KS Ravi Kumar
-
50 ఏళ్ల వేడుక.. రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ సినిమా రీరిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన నరసింహ రీరిలీజ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 1999లో వచ్చిన ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నీలాంబరిగా చాలా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ఇందులో శివాజీ గణేశన్, సౌందర్య,నాజర్,అబ్బాస్ తదితరులు నటించారు. తమిళ్లో సంచలన విజయం అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నుంచి రజనీకాంత్‌కు ఇక్కడ మార్కెట్ కూడా పెరిగింది.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ (Narasimha) సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పుడు థియటర్స్లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ, ఈ చిత్రం 2025 ఆగష్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది. రజనీ నటించిన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 18న విడుదలైంది. దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ సమయానికి నరసింహ సినిమాను రీరిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్లీ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేశాయి. అందులో భాషా, బాబా, దళపతి ఉన్నాయి. ఇప్పుడు నరసింహ మూవీ మళ్లీ విడుదల కానున్నడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నరసింహ సినిమా 1999లో 200 ప్రింట్స్‌తో విడుదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 86 థియేటర్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా ప్రాంతాలలో 200 రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లు రాబట్టింది. ఆ సమయంలో అమెరికాలో రూ. 3 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత రజనీ లుక్‌ను బీడీలు, సిగరెట్లు పొగాకు వంటి వాటిపై ట్రేడ్‌మార్క్‌గా రైట్స్ కొనుగోలు చేశారు. -
రజినీకాంత్ వేలు పెట్టారు.. అందుకే సినిమా ఫ్లాప్: డైరెక్టర్
దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. చిన్న హీరోలకు అయితే చెల్లుబాటు అవుతుంది గానీ పెద్ద హీరోల్లో కొందరు మాత్రం ప్రతి దానిలో వేలు పెడుతుంటారు. హిట్ కొడితే తమ క్రెడిట్ అన్నట్లు చెప్పుకొంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిదే తప్పు అన్నట్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన పని గురించి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ నిజాలు బయటపెట్టారు. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్‌తో 'ముత్తు', 'నరసింహా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్.. ముచ్చటగా మూడోసారి కలిసి 'లింగా' తీశారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. 2014లో రిలీజైన ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్ర సెకండాఫ్‌లో రజినీకాంత్ వేలు పెట్టారని, ఎడిటింగ్ పూర్తిగా మార్చేశారని అందుకే పోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)'ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ చేసేందుకు నాకు టైమ్ కూడా ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని మార్చేశారు. అనుష్కతో ఉండే పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ తొలగించేశారు. బెలూన్ జంపింగ్ సీన్ జోడించారు. మొత్తానికి 'లింగా'ని గందరగోళం చేశారు' అని కేఎస్ రవికుమార్ తన ఆవేదనని దాదాపు పదేళ్ల తర్వాత బయటపెట్టారు.2016లో ఇదే సినిమా గురించి ఇదే దర్శకుడు మాట్లాడుతూ.. రూ.150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, సూపర్ హిట్ అని చెప్పారు. ఇప్పుడేమో సినిమాని రజినీకాంత్ గందరగోళం చేశారని అసలు నిజాలు బయటపెట్టారు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో 30 శాతం మాత్రమే వసూళ్ల రూపంలో రిటర్న్ వచ్చాయని, దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లకు తిరిగి డబ్బులిచ్చారని టాక్.ఇకపోతే రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'.. మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 10న దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
ఓటీటీలో టాప్ డైరెక్టర్ కుమారుడి తొలి సినిమా
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై తాజాగా 'హిట్ లిస్ట్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం ద్వారా టాప్ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మే 31న థియేటర్లలో తెలుగు, తమిళంలో ఒకే రోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'హిట్‌లిస్ట్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు,తమిళ్ రెండూ భాషల్లో ఒకేరోజు రానుంది. View this post on Instagram A post shared by aha Tamil (@ahatamil) -
హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్
హీరో బాలకృష్ణ గురించి చెప్పగానే చాలామంది ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన ప్రవర్తన. ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. బయటనే కాదు సెట్లోనూ ఇలా కొట్టడాలు జరుగుతుంటాయని విన్నాం. కానీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ చెప్పడంతో ఇది నిజమని తేలిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్.. పలు సినిమాలు తీశాడు. తెలుగులో బాలయ్యతో కలిసి 'జై సింహా', 'రూలర్' చిత్రాలు చేశాడు. కానీ ఈ రెండూ ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. అయితే షూటింగ్ సందర్భంగా ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడని చెప్పారు. అలానే తన అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడని చెబుతూ అప్పటి విషయాన్ని చెప్పాడు. తాజాగా 'గార్డియన్' అనే తమిళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బాలయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. (ఇదీ చదవండి:పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) 'షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతాడు. అలా ఓ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నా అసిస్టెంట్ శరవణన్‌ని ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దీంతో శవరణన్ కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు' 'మళ్లీ ఆయన శరవణన్‌ని ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి.. సర్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా సరే కూల్ కాలేదు. వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్‌కి అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త స్థిమిత పడ్డాడు' అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం చెబుతున్నంతసేపు స్టేజీపైన ఉన్న హీరోయిన్ హన్సికతో పాటు మిగతా వాళ్లందరూ నవ్వుతూనే ఉన్నారు. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..) -
వాళ్లని ఆడియో ఫంక్షన్‌కు పిలిస్తే బిజీ అన్నారు.. మాకు టైం వస్తుంది: ప్రముఖ దర్శకుడు
తమిళ సినిమా: గూగుల్ కుట్టప్ప చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటులను ఆహ్వానించినా షూటింగ్ ఉందంటూ వారెవరు రాలేమని చెప్పారని దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఇది వారి సీజన్ అని తమకూ ఒక సీజన్ వస్తుందని అన్నారు. తన ఆర్.కె. సెల్యూలాయిడ్ పతాకంపై నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గూగుల్ కుట్టప్ప. బిగ్‌బాస్ ఫేమ్ దర్శన్ , లాస్లియా హీరో హీరోయిన్ గా నటించిన ఇందులో యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కేశవ కుమార్ శిష్యులు శబరి, గుణ శరవణ్ కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. ఫెఫ్సీ, దర్శకుల సంఘాల అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి, విక్రమన్, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, తంగర్ బచ్చన్ పాల్గొన్నారు. -
బ్లాక్‌బస్టర్ కాంబినేషన్: త్వరలో రజనీ ‘రాణా’!
రజనీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్ లది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘నరసింహా, ముత్తు’ వంటి బ్లాక్బస్టర్లు ఉన్నాయి. మళ్లీ ఈ ఇద్దరూ ఓ సినిమా కోసం కలవబోతున్నారని కోలీవుడ్ టాక్. 2010లో ‘రాణా’ అనే భారీ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు కేఎస్ రవికుమార్. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా ప్రారంభం అయింది. రజనీకాంత్ అనారోగ్యం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ గురించి రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్టు కేయస్ రవికుమార్ పేర్కొన్నారు. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ‘రాణా’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో కేయస్ రవికుమార్ పేర్కొన్నారు. మరి ఈ డ్రీమ్ నెరవేరుతుందా? చూడాలి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం చేస్తున్నారు -
పారితోషికంకాదు.. పార్టనర్షిప్!
‘నరసింహా, ముత్తు, దశావతారం, జై సింహా’ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్బీ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ 2 కోట్ల వరకూ ఉంటుంది. విశేషమేంటంటే... ఈ సినిమాకు పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ పారితోషికం తీసుకోవడంలేదట. ఈ సినిమా బిజినెస్ పూర్తయిన తర్వాత వాటా తీసుకుంటారట. ఈ సినిమా చిత్రీకరణను 30 రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్లాన్ అని తెలిసింది. ఇందులో తమిళ నటులు విజయ్ సేతుపతి, పార్థిబన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వగానే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ ఇప్పటికే పార్టనర్షిప్ మీదే సినిమాలు చేస్తున్నారు. కరోనా తర్వాత చిన్న సినిమాలు కూడా పారితోషికాలు కాకుండా పార్టనర్షిప్ ప్లాన్‌తో రూపొందుతాయా? యాక్టర్స్, డైరెక్టర్స్ పారితోషికం బదులు భాగస్వామ్యం తీసుకుంటారా? వేచి చూడాలి. -
ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బంది అదే!
‘‘లెజెండ్’ సినిమాలో తొలిసారి బాలకృష్ణగారి సరసన యాక్ట్ చేశాను. పెద్ద సూపర్‌స్టార్‌తో ఎలా వర్క్ చేస్తాం అని టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు బాలకృష్ణగారితో మూడో సినిమా చేశాను. బాలకృష్ణగారి సినిమా అంటే ఓకే అనేస్తున్నాను. వీలుంటే ఆయనతోనే వంద సినిమాలయినా చేస్తాను’’ అన్నారు సోనాల్ చౌహాన్. బాలకృష్ణ హీరోగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సోనాల్ చెప్పిన విశేషాలు. ►‘రూలర్’ చిత్రంలో నా పాత్ర పేరు హారిక. కావాలనుకున్నది సాధించుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఓ విషయంలో హీరోతోనే పోటీ పడాల్సి వస్తుంది. నా పాత్ర ఫుల్ గ్లామరస్‌గా ఉంటుంది. కామెడీ కూడా చేశాను. ఈ సినిమాలో బాలకృష్ణగారు రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఒకటి మాస్ గెటప్. ►ఒక యాక్టర్ ఒక పాత్ర చేసి అది బాగా హిట్ అయితే అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి. మన ఇండస్ట్రీలో ఇబ్బందే అది. ఆ యాక్టర్ ఇక ఆ పాత్రలే చేయాలన్నట్టు చూస్తారు. యాక్టర్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి. నాకు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయాలనుంది. భవిష్యత్తులో డిజిటల్ మాధ్యమమే టాప్‌లో ఉంటుందనుకుంటున్నాను. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేశాను. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా, తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది. -
అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రూలర్’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి భారీ రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా, సాయిచరణ్ సాయిచరణ్ భాస్కరుని ఆలపించాడు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు. సినిమాలో బాలకృష్ణ పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా లిరిక్స్ ఉన్నాయి. హీరో పవర్ తెలియజేసేలా రామజోగయ్య లిరిక్స్ అందించారు. -
రెచ్చిపోయిన బాలయ్య.. రూలర్ టీజర్
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. టీజర్ వచ్చేసింది. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకూ ‘రూలర్’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్, మాస్లుక్లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్ మరింత ఆసక్తికరంగా సాగింది. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే..’ అంటూ బాలకృష్ణ పలికిన డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. -
రొమాంటిక్ రూలర్
ప్రేయసితో ప్రణయ గీతాలా పన చేస్తున్నారు బాలకృష్ణ. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. సి.వి. రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు బాలకృష్ణ. అందులో ఒకటి పోలీసాఫీసర్. మరొకటి ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ మున్నార్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఓ మెలోడీ సాంగ్‌ను బాలకృష్ణ, వేదికలపై చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
బాలయ్య అభిమానులకు మరో సర్ప్రైజ్ గిప్ట్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రూలర్’. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య స్టైలీష్ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన చిత్ర పోస్టర్ అభిమానులను అలరిస్తోంది. తాజాగా బాలయ్య అభిమానులను మరోసారి సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రూలర్’లో బాలయ్యకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా టీజర్ వెరీ సూన్ అంటూ పేర్కొంది. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లో బాలయ్య స్టెప్పులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో పాటు అతడు వేసుకున్న షూస్ ట్రెండీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య తన రూపం, ఆహార్యం పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివర దశకు చేరడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ‘రూలర్’ చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘ఎన్టీఆర్’కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపర్చడంతో పాటు ఎన్నికలు రావడంతో బాలయ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. దీంతో లాంగ్య్ గ్యాప్ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘రూలర్’పై నందమూరి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా పూర్తైన తరువాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. సినిమా కథ ఇప్పటికే పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం. Presenting you the Stylish look of #NBK from #Ruler Teaser Coming Soon!#NandamuriBalakrishna @sonalchauhan7 @Vedhika4u@prakashraaj @bhumikachawlat#KSRaviKumar @bhattchirantan@HaappyMovies @CKEntsOffl #RulerOnDec20 pic.twitter.com/nVWqkxqJRr — Haappy Movies (@HaappyMovies) November 9, 2019 -
కిర్రాక్ లుక్
‘లుక్ అదిరింది. కిర్రాక్ లుక్. భలే ఉంది కొత్త లుక్...’ ఇదిగో ఇలానే రెట్టించిన ఉత్సాహంతో బాలకృష్ణ అభిమానులు ఆనందపడిపోతున్నారు. బాలకృష్ణ తాజా చిత్రంలో ఆయన లుక్ విడుదల కావడమే ఇందుకు కారణం. నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. వాన్‌డైక్ బియర్డ్ (ఒక రకమైన గడ్డం)తో స్టైలిష్‌గా కనిపించారు బాలకృష్ణ. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సి.వి. రావ్, పర్సా నాగరాజు సహ–నిర్మాతలు. -
నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి.!
-
బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్
-
‘ఆ సినిమాలో నేను నటించడం లేదు’
బాలకృష్ణ హీరోగా తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రానికి సంబంధించి యువ కథానాయకి రెజీనా క్లారిటీ ఇచ్చింది. ఆ చిత్రంలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు రెజీనా ట్విట్ చేసింది. కాగా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే నయనతారతో పాటు, నటాషా దోషిని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే వారిద్దరితో పాటు రెజీనా పేరు కూడా నిన్న మొన్నటి వరకూ తెరమీదకు వచ్చింది. త్వరలోనే ఆమె సినిమా షూటింగ్లో పాల్గొంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ రెజీనా మాత్రం...తాను ఆ సినిమాలో నటించడంలేదని తెలిపింది. అలాగే చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. To set the record straight.. I am not a part of #KSRavikumar- #Balakrishna Garus #NBK102 . I wish the team all the very best! 😊 — ReginaCassandra (@ReginaCassandra) 16 October 2017 -
అప్పుడు నరసింహతో ఇప్పుడు నరసింహనాయుడుతో
రజనీకాంత్‌తో ‘నా దారి రహదారి’ అని ‘నరసింహ’లో డైలాగ్ చెప్పించిన తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ అదే హీరోలోని మాస్ హీరోయిజాన్ని ‘ముత్తు’లో ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు. ఇప్పుడాయన ‘కత్తులతో కాదురా... కంటి చూపుతో చంపేస్తా’ వంటి పవర్ఫుల్ డైలాగులకు, మాస్ హీరోయిజానికి పెట్టింది పేరైన మన ‘నరసింహనాయుడు’ బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణను కేఎస్ రవికుమార్ ఏ దారిలో తీసుకువెళతారో... కత్తి పట్టిస్తారా? లేదా మరోదారిలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీస్తారా? వెయిట్ అండ్ సీ! ‘‘ఎం. రత్నం కథ, మాటలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జూలై 10న సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అన్నారు చిత్రనిర్మాత సి. కల్యాణ్. -
పురియాద పుదిర్గా విజయ్‌సేతుపతి చిత్రం
పురియాద పుదిర్ ఈ పేరు ఇంతకు ముందు విన్నట్లుంది కదూ. ఎస్.1990లో దర్శకుడు కేఎస్.రవికుమార్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం పేరు ఇది. ఈ పేరుతో తాజాగా మరో చిత్రం తెరపైకి రానుంది. విజయ్‌సేతుపతి హీరోగా నటించిన చిత్రం మెల్లిసై ఇప్పుడు పురియాద పుదీర్గా మారింది. గాయత్రి కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని రెబల్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. రంజిత్ జయకొండి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విడుదల హక్కుల్ని జేఎస్కే ఫిలిం కార్పొరేషన్ సంస్థ అధినేత జే.సతీష్‌కుమార్ పొందారు. ఆయన చిత్ర టైటిల్ మార్చడం తదితర వివరాలను తెలుపుతూ ఒక మంచి బలమైన కథా చిత్రానికి మెల్లిసై అనే సాఫ్ట్ టైటిల్ నప్పదన్నారు. అంతే కాకుండా విజయ్‌సేతుపతి వంటి క్రేజ్ ఉన్న నటుడి చిత్రానికి ఆసక్తిని రేకెత్తించే టైటిల్ ఉంటే బాగుంటుందన్నారు. అందుకే సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ.చౌదరికి చెందిన పురియాద పుదీర్ టైటిల్‌ను ఆయన అనుమతి పొంది ఈ చిత్రానికి పెట్టినట్లు తెలిపారు. వినూత్న కథ కథనాలతో కూడిన ఈ చిత్రం విజయ్‌సేతుపతి ఇమేజ్ను మరింత పెంచడంతో పాటు తమ సంస్థకు కచ్చితంగా మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పురియాద పుదిర్ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
లింగా క్లైమాక్స్ అది కాదు
లింగా చిత్ర క్లైమాక్స్ అదికాదు అని మనసు విప్పారు ఈ చిత్ర దర్శకుడు కేఎస్.రవికుమార్. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ముడింజా ఇవనై పిడి. నాన్ఈ చిత్రం ఫేమ్ కిచ్చా సుధీప్ కథానాయకుడిగా తమిళంలో పరిచయం అవుతున్న చిత్రం ఇది.ఆయనకు జంటగానిత్యామీనన్ నటించిన ఈ చిత్రం తమిళం,కన్నడం భాషల్లో తెరకెక్కనుంది. శుక్రవారం రెండు భాషల్లోనూ విడుదల కానుంది.దర్శకుడు కేఎస్.రవికుమార్ బుధవారం ఉదయం తను కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఈ చిత్రం ద్వారా తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నానన్నారు. తానీ చిత్రాన్ని అంగీకరించడానికి కారణం నటుడు కిచ్చా సుధీప్నే నన్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన మాస్ ఎంటర్టెయినర్ అని తెలిపారు. తన చిత్రాల్లో కమర్శియల్ అంశాలతో పాటు క్లాసిక్ మిక్స్ అయినా తాను దర్శకుడినేన్నారు. తన తొలి చిత్రం పురియాద పుదిర్ చిత్రమని అది ఒక కన్నడ చిత్రానికి రీమేక్ అనీ, నిర్మాత ఆర్వీ.చౌదరి తనను ఒరిజినల్ చిత్రం చూసి తమిళంకు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే రాయమని చెప్పారన్నారు. ఇకపోతే చిత్ర జయాపజయాలు ఎవరి చేతులోనూ ఉండవన్నారు. అదే విధంగా వరుసగా విజయాలు సాధించిన వారు లేరని అన్నారు. లింగా చిత్ర ప్రస్థావన తీసుకొస్తున్నారు కాబట్టి చెబుతున్నానని, ఆ చిత్రానికి తాము ముందుగా ప్లాన్ చేసింది వేరని అన్నారు. క్లైమాక్స్ ఫైట్‌లో గ్లైడర్‌ను ఉపయోగించి భారీగా చిత్రీకరించాలను కున్నామని, అయితే అందుకు సీజీ వర్క్ చాలా ఆలస్యం అవుతుందని చెప్పడంతో రజనీకాంత్ బైక్ నుంచి జంప్ చేసి గాలిలో తేలుతున్న బెలూన్ మీదకు దూకి అందులోని విలన్‌తో ఫైట్ చేయడంతో కామెడీ అనిపించిందని అన్నారు. సినిమా గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, విమర్శలు రాసే వారు కూడా ఇది తన అభిప్రాయం అని పేర్కొంటే బాగుంటుందని అన్నారు. కిచ్చా సుధీప్ మంచి నటుడే కాదని మంచి మానవతావాదిగా ఉన్నారని దర్శకుడు కేఎస్.రవికుమార్ పేర్కొన్నారు. తెలుగులో మళ్లీ దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు మంచి కథ, టీమ్ కుదిరితే తప్పకుండా చేస్తానని తెలిపారు. చిరంజీవి హీరోగా స్నేహం కోసం చిత్రం చేసిన తరువాత ఆయన చాలా సార్లు మనం మళ్లీ కలిసి పని చేద్దాం అని అంటుంటారని అన్నారు. -
ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్
సాధారణంగా చిత్రాల్లో ఎంట్రీ పాటతో బిల్డప్ ఇవ్వడం అనేది కథా నాయకులకే జరుగుతుంది. నాయికలకు అలా ఎంట్రీ పాటతో పరిచయం చేయడం అరుదే. అలాంటి అరుదైన నటీమణుల్లో తాజాగా నటి నిత్యామీనన్ చేరారు. పాత్రల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించే ఈ మలయాళ కుట్టి బహు భాషా నటి అన్నది తెలిసిందే. తమిళం, మలయాళం, తెలుగు భాషలతో పాటు కన్నడంలోనూ మంచి ప్రాచుర్యం పొందారు. అయితే కన్నడంలో నిత్యామీనన్ నటిగా తొలుత పరిచయం అయ్యారన్న విషయం చాలా మందికి తెలియదు. 2006లో సెవెన్ ఓ క్లాక్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ అయ్యారు. తాజాగా తమిళం, కన్నడం భాషలలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ముడింజ ఇవనై పుడి అనే చిత్రంలో నటిస్తున్నారు. సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద బిల్డప్ ఇచ్చేలా ఇంట్రో సాంగ్‌ను పొందుపరుస్తున్నారట. ఇంతకుముందు ఖుషీ చిత్రంలో మేగం కరుక్కుదు మిన్నల్ చిదిక్కుదు అనే పాట నటి జ్యోతికకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ముడింజ ఇవనై పిడి చిత్రంలో నిత్యామీనన్‌కు ఆ ఇంట్రో సాంగ్ అంత పేరు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్ర యూనిట్. ఆ పాట యువతను గిలిగింతలు పట్టిస్తుందట. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ముడింజా ఇవనై పిడి చిత్రంపై అంచనాలు పెరగడం గమనార్హం. -
సంగీతమూ అంతే ముఖ్యం
సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో సంగీతం, పాటలు కూడా అంతే ముఖ్యం. సంగీతంలో పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చక్కని సాహిత్యం కూడా వినిపించకుండా పోతోందని సాహితీప్రియులు ఆవేదన చెందటం చూస్తున్నాం. అలాంటిది నేను చేసే చిత్రాల్లో అన్ని పాటలు హిట్ అవ్వాలి. పాటలతో పాటు సంగీతం చిత్రానికి ప్లస్ కావాలి అంటున్నారు సంగీత దర్శకుడు సౌందర్యన్. సంగీత దర్శకుడిగా ఈయన అనుభవం రెండున్నర దశాబ్దాలు. ఇప్పటి వరకు చేసింది 42 చిత్రాలు. తొలి చిత్రమే సూపర్ హిట్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఆర్బి చౌదరి నిర్మించిన చేరన్‌పాండియన్. దర్శకుడు కేఎస్ రవికుమార్. ఇందులో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ఆ తరువాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరుసగా ముదల్శీదనం, పుత్తంపుదు పయనం, ముత్తు కుళిక వారియాల్ అంటూ నాలుగు చిత్రాలు చేసిన ఘనత ఈయనదే. సంగీత రంగంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న సౌందర్యన్కు ప్రత్యేకంగా గురువంటూ ఎవరూ లేరట. బికామ్ పట్టభద్రుడయిన ఈయన సంగీతంపై ఆసక్తితో జగదీష్ అనే సంగీత మాస్టారు వద్ద గిటార్ నేర్చుకున్నారు. అలా సంగీత జ్ఞానాన్ని పెంపొందిచుకున్న సౌందర్యన్, దర్శకుడు కేఎస్ రవికుమార్ దష్టిలో పడ్డారు. ఆయన ద్వారా చేరన్‌పాండియన్ చిత్రంతో సంగీతదర్శకులయ్యారు. కుంజుమోన్ నిర్మించిన సింధూనదిపూ వంటి పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగు, ఒరియా చిత్రాలకు సంగీతాన్ని అందించడం విశేషం. ఇటీవల ఈయన సంగీతం అందించిన నదిగళ్ ననైవదిలై ్ల చిత్రంలోని పాటలకు సంగీత ప్రియుల ఆదరణతో పాటు పరిశ్రమ నుంచీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందంటున్నారు ఈయన. తన 42 చిత్రాలలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినా నదిగళ్ ననైవదిలై ్ల లోని పాటలు తనకు సంతప్తినిచ్చాయన్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వద్ద పని చేయకపోయినా తనకు స్ఫూర్తి ఆయనే అంటున్న సౌందర్యన్ ప్రస్తుతం ఒళిచిత్రం, ననైయాదమళై, ఎన్నంపుదువన్నం తదితర చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాను రూపొందించిన సహస్ర గీతాలు బయట ప్రపంచంలో మారుమ్రోగాలన్నదే తన లక్ష్యం అంటారు ఈయన.. -
అసత్య ప్రచారమొద్దు
లింగాపై సత్యదూర ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ చిత్రాన్ని విడుదల చేసిన వేందర్ మూవీస్ సంస్థ హెచ్చరించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన లింగాపై ఫలితం విషయంలో రకరకాల ప్రచా రం సాగుతోంది. చిత్రం ఆశించిన విధంగా లేదని, రజనీకాంత్, కేఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన ముత్తు, పడయప్పాలను పోల్చుకుంటే లింగా ప్రజాద రణ పొందలేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆశించిన వసూళ్లు సాధించకపోవడంతో థియేటర్ల యజమాన్యాలు రజనీకాంత్ ను కలిసి నష్ట పరిహారం కోరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నారుు. దీంతో వేందర్ మూవీస్ సంస్థ స్పందించింది. లింగా చిత్రం గురించి తప్పుడు ప్రసారం జరుగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండడం, లింగా చిత్రాన్ని 600 థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం లాంటి కారణాల వలన వసూళ్లు తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది. ఈ శుక్రవారం నుంచి లింగా చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారని తెలిపింది. వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. లింగా చిత్రం గురించి అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లింగా చిత్రాన్ని విమర్శకుల కోసం తీయలేదని చురకలు వేస్తూ అసత్య ప్రచారాలను కేఎస్.రవికుమార్ ఖండించారు. -
ఈ చిత్రాలకు లింగా ఫీవర్
లింగా చిత్రం చాలా చిత్రాల విడుదలకు అయోమయంలో పడేసిందనే చె ప్పాలి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లిం గా. అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయనుంది. చిత్రం కేసులు, కోర్టులు అంటూ పలు బంధనాలను తెంచుకుని ముందుగా నిర్ణయించిన ప్రకారమే రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది. దీంతో మంగళవారం నుంచి టికెట్లు విడుదలవుతోందంటే చిత్ర పరిశ్రమలు ఎంత ఆసక్తి నెలకొంటుందో అభిమానుల్లో ఎంత ఉత్కంఠ చోటు చేసుకుం టుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తరువాత ఇస్తున్న మరో ఫక్తు మాస్ మసాలా చిత్రం లింగా. చిత్ర టీజర్‌కు, పాటలకు ఇప్పటికే చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో యావద్భారత సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లింగా చిత్రాన్ని ఒక్క తమిళనాడులోనే 500 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కర్ణాటక, హిందీ తదితర భాషల్లో 2,500 థియేటర్లలో విడుదలకు లింగా చిత్రం సిద్ధం అవుతోందని సమాచారం. ఇతర చిత్రాలకు దడ : లింగా చిత్ర విడుదల వివరాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇతర చిత్రాల నిర్మాతల్లో మాత్రం దడ పుట్టిస్తోంది. లింగా చిత్రంపై ఆ చిత్ర యూనిట్ చెబుతున్న దాన్ని బట్టి భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఆ చిత్రం తరువాత విడుదల కానున్న చిత్రాల పరిస్థితి అయోమయంగా మారింది. లింగా చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుండగా మరో రెండు వారాల్లోపే అంటే క్రిస్మస్ సందర్భంగా మరో ఏడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటి లో దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో బాలా నిర్మించిన పిశాచు, ప్రభుసాల్మన్ తెరపై ఆవిష్కరించిన కయల్ చిత్రా లు ఈ నెల 19 న, నటు డు సిద్ధార్థ్ నటించిన ఎనక్కుళ్ ఒరువన్, ఎస్.జె.సూర్య స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఇసై, కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన కప్పల్, మగిల్ తిరుమేని దర్శకత్వంలో ఆర్య, హన్సిక జంటగా నటించిన మెగామాన్, ఎళిల్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు హీరోగా నటించిన వెళ్లక్కార దుైరె చిత్రాలు ఈనెల 25న విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ చిత్రాలన్నింటికీ లిం గా ఫీవర్ పట్టుకుందన్నది నిజం. లింగా తమిళనాడులో మాత్రమే 500 థియేటర్లలో విడుదల కానుండడంతో పొంగల్ (సంక్రాం తి) వరకు ఈ చిత్రాన్నే ప్రదర్శించడానికి చాలా థియేటర్ల యాజమాన్యం నిర్ణ యం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరిలో మరో మూడు భారీ చిత్రా లు అజిత్ ఎన్నై అరిందాల్, విక్రమ్ నటిం చిన ఐ, విశాల్ చిత్రం ఆంబళ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అంటే లింగా విడుదలకు ఈ మూడు చిత్రాల విడుదలకు మధ్య నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ ఉం ది. అలాగే లింగాకు క్రిస్మస్కు విడుదలయ్యే చిత్రాలకు మధ్య సరిగ్గా రెం డు వారాల గ్యాప్ కూడా లేదు. దీంతో ఈ ఏడు చిత్రాలకు లింగా చిత్రం ఎన్ని థియేటర్లను త్యాగం చేస్తుంది, వాటిలో ఏ చిత్రం ఎన్ని థియేటర్లను దక్కించుకుంటుంది అన్నది తెలియని పరిస్థితి. -
ఈ వయసులో డ్యూయెట్లు నిజంగా శిక్షే : రజనీకాంత్
‘‘నా మొదటి సినిమా తొలి సీన్ చేస్తున్నప్పుడు పడనంత టెన్షన్ ఈ సినిమా కోసం పడ్డాను. ఆ టెన్షన్‌కి కారణం ఇద్దరమ్మాయిలు’’ ... ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ‘లింగ’ ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ కాసేపు తమాషాగా, ఇంకాసేపు సీరియస్‌గా ప్రసంగించారు. ఇదో అద్భుతం ‘‘దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నేను చేసిన చిత్రం ‘లింగ’. మధ్యలో ‘కోచడయాన్’ వచ్చినా అది యానిమేషన్ ప్రధానంగా సాగే సినిమా. ‘లింగ’ పరంగా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఇది చాలా పెద్ద సినిమా. ఇందులో భారీ తారాగణం ఉన్నందువల్ల, భారీ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేయడం వల్ల ఈ చిత్రం పెద్దది అనడం లేదు. ఈ కథ చాలా గొప్పది. స్వాతంత్య్రం రాకమునుపు, ఆ తర్వాత జరిగే కథ ఇది. ప్రధానంగా ఓ ఆనకట్ట నిర్మాణం నేపథ్యంలో సాగుతుంది. దాదాపు 60, 70 సన్నివేశాల్లో వేల మంది నటీనటులు, ఏనుగులు, రిస్కీ ఫైట్స్, పెద్ద పెద్ద సెట్స్.. ఇలా భారీ ఎత్తున ఉన్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. ఆ ఘనత టెక్నీషియన్లదే. అలాగే, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్లానింగ్‌ని మెచ్చుకోవాల్సిందే. రాజమౌళితో సినిమా చేస్తా... 30, 40 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలా? అని కేయస్ రవికుమార్, నేను ఆలోచించాం. ఎంత పెద్ద సినిమా అయినా తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చని యువతరానికి చెప్పాలనుకున్నాం... సాధించాం. ఒక్క విషయం.. నేను ‘బహుబలి’ గురించి ప్రస్తావించడంలేదు. ఆ చిత్రాన్ని రాజమౌళి ఎంతో గొప్పగా తీస్తున్నారు. నేను కూడా షూటింగ్ చూశాను. తప్పకుండా భారతదేశంలో రాజమౌళి నంబర్ వన్ టెక్నీషియన్. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తా. ఈ ఇద్దరమ్మాయిలే కారణం నా మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’ మొదటి సీన్ అప్పుడు పడని టెన్షన్ ఈ చిత్రం అప్పుడు పడ్డాను. దానికి కారణం అనుష్క, సోనాక్షి. అనుష్క చాలా మంచి అమ్మాయి. సోనాక్షి నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఈ ఇద్దరితో డ్యూయెట్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఏ ఆర్టిస్ట్‌కైనా భగవంతుడు విధించే శిక్ష ఏంటో చెప్పనా?.. 60 ఏళ్ల వయసులో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడటం. అలాగే, జగపతిబాబు గురించి చెప్పాలి. మేమిద్దరం ‘కథానాయకుడు’లో నటించాం. కానీ, తనేంటో ‘లింగ’ సమయంలో అర్థమైంది. చిత్రపరిశ్రమలో నేను చూసిన జెంటిల్మెన్లో జగపతిబాబు ఒకరు. రజనీ సినిమాలో కథ ఉంటుందా అన్నారు ఈ నెల 12న లింగ’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఈ కథ మాది’ అంటూ చెన్నయ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు కేసు పెట్టారు. దానికి స్పందిస్తూ.. ‘ఏంటీ రజనీ సినిమాలో కథ ఉంటుందా? ఆ కథ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. తప్పకుండా ‘లింగ’ చూడాలి’ అని కొంతమంది ట్విట్టర్లో స్పందించారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. కానీ, ఆ కథ పొన్కుమరన్ది. ఆ నలుగురిదీ కాదు. నన్ను క్షమించండి హుద్ హుద్ బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ చేసిన రోజున రావాలనే అనుకున్నా. కానీ, మా కుటుంబానికి చెందిన రెండు ముఖ్యమైన పెళ్లిళ్లు ఉండటంతో రాలేకపోయా. నన్ను క్షమించండి. హుద్ హుద్ బాధితుల సహాయార్థం నా వంతుగా కొంత ఫండ్ ఇస్తా’’ అని రజనీకాంత్ చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘రజనీతో గతంలో సూపర్ హిట్ సినిమా తీశాను. మేమిద్దరం మరో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. భవిష్యత్తులో మరో అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని చెప్పారు. కె. విశ్వనాథ్ మాట్లాడుతూ -‘‘బాపుగారు, బాలచందర్గార్లతో వారం రోజులైనా పని చేయాలనీ, రజనీకాంత్‌తో సినిమా చేయాలనీ ఉండేది. ‘ఉత్తమ విలన్’లో బాలచందర్‌గారితో నటించా. ‘లింగ’లో రజనీతో చేశాను’’ అని తెలిపారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘అతిశయోక్తి కాదు కానీ, రజనీ అంత గొప్ప మనిషి లేరు. ఎవరేమన్నా పట్టించుకోరు.. ఆశీర్వదిస్తారు. అలా ఎలా ఉండగలుగుతున్నారు? అనడిగితే -‘‘ప్రతి రోజూ ఏదో సందర్భంలో నేనో బస్ కండక్టర్ని అనే విషయం గుర్తొస్తుంటుంది’’ అన్నారు. అదీ రజనీకాంత్ అంటే’’ అని చెప్పారు. కేయస్ రవికుమార్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు రజనీకాంత్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ ఘనత దక్కించుకున్న మొదటి సినిమా ఇదే. రజనీగారి పుట్టినరోజుకి ఇది మంచి బహుమతి అవుతుంది’’ అన్నారు. రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చేయడం నా ఏడు జన్మల అదృష్టంగా భావిస్తున్నా’’ అని చెప్పారు. ఈ వేడుకలో రమేశ్ ప్రసాద్, నందు అహుజా, రత్నవేలు, పొన్కుమరన్, బీవీయస్‌యన్ ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి కొర్రపాటి, అనుష్క, సోనాక్షీ సిన్హా, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. -
పారితోషికం 60 కోట్లు?
రజనీకాంత్ పారితోషికం 60 కోట్లట. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అంశం ఇదే. ‘లింగా’ చిత్రం కోసమే సూపర్‌స్టార్ ఇంత పారితోషికం తీసుకున్నారట. ఒకవేళ రజనీ ఇంత పారితోషికం తీసుకున్నది నిజమే అయితే.. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి రికార్డ్ ఆయనకే దక్కుతుంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఇప్పటికే భారీ ఎత్తున బిజినెస్ అయ్యిందట. శాటిలైట్, ఆడియో హక్కుల నిమిత్తం నిర్మాతకు భారీ మొత్తమే అందిందని సమాచారం.