
పారితోషికం 60 కోట్లు?
రజనీకాంత్ పారితోషికం 60 కోట్లట. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అంశం ఇదే. ‘లింగా’ చిత్రం కోసమే సూపర్‌స్టార్ ఇంత పారితోషికం తీసుకున్నారట. ఒకవేళ రజనీ ఇంత పారితోషికం తీసుకున్నది నిజమే అయితే.. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి రికార్డ్ ఆయనకే దక్కుతుంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఇప్పటికే భారీ ఎత్తున బిజినెస్ అయ్యిందట. శాటిలైట్, ఆడియో హక్కుల నిమిత్తం నిర్మాతకు భారీ మొత్తమే అందిందని సమాచారం.