రజినీకాంత్ వేలు పెట్టారు.. అందుకే సినిమా ఫ్లాప్: డైరెక్టర్ | Director KS Ravi Kumar Allegations On Rajinikanth | Sakshi
Sakshi News home page

Rajinikanth: నేను తీసిన సినిమాని గందరగోళం చేశారు

Published Mon, Oct 7 2024 1:34 PM | Last Updated on Mon, Oct 7 2024 1:41 PM

Director KS Ravi Kumar Allegations On Rajinikanth

దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. చిన్న హీరోలకు అయితే చెల్లుబాటు అవుతుంది గానీ పెద్ద హీరోల్లో కొందరు మాత్రం ప్రతి దానిలో వేలు పెడుతుంటారు. హిట్ కొడితే తమ క్రెడిట్ అన్నట్లు చెప్పుకొంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిదే తప్పు అన్నట్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్‌స్టార్ రజినీకాంత్‌ చేసిన పని గురించి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ నిజాలు బయటపెట్టారు. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్‌తో 'ముత్తు', 'నరసింహా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్.. ముచ్చటగా మూడోసారి కలిసి 'లింగా' తీశారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. 2014లో రిలీజైన ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్ర సెకండాఫ్‌లో రజినీకాంత్ వేలు పెట్టారని, ఎడిటింగ్ పూర్తిగా మార్చేశారని అందుకే పోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)

'ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ చేసేందుకు నాకు టైమ్ కూడా ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని మార్చేశారు. అనుష్కతో ఉండే పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ తొలగించేశారు. బెలూన్ జంపింగ్ సీన్ జోడించారు. మొత్తానికి 'లింగా'ని గందరగోళం చేశారు' అని కేఎస్ రవికుమార్ తన ఆవేదనని దాదాపు పదేళ్ల తర్వాత బయటపెట్టారు.

2016లో ఇదే సినిమా గురించి ఇదే దర్శకుడు మాట్లాడుతూ.. రూ.150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, సూపర్ హిట్ అని చెప్పారు. ఇప్పుడేమో సినిమాని రజినీకాంత్ గందరగోళం చేశారని అసలు నిజాలు బయటపెట్టారు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌లో 30 శాతం మాత్రమే వసూళ్ల రూపంలో రిటర్న్ వచ్చాయని, దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లకు తిరిగి డబ్బులిచ్చారని టాక్.

ఇకపోతే రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'.. మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 10న దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement