జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి | Nainika Mother Interview Bigg Boss 8 Telugu | Sakshi
Sakshi News home page

Nainika Bigg Boss 8: ఆయన దగ్గరకు వద్దని మరో మాస్టర్ చెప్పడంతో

Oct 7 2024 1:08 PM | Updated on Oct 7 2024 1:42 PM

Nainika Mother Interview Bigg Boss 8 Telugu

బిగ్‌బాస్ 8 తెలుగు షోలో కాస్త జోష్ వచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ పేరిట ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు గతవారం  మిడ్ వీక్ ఆదిత్య ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్‌లో నైనిక ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమె తల్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతుంది. అందులో జానీ మాస్టర్ ప్రస్తావన రావడమే కాస్త ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: బెయిల్‌ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు)

ఢీ షోలో డ్యాన్సర్‌గా కాస్త గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. గత కొన్నాళ్లు నుంచి మాత్రం నటిగా అవకాశాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. కానీ పట్టుమని ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.

గతంలో ఢీ డ్యాన్స్ షో తర్వాత గణేశ్ మాస్టర్, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు వచ్చాయని తాను పంపించలేదని నైనిక తల్లి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గరకు అయితే వద్దని శశి మాస్టర్ తమతో చెప్పాడని అన్నారు. రీసెంట్‌గా తన అసిస్టెంట్‌ని వేధించారనే ఆరోపణలతో జానీ అరెస్ట్ అయ్యారు. దీంతో నైనిక తల్లి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!)

Advertisement
 
Advertisement
Advertisement