Nainika Anasuru
-
ఫ్రెండ్ అంటే ఇలా ఉంటారా? విష్ణు ఫేక్.. ఇప్పటికీ అదే చెప్తా!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో విష్ణుప్రియ, సీత, నైనిక ముగ్గురూ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. హౌస్‌లో చీమ చిటుక్కుమన్నా సరే దాని గురించి ఒకరి చెవి మరొకరు కొరుక్కునేవాళ్లు. మంచి దోస్తుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లు. తమ గ్యాంగ్‌కు పవర్పఫ్ గర్ల్స్ అని పేరు పెట్టుకున్నారు. కానీ పోయినవారం ముగ్గురూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. విష్ణు.. నైనికను, సీత, నైనిక.. విష్ణును నామినేట్ చేసింది. అదే వారం నైనిక ఎలిమినేట్ కూడా అయింది.ఫ్రెండ్ అంటే..ఇంటర్వ్యూలతో వారంపాటు బిజీగా ఉన్న నైనిక ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ అన్ని ఎపిసోడ్లు చూస్తూ వస్తోంది. నిన్న లైవ్ కూడా చూసిందట! ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ఫ్రెండ్ అంటే.. గేమ్‌లో అయినా టాస్క్‌లో అయినా తప్పు చేస్తే చెప్పాలి. అంతేకానీ అప్పుడు నీ గేమ్ నువ్వు ఆడేసి తర్వాత దాని గురించి గాసిప్ చేస్తారా? నీ స్నేహితురాలిని కిందకు లాగాలని ఎలా ప్రయత్నిస్తావ్?చాలా సెల్ఫిష్బిగ్బాస్ హౌస్‌లో కనెక్షన్స్ ఎలా మారిపోతున్నాయో చూస్తున్నా.. ముందు అదే ఫ్రెండ్‌కు వెళ్లి తప్పులు చెప్తుండే, ఇప్పుడు సడన్‌గా మారిపోయింది. జనాలు చాలా సెల్ఫిష్ అంటూ 'ఎండ్ ఆఫ్ పవర్ ఆఫ్ గర్ల్స్' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. విష్ణుప్రియ గురించే ఇలా రాసిందని అభిప్రాయపడుతున్నారు. అది నిజమేనన్నట్లు మరో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.ఫేక్ ఫ్రెండ్విష్ణును ఫేక్ ఫ్రెండ్ అన్నందుకు నన్ను ప్రశ్నించారు.. కానీ ఇప్పటికీ తను ఫేక్ ఫ్రెండ్ అనే చెప్తాను అని నొక్కి మరీ చెప్పింది. అలాగే నబీల్.. సీత గురించి వెనకాల మాట్లాడటం కూడా నచ్చలేదని పేర్కొంది. డేంజర్ జోన్లో ఉన్న సీతకు ఓట్లేయమని కోరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆఫ్టర్ బిగ్ బాస్ గ్లామర్ డోస్ పెంచిన నైనిక (ఫోటోలు )
-
జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి
బిగ్‌బాస్ 8 తెలుగు షోలో కాస్త జోష్ వచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ పేరిట ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు గతవారం మిడ్ వీక్ ఆదిత్య ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్లో నైనిక ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమె తల్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతుంది. అందులో జానీ మాస్టర్ ప్రస్తావన రావడమే కాస్త ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు)ఢీ షోలో డ్యాన్సర్‌గా కాస్త గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. గత కొన్నాళ్లు నుంచి మాత్రం నటిగా అవకాశాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. కానీ పట్టుమని ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.గతంలో ఢీ డ్యాన్స్ షో తర్వాత గణేశ్ మాస్టర్, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు వచ్చాయని తాను పంపించలేదని నైనిక తల్లి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గరకు అయితే వద్దని శశి మాస్టర్ తమతో చెప్పాడని అన్నారు. రీసెంట్గా తన అసిస్టెంట్‌ని వేధించారనే ఆరోపణలతో జానీ అరెస్ట్ అయ్యారు. దీంతో నైనిక తల్లి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!) -
Bigg Boss: నైనిక ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?
బిగ్‌బాస్ షోలో ఆట ఎప్పుడు ఎటు మలుపు తిరుగుందో చెప్పలేం. అందుకు నైనిక పెద్ద ఉదాహరణ. షో ప్రారంభమైన కొత్తలో టాస్కుల్లో శివంగిలా ఆడి గెలిచింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్లా కనిపించింది. వయసులో చిన్నదైనా క్లాన్ (టీమ్) లీడర్‌గా ఎదిగింది. తన గ్రాఫ్ ఏ రేంజ్లో అయితే పైకి జుయ్‌మని ఎగబాకిందో అదే స్పీడులో కిందకు పడిపోయింది.చిచ్చుబుడ్డిలా వెలిగి చివరకు..క్లాన్ చీఫ్‌గా పెద్దగా పవర్ చూపించలేకపోయింది. ఆటలో డల్ అయిపోయింది. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తప్పితే హౌస్‌లో పెద్దగా కనిపించకుండా పోయింది. నైనిక నీ గేమ్ ఎటు పోయింది? నీలో ఫైర్ ఏమైపోయింది? అని నాగార్జున సైతం ఆమె ముఖం పట్టుకుని అడిగాడు. అయినా లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఐదో వారం ఎలిమినేట్..ప్రేక్షకులు ఈమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునే స్థాయి నుంచి హౌస్‌లో ఉంచాల్సిన అవసరం లేదనుకునే స్థాయికి వచ్చేసింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్ అయింది. ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రతి వారం రూ.2.20 లక్షలు అందుకుందట! ఈ లెక్కన ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్.. ఏడ్చినా కరుణించలేదు!
ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్ 04) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..జాతకం చెప్పిన మణిమణికంఠకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్నే విలన్ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్ మస్తీ పేరిట బిగ్‌బాస్ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్మేట్స్ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.భార్య మెసేజ్ కోసం మణి ఆరాటంఅనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్ చేసుకుని వారికి ఫుడ్, లెటర్ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పింది. అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.నువ్వు వారియర్‌వి..అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్ చూసి నైనిక మురిసిపోయింది.యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్బాస్మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్ చూపించు బిగ్‌బాస్ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్ కనికరించలేదు. ఒంటరి పోరాటం..ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.పెళ్లయి 10 నెలలే..తర్వాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్.. ప్రేరణ, నబీల్, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్ చదివి సంతోషించింది.విష్ణుకు మెసేజ్చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. టాస్కుల్లో ఫైర్ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్ పెడుతుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై విషం కక్కిన యష్మి, ఆదిత్యను దగ్గరుండి సాగనంపారు!
బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త చీఫ్ సెలక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిలగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓంను బయటకు పంపించారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పోరాడి ఓడిన ప్రేరణహ్యాపీ పప్పీ టాస్క్‌లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరిదాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్‌గా నిలిచాడు. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీల్‌లకు బిగ్‌బాస్ 'రాజయ్యేది ఎవరు?' అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు.ఫ్రెండ్ అని ఊరుకున్నా..ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ.. నబీల్‌కే ఫేవర్ చేసిందని ఆరోపించింది, అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్‌గా ఊరుకుంటున్నాను, లేకపోయుంటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్, పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా.. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికీ సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది.లేడీస్ గ్యాంగ్ ఏడుపురాత్రిపూట బిగ్‌బాస్ మిడ్‌వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్లో ఉన్నవారిలో నిఖిల్, నబీల్, మణికంఠ.. ఈరోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికలలో ఒకరు ఈరోజు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నాడు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్లను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్‌బాస్.. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి.. వీరిలో ఎవరు ఈరోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు.ఆదిత్య ఎలిమినేట్కొన్ని విషయాల్లో ఆదిత్య వెనకబడుతున్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం.. ఆదిత్య వెళ్లిపోతాడని భావించారు. నబీల్ వంతురాగా.. మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ.. నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్‌బాస్.. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదిత్య పిచ్చిపని.. బిగ్‌బాస్ వార్నింగ్.. నిజం ఒప్పుకున్న విష్ణు
ఈ రోజు నామినేషన్స్‌లో అంత ఫైర్ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్ టీమ్‌కు షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అలా వెళ్లి ఇలా వచ్చేశాడుఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.నామినేషన్స్తర్వాత నైనిక..నబీల్, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్.. నైనిక, విష్ణుప్రియను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్ చేశాడు.నీకే నోటిదురుసునిఖిల్ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్ చేసింది. ఆవేశపడ్డ ఆదిత్యఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్ అన్నాడు. దీంతో బిగ్‌బాస్.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్ ఫోటోను మంటల్లో వేసింది. మాట మార్చావ్..యష్మి.. మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. నామినేషన్స్‌లో ఎవరంటే?చివర్లో హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్‌లో ఒకరిని నామినేట్ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్ నామినేషన్లో ఉన్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?
బిగ్‌బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈమె బయటకొచ్చేయడంపై సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈసారి రెండు వికెట్లు పడతాయనమాట. వాళ్లు ఎవరు కావొచ్చు? ఎందుకు ఇదంతా?బోరింగ్ బిగ్బాస్ఈసారితో పోలిస్తే గత సీజనే కాస్తోకూస్తో బెటర్ అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కరు కూడా సరైన కంటెంట్ ఇవ్వట్లేదు. బిగ్‌బాస్ టీమ్ కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది కానీ రెగ్యులర్‌గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీనివైపే చూడట్లేదు. ఇది కాస్త బిగ్‌బాస్‌కి అర్థమైనట్లుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఎలిమినేట్ వేటుఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తుంది. మంటల్లో ఫొటో వేయాలి అనే కాన్సెప్ట్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కాస్తోకూస్తో ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయిఆ ఇద్దరు వీళ్లేనా?అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు. మరొకరిని వీకెండ్లో పంపించేస్తారనిపిస్తోంది. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్లలో ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం ఆగితే సరిపోద్ది.(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!)TWIST - There is a Mid-Week Elimination this week!#BiggBossTelugu8 pic.twitter.com/yaSu22gXPx— TeluguBigg (@TeluguBigg) September 29, 2024 -
పెళ్లాంబిడ్డ కావాలంటావ్, అంతలోనే హగ్గుకోసం వెంటపడ్తావ్!
నాకు బంధాలు, బాధ్యతలు నచ్చవు. నన్ను ఒంటరిగానే వదిలేయండి.. అని బిగ్‌బాస్ 8 ప్రారంభంలోనే మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. పెళ్లాం బిడ్డ దూరమయ్యారని, వారిని తిరిగి తనదగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ షోకు వచ్చానని మొదటిరోజే ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు.సింపతీ వద్దు!నామినేషన్స్‌లోనూ అదే కథ మళ్లీ వినిపించాడు. సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న కామెంట్స్ రావడంతో కాస్త పద్ధతి మార్చుకున్నాడు. ఇంటి నుంచి తన తల్లి శాలువా వచ్చినప్పుడు కూడా సింపతీ కోసమైతే తనకు ఇవ్వొద్దు అని నాగమణికంఠ కరాఖండిగా చెప్పాడు. అప్పుడతడిలో మెచ్యురిటీ చూసి జనాలు ముచ్చటపడిపోయారు.అపరిచితుడిలా మణికంఠటాస్కులు వస్తే చాలు పట్టుదల, ఏకాగ్రత చూపించే అతడి అంకితభావాన్ని మెచ్చి ఓట్లు గుద్ది నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు. అంతా ఓకే అనుకునేలోపే మణికంఠ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి ఏడుస్తూ, మరోసారి అమ్మాయిలతో సరదాలు చేస్తూ, ఇంకోసారి తన ముందు తప్పు చేస్తే సహించకుండా ఉంటూ ఎవరికీ అంతుచిక్కకుండా ప్రవర్తిస్తున్నాడు.హగ్గుల పిచ్చిఈ మధ్యే యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆమెను వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. ఈ విషయంలో తను చాలా చిరాకుపడింది. మరోసారైతే తనకెవరూ ముద్దు ఇవ్వడం లేదు, ముద్ద(తిండి) పెట్టడం లేదని తనకు తానే ఏవేవో మాట్లాడుకున్నాడు. ఈసారైతే ఏకంగా తను అక్క అని పిలిచే సోనియాను ఒక హగ్ కావాలని అడుక్కున్నాడు. నీకో భార్య ఉంది, తెలుసా?ఎటు చూసినా కెమెరాలున్నాయని నిరాశపడుతూనే తనను హత్తుకున్నాడు. ఇతడి ప్రవర్తన అర్థమైపోయిన నైనిక మణికంఠను ముఖం పట్టుకుని అడిగేసింది. 'నువ్వు ఇక్కడ అందరితో ప్రేమలో ఉన్నావు, కానీ అంత వద్దమ్మా! నీకు భార్య ఉన్నప్పుడు తనతో మాత్రమే ప్రేమలో ఉండాలి. ఇలా అందరికీ ముద్దులు పెట్టడమేంటి? పెళ్లయ్యాక అసలు అవతలివారిని ఫ్లర్టింగే చేయకూడదు' అని క్లాస్ పీకింది.ఏదైనా చేసేయొచ్చా?చాలా తప్పుగా మాట్లాడుతున్నావని మణి అనగా.. నేను నిజం మాట్లాడుతున్నా అని నైనిక కుండ బద్ధలు కొట్టింది. దీంతో అతడు.. ఇక్కడే కదా చిల్ అయ్యేది.. ఇంటికెళ్లాక ఎలా కుదరదుగా అని డ్యాన్స్ చేశాడు. ఈ హగ్గులు, ముద్దుల గోల తగ్గించుకుంటేనే మణి ఇంకొన్నాళ్లయినా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగలుగుతాడు. లేదంటే జనాలే తనను బయటకు నెట్టేయడం ఖాయం! ఇప్పటికే మణి వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. రానురాను రాజు గుర్రం గాడిద అయిందట.. నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్ అని కామెంట్లు చేస్తున్నారు. Meeru friends eppudu aiyaru ante adulterated comedy annadhi Mari veedu hug adigithe tittalsindhi poyi task vundhi anatam enti 😬Girls meedha noru vesukoni padipothadhi mari veedini endhuku analedhu nee pempakam.baledhu ani#BiggBossTelugu8pic.twitter.com/6zorDLx77Y— anushkafan (@Anushkafan07) September 18, 2024Nainika deserves a big round of applause 👏🏻👏🏻👏🏻E #NagaManikanta gadu healthy flirting perutho intlo vese pervert veshalu meedha gatti rod vesindi vadikiAbba Sai Ram #BiggBossTelugu8 #Nainika pic.twitter.com/fCOi5O7BKF— Vamc Krishna (@lyf_a_zindagii) September 19, 2024 చదవండి: బెదిరించకు, మంచిగా అడిగితే చెప్తా.. సోనియాకు నబీల్ కౌంటర్ -
సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మిగిలారు.త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హౌస్‌లో యథాతథంగా నామినేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.గాలి తీసేసిన నైనికఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్, అభయ్, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్ క్లాన్లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.ఫుల్ టార్గెట్ నువ్వేతనకైతే మణికంఠ డేంజర్‌గా అనిపిస్తున్నాడని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్ చేసుకుంటూ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్ అని తిట్టుకున్నారు.నామినేషన్లో ఎవరున్నారంటే?చివర్లో నబీల్.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్ అభయ్ నామినేషన్లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగ్.. సోనియా ఇక మాట్లాడకు!
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వీకి వార్నింగ్నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్‌తో గేమ్ ఆడించాడు. మీ టీమ్‌లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్‌లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.సంచాలక్‌గా ఫెయిల్ప్రేరణ సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్‌లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్‌గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్‌గా ప్రకటించనంది. కావాలనే అలా చేశాను: యష్మిఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.బెస్ట్ పర్ఫామర్ అతడేఅప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్‌లో నబీల్‌కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.అసలైన ఆడపులిఅనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్‌లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్‌లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్మూడో టీమ్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్‌మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్‌గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.చీఫ్‌ను మీరే ఎంచుకోండిఇప్పుడు చీఫ్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్‌ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్‌గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్‌గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్‌గా వద్దన్నాడు.కొత్త చీఫ్ ఎవరంటే?సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్‌గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్‌గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్‌గా నిలిచాడు. దీంతో హౌస్‌లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్ -
యష్మికి బుల్లెట్ దింపిన నాగ్.. వెంటనే ప్లేటు తిప్పేసిందే!
బిగ్‌బాస్ హౌస్‌లో కెరటం టీమ్ సభ్యులు నాగమణికంఠ, నిఖిల్ రేషన్ లేక అల్లాడిపోతున్నారు. నిజానికి రేషన్ కోసం పెట్టిన గేమ్‌లో వీరు గెలవాల్సింది. అయితే యష్మి సంచాలకురాలు కావడంతో ఆటను తనకు నచ్చినట్లు మార్చేసింది. తాజా ప్రోమోలో నాగ్ ఆ విషయాన్ని ప్రస్తావించాడు.ప్లేటు తిప్పేసిన యష్మిమరమరాలు పావుకిలో తేవాలని బిగ్‌బాస్(#BiggBosstTlugu8) ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే పావుకిలోకు దగ్గర్లో పట్టుకొస్తారో వారికి పాయింట్ ఇస్తానంది యష్మి. మణికంఠ పావుకిలోకు దగ్గర్లో ప్యాక్ చేశాడు. కానీ, అతడిని గెలిపించడం ఇష్టం లేక ప్లేటు తిప్పేసింది. కరెక్ట్‌గా పావుకిలో ఉంటే మాత్రమే ఇస్తానంటూ ఎవరికీ పాయింట్ ఇవ్వలేదు. ఈ వీడియోను చూపిస్తూ యష్మి చీఫ్‌గా ఫెయిలైందంటూ తన ఫోటోను గన్‌తో కాల్చాడు. అబ్బా.. ఏం కవరింగ్రా బాబూ..దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్న టీమ్ ఆకలితో ఉండకూడదనే అలా చేశానని కవర్ చేసింది. అలాగే సంచాలకురాలిగా ప్రేరణ కన్ఫ్యూజ్ కావడానికి కారణం కూడా నువ్వేనని నాగ్ తనను నిందించాడు. ఇక పృథ్వీ కొన్ని అభ్యంతరకర పదాలు వాడుతున్నావని, నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించాడు. చదవండి: బిగ్‌బాస్ సైకాలజీ: అన్నింటినీ ప్రభావితం చేసేది గ్రూపులే! -
చనిపోదామనుకున్న ఆదిత్య.. గిఫ్టులు అందుకున్నదెవరంటే?
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు బిగ్‌బాస్ ఇంటిసభ్యులు బాగానే కష్టపడ్డారు. అయితే అందరికంటే చిన్న టీమ్ ఎక్కువ ప్రైజ్‌మనీ గెలవడం విశేషం. టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సరదా గేమ్ ఆడించారు. ఆ వెంటనే వాళ్ల ఇంటి నుంచి కొన్ని వస్తువులు తెప్పించి కొందరికి ఇచ్చి మరికొందరికి కళ్లముందు ఆశపెట్టివెనక్కు తీసేసుకున్నారు. ఇంతకీ ఎవరెవరు బహుమతులు అందుకున్నారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఆడపులిలా సోనియాప్రైజ్మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతులేని వీరులు టీమ్.. రూ.75 వేలు, అఖండ టీమ్ రూ.1,25,000, కెరటం రూ.2,45,000 సాధించినట్లు వెల్లడించాడు. ఈ మూడింటిలో కెరటం టీమ్ సాధించిన డబ్బును ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,45,000కు చేరింది. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో యష్మి చికెన్ దొంగిలించినట్లు ఒప్పుకుంది. సోనియా ఆడపులిలా రెడీ అయింది. విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేసింది. నిఖిల్ చీర కట్టుకుని స్టెప్పులేశాడు.ఇంటి నుంచి బహుమతులుతర్వాత కంటెస్టెంట్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయని గుడ్‌న్యూస్ చెప్పాడు. కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని మెలిక పెట్టాడు. ఆ ఐదుగురు ఎవరనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఎవరు గిఫ్ట్ పొందాలి? ఎవరి బహుమతి వెనక్కు పంపించాలన్నది ఇంటిసభ్యుల చేతిలోనే ఉంటుందన్నాడు. మొదటగా అభయ్, నిఖిల్ గిఫ్టులు వచ్చాయి.నాన్నకు తెలియకుండా దొంగతనంఅభయ మాట్లాడుతూ.. మా నాన్న లెక్కల మాస్టారు. తాను చాలా స్ట్రిక్ట్. కానీ, నేను సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్ చేశాడు. అలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను సంపాదించిన డబ్బుతో కొన్న వాచ్ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే ధరించాడు అని చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ.. అబ్బాయిలకు నాన్నను హగ్ చేసుకునే అదృష్టం ఉండదు. అందుకని నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేశాను అంటూ ఏడ్చేశాడు. నైనిక కోసం సీత త్యాగంమెజారిటీ ఇంటిసభ్యులు అభయ్కు లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేశారు. దీంతో అతడు వాచీ అందుకున్నాడు. నైనిక, సీతకు బొమ్మలు గిఫ్ట్స్‌గా వచ్చాయి. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రిలేషన్లో ఉన్నాక అతడు నన్ను వదిలేసి పోయాడు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేనసలు నిద్రపోలేనంటూ ఏడ్చేసింది. కానీ ఈ బిగ్‌బాస్ హౌస్‌లో నైనిక, విష్ణుప్రియ దొరికారని.. వాళ్లతో కబుర్లు చెప్తూ నిద్రపోతున్నానంది. కాబట్టి ఆ బొమ్మ లేకుండా ఉండగలనని నైనికకు గిఫ్ట్ ఇచ్చేయండని కోరింది.చాలాసార్లు విడిపోదామనుకున్నామునైనిక మాట్లాడుతూ.. ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి. అలా ఎన్నోసార్లు గొడవలయ్యాయి, చాలాసార్లు విడిపోదామనుకున్నాము. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే ఆ బాధను మర్చిపోయాను. నేనూ కొన్ని తప్పులు చేశాను, సారీ కన్నా, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అని ఏడ్చేసింది. సీత త్యాగం, హౌస్మేట్స్ సపోర్ట్‌తో నైనిక తన బొమ్మను గెల్చుకుంది.అదే చివరి ఫోటో..నబీల్, పృథ్వీలకు తండ్రి ఫోటోలు వచ్చాయి. నబీల్ మాట్లాడుతూ.. నాన్నకు సింగర్ అవ్వాలన్నది కోరిక. తనకెలాగూ అనుకున్న కల నెరవేరలేదని నాకు ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. 2021 జూన్‌లో నాన్నతో చివరిసారి ఫోటో దిగాను. ఆ మరుసటి నెలలోనే తను చనిపోయాడు. కానీ, నేను స్ట్రాంగ్.. పృథ్వీకి వచ్చిన బహుమతిని అతడికి ఇచ్చేయమని కోరాడు.నాన్నతో దిగిన ఏకైక ఫోటోపృథ్వీ మాట్లాడుతూ.. మా నాన్నతో నేను దిగిన ఏకైక ఫోటో ఇదొక్కటే. మా నాన్నతో ఆగస్టు 15న చాలాసేపు మాట్లాడాను. ఆరోజే ఆయన కాలం చేశాడు. నేను నటుడినవ్వాలన్నది ఆయన కల. అది నెరవేర్చాను అని చెప్పుకొచ్చాడు. మెజారిటీ ఇంటిసభ్యులు నబీల్‌కు లాలీపాప్స్ ఇవ్వడంతో అతడు ఫోటోఫ్రేమ్ అందుకున్నాడు. అనంతరం మణికంఠకు శాలువా, ఆదిత్యకు తండ్రి ఫోటో ఫ్రేమ్ గిఫ్టుగా వచ్చాయి. చనిపోదామనుకున్నా..మణికంఠ మాట్లాడుతూ.. అమ్మ చనిపోతుందనడానికి ముందు తన శాలువా ఇచ్చింది. సింపతీ కోసమైతే దీన్ని నాకు ఇవ్వకండి అన్నాడు. ఆదిత్య మాట్లాడుతూ.. నాలో ఉన్న మంచి లక్షణాలకు నాన్నే కారణం. కరోనా టైంలో నా భార్య, కుమారుడు, తల్లి.. అందరికీ కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు నాన్న ఫోటో కిందపడి నన్ను హెచ్చరించింది అని ఎమోషనల్ అయ్యాడు. దొంగతనంఈ క్రమంలో నాన్న గొప్పదనం గురించి చెప్తూ బాషా భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్మేట్స్ సపోర్ట్‌తో ఆదిత్య తన తండ్రి ఫోటో అందుకున్నాడు. ఇకపోతే మణికంఠ అర్ధరాత్రి అఖండ టీమ్ బెడ్రూమ్లో దూరి సరుకులు దొంగతనం చేశాడు. అందర్నీ ఓ ఆటాడుకుందామనే ఈ ప్లాన్ వేసినట్లున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నాన్నను హగ్ చేసుకోలేక షర్ట్ దొంగతనం', 'ప్రియుడు వదిలేసి పోయాడు'
ప్రతి సీజన్లో ప్రైజ్‌మనీ రూ.50 లక్షలయితే ఈసారి మాత్రం జీరో పెట్టాడు బిగ్‌బాస్. అంటే.. మీకు కావాల్సినంత ప్రైజ్‌మనీని మీరే సంపాదించుకోవాల్సి ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందుకోసం టాస్కులు కూడా మొదలుపెట్టాడు. నిన్న అందరికంటే చిన్న టీమ్ అయిన కెరటం ఎక్కువ డబ్బులు గెలవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.బాషాను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన నైనికఈ టాస్కులతో కంటెస్టెంట్ల బుర్రలు హీటెక్కిపోయాయని అర్థం చేసుకున్న బిగ్‌బాస్ తాజాగా వారితో సరదా గేమ్ ఆడించాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భాగంగా ఆదిత్య, నిఖిల్ అమ్మాయిగా ముస్తాబయ్యాడు. నైనిక.. శేఖర్ బాషాను బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. నాన్నకు కొన్న వాచ్అనంతరం కంటెస్టెంట్లకు వారి ఇంటినుంచి గిఫ్ట్స్ వచ్చాయి. కానీ అంత ఈజీగా ఎలా ఇస్తాడు? ఐదుగురికి మాత్రమే గిఫ్ట్ పొందే ఛాన్స్ ఉందని చెప్పాడు. నైనిక, సీత, నిఖిల్, అభయ్, ఆదిత్యకు బహుమతులు రాగా.. ఆ గిఫ్టుల వెనక బ్యాక్‌స్టోరీని చెప్పారు. సినిమాల్లోకి వచ్చాక నా తొలి పారితోషికంతో నాన్నకు కొన్న వాచ్ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే పెట్టుకున్నాడంటూ అభయ్ ఎమోషనలయ్యాడు. దొంగతనం చేశా..నిఖిల్ మాట్లాడుతూ.. అబ్బాయిలకు తండ్రిని హగ్ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేరు. కాబట్టి నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేశానని ఏడ్చేశాడు. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నాక అతడు నన్ను వదిలేసిపోయాడు. అప్పుడు నాకు దొరికిన ఫ్రెండ్ కుమార్ అంటూ తన బొమ్మను చూస్తూ కన్నీళ్లుపెట్టుకుంది.ఆ బాధ నుంచి బయటపడేశాడునైనిక మాట్లాడుతూ.. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి నేను బయటపడ్డాను. ఆ బాధ నుంచి నన్ను బయటపడేసింది తనే.. నన్ను అంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అంటూ నైనిక బోరుమని ఏడ్చింది. మరి ఎవరెవరు గిఫ్ట్ గెలచుకున్నారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
Bigg Boss 8: ఐదో వారంలో నైనిక ఎలిమినేట్
డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ (ఆరో సీజన్), ఢీ (13, 14వ సీజన్లు) రియాలిటీ షోలతో ఫేమస్ అయింది నైనిక. కవర్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోలతోనూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అలాగే ఢీలో తన కో కంటెస్టెంట్ సాయితో రొమాంటిక్ స్టెప్పులు వేసి మరింత పాపులర్ అయింది. అలాగే అతడితో లవ్- బ్రేకప్తోనూ వార్తల్లో నిలిచింది. ఈ తెలుగమ్మాయి డ్యాన్సరే కాదు మంచి నటి కూడా! గ్లామర్‌లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ బిగ్‌బాస్ హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీనిస్తుందనుకున్నారు. మొదట్లో తనలో ఫైర్ చూపించిన నైనిక తర్వాత సైలెంట్ అయిపోయింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్ అయింది.