'నాన్నను హగ్‌ చేసుకోలేక షర్ట్‌ దొంగతనం', 'ప్రియుడు వదిలేసి పోయాడు' | Bigg Boss Telugu 8 Promo: Nikhil, Nainika, Seetha, Abhay Gets Emotional Over Gifts | Sakshi
Sakshi News home page

ఏడిపించేసిన బిగ్‌బాస్‌.. రిలేషన్‌షిప్‌ గురించి చెప్తూ బోరుమని విలపించిన సీత, నైనిక

Published Fri, Sep 13 2024 4:24 PM | Last Updated on Fri, Sep 13 2024 4:37 PM

Bigg Boss Telugu 8 Promo: Nikhil, Nainika, Seetha, Abhay Gets Emotional Over Gifts

అబ్బాయిలకు తండ్రిని హగ్‌ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేరు. కాబట్టి నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్‌ దొంగతనం చేశానని ఏడ్చేశాడు.

ప్రతి సీజన్‌లో ప్రైజ్‌మనీ రూ.50 లక్షలయితే ఈసారి మాత్రం జీరో పెట్టాడు బిగ్‌బాస్‌. అంటే.. మీకు కావాల్సినంత ప్రైజ్‌మనీని మీరే సంపాదించుకోవాల్సి ఉంటుందని ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇందుకోసం టాస్కులు కూడా మొదలుపెట్టాడు. నిన్న అందరికంటే చిన్న టీమ్‌ అయిన కెరటం ఎక్కువ డబ్బులు గెలవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది.

బాషాను స్విమ్మింగ్‌ పూల్‌లో పడేసిన నైనిక
ఈ టాస్కులతో కంటెస్టెంట్ల బుర్రలు హీటెక్కిపోయాయని అర్థం చేసుకున్న బిగ్‌బాస్‌ తాజాగా వారితో సరదా గేమ్‌ ఆడించాడు. ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ పెట్టాడు. ఈ గేమ్‌లో భాగంగా ఆదిత్య, నిఖిల్‌ అమ్మాయిగా ముస్తాబయ్యాడు. నైనిక.. శేఖర్‌ బాషాను బలవంతంగా స్విమ్మింగ్‌ పూల్‌లో పడేసింది. 

నాన్నకు కొన్న వాచ్‌
అనంతరం కంటెస్టెంట్లకు వారి ఇంటినుంచి గిఫ్ట్స్‌ వచ్చాయి. కానీ అంత ఈజీగా ఎలా ఇస్తాడు? ఐదుగురికి మాత్రమే గిఫ్ట్‌ పొందే ఛాన్స్‌ ఉందని చెప్పాడు. నైనిక, సీత, నిఖిల్‌, అభయ్‌, ఆదిత్యకు బహుమతులు రాగా.. ఆ గిఫ్టుల వెనక బ్యాక్‌స్టోరీని చెప్పారు. సినిమాల్లోకి వచ్చాక నా తొలి పారితోషికంతో నాన్నకు కొన్న వాచ్‌ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే పెట్టుకున్నాడంటూ అభయ్‌ ఎమోషనలయ్యాడు. 

దొంగతనం చేశా..
నిఖిల్‌ మాట్లాడుతూ.. అబ్బాయిలకు తండ్రిని హగ్‌ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేరు. కాబట్టి నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్‌ దొంగతనం చేశానని ఏడ్చేశాడు. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాక అతడు నన్ను వదిలేసిపోయాడు. అప్పుడు నాకు దొరికిన ఫ్రెండ్‌ కుమార్‌ అంటూ తన బొమ్మను చూస్తూ కన్నీళ్లుపెట్టుకుంది.

ఆ బాధ నుంచి బయటపడేశాడు
నైనిక మాట్లాడుతూ.. ఒక హింసాత్మక రిలేషన్‌ నుంచి నేను బయటపడ్డాను. ఆ బాధ నుంచి నన్ను బయటపడేసింది తనే.. నన్ను అంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అంటూ నైనిక బోరుమని ఏడ్చింది. మరి ఎవరెవరు గిఫ్ట్‌ గెలచుకున్నారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు  ఆగాల్సిందే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement