Abhay Naveen
-
ఆమెను పెళ్లి చేసుకునేది నేను, నాకే ప్రాబ్లం లేదు: సోనియా ప్రియుడు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్లలో సోనియా మొదటిస్థానంలో ఉంటుంది. తన ఆట తీరు, మాట తీరు వల్ల విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మొదట్లో నిఖిల్‌ను గ్రూపిజం అంటూ పెద్దపెద్ద మాటలన్న ఆమె తర్వాత అతడినే తనవైపు తిప్పుకుంది. అటు పృథ్వీని సైతం తన చేతికింద పెట్టుకుని ఇద్దరిని తన గేమ్ కోసం అస్త్రంగా వాడుకుంటోంది.కావ్యతో బ్రేకప్?ఇక్కడ జనాలకు అర్థం కాని విషయాలు రెండున్నాయి. ఒకటి.. నిఖిల్‌కు ఆల్రెడీ నటి కావ్యతో బ్రేకప్ అయిందా? రెండు.. డిసెంబర్లో పెళ్లి పెట్టుకుని సోనియా.. అబ్బాయిలతో కాస్త అతి చనువుగా ప్రవర్తించడం! ఈ రెండు విషయాలపై సోనియా స్నేహితుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా సోనియా గురించి చెప్తూ.. ఆమె అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా ఏం చూపించదు. అందరితో ఒకేలా ఉంటుంది. బయటకు వచ్చాక తనపై వచ్చిన ట్రోల్స్ చూసి నేనే షాకయ్యాను. నాకు ఏ ప్రాబ్లం లేదుఆమె కుటుంబాన్ని, కాబోయే భర్తను కలిశాను. అతడేమన్నాడంటే.. 'సోనియా ఎలాంటిదో మాకు తెలుసు. ఇంట్లో వాళ్లను సోదరుల్లా చూస్తుంది. అబ్బాయైనా, అమ్మాయైనా తనకు నచ్చితే అలా చేతులు పట్టుకునే మాట్లాడుతుంది. అందులో నెగెటివిటీ ఏం లేదు. ఆమెను పెళ్లి చేసుకోబోయేది నేను కదా.. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. తనపై ట్రోలింగ్‌ను పట్టించుకోను అని చెప్పాడు.బ్రేకప్ అంటూ ఏడ్చేశాడునిఖిల్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌కు వచ్చేముందే తనకు బ్రేకప్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. హౌస్‌లో సీత బ్రేకప్ స్టోరీ చెప్పినప్పుడు నిఖిల్.. తాను కూడా నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నానని, ఈమధ్యే బ్రేకప్ అయిందని చెప్పుకుంటూ ఏడ్చాడు. నిఖిల్ బ్రేకప్‌కు సోనియా కారణం కాదు అని పేర్కొన్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: ఎలిమినేషన్‌పై అభయ్ వీడియో.. అందుకే ఇలా
బిగ్‌బాస్ 8లో మూడో ఎలిమినేషన్. తెలంగాణ పోరడు అభయ్ నవీన్ బయటకొచ్చేశాడు. తొలి రెండు వారాలు మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు.. మూడో వారం వచ్చేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. పైపెచ్చు బిగ్‌బాస్‌నే నోటికొచ్చిన మాటలన్నాడు. దీంతో నీ ఆట చాలులే అని బయటకు పంపించేశారు. ఇప్పుడు తీరిగ్గా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాడు. ఎలిమినేషన్ తర్వాత అభయ్ నవీన్ ఓ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశాడు.అభయ్ ఏమంటున్నాడు?'బిగ్‌బాస్ హౌస్‌లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు వెరీ వెరీ సారీ. కానీ వెళ్లే ముందే నేను చెప్పి దిల్ దార్ ఉంటానని. అది నచ్చితే లోపల ఉంటా లేదంటే ఉండనని. దురదృష్టవశాత్తూ బయటకొచ్చేశా. నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. మీకు సినిమాలతో మరింత దగ్గరవుతా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా' అని అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే?తొలి రెండు వారాల్లో బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారానికి వచ్చేసరికి కన్నడ బ్యాచ్ నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఓ జట్టుకి(క్లాన్) లీడర్‌గా వ్యవహరించిన అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ చూపించాలి. కానీ అది మితిమీరిపోతే సమస్య వస్తుంది. అభయ్ కూడా అలా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. అయితే అయ్యాడు కానీ దాన్ని బయటకు చూపించడం దెబ్బేసిందని చెప్పొచ్చు.బిగ్‌బాస్‌నే తిడితే ఎలా?గత వారం జరిగిన గుడ్లు టాస్క్‌లో తన జట్టు గెలుపు కోసం పోరాడుతుంటే చీఫ్‌గా ఉన్న అభయ్ మాత్రం ఆటని లైట్ తీసుకున్నాడు. దీనికి తోడు తన టీమ్ సభ్యులని కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు. తన టీమ్‌పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్‌బాస్ మీద ప్రతాపం చూపించాడు. బిగ్‌బాస్.. బయాస్డ్ (ఒకరికే సపోర్ట్ చేయడం) అని నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్‌బాస్ మీదకు తోసేశాడు. ఇప్పుడేమో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన తర్వాత కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) View this post on Instagram A post shared by B Naveen Kumar (@abhainaveen) -
తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా.. నిన్ను ఫైనల్లో చూడాలి: అభయ్
ఫండే.. ఎప్పటిలాగే నాగ్ ఫన్ గేమ్స్ ఆడించాడు. మధ్యమధ్యలో నామినేషన్లో ఉన్న ఎనిమిదిమందిలో ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ పోయాడు. అందరూ ఊహించనట్లుగానే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియలాంటే నేటి (సెప్టెంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..మొదట సేవ్ అయింది వీళ్లే..నాగార్జున వచ్చీరావడంతోనే నామినేషన్లో ఉన్న ఎనిమిది మందిలో సీత, ప్రేరణ సేవ్ అయినట్లు ప్రకటించాడు. తర్వాత కంటెస్టెంట్లతో సెట్, కట్ గేమ్ ఆడించాడు . ఫ్రెండ్స్‌లో సెట్ అయ్యేవాళ్లకు హార్ట్ ఇచ్చి, సెట్ కానివాళ్లకు హార్ట్‌ను ముక్కలు చేసివ్వాలన్నాడు. మొదటగా నిఖిల్.. మాట వింటాడని పృథ్వీకి హార్ట్ ఇచ్చాడు. కొన్ని మాటలు వదిలేయడం వల్ల బాధపడ్డానంటూ సోనియాకు హార్ట్ ముక్కలు చేసిచ్చాడు.నిఖిల్ హృదయం ముక్కలుగతవారం ఇచ్చిన మాట ప్రకారం సోనియా.. నాగ్ కోసం పాట పాడి అలరించింది. తర్వాత సీత.. చాలా విషయాల్లో అర్థం చేసుకుంటుందంటూ నైనికకు హార్ట్.. అర్థం చేసుకోవట్లేదంటూ విష్ణుప్రియకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. మణికంఠ.. నేను తప్పు చేసినప్పుడు సరిచేసిందని సోనియాకు హార్ట్ ఇవ్వగా నిఖిల్‌కు ముక్కలైన హృదయం ఇచ్చాడు. నబీల్.. ఆదిత్యకు హార్ట్, నైనికకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. విష్ణుప్రియ.. సీతతో సెట్ అని, పృథ్వీతో ఇంకా సెట్ అవట్లేదంటూ కట్ చెప్పింది. విష్ణుకు బ్రోకెన్ హార్ట్నైనిక వంతురాగా సీతతో సెట్ అని, నిఖిల్‌తో కొన్ని చెప్పుకోలేకపోతున్నానంటూ కట్ చెప్పింది. ప్రేరణ.. సహనం నేర్పించాడంటూ అభయ్కు హార్ట్ ఇచ్చింది. ఫ్రెండే కాదని నన్ను నామినేట్ చేసిందంటూ యష్మికి హార్ట్ బ్రేక్ ఇచ్చింది. పృథ్వివంతు రాగా.. యష్మికి హార్ట్ ఇచ్చి.. నా మనసు ముక్కలు చేసిందంటూ విష్ణుకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. సోనియా.. మణికి హార్ట్ ఇచ్చి అభయ్కు బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. అభయ్ వంతురాగా.. యష్మికి హార్ట్, ప్రేరణకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. ఆదిత్య.. నబీల్ హార్ట్ ఇచ్చి, మణికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. అభయ్ ఎలిమినేట్చివరగా యష్మి.. నిఖిల్‌కు సెట్ చెప్పి పృథ్వీకి కట్ చెప్పింది. తర్వాత నైనికను సేవ్ చేసి ఇంట్లోవారితో సరదా గేమ్ ఆడించారు. అనంతరం మణికంఠ, విష్ణుప్రియ, యష్మిని సేవ్ చేశారు. మళ్లీ ఓ గేమ్ ఆడించాక.. ఈ వారం కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువసేపు వంట చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత పృథ్విని సేవ్ చేస్తూ.. అభయ్ ఎలిమినేటెడ్ అని నాగ్ ప్రకటించడంతో సీత ఏడ్చేసింది.ఆ ముగ్గురికి నల్ల గులాబీమితిమీరిన కామెడీకి ఫలితం అనుభవించాల్సిందేనని అభయ్ తన ఎలిమినేషన్‌ను అంగీకరించాడు. వెళ్లిపోతూ హౌస్‌లో ఉన్న ముగ్గురికి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. కొన్ని పదాలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండమని విష్ణుప్రియకు, వీలైనంతవరకు వేరేవారి గొడవలకు దూరంగా ఉండమని మణికంఠకు, ఫైనల్స్‌లో చూడాలంటూ పృథ్వీకి బ్లాక్ రోజెస్ ఇచ్చాడు. నిఖిల్, సీత, సోనియా, నబీల్‌కు ఎర్రగులాబీలు ఇచ్చాడు. బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మూడు వారాలకే బ్యాగు సర్దిన అభయ్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఆటతో లేదా మాటతో మెప్పించాలి. అప్పుడే బిగ్‌బాస్ షోలో రాణించగలరు. ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ కోల్పోయినా హౌస్ నుంచి బయటకు రావడం ఖాయం! అభయ్ నవీన్ రెండింటి మీదా పట్టు కోల్పోయాడు. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఏదో అదృష్టం కలిసొచ్చి అభయ్ చీఫ్ అయ్యాడంతే! అచ్చిరాని చీఫ్ పోస్ట్కంటెస్టెంట్లు తనను నమ్మి చీఫ్ పదవి కట్టబెట్టారు. ఏ ముహూర్తాన చీఫ్ అయ్యాడో కానీ తనలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి ప్రస్ఫుటంగా కనిపించాయి. పైగా సెల్ఫ్ నామినేట్ అవడంతో అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇట్టే బయటపడింది. గుడ్ల టాస్క్‌లో తన టీమ్ గెలుపు కోసం వెంపర్లాడుతుంటే చీఫ్ పోస్టులో ఉన్న అభయ్ మాత్రం పిచ్చ లైట్ తీసుకున్నాడు. అంతేనా, టీమ్ సభ్యులను కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు.ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదేపైగా తన టీమ్‌పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్‌బాస్ మీద తన ప్రతాపం చూపించాడు. బిగ్‌బాస్.. బయాస్డ్ అంటూ నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్‌బాస్ మీదకు తోసేశాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు, తనను బయటకు పంపించడమే బెస్ట్ అనుకున్నారు.నాగార్జున దయ చూపినా..ఏదో అద్భుతంగా ఆడి బిగ్‌బాస్‌ను నిలదీసుంటే మెచ్చుకునేవారేమో కానీ, ఇలా చేతగానివాడిలా ఓ మూలన కూర్చుని సెటైర్లు వేయడం ఎవ్వరికీ మింగుడుపడలేదు, అందుకే నాగార్జున రెడ్ కార్డు చూపించినప్పటికీ దయ తలిచి హౌస్‌లో ఉండనిచ్చినా ప్రేక్షకులు అందుకు ఒప్పుకోలేదు. నిర్దాక్ష్యిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇక ఈ మూడువారాలకుగానూ దాదాపు రూ.6 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మనిషి పుట్టుక పుట్టావా? అంటూ నాగ్ ఫైర్..
-
కుమ్మేసిన లేడీస్.. ప్రైజ్‌మనీ డబుల్! అభయ్, మణికి వార్నింగ్
ఈ వారం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసినవాళ్లకు నాగార్జున ఎవరికి క్లాస్ పీకనున్నాడనేది ముందే తెలుసు. అయితే అందరూ ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో నాగ్ ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్‌ను మెడ పట్టి బయటకు గెంటినంత పని చేశాడు. కానీ బూతులు మాట్లాడిన పృథ్వీని సుతిమెత్తగా మందలించడం గమనార్హం. మరి ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అభయ్కు రెడ్ కార్డ్నాగార్జున వచ్చీరాగానే అభయ్‌ను వాయించడం మొదలుట్టాడు. మొదట బెలూన్ గేమ్ గురించి, తర్వాత బిగ్‌బాస్‌ను చులకన చేస్తూ తిట్టిన వీడియో ప్లే చేశాడు. సైకోలా ఉన్నావ్.. మనిషి పుట్టుక పుట్టావా? అన్నీ నీమాటలే అంటూ నాగ్.. అభయ్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వకపోతే నేను సహించను. ఇది మళ్లీ రిపీట్ అవకూడదు అంటూ అభయ్కు రెడ్ కార్డ్ చూపించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. దీంతో అభయ్ మోకాళ్లపై కూర్చుని తనను క్షమించమని వేడుకున్నాడు.అభయ్ తరపున నాగార్జున క్షమాపణ..ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్.. నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవడానికి లైఫ్‌లో దొరికిన అదృష్టం సర్ ఇది అని దండం పెట్టి బతిమాలాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలేనన్న నాగ్ ఇక్కడ బిగ్‌బాస్ కంటే ఎవరూ తోపు కాదని నొక్కి చెప్పాడు. అభయ్ తరపున నాగార్జున బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇంట్లో వాళ్లందరూ అభయ్కు ఒక్క ఛాన్స్ ఇద్దామనడంతో నాగ్ శాంతించాడు.రూ.6 లక్షలు గెలుచుకున్న లేడీస్తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించాడు. లేడీస్‌లో ఎవరు బాగా ఆడారన్న ప్రశ్నకు నిఖిల్.. సీత పేరు చెప్పాడు. దీంతో నాగ్.. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు ఇచ్చావని కౌంటరిచ్చాడు. ఎగ్స్ టాస్క్ లేడీస్ అందరూ కుమ్మేశారని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వారి పర్ఫామెన్స్ మెచ్చి ఏకంగా రూ.6 లక్షల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.11,60,000కు చేరుకుంది. క్లాస్ పీకిన నాగ్తర్వాత ప్రేరణ, విష్ణు మధ్య గొడవను నాగ్ లేవనెత్తాడు. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ..నేను పర్సనల్‌గా కనెక్ట్ అయింది విష్ణుతో! కానీ, తనను నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్‌లో నాపై రక్కింది అని చెప్పింది. అప్పుడు.. సీతను తన్నిన, విష్ణుప్రియను క్యారెక్టర్‌లెస్ అన్న వీడియో ప్లే చేసి మరీ ప్రేరణకు నాగ్ క్లాస్ పీకాడు.పతివ్రత..పంపులదగ్గర కొట్టుకున్నట్లు ఆ మాటలేంటి? అని గద్దించగా ప్రేరణ.. తప్పు పదం వాడేశానని, అందుకు సారీ చెప్పానంటూనే మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విష్ణుప్రియ కూడా పతివ్రత పదం వాడిందని, మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాగ్ హెచ్చరించాడు. గుడ్డు దగ్గరే గొడవ మొదలు కావడంతో వీళ్లిద్దరికీ కలిపి ఐదు గుడ్లు పంపించి శత్రువులను మిత్రువులు చేశారు.ఎందుకంత సీన్ చేశారు?తర్వాత దోస వివాదానికి చెక్ పెడుతూ ఓ వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ.. విష్ణుకు మామూలుగానే దోస వేసి ఇచ్చింది. అడుక్కునేవారికి వేసినట్లు వేయలేదుగా.. దానికి మణి, విష్ణు ఎందుకంత సీన్ చేశారని నాగ్ అడిగాడు. మధ్యలో నువ్వు ఉండటం వల్లే ఆ గొడవ పెద్దదైందని, నీ గేమ్ నువ్వు ఆడు అని మణికి సలహా ఇచ్చాడు.ఆడపిల్ల ఇబ్బందిపడితే..తర్వాత అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన హగ్గుల వల్ల యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని వీడియో ద్వారా చూపించారు. నీ వల్ల ఆడపిల్ల ఇబ్బందిపడితే బయటకు పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావన్నది గుర్తుపెట్టుకుని ఆడమని చెప్పాడు. ఒక్క యష్మి విషయంలోనే కాదని, ఇది చాలాసార్లు రిపీట్ అవుతోందని తెలిపాడు.తప్పు తెలుసుకున్న మణిమొత్తానికి తప్పు తెలుసుకున్న మణి.. ఇంకోసారి అలా జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలామంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానన్నాడు. పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని, బూతులు తగ్గించుకోవాలన్నాడు. వరుసగా చీఫ్ అవుతున్న నిఖిల్‌ను అభినందించాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అభయ్ ఎలిమినేట్.. తన గొయ్యి తనే తీసుకున్నాడు!
ఓవర్ కాన్ఫిడెన్స్‌కు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్ విషయంలో ఇది నిరూపితం కాబోతోంది. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ అయిపోవడంతో తన ఎలిమినేషన్ గురించి లీకులు బయటకు వచ్చేశాయి. నిజానికి అభయ్ ఎలిమినేట్ అయ్యేవాడే కాదు, అసలు నామినేట్ అయ్యేవాడు కూడా కాదు!సెల్ఫ్ నామినేట్సోమవారం నామినేషన్స్ జరిగే సమయానికి హౌస్‌లో నిఖిల్, అభయ్ ఇద్దరూ చీఫ్స్‌గా ఉన్నారు. బిగ్‌బాస్ వీరిలో ఒకరు నామినేట్ కావాలని చెప్పాడు. దీంతో అభయ్, నిఖిల్ చర్చించుకున్నారు. నిఖిల్ తాను నామినేట్ అవుతానంటే అభయ్ అందుకు ఒప్పుకోలేదు. సేవ్ అవుతానన్న నమ్మకంతో తానే నామినేషన్లోకి వెళ్తానన్నాడు. పర్ఫామెన్స్ సున్నాచీఫ్ అయ్యానంటే తనలో కూడా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది, అందరూ తనను సపోర్ట్ చేస్తున్నారు.. ఇలా తనకు తానే గొప్పగా ఊహించుకున్నాడు. పోనీ ఈ వారం గేమ్ పర్ఫామెన్స్ ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్! చేతకానివాడిలా ఆడకపోవడమే కాక టీమ్ అంతా కూడా గేమ్‌ను వదిలేయమన్నాడు. అటు బిగ్‌బాస్‌నూ బూతులు తిట్టాడు. ఇది చూసి బిగ్‌బాస్ అడిని చీఫ్ పదవి నుంచి తొలగించాడు. గుణపాఠంగా..అటు జనాలు సైతం.. అభయ్ హౌస్‌లో ఉంటే మిగతావారిని కూడా చెడగొట్టేలా ఉన్నాడని భావించి తనను పంపించేయడమే నయమనుకున్నారు. అందుకనే పెద్దగా ఓట్లు పడలేదు. చివరికి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేతులు కాల్చుకున్నాడు. తను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. ఈ వారం ఎలిమినేట్ అయి హౌస్ అందరికీ ఓ గుణపాఠంగా మారాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్‌నే బూతులు తిడతావా? ఇంట్లో నుంచి వెళ్లిపో..
మొన్నటివరకు బాగానే ఉన్న అభయ్ చీఫ్ అయ్యాక తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. అందరికంటే తోపు అని ఫీలయ్యాడో ఏమోకానీ ఏకంగా బిగ్‌బాస్‌నే తిట్టాడు. మెంటల్, దిమాక్ లేదు, వాళ్లింట్లో పెళ్లాం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్లున్నాడు, బిగ్‌బాస్ కాదు బయాస్డ్ బాస్.. ఇలా నోటికొచ్చినవన్నీ అనేశాడు. బిగ్‌బాస్ కంటే గొప్ప అనుకుంటే బయటకు వెళ్లిపోండి అని నిన్న గేట్లు ఎత్తితే మళ్లీ కిక్కురుమనకుండా ఉన్నాడు. అభయ్‌ను వాయించిన నాగ్ఇంత జరిగాక కూడా తానే తప్పూ చేయలేదని బుకాయించడం గమనార్హం. ఇలాంటివి బిగ్‌బాస్ చూస్తూ ఊరుకుంటాడేమో కానీ నాగార్జున అస్సలు ఊరుకోడు. తాజాగా రిలీజైన ప్రోమోలో అభయ్‌ను వాయించేశాడు. అన్నీ లఫంగి మాటలు.. ఇది బిగ్‌బాస్ హౌస్.. బిగ్‌బాస్ మాత్రమే ఇక్కడ రూల్ చేస్తాడు అని సీరియస్ అయ్యాడు. దీంతో తప్పు తెలుసుకున్న అభయ్ మోకాళ్లపై కూలబడి క్షమించమని అడిగాడు. ఇప్పుడే వెళ్లిపో..బిగ్‌బాస్‌ను గౌరవించకపోతే నేను సహించనంటూ రెడ్ కార్డు చూపించాడు. ఈ క్షణమే బయటకు వెళ్లిపో అంటూ గేట్లు ఎత్తాడు. ఊహించని పరిణామానికి షాకైన అభయ్ ఒక్క ఛాన్స్ అని బతిమాలుకున్నాడు. అయితే ఇదంతా కేవలం వార్నింగ్ అని తెలుస్తోంది. రెడ్ కార్డ్ చూపించారు కానీ ఎలిమినేట్ చేయలేదని సమాచారం. కానీ ఇప్పుడు తప్పించుకున్నా రేపటి ఎపిసోడ్లో తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ అంటే లెక్కలేదా? నిఖిల్ అంత చేసినా సోనియా..!
బిగ్‌బాస్‌ను ధిక్కరిస్తే ఏమవుతుంది? వీకెండ్లో నాగార్జున క్లాస్ పీకుతాడు. కానీ ఈసారి అంతవరకు ఆగలేకపోయాడు బిగ్‌బాస్. తనమీద కామెడీ హద్దులు దాటడంతో కంటెస్టెంట్లందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అటు నిఖిల్.. టీమ్‌లో అందరినీ పక్కన పెట్టి సోనియాను చీఫ్‌గా గెలిపించాలనుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చీఫ్ పదవి పాయే..నేను ఆడను, మరొకరిని ఆడనివ్వను.. అన్నట్లుంది చీఫ్ అభయ్ వాలకం. ఇదేం పనికిమాలిన గేమ్, బిగ్‌బాస్ బయాస్డ్.. బయట ఇంటర్వ్యూకు వెళ్లినా కూడా అదే మాట చెప్తా.. అని బిగ్‌బాస్‌నే తిట్టాడు. ఇదేదో తేడా కొడుతుందని భావించిన బిగ్‌బాస్ గుడ్ల టాస్క్‌ను ముగించేశాడు. ఈ గేమ్‌లో కాంతార టీమ్ ఓడిపోవడంతో అభయ్ చీఫ్ పదవి పోయిందన్నాడు.మరోసారి చీఫ్ రేసులో నిఖిల్శక్తి టీమ్ గెలవడంతో ఆ టీమ్ లీడర్ నిఖిల్ మరోసారి చీఫ్ పదవి కోసం పోటీపడవచ్చన్నాడు. అలాగే రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్లు కూడా చీఫ్ పోస్ట్ కోసం పోటీలో ఉంటారని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ గుడ్డును ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనేది నిఖిల్ ఆలోచించి తన నిర్ణయం చెప్పాలన్నాడు. అటు కాంతార టీమ్ చర్చించుకుని తమలో ముగ్గురిని కంటెండర్లుగా ప్రకటించాలన్నాడు. దీంతో హౌస్మేట్స్ ఆశ్చర్యపోయారు. బిగ్‌బాస్‌నే తీసేయాలట!ఓడిపోయిన టీమ్‌లో నుంచి ముగ్గురిని సెలక్ట్ చేయడమేంటని నోరు తెరిచారు. అభయ్ అయితే మరోసారి తన నోటికి పని చెప్పాడు. బిగ్బాస్కేమైనా క్లారిటీ ఉందా? నోటికేదొస్తే అది చెప్తున్నాడు. అసలు బిగ్‌బాస్‌నే మార్చేయాలి అని అసహనం వ్యక్తం చేశాడు. వీళ్ల నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలని భావించిన బిగ్‌బాస్ అర్ధరాత్రి హౌస్‌మేట్స్‌ను గార్డెన్ ఏరియాలో నిలబడెట్టాడు. ఇప్పుడే వెళ్లిపోండిగెలిచిన శక్తి టీమ్‌లో నిఖిల్ చీఫ్ పదవి కోసం ఒకరితో మాత్రమే తలపడాల్సి ఉంటుంది. అది అతడికి లభించిన ప్రయోజనం.. ఓడిన కాంతార టీమ్‌లో ముగ్గురు చీఫ్ పదవి కోసం పోట్లాడాల్సి ఉంటుంది. ఇదే బిగ్‌బాస్ గేమ్ అని క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్ రూల్స్‌కు కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి, కాదు కూడదనుకుంటే వెళ్లిపోండి, బిగ్బాస్కంటే తామే ఎక్కువని ఫీలైతే ఉండాల్సిన అవసరం లేదు అని గేట్లు తెరిచాడు.సారీ చెప్పమన్న సోనియాదీంతో సోనియా.. అభయ్‌ను పిలిచి సారీ అయినా చెప్పు అని సలహా ఇచ్చింది. అతడు అందుకు ఒప్పుకోకపోవడంతో హౌస్మేట్స్ అందరూ కలిసి బిగ్‌బాస్‌కు సారీ చెప్పారు. పైగా తనేం తప్పు చేయలేదని బుకాయించాడు. తన కామెడీని సీరియస్‌గా తీసుకోవద్దని బిగ్‌బాస్‌కే నీతులు చెప్పాడు. ఇదిలా ఉంటే నిఖిల్ సిగరెట్ తాగినందుకు సోనియా హర్ట్ అయింది.. ఎంతోమంది చెప్పినా మానుకోలేదు, ఈమె చెప్తే సడన్‌గా ఎలా మానేస్తానని నిఖిల్ తన బాధను అభయ్‌తో చెప్పుకున్నాడు. నిఖిల్ సుద్దపూసతన వ్యక్తిగత విషయాల్లో దూరడం నచ్చట్లేదన్నాడు. అటు సోనియా.. అభయ్ దగ్గరకు వెళ్లి నిఖిల్ సుద్దపూస అని సెటైర్లు వేసింది. తనతో రెండు రోజులదాకా మాట్లాడాలని లేదని పేర్కొంది. అసలతడికి నిర్ణయాలు తీసుకోవడమే సరిగా లేదంది. అలా అన్న కాసేపటికే మళ్లీ నిఖిల్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. సరిగ్గా అదే సమయంలో రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావని సీత నిఖిల్‌ను అడిగింది. అందుకు యష్మి.. ఆన్సర్ అందరికీ తెలిసిందేగా అనేసింది.ఒక్కరు చేసిన తప్పుకు అందరికీ శిక్షఇక బిగ్‌బాస్.. అభయ్ తనపై అభ్యంతరకర పదజాలం వాడారని మండిపడ్డాడు. రాజు అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అతడు చేసిన పనికి టీమ్ సభ్యులందరూ శిక్ష అనుభవించాల్సిందేనంటూ కాంతార టీమ్‌కు చీఫ్ పదవి కోసం కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లు ప్రకటించాడు. అటు అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ రెడ్ ఎగ్‌ను సోనియాకు ఇచ్చాడు. మరోసారి చీఫ్‌గా నిఖిల్ఆ ఎగ్ తీసుకోమని సలహా ఇచ్చిన తననే పక్కన పెట్టేయడంతో సీత ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి నిఖిల్ రాగా.. వెళ్లిపో, ప్లీజ్ అని బతిమాలింది. ఇక నిఖిల్, సోనియాకు నిదానమే ప్రధానం అని టాస్క్ ఇవ్వగా ఇందులో నిఖిల్ గెలిచి మరోసారి చీఫ్‌గా నిలిచాడు. అయితే అతడిలో మరోసారి చీఫ్ అయ్యానన్న సంతోషం కన్నా సోనియా గెలవలేదన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.చదవండి: నటుడితో ప్రేమ.. అమ్మకు అస్సలు ఇష్టం లేదన్న హీరోయిన్ -
కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్!
లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ముందుండి నడిపించాలి. అంతేకానీ ఏదైతే నాకేంటి? ఎవరెటు పోతే నాకేంటి? అనుకోకూడదు. కానీ అభయ్ అచ్చంగా అదే చేశాడు. తన టీమ్ కష్టపడి సంపాదించిన గుడ్లను కాపాడటం కూడా చేతకాలేదు. పైగా తమ గుడ్లు పోతున్నాయని టీమ్ మెంబర్స్ లబోదిబోమంటే అరవకుండా ఊరుకోమని చెప్తున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం వింతలు, విశేషాలు జరిగాయో నేటి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కాంతార టీమ్‌పై విరుచుకుపడ్డ శక్తి టీమ్బిగ్బాస్ హౌస్‌లో నిన్నటి గుడ్ల టాస్క్ నేడు కూడా కొనసాగింది. కోడికూత వినబడగానే కంటెస్టెంట్లు ముందూవెనకా చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదిస్తున్నారు. వాటిని జేబుల్లో, టీషర్ట్స్‌లో.. ఎక్కడపడితే అక్కడ దాచేసుకున్నారు. తర్వాత తీరికగా బుట్టల్లో భద్రపరుస్తున్నారు. ఇంతలో కాంతార టీమ్ దగ్గరి నుంచి శక్తి టీమ్ గుడ్లు దొంగిలించింది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులు తమ చీఫ్ అభయ్కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. నబీల్‌పై నింద వేశా: విష్ణుప్రియకానీ యష్మి, ప్రేరణ మాత్రం దాన్ని అలాగే వదిలేసి ఉండలేకపోయారు. నువ్వానేనా చూసుకుందామన్నరీతిలో పోట్లాడారు. ఈ రౌండ్లో శక్తి 66, కాంతార 30 గుడ్లు సంపాదించింది. తర్వాత పెట్టిన గేమ్‌లో కాంతార టీమ్ గెలిచి 90 గుడ్లు సంపాదించింది. ఇక నబీల్ తనను అభ్యంతరకరంగా టచ్ చేశాడన్న విష్ణుప్రియ ఈరోజు దానిపై క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పింది. సైకోగాళ్లు.. బిగ్‌బాస్‌నే తిట్టిన అభయ్కిచెన్ విషయంలో బిగ్‌బాస్ మరిన్ని ఆంక్షలు విధించాడు. ఒక సమయంలో ఒక టీమ్‌కు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో వంట చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. వారిది పూర్తయ్యాకే మరో టీమ్ కిచెన్‌లో అడుగుపెట్టాలన్నాడు. ఈ నిర్ణయం విన్న అభయ్.. వీళ్లేమైనా మనిషి పుట్టుక పుట్టారా? దిమాక్ లేదు, సైకోగాళ్లు అంటూ బిగ్‌బాస్‌నే ధిక్కరించాడు. కానీ బిగ్‌బాస్ ఆదేశించాక ఇంకా ఆలోచించాల్సిందేం ఉండదు గనుక హౌస్మేట్స్ వెంటనే ఆ రూల్ ఫాలో అయిపోయారు.రాక్షసుడిలా పృథ్వీతర్వాతి రోజు నిఖిల్ ప్రభావతి కోడి దగ్గర ఎర్రగుడ్డు ఉండటం చూశాడు. అదే విషయం తన టీమ్ దగ్గరకు వెళ్లి చెప్పగా వెంటనే వెళ్లి తీసుకోమని సీత తొందరపెట్టింది. ఆమె సూచనతో ఎవరికీ కనబడకుండా ఎగ్ తీసుకొచ్చాడు. అటు సోనియాకు ఏమైందో ఏమో కానీ సడన్‌గా నైనిక మీదకెళ్లి ముద్దులు పెట్టింది. అనంతరం గేమ్ మొదలవగానే పృథ్వీ మళ్లీ రాక్షసుడిగా మారిపోయాడు. ఎటుపడితే అటు తోసేసి, రక్కేసి, లాగేసి, నెట్టేసి చూసేవారినే భయపెట్టించేశాడు.చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్అటు కాంతార చీఫ్ అభయ్ మాత్రం మరోసారి తన టీమ్‌కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తనటీమ్ కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్.. తన కళ్లముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోనీ అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయినవాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. తన టీమ్ ఓడిపోవడానికి అభయే ప్రత్యక్ష కారకుడయ్యాడు. అతడి నిర్లక్ష్యం వల్ల అవతలి టీమ్ మరింత రెచ్చిపోయారు.తన్నుకున్న లేడీ కంటెస్టెంట్లుఆడాళ్లు అయితే కిందపడి కొట్టుకున్నారు, తన్నుకున్నారు, జుట్టు పీక్కున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేయడంతో ఆమె ఆవేశంలో విష్ణును క్యారెక్టర్‌లెస్ అనేసింది. అటు సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరగా ఈ రౌండ్లో శక్తి టీమ్ దగ్గర 263, కాంతార టీమ్ దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్‌లో ఉన్న శక్తి టీమ్ కాంతార టీమ్‌లో నుంచి ప్రేరణను గేమ్‌లో నుంచి ఎలిమినేట్ చేసింది. అయితే ఈ రోజు గేమ్‌లో యష్మి, ప్రేరణ శివంగిలా ఫైట్ చేశారని తప్పకుండా చెప్పుకుని తీరాల్సిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ గొడవలన్నింటికీ ఆవిడే కారణం.. చీఫ్ పదవి పాయే!
బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్ల పంచాయితీ నడుస్తోంది. ప్రభావతి అలియాస్ కోడి సమయానుసారం పెట్టే గుడ్లను రెండు టీమ్స్ సంపాదించి దాచుకోవాలి. అవతలివారు దోచుకోకుండా కాపలా కాయాలి. సంపాదించడం కన్నా కొట్టేయడం తేలిక అని భావించిన హౌస్మేట్స్ దొంగతనం మీదే ఎక్కువ దృష్టి సారించారు.సంచాలకుడిగా నబీల్ఇప్పటికే శక్తి టీమ్ లీడ్‌లో ఉండగా ఈ గేమ్‌లో అవుట్ అయిన నబీల్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సోనియా ఏదో పాయింట్లు చెప్తుండగా.. నబీల్ కలగజేసుకుంటూ నువ్వు నన్ను బెదిరించకు, మంచిగా అడుగు చెప్తా అని కౌంటరిచ్చాడు. మీరు మా దగ్గరకు రాకండి, మేము మీ గుడ్లకు రాము అని రెండు టీములు ప్రశాంతంగా ఆడుదామనుకుంటే అందుకు సోనియా ఒప్పుకోలేదట. చీఫ్ పది పాయే..ఈ గొడవలన్నీ తన వల్లేనని కాంతార టీమ్ అభిప్రాయపడింది. మొత్తానికి లైవ్‌లో ఈ టాస్క్ అయిపోగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ విజేతగా నిలిచింది. ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. అభయ్‌ను చీఫ్‌గా తొలగించారట.. దీంతో అతడి లీడర్ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచింది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8 మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?
బిగ్‌బాస్ 8 అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా పర్లేదనిపిస్తోంది. గత వారం ఊహించని విధంగా శేఖర్ భాషా ఎలిమినేట్ అవడంతో చాలా మంది షాకయ్యారు. తనకి తానుగా వెళ్లిపోయానని తర్వాత చెప్పేసరికి ఊరుకున్నారు. ఇక ఈ వారం ఓటింగ్‌లోనూ లెక్కలు మారుతున్నాయి. ఏకంగా ఇద్దరు అబ్బాయిలు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.నామినేషన్స్‌లో ఎవరెవరు?ఎప్పుడు రెండు రోజులు పట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈసారి సోమవారం ఒక్కరోజులోనే తేలిపోయింది. 8 మంది లిస్టులోకి వచ్చారు. వీళ్లలో నాగమణికంఠ, యష్మీ, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్‌ని ఎవరూ నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్‌బాస్.. వీళ్లలో ఒకరు నామినేషన్స్‌లో ఉండాలని చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)రివర్స్ అవుద్దేమో?అయితే నిఖిల్ ఇప్పటికే ఓసారి నామినేట్ అయ్యాడని, కాబట్టి తాను వస్తానని అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుందని అభయ్ నవీన్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే అతడికి రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓటింగ్ మంచి రసపట్టులో ఉంది. విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతోంది. తర్వాత వరసగా మణికంఠ, సీత, యష్మీ గౌడ, నైనిక, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు.చివర్లో పృథ్వీ కానీప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీరాజ్ చివరి స్థానాల్లో ఉన్నారు. కానీ బిగ్‌బాస్‌కి పృథ్వీ కావాల్సినవాడిలా కనిపిస్తున్నాడు. లవ్ ట్రాక్ నడిపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు. దీని వల్ల అభయ్ నవీన్‌కి దెబ్బ పడుతుందేమోనని అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమై అభయ్ బయటకొస్తే మాత్రం ఇతడంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడేమో? ఎందుకంటే ఆడియెన్స్ పల్స్ తెలుకుందామని సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఏమన్నా పరిస్థితులు ఎదురు తిరిగితే మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇతడే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం) -
బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత
బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే అప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట! అటు శేఖర్ బాషాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు నా గైడెన్స్ అవసరం: సోనియాసోనియా పాటతో ఫండే ఎపిసోడ్ మొదలైంది. తర్వాత హౌస్‌ను రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు నాగ్. నిఖిల్, అభయ్ టీమ్స్‌లోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. అలా సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా.. నిఖిల్ టీమ్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా.. నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్‌కు ఎక్కువ అవసరం అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్‌లోనే టాప్ పర్ఫామర్ అయిన నిఖిల్‌కు ఇంతవరకు ఏ గేమ్‌లోనూ గెలవని సోనియా.. గైడెన్స్ ఇస్తాననడం కాస్త విడ్డూరంగా అనిపించకమానదు. విష్ణుప్రియతో గొడవలకు ఫుల్స్టాప్!అభయ్ టీమ్‌లో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబీల్, మణికంఠ ఉన్నారు. అభయ్ టీమ్‌కు కాంతార, నిఖిల్ టీమ్‌కు శక్తి అన్న పేర్లు ఫిక్స్ చేశారు. అనంతరం విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించడంతో సోనియా వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. నాగ్ ఇచ్చిన హింట్లను బాగానే తలకు ఎక్కించుకుందని చూసేవారికి ఇట్లే అర్థమైపోయింది. తర్వాత శక్తి, కాంతారల టీమ్స్‌తో సరదా గేమ్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో ఎవరైనా తన బ్రేకప్ స్టోరీ చెప్తే వారికి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తానన్నాడు నాగ్. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆరు నెలల్లో 14 కిలోలు తగ్గానా ఐదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్‌తో ముక్కలైంది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి సైతం ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. ఆరు నెలలపాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించాను. ఈ క్రమంలో అతడు నన్ను ఏడాది నుంచి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్ బాధ వల్ల 14 కిలోల బరువు తగ్గాను. బాధ నుంచి బయటపడేందుకు సైక్రియాట్రిస్ట్‌ను కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవడమే మంచిదైందనిపిస్తోందని సీత పేర్కొంది. సీత పాయింట్ గెలవడంతో తన శక్తి టీమ్ విజేతగా నిలిచింది.హౌస్మేట్స్ చేతిలో ఎలిమినేషన్మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా? ప్రైజ్‌మనీలో మరో రూ.15 వేలు యాడ్ చేయాలా? అని నాగ్ రెండు ఆఫర్స్ ముందు పెట్టాడు. టీమ్ ముక్తకంఠంతో ప్రైజ్‌మనీ పెరగడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,60,000కు చేరింది. తర్వాత సీత సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో మిగిలిన బాషా, ఆదిత్యలలో ఎవరు సేవ్ అవ్వాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. సీత తప్ప ప్రతి ఒక్కరూ బాషా గేమ్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాడని, తను వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించారు. సీత మాత్రమే బాషాకు సపోర్ట్ఆదిత్యకు పూలమాల వేసి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. శేఖర్ లేకుండా ఇంటిని ఊహించలేకపోతున్నా అని సీత మాత్రమే అతడికి సపోర్ట్ చేసింది. ఫైనల్‌గా శేఖర్ ఎలిమినేట్ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్లను ఓదార్చిన బాషా.. వెళ్లేముందు కూడా అందర్నీ నవ్వించి పోయాడు. నేను జోక్ చేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరు అందరి హార్టులు విన్ చేస్తారు అని తెలిపాడు.ఎవరు ఫేక్? ఎవరు రియల్?స్టేజీపైకి వచ్చిన బాషాతో.. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అన్నది చెప్పమని గేమ్ ఆడించాడు. అలా బాషా ముందుగా.. సీత.. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది, విష్ణుప్రియ.. చాలా అమాయకురాలు, ప్రేరణ.. జెన్యూన్, తను కూడా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది అంటూ ముగ్గురి ఫోటోలను రియల్ పర్సన్ లిస్టులో చేర్చాడు. సోనియాకు రెండు ముఖాలుఫేక్ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా.. నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నామినేషన్లో మాత్రం కాళి అవతారం చూశాను. తనకు రెండు ముఖాలున్నాయి. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. బహుశా అది అతడి స్ట్రాటజీయేమో! ఆదిత్య.. తను నన్ను నామినేట్ చేసినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నాను. కానీ నేను నామినేట్ చేస్తే దాన్నతడు స్పోర్టివ్‌గా తీసుకోలేదు అని ఈ ముగ్గురినీ ఫేక్ లిస్టులో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్ కోల్పోయింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగ్.. సోనియా ఇక మాట్లాడకు!
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వీకి వార్నింగ్నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్‌తో గేమ్ ఆడించాడు. మీ టీమ్‌లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్‌లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.సంచాలక్‌గా ఫెయిల్ప్రేరణ సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్‌లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్‌గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్‌గా ప్రకటించనంది. కావాలనే అలా చేశాను: యష్మిఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.బెస్ట్ పర్ఫామర్ అతడేఅప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్‌లో నబీల్‌కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.అసలైన ఆడపులిఅనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్‌లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్‌లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్మూడో టీమ్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్‌మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్‌గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.చీఫ్‌ను మీరే ఎంచుకోండిఇప్పుడు చీఫ్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్‌ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్‌గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్‌గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్‌గా వద్దన్నాడు.కొత్త చీఫ్ ఎవరంటే?సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్‌గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్‌గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్‌గా నిలిచాడు. దీంతో హౌస్‌లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్ -
చనిపోదామనుకున్న ఆదిత్య.. గిఫ్టులు అందుకున్నదెవరంటే?
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు బిగ్‌బాస్ ఇంటిసభ్యులు బాగానే కష్టపడ్డారు. అయితే అందరికంటే చిన్న టీమ్ ఎక్కువ ప్రైజ్‌మనీ గెలవడం విశేషం. టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సరదా గేమ్ ఆడించారు. ఆ వెంటనే వాళ్ల ఇంటి నుంచి కొన్ని వస్తువులు తెప్పించి కొందరికి ఇచ్చి మరికొందరికి కళ్లముందు ఆశపెట్టివెనక్కు తీసేసుకున్నారు. ఇంతకీ ఎవరెవరు బహుమతులు అందుకున్నారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఆడపులిలా సోనియాప్రైజ్మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతులేని వీరులు టీమ్.. రూ.75 వేలు, అఖండ టీమ్ రూ.1,25,000, కెరటం రూ.2,45,000 సాధించినట్లు వెల్లడించాడు. ఈ మూడింటిలో కెరటం టీమ్ సాధించిన డబ్బును ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,45,000కు చేరింది. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో యష్మి చికెన్ దొంగిలించినట్లు ఒప్పుకుంది. సోనియా ఆడపులిలా రెడీ అయింది. విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేసింది. నిఖిల్ చీర కట్టుకుని స్టెప్పులేశాడు.ఇంటి నుంచి బహుమతులుతర్వాత కంటెస్టెంట్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయని గుడ్‌న్యూస్ చెప్పాడు. కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని మెలిక పెట్టాడు. ఆ ఐదుగురు ఎవరనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఎవరు గిఫ్ట్ పొందాలి? ఎవరి బహుమతి వెనక్కు పంపించాలన్నది ఇంటిసభ్యుల చేతిలోనే ఉంటుందన్నాడు. మొదటగా అభయ్, నిఖిల్ గిఫ్టులు వచ్చాయి.నాన్నకు తెలియకుండా దొంగతనంఅభయ మాట్లాడుతూ.. మా నాన్న లెక్కల మాస్టారు. తాను చాలా స్ట్రిక్ట్. కానీ, నేను సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్ చేశాడు. అలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను సంపాదించిన డబ్బుతో కొన్న వాచ్ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే ధరించాడు అని చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ.. అబ్బాయిలకు నాన్నను హగ్ చేసుకునే అదృష్టం ఉండదు. అందుకని నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేశాను అంటూ ఏడ్చేశాడు. నైనిక కోసం సీత త్యాగంమెజారిటీ ఇంటిసభ్యులు అభయ్కు లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేశారు. దీంతో అతడు వాచీ అందుకున్నాడు. నైనిక, సీతకు బొమ్మలు గిఫ్ట్స్‌గా వచ్చాయి. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రిలేషన్లో ఉన్నాక అతడు నన్ను వదిలేసి పోయాడు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేనసలు నిద్రపోలేనంటూ ఏడ్చేసింది. కానీ ఈ బిగ్‌బాస్ హౌస్‌లో నైనిక, విష్ణుప్రియ దొరికారని.. వాళ్లతో కబుర్లు చెప్తూ నిద్రపోతున్నానంది. కాబట్టి ఆ బొమ్మ లేకుండా ఉండగలనని నైనికకు గిఫ్ట్ ఇచ్చేయండని కోరింది.చాలాసార్లు విడిపోదామనుకున్నామునైనిక మాట్లాడుతూ.. ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి. అలా ఎన్నోసార్లు గొడవలయ్యాయి, చాలాసార్లు విడిపోదామనుకున్నాము. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే ఆ బాధను మర్చిపోయాను. నేనూ కొన్ని తప్పులు చేశాను, సారీ కన్నా, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అని ఏడ్చేసింది. సీత త్యాగం, హౌస్మేట్స్ సపోర్ట్‌తో నైనిక తన బొమ్మను గెల్చుకుంది.అదే చివరి ఫోటో..నబీల్, పృథ్వీలకు తండ్రి ఫోటోలు వచ్చాయి. నబీల్ మాట్లాడుతూ.. నాన్నకు సింగర్ అవ్వాలన్నది కోరిక. తనకెలాగూ అనుకున్న కల నెరవేరలేదని నాకు ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. 2021 జూన్‌లో నాన్నతో చివరిసారి ఫోటో దిగాను. ఆ మరుసటి నెలలోనే తను చనిపోయాడు. కానీ, నేను స్ట్రాంగ్.. పృథ్వీకి వచ్చిన బహుమతిని అతడికి ఇచ్చేయమని కోరాడు.నాన్నతో దిగిన ఏకైక ఫోటోపృథ్వీ మాట్లాడుతూ.. మా నాన్నతో నేను దిగిన ఏకైక ఫోటో ఇదొక్కటే. మా నాన్నతో ఆగస్టు 15న చాలాసేపు మాట్లాడాను. ఆరోజే ఆయన కాలం చేశాడు. నేను నటుడినవ్వాలన్నది ఆయన కల. అది నెరవేర్చాను అని చెప్పుకొచ్చాడు. మెజారిటీ ఇంటిసభ్యులు నబీల్‌కు లాలీపాప్స్ ఇవ్వడంతో అతడు ఫోటోఫ్రేమ్ అందుకున్నాడు. అనంతరం మణికంఠకు శాలువా, ఆదిత్యకు తండ్రి ఫోటో ఫ్రేమ్ గిఫ్టుగా వచ్చాయి. చనిపోదామనుకున్నా..మణికంఠ మాట్లాడుతూ.. అమ్మ చనిపోతుందనడానికి ముందు తన శాలువా ఇచ్చింది. సింపతీ కోసమైతే దీన్ని నాకు ఇవ్వకండి అన్నాడు. ఆదిత్య మాట్లాడుతూ.. నాలో ఉన్న మంచి లక్షణాలకు నాన్నే కారణం. కరోనా టైంలో నా భార్య, కుమారుడు, తల్లి.. అందరికీ కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు నాన్న ఫోటో కిందపడి నన్ను హెచ్చరించింది అని ఎమోషనల్ అయ్యాడు. దొంగతనంఈ క్రమంలో నాన్న గొప్పదనం గురించి చెప్తూ బాషా భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్మేట్స్ సపోర్ట్‌తో ఆదిత్య తన తండ్రి ఫోటో అందుకున్నాడు. ఇకపోతే మణికంఠ అర్ధరాత్రి అఖండ టీమ్ బెడ్రూమ్లో దూరి సరుకులు దొంగతనం చేశాడు. అందర్నీ ఓ ఆటాడుకుందామనే ఈ ప్లాన్ వేసినట్లున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నాన్నను హగ్ చేసుకోలేక షర్ట్ దొంగతనం', 'ప్రియుడు వదిలేసి పోయాడు'
ప్రతి సీజన్లో ప్రైజ్‌మనీ రూ.50 లక్షలయితే ఈసారి మాత్రం జీరో పెట్టాడు బిగ్‌బాస్. అంటే.. మీకు కావాల్సినంత ప్రైజ్‌మనీని మీరే సంపాదించుకోవాల్సి ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందుకోసం టాస్కులు కూడా మొదలుపెట్టాడు. నిన్న అందరికంటే చిన్న టీమ్ అయిన కెరటం ఎక్కువ డబ్బులు గెలవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.బాషాను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన నైనికఈ టాస్కులతో కంటెస్టెంట్ల బుర్రలు హీటెక్కిపోయాయని అర్థం చేసుకున్న బిగ్‌బాస్ తాజాగా వారితో సరదా గేమ్ ఆడించాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భాగంగా ఆదిత్య, నిఖిల్ అమ్మాయిగా ముస్తాబయ్యాడు. నైనిక.. శేఖర్ బాషాను బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. నాన్నకు కొన్న వాచ్అనంతరం కంటెస్టెంట్లకు వారి ఇంటినుంచి గిఫ్ట్స్ వచ్చాయి. కానీ అంత ఈజీగా ఎలా ఇస్తాడు? ఐదుగురికి మాత్రమే గిఫ్ట్ పొందే ఛాన్స్ ఉందని చెప్పాడు. నైనిక, సీత, నిఖిల్, అభయ్, ఆదిత్యకు బహుమతులు రాగా.. ఆ గిఫ్టుల వెనక బ్యాక్‌స్టోరీని చెప్పారు. సినిమాల్లోకి వచ్చాక నా తొలి పారితోషికంతో నాన్నకు కొన్న వాచ్ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే పెట్టుకున్నాడంటూ అభయ్ ఎమోషనలయ్యాడు. దొంగతనం చేశా..నిఖిల్ మాట్లాడుతూ.. అబ్బాయిలకు తండ్రిని హగ్ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేరు. కాబట్టి నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేశానని ఏడ్చేశాడు. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నాక అతడు నన్ను వదిలేసిపోయాడు. అప్పుడు నాకు దొరికిన ఫ్రెండ్ కుమార్ అంటూ తన బొమ్మను చూస్తూ కన్నీళ్లుపెట్టుకుంది.ఆ బాధ నుంచి బయటపడేశాడునైనిక మాట్లాడుతూ.. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి నేను బయటపడ్డాను. ఆ బాధ నుంచి నన్ను బయటపడేసింది తనే.. నన్ను అంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అంటూ నైనిక బోరుమని ఏడ్చింది. మరి ఎవరెవరు గిఫ్ట్ గెలచుకున్నారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
నిజంగానే ఎమోషనల్ ఫూల్, ఇలాగైతే కష్టమే! మణి అదుర్స్!
బిగ్‌బాస్ హౌస్‌లో రెండోవారమే ఆకలికేకలు మొదలయ్యాయి. మూడు టీములకు పోటీపెట్టగా రెండు టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీమ్ మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయేవారితో ఉండనంటూ నిఖిల్‌కు హ్యాండిచ్చింది సోనియా. తనను లూజర్ అని పదేపదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న బిగ్బాస్వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్‌బాస్(#BiggBoss8Telugu) సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్స్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూడు టీమ్స్ సంపాదించిన రేషన్‌ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. మొదటగా మూడు టీమ్స్‌కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీమ్ గెలిచింది.సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పుఇక వేరే టీమ్స్‌కు ఫుడ్ దొరకదనుకుందో, ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీమ్స్‌కు బిగ్‌బాస్ పోటీపెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్లో ఉన్నానని, తానే ఆడతానని మంకుపట్టు పట్టాడు. ఆ ఒక్క నిర్ణయంతో కెరటం ఓటమిఅలా నిఖిల్ టీమ్ నుంచి మణి, నైనిక టీమ్ నుంచి సీత బరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్.. ఇలా ఒక్కో వస్తువు చెప్పినకొద్దీ ఎవరు ముందు తీసుకొస్తే వారు ఆ రౌండ్లో గెలిచినట్లు! మరమరాలు పావుకిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గర్లో (290 గ్రాములు) పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 250 గ్రాములు ఉంటే మాత్రమే అంగీకరిస్తానని, ఈ రౌండ్లో ఎవరూ విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలిగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది. వారమంతా రాగి ముద్దతోనే..ఫైనల్‌గా ఈ ఛాలెంజ్‌లో సీత తన అంతులేని వీరులు టీమ్‌ను గెలిపించింది. కెరటం టీమ్‌లోని నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్‌బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్‌కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సర్దిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి.. టీమ్ అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది. దొంగతనం షురూఅందుకు సోనియా సరేనంటూ తలూపుతూనే నిఖిల్ దగ్గరకొచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో.. అందరూ దోసె చేద్దామనుకుంటే కుదరదు ఎగ్ రైసే చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీమ్ సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటిసభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలుపెట్టేశారు. అటు బిగ్‌బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తిని నిఖిల్, మణి కడుపు నింపుకున్నారు.ఎమోషనల్ ఫూల్మరోవైపు నిఖిల్ నామినేషన్స్‌లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చుని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక.. నువ్వొక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్‌లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తుంది. అభయ్‌తో సోనియా.. నిఖిల్గాడిని చూస్తేనే కోపమొస్తుందని చెప్పింది. లూజర్స్‌తో ఉండనన్న సోనియాఅందుకు అభయ్.. నువ్వు నిఖిల్‌ను పదేపదే లూజర్ అన్నావంటగా.. లూజర్స్‌తో ఉండను అన్నావంట.. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీలయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు. అందుకు సోనియా.. మరీ అంత కాకపోయినా, క్యాజువల్‌గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్‌లో అవతలివారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్లిద్దరు మాత్రమేనంది. అయినా మొన్నటి నామినేషన్స్‌తో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు? అనేది జనాలకు ఈజీగా అర్థమైపోయిందిలే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చుక్కలు చూపిస్తున్న యష్మి టీమ్.. మణిలో ఈ యాంగిల్ ఉందా!
సాధారణంగా బిగ్‌బాస్ మొదలైన ఒకటీరెండు వారాలవరకు పెద్దగా కంటెంట్ ఏమీ ఉండదు. కానీ ఈ సీజన్లో మాత్రం కంటెస్టెంట్లు తొలి రోజు నుంచే కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. శేఖర్ బాషా తన వెరైటీ కామెడీతో, సోనియా పాయింట్లు లాగుతూ గొడవ పడుతూ, నాగమణికంఠ ఏడుస్తూ.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంటర్టైన్నారు. మరి ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో నేటి (సెప్టెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..తెలివిగా ఆడిన నైనిక టీమ్యష్మి, నైనిక, నిఖిల్.. ఈ ముగ్గురు చీఫ్స్‌లో ఎవరు పవర్ఫులో తేల్చుకోవాలంటూ బిగ్‌బాస్ టాస్కులు ఇచ్చాడు. అయితే నిఖిల్ టీమ్‌లో కేవలం ముగ్గురే ఉండటంతో యష్మి, నైనిక టీమ్స్‌కు మాత్రమే పోటీ పెట్టాడు. ఇప్పటికే ఓ టాస్కులో యష్మి టీమ్ గెలవగా తాజాగా మరో టాస్క్ ఇచ్చాడు. అందులో బుర్ర పెట్టి ఆడిన నైనిక టీమ్‌ను సంచాలకుడు నిఖిల్ విజేతగా ప్రకటించాడు. తన ఫ్రెండ్ నిఖిల్ తన టీమ్‌నే గెలిపిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్న యష్మి ఇది జీర్ణించుకోలేక కాసేపు కస్సుబుస్సులాడింది.ఈ వారం ఎవరిపై వేటుఎప్పుడూ గొడవకు సై అంటూ ముందుకు దూకే సోనియా సైలెంట్‌గా ఉండటంతో ఏమైందని నిఖిల్ ఆరా తీశాడు. ఒంటరిగా కూర్చున్న తనతో కబుర్లు పెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు కిచెన్‌లో అభయ్, బాషా, ప్రేరణ ఈ వారం నాగమణికంఠ ఎలిమినేట్ అవచ్చని ఊహించారు. కానీ పోలింగ్ చూస్తుంటే ఈ ఊహాగానాలు బోల్తా కొట్టడమే ఖాయమనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు రెండు గేముల్లో చెరొకటి గెలిచిన యష్మి, నైనిక టీమ్స్‌కు ఆఖరిగా ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. స్వింగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఐదు ఇటుకలను మొదటగా పేర్చాలని చెప్పాడు. పవర్ఫుల్ చీఫ్‌గా యష్మిఇక్కడ రెండు టీమ్స్ ఎలా గెలవాలన్నదానికి బదులు పక్కవారిని ఎలా ఓడించాలన్నదానిపైనే దృష్టి పెట్టారు. ఈ ఛాలెంజ్‌లో యష్మి టీమ్ గెలిచింది. రెండు టాస్కులు గెలిచి పవర్ఫుల్ చీఫ్గగా నిలిచిన యష్మి.. నిఖిల్ టీమ్‌లో నుంచి సోనియాను లాక్కుంది. అలాగే డ్రాగన్ రూమ్‌లోకి తన టీమ్‌తో పాటు వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. అందులో చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ అన్నీ ఉండటంతో టీమ్ సభ్యులు తెగ ఆనందపడిపోయారు.మూడు టీమ్స్ పేర్లివేఅనంతరం మూడు టీమ్స్‌ను మూడు జెండాలు, పేర్లు రూపొందించుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అందులో భాగంగా యష్మి టీమ్ అఖండగా, నైనిక టీమ్.. అంతులేని వీరులుగా, నిఖిల్ టీమ్.. కెరటంగా నిలుచున్నారు. ఈ మూడు టీమ్ లీడర్స్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. పవర్ఫుల్ చీఫ్ అయిన యష్మి టీమ్‌లో ఎవరూ ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదంటూ వారికి గుడ్‌న్యూస్ చెప్పాడు. లబోదిబోమన్న అంతులేని వీరులు టీమ్అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఏ పని చేయాలనేది యష్మి నిర్ణయించాలన్నాడు. దీంతో ఆమె కెరటం టీమ్‌కు వంటపని కేటాయించింది. మిగతా పనులన్నీ అంతులేని వీరులు టీమ్ చేయాలని నిర్ణయించింది. ఇది విని అంతులేని వీరులు టీమ్ సభ్యులు గుండెలు బాదుకున్నారు. గొడ్డుచాకిరీ చేయాలా? అని ఆవేశపడ్డారు, ఎమోషనలయ్యారు. అటుపక్క దొరికిందే ఛాన్స్ అన్నట్లు అఖండ టీమ్ రెచ్చిపోయింది. డస్ట్‌బిన్‌లో గ్లాస్ పడేసిన ప్రేరణ.. ఇది తన పని కాదన్నట్లు ఆ గ్లాసును మళ్లీ బయట తీసిపెట్టింది. నోరేసుకుని పడిపోకు..అటు అభయ్ నవీన్.. నచ్చింది వండుకుంటానంటూ కిచెన్‌లో అడుగుపెట్టాడు. అలాగైతే వండుకున్నాక మీ గిన్నెలు కూడా మీరే తోముకోండని సీత ఒంటికాలిపై లేచింది. అందుకు అభయ్.. మీరేమీ నా ఇంట్లో పని చేస్తలేరు.. ఇది గేమ్.. దిమాక్ ఉండాలి.. నోరేసుకుని పడిపోకు.. అని ఫైర్ అయ్యాడు. ఆ మాటతో సీత ఏడ్చేసింది. ఇక మొన్నటివరకు కన్నీళ్ల కుళాయి తెరిచిన మణికంఠ తనలో రెమోని బయటకు తీశాడు. భార్యను తలుచుకుని రొమాంటిక్ అయ్యాడు. ఈసారి భార్యను హగ్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు సెంటు పూసుకుని వెళ్తానంటూ సిగ్గుపడిపోయాడు. బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీకేమైనా దిమాఖ్ ఉందా..? ఏడ్చేసిన సీత
కొన్నిసార్లు బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇంట్లో ఉన్న ముగ్గురు చీఫ్‌లను కాస్తా మూడు టీమ్‌లు చేశాడు. మీలో ఎవరికి దమ్ముందో ప్రూవ్ చేసుకోవాలన్నాడు అయితే యష్మి, నైనిక టీమ్‌లో నలుగురి చొప్పున ఉంటే నిఖిల్ టీమ్‌లో మాత్రం ముగ్గురే ఉన్నారు. దాన్ని సమతుల్యం చేయాల్సింది పోయి యష్మి, నైనిక టీమ్స్‌కు పోటీ పెట్టాడు. నిన్నటి టాస్క్‌లో యష్మి టీమ్ గెలుపువీరిలో గెలిచిన టీమ్‌కు నిఖిల్ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే అవకాశం కల్పించాడు. ఈ ట్విస్టు విని హౌస్మేట్స్ అందరూ అవాక్కయ్యారు. ఇప్పటికే యష్మి, నైనిక టీమ్‌ల మధ్య నిన్న ఒక టాస్క్ జరగ్గా అందులో యష్మి టీమ్ గెలిచింది. నేడు ఈ రెండు టీమ్‌ల మధ్య మరో రెండు టాస్కులు జరిగాయి. ఈ మేరకు ప్రోమోలు వదిలారు. మొదట లూప్ ద హోల్స్ గేమ్ జరగ్గా ఇందులో నైనిక టీమ్ గెలిచింది. రెండో గేమ్‌లో ఎవరు గెలిచారంటే?తర్వాత ఇటుకల టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎలా గెలుద్దామని ఆలోచించడానికి బదులు పక్కవారిని ఎలా ఓడించాలన్నదానిపైనే ఫోకస్ పెట్టారు. ఎట్టకేలకు ఈ గేమ్‌లో యష్మి టీమ్ గెలిచింది. మరోవైపు కిచెన్ టీమ్‌లో ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కుంటూనే ఉన్నారు. మీ గిన్నెలు మీరు కడుక్కోండని సీత అందరికీ చెప్పింది. దీంతో అభయ్.. నువ్వు నా కింద పని చేయట్లేదు, ఇది గేమ్ అని ఫ్రస్టేట్ అయ్యాడు. ఆ ఒక్క మాటతో..అందరి గిన్నెలు మేమెందుకు కడగాలని సీత నిలదీయడంతో ఆ ప్రశ్న అడగడానికి దిమాఖ్ ఉండాలని సీరియస్ అయ్యాడు. దీంతో సీత తినే భోజనం మీద నుంచి లేచి ఏడుస్తూ వెళ్లిపోయింది. వంటగదిలో గిన్నెలు కడుగుతూనే ఉంటే ఎప్పుడు గేమ్ ఆడాలి? ఇంకెప్పుడు ముందుకు వెళ్లాలని విష్ణుప్రియతో చెప్పుకుంటూ ఫీలైంది. -
నిఖిల్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం!
నామినేషన్స్‌లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్‌లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్ 5)ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫేస్‌వాష్‌తో బ్రషింగ్!నామినేషన్స్ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్‌పేస్ట్ అనుకుని అతడు తన బ్రష్‌కు ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.చీఫ్‌లకు టీమ్స్ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్‌బాస్ ముగ్గురు చీఫ్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్‌లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురూ చెరొకరిని..చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్‌ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్‌లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్‌లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. నిఖిల్ టీమ్‌లో మణికంఠఅలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్‌కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్‌లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..చీఫ్ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీమ్‌లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్‌లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీమ్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్‌లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.నిఖిల్ ఎమోషనల్కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.వింత అలవాటుపృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్‌ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్‌బాస్ తనకు కొత్త టవల్ పంపించాడు. బాత్రూమ్ను క్లీన్‌గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.మాట మీద నిలబడ్డాడుగేమ్ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్‌లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్‌లకు బాల్ పట్టు- గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నైనిక టీమ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్‌లో అభయ్.. ఒక గోల్ చేయడంతో వీరి టీమ్ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీమ్‌లో ఇద్దరు మాత్రమే మిగులుతారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8 : మూడోవారం అభయ్ ఎలిమినేట్
అభయ్ నవీన్.. సిద్ధిపేట కుర్రాడు. ఇంజనీరింగ్ అయిపోగానే బ్యాంక్ ఉద్యోగం రావడంతో లైఫ్ సెటిల్ అనుకున్నాడు. అయితే అభయ్ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలీగ్స్.. సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని సలహా ఇచ్చారు. ఇంతలో తనతోపాటు పనిచేసే అందరికీ ప్రమోషన్ వచ్చింది, ఒక్క తనకు తప్ప! ప్రమోషన్ రాకపోవడంతో అభయ్ హర్ట్ అయ్యాడు. ఆ మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమాల్లో ట్రై చేశాడు. బొమ్మల రామారం మూవీలో నటించాడు. పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో యాక్ట్ చేసి బాగా క్లిక్ అయ్యాడు. అలా కొన్ని మూవీస్ చేసిన అతడు సొంతంగా ఓ కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారే కానీ ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా రిలీజ్ చేసే సమయానికి అభయ్ తండ్రి మరణించాడు. ఆ బాధను దిగమించుకుని ప్రయత్నాలు కొనసాగించాడు. అలా మూడేండ్ల నిరీక్షణ తర్వాత 'రామన్న యూత్' రిలీజ్ చేశాడు. డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 8వ సీజన్లో మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కానీ నోటిదురుసు వల్ల మూడో వారమే ఎలిమినేట్య్యాడు. -
చదువు గొప్పదనం నేపథ్యంలో...
‘‘రాక్షస కావ్యం’ బడ్జెట్ పరంగా చిన్న సినిమా. కానీ, కథ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని, కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహతో ‘రాక్షస కావ్యం’ తీశా’’ అని డైరెక్టర్ శ్రీమాన్ కీర్తీ అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దామురెడ్డి మాట్లాడుతూ–‘‘ఇదొక వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో పాటు చదువు గొప్పదనాన్ని చెబుతున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల వేసిన ప్రీమియర్స్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు అభయ్ నవీన్. నటీనటులు కుశాలిని, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు, అన్వేష్ మైఖేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు. -
ఇవాల్టి ట్రెండ్‌కు కావాల్సిన సినిమా రాక్షస కావ్యం, రిలీజ్ ఎప్పుడంటే?
అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్లో మరింత క్వాలిటీ కోసమే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్‌లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. రిలీజ్‌కు ముందే రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు బాగా హిట్ అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాల్టి ట్రెండ్‌కు కావాల్సిన సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. చదవండి: ఆస్తినంతా ఇచ్చేశాను.. సెంటు భూమి లేదు.. లక్షల పారితోషికం అందుకునే రవళి వెండితెరకు ఎందుకు దూరమైందో చెప్పిన హీరోయిన్ తల్లి -
Ramanna Youth Review: ‘రామన్న యూత్’ మూవీ రివ్యూ
టైటిల్: రామన్న యూత్ నటీనటుటు: అభయ్ నవీన్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, అమూల్య రెడ్డి, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, తదితరులు నిర్మాణ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ రచన-దర్శకత్వం: అభయ్ నవీన్ సంగీతం:కమ్రాన్ సినిమాటోగ్రఫీ: పహాద్ అబ్దుల్ మజీద్ విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. సిద్దిపేట జిల్లా ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన నలుగురు యువకుల కథే రామన్న యూత్. గ్రామానికి చెందిన రాజు(అభయ్ నవీన్)కి ఎమ్మెల్యే రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్) అంటే పిచ్చి. ఆయన వెంట తిరిగి ఎలాగైనా లీడర్‌గా ఎదగాలని ఆశపడతాడు. అతని స్నేహితులు చందు(జగన్ యోగిబాబు), రమేశ్(బన్నీ అభిరామ్), బాలు(అనిల్ గీలా)లతో కలిసి ఊర్లో యువనాయకుడు అనిల్(తాగోబోతు రమేశ్)తో తిరుగుతుంటారు. రామన్న యూత్ అసోసియేషన్ పెట్టి తనకు తాను లీడర్‌గా ప్రకటించుకుంటాడు. దసరా పండగ రోజు ఎమ్మెల్యే రామన్న, అనిల్‌లతో కలిసి ఉన్న ఓ ఫ్లెక్సీ కట్టిస్తాడు. అందులో అనిల్ తమ్ముడు మహిపాల్(విష్ణు) ఫోటో ఉండదు. దీంతో పగ పెంచుకున్న మహిపాల్ రాజు గ్యాంగ్‌ని అనిల్‌తో కలవకుండా అబద్దాలు చెప్పి చిచ్చు పెడతాడు. ఓ దశలో లేబర్ గాళ్లు మా అన్న పేరు చెడగొడుతున్నారని రెచ్చగొడతారు. దీంతో మహిపాల్‌కు, రాజు గ్యాంగ్‌కి గొడవ అవుతుంది. అప్పుడు దమ్ముంటే తన అన్న సాయం లేకుండా ఎమ్మెల్యేను కలవాలని రాజు గ్యాంగ్‌కి ఛాలేంజ్ విసురుతాడు. ఆ ఛాలేంజ్ని సీరియస్ తీసుకున్న రాజు గ్యాంగ్ ఎమ్మెల్యేను కలవాలని సిద్ధిపేటకు వెళ్తారు. మరి అనుకున్నట్లే రాజు గ్యాంగ్ ఎమ్మెల్యేను కలిశారా? వీళ్లంతా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లారు? అక్కడ వీళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? జైలు పాలు ఎందుకయ్యారు? తన ప్రియురాలు (అమూల్యారెడ్డి)తో రాజు ప్రేమ ఫలించిందా? చివరకు రాజు లీడర్ అయ్యాడా లేదా? రాజు గ్యాంగ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి అనేది తెలియాలంటే రామన్న యూత్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజకీయాల్లో కిందిస్థాయిలో తిరిగే ఓ యువకుడి కథ ఇది. సరైన నాయకుడిని ఎంచుకోకుండా.. ఆ పార్టీ జెండాలు మోస్తూ తిరిగితే చివరకు ఏం అవుతుందనేది కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. ఒక రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం యువతను ఎలా వాడుకుంటుంది? నాయకుడిని నమ్ముకొని సొంతవాళ్లను పట్టించుకోకుండా, ఏం పని చేయకుండా అవారాగా తిగిరితే చివరకు మధ్యతరగతి యువకుడి గతేమవుతుందనే మంచి సందేశాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. దర్శక హీరో నవీన్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. అయితే దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. కథంతా పల్లెటూరి నేపథ్యంలో ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. తెలంగాణ నేటివిటితో వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది కానీ ఎమోషనల్‌గా మాత్రం పెద్దగా కనెక్ట్ కాదు. సీన్ల పరంగా, క్యారెక్టర్ డిజైన్ల పరంగా బాగానే ఉంది కానీ బలమైన కథ లేకపోవడం మైనస్. అయితే దర్శకుడిగా నవీన్‌కి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించింది. నటీనటులంతా కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సాంకేతిక అంశాలపై తనకు ఉన్న పట్టును చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సినిమాను చాలా నేచురల్‌గా తెరకెక్కించాడు. హీరో గ్యాంగ్ చేసే దావత్, ముచ్చట్లు, వారి ఆలోచనలు..ఇవన్నీ వాస్తవికంగా ఉంటాయి. గ్రామాల్లో ఉండే యువత బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాల్లో బలమైన కథ లేదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అసభ్యతకు పాల్పడకుండా కుటుంబసమేతంగా సినిమా చూసేలా తెరకెక్కించాడు. తెలంగాణ యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. అభయ్ నవీన్, అనిల్ గీలా, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, విష్ణు పాత్రల చుట్టే ఈ కథ తిరుగుతుంది. లీడర్ అవ్వాలని కలలు కనే మధ్యతరగతి యువకుడు రాజుగా అభయ్ చక్కగా నటించాడు. అనిల్ గీలా, జగన్ యోగిబాబు కామెడీ బాగా పండించాడు. తండ్రికి భయపడినట్లు నటిస్తూనే.. బయట దోస్తానాతో తిరుగుతూ గప్పాలు కొట్టే క్యారెక్టర్ అనిల్‌ది. ఇక ఆన్లైన్ పేకాట ఆడుతూ వయసు కంటే చిన్న వాళ్లతో స్నేహం చేస్తూ ఆవారాగా తిరిగే పాత్ర జగన్ యోగిబాబుది. ఇక విష్ణు పాత్ర ఈ సినిమాకు చాలా కీలకమైంది. జెలసీతో రగిలిపోయే మహిపాల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు.ఎప్పుడూ తాగుబోతుగా కనిపించే రమేష్..ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. ఎమ్మెల్యే రామన్నగా శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్రమేర చక్కగా నటించాడు. యాదమ్మ రాజు, జబర్దస్త్ రోహిణి, ఆనంద చక్రపాణి, వేణ/ పొలసానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కమ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ, రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్‌ల ఎడిటింగ్ పర్వాతేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నంతంగా ఉన్నాయి.