బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్లలో సోనియా మొదటిస్థానంలో ఉంటుంది. తన ఆట తీరు, మాట తీరు వల్ల విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మొదట్లో నిఖిల్‌ను గ్రూపిజం అంటూ పెద్దపెద్ద మాటలన్న ఆమె తర్వాత అతడినే తనవైపు తిప్పుకుంది. అటు పృథ్వీని సైతం తన చేతికింద పెట్టుకుని ఇద్దరిని తన గేమ్ కోసం అస్త్రంగా వాడుకుంటోంది.
కావ్యతో బ్రేకప్?
ఇక్కడ జనాలకు అర్థం కాని విషయాలు రెండున్నాయి. ఒకటి.. నిఖిల్‌కు ఆల్‌రెడీ నటి కావ్యతో బ్రేకప్ అయిందా? రెండు.. డిసెంబర్‌లో పెళ్లి పెట్టుకుని సోనియా.. అబ్బాయిలతో కాస్త అతి చనువుగా ప్రవర్తించడం! ఈ రెండు విషయాలపై సోనియా స్నేహితుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా సోనియా గురించి చెప్తూ.. ఆమె అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా ఏం చూపించదు. అందరితో ఒకేలా ఉంటుంది. బయటకు వచ్చాక తనపై వచ్చిన ట్రోల్స్ చూసి నేనే షాకయ్యాను.
నాకు ఏ ప్రాబ్లం లేదు
ఆమె కుటుంబాన్ని, కాబోయే భర్తను కలిశాను. అతడేమన్నాడంటే.. 'సోనియా ఎలాంటిదో మాకు తెలుసు. ఇంట్లో వాళ్లను సోదరుల్లా చూస్తుంది. అబ్బాయైనా, అమ్మాయైనా తనకు నచ్చితే అలా చేతులు పట్టుకునే మాట్లాడుతుంది. అందులో నెగెటివిటీ ఏం లేదు. ఆమెను పెళ్లి చేసుకోబోయేది నేను కదా.. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. తనపై ట్రోలింగ్‌ను పట్టించుకోను అని చెప్పాడు.
బ్రేకప్ అంటూ ఏడ్చేశాడు
నిఖిల్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌కు వచ్చేముందే తనకు బ్రేకప్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. హౌస్‌లో సీత బ్రేకప్ స్టోరీ చెప్పినప్పుడు నిఖిల్.. తాను కూడా నాలుగేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నానని, ఈమధ్యే బ్రేకప్ అయిందని చెప్పుకుంటూ ఏడ్చాడు. నిఖిల్ బ్రేకప్‌కు సోనియా కారణం కాదు అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment