![Naga Chaitanya Wife Sobhita Dhulipala Post Ahead Of Thandel Release](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Thandel.jpg.webp?itok=nLBYRXZY)
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల థియేటర్లలో విడుదలైంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. రియల్ స్టోరీ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు.
అయితే శోభిత తన భర్త సినిమా రిలీజ్‌కు ముందు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా విడుదల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిత్రం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసని అన్నారు. ఈ లవ్ స్టోరీని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉందని శోభిత తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు ఇకనైనా మీరు గడ్డం గీసుకుంటారు.. మొదటిసారి గడ్డం లేకుండా నీ ముఖం చూసే దర్శనభాగ్యం కలుగుతుంది సామీ అని ఆమె రాసింది.' అంటూ తెలుగులోనే రాసుకొచ్చింది.
కాగా.. గతేడాది డిసెంబర్‌లో శోభిత ధూళిపా- నాగచైతన్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో శోభిత దూళిపాల తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment