మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.
అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తమ పెళ్లి వేడుక చిరకాల గుర్తుండిపోయేలా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే గ్రాండ్ వెడ్డింగ్‌ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలోనూ హన్సిక, నయనతార సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరిద్దరి బాటలోనే శోభిత- నాగచైతన్య నడుస్తున్నట్లు సమాచారం. తమ పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరికొన్ని ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వీరి పెళ్లి వేడుకను సిద్ధం చేశారు. తాతయ్య ఆశీస్సుల కోసమే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగచైతన్య వెల్లడించారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరాడని నాగార్జున తెలిపారు. అందుకే పెళ్లి పనులు కూడా వారిద్దరే చూసుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment