శోభిత ధూళిపాళ్ల దీపావళి విషెస్.. ఆ ఫోటోను షేర్ చేస్తూ! | Sobhita Dhulipala shared a picture on her Instagram to wish happy Diwali | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: కాబోయే అక్కినేని కోడలు.. ఫ్యాన్స్‌కు వైరైటీ దీపావళి విషెస్!

Published Thu, Oct 31 2024 4:58 PM | Last Updated on Thu, Oct 31 2024 4:58 PM

Sobhita Dhulipala shared a picture on her Instagram to wish happy Diwali

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని వారి కోడలు కానుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి తేదీపై ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌ 4న పెళ్లి వేడుక జరగనుందని ప్రకటించారు. ఇటీవల ఏఎన్నార్‌ శతజయంతి వేడుకల్లోనూ శోభిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలిని చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు.

ఈరోజు దీపావళి సందర్భంగా శోభిత ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలిపింది. టపాసులపై తన ఫోటోను ముద్రించి ఉన్న వాటిని షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

s

పెళ్లి పనులతో బిజీగా శోభిత..

శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పసుపు దంచుతూ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. త్వరలోనే జరగనున్న చైతూ- శోభిత గ్రాండ్‌ వెడ్డింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement