dipawali wishes
-
శోభిత ధూళిపాళ్ల దీపావళి విషెస్.. ఆ ఫోటోను షేర్ చేస్తూ!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని వారి కోడలు కానుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి తేదీపై ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న పెళ్లి వేడుక జరగనుందని ప్రకటించారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలిని చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు.ఈరోజు దీపావళి సందర్భంగా శోభిత ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలిపింది. టపాసులపై తన ఫోటోను ముద్రించి ఉన్న వాటిని షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లి పనులతో బిజీగా శోభిత..శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పసుపు దంచుతూ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. త్వరలోనే జరగనున్న చైతూ- శోభిత గ్రాండ్ వెడ్డింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. -
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్‌లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్
-
తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.#HappyDiwali — YS Jagan Mohan Reddy (@ysjagan) November 4, 2021 చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ -
గర్వంగా ఉంది : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనంగా జరుపుకున్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో ట్రంప్ సతీసమేతంగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ సిబ్బందితోపాటు పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా చాలా నమ్మకమైన దేశమని, ప్రతిఒక్కరు అమెరికన్ రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా జీవించేలా తన పాలన కొనసాగినందుకు గర్విస్తున్నానని తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని గుర్తుచేశారు. దీపావళి కాంతుల్లా.. అమెరికా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని, ప్రజలంతా మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు. (చదవండి : తుది ఫలితాలు వెల్లడి.. వెనక్కి తగ్గిన ట్రంప్) కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయులకు ప్రపంచ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నిండి ఉండాలని ఆకాంక్షించారు. -
ఈ దీపావళి ప్రతి ఇంట కోటి కాంతులు నింపాలి
సాక్షి, అమరావతి : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తిమీద దైవ శక్తి సాధించే విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని ఆయన పేర్కొన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు జననేత బుధవారం ట్వీట్ చేశారు. May light triumph over darkness and good over evil. May this Festival of Lights brighten our homes, and bring all of us joy and contentment. Happy Deepavali! — YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2018 -
'ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి'
-
ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.