మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.
శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.
అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుక
నాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment