akkineni
-
శోభిత మంగళస్నాన వేడుక.. ఆభరణాలకు ప్రత్యేక సెంటిమెంట్!
మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుకనాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది. -
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ) ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి (సెప్టెంబర్ 20, 1924 – సెప్టెంబర్ 20, 2024) సందర్భంగా “నటసమ్రాట్ అక్కినేనిగారి నటనాజీవితం-వివిధ కోణాలలో” అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ఆదివారం ఘనంగా జరిగింది.అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అక్కినేని గారితో ఉన్న ప్రత్యేక అనుభందాన్ని, ఆయన జీవనప్రస్థానాన్ని క్లుప్తంగా వివరించి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కినేనిగారితో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధంఉన్న ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రవి కొండబోలు అక్కినేనిగారి అభిరుచులు, కుటుంబ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యాన్ని పంచుకున్నారు. ప్రముఖ గాయని, ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరి అక్కినేనిగారి సమక్షంలో పాటలు పాడి వారి ఆశీస్సులు పొందగల్గడం తన అదృష్టం అన్నారు. ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రావు కల్వాల అక్కినేని గారి జ్ఞాపకశక్తి, ఆత్మీయపలకరింపులను గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేని నటనా జీవితం ఎంత ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్ట మైనది, ఆయన జీవితంనుండి నేర్చుకోవలసినది ఎంతోఉంది అన్నారు. అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో విశిష్టఅతిథులుగా పాల్గొన్న – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సినీ గీతరచయిత, తెలుగువేదకవి – “అక్కినేనితో ముచ్చట్లు”; డా. వి.ఎన్ ఆదిత్య, ప్రముఖ సినీదర్శకులు, రచయిత, నిర్మాత – “జానపద కథానాయకుడు అక్కినేని”; ఎస్. వి రామారావు, ‘సినీ విజ్ఞాన విశారద’, సినీ చరిత్రకారుడు – “అక్కినేని జైత్రయాత్ర”; బలభద్రపాత్రుని రమణి, ప్రముఖ సినీకథా రచయిత్రి, నందిపురస్కార గ్రహీత – “నవలానాయకుడు అక్కినేని”; కాదంబరి కిరణ్, ప్రముఖ సినీ నటులు, అక్కినేనికి అత్యంత ఆప్తులు – “చిన్నతెరమీద మహానటుడు”; పోణంగి బాలభాస్కర్, పూర్వ ఆకాశవాణి వార్తల చదువరి, దూరదర్శన్ వ్యాఖ్యాత – “భక్తిరస పాత్రల్లో అక్కినేని”; పారా అశోక్ కుమార్, సాహిత్య పరిశోధకులు –“అక్కినేని హేతువాద దృక్పథం”; లక్ష్మీ భవాని, ‘అక్కినేని వీరాభిమాని’ – “సాంఘిక చిత్రాలలో మరపురాని కథానాయకుడు” అంటూ వివిధ కోణాలలో అక్కినేని గారి నటనాజీవితాన్ని చక్కగా విశ్లేషణ చేశారు. ప్రముఖ ద్వ్యనుకరణ కళాకారుడు భవిరి రవి అక్కినేని గారి ఎలా మాట్లాడతారో అనుకరించి అందరినీ అలరించారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర పద్మవిభూషణ్, నటసమ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో (డాలస్ పరిసర నగరం) నెలకొని ఉన్న రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో అక్కినేని సినిమాల నుంచి కొన్ని పాటలను ఎంపికచేసి “అక్కినేని చిత్రగీతాంజలి / నృత్యాంజలి పేరిట’’ ఒక ప్రత్యేక నివాళిగా అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందరూ పాల్గొనవలసినదిగా ఆహ్వానం పలికారు.(చదవండి: చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!) -
రజినీకాంత్ తో కయ్యానికి సిద్దమైన నాగ్..
-
అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్..వాళ్ల గ్లామర్ రహస్యం ఇదేనా!
కిచెన్ గార్డెన్ అంటూ ఇటీవల దాని ప్రాముఖ్యత గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు. అపార్టమెంట్లో ఉంటున్నాం అని బాధపడాల్సిన పనిలేదని అక్కడ కూడా పెరటి మొక్కలు ఎలా పెంచుకోవచ్చో వివరిస్తున్నారు కూడా. అయితే దీనికి సెలబ్రెటీలు, ప్రముఖుల నుంచి మంచి విశేష ఆధరణ ఉంది. అందులోనూ వాళ్ల గ్లామర్‌ను కాపాడుకోవడంలో ముఖ్యంగా జాగ్రత్త ఉంచుకోవాల్సింది ఆరోగ్యం. అందుకని వాళ్లంతా ఈ పెరటి కాయగూరలకే ప్రివరెన్స్ ఇస్తున్నారు. అందులోనూ టాలివుడ్‌కి చెందిన అక్కినేని కుటుంబం ఎంత హెల్తీగా గ్లామార్గా ఉంటారో తెలిసిందే. మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండని చాలామందికి సలహలు కూడా ఇస్తుంటారు. ఆ అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్ విశేషాలు, వారి ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దామా!. అక్కినేని ఫ్యామిలీలోని లెజెండరి నటుడు నాగేశ్వరావు గారి దగ్గరి నుంచి అఖిల్ వరకు అంతా మంచి ఆరోగ్యంగా గ్లామరస్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు యంగ్ హీరోలకు తీసిపోని విధంగా బాడీని మెయింటైన్ చేసేవారు. అయితే వారంతా తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బిజీగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వారు వారి ఇంట్లో పండే కూరగాయలే కుటుంబ సభ్యులు తింటారు. నాగేశ్వరరావు ఇంటి పక్కనే ఒక కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు వాకింగ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ కిచెన్ గార్డెన్లో కాసేపు పనిచేస్తే కానీ ఆయనకు రోజు గడవదని కూడా తరుచు చెబుతుండేవారు. ఈ కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారు ఆ కిచెన్ గార్డెన్ ని అలాగే కొనసాగిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనకుండా వారి పెరట్లో పండిన కూరగాయలకే ప్రిపరెన్స్ ఇస్తారు. అలాగే కిచెన్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ ని కూడా కంపోస్ట్ చేస్తూ అక్కడే చెట్లకు ఎరువులుగా వాడుతారు. ఇక ఆ అక్కినేని హీరోల డైట్ వద్దకు వస్తే..అక్కినేని మాత్రం చాలా తక్కువగా తినేవారు. ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. నాగార్జున అయితే అన్నీ తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇక నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మథుడే ఈ హీరో. టాలీవుడ్ కింగ్ ఈ బాస్. 62 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తూ ఉంటాడు. చాలా మంది హీరోలకు నాగార్జున ఆదర్శం అనడంలో సందేహం లేదు. నాగ్ ఫేస్ లో ఎప్పుడు గ్లో ఉంటుంది. నాగచైతన్య, అఖిల్ కూడా అంతే తండ్రిలానే ఫుల్ జోష్, అందంగా ఉంటారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుగారి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే?..కుర్ర హీరోలకు కూడా జెలసీ వచ్చేంత బాగుండేవారు. వయసు మీద పడ్డా కూడా అందంగా కనిపించేవారు. ఇలా వారి కుటుంబం అంతా ఇంత ఆరోగ్యంగా, ఫిట్నెస్గా ఉండటానికి వారు అనుసరిస్తున్న ఆరోగ్యకరమైన జీవనశైలి, తీసుకుంటున్న మంచి ఆహారమే కారణం. (చదవండి: ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!) -
ఆ మైండ్ సెట్ తో వెళ్తే కచ్చితంగా నచ్చుతుంది
-
కస్టడీ టీం ప్లానింగ్ అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిఫ్లెక్ట్ అయితే మాత్రం..
-
నాన్న శివ సినిమాకు కస్టడీ సినిమాకు కనెక్షన్..
-
కస్టడీ ట్రైలర్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..ట్రైలర్ మొత్తం అదే
-
గ్యాంగ్ స్టర్ గా పాన్ ఇండియా సినిమా?
-
నాగార్జున, అల్లరి నరేష్ మల్టీస్టారర్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్
-
విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో నూ ఈడీ తనిఖీలు
-
ఎస్... అవన్నీ వదంతులే!
‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాది రాజీ పాత్రను అద్భుతంగా చేసినందుకు బోలెడన్ని ప్రశంసలు దక్కించుకున్నారు సమంత. అలాగే ఎల్టీటీఈ (తమిళ ఈలం)కి సహకరించే తమిళ ఉగ్రవాదిగా కనిపించడం పట్ల తమిళ ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. తాజాగా ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2’ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని సమంత పేర్కొన్నారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ – ‘‘ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ విషయాన్ని నేను ఆమోదిస్తాను. అయితే ఆ అభిప్రాయాన్నే వారు బలంగా నమ్ముతుంటే, వారి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమించమని కోరుతున్నాను. నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు. అయితే ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక (హిందీలో రిలీజైంది) కొంతవరకూ విమర్శలు సద్దుమణిగాయి. ఊహించినంత చెడుగా లేదని చూసినవాళ్లల్లో కొందరు గ్రహించారు. చూడని ప్రేక్షకులు, ఒకవేళ చూసినా అదే అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా రాజీ పాత్ర గురించి చెబుతూ – ‘‘తను విలన్ కాదు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన అమ్మాయి. ఆమె పడిన ఇబ్బందులు విన్నవాళ్లెవరూ తను విలన్ అనుకోరు’’ అన్నారు సమంత. ఈ మధ్య సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ ఐడీలో ‘అక్కినేని’ అని తీసేసి ‘ఎస్’ అని మాత్రమే పెట్టుకోవడంతో పలు ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు – ‘‘ఊహలన్నీ వదంతులే. అయినా నేను వదంతులకు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడూ అంతే’’ అన్నారు. ‘‘ఓ నెల రోజులు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. బ్రేక్ అయ్యాక కథలు వింటాను’’ అన్నారు సమంత. -
విరహమో... దాహమో... విడలేని మోహమో!
నాటి సినిమా లోకంలో అన్ని ఇళ్లకు గేట్లు, గడియలు ఉంటాయి. గేట్లు, గడియలు ఉన్న ఇళ్లల్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. అది ఇల్లు అవుతుంది. అక్కడ కాపురం కొలువుంటుంది. కాని– లోకంలో కొన్ని ఇళ్లకు గేట్లు, గడియలు ఉండవు. అక్కడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు. అక్కడ బతుకు చెడిన స్త్రీ ఉంటుంది. కాలికి గజ్జె కట్టి ఆడే మేళకత్తె ఉంటుంది. చూపులతో లోబరుచుకుని పలుకుతో దాసోహం చేసుకునే వెలయాలు ఉంటుంది. అది ఇల్లు కాదు. గుడి కాదు. రసికుల కార్యక్షేత్రం. కాని ఆ ఎడారిలో కూడా ఒక గడ్డి పువ్వు ఉంటుంది. సౌందర్యవంతౖమైన హృదయమున్న ఒక దేహం ఉంటుంది. ఒక సంస్కారవంతమైన ఆత్మ ఉంటుంది. దానిని చూసి ఒక పురుషుని మనసు స్పందిస్తే– ఆ పురుషుని కోసం ఆమె పరితపిస్తే– అదే మేఘసందేశం. రవీంద్రబాబు పాత్రను ధరించిన అక్కినేనికి ఆ ఊళ్లో మంచి పేరు ఉంటుంది. పలుకుబడి ఉంటుంది. దారిన పోతుంటే అందరూ దండాలు పెడుతుంటారు. ఊరికి మంచైనా చెడైనా అతడు చూడాల్సిందే. తెల్లటి దుస్తులు ధరించి పైన శాలువా తొడుక్కుని మల్లెపువ్వులా ఉండే అక్కినేనికి లోపల ఎక్కడో భావుకత్వం దాగి ఉంది. మబ్బులను చూసినా మల్లెలను చూసినా సాయం సంధ్య వేళలో వొంపులు తిరుగుతూ ప్రవహించే గోదారిని చూసినా అతడి హృదయంలో ఏవో సంవేదనలు రేగుతాయి. వాటికి భాష ఇవ్వాలని ఉంటుంది. వాటిని తన గొంతుతో తడపాలని ఉంటుంది. కాని అందుకు కావలసిన స్ఫూర్తి లభిస్తూ ఉండదు. ఇంట్లో భార్య నుంచి అలాంటి ఉత్సాహాన్ని పొందాలని అనుకుంటాడు. ఆమెను తన భావసుందరిగా ఊహించుకుంటూ ఉంటాడు. కాని ఆ పాత్రను పోషించిన జయసుధ ఒట్టి భర్త చాటు ఇల్లాలు. ఎప్పుడూ పూజలూ వ్రతాలు అంటూ తడి బట్టలలో తులసికోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భర్తతో పాటు కలిసి సరదాగా భోం చేయకుండా గడప అవతల కూచుని ‘ఇవాళ ఉపవాసం’ అంటూ ఉంటుంది. ఆకాశంలోని చందమామను కిటికీలో నుంచి చూస్తూ భార్యతో ఊసులాడాలని అతడనుకుంటే ఆమె చాప మీద అలసి నిద్రపోతూ ఉంటుంది. అతడికి అసంతృప్తి ఉంది. అది బయటకు తెలుస్తూ ఉంది. కాని ఆమెకు కూడా అసంతృప్తి ఉంది. మామూలు ఇల్లాలుగా భర్త సన్నిధికి చేరాలనుకున్నప్పుడల్లా అతడు ఏవో ఊహల్లో మరెవో ఆలోచనల్లో మునిగి ఉంటాడు. మనసులో కవితలల్లుకుంటూ భార్యను పట్టించుకోకుండా ఉంటాడు. ఇది తూర్పు పడమరల కాపురం. పైకి మర్యాదగా కనిపిస్తున్నా అగాధం ఉన్న కాపురం.ఈ అగాధంలో అల్పపీడనం ఏర్పడటానికి పద్మ పాత్రధారి జయప్రద వచ్చింది. ఊరి బయట ఏటి వొడ్డు ఆమె నివాసం. సాయంత్రమైతే ఆటా పాటా ఆమె వృత్తి. వచ్చిన మగవారిని నాట్యంతో మురిపించడం ఆమె భుక్తి. కాని ఆమె వృత్తిది పతనావస్థగాని ఆమె మనసుది కాదు. సంస్కారంది అంతకన్నా కాదు. ఆమె ఎంతో లలితంగా ఉంటుంది. అంతకంటే లలితంగా ఆమె పాట, నాట్యం ఉంటాయి. వాటి కంటే లలితంగా ఆమె సంస్కారం ఉంటుంది. జయదేవుని అష్టపదిని పాడుతూ పాదాలతో మువ్వలను కదిలిస్తున్నవేళ అక్కినేని ఆమెను చూస్తాడు. ఇసుక తిన్నెల మీద పురిని విదిల్చిన నెమలి వలే గొంతును ఎగజిమ్మిన కోకిల వలే ఉన్న ఆమెను చూడగానే అతడిలో ఆ క్షణమే ఆశువుగా కవితావేశం పొంగుతుంది. భావం ఉప్పొంగుతుంది. భాష ఆధీనంలోకి వచ్చి పదం బయల్పడుతుంది. ఆమె పాటకు అతడు తన భావాన్ని కలుపుతాడు. మొదటిసారి వారిరువురి కళా హృదయాలకు అలా లంకె పడుతుంది. అలా అతడు తన వెలితిని తీర్చే చిరునామాగా ఆమెను మలుచుకుంటాడు. ఆమె కనిపిస్తే చాలు అతడు కవి. ఆమె పక్కన మెత్తగా కూర్చుంటే చాలు. అతడు ముని. అంతవరకే ఆమె అతడికి కావలసింది. ఆమె సాంగత్యం... ఆమె సౌశీల్యం... దేహం కాదు. అయితే లోకం అలా అనుకోగలదా? అనుకోలేదు. అది పరాయి స్త్రీతో అతడు వల్లో పడ్డాడని భావిస్తుంది. ఇంట్లో భార్య కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది. తుదకు అతడి బావగారైన జగ్గయ్య జయప్రదను ఊరి నుంచి తరిమేసే దాకా ఊరుకోడు. ఎంతో ఇష్టమైన ఒక స్నేహితుల జంటను విడదీసే పాపంలాంటి పని అది. అక్కినేని విలవిలలాడిపోతాడు. ఆమె విరహంలో కవిత్వం రాసి రాసి సోలిపోతుంటాడు. కాని ఆమె కనిపించదు. కనిపించకపోయే కొద్దీ అతడు విరాగి అవుతాడు. గడ్డాలు మీసాలు పెంచిన బైరాగి అవుతాడు. అప్పుడుగానీ ఊరికీ, అయినవారికీ అర్థం కాదు– వారిద్దరూ ఒకరికి ఒకరు అని... ఒకరి కళకు మరొకరు ఆలంబన అని. సాధారణంగా అంతా ఇటువంటి వారిని చూసి నాలుగు రోజుల్లో బులబాటం తీరిపోతే విడిపోతారు అని అనుకుంటారు. కాని అక్కినేని, జయప్రదల బంధం అలాంటిది కాదు. వృద్ధులైనా వయసు ఉడిగినా వారు ఒకరి సాన్నిహిత్యంలోనే మరొకరు జీవిస్తూ ఉంటారు. ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసిస్తూ ఉంటారు. చివరకు ఒకరి మరణంలో కూడా మరొకరు తోడుంటారు.కొన్ని బంధాలకు అర్థమూ వ్యాఖ్యానమూ ఉండకపోవచ్చు. అంతమాత్రాన అవి లేకుండా పోవు. మనుషులు వాటిని ఏర్పరచుకోకుండా ఉండరు. పెళ్లి, పిల్లలు, సంసారం... వీటి అవతల కూడా ఎవరో మరెవరి దోసిళ్ల నీళ్లకో ఆర్తి పడుతుం టారు. ఆ దాహార్తిని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కట్టుబాట్లను దాటివెళ్లి పిచ్చివాళ్లు అవుతుంటారు. చివరి వరకూ ఘర్షణ అనుభవించి కడతేరిపోతుంటారు. మేఘసందేశం భావుకులైన ఒక స్త్రీ పురుషుల కథ. వారి బంధానికి లోకం అంగీకారం లేకపోవచ్చు. కాని ప్రకృతి అంగీకారం మాత్రం ఉంది. 1980లో ‘శంకరాభరణం’ వచ్చింది. నిద్రావస్థలో ఉన్న సంగీత నాట్యాలను సాహిత్యాన్ని అది ఒకసారి వెన్ను చరిచి ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది దర్శకులు ఆ సినిమాతో స్ఫూర్తి పొందారు. దాసరి నారాయణరావు 1982లో ‘మేఘసందేశం’ తీస్తే జంధ్యాల ఆ మరుసటి సంవత్సరం ‘ఆనందభైరవి’ తీశారు. శంకరాభరణంలో సోమయాజులను చూసి మంజు భార్గవి స్ఫూర్తి పొందితే మేఘసందేశంలో జయప్రదను చూసి అక్కినేని స్ఫూర్తి పొందుతాడు. శంకరాభరణంలో శంకరశాస్త్రి పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడితే ఇక్కడ అక్కినేని కుటుంబానికి భంగం ఏర్పడింది. ఎంతటి కళకారులైనా, ఎవరిని చూసి స్ఫూర్తి పొందినా, కుటుంబం భంగం కావడం ప్రేక్షకులకు నచ్చదు. ఆ ఇబ్బంది మేఘసందేశంలో ఉంది. కుటుంబ ధర్మానికి ద్రోహం చేశాననే గిల్ట్ జీవితాంతం అక్కినేనిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఏ పక్షం వహించాలో తెలియక సతమతమవుతారు. క్లయిమాక్స్‌లో అక్కినేని, జయప్రద చనిపోవడంతో నిట్టూర్పు విడుస్తారు. దాసరి వంటి కమర్షియల్ డైరెక్టర్, అక్కినేని వంటి కమర్షియల్ హీరో కలిసి ఆ రోజులలో ‘మేఘ సందేశం’ వంటి కళాత్మక సినిమా తీయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఈ సాహసానికి సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు, గీత కర్తలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, కెమెరా సెల్వరాజ్ తోడు నిలిచి సినిమాను క్లాసిక్‌గా మలిచారు. మేఘసందేశం రిలీజైన వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయకపోయినా మెల్లగా అది క్లాసిక్ స్థాయికి నిలువగలిగి జాతీయ అవార్డులు తెచ్చుకుని గుర్తింపు పొందగలిగింది. అక్కినేని, జయప్రద, జయసుధ, దాసరి ఈ నలుగురి జీవితంలో నేటికీ ఇది ముఖ్యమైన సినిమా. అంతేనా? కళ ఉన్నంత కాలం కాలదోషం లేని సినిమా. ఎవరో ఒక స్త్రీ కరముద్రలను చూసి ఒక పురుషుని మనసు కదం తొక్కినా ఒక పురుషుడి గానావేశం చూసి ఒక స్త్రీ హృదయం ఉప్పొంగినా మేఘసందేశం ప్రస్తావన ఉంటుంది. మూగ భాష అనాదిగా ఉంది. స్త్రీ పురుషుల మధ్య మూగ మేఘసందేశం కూడా వారిరువురు ఉన్నంత కాలం ఉంటుంది. కళాభ్యుదయ మస్తు. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన... ‘మేఘసందేశం’ సినిమాను మ్యూజికల్ అనాలి. ఇది సంగీతం మధ్య సినిమాయే తప్ప సినిమా మధ్య సంగీతం కాదు. సినిమాలో పది పాటలు ఉంటే పది పాటలనూ సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు సృజనాత్మకతలో పతాకస్థాయికి తీసుకువెళ్లారు. ‘శంకరాభరణం’కు బాలూ అన్ని పాటలు పాడితే మేఘసందేశంలో ఏసుదాస్ అన్ని పాటలు పాడి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. వేటూరి రాసిన ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. సుశీల పాడిన ‘నిన్నటి దాకా శిలనైనా’, ‘ఆకులో ఆకునై’, ‘ముందు తెలిసెనా ప్రభూ’... ఈ పాటలన్నింటికీ జాతీయ అవార్డు పొందారు. వీటిని సృష్టించిన రమేష్‌నాయుడుకు సరేసరి. వేటూరి హవా వల్ల నెమ్మదించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సినిమాలో తన విశ్వరూపం చూపారు. ‘ఆకులో ఆకునై’... ఆయన మార్క్. ‘శీతవేళ రానీయకు రానీయకు’ అని ఆయన మాత్రమే అనగలడు. మేఘసందేశం విడుదలయ్యాక దాని ఎల్పి రికార్డులు విస్తారంగా అమ్ముడుపోయాయి. పల్లెటూరి వాళ్లు కూడా ‘ఆకాశ దేశాన’ పాటను హమ్ చేశారు. మెరిసేటి ఓ మేఘమా అని మురిసిపోయారు. నిజంగానే మంచి సంగీతానికి అవి మంచిరోజులు. మరిచిపోని రోజులు. – కె -
శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు. ఇప్పటికీ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జేఎఫ్డబ్ల్యూ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేసింది. సమంత సెక్స్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిథి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు.. శృంగారానికా? ఆహారానికా?’అన్న ప్రశ్నకు సమాధానంగా.. సెక్స్‌కే ఓటేస్తా అంటూ ఆన్సరిచ్చింది సామ్. అంతేకాదు ఆహారం లేకుండా ఒక రోజు మొత్తం ఉండగలనంది. సమంత చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తమిళ్ లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది. -
హిట్ కావాలంటున్న అక్కినేని వారసులు
-
నిర్మాతగా మారుతున్న హీరో
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తరువాత హీరోగా నిలదొక్కుకో లేకపోయిన వారసుడు సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో 'సత్యం', 'గౌరి' లాంటి హిట్ సినిమాల్లో నటించినా, ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే నటుడిగా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయిన సుమంత్ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీపై స్వయంగా ప్రకటించిన అతడు త్వరలోనే తన బ్యానర్లో సినిమా మొదలు పెడతానని తెలిపాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో వెంకట్, నాగార్జునలు నిర్మాతలుగా మంచి విజయాలు సాధించగా, సుమంత్ సోదరి సుప్రియ కూడా నాగార్జున నిర్మించిన పలు చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే బాటలో సుమంత్ కూడా సక్సెస్ఫుల్ నిర్మాతగా మారాలని ప్లాన్ చేస్తున్నాడు. -
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ
తొలి సినిమా రిలీజ్ కూడా కాకముందే అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న అఖిల్, తొలి ప్రయత్నంలోనే సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఓ డెబ్యూ హీరో గతంలో ఎన్నడూ చేయని విధంగా భారీ బిజినెస్ చేసి రికార్డ్ సృష్టించిన సిసింద్రి, ఆ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోతున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఇప్పటి వరకు చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది. అనుకున్న విధంగా అఖిల్ సినిమా ఘనవిజయం సాధిస్తే 'అఖిల్' హీరోగా ఆ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టైటాన్ వాచెస్, మౌంటెన్ డ్యూ లాంటి యాడ్స్‌తో నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు అఖిల్. దీంతో బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని భావిస్తుంది అక్కినేని కుటుంబం. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న అఖిల్ సినిమాను వివి వినాయక్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమన్, అనూప్ రుబెన్స్ లు సంగీతం అందిస్తుండగా మణిశర్మ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. -
భావోద్వేగాలతో...కబడ్డీ కబడ్డీ
గయ్యాళి తల్లి సూర్యకాంతం వర్సెస్ సవతి కూతురు సావిత్రి! గారాబాల చెల్లెలు జమున వర్సెస్ పనిమనిషి లాంటి సావిత్రి! రోడ్ రోలర్ లాంటి సూర్యకాంతం వర్సెస్ ఆర్మీ ట్యాంక్ లాంటి ఛాయాదేవి! స్మార్ట్ లవర్ బాయ్ అక్కినేని వర్సెస్ ఇన్నోసెంట్ ప్రేమికుడు ఎన్టీవోడు! పెళ్లి చెడగొట్టే డర్టీ ఫెలో రమణారెడ్డి వర్సెస్ కథ నడిపించే పెద్దమనిషి ఎస్వీ రంగారావు! ఇన్ని ఎమోషన్స్‌తో కబడ్డీ... కబడ్డీ...! గుండెలను కరిగించే కథ! పరివర్తన తెచ్చే కథ! కుటుంబాలను కలిపే కథ! ఇప్పటికీ నచ్చే కథ! మళ్లీ చూడండి రామ్, ఎడిటర్, ఫీచర్స్ ఒక రాక్షసుడు ఉండేవాడు. బండెడు అన్నం, రోజుకో మనిషి వాడి డైట్. అదీ సరిపోయేది కాదు. నిద్రపట్టక దొర్లేవాడు. అర్ధాకలి మరి! మళ్లీ ఎప్పుడు వేళవుతుందా... ఎప్పుడు బండెడు అన్నం తిందమా అని ఎదురు చూసేవాడు. రోజుకొక మనిషన్నది కూడా ఆ రాక్షసుడి నియమం కాదు. అది మనుషులు పెట్టిన రేషనింగ్. లేకపోతే ఊరి మీద పడి దొరికినవాళ్లని దొరికినట్టు నోట్లో వేసుకుని చప్పరించేస్తాడు కదా. అంత స్టామినా వాడిది. సూర్యకాంతం నటనలో అంతకు రెండింతల స్టామినా ఉంటుంది. స్టామినా కాదు, రాక్షసత్వం. రోల్ ఏదైనా రోస్ట్ చేసేస్తుంది. కారాలు మిరియాలు అద్దుకుని మరీ కరకర న మిలేస్తుంది. కళ్లమ్మటి నీళ్లు వచ్చేస్తాయి. అమెక్కాదు. ఆమె దబాయించే మనిషికి. అంతటి మనిషిని ‘గుండమ్మ కథ’లో పస్తులుంచేశారు చక్రపాణి! అందులో సూర్యకాంతం గయ్యాళి. ఈ గయ్యాళి పాత్రను ఆయన షేక్స్పియర్ నవల ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత, కన్నడ సినిమా ‘మనె తుంబిద హెణ్ణు’ నుంచి కొంత తీసుకుని శిల్పంలా చెక్కారు. అయితే సావిత్రిపై విసుక్కోవడం, చికాకు పడడం తప్ప సూర్యకాంతంలో వేరే గయ్యాళితనం కనిపించదు గుండమ్మ కథలో. ‘బాబోయ్... గుండమ్మా!’ అని తక్కిన పాత్రలు మాత్రం బెదిరిపోయి పారిపోవడం తప్ప. ఎన్టీఆర్, ఏఎన్నార్... అప్పటికే సూపర్స్టార్లు. ఒకరిని మించిన వారొకరు. ఎవరి ఫ్యాన్స్ వారికి ఉన్నారు. ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. రోల్ ఏదైనా వాళ్లు హీరోల్లానే కనిపించాలి. మరోలా కనిపిస్తే బాక్సులు కాకుండా వేరే ఏవైనా బద్దలైపోతాయి. అలాంటిది.. కథ కోసమే అయినా, కామెడీ కోసమే అయినా ఎన్టీఆర్‌ని పనిమనిషి అంజిగాడిగా, ఏయన్నార్‌ని కొంటె కోణంగిగా చూపించడం పెద్ద సాహసం. పెపైచ్చు సినిమా టైటిల్ కూడా వారిని ఇండికేట్ చేసేలా లేదు. కథా వాళ్లిద్దరి చుట్టూ అల్లింది కాదు. అయినా అంత పెద్ద సాహసాన్ని అలవోకగా చేసేశారు చక్రపాణి-నాగిరెడ్డి... విత్ ది హెల్ప్ ఆఫ్ కమలాకర కామేశ్వరరావు. గుండమ్మ కథ మొత్తం ఇలాగే ఉంటుంది. వైవిధ్యంగా! రమణారెడ్డి ఉంటాడు. డేంజరస్ విలన్! పెళ్లిళ్లు చెడగొట్టడాన్ని మించిన డేంజరస్ విలనీ ఏముంటుంది చెప్పండి!! కానీ అంత డేంజరస్‌గా అనిపించడు. తెరపై కనిపించినప్పుడల్లా నవ్వించి పోతుంటాడు. పోయి, మళ్లీ నవ్వించడానికే వస్తున్నట్లు ఉంటాడు. ఈ మధ్యలో చేసే పనంతా చేస్తుంటాడు. ఇక గుండమ్మ సొంత కూతురు జమున పెంకి పిల్ల. సినిమాలో మరీ అంత పెంకితనం ఏమీ కనిపించదు. సవతి కూతురు సావిత్రి తెల్లారకుండానే లేచి ఇంటిపనులు మొదలు పెడితే, ఈ అమ్మాయికి ఎప్పటికో గానీ తెల్లారదు. బారెడు పొద్దెక్కాక ఒళ్లు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చి ‘అమ్మా... కాఫీ’ అని అడుగుతుంటుంది. అతి గారాబం. ఇక్కడికి ఈ వైపు క్యారెక్టర్లు అయిపోయాయి. సూర్యకాంతం, సావిత్రి, జమున, కొడుకు హరనాథ్, వాళ్లింటికి వచ్చిపోతుండే రమణారెడ్డి. అటువైపు ఎస్వీరంగారావు. ఆయన పెద్దకొడుకు ఎన్టీఆర్, చిన్న కొడుకు ఏఎన్నార్. వీళ్లతోపాటు కథ అవసరాన్ని బట్టి ఛాయాదేవి (హరనాథ్ ప్రేమించిన ఎల్.విజయలక్ష్మి మేనత్త), రమణారెడ్డి కొడుకు రాజనాల ఎంట్రీ ఇచ్చి వెళుతుంటారు. వీళ్లంతా పాత్రకు తగ్గ ఎమోషన్స్‌ని పలికిస్తుంటారు కానీ, ఆ పాత్రల స్వభావాలను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు పదే పదే సినిమాలో కనిపించవు. సూర్యకాంతం ఏమిటో చెప్పడానికి ఆమె ఫేస్‌వ్యాల్యూ ఒక్కటి చాలదా! చక్రపాణి కూడా ఇదే అభిప్రాయానికి వచ్చి ఆమెను అలా వదిలేశారు సహజసిద్ధంగా. ఆమెను దారిలో పెట్టడానికి అంతే ఫేస్‌వ్యాల్యూ ఉన్న ఛాయాదేవిని బాణంలా వదిలారు. ఇక ఆ తర్వాతి సీన్లు ఎలా నడవాలన్నది వాళ్లిద్దరి ఇష్టం. సూర్యకాంతం, ఛాయాదేవి కలిస్తే ఇంకేముందీ.. డెరైక్టర్ని కూడా మధ్యలోకి రానివ్వరు. గుండమ్మ కథలోనూ అలాగే జరిగింది. సినిమా హిట్ అయింది. ఎవరి వల్ల హిట్ అయిందంటే మాత్రం ఒక పేరు చెప్పలేం. సినిమా చూడాల్సిందే. గుండమ్మ కథలోని ప్రతి ఆర్టిస్టూ సినిమా చూపించారు. సంప్రదాయ నటనకు భిన్నంగా (ప్రోగ్రెసివ్ అనాలేమో) నటుల చేత యాక్ట్ చేయించి, కథను నడిపించిన చక్రపాణిని కూడా ఇందులోని హిట్ క్యారెక్టర్‌గానే చెప్పుకోవాలి. కథేమిటి? సూర్యకాంతం వితంతువు. కూతుళ్లు సావిత్రి, జమున. కొడుకు హరనాథ్. సంపన్న కుటుంబం. ఎస్వీరంగారావుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎన్టీఆర్, చిన్నవాడు ఏఎన్నార్. అది మరీ సంపన్న కుటుంబం. కొడుకులిద్దరికి మంచి సంబంధాల కోసం వెదుకుతుంటాడు ఎస్వీరంగారావు. ఇక్కడ సూర్యకాంతానికీ అదే పని. అయితే సొంత కూతురికి మాత్రమే సంబంధాలు చూస్తుంటుంది. సావిత్రిని ఎవడో తలమాసిన వాడికి ఇచ్చేస్తే సరిపోతుందని ఆమె ఉద్దేశం. ఎస్వీఆర్ గురించి సూర్యకాంతానికి తెలుస్తుంది. మధ్యవర్తిని పంపి జమున విషయం చెప్పిస్తుంది. ఈ సూర్యకాంతం ఎవరో కాదు, చనిపోయిన తన స్నేహితుడి భార్యేనని ఎస్వీఆర్‌కి తెలుస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్లకు... సావిత్రి, జమునల్ని ఇచ్చి చేస్తే స్నేహితుడి ఆత్మ శాంతిస్తుందని భావిస్తాడు. అలాగే గయ్యాళి సూర్యకాంతంలో, ఆమె పెంకి కూతురు జమునలో మార్పుతేవాలని అనుకుంటాడు. ఆ సంగతిని కొడుకులిద్దరికీ చెప్పి చిన్న నాటకం ఆడమంటాడు. ఎన్టీఆర్ పనిమనిషిలా సూర్యకాంతం ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మొదట ఆమెను బుట్టలో వేసుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో స్థానం సంపాదిస్తాడు. ఆ తర్వాత సావిత్రి హృద యాన్ని గెలుచుకుంటాడు. ఇక ఏఎన్నార్. జమునను వలలో వేసుకుని ఆమె ప్రేమను పొందుతాడు. సంపన్నుడైన ఎస్వీరంగారావు కొడుగ్గానే పరిచయం చేసుకుంటాడు. అలా ఇటు ఎన్టీఆర్, అటు ఏయన్నార్... సూర్యకాంతం కుటుంబానికి బాగా దగ్గరవుతారు. మొదట ఎన్టీఆర్, సావిత్రిల పెళ్లి జరుగుతుంది. తర్వాత చిన్న అవరోధంతో ఏయన్నార్, జమునలు దంపతులవుతారు. అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది. ఎన్టీఆర్ సావిత్రిని తన ఇంటికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. ఏయన్నార్ మరోలా సర్ప్రైజ్ చేసి (తను ఎస్వీఆర్ కొడుకును కాదన్న అబద్ధంతో) జమునను తనతో పాటు తీసుకెళ్లి అష్టకష్టాలు పడనిచ్చి చివర్లో అసలు విషయం చెప్తాడు. సూర్యకాంతం కూడా ఎస్వీఆర్ ఇంటికి వచ్చేస్తుంది. కథ సుఖాంతం. ఈ మధ్యలో కొన్ని మలుపులు, కొన్ని మెరుపులు... కథలో బలం ఉన్నప్పుడు పాత్రల స్వభావాలను పట్టిపట్టి ఎలివేట్ చేయల్సిన పనిలేదని నిరూపించిన చిత్రం... గుండమ్మ కథ. నిరూపించిన నిర్మాత చక్రపాణి. మళ్లీ చూడవలసిన సినిమా. మన పిల్లలకూ చూపించవలసిన సినిమా. మోడర్న్ అమ్మలకీ, నాన్నలకీ కథలు రావు. ఏంత రాకున్నా ఒక కథ మాత్రం వారు చెప్పగలరు. అదే... ఏడు చేపల కథ. అందుకే ఆ కథ ప్రతి తరానికీ అందుతోంది. సరిగ్గా అలాంటి కథే గుండమ్మ కథ. మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిన కథ. - సాక్షి ఫ్యామిలీ కొన్ని విశేషాలు - ఎన్టీఆర్‌కిది 100వ సినిమా. ఏయన్నార్‌కు 99వ చిత్రం. - గుండమ్మకథకు మూడేళ్ల ముందు ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో జమునకు మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఆ మూడేళ్లు వాళ్ల పక్కన జమున నటించలేదు. ఈ సినిమా కోసం నాగిరెడ్డి-చక్రపాణి గట్టిగా జోక్యం చేసుకుని ముగ్గురినీ కలిపారు. - ఈ సినిమాలో అందరూ బిజీ ఆర్టిస్టులే కావడంతో ఎవరి డేట్స్ దొరికితే వాళ్లతో సీన్లు తీసేశారు. ‘కోలో కోలో యన్న కోలో’ పాటలో ఎన్టీఆర్, సావిత్రి, ఏయన్నార్, జమున కలిసి పాడతారు కదా. నిజానికి షూటింగ్లో నలుగురూ కలిసిందే లేదు. ఇద్దరొకసారి, మరో ఇద్దరు ఇంకోసారి పాట పూర్తి చేసి నలుగురూ కలిసి పాడారన్న ఎఫెక్ట్ తీసుకొచ్చారు. - మరో ప్రఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డికి ఈ కథ నచ్చలేదు. హిట్టయిన తర్వాత కూడా ఇది ఎందుకు అంత పెద్ద విజయం సాధించిందో తనకు అర్థం కాలేదని అన్నారట! లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం మౌనముగా నీ మనసు పాడిన కనులు మూసినా నీవాయే... కోలోకోలోయన్న కోలో నా సామి ఎంత హాయి ఈ రేయి వేషము మార్చెను, భాషను మార్చెను అలిగిన వేళనే చూడాలి ప్రేమయాత్రలకు బృందావనము -
నాన్న మన మనస్సుల్లోనే ఉంటారు: నాగార్జున
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని నెలకొల్పారు. నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ హీరో నాగార్జున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏఎన్ఆర్ ఎప్పుడూ మన మనస్సుల్లోనే ఉంటారని నాగార్జున అన్నారు. బుధవారం గుడివాడలో ఏఎన్ఆర్ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పలు రంగాల్లో ప్రముఖులైన వారికి నాగార్జున అవార్డులను ప్రదానం చేశారు. క్రీడారంగంలో విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతికి, సామాజిక సేవారంగంలో వంశీ రామరాజుకు, విద్యారంగంలో ఎంఎన్ రాజుకు, న్యాయరంగంలో జస్టిస్ పర్వతరావుకు, సివిల్ సర్వీసుల రంగంలో సంపత్‌కుమార్‌కు అవార్డులు అందజేశారు. వీరితో పాటు సినిమా రంగంలో రాఘవేంద్రరావుకు, ఆరోగ్యరంగంలో గోపిచంద్‌కు, వరప్రసాద్రెడ్డికి కూడా అవార్డులు ఇచ్చారు. -
తాతయ్య కానున్న టాలీవుడ్ మన్మధుడు?
టాలీవుడ్ నవమన్మధుడు నాగార్జున ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూనే ఉంటారు. మనిషిని చూసి వయసు చెప్పడం ఆయన విషయంలో అసలు సాధ్యం కానే కాదు. అలాంటిది.. ఆయన తొందరలోనే తాత కాబోతున్నారు. అదేంటి.. ఇంకా నాగచైతన్యకు పెళ్లి కూడా కాకముందే నాగ్ ఎలా తాత అవుతారని అనుమానం వస్తోందా? అవును.. కాకపోతే ఆయన వెండితెరమీద మాత్రమే తాతయ్య అవుతున్నారు. తన కెరీర్లో ఇప్పటికి కొన్ని వృద్ధ పాత్రలను (అన్నమయ్య లాంటి చిత్రాల్లో) పోషించినా.. తాతయ్య అయినట్లు మాత్రం ఏ సినిమాలోనూ లేదు. ఇప్పుడు ఆయన ఆ పాత్ర చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మనం మూవీతో సూపర్‌హిట్ కొట్టిన నాగార్జున.. తన జోష్ కొనసాగిస్తున్నారు. కొత్త సినిమాల్లో ఆయన రొటీన్‌కు భిన్నంగా కనిపిస్తారని చెబుతున్నారు. ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తాత, మనవడు ఈ రెండు పాత్రల్లో నటించి నాగార్జున సరికొత్త వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారట. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తాతపాత్ర చేయబోతున్న నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తారు. మనవడి పాత్ర పోషించే నాగార్జున సరసన హీరోయన్‌గా తొలుత తమన్నా అనుకున్నా.. ఆమె పారితోషికం విని షాకయ్యి.. ముంబైకి చెందిన మరో కొత్త హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. "సోగ్గాడే చిన్ని నాయన" అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా వివరాలను అక్కినేని జయంతి వేడుకలలో స్వయంగా నాగార్జున ప్రకటిస్తారట. -
'మనం'కు మంచి స్పందన
చెన్నై: అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమేణా పుంజుకుంటున్నాయి. శుక్రవారం విడుదలైన మనం చిత్రం తొలి రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 4.02 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. విదేశాల్లో ఈ సినిమాకు అనూహ్య స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అమెరికాలో 1.17 కోట్ల రూపాయిలు రాబట్టింది. ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ఇదే. నాగేశ్వరరావు కుమారుడు, యువ సామ్రాట్ నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ ఈ సినిమాలో నటించారు. కాగా కేన్సర్‌తో బాధపడ్డ నాగేశ్వరరావు ఈ సినిమా విడుదలకు ముందే మరణించిన సంగతి తెలిసిందే. -
ఫిల్మ్ జర్నలిస్టులకు అక్కినేని అవార్డులు
-
సినీ ‘మహాప్రస్థానం’
ఎటు వెళ్తున్నాడో.. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. కాకినాడ నుంచి కలకత్తాకు చేరాడు. కడుపు నింపుకునేందుకు పనికోసం తిరిగాడు. చిత్రరంగంలో బాయ్‌గా కుదిరాడు. అలా మొదలైన ఆయన పయనం సినిమా నిర్మించే స్థాయికి చేరుకుంది. జగత్కిలాడీలు, తాతా మనవుడు, ఇంట్లోరామయ్య.. వీధిలో కృష్ణయ్య తదితర హిట్ చిత్రాలను అందించారు. చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమ నగరానికి తరలివ చ్చినప్పుడు ఫిల్మ్‌నగర్‌లో తొలిగా ఇల్లు కట్టి నూతన చిత్ర సామ్రాజ్యానికి బాటలు వేశారు. ఆయనే కోటిపల్లి రాఘవ. నూటొక్క ఏళ్ల కుర్రాడు. ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం లెజెండ్. ఆ సినీ‘మహా’ప్రస్థానం ఆయన మాటల్లోనే.. కాకినాడ దగ్గర ఉన్న పల్లెటూరు కోటిపల్లి మాది. నాన్న నారాయణస్వామి. రైతు. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నలుగురన్నదమ్ములు. నాకు చదువు అబ్బలేదు. దీంతో రెండో తరగతిలోనే ఒక రోజు బడి ఎగ్గొట్టి కాకినాడకు వచ్చి దొంగలబండి (టిక్కెట్ లేకుండా రెలైక్కడం) ఎక్కేశాను. అది ఏ ఊరుకెళ్తుందో.. నేనెక్కడికి వెళ్లదలుచుకున్నానో తెలియదు. చివరకు అది ఓ పెద్ద స్టేషన్లో ఆగింది. రైలు దిగి ఊళ్లోకెళ్లాను. కడుపులో ఆకలి తప్ప జేబులో అణా బిళ్ల కూడా లేదు. అలా నడుస్తూ ఒక పెద్ద గేటు దగ్గరకు వెళ్లాను. పని కోసం గేటు తోస్తోంటే గూర్ఖా బెదిరించాడు. అతనితో వాదిస్తుండగానే ఎవరో ఒకాయన పిలిచాడు. లోపలికి వెళ్లాను. ‘ ఏంకావాలి’ అని అడిగాడు. ‘పని కోసం వచ్చా’నన్నాను. ‘ట్రాలీ లాగుతావా’ అని అడిగాడు. ‘లాగుతాన’న్నా. పని దొరికింది. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. నేను కలకత్తాలో రైలు దిగానని. మోతీలాల్ చమేరియా స్డూడియోలో పని చేస్తున్నాని... ఆ స్టూడియోలో ‘రాజాహరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నారని. ఆ సినిమా విడుదలైంది. మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లోనే ‘భక్తప్రహ్లాద’, ‘భీష్మ’ వంటి మూకీ చిత్రాలు కలకత్తాలో రూపొందాయి. ఆ సమయంలో బాంబేలో టాకీ చిత్రం తెరకెక్కింది. అది ‘ఆలంఅరా’. అప్పటికి కలకత్తాకు వచ్చి చాలా రోజులే అయింది. నేను పని చేసిన స్టూడియోలోనే నెల జీతం రూ.10 తీసుకొని మరో రెలైక్కాను. విజయవాడకు చేరుకున్నాను. బాయ్‌గా పని చే శాను... ఆ రోజుల్లో విజయవాడలో మారుతీ సినిమా టాకీస్ ఒక్కటే ఉండేది. ఆ టాకీస్‌లో తెరపై కనిపించే మూకీ చిత్రాలకు కథ, కథనం అయి నడిపించే కస్తూరి శివరావు వద్ద పనికి కుదిరాను. ఆయనకు సినిమా కాపీలు అందించడం నా పని. అర్ధణా, అణా చొప్పున నా అవసరాన్ని బట్టి డబ్బులిచ్చేవారు. 1930-32లో ఇక్కడ టాకీల యుగం ప్రారంభమైంది. దాంతో విజయవాడ నుంచి మద్రాసుకు బయలుదేరాను. ఆ రోజుల్లో బలరామయ్య, మీర్జాపురం రాజా వంటి వాళ్లు నిర్మాతలుగా వెలుగొందుతున్నారు. మీర్జాపురం రాజావారు ‘గొల్లభామ’, ‘కీలుగుర్రం’ సినిమాలు తీశారు. సీహెచ్ నారాయణరావు దర్శకత్వంలో ‘భీష్మ’ టాకీ చిత్రం వచ్చింది. కృష్ణవేణి హీరోయిన్గా ‘గొల్లభామ’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలు తీస్తున్న రోజుల్లో లైట్లు మోయడం దగ్గర నుంచి అన్ని రకాల పనులు చేశాను. బహుశా సినిమా పరిశ్రమలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికే కస్తూరి శివరావు ప్రముఖ నిర్మాత బలరామయ్య దగ్గర చేరారు. అల్వాల్ పేట్‌లోని శోభనాచల స్టూడియోలో నేను ఉండేవాన్ని. వాహిని స్టూడియో, ప్రగతి స్టూడియో, నెఫ్ట్యూన్ స్టూడియో... ఇలా ఒకటెనక ఒకటి కొత్త స్టూడియోలు ఏర్పడ్డాయి. ఏ స్టూడియోలో పని ఉంటే అక్కడికి వెళ్లి చేశాను. క్రమంగా స్టంట్ మాస్టర్నయ్యాను. ఒక్క రూపాయి కూలీతో.. అక్కినేని, కన్నాంబలు హీరో, హీరోయిన్లుగా ‘పల్నాటి యుద్ధం’ సినిమా తీస్తున్న రోజుల్లో ఆ సినిమా దర్శకుడు రామబ్రహ్మం గుండెపోటుతో చనిపోయాడు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న ఎల్వీ దర్శకత్వంలోనే మిగిలిన చిత్రం పూర్తి అయింది. ఆ సినిమా హిట్టయ్యింది. అప్పటికి ఎన్టీరామారావు నాటకాల్లో బాగా నటిస్తున్నాడు. అలా నటిస్తున్న రోజుల్లోనే ఎల్వీప్రసాద్ దృష్టిలో పడ్డాడు. ఎల్వీ ప్రసాద్ ‘మనదేశం’ సినిమా కోసం ఎన్టీరామారావును మద్రాసుకు పిలిపించాడు. ‘రామారావు అని ఓ కుర్రాడు వస్తాడు తీసుకురాపో’ అని నన్ను మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌కు తరిమారు. వెళ్లి చేతిలో ‘రామారావు’ అనే పెద్ద అక్షరాలతో ఓ బోర్డు పట్టుకొని నించున్నా. వచ్చాడు. నాలుగో నెంబర్ బస్సెక్కి ఇద్దరం ఆల్వార్పేటకు చేరుకున్నాం. ‘మన దేశం’ సినిమాలో ఎన్టీరామారావుకు కానిస్టేబుల్ పాత్ర ఇచ్చారు. నేను కూడా అదే పాత్రలో నటించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెఫ్ట్ రైట్ కొట్టే సరికి బూట్లు కరుచుకొని ఇద్దరి కాళ్లకు పుండ్లు పడ్డాయి. ఆ రోజు కూలీ ఒక్క రూపాయి తీసుకొని నాతో పాటు బీఏ సుబ్బారావు గుడిసెకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాం. మరుసటి రోజు ఆల్వార్పేట్లోనే ఓ గుడిసె అద్దెకు ఇప్పించాను. నెలకు రూ.5. అంత అద్దె భరించడం తన వల్ల కాదన్నాడు. మ్యూజిక్ డెరైక్టర్ టీవీ రాజును జత చేశాను. చెరి సగం భరిస్తూ ఆ గుడిసెలో ఉన్నాడు. నెహ్రూతో చర్చలు... చిత్రపరిశ్రమలో ఒక స్థానం లభించింది. ఎంజీఆర్, శివాజీగణేషన్, కెఆర్ రామస్వామి, ఎన్టీరామారావు, అక్కినేని వంటి వాళ్లందరితో కలిసి పని చేశాను. బీఆర్ పంతులు ‘వీరపాండ్య కట్టబమ్మన్’ సినిమా తీశాడు. ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరి క్రమంగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగాను. ఆ రోజుల్లోనే షమ్మీకపూర్, మలాసిన్హా నటించిన ‘దిల్ తేరా దివాన్’ తమిళ అనువాద చిత్రానికి పని చేశాను. అప్పుడు న్యూయార్క్ ఎంజీఎం స్టూడియో వాళ్లు ‘టార్జాన్ గోస్ టూ ఇండియా’ తీశారు. మైసూర్లో షూటింగ్. ఆ సినిమాకు అన్నీ నేనే అయి పూర్తి చేశాను. ఆ సంస్థే 1952లో ‘భవానీ జంక్షన్’ సినిమా కోసం నా సహాయం కోరింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో షూటింగ్. ప్రధానమంత్రి నెహ్రూ అనుమతి కావాలి. ఆ సినిమాలో నటించేందుకు అప్పటి ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అవాగాడ్కర్ సహా చిత్ర యూనిట్ అంతా మద్రాస్ వచ్చారు. నేను నెహ్రూ దగ్గరకెళ్లాను. స్క్రిప్టు అందజేశాను. అది చదివి ఆయన నిరాకరించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న ఆ సినిమా ఇండియాలో తీయడానికి వీల్లేదన్నారు. దాంతో వాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అప్పటి వరకు వాళ్లతో కలిసి పని చేసినందుకు ఎంజీఎం స్టూడియో నాకు 20 వేల డాలర్లు ఇచ్చింది. 30 సినిమాలు తీసి.. కె. బాలచందర్ రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ను తెలుగులో ఏకాంబరేశ్వర్రావును భాగస్వామిగా పెట్టుకొని ‘సుఖదుఃఖాలు’ పేరుతో తీశాను. ఎస్వీరంగారావు హీరోగా నటించారు. ఆ తర్వాత వాణిశ్రీ, కృష్ణలతో ‘జగత్ కిలాడీలు’తీశాను. హిట్ అయింది. వరుసగా ‘జగజ్జెట్టీలు’,‘జగజ్జెంత్రీలు’ తీశాను. డబ్బులు బాగా వచ్చాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో ‘తాత మనువడు’ నిర్మించాను. 400 రోజులు ఆడింది. మా యూనిట్లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన కోడి రామకృష్ణ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు పూర్తిస్థాయి దర్శకత్వం చేశాడు. ఆ సినిమా 600 రోజులు ఆడింది. నిర్మాతగా 30 సినిమాలు తీశాను. ‘అంకితం’ నా ఆఖరి సినిమా. ఫిల్మ్‌నగర్‌లో తొలి ఇల్లునాది.. ఎన్టీరామారావు, అక్కినేనిలతో మొదటి నుంచి మంచి స్నేహం ఉంది. కానీ వాళ్లతో సినిమాలు తీయలేదు. ఎన్టీఆర్ ఎప్పుడు కాల్షీట్ అడిగినా ఇస్తానన్నారు. నా ‘సుఖదుఃఖాలు’ సినిమాకు హీరోగా నటించాలని అక్కినేనిని అడిగాను. ఆయన నా వైపు కోపంగా చూసి ‘నన్ను పెట్టి సినిమాలు తీసే స్థాయికి ఎదిగావా’ అని అన్నారు. అప్పటి నుంచి ఆయననే కాదు ఎన్టీఆర్‌ను కూడా అడిగేందుకు సాహసించలేదు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు సినిమా హైదరాబాద్‌కు తరలి వచ్చింది. అప్పుడు ఫిల్మ్‌నగర్ ఓ అడవి. ఆ అడవిలో మొట్టమొదటి ఇల్లు నాది. వ్యక్తిగత వివరాలు... పేరు : కోటిపల్లి రాఘవ పుట్టిన తేదీ : 9 డిసెంబర్, 1913 సొంత ఊరు : కోటిపల్లి, కాకినాడ అమ్మా,నాన్న : నాగమ్మ, నారాయణస్వామి భార్య : హంస కొడుకు : ప్రతాప్ కూతురు : ప్రశాంతి అవార్డులు : అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య సహా పలు అవార్డులు -
అక్కినేని అంతిమ యాత్ర
-
ఫిలిం చాంబర్‌కు అక్కినేని పార్థీవదేహం