వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చిత్తూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చిత్తూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రాత్రి 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు.
మహానటుడు అక్కినేని మరణం వల్ల సమైక్య శంఖారావం యాత్రను ఆయన తాత్కాలికంగా రద్దు చేశారు. రేపు ఉదయం జగన్ మళ్లీ చిత్తూరు వెళ్లి సమైక్య శంఖారావం యాత్ర కొనసాగిస్తారు.