అక్కినేని ఫ్యామిలీ కిచెన్‌ గార్డెన్‌..వాళ్ల గ్లామర్‌ రహస్యం ఇదేనా! | You should Know About Akkineni Family Garden Some Unknown Facts | Sakshi
Sakshi News home page

అక్కినేని ఫ్యామిలీ కిచెన్‌ గార్డెన్‌..వాళ్ల గ్లామర్‌ రహస్యం ఇదేనా!

Published Sun, Jan 21 2024 12:36 PM | Last Updated on Sun, Jan 21 2024 1:00 PM

You should Know About Akkineni Family Garden Some Unknown Facts - Sakshi

కిచెన్‌ గార్డెన్‌ అంటూ ఇటీవల దాని ప్రాముఖ్యత గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు. అపార్టమెంట్లో ఉంటున్నాం అని బాధపడాల్సిన పనిలేదని అక్కడ కూడా పెరటి మొక్కలు ఎలా పెంచుకోవచ్చో వివరిస్తున్నారు కూడా. అయితే దీనికి సెలబ్రెటీలు, ప్రముఖుల నుంచి మంచి విశేష ఆధరణ ఉంది. అందులోనూ వాళ్ల గ్లామర్‌ను కాపాడుకోవడంలో ముఖ్యంగా జాగ్రత్త ఉంచుకోవాల్సింది ఆరోగ్యం. అందుకని వాళ్లంతా ఈ పెరటి కాయగూరలకే ప్రివరెన్స్‌ ఇస్తున్నారు. అందులోనూ టాలివుడ్‌కి చెందిన అక్కినేని కుటుంబం ఎంత హెల్తీగా గ్లామార్‌గా ఉంటారో తెలిసిందే. మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండని చాలామందికి సలహలు కూడా ఇస్తుంటారు. ఆ అక్కినేని ఫ్యామిలీ కిచెన్‌ గార్డెన్‌ విశేషాలు, వారి ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దామా!.

అక్కినేని ఫ్యామిలీలోని లెజెండరి నటుడు నాగేశ్వరావు గారి దగ్గరి నుంచి అఖిల్‌ వరకు అంతా మంచి ఆరోగ్యంగా గ్లామరస్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు యంగ్‌ హీరోలకు తీసిపోని విధంగా బాడీని మెయింటైన్‌ చేసేవారు. అయితే వారంతా తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బిజీగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వారు వారి ఇంట్లో పండే కూరగాయలే కుటుంబ సభ్యులు తింటారు. నాగేశ్వరరావు ఇంటి పక్కనే ఒక కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు వాకింగ్కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ కిచెన్ గార్డెన్లో కాసేపు పనిచేస్తే కానీ ఆయనకు రోజు గడవదని కూడా తరుచు చెబుతుండేవారు. 

ఈ కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారు ఆ కిచెన్ గార్డెన్ ని అలాగే కొనసాగిస్తున్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనకుండా వారి పెరట్లో పండిన కూరగాయలకే ప్రిపరెన్స్ ఇస్తారు. అలాగే కిచెన్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ ని కూడా కంపోస్ట్ చేస్తూ అక్కడే చెట్లకు ఎరువులుగా వాడుతారు. ఇక ఆ అక్కినేని హీరోల  డైట్‌ వద్దకు వస్తే..అక్కినేని మాత్రం చాలా తక్కువగా తినేవారు. ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. నాగార్జున అయితే అన్నీ తక్కువ మోతాదులో తీసుకుంటారు. 

ఇక నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మథుడే ఈ హీరో. టాలీవుడ్ కింగ్ ఈ బాస్. 62 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తూ ఉంటాడు. చాలా మంది హీరోలకు నాగార్జున ఆదర్శం అనడంలో సందేహం లేదు. నాగ్ ఫేస్ లో ఎప్పుడు గ్లో ఉంటుంది. నాగచైతన్య, అఖిల్ కూడా అంతే తండ్రిలానే ఫుల్ జోష్, అందంగా ఉంటారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుగారి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే?..కుర్ర హీరోలకు కూడా జెలసీ వచ్చేంత బాగుండేవారు. వయసు మీద పడ్డా కూడా అందంగా కనిపించేవారు. ఇలా వారి కుటుంబం అంతా ఇంత ఆరోగ్యంగా, ఫిట్‌నెస్‌గా ఉండటానికి వారు అనుసరిస్తున్న ఆరోగ్యకరమైన జీవనశైలి, తీసుకుంటున్న మంచి ఆహారమే కారణం. 

(చదవండి: ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement