అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో అవార్డులను, సత్కారాలను పొందారు. ఒకప్పుడు అమ్మాయిల క్రేజీ హీరో, కలల మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. అయినా అదే అందం, గ్లామర్‌తో యువ హీరోలకు తీసిపోని విధంగా ఫిట్‌గా ఉంటాడు. వయసుతో సంబంధం లేకుండా అంతలా యవ్వనంగా ఫిట్‌గా బాడీ మెయిటైన్ చేసేందుకు నాగార్జున ఏం చేస్తుంటాడో తెలుసుకుందామా..!
నాగార్జునని చూడగానే అందరూ సార్ ఇప్పటికీ అలానే అంతే అందంగా ఎలా మెయిటైన్ చేస్తారు అని అడుగుతారట. అందరికీ ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటని కుతుహలమే. ఆ సందేహాలకు చెక్‌పెట్టేలా ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ మంత్ర గురించి మాట్లాడారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కూడా అవేంటంటే..
తన రోజుని వ్యాయమాలతోనే ప్రారంభిస్తాడట. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తారట. ఒకవేళ జిమ్‌కి వెళ్లకపోతే కనీసం వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తారట. అంతే తప్ప ఏ వ్యాయామాన్ని మిస్ చేయానని చెబుతున్నారు నాగ్. వర్కౌట్‌లు చేయడమే తన తొలి ప్రాధాన్యత అని అంటున్నారు. కచ్చితంగా వారానికి ఐదు రోజులు వ్యాయామాలు చేస్తానని చెప్పారు.
ఒక గంట 45 నిమిషాలు వ్యాయమాలకే కేటాయిస్తారట. అదే తన బాడీ ఆకృతి సీక్రెట్ అంటున్నారు. మన శరీరం షేప్‌అవుట్ అవ్వకూడదంటే ఇవి తప్పనసరి అని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ఓ చిట్కాను షేర్ చేశారు.
క్రమ తప్పకుండా సక్రమంగా వ్యాయామాలు చేయాలంటే ఫోన్‌లు వంటి గాడ్జెట్‌లు తీసుకెళ్లొద్దని అన్నారు. శక్తితో కూడిన వర్కౌట్‌లు చేస్తూ..హృదయస్పందన రేటు 70% ఉండేలా చూడండి. ఇది మీ ఏకగ్రతను పెంచి, రోజంత జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందని అన్నారు. ఇదే తన ఫిట్‌నెస్‌మంత్ర అని దృఢంగా చెబుతున్నారు. దీంతోపాటు తగినంత నిద్ర, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం వంటివి చేయాలన్నారు.
అందంగా కనిపించేందుకు..
మంచి డైట్‌ని తీసుకుంటారట. అదే తన ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగ్గా ఉంచుతాయని నమ్ముతానన్నారు. ఆరోగ్యకరమైన అల్పహారం, లంచ్, డిన్నర్‌లు తీసుకుంటే ఎవ్వరైనా అందంగానే ఉంటారని చెప్పారు. రాత్రి ఏడు లేదా ఏడున్నర లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారట నాగ్. పాల సంబంధిత పదార్థాలకు నిర్ధిష్ట వయసు వచ్చేటప్పటికీ తీసుకోవడం మానేస్తేనే బెటర్ అని అన్నారు.
నాగ్ కచ్చితంగా 12 గంటలు తిని 12 గంటలు ఉపవాసం ఉంటారట. ఆయన అడపాదడపా ఉపవాసం కూడా ఉంటారట. అప్పడప్పుడు చీట్ మీల్స్ కూడా ఉంటాయని నవ్వుతూ చెబుతున్నారు. ఎప్పుడు నోరుని కట్టేసుకుని స్ట్రిక్ట్‌గా ఉండనవసరం లేదని అంటున్నారు. ఆదివారం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినవి మొహమాటం లేకుండా తినేస్తా వర్కౌట్‌లతో అదనపు కేలరీలు కరిగించేస్తా అంటున్నారు. ఒకవేళ నచ్చింది తినాలనుకుంటే..అమ్మో డైట్ అని ఆలోచించను అది తినేదైనా..తాగాలనుకున్నా మందైనా.. ఏ మాత్రం సంకోచించనని అన్నారు. ఆయనకు స్వీట్లంటే మహా ఇష్టమట. ముఖ్యంగా చాక్లెట్లు తినకుండా ఉండరట.
అయితే వర్కౌట్లు చేసినంత కాలం హాయిగా అవి తీసుకోవచ్చని అంటున్నారు. అలాగే గోల్ఫ్ తప్పనిసరిగా ఆడతారట. ఇది తన మనసుకు చక్కటి వ్యాయామంలా ఉండి తనకొక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ఈత యవ్వనంగా ఉండేందుకు ఉపకరిస్తుందట. ఇది ఒక అద్భుతమైన వ్యాయమం అట. మొత్తం ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడుతుందని నాగార్జున చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment