samaikya sankharavam yatra
-
సమైక్య ముసుగులో సీఎం రాజకీయాలు:జగన్
చిత్తూరు: సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విమర్శించారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కొత్తపల్లిమిట్ట గ్రామం చేరుకున్న జగన్ అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని సీఎం అసెంబ్లీలో తీర్మానాన్ని ఇంతవరకు పెట్టడం లేదన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అడ్డగోలుగా లేఖ ఇచ్చారని చెప్పారు. సమైక్య లేఖ ఇవ్వడానికి ఆయన ఇప్పటి వరకు ముందుకు రాలేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సిఎం కిరణ్, చంద్రబాబు ముగ్గురూ కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం మధ్య నేడు యుద్ధం జరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం అన్నారు. ఇదిలా ఉండగా, కొత్తపల్లిమిట్టలో అభిమానులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు రెండు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు ఒక విగ్రహానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. నాలుగు అడుగుల స్థలం కోసం అనుమతి కావాలా? అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ అనే వ్యక్తి లేకుంటే ఈ ప్రభుత్వం ఉండేది కాదని చెప్పారు. భూస్థాపితం అయ్యే కాంగ్రెస్‌కు ప్రాణం పోసింది వైఎస్ఆర్ అన్నారు. అటువంటి వ్యక్తి విగ్రహ ప్రతిష్టకు అనుమతులంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ బయలుదేరిన జగన్
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చిత్తూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రాత్రి 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు. మహానటుడు అక్కినేని మరణం వల్ల సమైక్య శంఖారావం యాత్రను ఆయన తాత్కాలికంగా రద్దు చేశారు. రేపు ఉదయం జగన్ మళ్లీ చిత్తూరు వెళ్లి సమైక్య శంఖారావం యాత్ర కొనసాగిస్తారు. -
చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు: జగన్
చిత్తూరు: కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రానే కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర అనే మాట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు మాత్రం వినపడటం లేదని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పరని జగన్ వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్రను సోమవారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో చేపట్టారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో డ్రామాలాడుతున్నారని, 9 ఏళ్ల పాలనలో ఆయన తన హామీల్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత పెరగాలన్నారు. ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని చెప్పారు. రాష్ట్రాన్నివిడగొట్టడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కిరణ్ కుమ్మక్కయ్యారని జగన్ విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు. సోనియా గాంధీ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. -
రేపటి నుంచి సమైక్యశంఖారావం
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపటి నుంచి సమైక్యశంఖారావం యాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర నగరి నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన యాత్ర జగన్‌కు మెడ నొప్పి కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిదే. -
17 నుంచి జగన్ నాలుగో విడత సమైక్యశంఖారావం
-
చర్చ జరిగితే అంగీకరించినట్లే: జగన్
చిత్తూరు: శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరిగితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్ర సోమల గ్రామం చేరుకున్న తరువాత అక్కడ జరిగిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. శాసనసభలో సమైక్యతీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పునీరే ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. 30 లోక్‌సభ సీట్లు గెలుచుకుందామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అన్నారు. మన నీటికోసం మనమే తన్నుకోవాలా? అని ప్రశ్నించారు. విభజన జరిగితే సాగుకు నీళ్లుండవు, యువతకు ఉద్యోగాలుండవని హెచ్చరించారు. -
చిన్నపరెడ్డి కుటుంబానికి జగన్ ఓదార్పు
-
చిన్నపరెడ్డి కుటుంబానికి జగన్ ఓదార్పు
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన చిన్నపరెడ్డి కుటుంబాన్ని బుధవారం జగన్ ఓదార్చారు. వైఎస్సార్ అంటే చిన్నపరెడ్డికి ఎంతో అభిమానం ఉండేదని ఆయన హయాంలో వృద్ధాప్య పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, భర్త చనిపోయిన కూతరుకి వితంతు పెన్షన్ పొందామని చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు ఈసందర్భంగా జగన్‌కు తెలిపారు. జగన్ వారికి అన్నివిధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. చింతలపల్లెవారి క్రాస్, బురుజుపల్లె, తెట్టుపల్లె, ఈరల్లపల్లె క్రాస్, చిన్నసోమల క్రాస్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. సోమలలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అడుసుపల్లె, సరస్వతీపురం, నింజంపేట, మల్లేశ్వరపురం, రాంపల్లె, కలమండవారిపల్లె మీదగా పట్రపల్లె చేరుకుని అక్కడ పాదం మునస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. కమ్మపల్లె, శీలంవారిపల్లె, తంగేనిపల్లె, సవరంవారిపల్లె, గాంధీనగరం, గురికానివారిపల్లె మీదగా సదుం మండలం చేరకుంటారు. సదుం మండలంలో ఎస్.మతుకువారిపల్లె, నడిగడ్డ, హైస్కూల్ గడ్డలో రోడ్ షో నిర్వహించి యర్రాతివారిపల్లెలో రాత్రి బస చేస్తారు. -
సీమ గడ్డ మీద పుట్టిన మీకు సిగ్గుందా? : కిరణ్, బాబులను ప్రశ్నించిన జగన్
చిత్తూరు: సీమ గడ్డ మీద పుట్టిన మీకు సిగ్గుందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి ప్రశ్నించారు. మూడో విడత సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఈ యాత్ర బి.కొత్తకోట చేరుకున్న తరువాత అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సిఎం కిరణ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీత దాటడం లేదన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించవలసిన చంద్రబాబు వారితో కుమ్మక్కై కూర్చున్నారని విమర్శించారు. చంద్రబాబూ మీ నోటి నుంచి సమైక్యమనే మాట ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. కిరణ్ మీరెందుకు సమైక్య తీర్మానం చేయడం లేదు? అని అడిగారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని దేశం మొత్తం గుర్తించినా చంద్రబాబు, కిరణ్‌లకు కనిపించడం లేదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా రాష్ట్రాన్ని విభజన చేస్తోందన్నారు. సోనియా గుండెలదిరేలా సమైక్య నినాదం వినిపించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే నదీ జలాల సమస్యలు ఎక్కువుగా ఉన్నాయని, ఇక విడిపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటీ? అని జగన్ ప్రశ్నించారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు సీమతో పాటు అన్ని ప్రాంతాల రైతుల సమస్యలు తీరుస్తానని, మరో నాలుగు నెలలు ఓపిక పట్టండని జగన్ చెప్పారు. హంద్రినీవా, గాలేరునగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లకు నీరందిస్తామన్నారు. -
5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు
హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగించనున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అక్టోబర్ 26న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జగన్ సమైక్య శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి సమైక్యశంఖారావం ప్రారంభమవుతుందని వైఎస్ఆర్ సీపీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. -
సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'
-
సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'
చిత్తూరు: ఢిల్లీలో ఉన్న యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు వినిపించేలా నినాదాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సభికులకు పిలుపు ఇచ్చారు. జగన్ పిలుపుతో చిత్తూరు జిల్లా రాయల్పేట్లో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగువ ప్రాజెక్టులు నిండితే తప్ప దిగువకు నీరు రాని పరిస్థితి అని తెలిపారు. జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. జనం బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా జగన్ ఈరోజు రాయల్పేట్ గ్రామం చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామంలో ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఎగువ ప్రాజెక్టులు నిండిన తరువాతే దిగువకు నీరు వస్తుందని తెలిపారు. విభజన జరిగితే రాష్ట్రం ఏడారవుతుందని హెచ్చరించారు. రైతుల గురించి ఆలోచించే పరిస్థితిలేదని బాధపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 50 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుందాని తెలిపారు. చంద్రబాబు నోట సమైక్య మాట రాదన్నారు. ప్రజాగర్జనలో చంద్రబాబు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో తెలుగువాడి సత్తా చాటుదామని జగన్ అన్నారు. 30 లోక్‌సభ స్థానాలను గెలుచుకుందామని చెప్పారు. అంతకు ముందు పెందపంజాని మండలం నేలపల్లె గ్రామంలో జగన్ చెరకు రైతులను కలిశారు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే చెరకు రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని వారికి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర ప్రకటించిన తరువాతే క్రషింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు. -
'తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండి'
-
తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండి: జగన్
బైరెడ్డిపల్లి: రాయలసీమను కూడా అడ్డంగా నరకడం దేనికి? అన్ని జిల్లాలను తెలంగాణలో కలిపి తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సలహా ఇచ్చారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. రాయలసీమను విడగొట్టడం దేనికి? తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే ఎవరద్దంటారు? అని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు మాత్రం రాష్టం విడిపోవాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు వీరికి తెలుసా? అని ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వీరు ఎందుకు నివారించలేకపోయారని అడిగారు. రాయలసీమలో అట్టడుగున ఉన్న చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అందరూ సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నట్లు తెలిపారు. అందువల్లనే చిట్టచివరి నియోజకవర్గం కుప్పం నుంచి సమైక్య శంఖారావం పూరించినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ సమైక్యమే కావాలని కోరుకుంటున్నారని తెలియజెప్పేందుకే ఈ శంఖారావం యాత్ర అని తెలిపారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్దం జరుగుతుందని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ నుంచి దుర్మార్గులను పంపిద్దామన్నారు. వచ్చే ఎన్నికలలో 30 లోక్‌సభ స్థానాలను గెలుచుకుందాం, రాష్ట్రం విడిపోకుండా చూసుకుందాం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అని చెప్పారు. జై సమైక్యాంధ్ర , జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చూస్తూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అంతకు ముందు సమైక్య శంఖారావం యాత్ర బైరెడ్డిపల్లికి రాగానే అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. -
పూల వానగా మారిన అభిమానం!
-
కాలర్లు పట్టుకొని అడిగితే కిరణ్, చంద్రబాబు ఏం చెబుతారు?: జగన్
-
కాలర్లు పట్టుకొని అడిగితే కిరణ్, చంద్రబాబు ఏం చెబుతారు?: జగన్
వి.కోట: చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుల కాలర్లు పట్టుకుంటే ఏం సమాదానం చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపొమ్మని శాసిస్తున్నారు. విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అధిక ఆదాయం వచ్చే, ఉపాధి అవకాశాలు ఉన్న హైదరాబాద్ విడిపోయిన తరువాత చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్యాకేజీలు కోరుతున్న చంద్రబాబు, సీఎం కిరణ్‌లను కాలర్ పట్టుకొని అడిగితే ఏం చెబుతారని అడిగారు. హైదరాబాద్ నగరం మనందరిదని, దాని కోసం మనం అందరం కొట్టుకు చావాలా? అని అడిగారు. దారుణాలకు పాల్పడుతున్న పాలకులను, వారి ఓట్ల రాజకీయాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ప్రజల జీవితాలతో చదరంగం ఆడుతున్నాయని అన్నారు. సోనియా గాంధీ తన కొడుకుని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విడగొడుతోందని చెప్పారు. ఆమెకు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపో్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువాడు కన్నెర్ర చేస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతాడని తెలియజెప్పాలని పిలువు ఇచ్చారు. 30 ఎంపి స్థానాలు గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అన్నారు. సభలో జగన్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు వైఎస్ఆర్ సిపిలో చేరారు. అంతకు ముందు వి.కోటకు చేరుకున్న జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీగా తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో వి.కోట దద్దరిల్లింది. -
తెలుగు రాని వారు తెలుగు వారిని చీల్చుతున్నారు: జగన్
-
వైయస్ జగన్ రెండో రోజు సమైక్య శంఖారావం యాత్ర
-
కుప్పంలో జగన్ సమైక్య శంఖారావంపై విశ్లేషణ
-
కుప్పంలో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం
నిజాయితీతో కూడిన రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది. జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం!
-
నిజాయతీ రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం: జగన్
కుప్పం: నిజాయితీతో కూడిన రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్‌కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది. చిత్తూరు జిల్లా ప్రత్యేకతలు తెలియజేస్తూ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాయలు ఏలిన రతనాల సీమ - వెంకటేశ్వరుడు కొలువైన, కాణిపాకం వినాయకుడు ఉన్న నేల చిత్తూరు జిల్లా అని అన్నారు. చందమామలో మచ్చలు ఉన్నట్లుగా మన చిత్తూరు జిల్లాకు రెండు మచ్చలు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అది మన ఖర్మ అని కూడా అన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతోపాటు అందరూ సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే వీరిద్దరూ విడిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. నిజాయితో కూడిన రాజకీయాలకు వారు దూరంగా ఉన్నారన్నారు. సమైక్య శంఖారావం పిలుపుతో నాయకులలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఎవరు విడగొడతారో చూద్దాం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అని పిలుపు ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి, 30 పైచిలుకు పార్లమెంటు స్థానాలు గెలుచుకుని ఢిల్లీ కోటలు బద్దలు కొడదాం అన్నారు. కాంగ్రెస్ పెద్దలకు, ప్యాకేజీ అడుగున్న చంద్రబాబుకు రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాలు తెలుసా? అని అడిగారు. నీటి విషయాలు చూడండి. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాకటలోని అల్మట్టీ డ్యామ్ నిండితే గానీ మన రాష్ట్రానికి నీరు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో మరో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చిరించారు. మిగులు జలాలపై మనకు ఉన్న హక్కును తీసివేసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇలా ఉంటే, విడిపోతే పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించాలన్నారు. చిన్న చిన్న ఉద్యోగులు తమ సంపాదనతో హైదరాబాద్‌లో ఇల్లులు కొనుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఆస్తుల విలువ పడిపోతే సోనియా గాంధీ ఇస్తారా? కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తారా? ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఇస్తారా? అని ప్రశ్నించారు. కుమ్మక్కు రాజకీయాలు చేసేది చంద్రబాబు, వేలెత్తి చూపేది జగన్‌వైపు అన్నారు. ఢిల్లీ అధికారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది అన్నారు. విదేశీయుల భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదిస్తే, మీ పరిస్థితి ఏమిటని సోనియా గాంధీని ప్రశ్నించారు. కలసి ఉంటున్న తెలుగువారిని విడదీయాలని మీకు ఎలా అనిపించిందని సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా తయారయ్యారని విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వలేదని ప్రశ్నించారు. బూర్గుల రామకృష్ణారావు వంటి వారు విశాలాంధ్ర కోసం పోరాడారని, పదవులు వదులుకున్నారని గుర్తు చేశారు. చరిత్ర తెలియనివారు బలంగా ఉన్న తెలుగుజాతిని విడగొట్టాలనుకుంటున్నారని బాధపడ్డారు. తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయడానికి రాష్ట్రాన్ని విడగొడుతున్నారని మండిపడ్డారు. తన కొడుకుని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి వారితో సమ్మె విరమింపజేశారన్నారు. అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడంలేదు? సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం ఎందుకు ప్రవేశపట్టడంలేదు? అని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో కేంపస్ ఇంటర్వ్యూలు జరిగేవని, ఏటా 57వేల ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. ప్రతి రాష్ట్రానికి వెళ్లి సమైక్యాంధ్రకు అక్కడి నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్ఫుడు ఈ రాష్ట్రం విడిపోతే, రేపు మీ రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారికి తెలియచెబుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో హైదరాబాద్ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. కోయంబత్తూరు కూడా హైదరాబాద్ కంటే ముందు ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులకు పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఈ పరిస్థితులలో ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర, జై వైఎస్ఆర్, జై తెలుగుతల్లి అని నినాదాలు చేస్తూ జగన తన ప్రసంగాన్ని ముగించారు. అంతకు ముందు ఆయన కుప్పం మండలం తంబుగానిపల్లెలో వైఎస్ఆర్ ఆలయాన్ని ప్రారంభించారు. -
జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ పోటెత్తింది. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో రామకుప్పం మాజీ ఎంపీపీ, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడితో సహా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు కంచుకోటగా భావించే కుప్పంలో జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
కుప్పంలో్ జగన్‌కు ఘనస్వాగతం
-
కుప్పం బహిరంగ సభలో వైఎస్సాఆర్ సీపీ నేతల ప్రసంగం
-
'కిరణ్, చంద్రబాబు మన జిల్లా వాసులైనందుకు సిగ్గుతో తలదించుకోవల్సివస్తుంది'
-
జగన్ రాక సందర్భంగా కుప్పంలో పోటెత్తిన జనం
కుప్పం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో జనం పోటెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ జగన్ సమైక్య శంఖారావం పూరించనున్నారు. సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభ కోసం జనం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులతో కుప్పం రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్లు నిండిపోవడంతో జనం జగన్ కోసం మేడలపైన, మిద్దెలపైన ఎక్కి ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా జనమే జనం. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అంతకు ముందు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం వెళ్లి అక్కడ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెండిగంపల్లెలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. -
వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేక అసువులు భాసిన వెంకటేష్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చిన జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు తమిళనాడు సరిహద్దు క్రిష్ణగిరిలో యువనేతకు ప్రజల ఘన స్వాగతం పలికారు. మరోవైపు కుప్పంలో జనం పోటెత్తారు. కార్యకర్తలు, సమైక్యవాదులతో రోడ్లు కిక్కిరిసాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జగన్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. కాగా జగన్ ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు. -
జగన్ కోసం కుప్పం వాసుల ఎదురుచూపు