తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండి: జగన్ | Change the name as Telangana State: : YS Jagan | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండి: జగన్

Published Mon, Dec 2 2013 5:53 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండి: జగన్ - Sakshi

తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండి: జగన్

బైరెడ్డిపల్లి: రాయలసీమను కూడా అడ్డంగా నరకడం దేనికి? అన్ని జిల్లాలను తెలంగాణలో కలిపి తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సలహా ఇచ్చారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. రాయలసీమను విడగొట్టడం దేనికి? తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే ఎవరద్దంటారు? అని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు  మాత్రం  రాష్టం విడిపోవాలని  కోరుకుంటున్నారన్నారు.  రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు వీరికి తెలుసా? అని  ప్రశ్నించారు.  నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వీరు ఎందుకు నివారించలేకపోయారని అడిగారు.

రాయలసీమలో అట్టడుగున ఉన్న  చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అందరూ సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నట్లు తెలిపారు. అందువల్లనే చిట్టచివరి నియోజకవర్గం కుప్పం నుంచి  సమైక్య శంఖారావం పూరించినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ సమైక్యమే కావాలని కోరుకుంటున్నారని తెలియజెప్పేందుకే ఈ శంఖారావం యాత్ర అని తెలిపారు.

ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్దం జరుగుతుందని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ నుంచి దుర్మార్గులను పంపిద్దామన్నారు. వచ్చే ఎన్నికలలో 30 లోక్సభ స్థానాలను గెలుచుకుందాం, రాష్ట్రం విడిపోకుండా చూసుకుందాం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అని చెప్పారు.

జై సమైక్యాంధ్ర , జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చూస్తూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అంతకు ముందు సమైక్య శంఖారావం యాత్ర  బైరెడ్డిపల్లికి రాగానే అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు జగన్కు ఘనస్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement