
5 నుంచి జగన్ సమైక్య శంఖారావం కొనసాగింపు
హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగించనున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అక్టోబర్ 26న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జగన్ సమైక్య శంఖారావం పూరించిన విషయం తెలిసిందే.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి సమైక్యశంఖారావం ప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు.