ఢిల్లీలో ఉన్న యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు వినిపించేలా నినాదాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సభికులకు పిలుపు ఇచ్చారు. జగన్ పిలుపుతో చిత్తూరు జిల్లా రాయల్పేట్లో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగువ ప్రాజెక్టులు నిండితే తప్ప దిగువకు నీరు రాని పరిస్థితి అని తెలిపారు. జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. జనం బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా జగన్ ఈరోజు రాయల్పేట్ గ్రామం చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామంలో ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి.