samaikyandhra slogans
-
పోడియం వద్దకు దూసుకెళ్లిన వైఎస్ జగన్
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మరోసారి సమైక్యవాణి వినిపించారు. రాష్ట్ర విభజన ఆపండంటూ ఫ్లకార్డుతో ఆయన పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. స్పీకర్ పోడియం వద్ద పార్టీ ఎంపీలతో కలిసి జగన్ నిరసన తెలిపారు. మరోవైపు తొలిసారిగా సీమాంధ్ర మంత్రులు వెల్‌లోకి రాగా, సీమాంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు వెల్‌లోకి దూసుకు వచ్చి పోటా పోటీగా నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. ఇక సీమాంధ్ర సభ్యులు బిల్లు ప్రతులను చింపి ఎగురవేశారు. కాగా సమైక్యాంధ్ర ఆందోళనల మధ్యే కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభ్యుల ఆందోళనలతో ఖర్గే తన ప్రసంగాన్ని కేవలం పది నిమిషాల్లోనే ముగించారు. మరోవైపు ఖర్గే బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెల్ వద్ద నిరసన తెలియ చేయటం విశేషం. -
సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'
-
సోనియాకు వినపడేలా 'జై సమైక్యాంధ్ర'
చిత్తూరు: ఢిల్లీలో ఉన్న యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు వినిపించేలా నినాదాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సభికులకు పిలుపు ఇచ్చారు. జగన్ పిలుపుతో చిత్తూరు జిల్లా రాయల్పేట్లో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగువ ప్రాజెక్టులు నిండితే తప్ప దిగువకు నీరు రాని పరిస్థితి అని తెలిపారు. జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి, జై వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. జనం బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో విడత సమైక్య శంఖారావంలో భాగంగా జగన్ ఈరోజు రాయల్పేట్ గ్రామం చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామంలో ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ఎగువ ప్రాజెక్టులు నిండిన తరువాతే దిగువకు నీరు వస్తుందని తెలిపారు. విభజన జరిగితే రాష్ట్రం ఏడారవుతుందని హెచ్చరించారు. రైతుల గురించి ఆలోచించే పరిస్థితిలేదని బాధపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 50 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుందాని తెలిపారు. చంద్రబాబు నోట సమైక్య మాట రాదన్నారు. ప్రజాగర్జనలో చంద్రబాబు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో తెలుగువాడి సత్తా చాటుదామని జగన్ అన్నారు. 30 లోక్‌సభ స్థానాలను గెలుచుకుందామని చెప్పారు. అంతకు ముందు పెందపంజాని మండలం నేలపల్లె గ్రామంలో జగన్ చెరకు రైతులను కలిశారు. వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే చెరకు రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని వారికి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర ప్రకటించిన తరువాతే క్రషింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు. -
సెల్ వద్ద నిలబడి నిరసన తెలిపిన YS జగన్
-
లోక్‌సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు
-
లోక్‌సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా మరోసారి గళమెత్తారు. దాంతో సేవ్ ఆంధ్రప్రదేశ్... జై సమైక్యాంధ్ర నినాదాల మధ్య... లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి మంగళవారం సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ పోడియం ముందు నిరసన నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్‌తో పాటు ఎంపీలు నినదించారు. ఈ గందరగోళం మధ్యే మంత్రులు, వివిధ కమిటీల సభ్యులు నివేదికలను సభకు సమర్పించారు. దాదాపు 15 నిమిషాల సేపు నివేదికల సమర్పణ కార్యక్రమం కొనసాగింది. అవిశ్వాస తీర్మానాలపై 50 మంది సభ్యుల్ని లెక్కించేందుకు సహకరించాలని ఆందోళన చేస్తున్న సభ్యులను స్పీకర్ కోరారు. అయితే వారెవరూ పట్టించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు తమ అభిప్రాయాన్ని సభకు తెలిపారు. అంతకు ముందు ప్రధాని మన్మోహన్ సింగ్... సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా పాల్గొన్నారు. -
సమైక్యాంద్ర గళంతోనే కొనసాగుతున్న లోక్‌సభ
-
వైఎస్సార్ సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధం సక్సెస్
-
మలిరోజూ రోడ్లన్నీ బంద్..
* వైఎస్సార్ సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధం సక్సెస్ * వైఎస్సార్ సీపీ చేపట్టిన రహదారుల దిగ్బంధం సక్సెస్ఎక్కడి వాహనాలు అక్కడే.. స్తంభించిన రోడ్డు రవాణా * రోడ్లపైనే సమైక్య ఆందోళనలు * పోలీసు లాఠీలకు వెరవని పార్టీ శ్రేణులు * వేలాదిమంది నేతలు, కార్యకర్తల అరెస్టులు సాక్షి నెట్వర్క్: వరుసగా రెండోరోజూ రహదారులపై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో సీమాంధ్ర జిల్లాల్లోని రోడ్లన్నీ హోరెత్తాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎక్కడివాహనాలు అక్కడే ఆగిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా పూర్తిగా పడకేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48గంటల రహదారుల దిగ్బంధం వరుసగా రెండోరోజూ గురువారం విజయవంతమైంది. విభజన విధివిధానాలపై ఏర్పాటైన కేంద్రమంత్రుల బృందం గురువారం సమావేశమైన నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు పార్టీ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు పూర్తిగా సంఘీభావం ప్రకటిం చారు. పార్టీ శ్రేణులతో కలిసి నిరసనలు చేపట్టారు. రోడ్లపైనే మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, వంటావార్పులు నిర్వహించారు. సమైక్యస్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీలుగా రోడ్లపైకి చేరుకుని వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. రెండోరోజూ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గురువారం ఒక్కరోజే 13 జిల్లాల్లో 2732 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. ఎయిర్‌పోర్టు ముట్టడి విశాఖలోని ఎయిర్‌పోర్టును ముట్టడించారు. అరకులో బుధవారంనాటి ముట్టడిలో అదుపులోకి తీసుకున్న నేతల్ని రాత్రి వరకూ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ నేతలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లామీదుగా వెళ్లే 16,216 జాతీయరహదారులతో పాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులను పార్టీశ్రేణులు ఎక్కడికక్కడ దిగ్బంధించాయి. దిండి-చించినాడ వంతెనపై మాజీమంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-216ని దిగ్బంధించడంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోక లు స్తంభించాయి. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ట్రాక్టర్లను అడ్డుగాపెట్టి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. నరసాపురంలో రోడ్డుపైనే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెల్లవారుజాము నుంచి రోడ్డెక్కిన పార్టీ కార్యకర్తలు రహదారులు దిగ్బంధించారు. కొమరాడ వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 10కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెన్నై నుంచి కోల్కత్తా వైపు వెళ్లే లారీలు జిల్లా సరిహద్దులోనే నిలిచిపోయాయి. వంటావార్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు కృష్ణాజిల్లా గట్టు భీమవరం టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. తిరువూరులో విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి వంటావార్పు నిర్వహించారు. జాతీయరహదారిపై కబడ్డీ ఆడారు. కైకలూరులో జాతీయ రహదారి నెంబరు 165పై పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్ మాస్క్‌లు ధరించి రోడ్ల దిగ్భంధనంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా రోడ్లపైనే టెంట్లు వేసి వంటావార్పు చేశారు. తాడేపల్లి జాతీయ రహదారిపై కోలాటం ఆడుతూ కార్యకర్తలు రహదారులను దిగ్బం ధించారు.ఒంగోలులోని మంగమూరు జంక్షన్లో వంటావార్పు చేపట్టారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. అరెస్టులకూ వెరవక... పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో తపోవనం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. రాయదుర్గం నియోజకవర్గం డీ హీరేహాళ్ వద్ద రహదారి దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కళ్యాణదుర్గంలో ఆందోళన చేస్తున్న సమన్వయకర్తలు ఎల్ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామితో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. నగరిలో పార్టీ సమన్వయకర్త ఆర్కే.రోజా అధ్వర్యం లో పుత్తూరు-నారాయణవనం రోడ్డును దిగ్బంధించారు. పుంగనూరులో పార్టీ నాయకులు బెంగళూరు, ఎంబీటీ, తిరుపతి, చింతామణి రోడ్లను దిగ్బంధించారు. వైఎస్సార్ జిల్లా కడపలో జమ్మలమడుగులో తెల్లవారుజామున 4.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆర్టీసీ బస్సులు డిపోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల, రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దిగ్బంధనం కొనసాగింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 7, 18 జాతీయ రహదారులతో పాటు గ్రామాలవైపు వెళ్లే దారులపైనా బైఠాయించి నిరసనలు చేపట్టారు. దీంతో 130 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా... 200కుపైగా బస్సులు ఆలస్యంగా నడిచాయి. -
సమైక్య ఉద్యమానికి జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతు
సాక్షి, నెల్లూరు: రోజులు గడిచేకొద్ది సమైక్య ఉద్యమం మరింత బలపడుతోంది. జిల్లాలో ఉద్యమం 48వ రోజైన సోమవారం ఉధృతంగా సాగింది. నగరంలో నృత్యకళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘కలిసుంటే కలదు సుఖం.. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరి జీవితాల్లో వెలుగులుంటాయని’ నినదించారు. ముత్తుకూరుకు సమీపంలోని బ్రహ్మదేవిలో బ్రహ్మగర్జన పేరుతో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ నేతృత్వంలో జలదీక్ష పేరుతో వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అధికారులు, ఉపాధ్యాయుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించింది. నెల్లూరు గాంధీబొమ్మ కూడలిలో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్జీఓలు ఎన్జీఓ హోం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నృత్య కళాకారులు నర్తకి సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకా క్షీరాభిషేకం, రాస్తారోకో నిర్వహిం చారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బ్రహ్మగర్జన జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు-ముత్తుకూరు రహదారిని దిగ్బంధించారు. భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పొదలకూరులో భారీ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా టీపీగూడూరు మండలంలోని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు మూడోరోజు మహాలక్ష్మీపురం నుంచి పాదయాత్ర చేపట్టారు. నాలుగు పంచాయతీల్లో ఈ పాదయాత్ర జరిగింది. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షకు ఎంపీడీఓ, తహశీల్దార్, వ్యవసాయాధికారి సంఘీభావం తెలిపారు. డక్కిలిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి సైదాపురం బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్జీఓహోంలో దళితనాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీతాల కంటే జీవితాలే ముఖ్యమని ప్రతి ఒక్కరూ సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ అన్నారు. స్థానిక టవర్‌క్లాక్ కూడలిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జలదీక్ష నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నీటితో నింపిన డ్రమ్ముల్లో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిని విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పంబలేరులో జల దీక్ష నిర్వహించారు. అలాగే ఎల్ఏపీ, నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులు టవర్‌క్లాక్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 19వ రోజు రిలే దీక్షలు సోమవారం కొనసాగాయి. ఈ దీక్షలకు మం డలంలోని వెంగళరావునగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. పదో రోజు కృష్ణంపల్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు దీక్షలు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్లో 29వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 35వ రోజుకు చేరింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 21న లక్షమందితో చేపట్టనున్న ఆత్మఘోష కార్యక్రమంపై ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నేతలు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలను ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైర్ బస్సులతో ర్యాలీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు -
సమైక్య గళం.. గొంతెత్తిన దళం
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర నినాదం జిల్లాలో దశదిశలా మార్మోగుతోంది. సమైక్యాంధ్ర పరి రక్షణ ఆవశ్యకతను వివిధ కళారీతులతో కళాకారులు చాటుతున్నారు. విభజన వల్ల తలెత్తే కష్టాలు, నష్టాలను నాటికలు, నాట కాల రూపంలో కళ్లముందు సాక్షాత్కరింప చేస్తున్నారు. 38వ రోజైన శుక్రవారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో వివిధ వేషధారణలతో కొత్తపేట నూకాలమ్మ గుడి నుంచి భారీ ప్రదర్శన ప్రారంభించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో సుమారు గంటసేపు కళా రీతులను ప్రదర్శించి కళాగర్జన చేశారు. రెల్లి కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని విభజన ప్రకటనపై నిరసన తెలిపారు. డీపీవో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది రోడ్డుపై వంటావార్పు చేసి నిరసన గళమెత్తారు. స్వర్ణకారులు, కుమ్మరి, వడ్రంగి వృత్తిదారులు రోడ్లపైనే పనులు చేసి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో లక్ష జనగళ ఘోష.. తాళ్లపూడిలో లక్ష గళార్చన జంగారెడ్డిగూడెంలో సమైక్యాంధ్ర కోరుతూ లక్ష జనగళ ఘోష కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమైక్య నినాదాన్ని మారుమోగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉద్యమకారులను ఉత్సాహపరిచారు. తాళ్లపూడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేసి లక్ష గళార్చన నిర్వహించారు. వేగేశ్వరపురంలో 300 ఆటోలతో ర్యాలీ చేశారు. పాలకొల్లులో యరసింగి శిరీష అనే గృహిణి అమరణ దీక్ష చేపట్టారు. ఆడియో, వీడియో వర్కర్స్ ఆధ్వర్యంలో దీక్షలు జరిగారుు. బీఆర్‌ఎంవీ స్కూల్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. పోడూరు మండలం మినిమించిలిపాడులో వంటావార్పు చేపట్టారు. యలమంచిలి మండలం చించినాడ, దొడ్డిపట్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వద్ద సైనిక దుస్తుల్లో విద్యార్థులు కవాతు నిర్వహించారు. త్యాగధనుల వేషధారణలతో దేశభక్తి గీతాలకు అనుగుణంగా నర్తించారు. గోపన్నపాలెంలోని పార్థసారథి పాఠశాల విద్యార్థులు భిక్షాటన చేసి విభజన ప్రకటనపై నిరసన తెలిపారు. భీమవరం అర్కెస్ట్రా కళాకారులు, అధ్యాపకులు, న్యాయవాదులు, మునిసిపల్ ఉద్యోగులు, ఎన్జీవోలు రిలే నిరాహార దీక్షలు చేశారు. విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రకాశం చౌక్‌లో మానవహారం నిర్మించారు. నరసాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షల్లో వైద్యులు పాల్గొన్నారు. పీఎంపీలు, మెడికల్ షాపుల యజమానులు వంటావార్పూ చేశారు. ఆచంటలో రైతు సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. పెనుమంట్రలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు ప్రారంభించారు. పెనుగొండలో స్వర్ణకారులు దీక్షల్లో పాల్గొన్నారు. తణుకులో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్‌లపై విమర్శనాత్మక పాఠాలు చెప్పారు. అత్తిలిలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన నిరాహార దీక్షలను వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య సందర్శించారు. కొవ్వూరు జూని యర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షలకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు సంఘీభావం తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో విద్యార్థులు రోడ్డుపైనే పరీక్షలు రాసి నిరసన తెలిపారు. వాడపల్లిలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చింతల పూడి పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బంద్ పాటించి రోడ్డుపై వంటావార్పు చేశారు. బుట్టాయగూడెంలోఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు ఉండి సెంటర్లో రోడ్లను ఊడ్చి విభజన ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్ అందరిది అంటూ నినాదాలు
-
పిడికిలి బిగించిన పల్లెలు
న్యూస్‌లైన్ నెట్వర్క్, విశాఖ జిల్లా : సీమాంధ్ర ప్రాంత ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్న సమైక్య నినాదం కడలి కెరటంలా వాడవాడలా ఘోషించింది. పల్లెలు, పట్టణాలన్న తేడాలేకుండా జిల్లా నలుదిశలా మార్మోగింది. చిరుపల్లె నుంచి మహానగరం వరకు ఎటు చూసినా ఉద్యమ దీక్ష ప్రతిఫలించింది. విభజనను సమ్మతించేది లేదని ప్రతి గ్రామం గర్జించింది. ఊరూరా ఎగసిన ఆందోళన జ్వాలలతో వాతావరణం వేడెక్కింది. సకల జనుల సమ్మె ఉధృ తం కాగా, ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించి న బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఉప్పొంగిన ఉద్యమం అనకాపల్లి: గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లిలో బంద్ సంపూర్ణంగా జరిగిం ది. ఇంతవరకు స్వచ్చంద సంస్థలు, రాజకీయ పక్షాలు మాత్రమే పాల్గొన్న ఈ ఉద్యమంలోకి అన్ని యూనియన్లు, పాఠశాలలు, బెల్లం వర్తకులు, గ్రామాలు భాగస్వామ్యులు కావడంతో ఉద్యమం వేడెక్కింది. బవులవాడ పంచాయతీలో సమైక్యవాది ఆత్మహత్యకు పాల్పడ్డగా, అనకాపల్లి-గాజువాక రహదారిలో ఉన్న సిరసపల్లిలో కొద్దిపాటి గొడవ జరిగింది. తాజాగా ఎన్‌జివోల సమ్మె తోడవ్వడంతో మంగళవారం ఎన్నడూలేని రీతిలో బంద్ వాతావరణం తీవ్ర స్థాయిలో కనిపించింది. సమైక్య ఉద్యమకారులు ప్రైవేటు బ్యాంకులను, ఇతర వాణిజ్యసంస్థలను కూడా మూసి వేయించడంతో పట్టణం ఒక్కసారిగా వెలవెలబోయింది. దీనికి పెట్రోల్ బంకుల బంద్ తోడవడంతో ఉద్యమం హోరెత్తింది. అపూర్వ స్పందన : మన్యానికి, మైదానానికి వారధిగా ఉన్న నర్సీపట్నంలో బంద్ ఉధృతంగా సాగింది. ప్రజలే ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడిపించడంతో బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. నర్సీపట్నం డివిజన్లో 4500 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో కార్యాలయాలలో స్తబ్దత నెలకొంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలే తమంత తాముగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో అన్ని ప్రాంతాల్లో వాతావరణం ఉత్కంఠభరితంగా కనిపించింది. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ముత్యాలపాప నిరాహారదీక్షా శిబిరం వద్దకు వచ్చి ఆందోళనకారులకు సంఘీభావం తెలుపగా, అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు, కాంగ్రెస్ మద్దతుదారులకు మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. రాస్తారోకోలు.. నిరసనలు చోడవరం: సకల జనుల సమ్మె మంగళవారం చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఆందోళనకారులు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ రాష్ట్ర సమైక్యంగా ఉండాలంటూ బంద్ పాటించారు. అన్ని ప్రాంతాల నుంచి రాకపోకలను నిలిపివేయడంతో పాటు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చోడవరంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజును విద్యార్థులు, సమైక్యాంధ్ర జెఎసీ ప్రతినిధులు రాజీనామా చేయాలంటూ నిలదీశారు. నర్సయ్యపేటలో రైతులు ఎడ్లబళ్లతో రాస్తారోకో చేశారు. మాడుగుల నియోజకవర్గంలో రోడ్లపైనే వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. గోవాడలో సుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన దీక్షలు రెండో రోజు కూడా నిర్వహించారు. దీక్షాధారులు ఆస్పత్రికి తరలింపు యలమంచిలి: సమైక్యాంద్రకు మద్దతుగా యలమంచిలి నియోజకవర్గంలో బంద్, నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. గత 6రోజులుగా యలమంచిలి పట్టణంలో ఆమరణనిరాహారదీక్ష చేస్తున్న కొఠారు సాంబ శివరావు, నక్కా వెంకటరమణల ఆరోగ్యం క్షీణించడంతో ఉద్రిక్తత మధ్య వారిని పోలీసు లు ఆస్పత్రికి తరలించారు. గొల్లవిల్లి అప్పారావు అనే నిరసనకారుడు శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడబోగా పోలీసు లు అడ్డుకున్నారు. అచ్యుతాపురం జంక్షన్లో గుర్రాలతో కేసిఆర్ దిష్టిబొమ్మను తొక్కించారు. మన్యంలో సంపూర్ణం అరకులోయ: విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరవధిక సమ్మె కారణంగా ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సందర్భంగా నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. మండ ల కేంద్రంలో వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతబడ్డాయి. ఎన్జీవో సంఘాల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు రోడ్లపై ఆటలాడారు. సాయంత్రం అరకులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఒక్క పర్యాటకుడు కూడా అరకులోయకు రాలేదు. మ్యూజియం, పద్మావతి గార్డెన్లు మూతబడ్డాయి. అరకు ప్రధాన రహదారిలో వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో జనం ఇబ్బంది పడ్డారు. పాడేరులో పాలన స్తంభన పాడేరు : పాడేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు స్తంభించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. డివిజన్ కేంద్రమైన పాడేరులో ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాలతోపాటు పలు ప్రభుత్వ శాఖల కార్యాలయా లు నిశ్శబ్ధంగా కనిపించాయి. అధికారులు, పలు విభాగాల ఉద్యోగులు విధులకు గైర్హాజరై సమ్మెబాట పట్టారు. జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోను ఇదే పరిస్థితి. పాడేరు ఆర్టీసీ డిపోలోని కార్మిక సంఘాలన్ని సమ్మెబాట పట్టడంతో బస్ సర్వీసులు నిలిచిపోయి రవాణా స్తంబించింది.