'మనం'కు మంచి స్పందన | Nagarjuna's 'Manam' mints over Rs.4 crore in two days | Sakshi
Sakshi News home page

'మనం'కు మంచి స్పందన

Published Sun, May 25 2014 12:29 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

'మనం'కు మంచి స్పందన - Sakshi

'మనం'కు మంచి స్పందన

చెన్నై: అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమేణా పుంజుకుంటున్నాయి. శుక్రవారం విడుదలైన మనం చిత్రం తొలి రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 4.02 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. విదేశాల్లో ఈ సినిమాకు అనూహ్య స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అమెరికాలో 1.17 కోట్ల రూపాయిలు రాబట్టింది.

ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ఇదే. నాగేశ్వరరావు కుమారుడు, యువ సామ్రాట్ నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ ఈ సినిమాలో నటించారు. కాగా కేన్సర్తో బాధపడ్డ నాగేశ్వరరావు ఈ సినిమా విడుదలకు ముందే మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement