నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని కృష్ణా జిల్లా గుడివాడలో నెలకొల్పారు.
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని నెలకొల్పారు. నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ హీరో నాగార్జున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏఎన్ఆర్ ఎప్పుడూ మన మనస్సుల్లోనే ఉంటారని నాగార్జున అన్నారు.
బుధవారం గుడివాడలో ఏఎన్‌ఆర్ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పలు రంగాల్లో ప్రముఖులైన వారికి నాగార్జున అవార్డులను ప్రదానం చేశారు. క్రీడారంగంలో విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతికి, సామాజిక సేవారంగంలో వంశీ రామరాజుకు, విద్యారంగంలో ఎంఎన్ రాజుకు, న్యాయరంగంలో జస్టిస్ పర్వతరావుకు, సివిల్ సర్వీసుల రంగంలో సంపత్‌కుమార్‌కు అవార్డులు అందజేశారు. వీరితో పాటు సినిమా రంగంలో రాఘవేంద్రరావుకు, ఆరోగ్యరంగంలో గోపిచంద్‌కు, వరప్రసాద్‌రెడ్డికి కూడా అవార్డులు ఇచ్చారు.