Nageswara Rao
-
రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న YSRCP నేత
-
ఆదాయం అ'ధర'హో
డ్రాగన్ ప్రూట్ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన రైతు గుజ్జెల నాగేశ్వరరావు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టిన ఆయన రూ.2 లక్షల మేర ఆదాయం పొందుతున్నారు. అంతర పంటగా బంతి వేయడం వల్ల ఆదనంగా ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. దళారులు, వ్యాపారులపై ఆధారపడకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న మార్కెటింగ్ వనరులను సది్వనియోగం చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన గుజ్జెల నాగేశ్వరరావు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. విశాఖ షిప్‌యార్డులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అయితే అందరిలా కాకుండా ఆయన వినూత్నంగా ఆలోచించారు. ఈ ప్రాంత వాతావరణం అనుకూలంగా ఉన్నందున డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి సారించారు. గతేడాది ట్రెల్లీస్ పద్ధతిలో జైన్ రకానికి చెందిన రెండు వేల మొక్కలను ఎకరా విస్తీర్ణంలో నాటారు. ఒకొక్క మొక్క రూ.75.. ఒకొక్క మొక్కను గుంటూరులోని ఓ క్షేత్రంలో రూ. 75 చొప్పున కొనుగోలు చేశారు. ట్రెల్లీస్ విధానంలో కీలకమైన సిమెంట్ స్తంభాలు ఒకొక్కటి రూ.350 చొప్పున 500 కొనుగోలు చేశారు. మొత్తమ్మీద మొక్కలు, సిమెంటు స్తంభాలు, కూలి ఖర్చులు కలిపి ఎకరాకు 1.50 లక్షల వరకు పెట్టుబడి అయిందని రైతు తెలిపారు. » నాటిన తొమ్మిది నెలలకు కాపు మొదలైంది. ఈ ఏడాది పూర్తిగా దిగుబడి వచ్చింది. కిలో రూ.200 చొప్పున విక్రయించగా సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు పేర్కొన్నారు. » భూమిని సారవంతం చేసేందుకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువు వినియోగించారు. ఎకరాకు ఐదు ట్రాక్టర్లు గెత్తం వాడినట్టు రైతు తెలిపారు. దీనివల్ల దిగుబడి పెరగడంతో పాటు పండు నాణ్యతగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు నిలకడగా దిగుబడి వస్తుందని ఆయన వివరించారు. » ట్రెల్లీస్ విధానంలో సాగు చేపట్టడం వల్ల మొక్కకు గాలి తగిలి ఏపుగా పెరుగుతుంది. మొక్కకు మొక్కకు మధ్య పది అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు దూరం ఉండాలి. ఒక మొక్క నుంచి సుమారు 20 వరకు పండ్ల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. » పర్యాటక ప్రాంతం కావడం వల్ల మార్కెటింగ్ స్థానికంగా అందుబాటులో ఉంది. అరకు పైనరీ, గిరిజన మ్యూజియంతో పాటు స్థానిక మార్కెట్లో విక్రయించడం వల్ల దళారుల ప్రభావం లేదని రైతు తెలిపారు. దీనివల్ల ఆయన మంచి ఆదాయం పొందగలుగుతున్నారు. » అంతరపంటగా ముద్దబంతి సాగు చేపట్టారు. దీనిపై ఏటా అక్టోబర్, నవంబర్‌లో వచ్చే ఆదాయం తోట నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని రైతు తెలిపారు. ఉద్యానవనశాఖ ఎకరాకు రూ.13 వేలు పెట్టుబడి సాయంగా అందజేసిందని రైతు తెలిపారు. ఇంటిల్లపాది కష్టపడి పనిచేయడం వల్ల ఏటా నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల రెండో ఏడాది మంచి ఆదాయం వచ్చిందని రైతు నాగేశ్వరరావు వివరించారు.సాగును ప్రోత్సహిస్తాం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టే రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నాం. ఉద్యానవన శాఖ తరఫున ఎకరాకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం పొందవచ్చు. అయితే ఈ ఏడాది ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా సాగునీటి బోర్లు మంజూరైతే తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కేటాయిస్తాం. – కె.శిరీష,ఉద్యానవనశాఖ అధికారి, డుంబ్రిగుడ -
తమ్ముడి భూమినే కొట్టేసిన విశాఖ జనసేన నేత
-
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ) ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి (సెప్టెంబర్ 20, 1924 – సెప్టెంబర్ 20, 2024) సందర్భంగా “నటసమ్రాట్ అక్కినేనిగారి నటనాజీవితం-వివిధ కోణాలలో” అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ఆదివారం ఘనంగా జరిగింది.అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అక్కినేని గారితో ఉన్న ప్రత్యేక అనుభందాన్ని, ఆయన జీవనప్రస్థానాన్ని క్లుప్తంగా వివరించి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కినేనిగారితో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధంఉన్న ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రవి కొండబోలు అక్కినేనిగారి అభిరుచులు, కుటుంబ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యాన్ని పంచుకున్నారు. ప్రముఖ గాయని, ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరి అక్కినేనిగారి సమక్షంలో పాటలు పాడి వారి ఆశీస్సులు పొందగల్గడం తన అదృష్టం అన్నారు. ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రావు కల్వాల అక్కినేని గారి జ్ఞాపకశక్తి, ఆత్మీయపలకరింపులను గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేని నటనా జీవితం ఎంత ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్ట మైనది, ఆయన జీవితంనుండి నేర్చుకోవలసినది ఎంతోఉంది అన్నారు. అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో విశిష్టఅతిథులుగా పాల్గొన్న – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సినీ గీతరచయిత, తెలుగువేదకవి – “అక్కినేనితో ముచ్చట్లు”; డా. వి.ఎన్ ఆదిత్య, ప్రముఖ సినీదర్శకులు, రచయిత, నిర్మాత – “జానపద కథానాయకుడు అక్కినేని”; ఎస్. వి రామారావు, ‘సినీ విజ్ఞాన విశారద’, సినీ చరిత్రకారుడు – “అక్కినేని జైత్రయాత్ర”; బలభద్రపాత్రుని రమణి, ప్రముఖ సినీకథా రచయిత్రి, నందిపురస్కార గ్రహీత – “నవలానాయకుడు అక్కినేని”; కాదంబరి కిరణ్, ప్రముఖ సినీ నటులు, అక్కినేనికి అత్యంత ఆప్తులు – “చిన్నతెరమీద మహానటుడు”; పోణంగి బాలభాస్కర్, పూర్వ ఆకాశవాణి వార్తల చదువరి, దూరదర్శన్ వ్యాఖ్యాత – “భక్తిరస పాత్రల్లో అక్కినేని”; పారా అశోక్ కుమార్, సాహిత్య పరిశోధకులు –“అక్కినేని హేతువాద దృక్పథం”; లక్ష్మీ భవాని, ‘అక్కినేని వీరాభిమాని’ – “సాంఘిక చిత్రాలలో మరపురాని కథానాయకుడు” అంటూ వివిధ కోణాలలో అక్కినేని గారి నటనాజీవితాన్ని చక్కగా విశ్లేషణ చేశారు. ప్రముఖ ద్వ్యనుకరణ కళాకారుడు భవిరి రవి అక్కినేని గారి ఎలా మాట్లాడతారో అనుకరించి అందరినీ అలరించారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర పద్మవిభూషణ్, నటసమ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో (డాలస్ పరిసర నగరం) నెలకొని ఉన్న రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో అక్కినేని సినిమాల నుంచి కొన్ని పాటలను ఎంపికచేసి “అక్కినేని చిత్రగీతాంజలి / నృత్యాంజలి పేరిట’’ ఒక ప్రత్యేక నివాళిగా అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందరూ పాల్గొనవలసినదిగా ఆహ్వానం పలికారు.(చదవండి: చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!) -
సూపర్ 6 ..అంతా తూచ్ పిల్లెత్తుకుపోయింది
-
మా బావ ఎమ్మెల్యే.. అంతా నా ఇష్టం
‘అందరూ వినండి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాకు బావ వరుస అవుతాడు. నేను చెబితే ఆయన చెప్పినట్లే’ ఇదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో ఓ వ్యక్తి ధోరణి. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన ప్రస్తుతం ఉలవపాడు మండలంలో పెత్తనం చేస్తున్నాడు. సీనియర్ నాయకులు సైతం తన వద్దకు రావాల్సిందే అంటున్నాడు. ప్రస్తుతం మండలంలో సర్వాధికారం నాదేనని చెబుతున్నాడు. ఉలవపాడు: ‘నేను చెప్పిన వారే రేషన్ డీలర్. నాకు నచ్చిన వారే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉంటారు. నేను చూపించిన వారే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)గా పనిచేస్తారు. నేను చెప్పినట్లే అధికారులంతా నడుచుకోవాలి.’ ఇదీ పొడపాటి సుధాకర్ అనే వ్యక్తి ఉలవపాడు మండలంలో చేస్తున్న పని. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు సమీప బంధువు, బావమరిది వరుస అవుతాడు. ఎన్నికల సమయంలో సుధాకర్ ఇంటూరి కోసం ఉలవపాడు మండలంలో పనిచేశాడు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిఫలంగా ఇక్కడ ఇష్టమొచ్చినట్లు చేసుకోమని సుధాకర్‌కు నాగేశ్వరరావు బాధ్యతలు అప్పజెప్పినట్లుప్రచారం జరుగుతోంది. అధికారులు ఏ పనిచేయాలన్నా, ప్రజలకు ఏ పని కావాలన్నా ఆయన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.తొలగింపులు.. నియామకాలుమండలంలో ప్రస్తుతం ఉన్న డీలర్లు, వీఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను మార్చడానికి ఏకంగా పార్టీ కార్యాలయంలోనే సోమవారం సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే అండతోనే ఇలా చేసినట్లు కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్షిప్, భోజన ఏజెన్సీలు తమకే కావాలంటూ కార్యకర్తలు పట్టుబట్టారు. ఇప్పుడున్న వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని తహసీల్దార్ కార్యాలయానికి పేర్లు పంపించినట్లు సమాచారం. ఈ విషయాలు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. సుధాకర్ వ్యవహారశైలి నచ్చక సమావేశానికి డుమ్మా కొట్టారు. గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఇలానే పలువురు అధికారం చెలాయించారు.ఆగ్రహంగా సీనియర్ నేతలుఎమ్మెల్యే ఆదేశాలతో వేరే మండలానికి చెందిన సుధాకర్ ఉలవపాడు మండలంలో పెత్తనం చెలాయించడాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేతలు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి తాము ఎంతో శ్రమించామని, ఇప్పుడు మమ్మల్ని కాదని సుధాకర్‌కు బాధ్యతలు ఇవ్వడాన్ని వారు సహించలేకపోతున్నారు. తమ మాట చెల్లుబాటు కావడం లేదని, ఎమ్మెల్యే మండలాన్ని అతనికి రాసిచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ చేస్తున్న పనులపై ద్వితీయ శ్రేణి నాయకులంతా అసంతృప్తిగా ఉన్నా ఇంటూరి మాత్రం చూసీచూడనట్లు ఉన్నట్లు విమర్శలున్నాయి. అతను ఏం చేసినా ఫర్వాలేదన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహారశైలి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. -
షెల్ కంపెనీతో సీఎం రమేశ్ టోకరా..
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో టీడీపీ కోటరీకి నాయకుడు సీఎం రమేశ్ అక్రమాల బాగోతం మరొకటి బయటపడింది. ఫోర్జరీ సంతకాలు చేసి షెల్ కంపెనీ ముసుగులో ఏకంగా రూ.450 కోట్లు కొట్టేసిన వ్యవహారం ఆధారాలతో సహా వెలుగుచూసింది. సీఎం రమేశ్, ఆయన సన్నిహితుడు పి. నాగేశ్వరరావు పక్కా స్కెచ్‌తో పాల్పడిన ఈ ఘరానా మోసంపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్‌కాంట్రాక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి మరీ ఈ మోసానికి తెగబడ్డారు. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు, పీసీఎల్ ఇంటర్‌టెక్ లెన్హైడ్రో కాన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్ పాల్పడిన ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్ పోలీసులకు శనివారం అందించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఈ ఘరానా మోసం వివరాలిలా ఉన్నాయి.. పీసీఎల్ కన్సార్షియంకు తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు.. ఉత్తరాఖండ్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు వద్ద సివిల్ ప్రాజెక్టు కాంట్రాక్టును పీసీఎల్ ఇంటర్‌టెక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ మేరకు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీ)తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్రాజెక్టు వ్యవహారాలను నిర్వహించేందుకు పీసీఎల్ కన్సార్షియం తమ ప్రతినిధిగా కావూరి భాస్కర్‌రావును జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ (జీపీఏ) ద్వారా నియమించింది. కొంతకాలం ప్రాజెక్టు పనులు చేపట్టిన తరువాత పీసీఎల్ కన్సార్షియంకు టీహెచ్డీసీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ఆర్బిట్రేషన్‌కే చేరింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం కొనసాగుతోంది. పీసీఎల్ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్‌డీఏ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్ మోసం.. ఇలా ఓ వైపు ఈ న్యాయ వివాదం కొనసాగుతుండగా.. సీఎం రమేశ్ గుట్టుచప్పుడు కాకుండా ఓ కథ నడిపించారు. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని పీసీఎల్ కన్సార్షియం 2011లో గుర్తించింది. ఆ మేరకు ఆయన ఓ జీపీఏను కూడా సృష్టించారని తెలుసుకుని షాక్‌కు గురైంది. అంతేకాదు.. తమ కన్సార్షియం ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆయన సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతికి టీహెచ్‌డీఏ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. వాటిని చూపిస్తూ టీహెచ్‌డీఏ ప్రాజెక్టు బిల్లులు పొందేందుకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ వ్యవహారం నడిపింది. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం పరిమిత కాల జీపీఏతో పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధిగా టీహెచ్‌డీఏ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కానీ, ఆయన వ్యవహారశైలి నచ్చక ఆ జీపీఏ కాలపరిమితి ముగియగానే ఆయన్ని తొలగించారు. అయినాసరే.. తమ సంతకాలు ఫోర్జరీ చేసి మరోజీపీఏ సృష్టించుకోవడంతోపాటు.. సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతితో తమ కంపెనీ పేరుతో సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లుగా పీసీఎల్ కన్సార్షియం గుర్తించింది. ఈ ఒప్పందంలో పి.నాగేశ్వరరావు తన చిరునామాలో ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటను పేర్కొన్నారు. దీనిపై పీసీఎల్ కన్సార్షియం చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించగా ఆయన తప్పుడు చిరునామా ఇచ్చారని గుర్తించారు. అసలు చిరునామాను కూడా గుర్తించి వెల్లడించారు. షెల్ కంపెనీ ద్వారా నిధులు కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన ఆ బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం ద్వారా సీఎం రమేశ్, పి.నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పీసీఎల్ కన్సార్షియం ఈ విషయాన్ని ఈ–మెయిల్ ద్వారా టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిందని టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఫోర్జరీ నిర్ధారణ.. మరోవైపు.. ఆ సబ్ కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను కావూరి భాస్కర్‌రావు ట్రూత్‌ల్యాబ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పి. నాగేశ్వరరావు, రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధులైన తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు గత ఏడాది నవంబరు 4న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి ఫోర్జరీ సంతకాల విషయాన్ని నిర్ధారించాలని కోరారు. తప్పుడు ఒప్పందంతో తమ కంపెనీని మోసం చేసిన సీఎం రమేశ్, పి. నాగేశ్వరరావులపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరి మోసానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో వారిపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైద రాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని శని వారం కలిసి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసు కు సంబంధించి తాము సేకరించిన మరిన్ని కీలకపత్రాలను కూడా పోలీసులకు అందించారు. సీఎం రమేశ్ రూ.450 కోట్లు కొల్లగొట్టారు : కావూరి భాస్కర్‌రావు ‘పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేశ్ ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాను. దాదాపు అరగంట పాటు నా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఈ ఫోర్జరీ ద్వారా సీఎం రమేశ్ దాదాపు రూ.450 కోట్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి కోర్టులోనూ ఓ కేసు నడుస్తోంది. సీఎం రమేశ్‌పై సీబీఐ దర్యాప్తు జరిగితే రూ.వేల కోట్ల స్కాంలకు సంబంధించిన విషయాలు బయటకొస్తాయి’.. అని కావూరి భాస్కర్‌రావు మీడియాకు చెప్పారు. -
Nellore District: కందుకూరు టీడీపీలో అయోమయం
సాక్షిప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోను కందుకూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ ఎవరికన్న దానిపై అనిశ్ఛితి నెలకొంది. టికెట్ రేసులో నాయకుల మధ్య విభేదాలు ఎంతకూ తెగడం లేదు. టికెట్ నాదే అని పార్టీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు చెప్పుకుంటుంటే, ఆయన ప్రత్యర్థి వర్గం ఆయనకు టికెట్ దక్కకుండా ఎత్తులు వేస్తోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేసిన తొలి జాబితాలో నాగేశ్వరరావు పేరు లేకపోవడం, అదే సందర్భంలో ఆయన ప్రత్యర్థి వర్గం సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతుండడంతో నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అయోమయ వాతావరణం నెలకొంది. నిరాశలో ఐఎన్ఆర్ శిబిరం ప్రధానంగా టీడీపీ టికెట్ కోసం ప్రస్తుత పార్టీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, ఆయన ప్రత్యర్థి వర్గ నాయకులైన ఇంటూరి రాజేష్, కోటపాటి జనార్దన్, మహిళా నాయకురాలు ఉన్నం నళినీదేవిల మధ్య పోరు తారాస్థాయికి చేరుతోంది. నాగేశ్వరరావుకి టికెట్ దక్కకుండా చేయడంతో పాటు, తమలో ఎవరికో ఒకరికి టికెట్ కేటాయించేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల నాలుగైదు రోజుల నుంచి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల 24న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 94 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో నాగేశ్వరరావు వర్గం పూర్తిగా డీలా పడిపోయింది. రెండు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలను ఆయన చూస్తున్నారు. అధిష్టానం చెప్పిన కార్యక్రమాలను అమలు చేసుకుంటూ టికెట్ తనకే వస్తుందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తొలి జాబితా విడుదల తరువాత అసలు పార్టీలో ఏం జరుగుతుందోనని, తన పేరు ఎందుకు జాబితాలో లేదంటూ అయోమయంలో పడ్డారు. జాబితాలో తన పేరు లేకపోవడానికి కారణం ఏమిటి, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఎవరు అడ్డుకున్నారనే విశ్లేషణలతో ప్రస్తుతం నాగేశ్వరరావు శిబిరం నాయకులు లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. బల ప్రదర్శనకు దిగుతున్న ప్రత్యర్థి వర్గం తొలి జాబితాలో ఇంటూరి నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన ప్రత్యర్థి వర్గం నాయకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇదే అదునుగా తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. నాగేశ్వరరావుకు టికెట్ దక్కకుండా అడ్డుకోవడం ఒక ఎత్తైతే, తమలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కించుకునే వ్యూహం మరొకటి. దీనిలో భాగంగా గత రెండు రోజులుగా బల ప్రదర్శనకు దిగుతున్నారు. ప్రధానంగా ఇంటూరి రాజేష్ మంగళవారం తన వర్గం నాయకులతో కలిసి కందుకూరు నుంచి ర్యాలీగా నెల్లూరు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. ఇది కచ్చితంగా బల ప్రదర్శనకు దిగడమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మరో నేత కోటపాటి జనార్దన్ పామూరు రోడ్డులోని కళ్యాణ మండపంలో తన వర్గంతో సమావేశమయ్యారు. ఈయన టిక్కెట్ దక్కించుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకై నా వెనుకాడేది లేదని, పార్టీ అధిష్టానం వద్ద రూ.50 కోట్ల వరకు డిపాజిట్ చేసేందుకు కూడా సిద్ధమేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఇటీవల బీజేపీ నుంచి టీడీపీలో చేరిన మహిళా నాయకురాలు కూడా టికెట్ నాదేనని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఓ మీడియా అధినేతతో పాటు, ప్రస్తుత, మాజీ బీజేపీ పెద్దలపై ఈమె ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితుల్లో కేడర్ ఉంది. -
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: ఎమ్మెల్యే వాసుబాబు
-
తాడిపత్రిలో జనహోరు
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ చేశాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో తాడిపత్రి జనపత్రిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రోడ్డు వేలాది ప్రజలతో కిక్కిరిసింది. ముందుగా పట్టణంలోని కూరగాయల కొత్త మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భగత్‌సింగ్ నగర్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సీబీ రోడ్డు మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు సాగింది. మధ్యలో సిద్దిబాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. దారిపొడవునా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు, నేతలు వివరించినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మళ్లీ రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మాకే ఉంది : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాలుగున్నరేళ్లలో సామాజిక న్యాయం చేసి నిరూపించిన సీఎం వైఎస్ జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ నేతలకే ఉందన్నారు. సామాజిక న్యాయం జరగాలని, పేదవాడు పేదవాడిగానే ఉండిపోకూడదని, పేదల కుటుంబాల్లోనూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని సీఎం వైఎస్ జగన్ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పల్లకీ మోసిన జగన్‌ను మళ్లీ గెలిపిద్దాం: మంత్రి ఉషశ్రీచరణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పల్లకీ మోశారని, మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు, బీసీల్లో పుట్టాం అని గర్వంగా చెప్పుకునేలా చేశారని తెలిపారు. సీఎం జగన్ అగ్రకులంలో పుట్టినా బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటాం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలబెట్టేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ : ఎంపీ తలారి రంగయ్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించి, సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చెప్పారు. రాయలసీమలో మొత్తం 8 ఎంపీ స్థానాలు ఉంటే 5 స్థానాలు బీసీ, ఎస్సీలకు ఇచ్చారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీలకు ఏ పార్టీ టికెట్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉంది: ఎంపీ నందిగం సురేష్ పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ అతి సామాన్యమైన వ్యక్తులను పైసా ఖర్చు లేకుండా ఎంపీలుగా చేశారని, వారిలో తాను ఒకడినని అన్నారు. -
సామాజిక సాధికారతకు జై కొట్టిన కొత్తపేట
సాక్షి అమలాపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన సామాజిక సాధికారతకు కొత్తపేట జై కొట్టింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వేలాదిగా తరలిరావడంతో కొత్తపేట మెయిన్ రోడ్డు జన గోదావరిని తలపించింది. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావడం గమనార్హం. ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. యువత మోటార్ సైకిల్ ర్యాలీతో యాత్రను అనుసరించారు. ప్రజలు పూలు జల్లుతూ భారీ గజమాలలతో ఎదురేగి యాత్రకు స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కొత్తపేట సభలో పాల్గొన్నారు. సీఎం జగన్ సామాజిక విప్లవం, సంక్షేమ పాలనను వివరించినప్పుడు సభకు హాజరైన ప్రజలు హర్షధ్వానాలు చేశారు. సామాజిక న్యాయం చేసింది జగన్ ఒక్కరే: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ సామాజిక న్యాయం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే నని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో వారి వాళ్లకు, ఆయన పార్టీ వాళ్లకు మాత్రమే పని చేయాలని చెప్పారన్నారు. సీఎం జగన్ మాత్రం కులం, మతం, పార్టీలు అని చూడకుండా ప్రతి పేదవాడికీ మేలు చేయాలని చెప్పారని, అదే చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషి నభూతో నభవిష్యతి అని చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీర మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎంపీలు అయ్యారంటే అందుకు జగన్ కారణమన్నారు. ఇది దేశంలోనే ఒక చరిత్ర: మంత్రి చెల్లుబోయిన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సీఎం జగన్ ఈ వర్గాలను అక్కున చేర్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. చంద్రబాబు పాలనలో వివక్షకు గురైన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి, సంక్షేమ పథకాల ద్వారా వారి అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అన్నారు. పేదలవైపు ఉన్నది జగన్ ఒక్కరే: శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న పోరాటంలో పేదల వైపు ఉన్నది జగన్ ఒక్కరేనని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల వారికి ఉన్నత పదవులు అందించి, ఈ వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ చర్యలు చేపట్టారని వివరించారు. జగన్ గెలుపు మన అవసరం: మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరమని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఇంతమంది వెనుకబడిన, దళిత వర్గాల వారం వేదిక మీద ఉన్నామంటే సీఎం జగనే కారణమని అన్నారు. వెనుకబడిన వారిని జగన్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా గుర్తించారని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను సీఎం జగన్ అందిస్తున్నారని, దీని వల్ల వారి భవిష్యత్తు ఉన్నతంగా మారుతోందని వివరించారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ: ఎంపీ మార్గాని భరత్ గాంధీ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు తేవడంలో జగన్ ఒక శక్తిలా పని చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతారో తీసేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?
టాలీవుడ్లో మరో సినీ దిగ్గజం దివికేగిసింది. దాదాపు 55 ఏళ్ల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా, తనదైన నటనతో అభిమానులను మెప్పించిన నట దిగ్గజం చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరిసారిగా 2017లో వచ్చిన గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పదహారేళ్ల వయసు చిత్రం ద్వారానే అందాల నటి శ్రీదేవి అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! ) దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇకలేరన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ గురించి ఆసక్తిక విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత శంకరాభరణం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. అప్పటి హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. అంతే కాకుండా శోభన్ బాబు, చంద్రమోహన్ మంచి స్నేహితులు కూడా. అలా వారి మధ్య బలమైన స్నేహబంధం వల్ల ఆర్థికంగా ఇద్దరు డబ్బులు అవసరమైతే ఒకరినొకరు సాయం చేసుకోవారమని గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. శోభన్ తన వద్దనే డబ్బులు తీసుకునేవాడని.. ఇది చూసి తనకు ఆశ్చర్యమేసేదని ఆయన తెలిపారు. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత ) గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శోభన్‌బాబు, నేను మంచి స్నేహితులం. నాకంటే ఆయనే చాలా ఆస్తిపరుడు. అయినా కూడా నన్ను డబ్బులు అడిగేవారు. ఇది చూసి మొదట నేను ఆశ్చర్యపోయేవాన్ని. ఆ తర్వాత నాకు ఓ విషయం చెప్పాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని శోభన్ బాబు నమ్మేవారు. అందుకే ఏదైనా ఆస్తి కొన్నప్పుడల్లా నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు. శోభన్ బాబు మరణం మనకు తీరని లోటు' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. నాగేశ్వరరావుతో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. -
మెగా పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ కు కైకలూరు ఎమ్మెల్యే ఛాలెంజ్
-
ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
సాక్షి, ఏలూరు: వారాహి యాత్రలో జనసేన పవన్ కల్యాణ్ ఆరోపణలు, విమర్శలకు కైకలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్న పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరావు. అంతేకాదు.. తాను స్వయంగా ఎదిగిన మనిషినని.. అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని పవన్‌కు సవాల్ విసిరారాయన. చంద్రబాబుకి కొమ్ము కాయడం తప్ప.. పవన్‌ను ఏదీ చేతకావడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారాయన. గత ప్రభుత్వంలో పవన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసి గెలిపించిన కామినేని శ్రీనివాస్(మాజీ మంత్రి) కైకలూరుకు ఏమి చేశారు?.. రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో సహవాసం చేశారు. పార్టీ అంటే కన్నతల్లితో సమానం.కానీ, కామినేని నీతి తప్పి ప్రవర్తించారు. కామినేని హయాంలో పూర్తికాని పెద్దింట్లమ్మ వారధిని.. సీఎం జగన్ రూ. 14 కోట్లతో పూర్తి చేశారు అని తెలిపారాయన. వీటితో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను, అందుకు వెచ్చిస్తున్న నిధుల వివరాలను సైతం మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు. ‘‘పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడుతాడు. కానీ ఏమాత్రం ఆలోచన చెయ్యరు. నాకు నా కొడుక్కి కొమ్ములు వచ్చాయి వాటిని విరగ కొడతాను అని పవన్ అన్నారు. అవి కొమ్ములు కాదు ప్రజలు మేము చేస్తున్న సేవకు ఇచ్చిన ఆశీస్సులు. కామినేని ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు. కొల్లేరులో మేం వందలాది ఎకరాల ఆక్రమించామన్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆరోపణలు నిరూపిస్తే.. గుండు గీయించుకుని క్షమాపణలు కోరతా. పవన్.. తన స్థాయిని రోజురోజుకీ దిగజార్చుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు. కానీ, నువ్వు వారాహి పేరుతో యాత్ర చేస్తూ లేనిపోనివి మాట్లాడుతున్నావ్. కనీసం సర్పంచ్‌గా అయిన గెలిచి ఉంటే.. మౌలిక వసతుల గురించి నీకు తెలిసి ఉండేది. దమ్ముంటే.. పాదయాత్ర చెయ్యి. కైకలూరు నియోజకవర్గంలో నిజాయితీకి నిలువుటద్దం దూలం నాగేశ్వరరావు(తనను తాను ఉద్దేశిస్తూ..). కేరాఫ్ ఫ్లాట్‌ఫారమ్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అన్నచాటున తమ్ముడిలా ఎదిగిన వ్యక్తివి నువ్వు. ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది. పవన్ అది గమనించాలి. దమ్ముంటే.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయండి. అంతేగానీ.. నేరస్తుడైన చంద్రబాబుకి కొమ్ము కాయడం కాదు. అమరావతిలో రైతులు ఇచ్చిన రెండు స్పూన్ల పెరుగు అన్నం తిని.. వెళ్ళిపోయావు. రాజధాని పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా?.. అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు అంటూ పవన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరావు హితవు పలికారు. పవన్.. మీ పేరు చెప్పి ఎందరో విద్యార్థులు, యువత తల్లి దండ్రులను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు..వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారాయన. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ సొమ్మును దోచేస్తేనే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...? ‘‘మీరంతా రండి.. జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబుకు ఎవరూ కొమ్ము కాయరు..?. వంగవీటి రంగానే హత్య చేయించిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం ను చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం భార్యని కొడుకును చిత్రహింసలు పెడితే ఒక్కరోజైనా నువ్వు మాట్లాడవా? అని పవన్‌ను నిలదీశారాయన. -
అన్నపూర్ణ స్టూడియో ఉంది అంటే దానికి కారణం నాగేశ్వరరావు గారు
-
ఆ క్రెడిట్ ఆ వ్యక్తికి చెందాలి : దగ్గుబాటి రామానాయుడు
-
తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో ఆయనే!
తొంభై మూడేళ్ల వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో,నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. తెలుగు సినీరంగంలో అక్కినేని ‘ఎక్కని ఎత్తుల్లేవు. వెళ్లలేని దూరాల్లేవు.’ జనన మరణాల మధ్య రెప్పపాటు జీవితకాలంలో, మన చూపు తిప్పుకోకుండా మన నలరించిన ఎందరో మహానుభావుల్లో ప్రముఖులు... తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగం నుంచి నటరాజు వరప్రసాదమైన ‘అభినయ’ కళ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించి, తొంభై మూడు సంవత్సరాల వయసు వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, తెలుగు హృదయాలలో చిరంజీవిగా కొలువై ఉన్న నటనావతంసుడీయన. పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వంటివి అక్కినేనిని అలంకరించి తమ గౌరవాలను ఇనుమడింప చేసుకున్నాయి. తన కళని తర్వాత తరాలకి కూడా వారసత్వంగా అందించి అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్‌ని, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి స్టార్లని తయారు చేసి ‘అక్కినేని’ జయభేరి తరతరాలుగా నినదించేలా చేయడం సామాన్యమైన విషయం కాదు. 1950 నుంచి 60ల మధ్యలోనే ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌కి వచ్చి తీయా’లని నిర్దేశించ గలిగిన ‘ఖలేజా’ ఉన్న ఏకైక తెలుగు సూపర్ స్టార్ అక్కినేని. 1970ల మధ్య గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో, నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. అదే ‘గుండె ధైర్యం’తో తన తొంభై ఏళ్ల వయసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు క్యాన్సర్ సోకిందనీ, మరెంతో కాలం బతకననీ చెప్పగలగడం స్ఫూర్తి దాయకం. పై మూడు సంఘటనలూ, వయసు మారిందే గానీ, ఆయన వన్నె ఏ మాత్రం తగ్గ లేదని నిరూపించాయి. ‘ఆడపిల్లలకి చదువులెందుకు? పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపెయ్యక’ అనే పాత కాలపు భావజాలం సమాజంలో అధికంగా ఉన్న రోజుల్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే టైటిల్‌తో స్త్రీలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేలా చిత్రం చేయడం ఆయన ప్రోగ్రెసిన్ థాట్ ప్రాసెస్‌కి తార్కాణం. ఈనాటి ‘వుమెన్ ఎంపవర్మెంట్’ ట్రెండ్‌కి బీజం వేసిన సాంఘిక కార్యకర్తల్లో అక్కినేని కూడా ఒకరు. విగ్గు, మేకప్పు లేకుండా ఇంట్లోంచి కాలు కూడా బైటికి కదపలేని కళాకారులకి ఆయన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మారుతున్న సినిమా మేకింగ్ విలువలకి ఒక గొప్ప పాఠం. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రోజుల్లో ‘సుడిగుండాలు’ వంటి చిన్న పిల్లల మానసిక సమస్య మీద చిత్రాన్ని నిర్మించి, నటించడం ఆయన సామాజిక బాధ్యతకి, ప్రభావవంతమైన ఆలోచనా పరిణతికి నిదర్శనం. దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఆత్మగౌరవం, అగ్నిపుత్రుడు, సూత్ర ధారులు, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, దేవదాసు, మాంగల్యబలం, విప్రనారాయణ, సువర్ణ సుందరి, కీలుగుర్రం... ఇలా ఏ జోనర్లో చూసినా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో అక్కినేని పాదుకొచ్చిన కలికి తురాళ్లు కనిపిస్తాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టారర్లతో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగం. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడం, చలన చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించడం... కొన్ని లక్షలమంది కళాకారుల కలలని సాకారం చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. ‘‘అక్షరం నేర్చుకోలేదని బాధ ఉంది’’ అని చెప్తూనే, నిరంతర విద్యార్థిగా తెలుగు, తమిళ, హిందీ, ఉర్దూ్ద, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, నేర్చుకుని, ‘అక్కినేని ఆలోచనలు (అ, ఆలు)’ వంటి వచన కవితా సంపుటిని ప్రచురించడం ఆయనలోని క్రమశిక్షణకి, విద్యారంగం పట్ల గౌరవానికి దర్పణం. ముళ్లపూడి వెంకటరమణ గారన్నట్లు–అక్కినేని నాగేశ్వరరావు / ఎక్కని ఎత్తుల్లేవు / వెళ్లలేని దూరాల్లేవు. ఆయన కీర్తి, ప్రభావం, ప్రతిభ ప్రయాణించే కాలంలో మన జీవిత కాలం ఒక చిన్న మజిలీ మాత్రమే. ఆయనే శాశ్వతం. శతమానం భవతి. అక్కినేని అభిమానులకి ఆయన శత సంవత్సర జయంతి శుభాకాంక్షలు. వి.ఎన్. ఆదిత్య వ్యాసకర్త ప్రముఖ సినీ దర్శకుడు (నేటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం) -
‘హెచ్‌సీఏ’ కమిటీపై ఉత్తర్వులు ఇవ్వవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు కమిటీకి సంబంధించి దిగువ కోర్టులు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏ కమిటీ రద్దయిన నేపథ్యంలో అసోసియేషన్ కార్యకలాపాలను చక్కదిద్దేందుకు గత ఫిబ్రవరిలో ఎల్. నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే హెచ్‌సీఏ ఎన్నికల అంశం వ్యవహారం సహా ఇతర అంశాల్లో పలువురు హెచ్‌సీఏ సభ్యులు పదే పదే వేర్వేరు కారణాలతో కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీరి పిటిషన్ల తర్వాత హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. హెచ్‌సీఏ ప్రస్తుత స్థితికి సంబంధించి సుప్రీంకోర్టులోనే పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై తీర్పు ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. అసలు అలాంటి పిటిషన్లను అనుమతించడమే తప్పని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన చెల్లవని కూడా స్పష్టం చేసిన సుప్రీంకోర్టు... తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. -
దళారీ వ్యవస్థకు దన్ను.. బాబే
సాక్షి, అమరావతి: రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం గింజను ఆర్బీకే వ్యవస్థ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల దగ్గర నుంచి ఆఖరి గింజ వరకు కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించింది చంద్రబాబేనన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై ఈనాడు రామోజీరావుకు ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు. రామోజీరావు ఎలాంటి వారో ఆయన తోడల్లుడిని అడిగినా చెబుతారన్నారు. మంత్రి కారుమూరి ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబువి అబ్రకదబ్ర హామీలని, నయ వంచనకు ఆయన కేరాఫ్ అని ధ్వజమెత్తారు. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా రామోజీకి కనపడదు, వినపడదు. టీడీపీ పాలనలో దోచుకో దాచుకో పద్ధతిని అనుసరించారు. చంద్రబాబు హయాంలో 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తే గత నాలుగేళ్లలో సీఎం జగన్ 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2014 – 19 మధ్య 17.94 లక్షల మంది రైతులకు రూ.40,236 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. నాలుగేళ్లలో సీఎం జగన్ 32.78 లక్షల మంది రైతులకు పారదర్శకంగా రూ.58,765 కోట్లు చెల్లింపులు చేశారు. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా, గిట్టుబాటు ధర కల్పించకపోయినా రామోజీరావు, దత్తపుత్రుడు ఏనాడూ మాట్లాడలేదు. చంద్రబాబు ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డారో రైతులందరికీ తెలుసు.ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. 2014 ఇన్పుట్ సబ్సిడీ కూడా సీఎం జగన్ వచ్చాకే ఇచ్చారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్ ఆ పంట కాలంలోనే ఇస్తున్నాం. తెలంగాణలో ధాన్యాన్ని ఇతరులు ఎవరూ కొనరు. ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏపీలో స్వర్ణ రకం, ఇతర అన్ని రకాల ను పండిస్తారు. మన దగ్గర పండే ధాన్యాన్ని రైతుల నుంచి ఎంఎస్పీ కంటే ఎక్కువ ధరకు బయ్యర్లు కొనుగోలు చేస్తారు. ఐదేళ్ల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే ఏర్పాట్లు చేశాం. బొండాలను కొనుగోలు చేయాలనుకుంటే కొంత మాత్రమే వచ్చింది. విక్రయించాలని రైతులను కోరినా అమ్మలేదు. కేరళ అడిగిన బొండాలు రకం కూడా కొనుగోలు చేశాం. కేరళలో ఓనమ్ పండుగ వరకు మన రైతులు నిల్వ చేస్తారు. అలా నిల్వ చేయటం వల్ల రూ.1900లకు అమ్మటంతో రైతులకు ఎంతో లాభం వచ్చింది. -
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు
-
అశ్వారావుపేట (ఎస్టి) నియోజకవర్గంలో ప్రజల ఓట్లను ఎవరు గెలుస్తారు?
అశ్వారావుపేట (ఎస్టి) అశ్వారావుపేట గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలంగాణ లో ఈ పార్టీ గెలిచిన రెండు సీట్లలో ఇది ఒకటి. మరొకటి సత్తుపల్లి. నాగేశ్వరరావు తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై 13117 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాగేశ్వరరావుకు 61124 ఓట్లు రాగా, తాటి వెంకటేశ్వర్లుకు 48007 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన సిపిఎం అభ్యర్ధి రవీందర్ కు సుమారు ఐదు వేల ఓట్లు వచ్చాయి. సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టిడిపికి ముందుగా గుడ్ బై చెప్పగా, ఆ తర్వాత మరి కొంతకాలానికి నాగేశ్వరరావు కూడా అదే బాట పట్టి టిఆర్ఎస్లో కలిసిపోయారు. 2014లో అశ్వారావుపేటలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. గతంలో ఈయన బూర్గంపాడు నుంచి తెలుగుదేశం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి పోటీచేసి తనసమీప ప్రత్యర్ధి టిడిపి అభ్యర్ధి ఎమ్.నాగేశ్వరరావును 930 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా 2014లో సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే మిత్రసేనకు 15101 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్ధి ఆదినారాయణకు 13247 ఓట్లు లభించాయి. తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ శాసనసభలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసినా గెలవలేకపోయారు. అశ్వారావుపేట (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సోదరుడు నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే ఓడిస్తానంటున్న రాజేష్
కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అటుంచి ముందు పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో నిండా మునిగి తేలుతోంది. పార్టీలో ఉన్న నాయకులు ఎవరి బలాన్ని వాళ్లు పెంచుకునే పనిలో పడడంలో ఆ పార్టీ కార్యకర్తలు పూర్తిగా అయోమయ స్థితిలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రస్తుతం కందుకూరులో టీడీపీ నేతలైన ఇంటూరి బ్రదర్స్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావును వరుసకు సోదరుడైన ఇంటూరి రాజేష్ వ్యతిరేకిస్తుండడమే ఇందుకు కారణం. వీరిద్దరి ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు దివి శివరాం, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఉనికిని చాటుకునే పనిలో ఉన్నారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో సామాన్య కార్యకర్త అర్థం కాని పరిస్థితి. టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. ఇద్దరి మధ్య సోదర బంధుత్వం ఉన్నా రాజకీయంగా మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి ప్రధాన కారణం ఆధిపత్య పోరు అని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత నియోజకవర్గంలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం అండతో వలేటివారిపాళెం బడేవారిపాళెం గ్రామానికి చెందిన రియల్టర్ ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అయితే అంతకుముందు నుంచే అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు సోదరుడు రాజేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడంతోపాటు ఆర్థికంగా ఖర్చు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను మోసం చేసి నాగేశ్వరరావు దొడ్డిదారిలో ఇన్చార్జి పదవి తెచ్చుకున్నాడని రాజేష్ రగిలిపోయాడు. ఈ వైరం ప్రస్తుతం తారస్థాయికి చేరింది. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ కలిసి పనిచేయాలని ఆదేశించినా ససేమిరా అంటున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమాలను నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, వాటిలో పాల్గొనేందుకు రాజేష్ ఇష్టపడడం లేదు. తాను సొంతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తన వర్గాన్ని పెంచుకునే పనిలో రాజేష్ ఉన్నాడు. అగమ్యగోచరం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నా నాయకుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం తగ్గడం లేదు. పార్టీ అధిష్టానం నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే ఓడించేందుకు కూడా వెనుకాడేది లేదని రాజేష్ తన వర్గం నాయకులతో స్పష్టం చేస్తున్నారు. వీరి మధ్య పోరు ఇలా ఉంటే 2019 ఎన్నికల ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరమైన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అప్పుడప్పుడూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అధిష్టానం టికెట్ ఇస్తే మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమేనని తనవర్గం నాయకుల వద్ద చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
నగ్నంగా పూజలు చేస్తే డబ్బులంటూ మోసం.. 12 మంది అరెస్ట్
గుంటూరు రూరల్: డబ్బు ఆశ చూపి యువతుల్ని మోసగించేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాడి ఆగడాలకు దిశ యాప్ సాయంతో అడ్డుకట్ట పడింది. బాధిత యువతులు తమ మొబైల్ ఫోన్లోని దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతులను రక్షించారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా అఘాయిత్యాలకు పాల్పడిన 12 మందిని నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు అనే వ్యక్తి బోర్లు వేసే సమయంలో కొబ్బరి కాయలతో నీరు పడుతుందో లేదో చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుప్త నిధులను వెతికేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన వి.నాగేంద్రబాబుకు నగ్నంగా పూజలు చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశ చూపాడు. దీంతో నాగేంద్రబాబు తన క్లాస్మేట్ అయిన కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు చెందిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలకు ఒకసారి నగ్నంగా పూజలో కూర్చునే మహిళలు ఉంటే వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో సురేష్, ఖాశిం, పెద్దరెడ్డి ఇద్దరు యువతులతో గత మంగళవారం గుంటూరు వచ్చి నాగేంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని నాగేంద్రబాబు పూజారి నాగేశ్వరరావుకు ఫోన్లో చెప్పాడు. దీంతో నాగేశ్వరరావు అనుచరులు, అతడి కారు డ్రైవర్ సునిల్, చిలకలూరిపేటకు చెందిన ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే అరవిందచౌదరి, సుబ్బు, శివ, రాధ గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి నంద్యాల నుంచి వచ్చిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలను కలిసి.. డబ్బుల విషయమై మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారు. కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించి.. మంగళవారం రాత్రి పూజలు ప్రారంభించాలని నాగేశ్వరరావు చెప్పగా.. వారంతా తాడికొండ మండలం పొన్నెకల్లులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత నాగేశ్వరరావు యువతులను ఓ గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజలు ప్రారంభించాడు. మధ్యలో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూజ చేస్తున్న సమయంలో కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో యువతులు ఏమీ చేయలేకపోయారు. పూజలు ముగిసిన అనంతరం నాగేశ్వరరావు, అతని అనుచరులు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం నాడు పొన్నెకల్లులో పూజలు కుదరటం లేదని చిలకలూరిపేటలోని పండరీపురంలో అరవిందచౌదరి ఇంట్లో పూజలు చేయాలని నిర్ణయించాడు నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అందరూ కలిసి చిలకలూరిపేట వెళ్లారు. శుక్రవారం వరకూ పూజలు చేసే క్రమంలో యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో నాగేశ్వరరావు అక్కడినుంచి జారుకున్నాడు. దిశ యాప్‌ను ఆశ్రయించడంతో.. ఈ క్రమంలో సదరు యువతులు ఒప్పందం ప్రకారం తమకు డబ్బు ఇస్తే ఇంటికిపోతామని నాగేశ్వరరావు అనుచరులను అడిగారు. దీంతో నాగేశ్వరరావు అనుచరులకు, యువతులకు వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని అరవిందచౌదరి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పగా.. తన ఇంటికి వస్తే సెటిల్మెంట్ చేసుకుందామని నాగేశ్వరరావు సూచించాడు. అందరూ కారులో పొన్నెకల్లు బయలుదేరారు. మధ్యలో నాగేశ్వరరావు అనుచరులు యువతులను బెదిరించడంతో గోరంట్ల సమీపంలో బాధిత యువతులు తమ వద్దనున్న సెల్ఫోన్లో దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ నేతృత్వంలో నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే నగర శివార్లలోని గోరంట్ల వద్ద ఉన్న యువతుల చెంతకు చేరుకుని ఆమెతోపాటున్న అరవింద చౌదరి, నాగేంద్రబాబు, సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద చౌదరి, రాధ, భాస్కర్, పెద్దరెడ్డి, సాగర్, వెంకటసురేష్, శివ, సునీల్, పవన్, సుబ్బులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా చెప్పారు. ఎవరైనా డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎరవేస్తే నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. -
చెట్టు చెట్టుకో వెరైటీ.. అరుదైన మియాజాకీ మామిడి.. కిలో ధర 2.70 లక్షలు
పిఠాపురం (తూర్పు గోదావరి): అరుదైన రకాలు పండించాలన్న ఆ రైతు ఆలోచన మొక్కగా మొదలై.. చెట్టుగా మారింది. అది శాఖోపశాఖలుగా విస్తరించి తోటనిండా అద్భుతాలను పండిస్తోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓదూరు నాగేశ్వరరావు అనే రైతు నాలుగు ఎకరాల మామిడి తోటలో ఎన్నో రకాల మామిడి మొక్కలు నాటారు. తోటంతా కాస్తే వచ్చే ఆదాయాన్ని అందులోని ఒకే ఒక మామిడి చెట్టు తెచ్చిపెడుతోంది. ఆ ఒక్క చెట్టుకు 15 కాయలు కాయగా.. వాటి విలువ అక్షరాల రూ.15 లక్షలకు పైగానే ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కింగ్ ఆఫ్ మేంగో.. ఒక్కో కాయ రూ.లక్ష పైనే జపాన్ దేశంలో మాత్రమే పండే మియాజాకీ రకం మామిడిని ఓదూరు నాగేశ్వరరావు పండిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా గుర్తింపు పొందింది. ఇది బంగారం ధరతో పోటీ పడుతుంది. జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పండటం వల్ల దీనికి మియాజాకీ అనే పేరొచ్చింది. దీనిని సూర్యుడి గుడ్లు (ఎగ్స్ ఆఫ్ సన్) అని కూడా పిలుస్తారు. సువాసనలు వెదజల్లుతూ.. లోపల బంగారు ఛాయతో మెరిసిపోయే ఈ మామిడి పండు అత్యధిక పోషకాలను కలిగి ఉంటుందట. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కేజీ రూ.2.70 లక్షల వరకు పలుకుతుందని.. ఒక్కో కాయ ధర కనీసం రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది క్యాన్సర్‌కు మందుగా.. కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధంగా పేరొందడంతో దీనికి విలువ పెరిగింది. నాగేశ్వరరావు తోటలో గత ఏడాది మియాజాకీ రకం పండు మాత్రమే ఒకటి మాత్రమే కాయగా.. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. సుమో.. మామిడి! ఈ రైతు తోటలో ఈ ఏడాది కొత్తగా ఐదు కేజీల మామిడి చెట్లు కాపు మొదలుపెట్టాయి. ఒక్కో మామిడి కాయ బరువు సుమారు ఐదు కేజీలు ఉండటం వీటి ప్రత్యేకం. ప్రస్తుతం ఒక చెట్టుకు రెండు మాత్రమే కాసాయి. ఈ రకాన్ని అఫ్గాన్ దేశానికి చెందిన నూర్జహాన్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కాయగా దీనికి గుర్తింపు ఉంది. ఒక్క కాయ రూ.వెయ్యికి పైనే ఉంటుంది. సుమారు అడుగు పొడవు ఉండడం దీని విశేషం. పూత దశలో ఉండగానే దీనికి డిమాండ్ పెరుగుతుంది. మామిడి ప్రియులు వీటిని ముందుగానే బుక్ చేసుకుంటారు. విచిత్ర ఆకారాలు.. చిత్రమైన రంగులు నాగేశ్వరరావు తోటలో అడుగుపెడితే కళ్లు మిరుమిట్లు గొలిపే రంగులు.. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో మామిడి కాయలు కనిపిస్తాయి. చూడటానికి తయారు చేసిన కాయల మాదిరిగా కనిపిస్తాయి. ఇక్కడి మామిడి చెట్లకు అరటి పండ్లు వేలాడుతుంటాయి. వాటిని కోస్తే మాత్రం అచ్చమైన మామిడి పండ్లే. వీటిని అరటి పండ్ల మాదిరిగానే వలుచుకు తినేయొచ్చు. అచ్చం యాపిల్ పండ్ల మాదిరిగా ఉండే మామిడి పండ్లు సైతం ఈ తోటలో కాస్తున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వందకు పైగా అబ్బురపరిచే మామిడి మొక్కలతో ఈ పండ్ల తోట కనువిందు చేస్తోంది. మియాజాకీ 15 కాయలు కాసింది నాలుగేళ్ల క్రితం వివిధ రకాల మామిడి మొక్కలు వేయడం ప్రారంభించాను. గత ఏడాది మియాజాకీ మామిడి పండు ఒకటి కాసింది. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. ఈ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో రెండు చెట్లు మాత్రమే కాస్తున్నాయి. ఒక్కో కాయ 380 నుంచి 450 గ్రాముల వరకు బరువు ఉన్నాయి. మొత్తం మామిడి కాయల బరువు సుమారు 6 కేజీల వరకు ఉంటుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.15 లక్షల పైమాటే. – ఓదూరి నాగేశ్వరరావు, రైతు, చేబ్రోలు ఇవి చాలా అరుదు మియాజాకీ, నూర్జహాన్ రకాల మామిడి మన ప్రాంతంలో పండటం చాలా అరుదు. ఇవి చాలా విలువైనవి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని రకాలు చాలా అరుదైనవే. వీటిని ఇతర రైతులకు పరిచయం చేయడానికి ప్రయతి్నస్తాం. మొక్కలు నాటినా అవి చాలా వరకు పంటకు రావు. కానీ.. ఆయన అరుదైన రకాలను పండించడం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్గానే చెప్పవచ్చు. – అరుణ్‌కుమార్, ఇన్చార్జ్ ఉద్యాన శాఖాధికారి, గొల్లప్రోలు -
విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. వనస్థలిపురంలో వివాహితను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సీఐ కోరట్ల నాగేశ్వరరావును గతంలోనే పోలీస్ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావుపై ఇప్పటికే వనస్థలిపురం పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. కొద్దీ రోజుల క్రితమే కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మొత్తం 39 మందిని పోలీస్ శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. గత పది నెలల్లో 55 మందిపై చర్యలు తీసుకుంది. తీవ్రమైన నేరారోపణలపై ఆర్టికల్ 311(2) బి కింద విధుల నుంచి తొలగించింది. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. ఈ మేరకు సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ సర్వీస్ నుంచి తొలగించింది. -
రాజధాని పేరుతో చంద్రబాబు దగా చేశారు : మంత్రి కారమూరి
-
తలపై గన్ గురిపెట్టి రేప్.. మాజీ సీఐ నాగేశ్వర రావు రేపిస్టే: పోలీసుల ధృవీకరణ!
సాక్షి, హైదరాబాద్: ఓ నిందితుడి భార్యపై హైదరాబాద్‌లోని మారేడుపల్లి ఠాణా మాజీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కోరట్ల నాగేశ్వరరావు అత్యాచారం చేశాడని వనస్థలిపురం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని కస్టడీ సమయంలో పలుమార్లు బుకాయించిన మాజీ సీఐ నాగేశ్వర రావును లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించగా అందులో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో పాటూ మెజి్రస్టేట్ సమక్షంలో బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసిన మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ) స్థాయి అధికారిణి.. నిందితుడు బాధితురాలి కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేశాడని, తగిన ఆధారాలతో సహా తుది నివేదిక సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న పలువురి స్టేట్మెంట్లను రికార్డు చేసి, సాధ్యమైనంత త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు వనస్థలిపురం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. తుపాకీ తీసుకెళ్లలేదన్నది నాటకమే.. వృత్తిరీత్యా సీఐ కావటంతో తుపాకీ క్యారీ చేసే అలవాటు ఉన్న నాగేశ్వర రావు సంఘటన జరిగిన రోజు కూడా బాధితురాలి ఇంటికి గన్ తీసుకెళ్లాడు. కస్టడీ విచారణలో మాత్రం తాను తుపాకీ తీసుకెళ్లలేదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కావాలంటే మారేడుపల్లి ఠాణా రికార్డులను పరిశీలించుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పీఎస్ రికార్డులను, సీసీటీవీ కెమెరాలను, ఇతరత్రా సాంకేతిక అంశాలను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. సంఘటన జరిగిన మర్నాడు ఉదయం తుపాకీ స్టేషన్‌లోని ఒక అధికారికి ఇచ్చి, సరెండర్ చేసినట్లుగా రికార్డ్‌లో రాపించినట్లు విచారణలో బయటపడింది. ఠాణాలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. సంఘటన జరిగిన తెల్లారి నాగేశ్వర రావు స్టేషన్‌కు వచి్చనట్లు ఎక్కడా రికార్డు కాలేదు. దీంతో సీఐ ఫోన్ లొకేషన్‌ను పరిశీలించగా.. ఆ సమయంలో నాగేశ్వర రావు ఇంట్లోనే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. దీంతో కేసును తప్పుదారి పట్టించే యత్నం చేసిన నాగేశ్వర రావుపై వనస్థలిపురం పోలీసులు తప్పుడు డాక్యుమెంట్లు, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులు కూడా నమోదు చేశారు. రూ.30 లక్షలు డిమాండ్.. బాధితురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు సమరి్పంచడంలో సీఐ విఫలమయ్యాడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సీఐ ఫోన్ కాల్ రికార్డ్లను పరిశీలిస్తే.. ఎక్కడా కూడా బాధితురాలితో సంభవించినట్లు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఇదే విషయంపై సీఐను ప్రశ్నించగా.. బాధితురాలితో కేవలం వాట్సాప్ కాల్, మెసేజ్‌లు మాత్రమే చేసేవాడినని తెలిపినట్లు తెలిసింది. బాధితురాలి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక ఇంకా రాలేదని వివరించారు. బాధితురాలి భర్తపై ఉన్న కేసులు ట్రయల్‌కు రానున్నాయని, దీన్ని ఆసరాగా చేసుకొని ఆమెను లోబరుచుకోవాలని భావించిన సీఐ.. వివాహిత ఇంటికి వెళ్లి ఉంటాడని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అంతేతప్ప డీసీపీ స్థాయి అధికారి ఒకరు నాగేశ్వరరావుపై వ్యక్తిగత కక్షతో ఆయన్ని ఇరికించాడని వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన తెలిపారు. కాగా.. సంఘటన జరిగిన తర్వాత అవతలి పార్టీ సీఐను రూ.30 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయని ఆయన పేర్కొన్నారు. -
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్‌కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
‘సంక్షేమ’ సారథి సీఎం జగన్
కృష్ణా (కైకలూరు): రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం పని చేస్తున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. పెంచికలమర్రులో సర్పంచ్ జయమంగళ కాసులు, ఎంపీటీసీ సభ్యుడు సాధు కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డీఎన్నార్ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మూడేళ్లలో పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. డీఎన్నార్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులకు సీఎం జగన్ రూ.20లక్షలు కేటాయించారన్నారు. కొల్లేరు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వాల్లో జరగని అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అందుకే నియోజకవర్గంలో కైకలూరు, మండవల్లి మండలాల్లో పలు గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న విలేజ్‌లుగా ప్రకటించుకుంటున్నారని చెప్పారు. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే పెద్దింట్లమ్మ వారధి గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. వారధిని ఏడాది చివరి కి పూర్తి చేసేలా పని చేయిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో కొల్లేరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న రెగ్యులేటర్లను నిర్మిస్తామని ప్రకటించారన్నారు. త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలందరూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు చెరుకువాడ బలరామరాజు, భట్రాజు శివాజీ, నాయకులు బలే నాగరాజు, ముంగర గోపాల కృష్ణ, శేషావతారం, నిమ్మల సాయి, సైదు వెంకటేశ్వరరావు, శాఖమూరి అమ్మనరాజు తదితరులు పాల్గొన్నారు. -
10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
-
సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
-
రేణూ దేశాయ్ ని ఆప్యాయంగా పలకరించిన చిరంజీవి
-
నాన్న నాతోనే ఉన్నట్లుంది!
దివంగత ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా (సోమవారం, సెప్టెంబరు 20) ‘ఏయన్నార్ లివ్స్’ అంటూ ఓ ప్రత్యేకమైన వీడియోను షేర్ చేశారు ఆయన తనయుడు, హీరో నాగార్జున. తన తాజా చిత్రం ‘బంగార్రాజు’లోని తన పాత్ర తాలూకు విశేషాలను ఈ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘నా హీరో, నా స్ఫూర్తిప్రదాత మా నాన్నగారు. ఆయనకు పంచెకట్టు చాలా ఇష్టం. ముఖ్యంగా పొందూరు ఖద్దరంటే ఇంకా ఇష్టం. ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా పొందూరు ఖద్దరే. అలాగే నవరత్నాల హారం, నవరత్నాల ఉంగరం. ఇక నేను పెట్టుకున్న ఈ వాచ్ నాకన్నా సీనియర్. నాన్నగారి ఫేవరెట్ వాచ్ ఇది. ఇప్పుడు నా ఫేవరెట్ వాచ్. ఇవన్నీ ధరిస్తే నాన్నగారు నాతోనే ఉన్నట్లు ఉంటుంది. ఏదో తృప్తి. నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం’’ అంటూ ఆ వీడియోను నాగార్జున షేర్ చేశారు. ‘బంగార్రాజు’ సినిమాలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్ చేశారు ఈ చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ. ఈ చిత్రంలో నాగచైతన్య, కృతీ శెట్టి, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రధారులు. -
నాన్నని ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లు
ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ.. అందంగా కనిపించే విలక్షణ విలన్... సూటు వేసుకుంటే నిజాం నవాబు.. ‘భలే మామా భలే...’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం...’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’ ‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’ ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు... కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్‌గా ముద్ర వేసుకున్న ఆర్. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు సింగపూర్‌లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని.. ‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్ అటాక్ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం... నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది. ఐస్‌క్రీమ్ చేసి పెట్టేవారు.. నాన్న సికింద్రాబాద్ జీరాలో పుట్టి పెరిగారు. నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్‌కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నాను. దొంగరాముడు చిత్రంలో సావితి, ఆర్. నాగేశ్వరరావు రిక్షాలో వెళ్లమన్నారు.. అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్ టైమ్ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్ టైమ్‌లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్ ఇంజిన్ డ్రైవర్‌గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్‌కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్‌క్రీమ్ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్‌కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు. డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు.. మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు. కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్ ప్యారిస్ కార్నర్ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్‌వెజ్ తినేవారు. హైదరాబాద్ స్టయిల్ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం. ఎస్.వి. రంగరావుతో నాగేశ్వరరావు నాగులు బావ అనేవారు.. అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పి రోడ్లో ఇప్పటికీ పాత హార్డ్‌వేర్ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను. ఇప్పటికీ గుర్తుండిపోయింది... నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్ అటాక్ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం. సుహాసిని నాన్న వెరీ పర్టిక్యులర్ నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్ లెక్క చెప్పలేను. ఏ సూట్లో చూసినా ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించేవారు. ఎస్వి రంగారావు అంకుల్ గృహప్రవేశానికి నాన్న హై కాలర్ (నెహ్రూ కాలర్) బ్లాక్ సూట్, ఎస్విఆర్ వైట్ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్ ఎల్లో... హై కాలర్ స్వెటర్‌తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని సంభాషణ: వైజయంతి పురాణపండ -
Pendyala Nageswara Rao: నాన్న చెబితే అదే ఫైనల్...
శివశంకరీ శివానందలహరీ... రసికరాజ తగువారముకామా... మది శారదా దేవి మందిరమే... శేషశైలావాసా శ్రీవెంకటేశా... చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది... నీలిమేఘాలలో గాలి కెరటాలలో... కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది.. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు... ఒకటనేమిటి... వేల పాటలు నేటికీ తెలుగు వారి గుండెలను పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి.. ఆనందంతో గుండె తడి చేసున్నాయి... పాటలకు జీవం కలిగించేలా సంగీతాన్ని అందించారు పెండ్యాల నాగేశ్వరరావు.. కుటుంబంలో పిల్లలతో అతి సామాన్యుడిలా ఉండేవారు అంటున్నారు పెండ్యాల రెండవ కుమార్తె డాక్టర్ సుజాత నాన్నగారు గుంటూరు జిల్లా వణుకూరులో 1917లో పుట్టారు. సీతారామయ్య, వెంకమ్మ తల్లిదండ్రులు. నాన్నగారి ఆరు నెలల వయసులోనే వారి తల్లిగారు స్వర్గస్థులయ్యారు. తాతగారు రెండో వివాహం చేసుకున్నారు. ఆవిడ నాన్నగారిని సవతి కొడుకులాగే చూశారు. తాతగారి దగ్గరే సంగీతంలో ఓనమాలు దిద్దారు. నాన్న ఏడో తరగతి చదువుతుండగా డబుల్ ప్రమోషన్ వచ్చింది. తాతగారిని జీతం కట్టమని అడిగితే, ఆయన కట్టలేదు. అందువల్ల నాన్న పెద్దగా చదువుకోలేకపోయారు. నాన్నగారి నాయనమ్మ సుబ్బమ్మగారే నాన్నను పెంచి, పెద్ద చేశారు. ఆవిడనే ‘అమ్మా!’ అని పిలిచేవారు. ఆవిడే సీత అనే అమ్మాయితో నాన్న వివాహం జరిపించారు. ఒక ఆడపిల్ల పుట్టేవరకు నాయనమ్మ జీవించి ఉన్నారు. కన్నతల్లిని చూడలేకపోయారన్న బాధ నాన్నను జీవితాంతం వెంటాడింది. మాతో ‘అమ్మా! మీరు అదృష్టవంతులు, తల్లి ప్రేమకు నోచుకున్నారు’ అనేవారు. నాన్న స్వరపరచిన ‘చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది’ పాట నాన్న గుండె లోతుల్లో నుంచి వచ్చింది. తనను సవతి తల్లి సరిగా చూడకపోయినా, ఆవిడ పిల్లల్ని తన సొంత తమ్ముళ్లు, చెల్లెళ్లుగానే చూసుకున్నారు నాన్న. తెల్లటి బెంగాలీ పంచె కట్టుతో, తెల్లటి గ్లాస్కో జుబ్బాకి బంగారు గుండీలతో ఉండే వస్త్రాలలో నాన్న స్వచ్ఛంగా కనిపిస్తారు. బాగా చదివించారు.. నాన్నగారికి మేం నలుగురు ఆడపిల్లలం. నిర్మల, సుజాత, వనజ, మంజుల. ‘అయ్యో! నలుగురు ఆడపిల్లలు’ అనే భావన ఉండేది కాదు. సంగీతంలో ఎత్తుకి ఎదగలేమనుకున్నారో ఏమో, మమ్మల్ని బాగా చదివించారు. నాన్న మాతో అన్ని విషయాలూ స్నేహంగా చర్చించేవారు. ఒకసారి నాతో, ‘అమ్మాయీ! తలకాయ అటుఇటు కదుపుతుంటే నీళ్ల చప్పుడు వస్తోంది. తలలో నీళ్లున్నట్లున్నాయి’ అన్నారు. ‘ఏమీ లేదు నాన్నా’ అంటే, ‘అంతేనంటావా’ అన్నారు. ఆయన గొంతులో పలికే మాటలో మాధుర్యం, చేతిరాతలో అందం ఉంటాయి. అరటి ఆకుల్లో భోజనం మాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో చాలా సంవత్సరాల వరకు భోజనాల బల్ల కూడా లేదు. అమ్మ మడి కట్టుకుని వంట చేసి, అరటి ఆకులు వేసి వడ్డిస్తుంటే, అందరూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేసేవారు. నాన్న సినిమా రంగంలో ఉండటం వల్ల, మా మావయ్య, బాబయ్యలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించటానికి మా ఇంటికి వస్తుండేవారు. నాన్నగారు ఏం చేసేవారు... నాన్న సినిమాలలో బిజీగా ఉన్న రోజుల్లో మూడు షిఫ్టులు పనిచేసేవారు. పొద్దున్న ఎనిమిదికి వెళితే, ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండయ్యేది. ఈ సందర్భంగా నాన్న చెప్పిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ‘అనురాగము విరిసేనా’ పాట చేస్తున్నప్పుడు, ఆఫీసు పక్కింటివారు ఆ పాట వినటం కోసం పనులన్నీ మానుకుని కూర్చునేవారట. ప్రతీ పాటా ఓ పరీక్షే నాన్న ప్రతి పాటను ఒక పరీక్షగా భావించేవారు. పాట రికార్డింగ్ అయ్యాక, ఆఫీస్ బాయ్ సైతం ‘బావుంది’ అన్న తరవాతే ఓకే చేసేవారు. ఓకే చేశాక కూడా ఎక్కడైనా తనకు నచ్చలేదనిపిస్తే, మరుసటి రోజు మళ్లీ మార్చేవారు. ఎన్ని రీరికార్డింగులు చేసినా ఇరిటేట్ అయ్యేవారు కాదు. కొన్ని పాటలు స్వరపరుస్తున్నప్పుడు ‘అసలు ఈ పాట అందరూ వింటారా?’ అనుకునేవారు. ‘మీరజాలగలడా నాయానతి...’ పాట ప్రేక్షకులకు నచ్చిందో లేదో తెలుసుకోవాలని, ఆంధ్రలో సినిమా థియేటర్లో ప్రేక్షకుల మధ్యన కూర్చుని గమనించారట. వారంతా సంతోషంతో తలలాడిస్తుంటే, ‘నా పాటలు నిలిచిపోతాయి’ అని తృప్తి పడ్డారట. నాన్న ఒకసారి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ‘శివశంకరి..’ పాట వస్తుంటే, వింటూ తాళం వేస్తున్నారట. నాన్న వెనకాల కూర్చున్న ఒకాయన, ‘ఆయనను చూడండి ఏదో పెద్ద సంగీతం విద్వాంసుడిలా తాళం వేస్తున్నారు’ అంటే అప్పుడు అక్కడ మరో పెద్దాయన ‘ఆయనే పెండ్యాలగారు’ అన్నారట. ఆ అంశం ఒక పత్రికలో ప్రచురిస్తే, అది నాన్న భద్రంగా దాచుకున్నారు. నాన్న చెబితే అదే ఫైనల్... కాలేజీల వారు నాన్నను జడ్జిగా పిలిచేవారు. సినిమాలో అవకాశం కోసం చిన్న, పెద్ద తేడా లేకుండా పాడుతుంటే విని, ‘బాగా పాడారు కానీ మీ ఊరు వెళ్లిపోండి’ అనేవారు. ‘బాగా పాడారు’ అనేది వారిని తృప్తి పరచడానికి, ‘వెళ్లిపో’మనటం వాళ్ల శ్రేయస్సు కోరి. సినిమా సంగీతానికి ఏ గొంతు ఎలా ఉంటే బావుంటుందో నాన్నకు బాగా తెలుసు. ‘పెండ్యాలగారు మెచ్చుకున్నారంటే, వాళ్లు అదృష్టవంతులు’ అనుకునేవారు. ఘంటసాల గారి గొంతును ‘పెండ్యాల గారు అర్థం చేసుకున్నట్లుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు’ అన్నారు కొందరు విమర్శకులు. పి. సుశీల, ఎస్. జానకి వంటి ఎంతో మంది గాయకులను నాన్నగారే సినిమా పరిశ్రమ కు పరిచయం చేశారు. నాన్న వ్యక్తిత్వం ఎవరెస్ట్ కంటె గొప్పది. ఎంత ఇష్టమో.. ‘పెండ్యాల గారు ఈ పాట పాడండి’ అని బంధువులు అడిగిన పాటను ఎంతో పరవశంతో పాడేవారు. ఆయనకు నచ్చిన ప్రేక్షకులు వారే. నాన్న మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ‘ఒక్క పాట పాడు నాన్నా’ అని మేం అడిగితే ‘జ్ఞాపకం లేదమ్మా’ అనేవారు. ‘మేం అందిస్తాం నాన్నా’ అంటే పాడేవారు. నాన్న చాలా గుప్తదానాలు చేశారు. ఆకలితో ఉన్నవారికి జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చేసేవారు. ఒకసారి ఒక కుర్రవాడికి పావలా ఇచ్చారటం. ఆ రోజుల్లో కానీలు ఉండేవి. అది చూసిన మా బాబయ్య (నాన్న సవతి తమ్ముడు), అన్నయ్య దేవుడు అని మాతోత చాలా సార్లు చెప్పాడు. సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ కోసం నాన్న చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు చాలామందికి పెన్షన్లు వస్తున్నాయి. ఆరాధ్య దైవం శ్రీనివాసుడు.. నాన్నకు దైవభక్తి ఎక్కువ. ‘వేంకటేశాయ నమః’ అంటూ పూలతో ఆత్మార్పణం చేసేవారు. ఆయన ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. వారానికోసారి తిరుపతి వెళ్లేవాళ్లం. నాన్న తిరుమలలో చేయించని సేవ లేదు. వెంకటేశ్వర స్వామి మీద స్వరపరిచిన పాటలు భక్తిలో లీనమై చేశారు. ‘శేష శైలావాసా శ్రీవెంకటేశా’ పాటను అందరూ ఇప్పటికీ కీర్తన అనుకుంటారు. నాకు నాన్న స్వరపరిచి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడిన ‘ఏటిలోని కెరటాలు..’ పాట చాలా ఇష్టం. ఒకే టేక్‌లో శివశంకరి... వేటూరి గారు విజయవాడ ఆకాశవాణి వారి కోసం రచించిన ‘సిరికాకొలను చిన్నది’ రూపకాన్ని నాన్న స్వరపరిచారు. నాలుగైదు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు వేశారు. జగేదకవీరుని కథ చిత్రంలోని ‘శివశంకరి..’ పాటను ఘంటసాల గారితో బాగా ప్రాక్టీస్ చేయించి, ఒకే టేక్‌లో ఓకే చేశారు. విజయానంద చంద్రిక అనే కొత్త రాగాన్ని కనిపెట్టి, ‘జయభేరి’ చిత్రంలో ‘రసికరాజ తగువారము కామా’ పాటలో ఆ రాగం వాడారట. ‘శ్రీఘంటసాల పంచరత్నములు’ పేరుతో వెలువడిన ఐదు పాటలలో, నాన్నగారు స్వరపరిచిన ‘మది శారదా దేవి’, ‘శివశంకరీ’, ‘ముక్కోటి దేవతలు..’ పాటలు ఉన్నాయి. పెద్దలంతా నాన్నను మాస్టారూ అంటే, నాన్న ఘంటసాల గారిని ‘మాస్టారూ’ అనేవారు. కాంబినేషన్స్ వంట చేసేది... అమ్మనాన్నలది అన్యోన్య దాంపత్యం. ప్రేమ, ఆప్యాయతలను అర్థం చేసుకోవటమే దాంపత్యం అని వారిని చూస్తే అర్థమవుతుంది. భోజనం చేసేటప్పుడు, అమ్మ మారు వడ్డింపు అడిగితే, ‘వద్దు’ అని నాన్న అంటే, ‘ఏం వంట బాలేదా’ అని అడిగేది. ‘సీతమ్మా ఈ రోజు వంట బాగుంది’ అని నాన్న అంటే అమ్మ ఆనందపడేది. నాన్నకి కాంబినేషన్స్‌తో వంట చేసేది. తోటకూర – మజ్జిగ పులుసు, కంది పచ్చడి – పచ్చి పులుసు, కొబ్బరి కాయ – మామిడి కాయ పచ్చడి, గారెలు – అల్లం పచ్చడి. నాన్నకి అల్లం గారెల పచ్చడి ఇష్టం. ఆయన ఎన్ని తినగలరో అమ్మకి మాత్రమే తెలుసు. గణపతిం భజే... 1976 డిసెంబర్లో గుంటూరులో పెద్ద సన్మానం చేశారు. సకల గాయక సంగీత విభావరి పేరున సినీ కళాకారులు నాన్నగారి సమక్షంలో పాడారు. నాన్నకు ‘సంగీత సామ్రాట్’ బిరుదు ఇచ్చారు. వైజాగ్‌లో 1983లో పూర్ణకుంభం, వేదమంత్రాలతో, రోజా పూల బాట లో నడిపించి, సన్మానం చేశారు. ‘నన్ను దేవుణ్ని చేసేశారు’ అని నాన్న చెప్పారు. వాళ్లు దేవుణ్ని చేశారో, నాన్నే దేవుడు అయ్యారో తెలియదు కానీ, అది జరిగిన కొద్ది కాలానికే నాన్న కన్నుమూశారు. ఆ రోజు వినాయక చవితి. అమ్మ ఉండ్రాళ్లు, అల్లం పచ్చడి చేసింది. నేను మా వారు మధ్యాహ్నం ఇంటికి వెళ్లేసరికి నాన్న భోజనం చేసి, పడక్కుర్చీలో కూర్చుని ఆయాసపడుతున్నారు. హాస్పిటల్‌కి చేరుకునేసరికే కార్డియాక్ అరెస్ట్‌తో అంతా అయిపోయింది. అన్ని ఊళ్లలో ఈ వార్తను కరపత్రాలు గా పంచారు. ‘వాతాపి గణపతిం భజే’ అని సంగీతాన్ని ప్రారంభించిన నాన్నగారు ఆ గణపతి పుట్టినరోజు నాడే ఆయనలో ఐక్యమైపోయారు. - సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఏపీకి పన్నుల వాటాను తగ్గించారు
సాక్షి, విజయవాడ: ఐదేళ్లుగా పోలవరానికి నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నా బడ్జెట్లో నిధులు కేటాయించలేదని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల వల్ల 13 జిల్లాల ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిది.. కానీ బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌పై ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కూడా తగ్గించారని పేర్కొన్నారు. ‘చిన్న రాష్ట్రాలపై సానుకూలంగా ఉండే బీజేపీ.. ఏపీకి న్యాయం చేయాలి. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి. విమానాశ్రయాలు కేటాయించాలి. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున కేంద్రం నూతన పోర్టుల ఏర్పాటుకు సహకరించాలి. గతంలో టీడీపీ.. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేదు. చంద్రబాబు ఓటుకు నోటుకేసులో ఇరుక్కుని కేంద్రాన్ని నిధులు అడగలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల ముందు బీజేపీని విమర్శించిన టీడీపీ బడ్జెట్ అంశంలో ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార’ని బుద్ధా నాగేశ్వరరావు మండిపడ్డారు. -
మంగళగిరి ఎన్నారై కళాశాలలో కీచక ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, అమరావతి/మంగళగిరి: నా మాట వినకుంటే ప్రాక్టికల్ మార్కుల్లో కోత వేస్తానంటూ వైద్య విద్యార్థినులను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వైద్య విద్యార్థినుల్ని లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం ఇటీవల వెలుగు చూడడం తెలిసిందే. ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వైద్య విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి తమ గోడు విన్నవించారు. దీనిపై వీసీ చర్యలకు ఉప్రకమించారు. రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేయడమేగాక గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టులో హాజరు పరచగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్ష్మి.. అతనికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు.. డా.నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఎన్ఆర్ఐ వైద్యకళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న రేడియాలజీ పీజీ వైద్య విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, రకరకాలుగా వేధించడం చేశారు. వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు ఎన్ఆర్ఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలోనూ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి, అక్కడకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. వీసీ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎన్ఆర్ఐ కళాశాలకెళ్లి విచారణ జరిపి ప్రొఫెనర్ వేధింపులు నిజమేనని తేల్చింది. దీనిపై యాజమాన్యాన్ని వీసీ వివరణ కోరగా... ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని, ఆయన రాజీనామాను ఆమోదించామని బదులిచ్చారు. దీనిపై వీసీ.. రాజీనామా చేసి వెళ్లిపోతే వదిలేస్తారా, పోలీసు కేసు నమోదు చేయరా అంటూ నిలదీశారు. కళాశాల అంతర్గత విచారణలోనూ ప్రొఫెసర్ వేధించినట్టు నిర్ధారించాక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. విద్యార్థినులు జిల్లా ఎస్పీని తాజాగా కలసి ఫిర్యాదు అందజేయడమేగాక ప్రొఫెసర్ తీరుపై వీడియోలతోసహా ఆధారాలను సమర్పించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించడంతో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడమేగాక నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ వేధింపులపై ఎథికల్ కమిటీకి సిఫార్సు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వేధింపులపై రెండు కమిటీలు వేయగా వేధింపులు నిజమేనని అవి రెండూ తేల్చాయి. దీంతో భారతీయ వైద్యమండలి ఎథికల్ కమిటీకి ఈయన విషయాన్ని సిఫార్సు చేస్తున్నా. వైద్య విద్యార్థినుల స్టేట్‌మెంటుతోపాటు విచారణ కమిటీ నివేదికనూ పంపిస్తాం. ఎథికల్ కమిటీ విచారణ జరిపి ఆయన ఎంసీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తుందా.. ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటుందా అన్నది వేచిచూడాలి. –డా.కె.వెంకటేష్, వైస్ చాన్స్‌లర్ (ఇన్చార్జి), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ‘ఇప్పటివరకు ఏ విషయంలోనూ ఎక్కడా రాజీపడ్డది లేదు.. ఇకపై పడేదీ లేదు. నాన్న నాకు ఇచ్చిన పొలం అమ్ముకుని మరీ రాజకీయాలు చేస్తున్నా. ఎక్కడా చేయి చాచింది లేదు.. నా నిజాయితీ, విశ్వసనీయతే ప్రజలు నా వెంట ఉండేలా చేశాయి. మా మేనమామ కూతురు శ్యామల, నేను ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అవేర్ సంస్థ ద్వారా ప్రజలకు దగ్గరయ్యా. రాజకీయాల్లోకి వచ్చి రెండెకరాల భూమి అమ్ముకున్నా తప్ప సంపాదించింది లేదు. నలుగురికి మంచి చేయడం కోసం నేను నష్టపోయినా బాధపడను’ అంటున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ‘సాక్షి’ పర్సనల్ టైమ్. మాది దమ్మపేట మండల పరిధిలోని మొద్దులగూడెం పంచాయతీలో గల తాటి సుబ్బన్నగూడెం అనే మారుమూల గిరిజన గ్రామం. మా తల్లిదండ్రులకు ఆరుగురం సంతానం. మా నాన్న రాములుకు వ్యవసాయమే జీవనాధారం. నాకు పదేళ్ల వయసప్పుడే ఆయన మృతిచెందారు. అప్పటి నుంచి అమ్మ ఆదెమ్మే మాకు అన్నీ తానై పెంచింది. మేం పెద్దయ్యేంత వరకు మా మేనత్త భర్త నర్సింహులు మా పొలాలు సాగు చేసి, మాకు సంరక్షకుడిగా నిలిచారు. నాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ముగ్గురు అక్కలను అంతగా చదివించలేదు. నేను మూడో తరగతి వరకు మా ఊరికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న తొట్టిపంపు గ్రామానికి కాలి నడకనే వెళ్లి చదువుకున్నాను. నాలుగో తరగతి నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అప్పట్లో ఇలా తారురోడ్లు లేవు. పొలాల నుంచి అడ్డదారుల్లో దుగాల మీద నడుచుకుంటూ వెళ్లేది. 5 నుంచి 10 వరకు అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్లో ఉండి జమీందారు గారి దివాణం బడిలో చదువుకున్నాను. అప్పట్లో అశ్వారావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్.మాధవన్ గిరిజనులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. లోన్లు ఇవ్వడం, పొదుపు చేయించడంతోపాటు విద్యారంగంలో ప్రోత్సహిస్తుండే వారు. ఆయన దగ్గర గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు నేను ఆర్గనైజర్‌గా పనిచేసే వాడిని. అప్పట్లో నా రాజ్‌దూత్ వాహనంతోనే అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులను చైతన్యం చేస్తూ అవేర్ సంస్థ పథకాలను వారికి చేరవేసేవాడిని. రాజ్‌దూత్‌పై మారుమూల గ్రామాల్లో తిరిగిన రోజులు, నా రాజ్‌దూత్ నంబర్ ఏటీడబ్ల్యూ 5370 ఇప్పటికీ గుర్తుంది. ఆనాటి నుంచి ప్రజలతో నాకున్న సంబంధాలే నన్ను ఎమ్మెల్యేను చేశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. నా భార్య శ్యామల మా ఊర్లోనే ఉండే మా మేనమామ కూతురు. తాటి వారి ఆడపడుచు. వరసకు మరదలే అయినా అప్పట్లో ఇద్దరం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకు పిల్లలు లేనందున సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నాం. బాబు రాము అనంతపురంలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక నా మేనల్లుడు తాటి ప్రదీప్‌చంద్ర నా వ్యక్తిగత వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. నా భార్య మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మాటకు అడ్డు చెప్పలేదు. ఆమెకు తెలిసిందల్లా నా నిర్ణయానికి కట్టుబడి ఉండడమే. రాజకీయాల్లో తిరగడం వల్ల మానాన్న నుంచి నాకు సంక్రమించిన 14 ఎకరాల్లో రెండెకరాలు అమ్మేశా. భూమి అమ్మినప్పుడు కూడా శ్యామల పల్లెత్తు మాటనలేదు. నాపై ఆమెకున్న నమ్మకం.. ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఆ సమయంలో శ్యామల మాట్లాడుతూ.. ‘ఆయనకు ఏది నచ్చితే అదే చేస్తారు.. నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు.. నలుగురికి మంచి చేయడం కోసం నష్టపోయినా తప్పు లేదనే వ్యక్తిత్వం ఆయనది. ఇంటి పేరు మెచ్చా.. ఆయనకు లేదు మచ్చ.. అని అందరూ మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంటుంది’ అన్నారు. ఇల్లూ.. పొలమే లోకం.. మొద్దులగూడెం గ్రామ పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఉంటే ఇంట్లో, లేకుంటే పొలంలో.. ఈ రెండూ కాకుంటే పార్టీ ఆఫీస్‌లో ఉంటానని ప్రజలందరికీ తెలుసు. అందుకే అశ్వారావుపేటలో క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా కూర్చోలేక మారుమూల గ్రామమైనా మా ఊర్లోనే ఉంటాను. నియోజకవర్గం దాటితే.. అసెంబ్లీకే. నాకు కాంట్రాక్టులు లేవు.. టెండర్లకు వెళ్లేదీ లేదు. మా ఇంట్లో నాకొక్కడికే రాజకీయాలపై ఆసక్తి. మా తమ్ముడికి ఆ ఊసే ఉండదు. జలగం వెంగళరావు హయాంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశాను. ఏడో తరగతి పూర్తికాగానే ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం వచ్చినా.. రాజకీయాలపై ఉన్న మక్కువతో అందులో చేరలేదు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు మా పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకు పది ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది నా వల్లే అని తెలుసుకుని ఓ రోజు అర్ధరాత్రి బుల్లెట్ వేసుకుని మా ఇంటికొచ్చి నన్ను టీడీపీలో చేర్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అదే పది ఓట్లు వచ్చాయి. అంతే అప్పటి నుంచి నన్ను తుమ్మల వదలిపెట్టలేదు. జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావుతో మంచి సంబంధాలున్నాయి. 2009లో అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడింది. టీడీపీ నుంచి నేను.. మా బావ తాటి వెంకటేశ్వర్లు టికెట్ కోసం పోటీపడ్డాం. ఈ పంచాయితీ తేల్చలేక అప్పట్లో అధిష్టానం గెలిచే సీటును సీపీఎంకు ఇచ్చి చేజార్చుకుంది. ఆ తర్వాతా మా ఇద్దరికే పోటీ. 2014లో తాటి నన్ను ఓడించాడు. 2019లో నేను ఆయనను ఓడించి బాకీ తీర్చుకున్నా. నేను ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటూ.. నన్ను కూడా రావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే వారం రోజులు ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు వెళ్లి ఆయనకు దొరక్కుండా తప్పించుకున్నాను. మళ్లీ నేను గెలిచి.. ఆయన ఓడాక కూడా ఒత్తిడి మొదలెట్టారు. చివరకు సీఎం కూడా నాకేం కావాలన్నా సరే అన్నారు. కానీ.. నా వ్యక్తిత్వాన్ని అమ్ముకునేది లేదని తేల్చి చెప్పేశాను. నేను మట్టిని నమ్ముకున్న రైతును.. ఆ మట్టికున్న నిజాయితీ మనకుంటేనే ప్రజలు విశ్వసిస్తారనేది నా నమ్మకం. నాకు ఆ దేవుడు.. ఈ దేవుడనే తేడా లేదు. కాకుంటే సాయిబాబా గుడికి ఎక్కవగా వెళుతుంటా. సాధ్యమైనంత వరకు కుటుంబంతో.. చిన్ననాటి స్నేహితులతో గడుపుతుంటాను. -
‘పార్టీలో చేరితే అవాకులు చవాకులు పేలుతున్నారు’
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గ పాలనను అంతం చేయడంలో భాగంగానే ఎంతో మంది వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. సినీ రంగం నుంచి కూడా ఎంతో మంది వైఎస్ జగన్ నాయకత్వం నచ్చి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇది గిట్టని తెలుగుదేశం నాయకులు వారిపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ముందు సంక్షేమ కార్యక్రమాలతో పేరుతో ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ దశాదిశా మర్చనున్నాయని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 25 ఎంపీ సీట్లు అందించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. ‘ఒక్కసారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వండి అబివృద్ది అంటే ఏంటో చూపిస్తాం’ అన్నారు. -
సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
నాగేశ్వరరావుకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలపై విచారణ జరుపుతున్న అధికారిని బదిలీ చేయడం పట్ల అప్పటి సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేస్తూ ఆయనకు రూ లక్ష జరిమానా విధించింది. నాగేశ్వరరావుతో పాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని ఆయనకూ జరిమానా విధించింది. వీరు చేసినది పొరపాటు కాదని, ఉద్దేశపూర్వకమైన చర్యంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరావు సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను తాను కలలో కూడా ఉల్లంఘించనని పేర్కొన్నారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేసే ముందు కోర్టు అనుమతి కోరకపోవడం తన తప్పిదమేనని సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు అంగీకరించారు. తన పొరపాటును తాను పూర్తిగా తెలుసుకున్నానని, బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటూ తానెన్నడూ కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అనుమతిలేకుండా తాను షెల్టర్ హోం కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేసి ఉండాల్సింది కాదని అఫిడవిట్లో ఆయన స్పష్టం చేశారు. కాగా షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడంపై నాగేశ్వరరావు తీరును గత వారం సుప్రీం కోర్టు ఆక్షేపించింది. న్యాయస్ధానం ఉత్తర్వులతో మీరు చెలగాటమాడారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నాగేశ్వరరావు తీరును తప్పుపట్టారు. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా చేసిన నాగేశ్వారరావుకు కోర్టు నోటీసులు
-
‘సీబీఐ’ కేసు నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎమ్.నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొత్త సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు 2019, జనవరి 24న సమావేశం కానున్న అత్యున్నత ఎంపిక కమిటీలో తానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు మరో బెంచ్‌ను నియమిస్తామని వెల్లడించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాలుచేస్తూ కామన్‌కాజ్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. సీబీఐ డైరెక్టర్ నియామకంలో పారదర్శకత కోసం విధివిధానాలను రూపొందించాలని కామన్‌కాజ్ సంస్థ కోర్టును కోరింది. నాగేశ్వరరావును సెలెక్ట్ కమిటీ సిఫార్సు ఆధారంగా నియమించలేదని తెలిపింది. నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం 2018, అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. కానీ కేంద్రం దుర్బుద్ధితో, ఏకపక్షంగా, ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం (డీపీఎస్ఏ) నిబంధనల్ని తుంగలో తొక్కుతూ నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించిందని పిటిషన్లో పేర్కొంది. డీపీఎస్ చట్టం ప్రకారం వెంటనే నూతన సీబీఐ డైరెక్టర్‌ను నియమించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. అలాగే సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను, ఎంపిక ప్రక్రియలో పాటించిన విధివిధానాలు, సమావేశాల మినిట్స్‌ను సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కింద ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరింది. దీనివల్ల తుది జాబితాలోని అభ్యర్థులకు సంబంధించి ప్రతికూల అంశాలు ఉంటే ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు వీలవుతుందని సూచించింది. -
శ్రీనివాస్‌కు భద్రత కల్పించాలి : జాతీయ ఎస్సీ కమిషన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఏసీపీ నాగేశ్వరరావు బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కమిషన్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీని తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే డీజీపీ బదులు సిట్ అధికారి నాగేశ్వరరావు కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఈ కేసును ఇప్పటికే ఎన్ఐఏకు బదిలీ చేశామని కమిషన్‌కు తెలిపారు. అంతేకాక ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్నాడని చెప్పారు. ఈ నెల 11 శ్రీనివాస రావును మరోసారి కోర్టు ముందు హాజరుపర్చుతామని నాగేశ్వర రావు.. కమిషన్‌కు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషన్ ఈ కేసుతో సంబంధమున్న మిగతా పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించింది. అంతేకాక ఈ విషయమై విశాఖ కమిషనర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం ఈ కేసులో నిందుతుడైన శ్రీనివాస్‌కు, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్.. రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. -
దేశోద్ధారకుడు
‘ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. ‘పరవాలేదు. అమృతాంజనం కూడా మీదే కదా!’ అని చమత్కరించారట రాజాజీ. భారతీయ పత్రికలను బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణలోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి. ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు. కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం. భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రిక ఆవిర్భవించిన నాటికి గట్టుపల్లి శేషాచార్యులు అనే పండితుడు మద్రాసు నుంచి వెలువరిస్తున్న ‘శశిలేఖ’, ఏపీ పార్థసారథినాయుడు (ఇది కూడా మద్రాసులోనే∙అచ్చయ్యేది) నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రకాశిక’, కొండా వెంకటప్పయ్య తదితరులు మచిలీపట్నం నుంచి ప్రచురిస్తున్న ‘కృష్ణాపత్రిక’ ప్రధానంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలు కూడా తెలుగువారికి తెలియాలన్న ఉద్దేశం కూడా పంతులుగారికి ఉండేదట. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు (మే 1, 1867–11 ఏప్రిల్, 1938) కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో పుట్టారు. తండ్రి బుచ్చయ్య, తల్లి శ్యామలాంబ. ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, తరువాత మచిలీపట్నంలోను పూర్తయింది. ఆ చదువు చాలునని తండ్రి అభిప్రాయం. కొడుకు చదువులు, ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్లో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ తల్లి మాత్రం కొడుకు పెద్ద చదువులు చదవాలని పట్టుపట్టి మద్రాసు పంపింది. అక్కడే ఆయన క్రిస్టియన్ కాలేజీలో బీఏలో చేరారు. కానీ ఎందుకో మరి, మధ్యలోనే చదువు విడిచిపెట్టేశారు. అక్కడ ఉండగానే రెంటాల సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు ఆయన మేనకోడలు రామాయమ్మను పంతులుగారు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. ఇందుకు ఆయన తల్లి అంగీకరించలేదు. పెళ్లికి కూడా రాలేదు. 1890 సంవత్సరంలో పెళ్లి జరిగింది. సుబ్బారావుగారు న్యాయవాది మాత్రమే కాదు. వ్యాపారవేత్త. అక్కడే కాబోలు మొదట పంతులుగారిలో వ్యాపారం చేయాలన్న ఆశయం అంకురించింది.అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోను చేరలేదు. బొంబాయి వెళతానని చెప్పారు తల్లికి. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. మళ్లీ తల్లి మాట ధిక్కరించి ఆయన వెళ్లారు. 1892 నుంచి రెండేళ్ల పాటు అక్కడే వ్యాపారం చేశారు. తరువాత ఔషధాల వ్యాపారంలో తర్ఫీదు కోసం కలకత్తా వెళ్లారు. మళ్లీ బొంబాయి చేరుకున్నారు. అక్కడే విలియం అండ్ కో సంస్థలో చేరారు. అది ఐరోపా వారి సంస్థ. ఆ యజమాని అభిమానానికి పంతులుగారు పాత్రులయ్యారు. అదే వరమైంది. ఆ సంస్థ యజమాని స్వదేశం వెళ్లిపోవాలని అనుకున్నాడు. వ్యాపారం మొత్తం పంతులుగారికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వ్యాపారం చేతికి వచ్చాకనే 1899లో పంతులుగారు అమృతాంజనం తయారు చేయడం ఆరంభించారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఇతోధికంగా పెరిగిపోయింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అప్పుడే లక్షలలో ధనం వచ్చిపడింది. తన మందుల దుకాణానికి ‘అమృతాంజనం డిపో’ అని పేరు పెట్టారు. బొంబాయి, కలకత్తా – ఈ రెండు నగరాలు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్నాయి. అప్పటికే రాజకీయంగా ఎంతో చైతన్యం పొందాయి. కలకత్తా బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంతోను, మహారాష్ట్ర భారత జాతీయ కాంగ్రెస్ ప్రభావంతోను ఉద్యమ వేడితో ఉండేవి. ఆ రెండు నగరాల మధ్యనే పంతులుగారు చిరకాలం తిరిగారు. అందుకే అక్కడి ప్రభావం ఆయన మీద బాగా పడింది. తాను వ్యాపారంలో బాగా రాణించి స్థిరపడిన కాలంలో మహారాష్ట్ర పత్రికలు ఇస్తున్న చైతన్యంతో జాతీయ భావధారంలో ఊగుతూ ఉండేది. తెలుగువారి కోసం కూడా ఆ స్థాయిలో పత్రిక నిర్వహించాలని పంతులుగారు ఆకాంక్షించారు. అందుకే మొదట ఆంధ్రపత్రిక వారపత్రికను బొంబాయిలో 1908లో ఆరంభించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన సూరత్ కాంగ్రెస్ సభలకు ఆయన హాజరయ్యారు. అది ఆయన ఆలోచనను మరింత వేగవంతం చేసింది. 1910లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికల ప్రచురణను ఆరంభించారు. ఆ సంచికలు ఇప్పటికీ తెలుగు ప్రాంతంలోని కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. వాటిని చదవడం నిజంగా గొప్ప అనుభవం.అందులో ‘ప్రస్తావన’ పేరుతో ఒక శీర్షిక ఉండేది. అచ్చులో కనీసం నలభై యాభై పేజీలకు తక్కువ కాకుండా ఉండేది. దానిని స్వయంగా పంతులుగారే రాసేవారు. ప్రపంచ యుద్ధకాలంలో కూడా ఈ శీర్షిక దర్శనమిచ్చేది. అయితే కొన్ని పేజీలు తక్కువగా ఉండేవి. న్యూస్ ప్రింట్ కొరత కారణంగా అన్ని పేజీలు ఇవ్వలేకపోతున్నామని ‘గమనిక’లో వాపోయేవారు. ఈ శీర్షిక ప్రపంచం మొత్తం మీద ఒక విహంగ వీక్షణం. వివిధ ప్రపంచ దేశాల విశేషాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలుగు ప్రాంతం, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ వివరాలు అన్నీ అందులో ఉండేవి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు మొత్తం ఆయన ఇందులో విశ్లేషించేవారు. ఆయన 28 ఏళ్ల పాటు ఆ శీర్షిక నిర్వహించారు. అంటే తుదిశ్వాస విడిచేవరకు. కానీ తెలుగువారు బాగా తక్కువగా ఉన్న బొంబాయిలో ఆయన ఇమడలేకపోయారని అనిపిస్తుంది. వ్యాపారం, కుటుంబం, పత్రిక మద్రాసు తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. సూరత్ సభలకు వెళుతూ గిర్గావ్లో ఉన్న పంతులుగారి ఇంటిని ఆనాడు అవటపల్లి నారాయణరావు గారు ఇంకొందరు సందర్శించారు. ఈ అనుభవాన్ని, పంతులుగారి ఆతిథ్యం గురించి అవటపల్లి ఒక వ్యాసంలో చక్కగా వర్ణించారు.భారత స్వాతంత్య్రోద్యమాన్ని అక్షరాలలో దర్శించే భాగ్యమైనా కలిగించినవారు పంతులుగారే. మారుమూల గ్రామాలకు కూడా ఆంధ్రపత్రిక తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యేది. మద్రాస్ చేరుకున్న తరువాత 1914లో ఆంధ్రపత్రిక దినపత్రికను ఆరంభించారు. మరోపక్క వార పత్రిక కూడా వెలువడేది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆంధ్రపత్రిక ఒకే సంవత్సరంలో ఆరంభమైనాయి. పత్రికా నిర్వహణ భారమనుకుంటూనే మరోపక్క ఆంధ్రగ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. స్వయంగా తమ రచనలు ముద్రించుకోలేని ఎందరో రచయితల పుస్తకాలను అచ్చువేయించే పనిని పంతులుగారే చేపట్టారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భగవద్గీతా వ్యాఖ్యానం కూడా అచ్చు వేయించారు. ఇందులో భగవద్గీతా వ్యాఖ్యానం ఆయన జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా రాసినదే. ఇదంతా ఉచితంగా చేశారాయన.కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అసంపూర్ణంగా వదిలేసిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రచురణ భారాన్ని కూడా నాగేశ్వరరావుగారే తలకెత్తుకున్నారు. ఇవి కాక, ఆయన చెన్నపట్నంలో తన కార్యాలయం బయటకు వస్తే చాలు కనీసం అయిదారుగురు అక్కడ వేచి ఉండేవారట. ఒకరు కన్నీళ్లతో తన కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడిగేవారట. ఇంకొకరు తాను రాసిన పుస్తకం అచ్చు వేయించుకునే శక్తి లేదని దీనంగా చెప్పేవారట. ఒక విద్యార్థి పరీక్షకో, ఫీజుకో సాయం చేయమనే వారట. మరొకరు మరొక కారణం– అయితే అందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చి పంపేవారు. వారి బాధ తన బాధగా భావించి ఒక ఉద్వేగంతో ఆయన డబ్బు ఇచ్చేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారు పేర్కొనడం విశేషం. ఆయనకు గాంధీజీయే ‘విశ్వదాత’ అన్న బిరుదును ఇచ్చి గౌరవించారు. దేశోద్ధారక ఆయనకు ఉన్న మరొక బిరుదు. పంతులుగారు గాంధీగారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. తన సొంతూరులో తల్లి శ్యామలాంబగారి పేరుతో ఒక విద్యాలయాన్ని నెలకొల్పి అందులో హరిజన బాలబాలికలకు అవకాశం కల్పించిన మహనీయుడు. వారి దీనస్థితికి చింతిస్తూ రెండెకరాల భూమి కొని అందులో నలభై ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన. 1932లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘానికి ఆయన అధ్యక్షులు కూడా. హిందీ ప్రచారం, ఖద్దరు ఉద్యమం పంతులుగారి జీవితంలో కనిపించే మరో రెండు కోణాలు. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ సభలు జరిగినప్పుడే హిందీ సాహిత్య సమ్మేళనం కూడా జరిగింది. ఆ సభలకు పంతులుగారే ఆహ్వాన సంఘాధ్యక్షులు. విజయవాడలోని నాగేశ్వరరాయ హిందీ భవన్ ఆయన చలవతో ఏర్పడినదే. అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. ఎంత చిన్న గ్రంథాలయమైనా దానికి ఆంధ్రపత్రికను ఉచితంగా పంపేవారాయన. 1919లో మద్రాసులోని గోఖలే హాలులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ సభకీ, ఆంధ్ర సారస్వత సభలకు కూడా ఆయనే సారథి. 1924 సంవత్సరంలో ఆయన ‘భారతి’ మాస పత్రికను నెలకొల్పారు. ఇది ఒక అత్యున్నత అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. ప్రతి సంచిక ఒక ఆణిముత్యమే. సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి– ప్రతి విశిష్ట అంశాన్ని ‘భారతి’లో పాఠకులు దర్శించేవారు. తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక చేసిన సేవ వెలకట్టలేనిది. ఇవన్నీ ఉన్నా స్వాతంత్య్రోద్యమం, ఆం్ర«ధోద్యమం కూడా పంతులుగారి జీవితంలో కీలకంగానే కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర అవతరణకు కీలక ఒప్పందం జరిగిన శ్రీబాగ్ మద్రాసులో పంతులుగారి నివాసమే. 1924, 1929, 1930, 1934 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పంతులుగారే.పంతులుగారి కృషిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఆయన పత్రికా నిర్వాహకుడు. స్వయంగా పత్రికా రచయిత. కళోద్ధారకుడు. చిన్నప్పుడు స్వయంగా నాటకాలలో నటించిన అభిమానం ఆయనకు జీవితాంతం ఉండిపోయింది. అందుకే నాటక కళకు కూడా ఆయన సేవలు దక్కాయి. వీటితో పాటు జీర్ణదేవాలయోద్ధరణ ఇంకొకటి. కాశీనాథుని నాగేశ్వరరావు వంటివారు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగువాడు కావడం నిజంగానే గర్వకారణం. ∙డా. గోపరాజు నారాయణరావు -
ఇదెక్కడి న్యాయమో ‘సుప్రీం’కే తెలియాలి!
సాక్షి, న్యూఢిల్లీ : న్యాయం కోసం వెళితే న్యాయమే వెంటాడిందంటే ఇదేనేమో! ‘అయ్యా ! కేంద్రం అనవసరంగా అర్ధంతరంగా నన్ను సెలవుపై పంపించిందీ, ఇది అన్యాయం’ అంటూ సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆయనపై కేంద్రం చర్య తీసుకోవడం సబబా, కాదా? అన్న అంశాన్ని తేల్చాల్సిన సుప్రీం కోర్టు, ఆ విషయాన్ని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలకు సంబంధించి వర్మపై రెండు వారాల్లోగా ప్రాథమిక దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను శుక్రవారం ఆదేశించింది. విచారణను సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని, అంతవరకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు రోజువారి కార్యకలాపాలను చూడాలే తప్ప ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా దాఖలైన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం, ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను బలవంతంగా సెలవుపై పంపిస్తూ అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. హవాలా కేసులో నిందితుల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై అస్థానాపై వర్మ ఎఫ్ఐఆర్ నమోదు చేశాకనే, వర్మ కూడా అవినీతికి పాల్పడ్డారంటూ అస్థానా ఆరోపణలు చేయడం తెల్సిందే. అవి కేవలం కౌంటర్ ఆరోపణలు మాత్రమే. వర్మపై ఎలాంటి అవినీతి ఆరోపణలు మరెక్కడి నుంచి రాలేదు. సీబీఐ డెరెక్టర్‌ను రెండేళ్ల కాలపరిమితి తీరేవరకు తొలగించడానికి వీల్లేదంటూ 1997 నాటి వినీత్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తొలగించాల్సిన అత్యవసర పరిస్థితులు తలెత్తుతే నియామక కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ స్పష్టం చేస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ను నియమించే కమిటీ అంటే, ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడా కమిటీ అన్నది తెల్సిందే. ఈ కమిటీ అనుమతి లేకుండానే సీబీఐ డైరెక్టర్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఈ చర్యను తప్పు పట్టాల్సిన సుప్రీం కోర్టు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా వర్మపైనే విచారణకు ఆదేశించడం అసాధారణం. అస్థానపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులందరిని తాత్కాలిక నియామకంపై వచ్చిన నాగేశ్వరరావు అర్ధంతరంగా బదిలీ చేస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టు పట్టించుకోకపోవడం మరీ విడ్డూరం. సీబీఐ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదుల మంత్రిత్వ శాఖకు మాత్రం సీబీఐ డైరెక్టర్‌పై దర్యాప్తునకు ఆదేశించామంటూ సుప్రీం కోర్టు మొక్కుబడిగా ఓ నోటీసును పంపించింది. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు ప్రధాని నరేంద్ర మోదీనే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. -
ఉలి అలికిడి విన్నంతనే..
బండరాళ్ల ఊతంగా గుండెలు నిండే మాటలు పలికాడు సి.నారాయణరెడ్డి. అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఆయన రాసిన ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో / ఈ బండల మాటునా ఏ గుండెలు మ్రోగెనో’ పాటలో రాళ్లు మొత్తం సజీవమూర్తులుగా కనబడతాయి. శిల్పిగా జక్కన్న కూడా చేసింది అదేగా, రాళ్లలో రాగాలు పలికించడం! రాళ్లు ఏ కళంకం అంటకుండా మునీశ్వరుల్లా మూలన ఉన్నాయట. రాయి కదలలేదు, కానీ ఉలి అలికిడికి ఉప్పొంగుతుందట. పైన కఠినంగా ఉన్నా దాన్ని చెక్కే మనిషికి అది వెన్నలా కరిగిపోతుందది. మొత్తంగా దీన్నంతటినీ మనిషి స్వభావానికి అన్వయించాడు సినారె. ‘పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనే జలజలమని పొంగిపొరలు ‘పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది ఎస్.రాజేశ్వరరావు. పాడింది ఘంటసాల. 1964లో వచ్చిన ఈ చిత్రానికి బి.ఎస్.రంగా దర్శక నిర్మాత. బి.సరోజాదేవి, అక్కినేని నాగేశ్వరరావు నటీనటులు. -
... జాబిలి వెలిగేను మనకోసమే
ఈ లోకమంతా మన కోసమే ఉందా? ఇందులోని అందం, కాంతి? నచ్చిన మనిషి చెంతవుంటే అలా అనిపించకుండా ఎలా ఉంటుంది? వెన్నెల మనకోసమే కాస్తుంది. పూవులు మనకోసమే పూస్తాయి. ప్రేమికుల ఈ అతిశయపు మనఃస్థితిని దాశరథి ఎంత సున్నితంగా ఆవిష్కరించారు! వాగ్దానం చిత్రం కోసం ఆయన ‘నా కంటిపాపలో నిలిచిపోరా/ నీ వెంట లోకాల గెలువనీరా’ పాట రాశారు. ఈ రెండు వాక్యాలు వాటికవే సాటి. మళ్లీ చరణంలో– ‘ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగేను మనకోసమే నియ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొందాము అందని ఆకాశమే’ అని ముందు నాయిక, తర్వాత నాయకుడు పాడుకుంటారు. ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాల చేరుదమా’ అంటూ దాన్ని తర్వాతి చరణంలో కొనసాగిస్తారు. 1961లో వచ్చిన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం పెండ్యాల నాగేశ్వరరావు. పాడిందేమో సుశీల, ఘంటసాల. నటీనటులు కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆచార్య ఆత్రేయ కావడం విశేషం, పాటలేవీ రాయకుండా. -
వైఎస్సార్సీపీలోకి ‘వసంత’ కుటుంబం
సాక్షి, అమరావతి బ్యూరో : మాజీ హోం మంత్రి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం కృష్ణా జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో పాదయాత్ర సాగిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వారు కలిశారు. వారితోపాటు మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. వసంత నాగేశ్వరరావు, కృష్ణ ప్రసాద్‌లకు జగన్.. కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీల్‌ఛైర్‌పై వచ్చిన నాగేశ్వరరావుతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన మళ్లీ వైఎస్ జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. కృష్ణా జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర మహోద్యమంగా మారుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, పార్టీ నేతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దూలం నాగేశ్వరరావు, కోటగిరి శ్రీధర్, మొండితోక జగన్మోహనరావు, పేర్ని నాని, జోగి రమేష్, యలమంచిలి రవి, ఉప్పాల రామ్‌ప్రసాద్, కాజా రాజకుమార్, హనుమాల సు«ధాకరరావు, ఎం.నరసింహారావు, కోయి సుబ్రహ్మణ్యం, మాగంటి రామారావు, కోటేరు గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో ఏసీబీ సోదాలు
విశాఖ క్రైం : విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖలో ఉద్యోగులంతా ఇన్నాళ్లూ ఎంతో గొప్పగా భావించిన జిల్లా జేసీ–2 కాకర్ల నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో ఇరుక్కోవడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో కీలక అధికారిగా ఉన్న నాగేశ్వరరావు ఇంట్లోనే ఏసీబీ సోదాలు జరగడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారుల్లో గుబులురేగుతోంది. విజయనగరంలో మూడు చోట్ల, విశాఖ నగరంలో ఆరుచోట్ల, బెంగళూరులో ఒక చోట ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో సీఐ గఫూర్, సిబ్బంది విజయనగరంతోపాటు విశాఖపట్నంలోని పెదవాల్తేరు విజయనగర్ ప్యాలెస్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ చంద్ర ఇంట్లో సోదాలు చేశారు. సోదాల్లో రూ. 4.5కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినా... మార్కెట్లో వాటి విలువ రూ.20కోట్లకు పైనే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. జేసీ –2గా కాకర్ల నాగేశ్వరరావు 2017 జూన్ 20వ తేదీన చేరారు. వెలుగుచూసిన ఆస్తులివీ... విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలోని 775 చదరపు అడుగుల ఖాళీ స్థలం. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 484 గజాల స్థలం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కండతామరాపల్లిలో 52సెంట్ల భూమి. అదే గ్రామంలో మరో రెండు చోట్ల 61 సెంట్ల భూమి. కుటుంబ సభ్యుల పేరిట స్థలాలు కుమారుడు రాజేష్‌చంద్ర పేరు మీద తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 14 సెంట్ల ఖాళీ స్థలం, నగరంలోని రేసపువానిపాలెంలో కృష్ణా అపార్ట్మెంట్లో ఒక ప్లాటు, తల్లి ధనలక్ష్మి పేరు మీద సూర్యారావుపేట శశికాంత్‌నగర్‌లో 1250 చదరపు అడుగుల ఇల్లు, ఎండాడలో ఎన్ఎస్ఎన్ రెడ్డి లే అవుట్లో 633 చదరపు గజాల స్థలం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో ఎకరం భూమి, మధురవాడ దరి ఎండాడలో 389 చదరపు గజాల ఖాళీ స్థలం, ఎండాడలోనే 231 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 485 చదరపు గజాల స్థలం వుంది. సీతమ్మధార బాలయ్యశాస్త్రి లే అవుట్లో రూ.68లక్షల విలువ చేసే ప్లాట్ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. బినామీల పేరిట రెండు ఫ్లాట్లు: పెదవాల్తేరు విజయనగర్ప్యాలెస్ లే అవుట్లో 511వ నంబరు గల ఫ్లాట్ శ్రీరామకృష్ణరాజు పేరు మీద వుంది. అదే ప్యాలెస్‌లో మరో ఫ్లాటు రమణమూర్తి రాజు పేరిట వుంది. 705 గ్రాముల బంగారు ఆభరణాలు, 5567 గ్రాముల వెండి, రూ.19.91లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.12.75లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లు, రెండు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి జేసీ–2 వరకూ ప్రస్తుతం విజయనగరం జేసీ–2గా విధులు నిర్వర్తిస్తున్న కాకర్ల నాగేశ్వరరావు 1990 మార్చి 16న తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ బాధ్యతలు మొదలెట్టారు. 1998 జూన్‌లో తహసీల్దారుగా పదోన్నతి పొందారు. అనంతరం పదోన్నతులతో జూన్ 2003న డిప్యూటీ కలెక్టర్‌గా చేరారు. విశాఖ హెచ్‌పీసీఎల్, నర్సీపట్నంలో డీఆర్వోగా విధులు నిర్వర్తించారు. సింహాచలం ల్యాండ్ ప్రొటెక్షన్ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. కాకినాడ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్‌గా చేశారు. ఆర్డీఓగా జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆర్డీవోగా, డుమా పీడీగా, గుంటూరు ఏజేసీగా, విశాఖ డీఆర్వోగా, అన్నవరం ఈఓగా విధులు నిర్వర్తించారు. మే నెలలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఈ ఏసీబీ కేసు ఆయన సర్వీసులో మాయని మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. నాగేశ్వరరావు కుమారుడు రాజేష్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. సోదాలలో డీఎస్పీలు రామకృష్ణప్రసాద్, కరణం రాజేంద్ర, షఖీలా బాను, సీఐలు గణేష్, లక్ష్మాజీ, గొలగాని అప్పారావు, రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టేకులపల్లి తహసిల్దారుపై విచారణ
టేకులపల్లి: టేకులపల్లి తహసిల్దారుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. తనను దుర్భాషలాడారని ఓ గిరిజన మహిళ తహసిల్దారు నాగేశ్వరరావుపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏఎస్పీ సునీల్‌దత్ సోమవారం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. కాగా, కొత్త తహసిల్దారుగా ఎస్.అంజంరాజును నియమించారు. -
పొగాకు ఉత్పత్తులు హానికరం..
విజయనగరం ఫోర్ట్: పొగాకు ఉత్పత్తులు హానికరమని జేసీ–2 నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతి రేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిగరె ట్లు, చుట్ల తాగేవారికంటే ఆ పొగపీల్చే వారికే నష్టం ఎ క్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా స్త్రీ, పురుషల్లో లైంగిక పటుత్వం తగ్గిపోతుందని చెప్పా రు. పొగాకు ఉత్పత్తులు తినడం గాని తాగడం గాని చేయకూడదన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్ఓ జి.రవికుమార్, డీపీఎం బాలాజీ, డీఐసీ సాక్షి గోపాలరావు, డెమో విజయ, తదితరులు పాల్గొన్నారు. దూరంగా ఉండండి.. ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడంతో పాటు వ్యాయామం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సి. పద్మజ సూచించారు. పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ వైద్యుల సంఘం రుపొందించిన కరపత్రాలను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తుల తినడం వల్ల క్యాన్సర్, బ్రాంకలైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘ జిల్లా అధ్యక్షుడు గద్దె చిరంజీవి, ప్రధాన కార్యదర్శి శర్మ, జోనల్ కన్వీనర్ గోపి, ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ కలిగిన యువతతోనే దేశాభివృద్ధి
ఖమ్మం జెడ్పీసెంటర్: క్రమశిక్షణ కలిగిన యువత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇంపాక్ట్-2016 ముగింపు సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో లక్ష్య ఇంజనీరింగ్ కళాశాల, మైడ్యూటీ టు ద సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంపాక్ట్-2016 సదస్సు ముగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులకు, యువతకు చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక సేవతోపాటు విజ్ఞాన వికాసాన్ని అలవర్చుకుని దేశ ప్రతిష్టతను పెంపొందించాలని, ఏ కష్టాన్ని అయినా జయిచేందుకు సిద్ధం కావాలని సూచించారు. మై డ్యూటీ టు ద సొసైటీ ఫౌండేషన్ చైర్మన్ కొప్పురావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంపాక్ట్-2016 ద్వారా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, పట్టభద్రులు, ఆయా రంగాల్లో నైపుణ్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా తన బాధ్యతను కచ్చితంగా నిర్వహిస్తాడో అనుకున్న లక్ష్యాన్ని సులువుగా సాధిస్తాడని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు జేసీ నర్సింహారావు మాట్లాడుతూ శోధించి సాధించి పనిచేస్తే ఎంతటి కఠినమైన పని అయినప్పటికీ సులువుగా చేసుకోవచ్చన్నారు. నల్లమోతు శ్రీధర్ మాట్లాడుతూ సత్పవ్రర్తన కలిగి ఉంటే మంచి గుర్తింపును సాధిస్తారన్నారు. జేఎస్ పెద్దిరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చిత్రపటాల నేర్పించాలని చెప్పారు. సినీ ప్రముఖుడు, రచరుుత, దర్శకుడు, నటుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు కేవీ ప్రదీప్ మాట్లాడుతూ చదువు, డబ్బు ఎవరి పక్కన రావని, క్యారెక్టర్ మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో లక్ష్మీపురం వేణుగోపాల్, మై డ్యూటీ టు ద సొసైటీ ఫౌండర్ కొప్పూరావూరి ఆంజనేయులు, సభ్యులు రత్నకుమారి, మంజుల, సంకీర్త్, సుమంత్, రామకృష్ణ, ప్రిన్సిపాల్ రఘురాం, మల్లికార్జున్, మురళీకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఏయూ పీఠంపై పల్నాటి బిడ్డ
గుంటూరు జిల్లా వాసిని వరించిన ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవి పేదరికం నుంచి ఉన్నత శిఖరానికి నాగేశ్వరరావు ప్రస్థానం గురజాల మండలం జంగమహేశ్వరపురం స్వస్థలం తలదాచుకోవడానికి సొంత గూడు లేక.. చదువుకోవడానికి డబ్బుల్లేక.తింటానికి సరైన తిండిలేక ఇలా బాల్యంలో పేదరికం విసిరిన సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించారు. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని మేథోశక్తిని మధించారు..ప్రతి తరగతి గదిలో ఉత్తమ ఫలితాలతో గర్జించి..ప్రభుత్వం అందించే స్కాలర్షిప్లను తమ వాకిట ముంగిటకు నడిపించారు. వాటినే ఆసరాగా చేసుకుని ఉన్నత విద్యా శిఖరాల వైపు అడుగులు వేశారు. ఓనమాలు దిద్దిన యూనివర్సిటీలో అగ్ర పీఠం తనను వెతుక్కుంటూ వచ్చేలా విజయనాదం చేశారు. జన్మనిచ్చిన పల్నాట గడ్డకు వన్నె తెచ్చి..మట్టిలో మాణిక్యంగా మెరిసిపోతున్నారు ఆంధ్రా వర్సిటీ వైస్ చాన్సలర్ నాగేశ్వరరావు. సాక్షి, గుంటూరు: కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అనడానికి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా నియమితులైన గొల్లపల్లి నాగేశ్వరరావు ఉదాహరణ. తండ్రి ఆర్థిక పరిస్థితిని సైతం లెక్క చేయకుండా స్కాలర్ప్లతో చదువుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారు. నేడు చదువుకున్న యూనివర్సిటీలోనే అగ్ర పీఠాన్ని అధిరోహించారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని గురజాల మండలం జంగమహేశ్వరపురం. గొల్లపల్లి నర్సయ్య, అనసూయమ్మ దంపతుల రెండో సంతానం నాగేశ్వరరావు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లు. వీరికి సొంత ఇల్లు కూడా లేదు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే చదువుపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలోని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉంచారు. అక్కడే ఒకటి నుంచి ఐదు వరకు ప్రభుత్వ పాఠశాల్లో చదివించారు. అనంతరం రెంటచింతలలోని వైఆర్ఎస్ పాఠశాలలో పదో తరగతి వరకు స్కాలర్‌షిప్‌పై చదువుకున్నారు. మాచర్లలోని ఎస్కేబీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మెరిట్ స్కాలర్షిప్ సాయంతో 1979లో ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసి 1981– 84 మధ్యలో ఎంఫిల్ చదివారు. 1985 నుంచి 89 వరకు పీహెచ్డీ చదివి 1990లో ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంటŒæప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందారు. కుటుంబ నేపథ్యం.. గొల్లపల్లి నాగేశ్వరరావు 1986లో పీహెచ్డీ చేస్తుండగానే బొల్లాపల్లి మండలం రెడ్డిపాలేనికి చెందిన రాజారపు జ్ఞానయ్య మాస్టారు కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. ఆమె ఇంగ్లిషు టీచర్ కావడంతో ఆ ఇల్లు చదువులకు నిలయంగా మారింది. నాగేశ్వరరావుకు అర్చన, నవ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహాలు చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకున్నారు. వెనుతిరగకుండా ముందుకు సాగుతూ ... ఇక అక్కడి నుంచి నాగేశ్వరరావు ప్రస్థానం వెనక్కు చూడాల్సిన పని లేకుండా సాగింది. 2000 సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ ఉత్తమ పరిశోధకునిగా అవార్డు అందుకున్నారు. 2008లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యావేత్త అవార్డును పొందారు. 2014లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆచార్య అవార్డు అందుకున్నారు. ఏయూలో చీఫ్ వార్డెన్‌గా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌గా, క్యాంపస్ ప్రవేశాల విభాగం అసోసియేట్ డైరెక్టర్‌గా, స్కూల్æఆఫ్ కెమిస్ట్రీ డైరెక్టర్‌గా, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా, సైన్స్ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారిగా పని చేశారు. ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపార్టుమెంట్ హెచ్ఓడీ పదవిలో ఉండగా ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉన్నత పీఠం వరించింది. దీంతో జంగమేశ్వరపురం, గంగిరెడ్డిపాలెం, రెంటచింతల, మాచర్లలోని ఆయన బంధువులు, స్నేహితులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. చిన్నతనం నుంచే నాగేశ్వరరావుకు చదువంటే ఇష్టం.. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే చదువుకోవాలనే మక్కువ ఎక్కువగా ఉండేది. అయితే మా బాబాయి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గంగిరెడ్డిపాలెంలోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దే ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. డిగ్రీ వరకు చదివి ఏదో ఉద్యోగం చేస్తాడనుకున్నాను. ఇంతటి స్థాయికి ఎదుగుతాడని ఊహించలేదు. మాకెంతో ఆనందంగా ఉంది. – నాగేశ్వరరావు, అన్న, జంగమహేశ్వరపురం -
బీజేపీ నాయకుడు నాగేశ్వరరావు మృతి
చిలువూరు (దుగ్గిరాల) : చిలువూరుకు చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోటా నాగేశ్వరరావు (70) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని మంగళవారం పలువురు బీజేపీ నాయకులు సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు గారపాటి పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొంగర జోగేంద్రప్రసాద్, కొండపనేని రవీంద్రరావు తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన స్వల్ప వివాదం
ఇద్దరి మధ్య ఘర్షణ చేపల వ్యాపారి మృతి మచిలీపట్నం (కోనేరుసెంటర్) : మచిలీపట్నంలో ఇరువురి మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఆదివారం మచిలీపట్నంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ బి. వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన లంకే నాగేశ్వరరావు చేపల మార్కెట్లో వ్యాపారం చేస్తుం టాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగేశ్వరరావు కొన్ని రోజుల క్రితం తన స్నానాల గది నుంచి వాడుక నీరు బయటికి పోయేలా ఇంటికి ఆనుకుని ఉన్న పంటబోదెలోకి పైపును అమర్చాడు. అదే కాలనీకి చెందిన కాకర్ల చంద్రరావుకు నాగేశ్వరరావు ఇంటి లైనులో కొంత స్థలం ఉంది. పైపు గుండా నాగేశ్వరరావు ఇంట్లోని వాడుక నీరు పంట బోదెలోకి చేరి చంద్రరావు స్థలం వైపుగా పారుతోంది. దీంతో చంద్రరావు నాగేశ్వరరావు ఇంట్లోని మురుగునీరు అంతా పంటబోదె గుండా తన స్థలం వైపు పారుతోందని స్థానికంగా ఉన్న నీటి సంఘం అధ్యక్షునికి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు నీటి సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావును పిలిచి పైపు కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, పైపును అక్కడి నుంచి తీసేయాలని సూచించాడు. అందుకు నాగేశ్వరరావు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని పైపును తీసేస్తానని చెప్పాడు. అక్కడితో సమస్య సద్దుమణిగిపోయింది. కాగా చంద్రరావు తన స్థలంలో మెరక పనులు చేయించుకుంటూ పంటబోదె పనుల కోసం వచ్చిన జేసీబీ డ్రైవర్‌కు బోదెలోకి ఉన్న పైపును చూపించి తప్పించాలని సూచించాడు. ఇది గమనించిన నాగేశ్వరరావు చంద్రరావుతో వాగ్వివాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు చంద్రరావుతో పెనుగులాటకు దిగాడు. చంద్రరావు చేతిలోని గొడుగు కర్రతో నాగేశ్వరరావు తలపై కొట్టి ముందుకు నెట్టాడు. జరిగిన పెనుగులాటలో నాగేశ్వరరావు తల సమీపంలోని గోడకు గుద్దుకుంది. నాగేశ్వరరావు స్పృహ కోల్పోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. టౌన్ సీఐ వరప్రసాద్, మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్సైలు ఎండీ అష్ఫాక్, హబీబ్ బాషాలు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు నాగేంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఏయూ వీసీగా నాగేశ్వరరావు?
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆచార్య జి.నాగేశ్వరరావు నియమితులైనట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం నుంచి ఈ విష యం క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మా రింది. ఏయూ వీసీగా బీసీ సామాజిక వర్గానికి చెం దిన వ్యక్తిని నియమిస్తారని గత కొంత కాలంగా వినిపిస్తోంది. అందుకు తగినట్లే సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ముగ్గురు పేర్ల జాబితాలో ఆచార్య నాగేశ్వరరావు పేరు ముందు వరుసలో ఉన్నట్లు గత నెల రోజులుగా చర్చ జరుగుతోంది. కాగా గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏయూ వీసీగా నాగేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. వివిధ చానళ్లు, వెబ్సైట్లలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఫైలుపై గవర్నర్ సంకతం అనంతరం సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వ జీవోలు పొందుపరిచే వెబ్సైట్ మధ్యాహ్నం నుంచి పనిచేయకపోవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. నేడో, రేపో వీసీ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. కాగా ఆచార్య జి.నాగేశ్వరరావు ప్రస్తుతం ఏయూ సైన్స్ కళాశాల ప్లేస్మెంట్ అధికారిగా, అసోసియేట్ ప్లేస్మెంట్ అధికారిగా సేవలు అందిస్తున్నారు. పరిశోధనల్లో 36 మందికి మార్గదర్శనం చేశారు. రసాయన శాస్త్రంలో ఇనార్గానిక్ విభాగ నిపుణుడిగా సుపరిచితులు. -
‘పచ్చ’ తెచ్చిన వివాదం
ఆటో యూనియన్‌లో చీలిక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన పోలీసులు అచ్యుతాపురం: ఆటో స్టాండ్‌లో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో కుండలకు పసుపు రుంగుపూయడం వివాదానికి దారితీసింది. పసుపురంగు వేయడాన్ని వ్యతిరేకించినందుకు నాగేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ పై కక్షసాధింపునకు దిగారు. వివరాలు ఇలా ఉన్నా యి. యలమంచిలో రోడ్డులో మంగళవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దేశంపార్టీ నాయకులు దీనినిప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కుండలకు పసుపు పసుపు రంగు పూశారు. యూనియన్‌లో 250 మంది సభ్యులు ఉన్నారు. ఒక వర్గం సభ్యులకు పసుపు రంగుపూయడం నచ్చలేదు. ఆ వర్గం తరఫున గొర్లెధర్మవరానికి చెందిన నాగేశ్వరావు అనే ఆటోడ్రైవర్ యూనియన్ కార్యవర్గాన్ని ప్రశ్నించాడు. అధికారపార్టీ నాయకులని పిలిచి ప్రారంభించడంవరకూ అభ్యంతరం లేదని, కానీ కుండలకు పసుపు రంగుపూసి యూనియన్ని దేశంపార్టీకి తాకట్టుపెట్టడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ విషయం దేశంపార్టీ నాయకులవరకూ వెళ్లింది. పోలీసులను రంగంలోకి దిం చారు. నాగేశ్వరావు ఆదుపులోకి తీసుకున్నారు. ఆరు గంటలపాటు నాగేశ్వరావుని స్టేషన్లో కూర్చోబెట్టారు. గొడవ జరిగితే ఇరువర్గాలను పిలిచి మాట్లాడాలిగాని ఒక వ్యక్తిపై కక్షకట్టడం ఏమిటని మీడియా జోక్యంచేసుకోవడంతో ఎట్టకేలకు నాగేశ్వరావుని విడిచిపెట్టారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
పెరుగుతున్న ఎండలకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడులో ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెందాడు. గ్రామానికి చెందిన కొలక నాగేశ్వరరావు(41) సొంత పని పై ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. -
సైకిల్‌ను ఢీకొన్న బైక్.. వృద్దుడి మృతి
చెరుకుపల్లి (గుంటూరు జిల్లా): చెరుకుపల్లి మండలం ఏమినేనివారి పాలెం వద్ద సైకిల్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు (62) అనే వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేడు పాఠశాలలు పనిచేయాలి
చిత్తూరు (గిరింపేట): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయాలని డీఈవో నాగేశ్వరరావు ఆదే శించారు. గత ఏడాది జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా ఇచ్చిన సెలవులకు ప్రత్యామ్నాయంగా ఈ నెలలో రెండో శనివారాన్ని పని దినంగా పాఠశాలలు నిర్వహించాలని తెలిపారు. కాగా, ఈ విషయాన్ని జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంలకు శుక్రవారం సాయంత్రం పాఠశాల సమయం పూర్తయ్యేలోగా సందేశాల రూపంలో అందజేయాల్సి ఉంటుంది. అయితే ఆ విషయాన్ని శుక్రవారం రాత్రి 7 గంటలకు తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో దాదాపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు శనివారం సెలవు దినమని బాధ్యులు ప్రకటించారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో శనివారం పాఠశాలలను నిర్వహించినా చాలా మంది విద్యార్థులు డుమ్మా కొట్టడం ఖాయమని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంటున్నారు. -
టీడీపీ నేతపై కేసు నమోదు
సత్తెనపల్లి: మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్కూరి నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన వైఎన్ షాపు పక్కన నాగేశ్వరరావు ఇటీవల దేవుడి బొమ్మ ఏర్పాటు చేశారు. దానిని ఓ వర్గం వారు తొలగించారు. వారికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొడుతుండటంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నడుస్తోంది. -
నా భార్య మోసం చేసింది
మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం సెల్ఫ్ వీడియోలో ‘మరణ వాంగ్మూలం’ రికార్డు గాంధీ ఆస్పత్రి : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందని, తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనికి దారితీసిన పరిస్థితుల్ని తన సెల్ఫోన్లో సెల్ఫ్ వీడియో ద్వారా చిత్రీకరించాడు. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన డి.నాగేశ్వరరావు(28) కరాటే మాస్టర్. బామవరిది చెల్లెలైన బాపట్లకు చెందిన వరలక్షి్ష్మని ప్రేమించి గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నాడు. వరలక్షి్ష్మ హైదరాబాద్ చంచల్‌గూడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. బన్సీలాల్‌పేటలో వీరి నివాసం. తెనాలిలోనే ఉంటున్న నాగేశ్వరరావు వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి వెళతాడు. కొద్దిరోజులగా వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు గమనించిన నాగేశ్వరరావు... ఆమె ఓ వ్యక్తితో చాటింగ్ చేస్తుండగా చూసి మందలించాడు. ఆమెలో మార్పు లేకపోవడంతో విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లగా వారు కౌన్సెలింగ్ చేశారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో నాగేశ్వరరావు మంగళవారం బన్సీలాల్‌పేటలోని ఇంట్లో పురుగుల మందు తాగి నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న నాగేశ్వరరావును గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య తనను మోసం చేసి పదిమందిలో పరువు తీసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తమకు నాగేశ్వరరావు ఫోన్ చేసి చెప్పాడని అతడి తల్లి పాపమ్మ, సోదరి ఆదిలక్షి్ష్మ ఆస్పత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. అదే విషయాన్ని తన వీడియోలో బందించాడు బాధితుడు. నాగేశ్వరరావు తండ్రి పోలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, తనను వెంటపడి పెళ్లి చేసుకున్న నాగేశ్వరరావు అనుమానంతో నిత్యం వేధించేవాడని వరలక్ష్మి చెప్పారు. -
ఆ ఆరుగురిలో ఇద్దరు రైతుల మృతి
గుంటూరు: దేవాలయ భూములను వేలం వేయకూడదంటూ ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం తాడిపర్రు గ్రామంలో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. బోసు అనే రైతు ఆరోజే మృతి చెందగా, బుధవారం ఉదయం నాగేశ్వరరావు అనే రైతు ప్రాణాలు వదిలాడు. దీంతో ఆగ్రహించిన అఖిలపక్ష నేతలు బుధవారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రైతు మృతదేహంతో ధర్నాకు దిగారు. మృతిచెందిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబంలో అర్హులైన వారికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారు సాగుచేసుకుంటున్న భూమిని వారికే అప్పగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కాంతిలాల్ దండే సంఘటన స్థలానికి వచ్చి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని.. అడిగిన డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో అఖిలపక్ష నేతలు ఆందోళన విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, నేత లేళ్ల అప్పిరెడ్డి, సీపీఐ నేతలు, ప్రజాసంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. -
డ్రైవర్ టు డెరైక్టర్
సినిమాలంటే చాలా ఇష్టం వరంగల్‌లో సూపర్ లొకేషన్లు ‘ఒక్కడితో మొదలైంది’ డెరైక్టర్ నాగేశ్వర్ రావు పోచమ్మమైదాన్ : డ్రైవర్ నుంచి డెరైక్టర్‌గా ఎదగడం.. పొంతన లేదు కదూ! కావాల్సినంత ఆసక్తి మాత్రం ఉంది. సినిమాపై ఎనలేని ఇష్టం వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు ‘ఒక్కడితో మొదలైంది’ చిత్ర దర్శకుడు మొగిళి నాగేశ్వర్రావు. తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి లొకేషన్లు చూసేందుకు ఆదివారం వరంగల్‌కు వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించింది. ఆయన మాటల్లోనే.. అలా సినిమాలు చూసేవాణ్ని నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే చాలా ఇష్టం. స్కూల్‌కు వెళ్లే సవుయంలో చాక్లెట్ల కోసం తరచూ ఇంట్లో డబ్బులడిగే వాణ్ని. వాటిని కూడబెట్టి సినిమాకు వెళ్లేవాణ్ని. తర్వాత కొత్త సినిమా రిలీజైతే చాలు కాలేజీ బంక్ కొట్టి చూసేవాణ్ని. ఆ ఇష్టం కాస్తా ఇండస్ట్రీ వైపు నడిపించింది. వరంగల్‌లోనే తీశాను.. ఒక్కడితో మొదలైంది చిత్రాన్ని జిల్లాలోఏ 70 శాతం చిత్రీకరించాను. లో బడ్జెట్ లో సూపర్ లొకేషన్లు ఇక్కడ ఉన్నారుు. నా తదుపరి చిత్రం కోసం లొకేషన్లు అన్వేషించేం దుకు వచ్చాను. కాశిబుగ్గకు చెందిన పాషా, సత్యనారాయణ కొత్త లొకేషన్లు చూపిస్తారు. త్వరలో చక్రి స్మారక కార్యక్రమం.. ఖమ్మంలో చక్రి స్మారక కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తాం. వృద్ధ కళాకారులను ఘనంగా సన్మానించి ఆ రోజును చక్రికి అంకితం చేస్తాం. సినీ ప్రముఖులను ఆహ్వానిస్తాం. చక్రి అన్న పాటలు అంటే నాకు ప్రాణం. ఆయన మరణించిన సమయంలో అందుబాటులో లేను. ఇలా డెరైక్టర్ అయ్యూను.. మా కుటుంబం కష్టాల్లో ఉండడంతో చదువు ఆపేసి డ్రైవర్ శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో తెలిసిన వారి ద్వారా సినిమా ఫైనాన్సియర్ జగదీశ్వర్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాను. పరిచయమైన డెరైక్టర్ల వద్ద మెళకువలు నేర్చుక్నునారు. నాకో పాత్ర ఇప్పించండి అని ఓ రోజు జగదీశ్వర్ రెడ్డి సార్‌ను అడిగాను. మనమే ఓ సినిమా తీద్దాం అన్నారాయన. తర్వాత జీవితం అనే సీరియల్, ‘తొలి అడుగు’ వీడియో సాంగ్స్ తీసి విజయవంతమయ్యూ. ఓ మిత్రుడు నన్ను దర్శకుడిగా మారమని, తాను ప్రొడ్యూస్ చేస్తానని అడిగాడు. అలా ‘ఒక్కడితో మొదలైంది’ చిత్రం పురుడుపోసుకుంది. మరో 20 రోజుల్లో సినిమాను రిలీజ్ చేస్తాం. -
ప్రేమను గెలిచాడా?
ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? అనే కథాంశంతో సుధాకర్ పట్నం, నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లికి ముందు ప్రేమకథ’. ప్రిన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్, సునయన కథానాయికలు. మధు గోపు దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అనంత్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ‘అల్లరి’ నరేశ్ క్లాప్ ఇచ్చారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. కథాకథనాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: రవికుమార్. -
నాన్న మన మనస్సుల్లోనే ఉంటారు: నాగార్జున
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని నెలకొల్పారు. నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ హీరో నాగార్జున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏఎన్ఆర్ ఎప్పుడూ మన మనస్సుల్లోనే ఉంటారని నాగార్జున అన్నారు. బుధవారం గుడివాడలో ఏఎన్ఆర్ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పలు రంగాల్లో ప్రముఖులైన వారికి నాగార్జున అవార్డులను ప్రదానం చేశారు. క్రీడారంగంలో విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతికి, సామాజిక సేవారంగంలో వంశీ రామరాజుకు, విద్యారంగంలో ఎంఎన్ రాజుకు, న్యాయరంగంలో జస్టిస్ పర్వతరావుకు, సివిల్ సర్వీసుల రంగంలో సంపత్‌కుమార్‌కు అవార్డులు అందజేశారు. వీరితో పాటు సినిమా రంగంలో రాఘవేంద్రరావుకు, ఆరోగ్యరంగంలో గోపిచంద్‌కు, వరప్రసాద్రెడ్డికి కూడా అవార్డులు ఇచ్చారు. -
బెజవాడలో ముగ్గురి దారుణహత్య
పాత కక్షలతో తండ్రి, ఇద్దరు కొడుకులపై కాల్పులు హత్య కేసులో కోర్టు వాయిదాకు కారులో వస్తుండగా ఘటన జాతీయ రహదారిపైనే తెగబడిన దుండగులు కిరాయి హంతకుల పనేనని పోలీసుల అనుమానం విజయవాడ: ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకున్నాయి. గతంలో జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్రత్యర్థులు వారిని కిరాతకంగా హతమార్చా రు. పాత కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేం దుకు కారులో వస్తున్న ఇద్దరు నిందితులతో పాటు వారి తండ్రిని విజయవాడ సమీపంలో దారికాచి తుపాకులతో కాల్చి చంపారు. కారు డ్రైవరు పరారై పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో 5వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్యర్థుల కాల్పుల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన గందోడి(గంధం) నాగేశ్వరరావు(55), అతని కుమారులు పగిడి మారయ్య(36), గుంజుడు మారయ్య(32) మృతి చెందారు. వీరిపై 18 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగి పోలీసులు వివరించారు. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్యుడు భూతం దుర్గారావు హత్య కేసులో ఆయన బంధువు కూరపాటి నాగరాజుతోపాటు ఇతని సోదరి కుమారులైన ఇద్దరు మారయ్యలు కూడా నిందితులుగా ఉన్నారు. హత్య జరిగినప్పటి నుంచి దుర్గారావు, నాగరాజు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితులంతా ముంబైలో తలదాచుకుంటున్నారు. అయితే ఏలూరు జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతుండటంతో వాయిదాలకు మాత్రం వచ్చి వెళుతున్నారు. బుధవారం కూడా వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మారయ్యలను వారి తండ్రి నాగేశ్వరరావు కలుసుకున్నారు. అక్కడి నుంచి అద్దె కారులో ఏలూరు బయల్దేరారు. పెదఅవుటుపల్లి సమీపంలోకి రాగానే వీరి కారును కొందరు దుండగులు తమ వాహనంతో ఢీకొట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ హతమార్చారు. ఘటనా స్థలాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. కేసు దర్యాప్తుకు, హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దుండగుల వేషధారణ, భాష, కాల్పులు జరిపిన తీరును బట్టి ముంబై లేదా హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు వాడిన వాహనాన్ని హనుమాన్‌జంక్షన్‌లో వదిలేసి వెళ్లడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి దుండగులు రాజమండ్రి వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. కాగా, దుండగులు వాడిన వాహనం దుర్గారావు సోదరుడు శ్రీనివాస్‌దని దర్యాప్తులో తేలింది. -
ప్రియుడిపై హత్య, హత్యాయత్నం కేసులు
సామర్లకోట : సామర్లకోటలో శుక్రవారం రాత్రి తల్లీబిడ్డలను చెరువులోకి తోసేసిన ఘటనలో నిందితుడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు సీఐ కె.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి సెంటర్ నుంచి దిగువ భాగంలో ఉన్న సుగర్‌ఫ్యాక్టరీ చెరువులోకి శుక్రవారం ఓ వివాహితను, ఆమె ఏడాది బిడ్డను ఆమె ప్రియుడు తోసివేసిన విషయం తెలిసిందే. ఘటనలో బాలుడు మృతి చెందగా, బాధితరాలు సత్యవేణి (మణి) ప్రాణాలతో బయట పడ్డారు. సత్యవేణి ఫిర్యాదు మేరకు 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు. ఆయన కథనం ప్రకారం కాట్రావులపల్లికి చెందిన సత్యవేణికి వేలంగికి చెందిన మడికి బాలరాజుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది క్రితం బాలరాజు సత్యవేణిని వదలి వేయడంతో బత్సల శేషుతో ఆమెకు పరిచయమైంది. దీంతో గత మూడు నెలలుగా ఆమె అతనితో కలిసి జగ్గంపేటలో నివాసం ఉంటుంది. శేషుకు కూడా పెళ్లైంది. సత్యవేణి తనను రెండో భార్యగా ఇంటికి తీసుకువెళ్లాలని శేషును ఒత్తిడి చేస్తుండడంతో శేషు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆమెను ఆమె బిడ్డను ఆటోలో సామర్లకోట తీసుకొచ్చాడు. స్టేషన్ సెంటర్ నుంచి సత్యవేణిని ఆమె బిడ్డను బ్రిడ్జి మీదకు తీసుకెళ్లి అకస్మాత్తుగా వారిని చెరువులోకి తోసేశాడు. బాలుడు మృతిచెందగా, సత్యవేణి ప్రాణాలతో బయటపడ్డారు. భర్త నుంచి విడి పొయే సమయంలో సత్యవేణి మూడు నెలల గర్భిణి. శనివారం ఘటన స్థలాన్ని సీఐ నాగేశ్వరరావు, ఎస్సైలు ఎం.డి.ఎం.ఆర్.ఆలీఖాన్, నాగార్జున ఇతర సిబ్బంది పరిశీలించారు. నిందితుడు శేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
సీబీఐ వలలో రైల్వే అధికారి, స్కూల్ ప్రిన్సిపాల్
సాక్షి, హైదరాబాద్: మహిళాటీచరు నుంచి రూ.లక్ష నగదు, రూ.2 లక్షల చెక్‌ను తీసుకుంటూ.. రైల్వే స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, రైల్వే సూపరింటెండెంట్ కె.నర్సింహులు గురువారం సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. సికింద్రాబాద్‌లోని రైల్వే సీబీఎస్సీ స్కూల్లో విజయగౌరి టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఎస్సీ కులధ్రువీకరణ పత్రంతో అక్రమంగా ఉద్యోగం పొందిందని, ఈ విషయమై రైల్వే విజిలెన్స్ విచారణ జరుపుతున్నదని నాగేశ్వరరావు, నర్సింహులు విజయగౌరిని బెదరించారు. ఈ విషయంలో చర్య తీసుకోకుండా ఉండాలంటే రూ.3లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు గురువారం స్కూల్ వద్ద మాటువేసి విజయగౌరి నుంచి లంచం తీసుకుంటుండగా నాగేశ్వరరావు,నర్సింహులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టుచేశారు. -
సోంపేట ఎంపీపీ ఎంపికపై టీడీపీలో పోరు
సోంపేట: సోంపేట మండల అధ్యక్షుని గా పట్టణానికి చెంది న 5వ వార్డు ఎంపీటీసీ సభ్యుడు చిత్రాడ శ్రీనును ఎన్నుకున్నట్లు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్పష్టం చేశారు. పట్టణంలోని శైలజా కల్యాణ మండపంలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ టీడీపీ మండల కార్యకర్తలు, సర్పంచ్‌లు, ప్రాదేశిక సభ్యులతో కలసి ఎంపీపీ ఎన్నికపై సమావేశం నిర్వహించారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు సూరడ చంద్రమోహన్, మండలాధ్యక్షుడు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎంపీపీగా చిత్రాడ శ్రీనుని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ ప్రకటించడంతో పదవి ఆశించిన బిన్నళ జగన్నాథం నిరాశకు గురయ్యూరు. పార్టీ నాయకులు సోంపేట సర్పంచ్ చిత్రాడ నాగరత్నం ,శేఖర్,జి.కె నాయుడు, దెవు చిట్టిబాబు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. అలిగి బయటకు వెళ్లిపోయిన జగన్నాథం... ఎంపీపీ పేరు ప్రకటించగానే టీడీపీ సీనియర్ నాయకుడు తాళభద్ర ఎంపీటీసీ బిన్నళ జగన్నాథం తన అనుచరులతో కలసి సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. పలాస ఎమ్మెల్యే తీరుపై ఆయన భగ్గుమన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లడం, ఆస్తులు అమ్ముకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని ఆవేదన చెందారు. శివాజీ నమ్మించి మోసం చేశాడని తీవ్ర పదజాలంతో దుర్భషలాడారు. ఎమ్మెల్యే అశోక్ వారిని సముదాయించి పంపించారు. -
వివాహితకు ఫోన్లో వేధింపులు
ఉప్పలగుప్తం : ఇటీవల వివాహమైన తన కు ఫోన్ చేసి వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్తతో కలిసి ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్ ముందు మంగళవారం రాత్రి బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ ఏడాది మార్చి ఏడున కిత్తనచెరువుకు చెందిన పులపర్తి నానిబాబుతో సత్యశైలకు వివాహమైంది. అదే గ్రామానికి చెందిన పోతుల నాగేశ్వరరావు(నాగు) అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పినా.. నాగేశ్వరరావు నుంచి ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దల ద్వారా చెప్పించినా.. ఎస్సై స్వామినాయుడు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ భార్యాభర్తలు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మాజీ సర్పంచ్ యల్లమిల్లి రాముతో పాటు పలువురు గ్రామస్తులు వారికి అండగా నిలిచారు. దీనిపై ఎస్సై స్వామినాయుడును వివరణ కోరగా, ఆ వ్యక్తిని పిలిపిస్తానని చెప్పారు. -
45 రోజుల్లో సమస్య పరిష్కారం
విజయనగరం మున్సిపాలిటీ:విద్యుత్ వినియోగదారుల సమస్యలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ పి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందు కోసం 180042555333 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయూలని సూచించారు. వినియోగదారులు తెల్లకాగితంపై తమ సమస్యను నేరుగాగానీ, పోస్టులోగానీ ఫిర్యాదు చేసినా స్వీకరించి తగు న్యాయం చేస్తామని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర సేవలు పొందాలని సూచించారు. దాసన్నపేట విద్యుత్ భవన్లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, అంతరాయం, మీటర్ సమస్యలు, బిల్లులు అధికంగా రావటం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర అంశాలపై ఫిర్యాదు చేసే హక్కు ఉందన్నారు. వినియోగదారులు తమ సమస్యను వేదికలో విన్నవించుకున్న 45 రోజుల్లో పరిష్కరిస్తుందన్నారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఇదే తరహాలో ఫిర్యాదు చేయవచ్చని గుర్తు చేశారు. సమీపంలో ఉన్న కాల్‌సెంటర్‌కు వెళ్లి తమ సమస్యను నమోదు చేయించుకుంటే ఏఈ, ఏఓలు సమస్యను పరిష్కరిస్తారన్నారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సంస్థ పరిధిలో ఐదు జిల్లాల్లో మొత్తం 582 ఫిర్యాదులు రాగా అందులో 503 ఫిర్యాదులను పరిష్కరించామని మిగిలిన 73 ఫిర్యాదులను త్వరలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి 72 ఫిర్యాదులు రాగా 7 ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 63 ఫిర్యాదులు రాగా 11, విశాఖపట్టణం జిల్లా లో 168 ఫిర్యాదులు రాగా 14, రాజమండ్రిలో 130 ఫిర్యాదులు రాగా 12, ఏలూరులో 149 ఫిర్యాదులు రాగా 29 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. వీటన్నిం టినీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు పీఎస్ కుమార్, యు.కె.వి.రామకృష్ణరాజు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ విజయనగరం డీఈ నాగి రెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఏఓ వెంకటరాజు, పట్టణ ఏడీఈ బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. పరిష్కార వేదికకు 11 ఫిర్యాదులు... వినియోగదారుల సమస్యలను పరిష్కరించటంలో భాగం గా దాసన్నపేట విద్యుత్ భవన్లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి 11 ఫిర్యాదులు అందాయి. ఇందులో ప్రధానంగా నెల్లిమర్ల, జామి ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు తమకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరైనప్పటకీ సర్వీస్ నంబర్లు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. వీటీ అగ్రహరంలో ఓల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోందని, కామాక్షి నగర్లో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఫిర్యాదులు వచ్చాయి. పేర్లు మార్పు, మీటర్ రీడింగ్ సమస్యలపై ఫిర్యాదులు రాగా రెండు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వీటిని వేదిక చైర్మన్ పి.నాగేశ్వరరావు, సభ్యులు పీఎస్ కుమార్, యు.కె.వి.రామకృష్ణ స్వీకరించారు. -
అంధుడైన భర్తను హతమార్చిన భార్య..?
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని... అశ్వారావుపేట: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అంధుడైన భర్తను హతమార్చిందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి నిర్బంధించిన సంఘటన అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక బంజారా కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆసుపాకకు చెందిన అంధుడు జర్బలా నాగేశ్వరరావు(34)కు దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన అరుణతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అరుణకు ఆసుపాకకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ నాగేశ్వరరావు పలుమార్లు గొడవకు దిగాడు. ఈ విషయంలో గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి తప్పు చేయవద్దంటూ అరుణను హెచ్చరించారు. ఈ క్రమంలో తన భార్య వైఖరి స రిగా లేదంటూ నాగేశ్వరరావు గత ఏడాది అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా డు. అయినా వైఖరి మార్చుకోకుండా తననే చంపేస్తానని బెదిరిస్తోందని నెల రోజుల క్రితం నాగేశ్వరరావు అశ్వారావుపేటలో పెద్ద మనుషుల వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో తన ఆస్తిని భార్య, పిల్లలకు పంచే విధంగా మూడు రోజుల క్రితం ఒప్పందం చేసుకున్నారు. కానీ సోమవారం రాత్రి అతను ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. కుక్కలు మొరగడంతో.... సోమవారం రాత్రి 11.30 నిమిషాల సమయంలో నాగేశ్వరరావు ఇంటి వద్ద కుక్కలు మొరుగుతుండడంతో ఇరుగుపొరుగు వారు మేల్కొని వచ్చారు. అప్పటికే నాగే శ్వరరావు ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరి తాడుతో వేలాడుతూ కనిపించాడు. అరుణ, మరో వ్యక్తి కలిసి నాగేశ్వరరావును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపిస్తూ గ్రామస్తులు అరుణపై దాడి చేసి నిర్బంధించారు. అశ్వారావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపాక చేరుకున్న పోలీసులు వెంటనే నాగేశ్వరరావు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నిందితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాగేశ్వరరావు మృతిపై అనుమానాలు... నాగేశ్వరరావు మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుట్టు గుడ్డి వాడైన నాగేశ్వరరావుకు చెట్టు ఎక్కడం రాదని, చీకట్లో అతను చెట్టు ఎక్కి ఎలా ఉరి వేసుకున్నాడని అంటున్నారు. నాగేశ్వరరావు మృతితో ఆసుపాకలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు అశ్వారావుపేట కమ్యూనిటీ ఆస్పత్రికి చేరుకున్నారు. అరుణకు అదే గ్రామానికి చెందిన చిలకారావుతో వివాహేతర సంబంధం ఉందని, కోడలు అరుణ, చిలకారావులపై అనుమానాలు ఉన్నాయని నాగేశ్వరరావు తల్లి పిచ్చమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు అశ్వారావుపేట పోలీసులు తెలిపారు. -
రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలి
ఒంగోలు కలెక్టరేట్ : ఉలవపాడు మండలం రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నినదించాయి. ప్రకాశం జిల్లాకు మంజూరైన ఓడరేవును పొరుగు జిల్లావాసులు తన్నుకుపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్దఎత్తున ఒత్తిళ్లు తీసుకురావాలని నిర్ణయించాయి. ప్రభుత్వాలు స్పందించకుంటే ఆగస్టు 15 నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించాయి. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రంగాభవన్‌లో రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి చుండూరి రంగారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటుచేస్తే ప్రకాశం జిల్లా ప్రగతికే కాకుండా నవ్యాంధ్ర నిర్మాణానికి అద్భుతమైన అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి చుండూరి రంగారావు అన్నారు. రామాయపట్నం ఓడరేవు కోసం పాలకులకు ముందుగా విజ్ఞాపన పత్రాలు ఇస్తామని, వారు స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని ఎంతమందికి విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య గుర్తు చేశారు. టెక్నికల్ కమిటీ రామాయపట్నం పోర్టుకు అనుకూలమని తేల్చిందని చెప్పారు. రామాయపట్నంకు ముందుగా మంజూరైన ఓడరేవును దుగరాజుపట్నంకు తరలించడంపై హైకోర్టులో పిల్ వేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ వెల్లడించారు. రామాయపట్నం పోర్టును తరలించేందుకు కేంద్ర స్థాయిలో జరిగిన అక్రమాలపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ
ప్రియుడు, ప్రియురాలి అరెస్టు చేవెళ్ల రూరల్: ఓ మహిళ హత్య కేసులో పోలీసులు ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి మరో మహిళతోనూ సంబంధం పెట్టుకోవడంతో కక్షగట్టిన ఆమె ప్రియుడితో కలిసి చంపించింది. చేవెళ్ల మండలం ధర్మసాగర్ సమీపంలో ఈనెల 2న వెలుగుచూసిన మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం చేవెళ్ల ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగేశ్వర్రావు కేసు వివరాలు వెల్లడించారు. శంకర్పల్లి మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన కె. యాదమ్మ కొన్నాళ్ల క్రితం భర్తను వదిలేసింది. ఐదేళ్లుగా చేవెళ్ల సీపీఐ కాలనీలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఓ గదిని సుగుణమ్మ(42)కు అద్దెకు ఇచ్చింది. ఇదిలా ఉండగా యాదమ్మకు చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్ తో వివాహేతర సంబంధం ఉంది. తరచూ యాదమ్మ ఇంటికి వచ్చే అతడికి సుగుణమ్మతో కూడా పరిచయమై ‘సంబంధం’ ఏర్పడింది. వారిద్దరు చనువుగా ఉండడం యాదమ్మ జీర్ణించుకోలేకపోయింది. వెంకటేశ్ తనకు కాకుండా పోతాడని ఆందోళనకు గురైంది. ఎలాగైనా సుగుణమ్మను చంపాలని ఆమె నిర్ణయించుకుంది. ఈక్రమంలో సుగుణమ్మ తనతో అకారణంగా గొడవపడుతోందని, లేనిపోని అభాండాలు వేసి వెంకటేశ్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి సుగుణమ్మను హత్య చేయాలని పథకం వేశారు. ఈక్రమంలో ఈనెల 1న చేవెళ్ల బస్‌స్టేషన్ సమీపంలో వారు తరుచూ కలుసుకునే ప్రాంతంలో యాదమ్మ ప్రియుడిని కలిసింది. సుగుణమ్మకు యాదమ్మ ఫోన్ చేసి తాను దావత్ ఇస్తాను అని చెప్పింది. దీంతో సాయంత్రం సుగుణమ్మ కల్లు దుకాణం వద్దకు వచ్చింది. అక్కడ కల్లు తాగి ఓ ఆటోలో ధర్మసాగర్ సమీపంలోకి వెళ్లారు. పథకం ప్రకారం వెంకటేష్ అక్కడికి ముందే వెళ్లి వేచి చూస్తున్నాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. సుగుణమ్మకు కాస్తా ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న ఆమె చెంపపై యాదమ్మ బలంగా కొట్టింది. దీంతో సుగుణమ్మ కిందపడింది. వెంకటేశ్ సుగుణమ్మను గట్టిగా పట్టుకున్నాడు. యాదమ్మ సుగుణమ్మ చీరకొంగుతోనే మెడకు గట్టిగా బిగించింది. ఇద్దరూ కలిసి ఉరిబిగించి సుగుణమ్మను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో సీఐ నాగేశ్వర్, ఎస్ఐ ఖలీల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుగుణమ్మ ఇంటి యజమాని యాదమ్మపై అనుమానం రావటంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె ఫోన్‌ను పరిశీలించగా హత్య జరిగిన రోజు సుగుణమ్మతో మాట్లాడినట్లుగా ఉంది. వెంకటేశ్ నంబర్ కూడా ఉండడంతో అతడినీ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎస్ఐలు లక్ష్మీరెడ్డి, ఎండీ. ఖలీల్ కూడా ఉన్నారు. -
‘గని కార్మిక సంఘం’లో గందరగోళం
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని మల్కాపూర్ గని కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం గందరగోళం నెలకొంది. మెజార్టీ సభ్యులైన నలుగురు డెరైక్టర్లు మొగులాన్, ఉల్లి నర్సిములు, జట్టూరి నాగయ్య, పోత్రెపల్లి పండరీలు కలిసి సొసైటీ చైర్మన్ రాములు, వైస్‌చైర్మన్ పండరీలపై వికారాబాద్‌లోని కో ఆపరేటివ్ అధికారి నాగేశ్వర్రావుకు బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లు తమకు సమాచారం ఇవ్వకుండానే సొసైటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన డెరైక్టర్లు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన డెరైక్టర్లను గురువారం సొసైటీ కార్యాలయంలో చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ పండరీలతో పాటు సొసైటీ సభ్యులు నిలదీశారు. చైర్మన్‌పై ఆరోపణలు నిరూపించాలని వారు పట్టుబట్టారు. డబ్బులు తీసుకుని ప్రభుత్వ భూమిని రైల్వేమార్గం కోసం అమ్మినట్లు రుజువు చూపించాలని కోరారు. దీంతో ఇరు వర్గాల డెరైక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. సదరు నలుగురు డెరైక్టర్లను సొసైటీ సభ్యులు చుట్టుముట్టారు. దీంతో డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వాస్తవమేనని వారు అంగీకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్లు అక్రమాలకు పాల్పడినట్లు తాము అనలేదంటూ సదరు డెరైక్టర్లు అక్కణ్నుంచి నిష్ర్కమించారు. ఇది రాజకీయ కుట్ర: వైస్ చైర్మన్ పండరీ మల్కాపూర్ గని కార్మిక సంఘం కార్యాలయంపై కొంతమంది గిట్టనివారు కుట్రతో రాజకీయం చేస్తున్నారని సొసైటీ వైస్ చైర్మన్ పండరీ విమర్శించారు. మూడు దశాబ్దాలుగా సొసైటీలో ఎన్ని అక్రమాలు జరిగినా వారు ఎందుకు నోరు మెదపలేదంటూ ఆయన ప్రశ్నించారు. కొంతమంది నాయకులు రాజకీయ కుట్రతో సొసైటీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. -
నేడు బంద్
కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన గిరిజనులను ముంచే చర్య సరికాదు బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు వరంగల్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ గురువారం బంద్ నిర్వహిస్తున్నట్టు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ, చంద్రబాబు, సమైక్య కోటరీ కలిసి తెలంగాణ ప్రజల గుండెల్లో బాకులు దించుతున్నారని మండిపడ్డారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ జాతీయ గిరిజన విధానానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యతిరేకమన్నారు. 1/70 చట్టం, మీసా, అటవీ హక్కుల చట్టం, గిరిజన సలహా మండలి నిబంధనలను తుంగలో తొక్కి.. ఏడు మండలాలను ముంచేందుకు చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాజ్యంగ హక్కులు కోల్పోతుంటే రక్షించాల్సిన గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రకృతి పూజారులను పశువుల మాదిరిగా భావించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులు ఆప్షన్లు కోరుతున్నారని.. కానీ, వందేండ్లు కలిసి ఉన్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొడుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమస్యపై భద్రాచలంలో ఉద్యమిస్తామన్నారు. ఆంధ్రా పాల కుల కుట్రలను వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ నగర కమిటీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ చెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడుకుంటామన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్రావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఇంత హడావుడిగా ఆర్డినెన్స్‌ను తేవాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, చింతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బంద్‌కు జేఏసీ మద్దతు వరంగల్ : పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ గురువారం జరిగే తెలంగాణ బంద్‌కు సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. గిరిజనులను ముంపునకు గురిచేసే ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, ఏడు మండలాలను కలిపే చర్యలను వెంట నే ఉపసంహరించుకోవాలని కోరారు. బంద్‌లో జేఏసీలు భాగస్వామ్యం కావాలని కోరారు. బంద్‌లో పాల్గొనాలి: వినయ్ నేటి బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ కోరారు. గిరిజనులను నిరాశ్రయులను చేస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. తెలంగాణ టీడీపీ, బీజేపీ నా యకులు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. రాజ్యం గబద్ధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్డినెన్స్పేరుతో కొత్త విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. బంద్ కు సీపీఎం మద్దతు హన్మకొండ సిటీ : గురువారం జరగనున్న తెలంగాణ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని సీపీఎం జిల్లా కార్యాదర్శి జి.నాగయ్య తెలిపారు. బుధవారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జి.నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ఖండించారు. రాష్ట్ర సరిహద్దులను మార్చేముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదన్నారు. కార్యదర్శివర్గ స భ్యులు సూడి కృష్ణారెడ్డి, కె .వెంకటయ్య, ఎస్.వాసుదేవరెడ్డి, సీహెచ్.రంగయ్య, ఎం.చుక్క య్య, జి.ప్రభాకర్‌రెడ్డి, సాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు. సీపీఐ కూడా.. హన్మకొండ చౌరస్తా : పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం జరిగే బంద్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జిల్లా సమితి కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 205 గ్రామాలను ఆంధ్రాలో కలపడం దారుణమని పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. -
నాన్నగారికి నేను బోర్ కొట్టేశానేమో!
‘‘తండ్రీ కొడుకులతో కలిసి నటించే అదృష్టం అందరికీ దక్కదు. ఆ ఆనందాన్ని దక్కేలా చేసిన మా నాన్నగారికి కృతజ్ఞతలు’’ అంటున్నారు నాగార్జున. డా. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అక్కినేని కుటుంబ అభిమానులతో పాటు నాగార్జున కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు విశేషాలు చెప్పారు. ‘‘నాన్నగారితో కలిసి సినిమా చేయడంవల్ల ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కుదిరింది. గతంలో నాన్నగారి కాంబినేషన్లో నేను చేసినప్పుడు ఆయన దృష్టంతా నా మీదే ఉండేది. కానీ, ఈ సినిమాకి మాత్రం నాన్నగారి దృష్టి మొత్తం చైతూ మీదే. బహుశా నేను బోర్ కొట్టి ఉంటానేమో’’ అని సరదాగా అన్నారు నాగ్. ‘మనం’ షూటింగ్ లొకేషన్లో తన తండ్రి, తనయుడు ఒకరి మీద ఒకరు జోక్‌లేసుకుంటూ సరదాగా ఉండేవాళ్లని, ఈ సినిమా మొత్తం తనకో తీపి గుర్తులాంటిదని నాగ్ అన్నారు. ముఖ్యంగా తమ ముగ్గురి కాంబినేషన్లో షూటింగ్ చేసిన ఆ నాలుగైదు రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని, అవి చాలా ప్రత్యేకం అని నాగార్జున పేర్కొన్నారు. 1920 నుంచి 2013 వరకు సాగే కథతో ఈ సినిమా ఉంటుందని, అంతకు మించి ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలేమీ బయటపెట్టలేనని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన విషయం గురించి చెబుతూ -‘‘మా నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ‘రేయ్.. ఎంత బాగా చేశాడురా... చక్కగా ఉంది కదరా...’ అని అమితాబ్ నటన గురించి అనేవారు. అమితాబ్ నటించిన సినిమాలను దాదాపు వదలకుండా చూసేవారు. అందుకే, ఆయన చివరి చిత్రంలో అమితాబ్ నటిస్తే బాగుంటుందనుకున్నా. బిగ్ బి నటించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకం అయ్యింది’’ అని నాగార్జున అన్నారు.