సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గ పాలనను అంతం చేయడంలో భాగంగానే ఎంతో మంది వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నేత, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. సినీ రంగం నుంచి కూడా ఎంతో మంది వైఎస్ జగన్ నాయకత్వం నచ్చి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఇది గిట్టని తెలుగుదేశం నాయకులు వారిపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ముందు సంక్షేమ కార్యక్రమాలతో పేరుతో ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ దశాదిశా మర్చనున్నాయని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 25 ఎంపీ సీట్లు అందించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. ‘ఒక్కసారి వైఎస్సార్‌సీపీకి అవకాశం ఇవ్వండి అబివృద్ది అంటే ఏంటో చూపిస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment