ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆచార్య జి.నాగేశ్వరరావు నియమితులైనట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం నుంచి ఈ విష యం క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మా రింది. ఏయూ వీసీగా బీసీ సామాజిక వర్గానికి చెం దిన వ్యక్తిని నియమిస్తారని గత కొంత కాలంగా వినిపిస్తోంది. అందుకు తగినట్లే సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ముగ్గురు పేర్ల జాబితాలో ఆచార్య నాగేశ్వరరావు పేరు ముందు వరుసలో ఉన్నట్లు గత నెల రోజులుగా చర్చ జరుగుతోంది. కాగా గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏయూ వీసీగా నాగేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. వివిధ చానళ్లు, వెబ్‌సైట్లలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఫైలుపై గవర్నర్ సంకతం అనంతరం సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు.
అయితే ప్రభుత్వ జీవోలు పొందుపరిచే వెబ్‌సైట్ మధ్యాహ్నం నుంచి పనిచేయకపోవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. నేడో, రేపో వీసీ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. కాగా ఆచార్య జి.నాగేశ్వరరావు ప్రస్తుతం ఏయూ సైన్స్ కళాశాల ప్లేస్‌మెంట్ అధికారిగా, అసోసియేట్ ప్లేస్‌మెంట్ అధికారిగా సేవలు అందిస్తున్నారు. పరిశోధనల్లో 36 మందికి మార్గదర్శనం చేశారు. రసాయన శాస్త్రంలో ఇనార్గానిక్ విభాగ నిపుణుడిగా సుపరిచితులు.