ఆ ఆరుగురిలో ఇద్దరు రైతుల మృతి | two farmers died in guntur district | Sakshi
Sakshi News home page

ఆ ఆరుగురిలో ఇద్దరు రైతుల మృతి

Published Wed, Jul 8 2015 5:46 PM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM

two farmers died in guntur district

గుంటూరు: దేవాలయ భూములను వేలం వేయకూడదంటూ ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం తాడిపర్రు గ్రామంలో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. బోసు అనే రైతు ఆరోజే మృతి చెందగా, బుధవారం ఉదయం నాగేశ్వరరావు అనే రైతు ప్రాణాలు వదిలాడు. దీంతో ఆగ్రహించిన అఖిలపక్ష నేతలు బుధవారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రైతు మృతదేహంతో ధర్నాకు దిగారు.

మృతిచెందిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబంలో అర్హులైన వారికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారు సాగుచేసుకుంటున్న భూమిని వారికే అప్పగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కాంతిలాల్ దండే సంఘటన స్థలానికి వచ్చి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని.. అడిగిన డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  దాంతో అఖిలపక్ష నేతలు ఆందోళన విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, నేత లేళ్ల అప్పిరెడ్డి, సీపీఐ నేతలు, ప్రజాసంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement