bose
-
రాజ్‌భవన్‌లో సొంత విగ్రహం.. గవర్నర్‌పై విమర్శలు
కోల్‌కతా: బెంగాల్ గవర్నర్ ఆనంద్‌బోస్ మరోసారి వార్తల్లోకెక్కారు. గవర్నర్‌గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేసిన పని వివాదాస్పదమైంది.స్వయంగా ఆయన విగ్రహాన్ని ఆయనే రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకున్నారు బోస్. గవర్నర్‌గా ఓ పక్క ఇంకా పదవిలో ఉండగానే సొంత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకోవడమేంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.విగ్రహావిష్కరణ వీడియోలు సోషల్‌మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.బోస్పై నెటిజన్లు తెగ విమర్శలు చేస్తున్నారు.అయితే దీనిపై రాజ్‌భవన్ స్పందించింది.గవర్నర్ తన విగ్రహాన్ని తాను ఆవిష్కరించుకోలేదని అది ఆయనకు బహుమతిగా వస్తే తెర తీసి చూసుకున్నారని తెలిపింది.బోస్ చర్యపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. సొంత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎక్కడా వినలేదని తృణమూల్ నేతలు గవర్నర్‌ను ఎద్దేవా చేశారు.📜 On November 23, 2024, Indian Museum embraced the spirit of #ApnaBharatJagtaBengal on the twenty-third day of our month-long celebration, to mark the commencement of Dr. C. V. Ananda Bose, the Hon'ble Governor of West Bengal's third-year in office, as visionary leader of state. pic.twitter.com/qNg7eGhu6Q— Indian Museum (@IndianMuseumKol) November 23, 2024ఇదీ చదవండి: ‘సేనా’ధిపతిషిండే -
బెంగాల్ గవర్నర్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్‌సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
బాబుకు తోడు దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: ఓ దొంగ... మరో దొంగకు మద్దతిస్తే ఎలా ఉంటుంది? ఒకరికి మద్దతుగా మరొకరు తెరమీదికొచి్చ ‘తనేమీ తప్పు చేయలేదు’ అని చెప్పటం!!.. వినటానికే విచిత్రంగా ఉంది కదూ? నిజానికి కోర్టుల్లో కనుక ఇలా సాక్ష్యాలు చెబితే జైల్లో పడేస్తారు. కానీ ఎల్లో మీడియా మాత్రం... ఆ దొంగలు చంద్రబాబు నాయుడికి ఇస్తున్న సర్టిఫికెట్లను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అవే నిజాలని జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అవి నిజాలే అనుకుంటే... ఇలా ఎల్లో మీడియాలో సాక్ష్యాలు చెబుతున్న దొంగలను గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే కేసులో ఎందుకు అరెస్టు చేసింది? ఐటీ శాఖ ఎందుకు వాళ్లకు నోటీసులిచ్చింది? తాము తప్పు చేశామని వాళ్లు ఎందుకు ‘ఈడీ’ ఎదుట ఒప్పుకున్నారు? ఈ ప్రశ్నల్లో దేనికీ ‘ఈనాడు’ దగ్గర గానీ, దాని తోక మీడియా దగ్గర గానీ సమాధానాలు లేవు. వారికి తెలిసిందల్లా... చంద్రబాబు శుద్ధ పూస అని జనాన్ని నమ్మించేందుకు మొత్తం తమ మీడియా సామ్రాజ్యాన్ని అబద్ధాలకు తాకట్టు పెట్టడమే. అదే జరుగుతోంది కూడా!. దుర్యోధనుడు మంచోడని దుశ్శాసనుడు, శకుని సాక్ష్యం చెబుతున్నట్లే ఉంది టీడీపీ వ్యవహారం. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతోసహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు మద్దుతుగా ఆ కేసులో ఇతర నిందితులు వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ వంటి వారు ఇంటర్వ్యూలిస్తుండటం... సిగ్గులేకుండా వాటిని ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తుండటం రాష్ట్రం మొత్తాన్ని విస్మయపరుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా వీడియో విడుదల చేశారు. కాగా తాజాగా ఈ కేసులో మరో నిందితుడు సుమన్ బోస్ ‘మా చంద్రబాబు నీతిమంతుడు’ అని సరి్టఫికెట్ ఇచ్చేశారు. నిజానికి సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఒప్పందం చేసుకుని కోట్లు కొల్లగొట్టడంలో కీలక పాత్రధారి ఈ సుమన్ బోసే. ఈయనను, వికాస్ ఖన్విల్కర్‌ను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీఐడీ రెండూ అరెస్టు చేశాయి. జైల్లో ఉండి... బెయిలుపై బయటకు వచ్చారు. ఇలా బెయిలుపై వచి్చన వాళ్లు కేసులోని మరో నిందితుడికి మద్దతుగా మీడియాతో మాట్లాడటమే చిత్రాతిచిత్రం. వాస్తవానికి సుమన్‌బోస్ అసలు బండారాన్ని బయటపెడుతూ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే ఇటు సీఐడీకీ అటూ న్యాయస్థానానికి కూడా వాంగ్మూలాన్ని ఇచ్చిందన్నది టీడీపీ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోంది. మాకు తెలీదు.. సంబంధం లేదు: సీమెన్స్ టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్‌లో తమ అవినీతి దందాకు ‘సీమెన్స్ కంపెనీ ముసుగు వేయాలన్న చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. అసలు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించి తమకు తెలియనే తెలియదని సీమెన్స్ కంపెనీ కుండబద్దలు కొట్టింది. డిజైన్ టెక్ కంపెనీతో కలసి ఏపీఎస్ఎస్డీసీతో తాము కుదర్చుకున్నట్టు చెబుతున్న త్రైపాక్షిక ఒప్పందానికి, తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్ట్ కింద 90 శాతం నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూర్చే పద్ధతి అసలు తమ కంపెనీ పాలసీలోనే లేదని విస్పష్టంగా తేల్చింది. తమ కంపెనీ పేరిట సుమన్ బోస్ టీడీపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని... అసలు అటువంటి ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ఆయనకు కంపెనీ అప్పగించనే లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబుతూ పంపిన ఈ–మెయిల్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీమెన్స్ కంపెనీ పూర్తిగా సహకరిస్తోంది. కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు వారిద్దరే.. స్కిల్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు కాగా, సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. వారి బండారాన్ని సీఐడీ, ఈడీ ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. ఒప్పందంలో ఓ చోట సుమన్ బోస్ అని మరో చోట సౌమ్యాద్రి బోస్ అని సంతకాలు చేసినట్టు ఆడిట్ నివేదిక నిగ్గు తేల్చింది. సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించి సుమన్ బోస్ తమ కంపెనీ పేరిట చేసిన మోసాన్ని నిర్ధారించింది. ఆయన అప్పటికే డిలీట్ చేసిన ఈ–మెయిల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ సందేశాలను రిట్రీవ్ చేసి ఆ రికార్డులను సీఐడీకి అప్పగించింది. తమ కంపెనీకి తెలియకుండానే సుమన్ బోస్ ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్నారని, అటు తమ కంపెనీని మోసం చేయడంతోపాటు ఇటూ ఏపీ ఖజానాను కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించారని న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇక షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ కీలక పాత్ర పోషించారు. దాంతో సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్‌లను సీఐడీ 2021, డిసెంబర్10న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించింది. వారిద్దరు 2022, జనవరి 18 వరకు అంటే 40 రోజులపాటు జైలులో ఉన్నారు. బెయిలుపై వచ్చి ఎల్లో మీడియాలో చిలకపలుకులు చెబుతుండటమే ఘోరాతిఘోరం. సుమన్‌బోస్, ఖన్విల్కర్‌లను అరెస్ట్ చేసిన ఈడీ ఇక స్కిల్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్లతోపాటు షెల్ కంపెనీల ప్రతినిధులు సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్‌లను ఈ ఏడాది మార్చి 4న అరెస్ట్ చేసింది. వారికి విశాఖపట్నంలోనీ సీబీఐ న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ నలుగురినీ ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని 10 రోజులపాటు విచారించారు. అటువంటి సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విన్వేల్కర్ ప్రస్తుతం స్కిల్ కుంభకోణంలో అవినీతి జరగలేదని చెబుతూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని పరిశీలకులకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంలో ప్రశ్నావళికి సీమెన్స్ కంపెనీ ఈమెయిల్ ద్వారా చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.. ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు. ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ప్రశ్న: ఏపీఎస్ఎస్డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కరెంటు పోయింది.. కొవ్వొత్తుల వెలుగులోసంతకాలు చేశా ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదంటూ బుకాయించేందుకు యతి్నంచి సుమన్ బోస్ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఒప్పంద పత్రంలో ఏమని రాసి ఉందో కూడా తెలియదని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున కరెంట్ పోయిందని... కొవ్వొత్తులు తెప్పించారని...ఆ కొవ్వొత్తుల వెలుగులోనే తాము సంతకాలు చేశామని చెప్పారు. ఇంతకీ ఆ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మావోయిస్టు నంబర్–2గా రంజిత్ బోస్
న్యూఢిల్లీ: సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రెండో స్థానంలోకి బెంగాల్‌లోని హౌరా ప్రాంతానికి చెందిన రంజిత్ బోస్(63) అలియాస్ కబీర్‌ను ఎంపిక చేసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రంతోపాటు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేయడంలో ఈయన దిట్ట. రంజిత్ తలపై బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.కోటి వరకు ఉంది. బిహార్, జార్ఖండ్‌లతోపాటు తూర్పు భారతంలో పార్టీ పట్టు పెంచడం, సంచలన ఘటనలకు కార్యరూపం ఇచ్చేందుకే పార్టీ ఈ మార్పు చేపట్టిందని భావిస్తున్నారు. పార్టీలో రెండో స్థానంలో ఉన్న బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన ప్రశాంత్ బోస్(74)స్థానంలో రంజిత్ నియమితులయ్యారు. అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా కీలక నేతలంతా ఇటీవల పశ్చిమబెంగాల్ అడవుల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం పొలిట్‌బ్యూరోలో ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, రంజిత్ బోస్, మాజీ అధిపతి గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మిసిర్ బిస్రా అలియాస్ సాగర్ ఉన్నారు. బెంగాల్లో 2007లో నందిగ్రామ్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడంతో నాడు జరిగిన వ్యతిరేకోద్యమాన్ని రంజిత్ వెనక ఉండి నడిపించారు. దీంతోపాటు 44 గ్రామాలతో కూడిన లాల్‌గఢ్‌ను విముక్త ప్రాంతంగా ప్రకటించిన వ్యక్తిగా రంజిత్ బోస్‌కు పేరుంది. (చదవండి: షహీన్‌బాగ్ షూటర్ ఆప్ సభ్యుడే) -
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మృతి
పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ప్రముఖ నటుడు బోస్ మృతి చెందారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు మూడు దశాబ్ధలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సుమన్ హీరోగా తెరకెక్కిన సాహసపుత్రుడు సినిమాతో తెరకు పరిచయం అయిన బోస్‌కు ప్రేమఖైదీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. -
మరో బోస్
1911లో రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. ఒకటి, బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. రెండో కీలక పరిణామం– బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కేంద్రాన్ని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. డిసెంబర్ 23, 1912న నాటి వైస్రాయ్ హార్డింజ్ ఏనుగు ఎక్కి ఆడంబరంగా ఢిల్లీ నగరంలో ప్రవేశించాడు. చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ఇంటి ముందు ఒక బాలిక ఆత్రంగా ఎదురు చూస్తోంది, ఆ ఏనుగు రాక కోసం. దగ్గరకి రాగానే రహస్యంగా పట్టుకున్న నాటుబాంబును ఏనుగు మీది అంబారీ మీదకి విసిరింది. జనం కకావికలయ్యారు. హార్డింజ్ స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ చర్యను ఖండిస్తు డెహ్రాడూన్‌లో ఉన్న అటవీ పరిశోధన సంస్థ ఒక సభ నిర్వహించింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినవాడు అక్కడే పని చేస్తున్న రాస్ బిహారీ బోస్. నిజానికి ఢిల్లీలో బాంబు విసిరినది బాలిక కాదు, ఆ వేషంలో ఉన్న 16 ఏళ్ల బసంత్ విశ్వాస్ అనే బాలుడు. సాక్షాత్తు వైస్రాయ్ హత్యకు పథకం వేసినవాడు మరెవ్వరో కాదు, రాస్ బిహారీ బోస్. హత్యాయత్నం విఫలం కావడంతో డెహ్రాడూన్ వెళ్లిపోయి అనుమానం రాకుండా విధులలో చేరాడు. కానీ ఈ పథకం వేసినవాడు రాస్ బిహారీ అన్న సంగతి త్వరలోనే పోలీసులు పసిగట్టారు. భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను సాగనంపాలంటే హింసామార్గం తప్ప వేరుదారి లేదని నమ్మినవారిలో రాస్ బిహారీ ఒకరు. విప్లవకారులతో, విప్లవ కార్యకలాపాలతో ఆయన మమేకత్వం గమనిస్తే విస్తుపోతాం. చాలా చిన్నతనంలోనే ఆయన బాంబులు చేయడం నేర్చుకున్నాడు. తరువాత సైన్యంలో చేరాలని అనుకున్నాడు. సాధ్యం కాలేదు. గదర్ పార్టీలో పనిచేశాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. ఆపై తన నాయకత్వంలో పనిచేస్తున్న అజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌కు అప్పించారు. దేశంలో ప్రవేశించే అవకాశం లేక జపాన్ గడ్డ మీద కన్నుమూశారు. \ రాస్ బిహారీ (మే 25, 1886– జనవరి 21, 1945) అఖండ బెంగాల్‌లోని బురద్వాన్ జిల్లా సుబల్‌దహ గ్రామంలో పుట్టారు. ఆయన మూడో ఏటనే తల్లి మరణించారు. తండ్రి బిపిన్బిహారీ బోస్. తాతగారు కాళీచరణ్ బోస్ పర్యవేక్షణలో రాస్ బిహారీ ప్రాథమిక విద్య సుబల్దహలోనే జరిగింది. తరువాత చంద్రనాగోర్‌లో ఉన్నత విద్యకు వెళ్లారు. చంద్రనాగోర్ అప్పుడు ఫ్రెంచ్ ఏలుబడిలో ఉండేది. దీనితో 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం గురించి చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. దీనితో పాటు బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలతో కూడా ఆయన దృష్టి వికసించింది. ఇంకా నవీన్ సేన్ కవితల సంకలనం ‘ప్లాసి యుద్ధం’ కూడా ఆయనను ఉత్తేజపరిచింది. వీటితో పాటు సురేంద్రనాథ్ బెనర్జీ, వివేకానంద వంటి వారి ఉపన్యాసాలు కూడా రాస్ బిహారీలో చిన్నతనంలోనే ఒక కొత్త ప్రాపంచిక దృష్టికి అవకాశం కల్పించాయి. ఢిల్లీలో హార్డింజ్ హత్య పథకం విఫలమైన తరువాత రాస్ బిహారీ కొద్దికాలం చంద్రనాగోర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన దొరికితే ఉరిశిక్ష ఖాయం. భారతదేశం నుంచి బయటపడాలని 1915లో భావించారాయన. పీఎన్ ఠాకూర్ పేరుతో, ఒక కవి అవతారం దాల్చి జప బయటుదేరారు. మొదట కోబ్ నౌకాశ్రయానికి, తరువాత టోక్యో చేరుకున్నారు. అక్కడే విశాల ఆసియావాదులను ఆశ్రయించారు. మిత్సుర టొయోమా అందులో ఒకరు. ఈయనే మొదట రాస్ బిహారీకి ఆశ్రయం ఇచ్చారు. కానీ కొద్దికాలానికే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన ఆచూకీ తెలిసిపోయింది. తమకు అప్పగించవలసిందిగా ఇంగ్లండ్ జపాన్ను కోరింది. భారతీయ విప్లవకారులను వెతికే పని ఆరంభించిన జపాన్ పోలీసు యంత్రాంగం టొయోమా ఇంటిని కూడా సోదా చేసింది. అయితే మితవాద నాయకుడైనందువల్ల ఆ ఇంటిని ఎక్కువ సేపు సోదా చేయలేదు. దీనితో బోస్ టోక్యోలోనే షింజుకు అనే కొత్త రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. అక్కడ సోమా కుటుంబీకులు నడుపుతున్న నకామురయా బేకరీలో ఆశ్రయం పొందారు. టొయోమో, సోమా కుటుంబం వీరంతా భారత స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి కలిగినవారే. ఐజో, కొత్సుకొ సోమా కూడా అలాంటివారే. వారు తమ బేకరీలోనే రహస్య ప్రదేశంలో రాస్ బిహారీని ఉంచారు. ఈ విషయం ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యనే దాచారు. రాస్ బిహారీని అంత జాగ్రత్తగా కాపాడారు. ఆ సమయంలోనే ఒక బ్రిటన్ నౌక జపాన్ వారి వాణిజ్య నౌకను పేల్చింది. దీనితో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోయాయి. ఫలితంగా రాస్ బిహారీని అప్పగించాలంటూ బ్రిటన్ చేసిన విజ్ఞాపన రద్దయింది. అప్పుడు ఆయన బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా అడుగు పెట్టారు. సోమా కుటుంబంతో ఏర్పడిన అనుబంధంతో ఐజో, కొత్సుకొ సోమా పెద్ద కుమార్తె తొషికోను వివాహం చేసుకుంటానని రాస్ బిహారీ కోరాడు. అందుకు ఆ దంపతులు అంగీకరించారు. అసలు ఆ సమయంలో రాస్ బిహారీని అల్లుడిగా చేసుకోవడానికి ఆ దంపతులు అంగీకరించడం. భర్తగా స్వీకరించడానికి తొషికో ఇష్టపడడం పెద్ద విషయమే. ఎందుకంటే విదేశీయులని పెళ్లి చేసుకోవడానికి ఆనాటి జపాన్ సమాజం అంగీకరించేది కాదు. పైగా విదేశాల నుంచి వచ్చి ప్రవాసం గడుపుతున్న వారితో వివాహాలు అసలే నిషిద్ధం కూడా. అందుకే తొషికో గురించి చెప్పకుండా రాస్ బిహారీ జీవిత చిత్రం పరిపూర్ణమని అనిపించదు. అంతేకాదు, జపాన్ చేరుకున్న తరువాత కూడా రాస్ బిహారీ తన భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని విరమించలేదు. అందుకోసం ఆయన విదేశాలకు వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో తొషికో కుటుంబ బాధ్యత అంతా చూసుకునేవారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత తొషికో క్షయ బారిన పడి తన 28వ ఏటనే హఠాత్తుగా కన్నుమూశారు. ఆమె మరణం బోస్‌ను బాగా కుంగదీసింది. ఆయన మరోసారి వివాహం చేసుకోలేదు కూడా. నకామురయా బేకరీ పై అంతస్తులో చిన్న రెస్టారెంట్ ప్రారంభించి, మామగారితో కలసి వ్యాపారం చేశారు. ఈ చిన్న రెస్టారెంట్లో తయారు చేసే భారతీయ వంటకాల కోసం జపాన్ జాతీయులు విరగబడేవారు. ఇది ఎంతగా ఎదిగిపోయిందంటే జపాన్ స్టాక్ ఎక్సె ్చంజ్‌లో వాటాలు అమ్మిన తొలి జపాన్ ఆహారాల సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇది సహజంగానే స్థానికులలో ఆసూయకు కారణమైంది. ఒక సామ్రాజ్యవాద వలస దేశానికి చెందిన మనిషితో తొషికో ప్రేమ వ్యవహారం అంటూ ఆమె గురించి చెడుగా రాసేవి. కానీ ‘నకామురయా బోస్’గా ఆయన ఎందరో జపనీయులకు ఇష్టుడిగా మారిపోయారు. ఆయన తయారు చేసిన కూరకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఒకపక్క ఆ రెస్టారెంట్ పని చేస్తూనే భారత దేశ విముక్తి గురించి ఆలోచించేవారు రాస్ బిహారీ. టోక్యోలోనే ఇండియన్ క్లబ్ పేరుతో ఒక చిన్న సంస్థను స్థాపించి, దాని ద్వారా ఇంగ్లిష్ పత్రికలకు అనేక వ్యాసాలు రాసేవారాయన. రేడియో ప్రసంగాలు ఇచ్చేవారు. భారతీయులు సాగిస్తున్న స్వాతంత్య్రం పోరాటానికి మద్దతు ఇవ్వవలసిందిగా ఆయన ప్రపంచ దేశాలకు నిరంతరం విజ్ఞప్తి చేస్తూ ఉండేవారు. అనేక మందికి ఉత్తరాలు రాసేవారు. భారత్‌కు స్వాతంత్య్రం అంటే అది భారత్‌కు మాత్రమే ప్రయోజనం కాదు. ప్రపంచానికి ప్రయోజనం అని భావించారాయన. అందుకు కారణం కూడా చూపించారు. భారత్‌లో ఇంగ్లండ్ తిష్ట అలా కొనసాగుతూ ఉంటే, పేద, బడుగు దేశాలకు రక్షణ నానాటికీ కరువైపోతుందని ఆయన భావించారు. భారత్‌ను ఇంగ్లండ్ పాలించినంత కాలం ప్రపంచంలో శాంతి ఉండదు అని కూడా ఆయన రాశారు. దీనితో పాటు జపాన్‌లోనే ఉంటున్నప్పటికీ భారతదేశంలో సాగుతున్న ఉద్యమాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ‘గాంధీజీ గతకాలపు మనిషి. సుభాశ్ చంద్రబోస్ ఈ కాలం మనిషి’ అని ఒక సందర్భంలో రాస్ బిహారీ వ్యాఖ్యానించారు కూడా. ఆసియా దేశాల మధ్య ఐక్యతకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదో రాస్ బిహారీ అద్భుతంగా ఆనాడే గుర్తించారని అనిపిస్తుంది. ఆ ఐక్యతను ఆయన మనసారా ఆకాంక్షించారు. ఆగస్టు 1, 1926న నాగసాకిలో ఆయన నిర్వహించిన సభ చరిత్రాత్మకమైనదని చెప్పాలి. డాక్టర్ హోక్వా అనే ప్రముఖునితో కలసి రాస్ బిహారీ ఆసియా దేశాల ప్రతినిధుల గోష్టి నిర్వహించారు. దీనికి 42 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో చైనా వారు 11 మంది. భారతీయులు 8, అప్ఘాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి ఒక్కొక్కరి వంతున హాజరయ్యారు. ఇంకా జపాన్‌వారు 20 మంది పాల్గొన్నారు. ఆసియా ఆసియావాసులకే అన్న నినాదం రాస్ బిహారీ అక్కడ ఇచ్చారు. 1926లో ఆయన స్థాపించిన పాన్ ఆసియన్ అసోసియేషన్, 1930లో నెలకొల్పిన జపాన్–ఇండియా మిత్రమండలి కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ఈ మిత్రమండలి ఏటా మూడు లేదా నాలుగు పర్యాయాలు సమావేశాలు జరిపేది. జపాన్, భారత్ దేశాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించేది. ప్రధానంగా పురాతన సంస్కృతులు కలిగిన జపాన్, భారత్‌ల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హిందూ మహాసభ జపాన్ శాఖను ఆయనే ప్రారంభించి, వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు బోస్. ఇంతలోనే రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధంలో బ్రిటన్ కీలకంగా ఉంది. ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టడానికి ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకోవాలని విప్లవవాదుల ఆశయం. 1942లో సింగపూర్ జపాన్ అధీనంలోకి వచ్చింది. ఆగ్నేయాసియాలో 32,000 మంది భారతీయ సిపాయిలను జపాన్ యుద్ధఖైదీలుగా పట్టుకుంది. వీరిందరికీ భారత స్వాతంత్య్రం కోసం పోరాడే అవకాశం కల్పిస్తానని సింగపూర్‌లో జపాన్ సైనిక వ్యవహారాల అధిపతి మేజర్ ఫుజీవరా ప్రమాణం చేశాడు. ఈ వ్యవహారం చూడడానికి సింగపూర్ వచ్చిన రాస్ బిహారీ అక్కడే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను 1924లో స్థాపించారాయన. ఈ యుద్ధఖైదీల సాయంతో భారత్‌ను విముక్తం చేసే పనిలో తోడ్పడేందుకు రాస్ బిహారీ టోక్యో నుంచి బ్యాంకాక్ వెళ్లారు. తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్‌కు నాయకత్వం వహించవలసి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలోనే మేజర్ మోహన్‌సింగ్ నాయకత్వంలో పోరాడుతున్న 40 వేల మంది భారతీయ సైనికులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. వీరందరితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవలసిందని జపాన్ సైనికాధికారులు అవకాశం ఇచ్చారు. ఆ పని మొదలయింది. అయితే ఆగ్నేయాసియాలో యుద్ధం గురించి సింగ్‌కూ, జపాన్ అధికారులకు మధ్య విబేదాలు వచ్చాయి. దీనితో సింగ్‌ను అరెస్టు చేసి, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు, అంటే రాస్‌బిహారీకి అజాద్ హింద్ ఫౌజ్‌ను అప్పిగించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత రాస్ బిహారీ అజాద్ హింద్ పౌజ్ను భారతదేశం నుంచి రహస్యంగా సింగపూర్ వచ్చిన నేతాజీ బోస్‌కు అప్పచెప్పారు. 1945 నాటికి రాస్ బిహారీ నిరంతరం రేడియో ప్రసారాలను వినడానికి అలవాటు పడ్డారు. అందులో ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అది భారతదేశం స్వాతంత్య్రమైందన్న వార్త. కానీ ఆ వార్త వినకుండానే ఆయన కన్నుమూశారు. ఆయన పార్ధివదేహాన్ని తీసుకువెళ్లడానికి జపాన్ రాజకుటుంబం ప్రత్యేక వాహనాన్ని పంపించింది. 1924 నాటికే జపాన్లొ రాస్ బిహారీ ఒక ప్రముఖ పౌరుడు. - ∙డా. గోపరాజు నారాయణరావు -
తెలివైన బోస్
స్కూల్ అయిపోగానే సైకిలేస్కొని ఎక్కడా ఆగకుండా ఇంటికొచ్చేసి, రాగానే అమ్మ ముందు వాలిపోయాడు బోస్ – ‘‘అమ్మా! నేనొచ్చేశానూ’’ అంటూ. ‘‘వచ్చావు బాబూ! కానీ ఏం చేసొచ్చావు?’’ అనుమానంగా అడిగింది అమ్మ. ‘‘ఉహూ! నేనెవర్ణీ ఏం చెయ్యలేదమ్మా! సత్యరాజ్‌ని, పాపారావుని కూడా..’’ అమాయకంగా సమాధానమిచ్చాడు బోస్. ‘‘నీకు తెలివితేటలు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదేరా! అమ్మను ఎప్పటికీ మోసం చెయ్యలేవు.’’ బోస్‌ను దగ్గరికి తీస్కొని చెప్పింది అమ్మ. బోస్‌కు వయసైతే పెరిగింది కానీ, బుద్ధి చాలా చిన్న వయసులోనే ఆగిపోయింది. ఇంత వయసొచ్చినా అల్లరి చేస్తాడంటూ నాన్నతో సహా చుట్టుపక్కల వాళ్లంతా బోస్‌ను తిడుతూ ఉంటారు. బోస్‌కు ఫ్రెండ్ అయినా, గైడ్ అయినా అన్నీ అమ్మే. బోస్ తమ్ముడు చందు అకడమిక్స్‌లో టాప్ ఉంటాడు. నాన్నేమో దేశంలోనే పెద్ద సైంటిస్ట్‌లలో ఒకరు. ‘‘బోస్‌ను చదువు మాన్పించొచ్చు కదా! వాడి బుద్ధి ఎప్పటికీ పెరగదు.’’ అని నాన్న గొడవ పెడుతూ ఉన్నా, అమ్మ మాత్రం బోస్‌ను బడికి పంపించడం మానదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. బోస్ గురించి ప్రత్యేకంగా కలిసి మాట్లాడాలని స్కూల్ ప్రిన్సిపాల్ అమ్మను పిలిపించాడు. బోస్‌ను ఇంకా స్కూల్లో ఉంచడంలో అర్థం లేదన్నాడాయన. గతం, భవిష్యత్‌ల పట్టింపే లేకుండా వర్తమానంలో బతకడమే బోస్ జీవితమని, అతణ్ని స్కూల్లో వేయడమంటే బంధించడమన్నట్టే అని చెప్పాడు – ‘‘ఇంకా ఇక్కడే ఉండి తను చేసేదేమీ లేదు. తనని దాటిపోతున్న పిల్లల్ని చూసి బాధపడటం తప్ప. ఏవైనా చిన్న చిన్న బాధ్యతలు అప్పజెప్పండి. లేదా హాయిగా, అలా స్వేచ్ఛగా వదిలేయండి!’’.ప్రిన్సిపాల్ మాటలనే తల్చుకుంటూ బయట మైదానంలో తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్న బోస్ దగ్గరికొచ్చింది అమ్మ. అమ్మ చేతిలోని రిపోర్ట్‌ను లాక్కొని చూశాడు. కాసేపు ఏం మాట్లాడలేదు. ‘‘నేను బాగానే చదివానమ్మా!’’ అన్నాడు. అమ్మ బోస్‌ను దగ్గరకు తీసుకొని అతని తలనిమిరి ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బోస్ స్కూల్‌కి ఇంకెప్పుడూ వెళ్లలేదు. ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్ అందరూ స్కూల్‌కు వెళ్లిపోతున్నారని ఒక్కడే కూర్చుని ఏవేవో బొమ్మలు ముందేసుకొని వాటికి కబుర్లు చెబుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. బోస్‌ని ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పెడదామని నాన్న ఆలోచన చేశాడు. ‘‘వాడ్ని పిచ్చాసుపత్రిలో పెడతారా?’’ అని అమ్మ గొడవ చేసింది. అందరూ పడుకున్నాక ఒక్కతే గార్డెన్లో ఏడుస్తూ కూర్చుంది. అమ్మను చూసి బోస్ ఆమె దగ్గరకొచ్చి, ‘‘అమ్మా!’’ అని పిలిచాడు. ‘‘బాబూ! నువ్వింకా పడుకోలేదా?’’ అని కళ్లు తుడుచుకుంది అమ్మ. అమ్మ ఒళ్లో పడుకున్నాడు బోస్. ‘‘నేను ఏదైనా పనిచేస్తానమ్మా! బాగా కష్టపడి పనిచేసి నాన్నంత పెద్ద సైంటిస్ట్ అవుతా’’ అన్నాడు. మళ్లీ బోసే – ‘‘చదువుకోకున్నా బాగా పనిచేస్తే సైంటిస్ట్ అవ్వొచ్చు కదమ్మా!’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏం కావాలంటే అది కావొచ్చు నాన్నా!’’ అని బోస్ నుదుటిపై ముద్దు పెట్టి దగ్గర తీసుకుంది అమ్మ. బోస్ ఉద్యోగంలో చేరాడు. తమ కాలనీలోనే ఉండే ఓ క్యాంటీన్లో ఫుడ్ డెలివరీ చేసే చిన్న ఉద్యోగం. బోస్ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.అక్కడే అతనికి ఒకమ్మాయి పరిచయమైంది. రజియా. పియానో టీచర్ ఆమె. ముందు ఆంటీ అని పిలిచాడు. తర్వాత టీచర్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఉద్యోగం బోస్‌ను ఎప్పటికప్పుడు బిజీగా ఉంచేది. తాను జాయిన్ అయ్యాక ఆ క్యాంటీన్‌కు మరిన్ని లాభాలు కూడా తెచ్చిపెట్టాడు. ఎప్పుడైనా బోర్ కొట్టినట్టు ఫీలయితే ఒక్కడే ఆడుకునేవాడు బోస్. ఒకరోజు అలాగే ఒంటరిగా కూర్చుని ఉన్న అతని దగ్గరికొచ్చి, ‘‘ఫ్రెండ్! ఒక్కడివే ఆడుకుంటున్నావేం? ఎందుకు బ్యాడ్ మూడ్లోఉన్నావు?’’ అనడిగింది రజియా. అతనేం మాట్లాడలేదు. ‘‘హలో! ఎందుకు బ్యాడ్ మూడ్‌లో ఉన్నావు?’’ మళ్లీ అడిగింది.‘‘చందు తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తున్నాడు. నన్ను రావొద్దన్నాడు. నా క్లాస్మేట్స్ కూడా ఎవ్వరూ నాతో డిన్నర్‌కి రారు. పార్టీలకు రారు. వాళ్ల పేరెంట్స్‌తో వెళతారు.’’ ‘‘నన్ను కూడా ఎవ్వరూ డిన్నర్‌కి తీసుకెళ్లరు. పోనీ నన్ను డిన్నర్‌కి తీసుకెళ్లడానికి నీకు వీలవుతుందా?’’ సరిగ్గా బోస్ మాట్లాడినట్టే అమాయకంగా మాట్లాడుతూ అడిగింది రజియా.బోస్ ఉత్సాహంగా ఆమె వైపు చూశాడు. ఆ వెంటనే, ‘‘జోక్!’’ అన్నాడు.‘‘కాదు నిజం.’’ అని చెప్పి రజియా బోస్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లింది. ‘‘నువ్వే నా బాయ్‌ఫ్రెండ్‌వి.’’ అని చెప్పి డేట్‌కి కూడా తీసుకెళ్లింది. రోజులు గడుస్తున్నాయి. రజియా ఇప్పుడు బోస్కి బెస్ట్‌ఫ్రెండ్. ఆమెకు లెక్కలేనన్ని కబుర్లు చెబుతూ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. టీచర్ అని పిలవడం దగ్గర్నుంచి ఫ్రెండ్ అనే మాటకు వచ్చేశాడు. భవిష్యత్ భయాల్లేని బోస్ జీవితం ఒకరోజు ఎవ్వరూ ఊహించని మలుపు తీసుకుంది. అది స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుగుతున్న రోజు. బోస్ నాన్నతో పాటు ఆ కన్వెన్షన్ ఏరియాలో ఉండే సైంటిస్టులంతా హాజరయ్యారు. వైభవంగా జరుగుతున్న వేడుక వద్దకు పోలీసులు వచ్చి అప్పుడే ఎగరేసిన జెండాలో పెద్ద బాంబు ఉందని చెప్పారు. దగ్గర్లో ఉన్న 150 గజాల్లో ఉన్న ఏ ఒక్క బిల్డింగూ మిగలదు. ఆ బిల్డింగ్ లోపల గొప్ప సైంటిస్టులు ఉన్నారు. వాళ్లంతా కళ్లముందు చనిపోతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. ఇరవై కేజీల జెండాను ఎవరైనా కొద్దిదూరం మోసుకెళితే సైంటిస్టులను కాపాడుకోవచ్చు. ‘‘సైంటిస్టులను చంపడానికి ఇది పాకిస్తాన్ చేసిన కుట్ర. ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే తప్ప వాళ్లు మనకు మిగలరు.’’ రీసెర్చ్‌సెంటర్ పెద్దాయన అందరికీ ఈ మాట చెప్పి ఎవరైనా ముందుకొస్తారేమోనని చూశాడు. ఎవ్వరూ రాలేదు. అక్కడున్న చాలామందికి బోస్ ఒక్కడే ఈ పని చేయదగ్గ వాడని అనిపించింది. అతని జీవితం ఇక్కడితోనే ఆగిపోయినా ఫర్వాలేదనుకున్నారంతా. అమ్మను ఒప్పించారు. బోస్కి బాంబువిషయం చెప్పకుండా జెండా మోసుకు వెళ్లమని మాత్రం చెప్పారు. ‘‘అమ్మా! చాలా నొప్పిగా ఉంటుందా అమ్మా’’ అనడిగాడు బోస్.‘‘అమ్మ కోసం ఈ పని చెయ్యి..’’ అంది అమ్మ. బోస్ జనగణమన పాడుతూ జెండాని ఎత్తుకొని పెద్దాయన చెప్పినంత దూరం పరిగెత్తాడు. ఆ తర్వాత బోస్ ఎవ్వరికీ కనిపించలేదు. బోస్ చేసిన గొప్పలు చెబుతూ అతని పేరుమీద ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఎవ్వరూ చేయలేని సాహసం బోస్ చేశాడని కొనియాడారందరూ.కానీ ఆ రోజు అక్కడున్న వారెవ్వరికీ తాను చనిపోతాడని తెలిసినా బోస్ ఈ సాహసం చేశాడని తెలియదు, రజియా చెప్పేవరకూ. -
బోస్.. మ్యాజిక్ బాస్
భీమవరం: ఇంద్రజాలంలో రాణిస్తూ.. అంతర్జాతీయస్థాయి కీర్తిని సొంతం చేసుకున్నారు డాక్టర్ బోస్. ఆయన పూర్తిపేరు దంతులూరి సత్యనారాయణరాజు. ఊరు భీమవరం. ఇంద్రజాల ప్రదర్శనలు, పుస్తక రచన, పరిశోధనలతో ఆయన మ్యాజిక్ స్టార్‌గా గుర్తింపు పొందారు. సుమారు 50 ఏళ్లుగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ.. అనేక అవార్డులు, బిరుదులు, సన్మానాలు, సత్కారాలు పొందారు. 1948లో జన్మించిన బోస్ కామర్స్‌లో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ అకౌంట్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో పూర్తిచేశారు. పీపుల్స్ మ్యాజిక్ సర్కిల్(ఇండియా) అధ్యక్షునిగా, ఇంద్రజాలం, ఇంద్రజాల ప్రపంచం, మాయాదండం వంటి పత్రికలకు ఎడిటర్‌గా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ మ్యాజిక్ డైరెక్టర్‌గా, నేషనల్ మ్యాజిక్ కళాశాల కర్సపాండెంట్గా పనిచేశారు. 16 మ్యాజిక్ పుస్తకాల రచన డాక్టర్ బోస్ ఇంద్రజాలం, మ్యాజిక్ గైడ్, మాయా బజార్, మ్యాజిక్ షో, మహిమలు, మర్మాలు, బుద్ధ గాథ–బుద్ధ బోధ వంటి ఇంద్రజాలానికి సంబంధించిన 16 పుస్తకాలను రచించారు. వివిధ పత్రికల్లో వ్యాసాలూ రాశారు. బిరుదులు, అవార్డుల పరంపర ఆయన ఇంద్రజాల కళా సార్వభౌమ, మ్యాజిక్ చక్రవర్తి, మెగా మెజీషియన్, మ్యాజిక్ మాస్టర్ వంటి 11 బిరుదులు పొందారు. అలాగే మ్యాజిక్ రత్న, ఆంధ్ర రత్నం, విశిష్ట ఇంద్రజాలికుడు అవార్డు, నేతాజీ అవార్డు, శాంతి సామరస్యం వంటి దాదాపు 27 అవార్డులను కుబుద్బెన్జోషి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, బీష్మనారాయణసింగ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. 13 వరల్డ్ రికార్డులు ఆయన సొంతం సత్యనారాయణరాజు మ్యాజిక్‌లో అద్భుతాలు సృష్టించి వరల్డ్ రికార్డులనూ సొంతం చేసుకున్నారు. యూనిక్ వరల్డ్ రికార్డు, ఎమేజింగ్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు వంటి 13 రికార్డులను తన కీర్తిమకుటంలో పొందుపరుచుకున్నారు. అంతేనా.. బోస్ స్వయంగా వంద మ్యాజిక్ ట్రిక్కులను మరొక 100 మ్యాజిక్ పరికరాలను తయారు చేయడం విశేషం. గతంలో భీమవరం పట్టణంలో కళ్ళకు గంతులు కట్టుకుని మోటారు సైకిల్ నడిపి అబ్బురపర్చడమేగాక మ్యాజిక్కు సంబంధించి రాష్ట్ర, జాతీయస్థాయి సమావేశాలు, తరగతులు నిర్వహించారు. వేలాది ప్రదర్శనలిచ్చిన డాక్టర్ బోస్ సమాజంలోని మూఢ నమ్మకాలపై ప్రచారం చేయడంతోపాటు శాంతి, అహింసలను ప్రబోధించే బౌద్ధ పుస్తకాలను రచించి జైళ్లలోని ఖైదీలకు ఉచితంగా పంపిణీ చేశారు. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడానికి కృషి చేశారు. విదేశీ పర్యటనలు సత్యనారాయణరాజు మ్యాజిక్‌ను ప్రదర్శించడానికి సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాడ్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ వంటి దేశాల్లో పర్యటించారు. తోటి మేజీషియన్లను గౌరవించాలనే సంకల్పంతో ఏటా బోస్ మ్యాజిక్ నగదు అవార్డును అందజేస్తున్నారు. -
పవన్ తో దాసరి 'బోస్' కల నెరవేరకుండానే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు గతంలో స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్‌కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్‌తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వెలువడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో తాజాగా దాసరి, బోస్ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరిగింది. పవన్ దాసరిలకు సినీ రంగంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఈ అంశాలను ప్రతిభించేలాగే ఉంటుందన్న టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని దాసరి...చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం సందర్భంగా కూడా ప్రస్తావించారు. అయితే ఇంతలోనే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురవడం... అనంతరం కోలుకున్నారు. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌పై చర్చలు జరిగినప్పటికీ దాసరి హఠాత్ మరణంతో ‘బోస్’ చిత్రం ప్రశ్నార్థకంగా మారింది. -
‘బాబు’ గొప్పలకు ప్రజలు అప్పుల పాలు
ఎమ్మెల్సీ బోస్ ఆక్షేపణ రామచంద్రపురం : చంద్రబాబు సర్కారు గొప్పల కోసం ప్రజలను అప్పులు పాలు చేస్తోందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. మంగళవారం రాత్రి రామచంద్రపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా వృద్ధి రేటు సాధిస్తున్నామని చెబుతూ గొప్పలకు పోతోందన్నారు. వర్షాభావ పరిస్థితులు, కరువు, వ్యవసాయానుబంధ రంగాల తిరోగమనం, నీటి పారుదల రంగంలో రాష్ట్రం మౌనం వహించటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చులో వెనుకబాటు తదితర వాటిని మండలిలో ప్రస్తావించానని చెప్పారు. 2014–15లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూ.1.40 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడితే విభజన అనంతరం రెండు రాష్ట్రాల బడ్జెట్ ప్రస్తుతం రెట్టింపు అయిందన్నారు. లోబు బడ్జెట్ నేరం కాదని పరిమితికి మించి ఉండకూదన్నారు. ప్రపంచ సరాసరి వృద్ధి రేటు 3.1శాతం, దేశంలో వృద్ధి రేటు 7.1శాతం కాగా నోట్ల రద్దు అనంతరం అది 6.06 శాతానికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతున్నట్టే రెవెన్యూ లోటు కూడా పెరుగుతుందన్నారు. వృద్ధి రేటు పెరుగుతున్నప్పుడు రాబడి పెరగాలని రాష్ట్రంలో అలా లేకపోవటంతో సర్కారు చెబుతున్న వృద్ధి రేటు నమ్మశక్యంగా లేదని నిపుణులు అనుమానిస్తున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు, సేవల రంగాల్లో వృద్ధితోనే జీడీపీ పెరుగుతుందన్నారు. ఆ రంగాలేవి ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధిలో లేవని ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే తేట తెల్లమవుతుందన్నారు. ఖరీఫ్‌లో 2014 నాటికి, ఇప్పటికీ చూస్తే అన్ని పంటలు కలిపి 5.24 లక్షల హెక్టార్లు, రబీలో 7.59 లక్షల హెకార్లలో పంట విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. 2014లో 13 జిల్లాల్లో 234 కరువు మండలాలుండగా 2016–17లో 301 మండలాలకు పెరగ్గా అనంతపురం కర్నూలు, ప్రకాశంలో పూర్తి దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఎంపెడా సంస్థ 30శాతం చేపల ఎగుమతులు జరిగాయని చెబుతుంటే ఆర్థిక మంత్రి 45 శాతం అని పేర్కొనడంపై విచారణ చేయాల్సిన బాధ్యత లేదా అని బోస్ ప్రశ్నించారు. నీటి పారుదల రంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా నీటిని తోడుకునేందుకు ప్రాజెక్టులను తెలంగాణ సీఎం నిర్మిస్తుంటే చంద్రబాబు సర్కారు పెదవి విప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులæ వల్ల పోలవరానికి కలిగే నష్టాలు తద్వారా కృష్ణా,గోదావరి డెల్టాలు ఎడారిగా మారనున్నాయని విమర్శించారు. ధవళేశ్వరం నుంచి గోదావరిని కృష్ణా నదికి బ్రిటిష్ కాలంలోనే అనుసంధానం చేశారన్నారు. దేశంలో 8చోట్ల 20 నదులకు పైగా అనుసంధానం 100 ఏళ్ల క్రితమే జరిగిందనే సంగతిని ఇరిగేషన్ మంత్రి మర్చిపోయి గొప్పలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడేళ్లు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.4.691 కోట్లను, బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో రూ.1,836 కోట్లను ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97, 123 కోట్లు రాష్ట్రానికి అప్పులు ఉంటే అవి 2018 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు పెరుగుతాయని చెప్పడం దారుణమన్నారు. సర్కారు విధానాల ఫలితంగా అన్ని రంగాలు దెబ్బతింటుంటే ఇంక వృద్ధి రేటు ఎలా సాధ్యమవుతుందని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని బోస్ డిమాండ్ చేశారు. -
బోస్... సన్నాఫ్ ఇండియా!
పవన్‌కల్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని దాసరి నారాయణరావు ప్రకటించి చాన్నాళ్లయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా పనులు చురుగ్గా జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. దాసరి సొంత నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిల్మ్స్ పతాకంపై ఇటీవల ఫిల్మ్‌చాంబర్‌లో ‘బోస్’ అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ‘సన్నాఫ్ ఇండియా’ అనేది ఉపశీర్షిక. ఈ టైటిల్ పవన్ కల్యాణ్‌తో చేయనున్న సినిమా కోసమేనని సమాచారం. దేశభక్తి కథతో ఈ సినిమా నిర్మించాలని దాసరి భావిస్తున్నారట. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని భోగట్టా. డాలీ దర్శకత్వంలో పవన్ నటించనున్న ‘కాటమరాయుడు’ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి.. ‘కాటమరాయుడు’ తర్వాత త్రివిక్రమ్ చిత్రం తెరకెక్కుతుందా? దాసరి సినిమా పట్టాలెక్కుతుందా? అనేది వేచి చూడాలి. -
పవన్, దాసరిల 'బోస్'..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్‌కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్‌తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందన్న టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా దాసరి, బోస్ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్ దాసరిలకు సినీ రంగంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఈ అంశాలను ప్రతిభించేలాగే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బోస్ అనే టైటిల్‌పై తారక ప్రభు ఫిలింస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'
-
'రష్యన్ కోణంలో దర్యాప్తు జరపాల్సిందే'
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తాను నమ్మడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. నిజం నిర్ధారించలేకపోవడం మన దేశానికే సిగ్గు చేటని, ఆయన గురించి రష్యన్ కోణంలో దర్యాప్తు చేపట్టాలని కోల్ కతాలో జరిగిన నేతాజీ 75వ వార్షికోత్సవ సందర్భంలో ఆమె డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ జాతి పిత అయితే, స్వాతంత్ర్యం రాకముందు నేతాజీ జాతి నేత అని ఆమె అన్నారు. నేతాజీ ప్రమాదంలో చనిపోయి ఉంటే... స్వాతంత్ర్యం తర్వాత ఆయన కుటుంబం రహస్యంగా ఎందుకు బతకాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి సమాధానం కావాలంటే రష్యన్ కోణంలో దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా నేతాజీ మనవడు ఆశిష్ రే నిర్వహిస్తున్న బ్రిటిష్ కు చెందిన వెబ్ సైట్ www.bosefiles.info అదే విషయంపై అధ్యయనాలు నిర్వహించి, నివేదికలను వెల్లడించింది. ఏళ్లకాలంగా ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు నేతాజీ చివరి రోజుల్లోని వివరాలు, ప్రత్యక్ష సాక్ష్యాలను సేకరించి వెబ్ సైట్ లో పొందుపరిచింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు ఆ వెబ్ సైట్‌లోని నాలుగు నివేదికలూ నిర్ధారిస్తున్నాయి. ఆగస్టు 18, 1945లో తైపీ దగ్గర జరిగిన విమాన ప్రమాదం తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణించారని, అయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ విషయాన్ని నమ్మడం లేదని, రష్యన్ కోణంలో దర్యాప్తును కోరుకుంటున్నారని రే అంటున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగింది? బోస్ ప్రమాదం నుంచి బయట పడ్డారా లేదా అన్న వివరాలపై ఆయన అనుచరుడు కల్నల్ హాబిబర్ రెహ్మాన్ చెప్పిన విశేషాలు సహా మరిన్ని వివరాలను ఆశిష్ రే... తాజాగా వెబ్ సైట్లో పోస్ట్ చేశారు. బోస్ అనుచరుడు చెప్పిన ప్రకారం ఎయిర్ క్రాష్ నుంచి బోస్ తో పాటు రెహ్మాన్ కూడా బయట పడ్డారని, ఆరోజు ఫిన్నే, డేవిస్... అనే ఇద్దరు పోలీసు అధికారుల నేతృత్వంలో ఇండియానుంచి దర్యాప్తు కోసం హెచ్ కె రాయ్, కెపి డే నిఘాజట్లు సైగాన్, తైపీలలో దర్యాప్తు చేపట్టడం కోసం బ్యాంకాక్ కు వెళ్ళారని, జపనీస్ అధికారిక డాక్టర్ ట్సురుతాను విచారించామని రే చెప్తున్నారు. బోస్ చనిపోయే ముందు నర్స్ ట్సాన్ పై షా చికిత్స అందించారని, డాక్టర్ యోష్మి ని రే స్వయంగా కలిశానని కూడ అంటున్నారు. విమాన ప్రమాదం తర్వాత బోస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఈ వివరాలన్నీ నిర్ధారిస్తున్నాయని రే స్పష్టం చేస్తున్నారు. నోనోమియా అనే లెఫ్టినెంట్... సుభాష్ చంద్రబోస్ ఓ ప్రత్యేకమైన, ప్రముఖమైన వ్యక్తి అని చెప్పారని, అందుకే ఆయన్ను ఎలాగైనా బతికించాలని ప్రయత్నించామని డాక్టర్ యోష్మి అన్నట్లు కూడా రే వెల్లడించారు. అయితే బోస్ పరిస్థితి విషమంగా మారుతున్న సమయంలో ఆయన్ను ఎలా ఉంది అని అడిగితే... తలలో తీవ్ర రక్తప్రసరణ జరుగుతున్నట్లనిపిస్తోందన్నారని, ఓ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే ఆయన ప్రాణంపోయిందని డాక్టర్ రేష్మి వివరించినట్లు 'రే' చెప్తున్నారు. మమతా బెనర్జీకి ఈ విషయాలపై నమ్మకం కుదరడం లేదని అందుకే ఆమె రష్యన్ కోణంలో దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారని ఆశిష్ రే అంటున్నారు. -
బోస్ పరిశోధన సంస్థలో అగ్నిప్రమాదం
కోల్‌కతా తూర్పు ప్రాంతంలోని రాజా బజార్లో గల బోస్ పరిశోధన సంస్థలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంస్థలో గల మైక్రోబయాలజీ ల్యాబ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1917లో బోస్ పరిశోధన సంస్థను స్థాపించారు. విఙ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు విభాగాలలో ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తారు. -
ఆ ఆరుగురిలో ఇద్దరు రైతుల మృతి
గుంటూరు: దేవాలయ భూములను వేలం వేయకూడదంటూ ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం తాడిపర్రు గ్రామంలో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. బోసు అనే రైతు ఆరోజే మృతి చెందగా, బుధవారం ఉదయం నాగేశ్వరరావు అనే రైతు ప్రాణాలు వదిలాడు. దీంతో ఆగ్రహించిన అఖిలపక్ష నేతలు బుధవారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రైతు మృతదేహంతో ధర్నాకు దిగారు. మృతిచెందిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబంలో అర్హులైన వారికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారు సాగుచేసుకుంటున్న భూమిని వారికే అప్పగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కాంతిలాల్ దండే సంఘటన స్థలానికి వచ్చి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని.. అడిగిన డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో అఖిలపక్ష నేతలు ఆందోళన విరమించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, నేత లేళ్ల అప్పిరెడ్డి, సీపీఐ నేతలు, ప్రజాసంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. -
సుభాష్ చంద్రబోస్ జయంతి
-
'ట్రావెల్స్‌ను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం'
హైదరాబాద్ :ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోస్ తెలిపారు. పాలెం బస్సు సంఘటనను దృష్టిలో పెట్టుకుని వేధిస్తున్న కారణంగా ఇంతకన్నా ప్రత్యామ్నాయం కనబడటం లేదన్నాడు. ఆర్టీఏ అధికారులు తమను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యజమానులను సీజ్ పేరుతో వేధించడంపై బోస్ పై విధంగా వ్యాఖ్యానించాడు. తాము బస్సులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. పాలెం ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ కఠిన వైఖరి కనబరచడంతో యజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తూ బస్సులను సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రైవేటు ట్రావెల్స్ గుర్రుగా ఉన్నాయి. ఒక్క ఘటనను ఆధారంగా చేసుకుని ఆర్టీఏ అధికారులు తమను ఇబ్బందులు పెట్టడం తగదని వారు విన్నవిస్తున్నారు. ఒకవేళ ఇలానే ఉంటే ప్రైవేటు బస్సులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పలు జిల్లాల్లో సుమారు 50కి పైగా బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 16 బస్సులను అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న 16 వోల్వో బస్సులను ఆర్టీఏ అధికారులు సోమవారం అనంతపురం వద్ద సీజ్ చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అయిదు ప్రయివేటు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. -
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: పిల్లి సుభాష్ ప్రసంగం