బాబుకు తోడు దొంగల వత్తాసు | Siemens Ex MD Suman Bose About Chandrababu Arrest Over Skill Development Scam Case | Sakshi
Sakshi News home page

బాబుకు తోడు దొంగల వత్తాసు

Published Mon, Sep 18 2023 5:15 AM | Last Updated on Tue, Sep 19 2023 1:26 PM

Siemens Ex MD Suman Bose About Chandrababu Arrest Over Skill Development Scam Case - Sakshi

స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ గురించి తమకు తెలియదని, తమకు సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ పంపిన ఈ మెయిల్‌లో ఓ భాగం

సాక్షి, అమరావతి: ఓ దొంగ... మరో దొంగకు మద్దతిస్తే ఎలా ఉంటుంది? ఒకరికి మద్దతుగా మరొకరు తెరమీదికొచి్చ ‘తనేమీ తప్పు చేయలేదు’ అని చెప్పటం!!.. వినటానికే విచిత్రంగా ఉంది కదూ? నిజానికి కోర్టుల్లో కనుక ఇలా సాక్ష్యాలు చెబితే జైల్లో పడేస్తారు. కానీ ఎల్లో మీడియా మాత్రం... ఆ దొంగలు చంద్రబాబు నాయుడికి ఇస్తున్న సర్టిఫికెట్లను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అవే నిజాలని జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

ఒకవేళ అవి నిజాలే అనుకుంటే... ఇలా ఎల్లో మీడియాలో సాక్ష్యాలు చెబుతున్న దొంగలను గతంలో ఎన్‌­ఫో­ర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇదే కేసులో ఎందుకు అరెస్టు చేసింది? ఐటీ శాఖ ఎందుకు వాళ్లకు నోటీసులిచ్చింది? తాము తప్పు చేశా­మని వాళ్లు ఎందుకు ‘ఈడీ’ ఎదుట ఒప్పుకున్నారు? ఈ ప్రశ్నల్లో దేనికీ ‘ఈనాడు’ దగ్గర గానీ, దాని తోక మీడియా దగ్గర గానీ సమాధానాలు లేవు. వారికి తెలిసిందల్లా... చంద్రబాబు శుద్ధ పూస అని జనాన్ని నమ్మించేందుకు మొత్తం తమ మీడియా సామ్రాజ్యాన్ని అబద్ధాలకు తాకట్టు పెట్టడమే. అదే జరుగుతోంది కూడా!. 

దుర్యోధనుడు మంచోడని దుశ్శాసనుడు, శకుని సాక్ష్యం చెబుతున్నట్లే ఉంది టీడీపీ వ్యవహారం. స్కిల్‌ కుంభకోణంలో ఆధారాలతోసహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు మద్దుతుగా ఆ కేసులో ఇతర నిందితులు వికాస్‌ ఖన్విల్కర్, సుమన్‌ బోస్‌ వంటి వారు ఇంటర్వ్యూలిస్తుండటం... సిగ్గులేకుండా వాటిని ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తుండటం రాష్ట్రం మొత్తాన్ని విస్మయపరుస్తోంది. షెల్‌ కంపెనీల ద్వారా నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌ ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా వీడియో విడుదల చేశారు.

కాగా తాజాగా ఈ కేసులో మరో నిందితుడు సుమన్‌ బోస్‌ ‘మా చంద్రబాబు నీతిమంతుడు’ అని సరి్టఫికెట్‌ ఇచ్చేశారు. నిజానికి సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఒప్పందం చేసుకుని కోట్లు కొల్లగొట్టడంలో కీలక పాత్రధారి ఈ సుమన్‌ బోసే. ఈయనను, వికాస్‌ ఖన్విల్కర్‌ను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీఐడీ రెండూ అరెస్టు చేశాయి. జైల్లో ఉండి... బెయిలుపై బయటకు వచ్చారు. ఇలా బెయిలుపై వచి్చన వాళ్లు కేసులోని మరో నిందితుడికి మద్దతుగా మీడియాతో మాట్లాడటమే చిత్రాతిచిత్రం. వాస్తవానికి సుమన్‌బోస్‌ అసలు బండారాన్ని బయటపెడుతూ సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే ఇటు సీఐడీకీ అటూ న్యాయస్థానానికి కూడా వాంగ్మూలాన్ని ఇచ్చిందన్నది టీడీపీ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోంది. 

మాకు తెలీదు.. సంబంధం లేదు: సీమెన్స్‌ 
టీడీపీ ప్రభుత్వంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రాజెక్ట్‌లో తమ అవినీతి దందాకు ‘సీమెన్స్‌ కంపెనీ ముసుగు వేయాలన్న చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. అసలు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ గురించి తమకు తెలియనే తెలియదని సీమెన్స్‌ కంపెనీ కుండబద్దలు కొట్టింది. డిజైన్‌ టెక్‌ కంపెనీతో కలసి ఏపీఎస్‌ఎస్‌డీసీతో తాము కుదర్చుకున్నట్టు చెబుతున్న త్రైపాక్షిక ఒప్పందానికి, తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్ట్‌ కింద 90 శాతం నిధు­లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా సమకూర్చే పద్ధతి అసలు తమ కంపెనీ పాలసీలోనే లేదని విస్పష్టంగా తేల్చింది.

తమ కంపెనీ పేరిట సుమన్‌ బోస్‌ టీడీపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని... అసలు అటువంటి ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ఆయనకు కంపెనీ అప్పగించనే లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబు­తూ పంపిన ఈ–మెయిల్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీమెన్స్‌ కంపెనీ పూర్తిగా సహకరిస్తోంది.

కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు వారిద్దరే.. 
స్కిల్‌ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు కాగా,  సుమన్‌ బోస్, వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. వారి బండారాన్ని సీఐడీ, ఈడీ ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. ఒప్పందంలో ఓ చోట సుమన్‌ బోస్‌ అని మరో చోట సౌమ్యాద్రి బోస్‌ అని సంతకాలు చేసినట్టు ఆడిట్‌ నివేదిక నిగ్గు తేల్చింది. సీమెన్స్‌ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించి సుమన్‌ బోస్‌ తమ కంపెనీ పేరిట చేసిన మోసాన్ని నిర్ధారించింది. ఆయన అప్పటికే డిలీట్‌ చేసిన ఈ–మెయిల్స్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ సందేశాలను రిట్రీవ్‌ చేసి ఆ రికార్డులను సీఐడీకి అప్పగించింది.

తమ కంపెనీకి తెలియకుండానే సుమన్‌ బోస్‌ ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం చేసుకున్నారని, అటు తమ కంపెనీని మోసం చేయడంతోపాటు ఇటూ ఏపీ ఖజానాను కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించారని న్యాయ­స్థానంలో 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇక షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌ కీలక పాత్ర పోషించారు. దాంతో సుమన్‌ బోస్, వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌లను సీఐడీ 2021, డిసెంబర్‌10న అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌ విధించింది. వారిద్దరు 2022, జనవరి 18 వరకు అంటే 40 రోజులపాటు జైలులో ఉన్నారు. బెయిలుపై వచ్చి ఎల్లో మీడియాలో చిలకపలుకులు చెబుతుండటమే ఘోరాతిఘోరం. 

సుమన్‌బోస్, ఖన్విల్కర్‌లను అరెస్ట్‌ చేసిన ఈడీ 
ఇక స్కిల్‌ కుంభకోణంపై కేంద్ర ద­ర్యా­ప్తు సంస్థ ఈడీ కూడా కేసు నమో­దు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమన్‌ బోస్, వికాస్‌ వినాయక్‌ ఖన్విల్కర్‌లతోపాటు షెల్‌ కంపెనీల ప్రతినిధులు సురేష్‌ గోయల్, ము­కుల్‌ చంద్ర అగ­ర్వాల్‌లను ఈ ఏడాది మార్చి 4న అరెస్ట్‌ చేసింది. వారికి విశాఖపట్నంలోనీ సీబీఐ న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఆ నలుగురినీ ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని 10 రోజులపాటు విచారించారు. అటువంటి సుమన్‌ బోస్, వికాస్‌ వినాయక్‌ ఖన్విన్వేల్కర్‌ ప్రస్తుతం స్కిల్‌ కుంభకోణంలో అవినీతి జరగలేదని చెబుతూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటం దెయ్యాలు వేదాలు  వల్లించినట్టుందని పరిశీలకులకు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ అంశంలో ప్రశ్నావళికి సీమెన్స్‌ కంపెనీ ఈమెయిల్‌ ద్వారా చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి..
ప్రశ్న:  జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కోసం సీమెన్స్‌–డిజైన్‌ టెక్‌ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్‌ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా సీమెన్స్‌ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్‌ కంపెనీలో ఉందా?  
సీమెన్స్‌ కంపెనీ సమాధానం: గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్‌ కంపెనీలో లేనే లేదు. డిజైన్‌ టెక్‌ కంపెనీతో కలసి మేము స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు.  

ప్రశ్న:  ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచిగానీ డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి ఏమైనా వర్క్‌ ఆర్డర్‌ మీకు వచ్చిందా?  
సీమెన్స్‌ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచిగానీ డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్‌ ఆర్డర్‌ రాలేదు. 

ప్రశ్న:  ఏపీఎస్‌ఎస్‌డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్‌ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్‌ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్‌ బోస్‌ సంతకాలు చేశారు. సీమెన్స్‌ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు?  
సీమెన్స్‌ కంపెనీ సమాధానం: సీమెన్స్‌ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్‌ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్‌ బోస్‌ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ పేరిట అవినీతి కేసులో సుమన్‌ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్‌ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్‌ బోస్‌ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్‌ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.

కరెంటు పోయింది.. కొవ్వొత్తుల వెలుగులోసంతకాలు చేశా
ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదంటూ బుకాయించేందుకు యతి్నంచి సుమన్‌ బోస్‌ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఆ ప్రాజెక్ట్‌ ఒప్పంద పత్రంలో ఏమని రాసి ఉందో కూడా తెలియదని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున కరెంట్‌ పోయిందని... కొవ్వొత్తులు తెప్పించారని...ఆ కొవ్వొత్తుల వెలుగులోనే తాము సంతకాలు చేశామని చెప్పారు. ఇంతకీ ఆ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement