certificate
-
మెసేజ్ పెడితే సర్టిఫికెట్ పంపిస్తాం
బొమ్మనహాళ్ : రెవెన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తామన్నారు. పెన్షన్లు సక్రమంగా ఇచ్చారా, లేదా అని తెలుసుకోవడానికి నేరుగా ఫోన్లు కూడా చేస్తామన్నారు. ఎవరైనా లంచం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. శనివారం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తొలుత గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పాల్తూరు రుద్రమ్మ ఇంటికి వెళ్లి వితంతువు పెన్షన్ రూ.4 వేలు, బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకు వెళ్లి రూ.15 వేలు వికలాంగుల పెన్షన్ అందజేశారు. నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో మాట్లాడారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా తన జీవితం ధన్యమైందన్నారు.రాష్ట్రంలో తాము ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్యం ధరలు కూడా తగ్గించామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించకూడదన్నారు. ఎక్కడా కూడా బెల్టు షాపులు పెట్టకూడదని, ఎవరైనా బెల్టు షాపులు తెరిస్తే తాను బెల్ట్ తీయాల్సి వస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు ‘మీ ఊర్లో ఇసుక మీరే తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చాను. ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇసుకను ఉచితంగా తెచ్చుకోండి. ఎవరైనా అడ్డొస్తే నా పేరు చెప్పండి. అవసరమైతే నిలదీయండి. రెండో గేర్‌లో పోతా ఉంటే నాలుగో గేర్‌లోకి మార్చి స్పీడ్ పెంచండి’ అని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా, మత్తు పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం డ్రోన్స్ నిఘా పెట్టామని, దానికి ‘డేగ’ అని పెరు పెట్టామని తెలిపారు. ‘నా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. త్వరలో నైబర్‌హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. యువత అందరూ సెల్ఫోన్లో రూ.10 వేలు సంపాదించే మార్గం చూపిస్తాం. ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక సమయంలో మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తాం’ అని అన్నారు. -
అతీగతీలేని ‘వినతి’
సాక్షి, అమరావతి :ప్రజల నుంచి భారీఎత్తున విజ్ఞాపనలు తీసుకుంటున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వాటి పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు జనం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రతి శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజూ కొందరు మంత్రులు కూడా అక్కడ విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలను చూసి జనసేన, బీజేపీ ఆఫీసుల్లోనూ ఈ తంతు సాగిస్తున్నారు. అలాగే, ప్రతి సోమవారం ఎప్పటిమాదిరిగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా టీడీపీ ప్రభుత్వం మార్చింది. జనం గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ పెద్దఎత్తున తమ సమస్యలను మొర పెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం మాత్రం దొరకడంలేదు. సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న వారికి సైతం ఎటువంటి ఊరట లభించడంలేదు. ఉదా.. నెలరోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన నబీల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి టీడీపీ ఆఫీసులో తన సమస్యపై సీఎంకు వినతిపత్రం ఇచ్చాడు.కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి పురోగతిలేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వస్తుండడంతో వాటిపై ఏంచేయాలో తెలీడంలేదని అధికారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల గురించే ఎక్కువ మంది ఫిర్యాదుల చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నా అవి ఎప్పుడూ రొటీన్‌గా వచ్చే రెవెన్యూ సమస్యలేనని అధికారులు చెబుతున్నారు. వచ్చిన విజ్ఞాపనలను పరిష్కరించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు. దీంతో చేసేదిలేక 60 రోజుల్లో వినతిని పరిష్కరించాలి కాబట్టి ఈలోపే ఏదో ఒక కారణంతో దాన్ని మూసేసి అది పరిష్కారమైపోయినట్లు నమోదు చేస్తున్నారు. మరోవైపు.. అసలేమీ జరగకుండానే వినతిపత్రం ఇచ్చిన వారికి అది క్లియర్ అయిపోయినట్లు ఎస్ఎంఎస్లు వస్తుండడంతో వారు బిత్తరపోతున్నారు.కోర్టు కేసు లేకుండా ఉన్నట్లు చెప్పి మూసేశారు..తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అల్లవరం గ్రామానికి చెందిన భీమవరపు కటుమస్వామి జులై 15న ఆర్డీఓ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎఫ్ఎంసీ) లేకుండానే తమ కుటుంబానికి చెందిన భూమిని మ్యుటేషన్ చేశారని విజ్ఞాపన ఇచ్చాడు. తన అమ్మమ్మ నూకాలమ్మ 2016లో చనిపోయిందని, ఆమెకు వారసత్వంగా ఉన్న భూమిని ఆమె చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా రెవెన్యూ అధికారులు వేరే కొందరికి మ్యుటేషన్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. అడుగుతుంటే పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.ఆర్డీఓ ఈ వినతిని తీసుకుని ఎఫ్ఎంసీ లేకుండా మ్యుటేషన్ ఎలా చేస్తారని ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వీఆర్ఓ విచారణకు వెళ్లాడు. కానీ, కొద్దిరోజులకు మీ సమస్య పరిష్కారమైందంటూ కటుమస్వామికి ఎస్ఎంఎస్ రావడంతో అతను విస్తుపోయాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే కోర్టులో కేసు ఉందని తహశీల్దార్ రిపోర్టు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని ఫిర్యాదును మూసివేసినట్లు చెప్పారు. అతను ఈ కేసు కోర్టు పరిధిలో లేదని అన్ని ఆధారాలు చూపడంతో నిజమేనని ఒప్పుకున్నా తాము చేసేదేంలేదని ఆర్డీఓ చేతులెత్తేశారు. 60 రోజుల్లోపు వినతిని పరిష్కరించాల్సి వుండడంతో కోర్టు వంకతో వినతిని తహశీల్దార్ క్లియర్ చేసినట్లు తేలింది.65 వేల సమస్యలు పరిష్కారమయ్యాయటఇలా ఇప్పటివరకు 65,211 సమస్యలను పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్) వెబ్సైట్లో జూన్ 15 నుంచి ఇప్పటివరకు 88,761 విజ్ఞాపనలు అందగా, 65,211 విజ్ఞాపనలను పరిష్కరించినట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే, ఇవన్నీ గోకవరం కేసు మాదిరిగానే ఏమీ అవకుండానే కాగితాల్లోనే పరిష్కారమైనట్లు రాసుకున్నారని బాధితులు వాపోతున్నారు. -
విదేశాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా..
విదేశాల వెళ్లాలనుకునేవారికి ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలా అనే ప్రశ్న ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి సుందరకాండలో హనుమంతుడి జవాబులాగా ‘‘అక్కర్లేదు’’ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళదాం..ఈ మధ్యే ఆర్థిక శాఖ తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలో విదేశీయానం చేసేవారంతా ఆదాయపు పన్ను శాఖ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలనే అర్థం వచ్చేలా ధ్వనించింది. దీంతో అందరు పౌరులు ఉలిక్కిపడ్డారు. గాభరా పడ్డారు. షాక్ తిన్నారు. ఎందుకంటే, మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసేందుకు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు స్వయంగా చూసేందుకు విదేశాలకు వెళ్తున్నారు.2023 మార్చి 31తో పోలిస్తే 2024 మార్చి 31 నాటికి పూర్తయిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 15 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 69.6 మిలియన్ల మంది విదేశీయానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అన్ని రకాల వారూ ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఆపాటి, ఈపాటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో విదేశీయానం చెయ్యని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.బడ్జెట్లో ఒక కొత్త మార్పు వచ్చింది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయం మొదలైనవాటిని చూపించని ఎంతో మంది భారతీయ పౌరులు ఉన్నారు. బ్లాక్‌మనీ 2015 చట్టం ప్రకారం ఇలాంటి ఆస్తులను చూపించకపోవటం నేరం. ఇలాంటి వారి మీద దృష్టి పెడుతోంది డిపార్టుమెంటు. ఒకప్పుడు ఎవరు విదేశీయానం చేసినా, ప్రయాణానికి ముందు క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని నిబంధన ఉండేది. దాన్ని సడలించారు. రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా 1/4 బిఅని 1/6 అని షరతులు ఉండేవి. ఒక షరతు ప్రకారం స్వయంగా విదేశీయానం చేయకపోయినా ‘టికెట్’ కొని ఉంటే రిటర్నుల్లో చూపించాల్సి వచ్చేది. కాలక్రమేణా సరడలింపుల వల్ల అంతా మర్చిపోయారు.కానీ మొన్న బడ్జెట్లో ఈ ప్రస్తావన రావడంతో అందరిలోనూ గుబులు.. కానీ నిబంధన కొంతమందికే వర్తిస్తుంది. తల్లిదండ్రులెవరూ భయపడక్కర్లేదు. డిపార్టుమెంటుకి వెళ్లక్కర్లేదు. సర్టిఫికెట్ తీసుకోనవసరం లేదు. రిలాక్స్.. రిలాక్స్.. అందరికీ ఇది అవసరం లేదు. మీరంతా నిశ్చింతగా ప్లాన్ చేసుకోవచ్చు.ఎవరికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి..ఆర్థికపరంగా అవకతవకలు చేసినవారు, పది లక్షలు దాటి పన్ను చెల్లించాల్సిన వారు, ఈ పన్ను భారానికి ‘స్టే’ విధించకపోతే.. ఇటువంటి వారికి కావాలి. ఇది అరుదైన పరిస్థితి. అసాధారణ పరిస్థితి. ట్యాక్స్ చెల్లించకపోవడం నేరం. కట్టకుండా విదేశాలకు వెళ్లే వారి నుంచి .. అంటే డిఫాల్టర్ల నుంచి పన్ను వసూలు చెసే ప్రక్రియలో భాగంగా ఈ సర్టిఫికెట్ అడుగుతారు. పైన చెప్పిన రెండు షరతులు ఫిబ్రవరి 2004 నాడు జారీ చేసిన సూచన .. కాదు.. ఆదేశం అని అనాలి. అంటే 20 సంవత్సరాల మాట .. ఈ ఆదేశానికి, 2015 బ్లాక్ మనీ చట్టానికి లింకు కలిపారు. ఈ విషయాన్నే 2024లో ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల మాట .. ఇప్పుడు ప్రస్తావన తేవడంతో దురదృష్టవశాత్తూ ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది. ఏం గాభరాపడక్కర్లేదు.మీరు ఒక విజయ్ మాల్యాని .. ఒక నీరవ్ మోడీని ప్రస్తావించి గవర్నమెంటు మీద దుమ్మెత్తిపోయకండి. చట్టప్రకారం రిటర్ను వేయడం విధి. పన్ను చెల్లించడం తప్పనిసరి. ఆ దోవలో వెళ్తే మిమ్మల్ని ఎవరూ ఆపరు. అడ్డు చెప్పరు. ఆటంకపర్చరు. ఎయిర్‌పోర్టుకి ఎవరూ రారు. అయితే, ఒక సూచన. మీతోపాటు మీ పాన్‌కార్డు, మీరు అసెస్సీ అయితే లేటెస్ట్ రిటర్ను కాపీ పెట్టుకోండి. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపోయినా రిటర్నులు వేసే అవసరం లేకపోయినా.. అసెస్మెంట్ కాకపోయినా .. అసెస్మెంట్ ఆగిపోయినా 10 లక్షల లోపుల పన్నులు చెల్లించకపోయినా (మనలో మన మాట, బండి అంతవరకు పోనివ్వకండి) గాభరా పడక్కర్లేదు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. బాన్ వొయాజ్.. ఆల్ ద బెస్ట్. -
సిటీ స్కై డ్రోన్స్ ఫ్లై
సాక్షి, హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ నుంచి ఫంక్షన్ల షూటింగ్ దాకా.. మందుల అత్యవసర సరఫరా నుంచి రోడ్డుపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించేదాకా.. డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. మరెన్నో రంగాలు, అవసరాలకూ డ్రోన్లు విస్తరిస్తున్నాయి. పదులు, వందల్లో కాదు.. రోజూ వేల సంఖ్యలో డ్రోన్లు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సరదాగా వాడే చిన్న చిన్న కెమెరా డ్రోన్ల నుంచి ఓ స్థాయిలో బరువులు, వస్తువులు మోసుకెళ్లే భారీ డ్రోన్ల దాకా దూసుకుపోతున్నాయి. దీంతో వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగైతే తప్పనిసరో అలా డ్రోన్లను ఎగరవేసేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. అధికారికంగా, అనధికారికంగా రాష్ట్రంలో సుమారు 3 వేల డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అధికారుల అంచనా.యాచారంలో డ్రోన్ అకాడమీ..ఇప్పటివరకు డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) త్వరలోనే డ్రోన్ల తయారీ, నిర్వహణ సేవలను సైతం అందించనుంది. నగర శివార్లలోని యాచారం మండలంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి ని కేటాయించింది. భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరో ఏడాదిలో డ్రోన్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఆపరేషనల్ మేనేజర్ సామల రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంధనంతో నడుస్తూ, 150–200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యమున్న భారీ డ్రోన్లను నడిపే పైలట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిని రక్షణ, నేవీ రంగాల్లో భద్రత కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 120 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటాయని వివరించారు.డ్రోన్లతో ట్రాఫిక్ నిర్వహణ..జంక్షన్లు, రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ‘మావిక్ 3 పీఆర్ఓ’ డ్రోన్‌ను సైబరాబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు. దీనికి ఉండే నాలుగు అత్యాధునిక కెమెరాల సాయంలో ఏరియల్ ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ రియల్ టైమ్‌లో ప్రసారం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. దీంతో ట్రాఫిక్ పోలీసు బృందాలు ఆయా సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు కలుగుతుంది. వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు.ఔషధాల సరఫరా కోసంనగర శివార్లలోని బీబీనగర్‌లో ఉన్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండు డ్రోన్లను వినియోగిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్షయవ్యాధి మందులను, టీబీ పరీక్షల కోసం కఫం నమూనాలను సైతం డ్రోన్లతో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రెండు గంటలకుపైగా సమయం పడితే.. డ్రోన్‌తో కేవలం పది, ఇరవై నిమిషాల్లోపే అత్యవసర ఔషధాలను చేరవేస్తున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్ క్యాంపస్‌లోని హ్యాంగర్ నుంచి యాదాద్రి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు 8 కిలోల బరువు మోసే సామర్థ్యమున్న డ్రోన్‌తో మందులను సరఫరా చేస్తున్నారు.వ్యవసాయ పనుల్లోనూ ఎంతో లాభంవ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యావంతులైన కొందరు రైతులు డ్రోన్ల వినియోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ల వినియోగం, నిర్వహణ సేవలపై పలు డ్రోన్ తయారీ సంస్థలు, రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ డ్రోన్ అకాడమీ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందు పిచికారీకి ఒక రోజు సమయం పడుతుంది.పైగా రూ.700–1,000 వరకు ఖర్చు అవుతుంది. డ్రోన్‌తో పిచికారీ రూ.500–600 ఖర్చుతోనే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా పురుగు మందు వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. పైగా డ్రోన్‌కు అమర్చే కెమెరాలతో పంటలను ఫొటో తీయడం, చీడ పురుగుల స్థాయిని గుర్తించడం తేలికవుతుంది. ఇక్రిశాట్ సంస్థ పంట రకాలను, దశలను అధ్యయనం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్ లెరి్నంగ్ టెక్నాలజీల సాయంతో విశ్లేషిస్తోంది.వాతావరణ మార్పుల పరిశీలనకూ..నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వాతావరణ పరిశోధన, అంచనాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. వివిధ సెన్సర్లతో కూడిన డ్రోన్‌తో ఆకాశంలో అంతెత్తు వరకు వెళ్లి.. భూమి ఉపరితలం, వాతావరణ పరిస్థితుల డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు.అటవీశాఖ పరిధిలోనూ..అటవీ ప్రాంతాలు, తోటలు, నీటి మట్టం పర్యవేక్షణకు అటవీ శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో ఏనుగు ఇద్దరు రైతులను తొక్కి చంపిన ఘటనలో ఆ ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగించారు. అలాగే పులుల సంచారాన్ని గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలిలైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం నేరంవాహనాలు నడిపేందుకు ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలో అలాగే డ్రోన్‌ను ఎగరవేసేందుకు కూడా సర్టిఫికెట్ కావాల్సిందే. వాణిజ్య అవసరాల కోసం డ్రోన్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ అనుమతి పొందిన సంస్థ నుంచి డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆ లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ సర్టిఫికెట్‌కు పదేళ్ల కాల పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.ఫీజు రూ. 38వేలు...నాలుగేళ్లలో తెలంగాణ డ్రోన్ అకాడమీ నుంచి 600 మందికిపైగా విద్యార్థులు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందారు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు రూ.38 వేలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శిక్షణ కోసం వస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందినవారిలో 30 మందికిపైగా మహిళా డ్రోన్ పైలట్లు ఉండటం గమనార్హం.డ్రోన్లతో స్టార్టప్‌లు పెడుతున్నారువయసు,లింగ భేదాలతో సంబంధం లేకుండా చాలా మందిడ్రోన్ పైలట్ శిక్షణపై ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, నిర్వహణ ఎలా అనే అంశాలపై నైపుణ్యం కోసం మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తర్వాత సొంతంగా డ్రోన్లతో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు. -
ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ ఉత్పత్తుల నాణ్యత పెంచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడకుండా, రైతులకు వ్యయప్రయాసలను తొలగిస్తూ ఇకపై రాష్ట్రంలోనే ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందొచ్చు. ఈ సర్టిఫికెట్ జారీకి సేంద్రీయ ధ్రువీకరణకు వ్యవసాయం, ఆహారశుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి అనుమతినిచి్చంది. ఫలితంగా సేంద్రీయ పంట ఉత్పత్తులకు రైతులు గిట్టుబాటు ధర పొందడంతో పాటు ఆ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. సర్టిఫికేషన్ ఉంటే ’ఏపీ’కి తిరుగేలేదు ఏపెడా లెక్కల ప్రకారం సేంద్రీయ సాగులో మన దేశం 8వ స్థానంలో, ఉత్పత్తిదారుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో 1.07 కోట్ల ఎకరాల్లో సేంద్రీయ పంటలు సాగవుతున్నాయి. వాటిలో 65.73 లక్షల ఎకరాలు వాస్తవ సాగు ప్రాంతం కాగా, 41.51 లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం. ధ్రువీకరించిన సేంద్రీయ ఆహార ఉత్పత్తులు 3.50 మిలియన్ మెట్రిక్ టన్నులు. వాటిలో రూ.7078 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఇండియన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో విదేశాలకు ఎగుమతవుతున్నాయి.పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలోని ఉత్పత్తులకు సర్టిఫికేషన్ లేకపోవడం ఎగుమతులకు ప్రధాన సమస్యగా మారింది. దీంతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆక్వా ఉత్పత్తులు, ఉద్యాన పంటలకు క్రాప్ సర్టిఫికేషన్ చేసుకునే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. మూడేళ్లలోనే ఏపీకి గుర్తింపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 8.50 లక్షల ఎకరాలు సాగవుతున్నప్పటికీ, ఎపెడా లెక్కల ప్రకారం పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో సాగయ్యే విస్తీర్ణం 60 వేల ఎకరాలే. దిగుబడులు 20వేల టన్నులు వస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఇంటర్ననేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్‌పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులే జరుగుతున్నాయి. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటే రూ.2 వేల కోట్లకు పైగా జరుగుతుందని అంచనా వేసింది. జాతీయ సేంద్రీయ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్పీఓపీ) కింద దేశంలో 37 సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలున్నాయి. వాటిలో ఏపీ, తెలంగాణాతో పాటు 14 రాష్ట్ర ప్రభుత్వ, 23 ప్రైవేటు ఏజెన్సీలకు గుర్తింపు ఉంది. మూడేళ్లలోనే ఏపీకి ఈ గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ విభాగం సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సేంద్రీయ విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్పీఓపీ నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసి ధ్రువీకరించేందుకు ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఎస్సీఏ)కి అనుబంధంగా 2021–22లో ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓసీఏ)ని ఏర్పాటు చేశారు. క్వాలిటీ మేనేజర్ పర్యవేక్షణలో జోన్‌కి ఒకరు చొప్పున ఇద్దరు ఎవాల్యుయేటర్స్, జోన్‌కి ఇద్దరు చొప్పున నలుగురు ఇన్స్పెక్టర్స్/ఆడిటర్స్‌ను నియమించారు.ఈ విభాగం ద్వారా తొలి దశలో పొలం బడులు, తోటబడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రీయ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకలి్పంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటికీ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ జారీకి లైసెన్సు జారీ చేసింది. పొలం బడులు, తోట బడులు ప్రామాణికంగా 2023 ఖరీఫ్ సీజన్ నుంచి గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సర్టిఫికెట్తో రైతులు మద్దతు ధరకంటే 2, 3 రెట్ల ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు.ధ్రువీకరణ ఇలా..⇒ సీజన్‌వారీగా ఇప్పటికే సాగయ్యే వ్యవసాయ, ఉద్యాన పంటలు (ఫీల్డ్ క్రాప్స్)కు 2 ఏళ్లు, పండ్ల తోటలకు మూడేళ్ల పాటు సాగు పద్ధతులను పరిశీలించిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ ఇప్పటికే గ్యాప్ సర్టిఫికేషన్‌తో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే పంట ఉత్పత్తులకు రిజి్రస్టేషన్ చేసుకుంటే నిర్దేశిత కాలపరిమితిలో ప్రమాణాలు పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది ⇒ సేంద్రీయ వ్యవసాయం కోసం తప్పనిసరిగా భూమిని మార్చాలి ⇒ సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చెయ్యాలి ⇒ ఇన్పుట్స్ అన్నీ సహజంగానే ఉండాలి ⇒ కలుపు మొక్కల నివారణతో సహా తెగుళ్లు, వ్యాధులను సహజ పద్ధతుల్లో మాత్రమే నియంత్రించాలి ⇒ 25 ఎకరాల లోపు సన్న, చిన్న కారు రైతులతో పాటు 25 ఎకరాలకు పైబడిన పెద్ద రైతులతో 25 నుంచి 500 మంది సభ్యులతో కూడిన రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాసెసర్స్, రిటైలర్స్, ఎగుమతిదారులు ఎవరైనా సేంద్రీయ సాగు కోసం రిజి్రస్టేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ⇒ దశలవారీగా తనిఖీలు, పరీక్షల అనంతరం సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులతో పాటు సమీప భవిష్యత్తులో అటవీ సేకరణలు, ఏపి కల్చర్, ఆక్వా కల్చర్, సముద్రపు నాచు, జల మొక్కలు, పుట్ట గొడుగుల ఉత్పత్తి, పశువుల ఉత్పత్తుల ప్రాసెసింగ్ అండ్ హ్యాండలింగ్, జంతువుల ఫీడ్ ప్రొసెసింగ్‌కు ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేషన్‌తో రైతుకు మేలు సేంద్రీయ ధ్రువీకరణకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఎపెడా గుర్తింపునిచి్చంది. 2027 వరకు లైసెన్సు జారీ చేసింది. ఆ తర్వాత మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ గుర్తింపు ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుని వరకు భరోసా లభిస్తుంది. రసాయన అవశేషాల్లేని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులు పొందే వీలు కలుగుతుంది. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడడం, ఎగుమతులు పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మొక్కలు, జంతువుల్లో జీవ వైవిధ్యతను కాపాడేందుకు సేంద్రీయ వ్యవసాయ సుస్థిరత, పర్యావరణ హితమైన ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. –ఎ.త్రివిక్రమరెడ్డి, డైరెక్టర్, ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ -
అన్నవరం రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్ఏఎస్టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?
ఎన్నో రకాల ఆలయాలు వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయా?.. అని షాకింగ్ అనిపిస్తుంటుంది కూడా. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తాం కూడా. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తాం. కానీ అవేమీ అక్కర్లేకుండా నేరుగా ఈ ఆలయానికి వెళ్లి పాపం పోగొట్టుకోవడమే కాకుండా పోయినట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా తెచ్చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. ఆ ఆలయం ఎక్కడుందంటే.. అలాంటి ఆలయం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం రూ. 12/-లు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. హృదయంలో పాపం చేశామన్నా భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది. అందుకే చాలామంది రైతులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్‌లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్‌ని తీసుకుంటారని చెబుతున్నారు ప్రజలు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని అన్నారు. (చదవండి: ఆరేళ్లక్రితం తప్పిపోయిన బాలుడిని 'ఆ ఫేస్బుక్ సందేశం'.. కుటుంబం చెంతకు చేర్చింది!) -
బాబుకు తోడు దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: ఓ దొంగ... మరో దొంగకు మద్దతిస్తే ఎలా ఉంటుంది? ఒకరికి మద్దతుగా మరొకరు తెరమీదికొచి్చ ‘తనేమీ తప్పు చేయలేదు’ అని చెప్పటం!!.. వినటానికే విచిత్రంగా ఉంది కదూ? నిజానికి కోర్టుల్లో కనుక ఇలా సాక్ష్యాలు చెబితే జైల్లో పడేస్తారు. కానీ ఎల్లో మీడియా మాత్రం... ఆ దొంగలు చంద్రబాబు నాయుడికి ఇస్తున్న సర్టిఫికెట్లను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అవే నిజాలని జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అవి నిజాలే అనుకుంటే... ఇలా ఎల్లో మీడియాలో సాక్ష్యాలు చెబుతున్న దొంగలను గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే కేసులో ఎందుకు అరెస్టు చేసింది? ఐటీ శాఖ ఎందుకు వాళ్లకు నోటీసులిచ్చింది? తాము తప్పు చేశామని వాళ్లు ఎందుకు ‘ఈడీ’ ఎదుట ఒప్పుకున్నారు? ఈ ప్రశ్నల్లో దేనికీ ‘ఈనాడు’ దగ్గర గానీ, దాని తోక మీడియా దగ్గర గానీ సమాధానాలు లేవు. వారికి తెలిసిందల్లా... చంద్రబాబు శుద్ధ పూస అని జనాన్ని నమ్మించేందుకు మొత్తం తమ మీడియా సామ్రాజ్యాన్ని అబద్ధాలకు తాకట్టు పెట్టడమే. అదే జరుగుతోంది కూడా!. దుర్యోధనుడు మంచోడని దుశ్శాసనుడు, శకుని సాక్ష్యం చెబుతున్నట్లే ఉంది టీడీపీ వ్యవహారం. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతోసహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు మద్దుతుగా ఆ కేసులో ఇతర నిందితులు వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ వంటి వారు ఇంటర్వ్యూలిస్తుండటం... సిగ్గులేకుండా వాటిని ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తుండటం రాష్ట్రం మొత్తాన్ని విస్మయపరుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా వీడియో విడుదల చేశారు. కాగా తాజాగా ఈ కేసులో మరో నిందితుడు సుమన్ బోస్ ‘మా చంద్రబాబు నీతిమంతుడు’ అని సరి్టఫికెట్ ఇచ్చేశారు. నిజానికి సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఒప్పందం చేసుకుని కోట్లు కొల్లగొట్టడంలో కీలక పాత్రధారి ఈ సుమన్ బోసే. ఈయనను, వికాస్ ఖన్విల్కర్‌ను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీఐడీ రెండూ అరెస్టు చేశాయి. జైల్లో ఉండి... బెయిలుపై బయటకు వచ్చారు. ఇలా బెయిలుపై వచి్చన వాళ్లు కేసులోని మరో నిందితుడికి మద్దతుగా మీడియాతో మాట్లాడటమే చిత్రాతిచిత్రం. వాస్తవానికి సుమన్‌బోస్ అసలు బండారాన్ని బయటపెడుతూ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే ఇటు సీఐడీకీ అటూ న్యాయస్థానానికి కూడా వాంగ్మూలాన్ని ఇచ్చిందన్నది టీడీపీ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోంది. మాకు తెలీదు.. సంబంధం లేదు: సీమెన్స్ టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్‌లో తమ అవినీతి దందాకు ‘సీమెన్స్ కంపెనీ ముసుగు వేయాలన్న చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. అసలు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించి తమకు తెలియనే తెలియదని సీమెన్స్ కంపెనీ కుండబద్దలు కొట్టింది. డిజైన్ టెక్ కంపెనీతో కలసి ఏపీఎస్ఎస్డీసీతో తాము కుదర్చుకున్నట్టు చెబుతున్న త్రైపాక్షిక ఒప్పందానికి, తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్ట్ కింద 90 శాతం నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూర్చే పద్ధతి అసలు తమ కంపెనీ పాలసీలోనే లేదని విస్పష్టంగా తేల్చింది. తమ కంపెనీ పేరిట సుమన్ బోస్ టీడీపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని... అసలు అటువంటి ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ఆయనకు కంపెనీ అప్పగించనే లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబుతూ పంపిన ఈ–మెయిల్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీమెన్స్ కంపెనీ పూర్తిగా సహకరిస్తోంది. కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు వారిద్దరే.. స్కిల్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు కాగా, సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. వారి బండారాన్ని సీఐడీ, ఈడీ ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. ఒప్పందంలో ఓ చోట సుమన్ బోస్ అని మరో చోట సౌమ్యాద్రి బోస్ అని సంతకాలు చేసినట్టు ఆడిట్ నివేదిక నిగ్గు తేల్చింది. సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించి సుమన్ బోస్ తమ కంపెనీ పేరిట చేసిన మోసాన్ని నిర్ధారించింది. ఆయన అప్పటికే డిలీట్ చేసిన ఈ–మెయిల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ సందేశాలను రిట్రీవ్ చేసి ఆ రికార్డులను సీఐడీకి అప్పగించింది. తమ కంపెనీకి తెలియకుండానే సుమన్ బోస్ ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్నారని, అటు తమ కంపెనీని మోసం చేయడంతోపాటు ఇటూ ఏపీ ఖజానాను కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించారని న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇక షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ కీలక పాత్ర పోషించారు. దాంతో సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్‌లను సీఐడీ 2021, డిసెంబర్10న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించింది. వారిద్దరు 2022, జనవరి 18 వరకు అంటే 40 రోజులపాటు జైలులో ఉన్నారు. బెయిలుపై వచ్చి ఎల్లో మీడియాలో చిలకపలుకులు చెబుతుండటమే ఘోరాతిఘోరం. సుమన్‌బోస్, ఖన్విల్కర్‌లను అరెస్ట్ చేసిన ఈడీ ఇక స్కిల్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్లతోపాటు షెల్ కంపెనీల ప్రతినిధులు సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్‌లను ఈ ఏడాది మార్చి 4న అరెస్ట్ చేసింది. వారికి విశాఖపట్నంలోనీ సీబీఐ న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ నలుగురినీ ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని 10 రోజులపాటు విచారించారు. అటువంటి సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విన్వేల్కర్ ప్రస్తుతం స్కిల్ కుంభకోణంలో అవినీతి జరగలేదని చెబుతూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని పరిశీలకులకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంలో ప్రశ్నావళికి సీమెన్స్ కంపెనీ ఈమెయిల్ ద్వారా చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.. ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు. ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ప్రశ్న: ఏపీఎస్ఎస్డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కరెంటు పోయింది.. కొవ్వొత్తుల వెలుగులోసంతకాలు చేశా ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదంటూ బుకాయించేందుకు యతి్నంచి సుమన్ బోస్ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఒప్పంద పత్రంలో ఏమని రాసి ఉందో కూడా తెలియదని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున కరెంట్ పోయిందని... కొవ్వొత్తులు తెప్పించారని...ఆ కొవ్వొత్తుల వెలుగులోనే తాము సంతకాలు చేశామని చెప్పారు. ఇంతకీ ఆ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
Jagananna Suraksha: దిగులు తీర్చిన సురక్ష
ఏ సర్టిఫికెట్ ఎవరిస్తారో తెలియదు. ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియదు. మనకిక ప్రభుత్వ సాయం అందదులే అనుకుంటున్న వారి ఇంటికి.. వలంటీర్లే వచ్చి ఏ సర్టిఫికెట్లు కావాలి అని అడిగి మరీ సేవలు చేస్తుంటే.. ప్రజల ముఖాల్లో ఆనందం అంతా ఇంతా కాదు. జగనన్న సురక్ష శిబిరాల్లో లబ్ధిదారులు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలును వేనోళ్ల కొనియాడుతున్నారు. కొంతమందికి ఇంటి వద్దే వలంటీర్లు సర్టిఫికెట్లు అందజేస్తుంటే.. ఇలాంటి సర్కార్‌ను ఎప్పుడూ చూడలేదంటూ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సురక్ష శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. వేలాది మంది ఇందులో లబ్ధిపొందారు. పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ జగనన్న సురక్షలో అధికారుల నుంచి సదరం సర్టిఫికెట్ అందుకుంటున్న ఈమె పేరు షేక్ మీరాబి. పల్నాడు జిల్లా కారెంపూడి మండలం చినకొదమగుండ్ల గ్రామం. మూడు నెలల క్రితం ఆమె భర్త షేక్ ఖాదర్‌కు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కుడి కాలు తీసేశారు. గతంలో ఇద్దరు పని చేసుకుంటూ జీవనం సాగించారు. 3 నెలలుగా భర్త మంచానికే పరిమితం కావడంతో పోషణ కష్టమైంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పలువురు మీరాబీకి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వలంటీర్‌కు చెప్పగా.. వారితో దరఖాస్తు చేయించారు. బుధవారం జరిగిన గ్రామ సభలో సదరం సర్టిఫికెట్‌ను మీరాబీకి అధికారులు అందించారు. పింఛన్‌కు కూడా అధికారులు దరఖాస్తు చేయించి మంజూరుకు సిఫార్సు చేశారు. త్వరలో దివ్యాంగుల పింఛన్ వస్తుందని తెలిసి మీరాబీ సంతోషానికి అవధులు లేవు. ఎంతో దిగులుతో ఉన్న తనకు సురక్ష శిబిరాల ద్వారా జగనన్న ఎంతో మేలు చేశారంటూ ఆమె కన్నీళ్లతో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రం ఈమె పేరు సీసా మచ్చూలి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి.గొందూరు గ్రామం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, రెండుమూడు సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి నెలరోజుల తర్వాత ఆ పత్రం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కులధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో జగనన్న సురక్ష ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఒక్కరోజులోనే ఫైసా ఖర్చు లేకుండా అధికారులు పత్రం అందజేశారు. సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించిన జగనన్నకు థ్యాంక్స్ అంటూ ఆనందం వెలిబుచ్చారు. సులువుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కాకినాడ జిల్లా, కిర్లంపూడి మండలం, గెద్దానాపల్లికి చెందిన జల్లిగంపల పోలారావు ఉన్నత చదువులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అవసరమైంది. జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు అతని ఇంటికి వెళ్లినప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం.. అతని దగ్గర నుంచి సర్టిఫికెట్ కోసం వివరాలు, జిరాక్స్‌లు తీసుకుని అధికారులకు అందజేశారు. వారు ఆ దరఖాస్తును పరిశీలించి బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇచ్చారు. -
‘20లోపు ఇంటర్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి’
అనంతపురం: ఏపీ ఈఏపీసెట్–2023 పరీక్ష రాసినవారు ఈ నెల 20లోపు తమ ఇంటర్ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్ స్టూడెంట్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ సి.శోభాబిందు శుక్రవారం తెలిపారు. ఏపీ ఈఏపీసెట్–2023లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఈఏపీసెట్‌లో మొత్తం 2,52,717 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంకా 42వేల మంది విద్యార్థులకు ఇంటర్ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల జాబితాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను బ్రోకరేజ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. కేఎస్‌బీఎల్ క్లయింట్ల నిధులను గ్రూప్ కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేసుకుందని, అలాగే రూ. 2,700 కోట్ల విలువ చేసే క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి దాదాపు రూ. 2,033 కోట్ల నిధులు సేకరించిందని బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో సెబీ పేర్కొంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? ఆయా క్లయింట్లకు నిధులు, సెక్యూరిటీలను తిరిగి ఇవ్వకపోగా.. ఖాతాల మదింపు విషయంలో ఫోరెన్సిక్ ఆడిటర్లకు సరిగ్గా సహకరించలేదని కూడా తెలిపింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఇప్పటికే కేఎస్‌బీఎల్‌ను డిఫాల్టరుగా ప్రకటించి, బహిష్కరించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ పేర్కొంది. క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను కార్వీ, దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ గత నెలలో నిషేధం విధించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) ఇలాంటి మరిన్ని బిజినెస్వార్తలు, ఇతరఅప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్‌లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్‌లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్‌ల జాబితాలో భారత్‌కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్‌ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్‌లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు. బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్‌లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్ ఇస్తారు. బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు? 1985లో డెన్మార్క్‌లో ప్రారంభించిన ’ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’(ఎఫ్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్స్‌ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్‌లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్‌లు ఈ సర్టీఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రా న్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టీఫికెట్ లభించింది. బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కొమ్మాది(భీమిలి): రానున్న కాలంలో మరిన్ని బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. రుషికొండ బీచ్‌లో శనివారం బ్లూ ఫ్లాగ్‌ను జేసీ కె.ఎస్.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్ ఇండియా ఆపరేటర్ డాక్టర్ కురూప్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, సమాచారశాఖ జేడీ వి.మణిరామ్ పాల్గొన్నారు. మన దేశంలో 2018లో తొలిసారిగా.. భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని ’చంద్రబాగ్’ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్‌కు అప్పగించింది. తొలి సారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు.. మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్‌ను రెన్యువల్ చేస్తోంది. ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్‌లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్కోడ్, పడుబిద్రి బీచ్‌లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికోయ్ తుండి, కద్మత్ బీచ్‌లు బ్లూ ఫ్లాగ్ సర్టీఫికేషన్ దక్కించుకున్నాయి. -
టీఎస్ బీపాస్ ద్వారా ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో భూములను కొనుగోలు చేసిన వారికి ఉపయో గపడేలా ల్యాండ్ యూజ్ స్టేటస్‌ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అందుబాటు లోకి తెచ్చింది. భూ కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన భూమి మాస్టర్ ప్లాన్‌లోని ఏ కేటగిరీ పరిధిలో ఉందో టీఎస్–బీపాస్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ (భూమి వినియోగ పత్రం)ను టీఎస్–బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసు కొని, నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికెట్ పొందే వీలును మున్సిపల్, పట్టణ పరిపాలన శాఖ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ లాండ్ యూజ్ సర్టిఫి కెట్ పొందే తీరును ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమకు అవస రమైన సేవలు కావాల్సిన వారు https://lui. tsbpass.telangana.gov.inతమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే నంబర్ నమోదు చేసి, తగిన రుసుము చెల్లిస్తే ఆ భూమికి సంబంధించిన ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఇస్తారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఈ సర్టిఫికెట్ పొందే సేవలు అందుబాటులో ఉన్నాయి. -
పంచాయతీ అధికారుల చేతివాటం!
సాక్షి, పార్వతీపురంమన్యం(కురుపాం): వివిధ కేసుల్లో పట్టుబడిన వారిని విడిపించేందుకు జామీనుగా వెళ్లేవారికి సాల్వెన్స్ (ఇంటిపన్ను, ఆస్తి ధ్రువీకరణ పత్రం) సర్టిఫికేట్ అవసరం. వీటి మంజూరుకు పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌లో ఓ అధికారి రూ.500 చొప్పున వసూలు చేశారంటూ మొండెంఖల్ పంచాయతీ పరిధిలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక లక్కాయి, గురపన్న, దుర్గన్న తదితరులు స్థానిక విలేకరుల వద్ద బుధవారం వాపోయారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ వి.శివరామప్ప వద్ద విలేకరులు ప్రస్తావించగా ఇప్పటివరకు నా దృష్టికి రాలేదని, డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అసలు పేరు చెప్పిన డెత్ సర్టిఫికెట్!
సాక్షి, హైదరాబాద్: ఇక్కడి పోలీసులు అరెస్టు చేసినా... తమ పాస్‌పోర్టు స్వాదీనం చేసుకున్నా...లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసినా... రాకపోకలు, దందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నైజీరియన్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ దేశంలోనే అసలు, నకిలీ పేర్లతో రెండు పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అసలుది దాచేసి, నకిలీ పేరుతో తీసుకున్న దాంతోనే ప్రయాణాలు చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడూ ఇందులోని పేరే చెప్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నారాయణగూడ ఠాణా అధికారులు ఇటీవల అరెస్టు చేసిన వసిగ్వీ చిక్వమేక జేమ్స్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి అసలు పేరు, వివరాలు సైతం ఓ డెత్ సర్టిఫికెట్ ద్వారా బయటకు వచ్చాయి. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లు అవలంభిస్తున్న కొత్త పంథా ఇదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గోవాకు వచ్చిపోతూ డ్రగ్స్ దందా... నైజీరియాకు చెందిన వసిగ్వీ జేమ్స్ 2013 నుంచి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిపోతున్నాడు. 2016, 2019ల్లోనూ రాకపోకలు సాగించిన ఇతడికి గోవా, బెంగుళూరుల్లో ఉండే డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ జాక్స్ సరఫరా చేస్తున్న సింథటిక్ డ్రగ్స్‌కు అక్కడి పెడ్లర్స్‌కు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. ఇలాంటి నేరాలు చేస్తూ చిక్కిన వారి నుంచి పోలీసులు పాస్‌పోర్టు స్వాదీనం చేసుకుంటారు. వీళ్లు బెయిల్ పొందినా దేశం దాటి వెళ్లిపోకుండా విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తారు. తనకు ఇలా జరిగితే స్వదేశానికి వెళ్లడం ఇబ్బందని భావించాడు. దీంతో 2021 నవంబర్ 19న నైజీరియాలోనే అలమాంజో మాసెక్సూ్య పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నారు. నకిలీవి వాడుతూ వ్యవహారాలు.. డబ్బు అవసరమైన ప్రతిసారీ భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేయడం మొదలెట్టాడు. ఈ నకిలీ పేరుతో తీసుకున్న పాస్‌పోర్టు వాడి 2021–22ల్లో గోవాకు వచ్చాడు. తనకు పరిచయం ఉన్న కస్టమర్లను డ్రగ్స్ అమ్ముతూ ఈ ఏడాది మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంలో అలమాంజో పేరు చెప్పి, దాంతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. మూడు వారాలు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్లీ దందా మొదలెట్టాడు. తాజాగా గత వారం నారాయణగూడ పరిధిలోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేయడానికి వచ్చి హెచ్–న్యూ పోలీసులకు చిక్కాడు. ప్రాథమిక విచారణలో తన పేరు అలమాంజో అని చెప్తూ ఆధారంగా ఆ పేరుతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. సాధారణ దర్యాప్తులో భాగంగా అధికారులు అతడి సెల్‌ఫోన్‌ను విశ్లేషించారు. ఆమె డెత్ సర్టిఫికెట్తో గుట్టురట్టు... ఇందులోని ఈ–మెయిల్స్, ఇతర పత్రాల్లో వసిగ్వీ జేమ్స్ అనే పేరు కనిపించింది. దీనిపై ప్రశ్నించగా... అసలు ఆ ఫోనే తనది కాదంటూ తప్పించుకున్నాడు. గోవాలో తనతో సహజీవనం చేసిన ఓ యువతి గతంలోనే అనారోగ్యంతో మరణించిందని, ఆమె మీద ఒట్టేసి చెప్తున్నానంటూ బుకాయించాడు. అయితే అనుమానం నివృత్తి కాని దర్యాప్తు అధికారులు ప్రతి ఈ–మెయిల్‌ను విశ్లేషించారు. ఓ మెయిల్లో సదరు యువతికి సంబంధించిన డెత్ సరి్టఫికెట్ లభించింది. అందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆమె పేరుతో పాటు భర్తగా వసిగ్వీ చిక్వమేక జేమ్స్ పేరు ఉంది. దీని ఆధారంగా పోలీసులు అతగాడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో తన అసలు పేరు అదేనని అంగీకరించడంతో పాటు అలా ఎందుకు చేశాడో వివరించాడు. ఇటీవల అనేక మంది నైజీరియన్లు ఇలానే చేస్తున్నట్లు బయటపెట్టడంతో అ«ధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ఎంబసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. (చదవండి: మునా‘వార్’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్ ఫారూఖీ) -
ఎక్కువ దరఖాస్తులు వాటికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసమే వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్ల కోసం అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్లు, కాల్ సెంటర్ల ద్వారా వచ్చే ఈ దరఖాస్తులకు సంబంధించిన సర్టిఫికెట్లను సులభంగా జారీచేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలుచేస్తోంది. అలాగే, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనపడుతోంది. సర్టిఫికెట్ల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణాలు గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. దరఖాస్తుల తీరూతెన్నూ ఎలా ఉందంటే.. ► గత నెలలో 26 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ (క్యాస్ట్, నేటివిటీ, పుట్టిన తేదీ) సర్టిఫికెట్ల కోసం 1.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 92 వేల సర్టిఫికెట్లను ఆమోదించి జారీచేయగా, 1,050 సర్టిఫికెట్లను తిరస్కరించారు. 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే 30 శాతం సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా చూస్తే ఈ సర్టిఫికెట్ల కోసం 2.68 లక్షల దరఖాస్తులు రాగా, 2.15 లక్షల దరఖాస్తులను మంజూరు చేశారు. 8,100 దరఖాస్తులను తిరస్కరించగా, 45 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 నెలల్లో ఈ సర్టిఫికెట్ల పెండింగ్ శాతం 16 శాతంగా ఉంది. ► అలాగే, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 1.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 95 వేల దరఖాస్తులను మంజూరు చేశారు. 2,700 దరఖాస్తులను తిరస్కరించగా, 18 వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మూడు నెలలుగా చూసుకుంటే.. మొత్తం 2.20 లక్షల దరఖాస్తులు రాగా 1.93 లక్షల దరఖాస్తులను ఆమోదించి, 7,500 దరఖాస్తులను తిరస్కరించారు. 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. ► ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం గత నెలలో 15,500 దరఖాస్తులు రాగా 7,500 దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 1,600 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 6,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ దరఖాస్తులు 41% పెండింగ్‌లో ఉంటున్నాయి. మూడు నెలలుగా చూసుకుంటే 44 వేల దరఖాస్తులు రాగా 28 వేల దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 8,300 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 7,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారు. 3 నెలల్లో ఈ దరఖాస్తులు 16% పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తుకు సంబంధించి గతంలో కుటుంబ పెద్ద సర్టిఫికెట్ పొంది ఉంటే దాని ప్రకారం అప్పటికప్పుడు వెంటనే సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉంటుంది. ► పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా చేసుకున్న దరఖాస్తులు గత నెలలో 4,100 రాగా ఇందులో 570ని జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించగా, 3,500కి పైగా పెండింగ్‌లో ఉంచారు. వీటి పెండింగ్ శాతం 86గా ఉండడం గమనార్హం. ► డెత్ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా పెట్టుకున్న దరఖాస్తులు గత నెలలో 1,600 రాగా కేవలం 128నే ఆమోదించి జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించారు. 1,400కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 90 శాతానికి పైగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ► అలాగే, పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా వచ్చే దరఖాస్తులకు సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సీసీఎల్ఏ ఆదేశాలిచ్చింది. -
వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్‌లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్‌లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది. -
గ్రూప్స్ ఎగ్జామ్స్ అభ్యర్థులకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టిన కోవిడ్-19...!
వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్న లోకేశ్.. ఆ తర్వాత పీజీ వరకు హైదరాబాద్‌లో చదివాడు. ఇప్పుడు గ్రూప్స్‌కు దరఖాస్తు చేయాలనుకున్నాడు. నిబంధనల ప్రకారం స్థానికత, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు కావాల్సి వచ్చింది. సొం తూరు వెళ్లి తీసుకోవాలనుకున్నాడు. కానీ కోవిడ్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న ఆ స్కూల్ మూతపడింది. ఖమ్మం జిల్లాలో పలువురు ఎంఈవోల వద్ద స్థానిక, ఇతర సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మూతపడ్డ పాఠశాలల సమాచారం రికార్డుల్లో లేదని ఎంఈవోలు గుర్తించారు. అయోమయ స్థితిలో ఉన్నతాధికారుల సలహా కోరారు. ఇలాంటి విద్యార్థుల పరిస్థితిపై ప్రత్యేక కథనం సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో మూతపడ్డ స్కూల్స్ రికార్డులను అప్పగించకపోవడంతో గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యే చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి ప్రైవేటు పాఠశాలలు మూతపడినట్టు సమాచారం. వరుస లాక్డౌన్లు, ఆ తర్వాత కూడా సరిగా నడపలేకపోవడంతో చిన్న బడులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నాయి. దీంతో మూత వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో స్కూల్ రికార్డులను స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో అప్పగించాలి.. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి తెలియజేయాలి. కానీ మూతపడిన బడులు ఈ నిబంధనలు పాటించలేదు. అసలు సమస్యేంటి? ఇప్పటివరకూ 4–9 వరకు ఎక్కడ చదివితే దాన్ని స్థానికతగా భావించారు. గ్రూప్స్ నోటిఫికేషన్లో 1–7వ తరగతి వరకు ఎక్కడ చదివారో అభ్యర్థులు ధ్రువీకరించాల్సి వస్తోంది. సాధారణంగా ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత విద్యార్థి బదిలీ సర్టిఫికేట్, ఇతర ధ్రువపత్రాలు లేకున్నా ప్రాథమికోన్నత పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో చాలామంది 1–5 తరగతులు ప్రైవేటు స్కూల్లో చదివినా, అక్కడ్నుంచీ ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోలేదు. ప్రైవేటు బడుల్లో ఫీజులు చెల్లిస్తే తప్ప టీసీలు ఇవ్వబోమని యాజమాన్యాలు హుకుం చేయ డం సర్వసాధారణం. టీసీ లేకున్నా పైతరగతు ల్లో చేర్చుకునే వెసులుబాటు ఉండటంతో చాలా మంది ఈ అవకాశాన్నే వినియోగించుకున్నారు. కొంతమంది 1–5వరకు స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుని, తర్వాత డిగ్రీ వరకు ఇతర ప్రాం తాల్లో చదువుకున్నారు. ఇప్పుడు వీళ్లు విధిగా తమ సొంత ప్రాంతంలో ధ్రువీకరణ పొందాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలూ లేకపోవడంతో స్కూల్ సర్టిఫికెట్లపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. కొరతే కారణమా? మూతపడ్డ బడుల సమాచారం సేకరించడం, రికార్డులు తీసుకుని భద్రపర్చడం స్థానిక మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) బాధ్యత. ఆ తర్వాత డిప్యూటీ డీఈవో, ఆ పైన డీఈవో దీన్ని పర్యవేక్షిస్తారు. విద్యాశాఖలో కీలకమైన పర్యవేక్షణ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 539 ఎంఈవో పోస్టులుంటే.. ప్రస్తుతం 16 మందే ఉన్నారు. 67 మంది డిప్యూటీ డీఈవోలు ఉండాల్సి ఉంటే, ఒక్కరూ లేరు. 12 డీఈవో పోస్టులకుగాను 8 మందే ఉన్నారు. ఈ ఖాళీలు పర్యవేక్షణలోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఫలితంగానే మూతపడ్డ బడుల రికార్డులు భద్రపరిచే వ్యవస్థ కరువైందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. స్థానికతకు మార్గమేంటి? దీనికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులను కోరుతోంది. మూతపడ్డ బడుల రికార్డు లేనప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే బాగుంటుందని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, గెజిటెడ్ ధ్రువీకరణ, స్థానిక వ్యక్తుల హామీలు తీసుకుని దీన్ని పరిష్కరించవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, స్పష్టమైన ఆదేశాలు వస్తే ఆమేరకు ముందుకెళ్తామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. సమస్య తీవ్రంగానే ఉంది.. మూతపడ్డ స్కూల్స్ రికార్డులను అప్పగించకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గురించి ఎంఈవోలు మా సంఘాన్ని సంప్రదిస్తున్నారు. మూతపడ్డ కాలేజీల నిర్వాహకుల ఫోన్ నంబర్లు అందుబాటులో లేవంటున్నారు. తక్షణమే రికార్డులు అప్పగించాలని మా సంఘం తరపున మూసి వేసిన స్కూల్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. – వై.శేఖర్‌రావు (గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం అధ్యక్షుడు) రికార్డు ఏమైందో? కరీంనగర్ పక్కన కొత్తపల్లిలో ఉన్న న్యూ మిలీనియం స్కూల్లో నేను 4 నుంచి 6వ తరగతి వరకూ చదువుకున్నాను. స్టడీ, ఇతర సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించాను. నిర్వాహకులు చనిపోయారని, స్కూల్ మూతపడిందని తెలిసింది. నిర్వాహకుల సంబంధీకులతో మాట్లాడగా.. రికార్డులను ఎంఈవో ఆఫీసులో ఇచ్చామని చెప్పారు. ఎంఈవో ఆఫీసు వాళ్లేమో అసలా పేరుతో స్కూలే లేదంటున్నారు. రికార్డు ఏమైందో తెలియడం లేదు. – సంపత్ (పెగడపల్లి ఎంఆర్‌వోలో కాంట్రాక్టు ఉద్యోగి) -
‘చార్ధామ్’కు కోవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
డెహ్రాడూన్: ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు /వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
పూరీ వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం
పూరీ: ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక పై ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు. -
తిరుమల వెళ్లాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పాత వాహనాలను స్క్రాప్‌కి ఇచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్‌లో 25 శాతం దాకా రిబేట్ ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. కాలుష్యం వెదజల్లుతున్న పాత వాహనాలను వదిలించుకునేలా వాహదారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ప్రెస్ నోట్లో పేర్కొంది. దీని ప్రకారం రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలకు 25 శాతం దాకా, రవాణా (వాణిజ్య)వాహనాలకు 15 శాతం దాకా కన్సెషన్ లభించగలదని కేంద్రం తెలిపింది. రవాణా వాహానాలకు ఎనిమిదేళ్ల దాకా, రవాణాయేతర వాహనాలకు 15 ఏళ్ల వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈ నిబంధనలు 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ విధానాన్ని ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దీని ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ తప్పనిసరి కానుంది. మిగతా కేటగిరీల వాహనాలకు 2024 జూన్ 1 నుంచి దశలవారీగా అమలు చేస్తారు. చదవండి: కొత్త స్వరం.. గడ్కరీ కీలక ప్రకటన -
TDS: మీరు ఉద్యోగస్తులా.. ఫాం16, ఫాం16ఏ గురించి మీకు తెలుసా?
టీడీఎస్ అంటే మూలం వద్ద చెల్లింపులోనే కోత అని అర్థం. చెల్లింపులు జరిపే వ్యక్తి చట్టప్రకారం కొంత మొత్తం పన్నుగా మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలా రికవరీ చేసిన మొత్తాన్ని సకాలంలో గవర్నమెంటుకు చెల్లించి, సకాలంలో రిటర్నులు దాఖలు చేసి, ఒక స్టేట్మెంటును తయారు చేస్తారు. వీటినే టీడీఎస్ స్టేట్మెంట్లు అంటారు. ఇందులో ఆదాయం వివరాలు, వాటి స్వభావం, కొంత కోసిన మొత్తం, చలానా వివరాలు, అస్సెస్సీ పేరు, పాన్, అసెస్మెంటు సంవత్సరం మొదలైన వివరాలు ఉంటాయి. జీతాలు చెల్లించేటప్పుడు ఇచ్చిన ఫారంని 16 అని, ఇతర చెల్లింపులకు ఇచ్చిన ఫారం 16ఏ అని అంటారు. డిపార్ట్మెంటు వారు అన్నింటినుండి సేకరించిన సమాచారంతో ప్రతి అస్సెస్సీకి ఒక సమగ్రమైన పట్టికను తయారు చేస్తారు. దీనినే 26సీ అని అంటారు. ఇందులో అస్సెస్సీకి సంబంధించిన ఆదాయ వివరాలు, టీడీఎస్, టీసీఎస్, అస్సెస్సీ చెల్లించిన పన్ను వివరాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇదొక చిట్టా అని చెప్పవచ్చు. అయితే ఫారం 16/16ఏ లోని వివరాలు, ఫారం 26ఏ లోని వివరాలు ఒకదానితో మరొకటి సరిపోవాలి. తేడాలు రాకూడదు. అయితే, ఎన్నో సందర్భాల్లో తేడాలు ఉంటున్నాయి. వివిధ కారణాలు ఏమిటంటే.. ♦డిడక్ట్ చేసిన వ్యక్తి చెల్లించకపోవడం ♦రిటర్నులు నింపినప్పుడు తప్పులు దొర్లడం ♦పాన్ నంబరు రాయడంలో తప్పులు ♦టాన్ నంబర్ రాయడంలో తప్పులు ♦ చలాన్ల వివరాల్లో తప్పులు దొర్లటం ♦అసెస్మెంటు సంవత్సరాన్ని తప్పుగా రాయటం ♦ అడ్రస్‌లు తప్పుగా రాయడం ♦అస్సెస్సీ పేర్లు తప్పుగా రాయడం ♦పూర్తి వివరాలు ఇవ్వకపోవడం ♦ పన్నుల మొత్తం రాయడంలో తప్పులు, హెచ్చుతగ్గులు దొర్లడం.. ♦ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. అందుకే తేడాలు రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా తేడాలు గమనించినప్పుడు ఫారం 16, ఫారం 16ఏ జారీ చేసిన వారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వారిని సంప్రదించి ఆ తప్పులు సరిదిద్దించుకోవాలి. డిపార్ట్మెంటు వారికి తగిన కారణాలు వివరిస్తూ జవాబు ఇవ్వండి. వ్యత్యాసాలని సమన్వయం చేయండి. అంటే ‘‘రీకన్సిలేషన్’’ చేయండి. వివరణ సరిగ్గా ఉంటే ఏ సమస్యా ఉండదు. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు ప్రీఫిల్డ్ ఫారాలు ఉన్నాయి. ఈ సదుపాయం వల్ల ఫారం 26ఏ లోని అంశాలు యథాతథంగా ప్రీఫిల్డ్ ఫారంలో ఉంటాయి. ఇటువంటప్పుడు తేడాలు కనబడితే వాటిని వెంటనే సరిదిద్దండి. డిడక్టర్ ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వకపోయినా ఇబ్బందే. డిమాండు ఏర్పడే అవకాశం ఉంటుంది. సరిదిద్దండి. వీటివల్ల ఆలస్యం కావచ్చు. అయినా తప్పదు. ఇలాంటి తప్పులు దొర్లినప్పుడు సరిదిద్దుకునేందుకు అస్సెస్సీలకు డిపార్ట్మెంటు అధికారులు సరైన అవకాశం, సమయం ఇవ్వాలి. 26ఏ లో తప్పుడు సమాచారాన్ని బట్టి అసెస్మెంట్ జరిగితే ఆ చర్య మీద అప్పీలుకు వెళ్లవచ్చు. ఈ మధ్య ఒక కంపెనీ అసెస్మెంటులో కోట్ల రూపాయల తప్పు దొర్లితే ఆ తప్పుని సరిదిద్దారు. కాబట్టి జాగ్రత్త వహించండి. అన్నింటికీ కీలకం.. మీ దగ్గరున్న సరైన, నిజమైన సమగ్రమైన సమాచారం. అదే శ్రీరామరక్ష. చదవండి: Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? -
TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్ తప్పనిసరి
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్లైన్లో ఉంచనుంది. అక్టోబర్ నెలకి సంబంధించి రోజుకి 8 వేల టికెట్లు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. (చదవండి: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా) అలానే సర్వదర్శనం టికెట్లను రేపటి నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొంది. చదవండి: TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ -
కోవిషీల్డ్ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య
లండన్: కరోనా వ్యాక్సిన్ అంశంలో భారత్, బ్రిటన్ మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ మెలిక పెట్టింది. అక్టోబర్ 4 నుంచి విదేశీ ప్రయాణికులు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కొద్దిరోజుల కిందట బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ లేకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆ దేశం దిగొచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదన్న యూకే అధికారులు, భారత్ జారీ చేసే వ్యాక్సినేషన్ ధ్రువపత్రంపైనే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ జాబితాలో ఆ్రస్టాజెనికా కోవిషీల్డ్‌ను చేరుస్తూ బుధవారం నిబంధనల్ని సవరించారు. అయితే కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం అంశంలో భారత్, యూకే పరస్పరం చర్చించుకుంటున్నాయని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని వెల్లడించారు. విదేశీ ప్రయాణికుల మార్గదర్శకాల్లో బ్రిటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను చేర్చకపోవడంపై భారత్ పదునైన విమర్శలే చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్–ఆ్రస్టాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్నే పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో చేస్తోందని, అలాంటప్పుడు ఆ వ్యాక్సిన్‌పై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ నిలదీసింది. భారత్‌లో తయారైన టీకాలు పనికొచ్చినప్పుడు... అదే టీకా వేసుకున్న వారు బ్రిటన్‌కు ఎందుకు రాకూడదంటూ సూటిగా ప్రశ్నించింది. భారత్ విమర్శలతో వెనక్కి తగ్గిన బ్రిటన్ వ్యాక్సిన్‌కి అంగీకరించినప్పటికీ, భారత్ జారీ చేసే వ్యాక్సిన్ ధ్రువపత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని, అందుకే ఆ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించి తీరాలని చెప్పింది. మరోవైపు భారత్ అధికారులు మాత్రం వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని, డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకి అనుగుణంగానే జారీ చేస్తున్నామని చెబుతున్నారు. -
స్కూల్ బస్‌ల ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
సర్వేకు అదనంగా డ్రోన్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలకు కొత్తగా ఆస్తి సర్టిఫికెట్ల జారీకి సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు డ్రోన్లు అందుబాటులో ఉండగా, తాజాగా జిల్లాకొకటి చొప్పున మొత్తం 13 డ్రోన్లను కేంద్రం సమిత్వ పథకంలో భాగంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగరతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, ప్రస్తుత కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అడ్వయిజర్ కల్నల్ గిరీష్ బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో పలు గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2 నాటికి దాదాపు 2,500 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేసి మ్యాప్‌లను రాష్ట్రానికి అందజేసేందుకు చర్యలు చేపడతామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే సమయంలో చెట్లు వంటివి అడ్డం వచ్చినప్పుడు, ఇంటి సరిహద్దుల మధ్య విస్తీర్ణాన్ని నిర్ధారించడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను పలు జిల్లాల కలెక్టర్లు సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరించారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ మాలిక్, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం ఓఎస్డీ ఏకే నాయక్, వర్చువల్ విధానంలో పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
ఇక వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందే సదుపాయం ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే సులభమైన ప్రత్యామ్నాయంగా వాట్సాప్ నుంచి సర్టిఫికెట్ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆ మేరకు సర్టిఫికెట్ పొందవచ్చు. వాట్సాప్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్ ఎంపీ ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ ఇలా.. ► మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ వాట్సాప్ నెంబర్ 9013151515ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ► కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్‌లో లేదా కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్‌ను ఇందుకు ఉపయోగించాలి. ► వాట్సాప్‌లో కాంటాక్టు లిస్టులోని మైగవ్ నెంబర్‌పై క్లిక్ చేసి, చాట్ బాక్సులో covid certificate లేదా download certificate అని టైప్ చేయాలి. ► రిజిస్టర్డు ఫోన్ నంబర్‌కు ఆరు ఆంకెల ఓటీపీ వస్తుంది. ► చాట్ బాక్సులో ఓటీపీని ఎంటర్ చేయాలి. ► కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్క ఫోన్ నెంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకొని ఉంటే.. వారందరి పేర్ల జాబితాను వాట్సాప్ మీకు పంపిస్తుంది. వారిలో ఎవరెవరి సర్టిఫికెట్లు కావాలని మీరు కోరుతున్నారో అడుగుతుంది. ► ఎంతమంది సర్టిఫికెట్లు కావాలో సూచిస్తూ ఆ సంఖ్యను ఎంటర్ చేయాలి. కొన్ని సెకండ్లలోనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వాట్సాప్ చాట్ బాక్సులో ప్రత్యక్షమవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
రెండేళ్ల కోసం కక్కుర్తి.. మూడేళ్లుగా పరారీలో.. చివరకు
సాక్షి, హిమాయత్‌నగర్: పదవీ విరమణకు సంబంధించి బెన్ఫిట్స్ ఫోరం సబ్మిట్ చేయమంటూ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం నుంచి సంకేతాలందడంతో తనకు మరో రెండేళ్ల గడువు ఉందని, ఇప్పట్లో రిటైర్మెంట్ లేదంటూ కమిషనర్ కార్యాలయానికి కొన్ని ఫోర్జరీ పత్రాలను సబ్మిట్ చేశాడు సంతోష్‌నగర్ పీఎస్‌లో విధులు నిర్వర్తించే ఏఎస్సై మహ్మద్ అబ్దుల్ రౌఫ్. ఉద్యోగంలో చేరేప్పుడు 3–5–1960 తేదీతో ఉన్న ఎస్సెస్సీ మెమో, బొనోఫైడ్, సెల్ఫ్ డిక్లరేషన్‌ను ఇచ్చిన ఇతడు తన పుట్టిన ఏడాది 1960 కాదని, 1962 అంటూ సీపీ కార్యాలయంలో చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలంటూ సీపీ కార్యాలయ సిబ్బంది ఆదేశించారు. మహ్మద్ అబ్దుల్ రౌఫ్ బోనోఫైడ్‌లో ఉన్న ఒక లైన్లో తన పుట్టిన సంవత్సరం 1962 అని రాసుకుని సబ్మిట్ చేశాడు. దీంతో మే 31వ తేదీ 2018న పదవీ విరమణ ఉండగా.. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి పోలీసు శాఖను మోసం చేయాలని చూసిన రౌఫ్‌పై 30వ తేదీన కమిషనర్ కార్యాలయం ఫిర్యాదు ఇవ్వడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా పరారీలో.. పక్కాగా పట్టివేత కేసు నమోదైన విషయం తెలుసుకున్న మహ్మద్ అబ్దుల్ రౌఫ్ పరారీలో ఉన్నాడు. అయితే ఇటీవల నారాయణగూడ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భూపతి గట్టుమల్లు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పదిరోజుల పాటు కానిస్టేబుల్ మల్లేష్, హోంగార్డు ఇమ్రాన్‌లను ఈ కేసుపై ని ఘా పెట్టించారు. మహ్మద్ అబ్దుల్ రౌఫ్ కొద్దిరో జులగా భవానీనగర్‌లోని ఇంటిలోనే ఉంటున్నా డు. ఈ సమాచారం పక్కాగా ఉండటంతో.. బుధవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ గట్టుమల్లు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి తెల్ల వారుజామున సిబ్బంది మల్లేష్, ఇమ్రాన్‌లతో కలసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గట్టుమల్లు తెలిపారు. -
గల్ఫ్‌లో టీకా సర్టిఫికెట్ల తిప్పలు
ఇండియా నుంచి గల్ఫ్ కు వెళ్లే భారతీయులకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోవీషీల్డ్ టీకా తీసుకుంటే ఇబ్బంది లేదన్న ధైర్యంతో ఉన్న ప్రవాస భారతీయులకు ఊహించిన సమస్య ఎదురైంది. భారత ప్రభుత్వం కోవిన్ యాప్ ద్వారా జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ని కొన్ని గల్ఫ్ దేశాలకు చెందిన యాప్‌లు స్వీకరించడం లేదు. ఇబ్బందులు కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ప్రతీ దేశానికి వేర్వేరుగా యాప్‌లు ఉన్నాయి. మన ప్రభుత్వం కోవిన్ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేసింది. ఇండియాలో కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారు కొన్ని గల్ఫ్ దేశాల ఆరోగ్య శాఖ యాప్ లలో తమ ఆరోగ్య స్థితిని నమోదు చేసుకునే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి యాప్‌లు కోవిన్‌ను స్వీకరించడం లేదు. ఆర్థిక భారం గల్ఫ్ దేశాల యాప్‌లలో తలెత్తుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఢిల్లీలోని గల్ఫ్ దేశాల ఎంబసీలతో కోవిడ్ టీకా సర్టిఫికేట్ అటెస్ట్ చేసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.6,500 నుంచి రూ.8,000 ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా ‘తవక్కల్నా' యాప్‌లో ఆరోగ్య స్థితిని మోసపూరితంగా అప్డేట్ చేసినందుకు గాను అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, విదేశీ కార్మికులతో సహా 122 మంది ఇటీవల సౌదీలో అరెస్టు అయ్యారు. ఎంబసీలు చొరవ చూపితే భారతీయ టీకా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్ పోర్టల్ ను గల్ఫ్ దేశాలు గుర్తించేలా మన ఎంబసీ అధికారులు కృషి చేయాలని గల్ఫ్‌లో ఉన్న భారతీయులు కోరుతున్నారు. కోవిన్ క్యూఆర్ స్కాన్ కోడ్ ఉపయోగించి టీకా సర్టిఫికెట్ ను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామ కంఠాల్లోని ఆస్తులకు మహర్దశ
బ్యాంకులో లోను తీసుకుని ఓ చిన్న సూపర్ మార్కెట్ ప్రారంభించాలని కలలుకంటున్న రామకోటేశ్వరరావు కల త్వరలో నేరవేరబోతోంది. బ్యాంకు లోను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తనఖా ఏం పెడతావ్ అంటూ బ్యాంకు వాళ్లు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఎప్పటికప్పుడు తన ఆశను చంపుకుంటూ వచ్చాడు. ఊళ్లో నాలుగు సెంట్ల స్థలంలో తల్లిదండ్రులు ఎప్పుడో కట్టిన దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే ఇల్లు తప్ప అతనికి మరే ఆస్తిపాస్తుల్లేవు. ఆ ఇంటిని చూసి లోను ఇవ్వమని అడిగితే దస్తావేజులు తెమ్మమనేవారు. ఊళ్లో గ్రామకంఠం కింద ఉండే ఇళ్లకు ఎలాంటి దస్తావేజులు ఉండవని తెలిసి రామ కోటేశ్వరరావు ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఆస్తులకూ ఆస్తి సర్టిఫికెటును మంజూరు చేయబోతుందని తెలిసి రామకోటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేవు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దస్తావేజుల్లేని ఆస్తుల యజమానులకు ఇది గొప్ప ఊరట. వీరి కష్టాలకు తెరదించుతూ గ్రామకంఠాల పరిధిలోని ఆస్తులకు కొత్తగా యాజమాన్య హక్కు (ఆస్తి సర్టిఫికెట్లు)ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసేందుకు ఇటీవల సమావేశమైన కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ అవకాశం లేకుండాపోయిన క్రయవిక్రయాలను ఇప్పుడు అధికారికంగా ఎంతో ధీమాగా చేసుకోవచ్చు. పూర్వం ఎప్పుడో గ్రామ కంఠాలుగా వర్గీకరణ చేసిన ప్రాంతంలో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలున్న వారికి ఇప్పటివరకు వాటిని ఉపయోగించుకోవడమే కానీ, మరే విధంగా అవి అక్కరకు రాని ఆస్తిగా తయారయ్యాయి. దీంతో అవి రూ.లక్షల విలువ చేసినా అవసరమైనప్పుడు వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా రుణం పొందే అవకాశంలేదు. వాటిని అమ్మినా, కొన్నా అవన్నీ అనధికారికంగా జరిగే లావాదేవీలే. 90 లక్షల ఇళ్లు.. 30 లక్షల స్థలాలు రాష్ట్రంలో 17,950 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో గ్రామ కంఠాల పరిధిలో ఇళ్లు, స్థలాలున్న వారికి రెవెన్యూ శాఖ యజమాన్య హక్కు ఇచ్చే విధానంలేదు. వీటికి సంబంధించి రెవెన్యూ లేదా పంచాయతీల వద్ద ఎలాంటి ప్రత్యేక రిజిస్టర్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గ్రామ కంఠాల పరిధిలో 90 లక్షల ఇళ్లు, మరో 30 లక్షల సంఖ్యలో ఇతర ఖాళీ స్థలాలు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ అధికారుల అంచనా. వీటన్నింటి విలువను లెక్కిస్తే రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. చట్ట సవరణ తర్వాత ప్రతి ఆస్తికీ సర్టిఫికెట్ ఈ నేపథ్యంలో.. గ్రామ కంఠం పరిధిలో ప్రతి ఇల్లు, ఖాళీ స్థలానికి వేర్వేరుగా సంబంధిత యజమానులకు ఆస్తి సర్టిఫికెట్ల జారీకి వీలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చట్టానికి సవరణలు చేస్తోంది. అసెంబ్లీలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించాకే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రతి ఆస్తిని యజమాని పేరుతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులలో నమోదు చేస్తారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో గ్రామ కంఠంలో ఉండే ఆస్తులకూ డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహిస్తారు. ఒక్కొక్క దానికి ప్రత్యేక నెంబరును కేటాయించి ఆ మేరకు యజమానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆస్తి సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. కాగా, రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ పూర్తవగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున 51 గ్రామాలలో సర్వే కొనసాగుతోంది. ఇళ్ల విలువ పెరిగే అవకాశం ఇదిలా ఉంటే.. ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి పూర్తి ఆర్థిక భరోసా లభించినట్లవుతుంది. ఆ ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు పొందే వీలుంటుంది. క్రయవిక్రయాలు లేదా ఆస్తి పంపకాలు సులభంగా జరుపుకోవచ్చు. ఇదే సమయంలో ఆ ఆస్తులకు ప్రస్తుతమున్న ధర కంటే భారీగా రేటు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
టీకా వేయించుకోకున్నా సర్టిఫికెట్ వచ్చింది!
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన 13ఏళ్ల వేదాంత్‌కు కోవిడ్ టీకా వేసినట్లు ఆయన తండ్రికి మెసేజ్ వచ్చింది. పైగా వేదాంత్ వయసు 56గా మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో షాకైన బాలుడి తండ్రి రజత్ డాంగ్రె అ విషయమై ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినా ఫలితం రాలేదని చెప్పారు. వేదాంత్ దివ్యాంగుడని, కొన్ని రోజుల క్రితమే తనకు పెన్షన్ కోసం వివరాలను మున్సిపాలిటీలో ఇచ్చానని తెలిపారు. ఇటీవలే మధ్యప్రదేశ్ రికార్డు స్థాయిలో టీకాలు వేసినట్లు వార్తలకెక్కింది. అయితే తమకు టీకా వేయించుకోకున్నా, బెనిఫిషియరీ సర్టిఫికెట్ వచ్చిందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తనకు అసలు పరిచయం లేని ముగ్గురు పేర్లతో మెసేజులు వచ్చాయని సత్నాకు చెందిన చైనేంద్ర పాండ్య చెప్పారు. తానే ఇంతవరకు టీకా వేయించుకోలేదని, ఎవరికో టీకా వేసిన మెసేజ్‌లు తనకు ఎందుకు వచ్చాయో తెలియట్లేదని వాపోయారు. అయితే ఈ వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇలాంటి ఫిర్యాదులేమైనా అధికారికంగా వస్తే విచారణ చేస్తామని వైద్యమంత్రి చెప్పారు. -
బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్‌పై మమత ఫొటో
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కోవిడ్ టీకా సర్టిఫికెట్లపై సీఎం మమతా బెనర్జీ ఫొటో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారు కోవిడ్ టీకాలు తీసుకుంటే వారికి సీఎం ఫొటో ఉన్న కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ను ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండగా, బెంగాల్లో మమత ఫొటో ఉండటంపై బీజేపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ అంశంపై బెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ వివరణ ఇచ్చారు. ‘ మా రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారికి ఇస్తున్న టీకాలు.. కేంద్ర ప్రభుత్వం సరఫరాచేసినవి కాదు. బెంగాల్ ప్రభుత్వం సొంత ఖర్చుతో టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రప్రభుత్వమేమీ 18–44 ఏళ్ల వయసు వారి టీకాలు ఇవ్వట్లేదు కదా? అయినా, మమత ప్రభుత్వం ఇస్తోందికాబట్టే ఆమె ఫొటోను టీకా సర్టిఫికెట్లపై ముద్రించాం. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలూ తమ సీఎంల ఫొటోలున్న సర్టిఫికెట్లనే జారీచేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. -
మోదీ చిత్రం లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్లు
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్నవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తున్నారు. అయితే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇకపై వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మోదీ చిత్రం ఉండబోదు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కో–విన్ పోర్టల్‌లో ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి చిత్రం ఉండడం పట్ల పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. -
వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో తొలగించండి
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇచ్చే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించవద్దంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని శనివారం కోరింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించడం ద్వారా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖ అనంతరం ఈసీ కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది. త్వరలో పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేంద్రానికి ఈసీ రాసిన లేఖలో ఎవరి పేరును పెట్టలేదని, కేవలం ప్రధాని ఫొటోలు కనిపించకుండా ఫిల్టర్లు మాత్రమే వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖకు సూచించిందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రావాల్సిన క్రెడిట్‌ను ప్రధాని తన వైపు మళ్లించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించింది. -
సేఫ్టీ ఫస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు వేగంగా రూపొందుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టౌన్‌షిప్స్ నిర్మాణాలు జరుగుతున్నా యి. వీటిల్లో వేలాది కూలీలు, ఉద్యోగులు పనులు చేస్తున్నారు. కానీ వీరి రక్షణను పర్యవేక్షించే ఏర్పాటు లేదు. ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఆ నిర్మాణ పనుల్లో లోపాలెక్కడ ఉన్నాయో గుర్తించే ఏర్పాటు లేకపోవటమే దీనికి కారణం. విదేశాల్లో భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్లు ఉంటారు. సై ట్లో ఎక్కడెక్కడ లోపాలు ఏర్పడుతున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దటం అతని విధి. కానీ దేశంలో ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. దీంతో ప్రతి భారీ భవన నిర్మాణంలో కచ్చితంగా కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్లను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించబోతోంది. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులను తయారు చేసేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కొత్తగా 6 నెలల సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభిస్తోంది. శిక్షణ పూర్తిగా న్యాక్ ఇవ్వనుండగా, సర్టిఫికెట్ మాత్రం సాంకేతిక విద్యా శాఖ జారీచేయనుంది. కెమికల్ ఇండస్ట్రీ సేఫ్టీ విషయంలో శిక్షణకు కొన్ని ప్రై వేటు సంస్థలున్నా, నిర్మాణ రంగంలో రక్షణకు సంబంధించిన శిక్షణ మాత్రం తొలిసారి న్యాక్ చేపడుతోంది. వీరు ఏం చేస్తారంటే.. బహుళ అంతస్తు నిర్మాణాల్లో ఎత్తులో ఉండి పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బాగా ఎత్తులో పనిచేసే వారి రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే ఎత్తు ప్రభావం వల్ల కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ► సెల్లార్ గుంతలు తవ్వేటప్పుడు సమీపంలోని ఇతర భవనాల పునాదులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ► విద్యుత్తు పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► పై అంతస్తులకు నిర్మాణ సామగ్రి తరలించే లిఫ్టు వైర్లు, బకెట్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ► ఈ బాధ్యతలు మొత్తం నిర్వహించటమే కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్ విధి. ఏ డిగ్రీ ఉన్నా అర్హులే ఇది ఆరునెలల సరి్టఫికెట్ కోర్సు. ఏ డిగ్రీ ఉన్న వారైనా ఈ కోర్సును చేయవచ్చు. సాంకేతిక విద్యాశాఖ నుంచి అనుమతికి రాగానే... త్వరలో 25 మందితో తొలిబ్యాచ్‌ను ప్రారంభించేందుకు న్యాక్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాదాలు తగ్గించేందుకు ఉపయోగం ప్రమాదాలు తగ్గించాలంటే నిర్మాణంలో ప్రతి అంశంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రతిరోజూ కార్మికులకు రక్షణపై బ్రీఫింగ్ ఉండాలి. సేఫ్టీ డ్రిల్ అవసరం. ఇవన్నీ చేసేందుకు కన్స్ట్రక్షన్ సేఫ్టీ సూపర్వైజర్లు ఉండాలి. వారిని తయారు చేసేందుకే ఈ శిక్షణ. ముంబై మినహా మరెక్కడా ఈ శిక్షణ లేదు. తెలుగురాష్ట్రాల్లో తొలిసారి న్యాక్ చేపడుతోంది. డిమాండ్ ఆధారంగా ఈ కోర్సు సీట్ల సంఖ్య పెంచుతాం. – భిక్షపతి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కోవిడ్ ట్రాకర్ ► ఏపీలో గత 24 గంటల్లో 64,099 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 478 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 7,067కు చేరింది. ► తెలంగాణలో ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు 62,57,745.. కాగా అందులో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 2,79,135 ► మంగళవారం చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 52,057... అందులో నమోదైన కరోనా కేసులు 536 ► మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాలు 1,502... అందులో మంగళవారం ముగ్గురు చనిపోయారు. -
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే పింఛన్
సాక్షి, హన్మకొండ అర్బన్ : జిల్లా ఖజానా శాఖ ద్వారా సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు నెలవారీ పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ. 65 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, నిబంధనల మేరకు ప్రతీ పింఛన్‌దారు ఏటా తాను జీవించి ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని విధిగా ఖజానా అధికారులకు అందజేయాలి. ప్రస్తుతం కోవిడ్–19 నేపథ్యంలో భౌతికంగా కాకుండా 2021 మార్చి 31లోపు ప్రభుత్వ టీ యాప్ పోలియో యాప్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ ద్వారా అందచేయాలి. అలా అందజేసిన వారికి మాత్రమే 2021 – 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పింఛన్ అందుతుంది. లేనిపక్షంలో వచ్చే ఏడాది మే నుంచి పింఛన్ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయండి.. టీ యాప్ పోలియో ద్వారా గత ఏడాది కూడా జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు తీసుకున్నారు. అలా గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న పింఛన్‌దారులు ఈ ఏడాదికి నేరుగా సెల్ఫీ ద్వారా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రం నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తమ మొబైల్ ఫోన్లో టీ యాప్ పోలియో తెలంగాణ ప్రభుత్వ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేస్తే పిన్ వస్తుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుడిగా చెబుతూ ఓటరు ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) లేదా బ్యాంకు అకౌంట్ నంబర్‌తో పాటు పేరు, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. వీటితో పాటు సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత టీయాప్ పోలియో సాఫ్ట్వేర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నమోదైన ఓటరు వివరాలు, ఖజానా శాఖ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన వివరాలు ఫొటోలతో సహా ట్రెజరీ అధికారుల పరిశీలనకు అందుతాయి. అక్కడ సరైనదేనని ధృవీకరించుకుని రిజిస్ట్రేషన్‌ను ఆమోదిస్తారు. ఆ తర్వాత పింఛన్‌దారులు జీవిత కాలమంతా జీవన ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో నుంచి టీయాప్ పోలియో యాప్ ద్వారా సమర్పించవచ్చు. కాగా, రిజిస్ట్రేషన్ పరిశీలన పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ను ట్రెజరీ అధికారులు ఆమోదించినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే మళ్లీ సెల్ఫీ దిగి తన జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. రెండోసారి దిగిన సెల్ఫీ ఫొటోతో జీవన ధృవీకరణ పత్రాన్ని నేరుగా ట్రెజరీ సాఫ్ట్వేర్ ఆమోదిస్తుంది. ఎవరివైనా వివరాలు లేదా ఫొటోలు రెండూ సరిగ్గా లేనప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తారు. మళ్లీ సరిగ్గా నమోదు చేసి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి రుసుము ఎవ్వరికీ చెల్లించాలి్సన అవసరం లేదు. మరికొంత సమాచారం పోస్ట్ ద్వారా వచ్చిన జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు ఆమోదించరు. పత్రం సమర్పించిన తర్వాత ఎవరైనా పింఛన్‌దారులు మరణిస్తే ఆ వివరాలను కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఓటరు కార్డు లేని పింఛన్‌దారులు ఆధార్ నంబర్ ద్వారా సమీప మీ సేవా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ కేంద్రాలకు వెళ్లి జీవన ధృవీకరణ పత్రాన్ని అందచేయవచ్చు. ఇందుకోసం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ నంబర్ లేని వారి జీవన ధృవీకరణ పత్రం మీ సేవ కేంద్రాల్లో ఆమోదించరు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛన్‌దారులు ట్రెజరీ కార్యాలయంలో తమ ఆధార్ నంబర్ నమోదు చేయించుకోవాలి. కాగా, ఓటరు కార్డు, ఆధార్ నంబర్ లేని వారితో పాటు ఆధార్ నంబరు ఉండి కూడా వేళ్లు సరిగ్గా స్కాన్ కాక జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో ఇవ్వలేని వారైతే సంబంధిత ట్రెజరీ అధికారిని కలిసి పత్రాన్ని నేరుగా అందచేయవచ్చు. రెవెన్యూ ధ్రువీకరణ పత్రం కూడా.. జీఓ 315 ద్వారా పింఛన్ పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతు మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలతో పాటు మైనర్ పింఛన్ పొందుతున్న ఫ్యామిలీ పింఛన్‌దారులు వివాహం చేసుకోనట్లు, ఉద్యోగం చేయడం లేదన్నట్లుగా రెవెన్యూ శాఖ ద్వారా ధృవీకరణ పత్రాన్ని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి. దివ్యాంగుల పింఛన్‌దారులు ఇటీవల(మూడేళ్ల క్రితం) తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. వీరు ధృవీకరణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో ఇవ్వకుండా నేరుగా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే పింఛన్ నిలిపివేస్తారు. రెండు పింఛన్లు పొందుతున్న వారైతే ఒక దానిపైనే కరువు భత్యం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువగా వస్తున్న కరువు భత్యాన్నే పొందాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉంటున్నారా? విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు అక్కడి ఎంబసీ ద్వారా జీవన ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఖజానా అధికారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. బంధువుల ద్వా రా వచ్చినా, వాట్సప్ లేదా ఫేస్బుక్ వీడియో కాల్ ద్వారా అందిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఎంబసీ ద్వారా పంపలేనప్పుడు స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారికి పత్రాలను సమర్పించి పింఛన్ పొందొచ్చు. కార్యాలయాలకు రావొద్దు కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లు ఎవరూ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కార్యాలయాలకు రావొద్దు. పెన్షనర్లలో ఎక్కువ మంది 60 ఏళ్ల వయస్సు పైబడినవారు ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా కార్యాలయాలకు వచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తే సరిపోతుంది. ఈ విషయంలో దళారుల మాటలు నమ్మి డబ్బు ఇవ్వొద్దు. ఎవరికైనా(వరంగల్ అర్బన్ జిల్లా పెన్షనర్లు) ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే నేరుగా 77999 34090 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయవచ్చు.– గుజ్జు రాజు, జిల్లా ఖజానా లెక్కల అధికారి -
కోవిడ్ తిరగబెట్టదని గ్యారంటీ లేదు
జెనీవా: కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారికి ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్న వివిధ దేశాల తీరుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తప్పు పట్టింది. కోవిడ్ వ్యాధి మళ్లీ తిరగబెట్టదని ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆఫీసులకి వెళ్లడానికి, ప్రయాణాలు చేయడానికి వీలుగా చిలీ వంటి దేశాల్లో ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాయి. అయితే, వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. -
ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్
న్యూఢిల్లీ: విద్యార్థుల సర్టిఫికెట్లపై హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్లు ముద్రించేందుకు యోచిస్తున్నామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ స్పష్టం చేసింది. వ్యవస్థలో పారదర్శకతకు, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సర్టిఫికెట్లపై విద్యార్థుల ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్, మార్కుల జాబితాపై క్యూఆర్ కోడ్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని వైస్ చాన్స్లర్లకు రాసిన లేఖలో యూజీసీ సెక్రటరీ రజనీశ్‌జైన్ అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో పారదర్శకత ఉంటుందని, వారికి సంబంధించిన వివరాల సేకరణ మరింత సరళంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఒకేదాంట్లో సీబీఎస్ఈ టెన్త్ సర్టిఫికెట్, మార్క్స్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి పాసైన విద్యార్థులకు సర్టి ఫికెట్, మార్కుల మెమో ఇకపై వేర్వేరుగా ఉండవు. ఈ ఏడాది నుంచి ఈ రెంటింటిని కలిపి ఒక్కటిగానే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ‘2019 సంవత్సరం నుంచి సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు ఒక్కటే సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో ధ్రువీకరణ పత్రంతోపాటు మార్కుల వివరాలుంటాయి’ అని ఓ అధికారి చెప్పారు. 12వ తరగతికి మాత్రం పరీక్ష ధ్రువీకరణ, మార్కుల షీట్లు వేరుగా ఉంటాయి. ఒక వేళ విద్యార్ధి ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాస్తే..అందులో సంపాదించిన మార్కుల వివరాలతో ప్రత్యేక ధ్రువీకరణ ఉంటుంది. -
ఆమెకు కులం, మతం లేదు!
పొద్దున లేస్తే చాలు కుల, మత, వర్గ రహిత సమాజం కావాలంటూ లెక్చర్లు దంచే ‘మహానుభావుల’ను చాలా మందినే చూస్తుంటాం. అందులో ఎంత మందికి నిజంగా సమసమాజ స్థాపన పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే తమిళనాడుకు చెందిన స్నేహ అనే న్యాయవాది మాత్రం ఇందుకు మినహాయింపు. మాటలకు పరిమితమై పోకుండా ఏళ్ల పాటు కృషి చేసి.. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ సంపాదించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారామె. ఎవరి హక్కులనో ప్రశ్నించేందుకు తాను ఈ సర్టిఫికెట్ పొందలేదని.. భవిష్యత్ తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నానన్న ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం. బుధవారం సాయంత్రం నుంచి స్నేహ (35), ఆమె భర్త పార్తీబ రాజా ఫోన్ మోగుతూనే ఉంది. కొందరు స్నేహకు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం స్నేహలాగే తాము కూడా కుల, మతరహిత సమాజంలో భాగస్వామ్యం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ పొందాడానికి అనుసరించాల్సిన విధానాల గురించి అడుగుతూ సందేహాలు తీర్చుకుంటున్నారు. గర్వంగా ఉంది... ఈ విషయం గురించి స్నేహ మాట్లాడుతూ... ‘నా జీవితంలోని ముఖ్య లక్ష్యం ఒకటి నెరవేరింది. నా తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల ప్రభావంతో చిన్ననాటి నుంచే నాలో కుల, మతాలకతీతంగా ఉండాలనే కోరిక బలపడింది. అనేక అవాంతరాల అనంతరం ఈ రోజు నా చేతిలో నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ ఉంది. అలా అని నేను రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ విధానాన్ని సమర్థిస్తాను. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటివి అవసరం. అయితే ఇందుకు కులమో, మతమో ప్రామాణికం కాకూడదు. ఈ సర్టిఫికెట్ పొందడం ద్వారా ఎవరి హక్కులను లాక్కోవడం లేదు. సమాజ శ్రేయస్సు కోసం, వివక్షకు గురవుతున్న వ్యక్తుల హక్కులను కాపాడాలని ప్రతీ ఒక్కరికీ విఙ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే 2017 నుంచి నాకు సానుకూలత లభించింది. ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చింది. చాలా గర్వంగా ఉంది. కాస్ట్ సర్టిఫికెట్ ఫార్మాట్లోనే నా సర్టిఫికెట్ రూపొందించమని అడిగాను’ అని తిరుపత్తూరు తహశీల్దార్ టీఎస్ సత్యమూర్తి నుంచి నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తండ్రి చూపిన బాటలో...భర్త ప్రోత్సాహంతో స్నేహ స్వస్థలం వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు. ఆమె తండ్రి కుల, మతాలకు వ్యతిరేకం. అందుకే తన ముగ్గురు కూతుళ్లకి స్నేహ, ముంతాజ్, జెన్నిఫర్ అనే పేర్లు పెట్టారు. తండ్రి ప్రభావంతో స్నేహ కూడా తన సంతానానికి వివిధ మతాచారాలకు సంబంధించిన పేర్లు పెట్టారు. ఈ విషయంలో స్నేహ భర్త పార్తీబ రాజా ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు. తన పెద్ద కుమార్తెకు ‘అధిరై నస్రీన్’ అనే బుద్ధిస్టు, ముస్లిం సంప్రదాయాల కలయికకు చెందిన పేరు పెట్టడం గురించి పార్తీబ రాజా మాట్లాడుతూ.. ‘ కుల, మత రహిత సమాజం గురించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకే మా కూతురికి ఈ పేరు పెట్టాం. తన పేరు వినగానే ప్రతీ ఒక్కరూ మీ అమ్మానాన్నలు ముస్లింలా అని అడుగుతారు. అప్పుడు మా కూతురు మా ఇద్దరి పేర్లు చెప్పడంతో పాటుగా తనకు ఆ పేరు పెట్టడానికి గల కారణాలు, తన పేరు వెనుక ఉన్న కథను వివరిస్తుంది. ఈ రకంగా వారికి అవగాహన కలుగుతుంది. ప్రసుతం స్నేహ నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ఒక సానుకూల దృక్పథానికి నాంది. ఈ విషయం గురించి చర్చ మొదలైంది. చాలా మంది తమకు కూడా ఇలాంటి సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు. బహుశా దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి మహిళ తనేనేమో. ప్రస్తుతం ఆమె సోదరీమణులు కూడా తన బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ప్రశంసల జల్లు నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ద్వారా స్నేహ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘భారతీయుల్లో నిగూఢంగా ఉండే కోరికను మీరు నెరవేర్చుకున్నారు. మనకు అనవసరమైన, సంబంధం లేని విషయాలను త్యజిద్దాం. కులాన్ని పక్కన పెట్టేద్దాం’ అంటూ లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. అదేవిధంగా సినీ నటుడు సత్యరాజ్, నటి, హక్కుల కార్యకర్త రోహిణి స్నేహను ప్రశంసించారు. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ Dear Sneha, You have actuated a long dormant desire among Indians. Let’s discard what never belonged to us. Let’s caste away Caste. From this point, a better tomorrow will be more accessible. Bravo daughter. Lead India forward. https://t.co/tdjngFiHWl — Kamal Haasan (@ikamalhaasan) February 13, 2019 -
పరేషాన్..!
సాక్షి, సిటీబ్యూరో: అల్వాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా నగరంలోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆవరణలో మూడు నెలల పాటు పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. సదరు కేంద్ర ప్రభుత్వ సంస్థలోకి నిత్యం రాకపోకలు సాగించేందుకు ధ్రువీకరణపత్రాలు అవసరమని సిబ్బంది స్పష్టం చేశారు. అతడి నేపథ్యంపై పోలీసుల నుంచి ధ్రువీకరణ తీసుకురావాలని సూచించారు. దీంతో అతను 15 రోజుల క్రితం అల్వాల్‌లోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాడు. అయితే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగింది. అతనొక్కడికే కాదు...వందలాది మందికి రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో తరచూ ఎదురవుతున్న అనుభవాలివి. పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ అవసరం పడినా, ఏదైనా పొగొట్టుకొని డూప్లికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిన క్రమంలో పోలీసులను సంప్రదిస్తే వాటిని తిరస్కరిస్తున్నారు. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో లాస్ రిపోర్టు పేరిట బాధితులకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం జరుగుతు న్నా ఈ రెండు కమిషనరేట్లలో ఆ తరహా స్పందన కరవైందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సకాలంలో అందక కష్టాలు... ఏదైనా పని కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 322 రకాల పౌరసేవలను పొందే అవకాశాన్ని కల్పించిన ఈ కేంద్రంలో పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్తో పాటు వస్తువులన్నీ పొగొట్టుకున్నందుకు ధ్రువీకరణపత్రాలను ఇచ్చే సేవలను కూడా చేర్చారు. క్షేత్రస్థాయిలో...ముఖ్యంగా> పోలీసులపరంగా మాత్రం పలు సందర్భాల్లో బాధితులకు తిరస్కరణలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రస్తుతం తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల అవసరం ఏర్పడుతోంది. అభ్యర్థుల నేపథ్యం, ప్రవర్తనపై పోలీసులు విచారణ జరిపి నిరంభ్యంతర పత్రం ఇస్తేనే ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమవుతోంది. అలాగే ఏదైనా ధ్రువీకరణ పత్రం పొగొట్టుకున్నప్పుడు పోలీసులు ధ్రువీకరిస్తేనే డూప్లికేట్ పొందడం సాధ్యమవుతుంది. కానీ ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో బాధితులకు తరచూ ఇబ్బందులు తప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసి పోలీసు సర్టిఫికెట్ తీసుకోవాల్సిన సమయంలో ఆలస్యమవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లకు వెళుతున్నట్లు, మరికొన్ని సందర్భాల్లో పోలీసు కమిషనరేట్‌కు వెళుతున్నట్టు చూపెడుతుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దరఖాస్తుదారుల ప్రవర్తనపై స్థానిక పోలీసు స్టేషన్లలో ధ్రువీకరణపత్రాలు ఇవ్వొద్దని ఇప్పటికే కమిషనర్లు మెమోలు కూడా జారీ చేయడంతో దరఖాస్తుదారులను కమిషనరేట్లకే స్థానిక పోలీసులు పంపిస్తున్నారు. లాస్ రిపోర్టుతో త్వరగా సేవలు... హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కమిషనరేట్ వెబ్సైట్లో లాస్ రిపోర్టు సదుపాయం కల్పించారు. బాధితులు ధ్రువీకరణపత్రాలు గానీ, సెల్ఫోన్లను పొగొట్టుకుంటే ఠాణాకు గానీ, మీసేవ కేంద్రాలకు గానీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెబ్సైట్లో లాస్‌రిపోర్టు అప్షన్కు వెళ్లి యాప్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‌లోనే పొగొట్టుకున్న ధ్రువీకరణపత్రాలు,, సెల్ఫోన్లపై ఫిర్యాదు చేస్తే చాలు వెతికిపెట్టే పనిని పోలీసులే చూస్తున్నారు. ఇలా చేసిన ఫిర్యాదులకు సంబంధించిన ధ్రు వీకరణ పత్రాలను 72 గంటల్లోగా తిరిగి సెల్కే పంపిస్తుండడంతో బాధితులకు ఊరట లభిస్తోంది. -
బీఎస్సీకి బీకామ్ పట్టా: మంత్రి గంటా సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్న విద్యార్థికి బీకామ్ పట్టా ఇవ్వడంపై మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌తో ఆయన మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇచ్చారని ఈసందర్భంగా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన వీసీకి ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే.. బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం విద్యార్థికి షాక్..! శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి.. టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాంలే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అదిగో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. -
కానిస్టేబుళ్ల ఎంపికకు సర్టిఫికెట్ల పరిశీలన
విజయనగరం టౌన్: పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల ఒకటో తేదీ నుంచి రెండురోజుల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సివిల్ విభాగంలో 192, ఆర్మ్డ్ రిజర్వు 107, జైలు వార్డర్లు19(పురుష), 11 మహిళ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం వారికివైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అభ్యర్థుల గత చరిత్రను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తారని ఎస్పీ తెలిపారు. తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, జైలువార్డర్ల ఉద్యోగాలకు ఎంపికైన మహిళా, పురుష అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించిన విద్యార్హత, కుల, క్రీడా వగైరా ధ్రువపత్రాల ఒరిజినల్స్, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన రెండు సెట్స్ జెరాక్స్ కాపీలను, ఇటీవల తీసుకున్న మూడు కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తమ వెంట తీసుకుని రావాలని చెప్పారు. అభ్యర్థులు వెనుకబడిన తరగతులకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రంతో పాటు క్రిమిలేయర్ ధ్రువపత్రాన్నీ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. -
1 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ట్రైనింగ్
కర్నూలు సిటీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి 42 రోజుల పాటు టెక్నికల్ కోర్సు ట్రైనింగ్ అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వబడుతుందని, ఇందుకు 18 సంవత్సరాలు నుంచి 45 ఏళ్లు నిండిన ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్ష, లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కల్గిన వారు అర్హులన్నారు. ఈ నెల30వ తేదీ వరకు అనంతపురం డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సర్టిఫికేట్ ఒకటే..పోస్టులు రెండు
వేరే వ్యక్తి సర్టిఫికెట్ జత చేసి ఉద్యోగం పొందిన వైనం ఆధార్, రేషన్ కార్డుల్లో కూడా పేరు మార్పు గుడ్డిగా ఓకే చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు బయటపడినా దర్యాప్తు నత్తనడకే ప్రజాధనం వృథా అవుతున్నా కిమ్మనని ఐసీడీఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : మీరు చదువుకోలేదా...ఎటువంటి సర్టిఫికెట్ లేదా... అయినా ఫర్లేదు మీకు ఉద్యోగం కావాలి అంతే కదా. అయితే ఎవరో ఒకరి సర్టిఫికెట్ తెచ్చుకోండి. మిగతాదంతా మేం చూసుకుంటాం అంటున్నారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొం దరు ఉద్యోగులు. ఇంకా మీకు అనుమానాలున్నాయా... ఐసీడీఎస్‌లో ఒకే ఎనిమిదో తరగతి సర్టిఫికెట్‌పై వేర్వేరు పోస్టుల్లో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ‘మేం ఉన్నాం కదా’ అని భరోసా ఇస్తున్నారు. ఈ బాగోతానికి సంబంధించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో వేర్వేరు అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే ఎనిమిదో తరగతి సర్టిఫికెట్ జత చేసి ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. అందులో ఒక మహిళ అంగన్వాడీ కేంద్ర వ ర్కరు, మరో మహిళ ఆయాగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్ర జాధనం వృథా అవుతున్నా ప్రలోభాలకు లోబ డి ఐసీడీఎస్ అధికారులు మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి. రాజ వొమ్మంగి మండలం కొమరాపురం గ్రామానికి చెందిన కోనల రామస్వామి కుమార్తె కోనల వెంకట లక్ష్మి అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సుమారు పదేళ్ల నుంచి హెల్పర్ (ఆయా)గా పనిచేస్తోంది. ప్రత్తిపాడు మండలం ఉప ప్రణాళిక ప్రాంతమైన బురదకోట గిరిజన గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వర్కర్ పోస్టు నియామకం కోసం ఎనిమిదేళ్ల కిందట శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టు కోసం కోనల అచ్చయ్య కుమార్తె కోనల లక్ష్మి దరఖాస్తు చేసుకుంది. అయినా సరిపడా విద్యార్హత ఆమెకు లేదు. అందుకు ఆమె పెద్ద పథకమే వేసింది. తన ఇంటి పేరుతోపాటు తన పేరుతో దగ్గరగా ఉండి రాజవొమ్మంగిలో అంగన్వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న కోనల వెంకటలక్ష్మి ఎనిమిదో తరగతి సర్టిఫికెట్‌ను జతచేసి అంగన్వాడీ వర్కర్ పోస్టుకు దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తును కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా స్త్రీశిశు సంక్షేమ అధికారులు లక్ష్మీకి అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాన్ని కట్టబెట్టేశారు. అన్నింటా పేరు మార్చేసి... అంగన్వాడీ వర్కర్‌గా నియామకానికి ముందు కోనల లక్ష్మి ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీ పరిధిలోని భాపన్నధారలో చిన్నారుల నివాస కేంద్రంలో సహాయకురాలిగా పనిచేసింది. అంగన్వాడీ వర్కర్‌గా నియామకం అనంతరం కోనల లక్ష్మి తన పేరును రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో కోనల వెంకట లక్షి్మగా నమోదు చేయించుకుంది. ఎనిమిదేళ్ల నుంచి కోనల లక్ష్మి ... కోనల వెంకట లక్షి్మగా బురదకోట అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కలెక్టర్ ఆదేశించినా... రాజవొమ్మంగి అంగన్వాడీ హెల్పర్ కోనల వెంకట లక్ష్మి తన సర్టిఫికెట్లతో మరో మహిళ ఉద్యోగం చేస్తోందని తెలుసుకొని రెండేళ్ల క్రితం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేశారు. తన సర్టిఫికేట్‌తో బురదకోట అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా పని చేస్తున్న లక్షి్మపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా ఇంతవరకు విచారణ చేయలేదు. గత ఏడాది శంఖవరం మండలం పెదమల్లాపురంలో నిర్వహించిన గిరిజన సదస్సులో కూడా విచారణ నిర్వహించి చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. బురదకోట పంచాయతీ పరిధిలో బాపన్నధార సహా పలు గ్రామాల గిరిజనులు ఐటీడీఏ పీఓకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రెండు పర్యాయాలు కాకినాడ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్సులో కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఇది జరిగి కూడా ఏడాది దాటిపోయినా పట్టించుకున్న నాథుడే లేడు. విచారణ నిర్వహించినా... బురదకోట అంగన్వాడీ వర్కర్ వి«ధి నిర్వహణలో అలక్ష్యం చేస్తోందని, తొమ్మిది నెలల్లో కేవలం 28 రోజుల మాత్రమే కేంద్రాన్ని తెరిచారని మూడేళ్ల క్రితమే 2014 జూన్ 16న పిల్లల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి టి.నాగమణి స్థానిక గిరిజనుల సమక్షంలో విచారణ నిర్వహించినా ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గిరిజనం ఆరోపిస్తోంది. ఏ విద్యార్హతలతో పోస్టింగ్ ఇచ్చారో తెలియజేయాలని బాపన్నధార గ్రామానికి చెందిన ముర్ల రాజబాబు, విప్లవకుమార్ గత నెలలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఇటీవల బురదకోటలో శంఖవరం, రాజవొమ్మంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ తదితరులను ఐసీడీఎస్ అధికారులు విచారించారని తెలిసింది. -
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ గడువు పెంపు
న్యూఢిల్లీ: పింఛన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించేం దుకు ఈపీఎఫ్ఓ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో ఏర్పడిన రద్దీ దృష్ట్యా ఈ గడువును గత నవంబర్‌లో జనవరి 15 వరకు పెంచిన సంగతి తెలిసిందే. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు ఆధార్‌ను తప్పనిసరి చేశామని, బ్యాంకుల ద్వారా వీటిని భౌతికంగా స్వీకరించే విధానాన్ని తొలగించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొబైల్ ఫోన్లు లేదా ఉమ్మడి సేవా కేంద్రాలు (సీఎస్సీ) లేదా ప్రత్యేక బ్యాంకు శాఖల ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించాలని సూచించారు. మొబైల్ఫోన్లలో జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ సర్టిఫికెట్‌ను అంగీకరిస్తుంది. లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించని పింఛన్‌దారులకు పెన్షన్ ఆగిపోతుంది. -
ఇక ఇంటికే సర్టిఫికెట్లు
‘మీ సేవ’లకు షాక్.. అక్రమాలకు బ్రేక్ త్వరలోనే అందుబాటులోకి ‘మీసేవ’ యాప్ మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.. పోస్టులో ఇంటికే రానున్న ధ్రువీకరణ పత్రాలు పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ నుంచే ప్రారంభం సర్టిఫికెట్ల కోసం ఇక మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. నిర్ణీత వ్యవధిలో సర్టిఫికెట్లు మన ఇంటికే చేరతారుు. ఎవరికీ అదనంగా చెల్లింపులు చేయకుండా ధ్రువీకరణ పత్రాలు చేతికందుతారుు. మరీ అత్యవసరమైతే అదనపు రుసుము చెల్లించి ఒక రోజు వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం త్వరలోనే ‘మీసేవ యాప్’ను అందుబాటులోకి తేనుంది. మన జిల్లాలోనే ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనుంది. ఇందూరు: మీ సేవ కేంద్రాలకు కాలం చెల్లనుంది.. నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో వారు ఉపాధి పొందుతున్న కేంద్రాలకే దెబ్బ తెచ్చింది.. మీ సేవ కేంద్రాల్లో బోగస్ సర్టిఫికెట్లు సృష్టించడం, క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తెప్పించి దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రభుత్వం ముకుతాడు వేయనుంది. మీ సేవ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా, ప్రజలు స్వతహాగా తమ మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకునేలా ’మీ-సేవ’ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు మన జిల్లా నుంచే ఓ డిప్యూటీ తహసీల్దార్, మరి కొందరు ఉద్యోగులు కలిసి ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని పనితీరును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు మొన్నటివరకు రెవెన్యూ కమిషనర్‌గా పని చేసిన రేమండ్ పీటర్‌కు వివరించగా, వారు ఓకే చెప్పారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం 230 మీ సేవ కేంద్రాలున్నారుు. వీటి ద్వారా కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు 26 రెవెన్యూ సేవలు పొందే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బోగస్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. సరైన సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తులు చేరుుంచడం, ఎవరి పేరుపై ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇవ్వడం, దరఖాస్తులు చేసుకున్న క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేరుుస్తున్నారు. ఇలా చేరుుంచినందుకు దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారుల దృష్టికి రాగా, అధికారులే మీ సేవ కేంద్రాల ఆపరేటర్లకు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల మీ సేవ కేంద్రాల ఆపరేటర్లతో జిల్లా కేంద్రంలో సమావేశం జరిపిన ఓ ఉద్యోగి ’మీరు ఏం చేసినా బయటకు తెలియకుండా చేసుకోండి’ అని దర్జాగా చెప్పడం గమనార్హం. సదరు ఉద్యోగికి మీ సేవ కేంద్రాల నుంచి మాముళ్లు అందుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ చెక్ పెట్టేందుకే యాప్.. మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మీ సేవ యాప్ ఏర్పాటుకు పూనుకుంది. జిల్లాకు చెందిన, ఈ- సేవా, మీ సేవ కేంద్రాల పరిపాలన అధికారి రమణ్రెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మీ సేవ యాప్‌కు శ్రీకారం చుట్టారు. అది పని చేసే విధానాలపై మంత్రి కేటీఆర్‌కు వివరించగా, బాగుందని ప్రశంసించారు. దీనిని రాష్ట్రమంతటా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మీ సేవ యాప్‌కు సంబంధించిన మరికొన్ని సాప్ట్వేర్ అప్లికేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెండు, మూడు నెలల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా నిజామాబాద్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ ప్రారంభమైతే మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ప్రజలు మీ సేవ కేంద్రాలకు కాకుండా వారి మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ‘డిజిటల్ కీ’కి మంగళం! ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటే, వీఆర్వో నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలన చేసి, తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తే మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అరుుతే, మీ సేవ యాప్‌తో ఈ విధానానికి ఫుల్స్టాప్ పడనుంది. మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోగానే సంబంధింత వీఆర్వో లాగిన్‌లో పరిశీలన చేస్తాడు. అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్‌లో పరిశీలన జరిపి, ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికే పోస్టులో రానుంది. ఎప్పడు కావాలంటే అప్పుడు కాకుండా నిర్ణీత కాల పరిమితిలోనే అందుతుంది. ఒకవేళ అత్యవసరం అరుుతే రుసుము ఎక్కువ చెల్లిస్తే ఒక్క రోజులో అందించడానికి చర్యలు చేపట్టనున్నారు. అరుుతే సర్టిఫికెట్లను పరిశీలన చేయడానికి ప్రభుత్వం వీఆర్వో, తహసీల్దార్లకు ట్యాబ్‌లను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచింది. అరుుతే సర్టిఫికెట్లు ముద్రించి ఇంటికే పోస్టులో పంపడానికి ప్రత్యేక ప్రింటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాలకు చెందిన డిజిటల్ కీని ఉపయోగించి, మీసేవ ఆపరేటర్లు అడ్డగోలుగా సర్టిపికెట్లు సృష్టిస్తున్నారు. వారి ఆటలకు చెక్ పెట్టేలా డిజిటల్ కీ కాకుండా, వేలిముద్రల కీ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండు నెలల్లో అమలు కావచ్చు.. మీ సేవ యాప్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు, మూడు నెలల్లో ఇది అమలు కావచ్చు. నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా నుంచే మీ సేవ యాప్‌ను రూపొందించి ఐటీ మంత్రి కేటీఆర్‌కు వివరించాం. ఇది చాలా బాగా పని చేస్తుందని, ప్రజలకు సులభంగా ఉంటుందని ఆయన అన్నారు. యాప్‌తో మీ సేవ ఆపరేటర్ల ఆటలకు ముకుతాడు పడనుంది. - రమణ్‌రెడ్డి, మీ సేవ కేంద్రాల ఏవో -
బాలగంధర్వుడు సాకేత్ రామ్
-
ఏఎన్‌యూకి ఐఎస్వో సర్టిఫికెట్
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. బుధవారం సాయంత్రం యూనివర్సిటీలో జరిగిన విలేకర్ల సమావేశంలో వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఈవిషయం వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ గుర్తింపు కమిటీ సభ్యులు ఏఎన్‌యూని సందర్శించి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న ప్రమాణాలను అధ్యయనం చేశారని వీసీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా సంస్థల నాణ్యతా ప్రమాణాలను అధ్యయనం చేసి సర్టిఫికెట్‌ను జారీ చేసే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల అనుబంధ సంస్థ అయిన భారత దేశపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ అధారిటీ సంస్థ టీఎన్వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేసిందన్నారు. టీఎన్వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రగ్యేష్ కుమార్ సింగ్ సర్టిఫికెట్‌ను ఏఎన్‌యూకి జారీ చేశారని తెలిపారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, ఆర్ట్స్, సైన్స్ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్ విజయరాజు, ఆచార్య బి విక్టర్‌బాబు తదితరులు ఈసందర్భంగా వీసీకి అభినందనలు తెలిపారు. -
శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పంపిణీ
మంచిర్యాల రూరల్ : నేడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా స్వయం ఉపాధితో కూడా ముందుకు సాగి అభివృద్ధి పథంలో నడవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గురువారం మంచిర్యాల ఈజీఎస్ ఏపీడీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ కోర్సులో ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పించి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కలిపించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనలో ముందుందన్నారు. మంచిర్యాల ఈజీఎస్ ఏపీడీ మల్లేశ్ మాట్లాడుతూ, జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల్లో వంద రోజులు పని చేసిన ఆయా కుటుంబాల్లోని యువతకు డ్రైవింగ్ కోర్సు ద్వారా 35 మంది శిక్షణ పొందారని, త్వరలోనే మరో 45 మందికి డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 1228 మంది యువత ఉండగా ఇందులో 30 మంది ఫ్యాషన్ డిజైన్, 45 కంప్యూటర్ కోర్సు, 20 మంది వైండింగ్, 25 మంది హౌజ్ వైరింగ్, 30 మంది టైలరింగ్‌లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, మున్సిపల్ కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, ఏపీఓ నవీణ్, డ్రైవింగ్ శిక్షణ కోర్సు డైరైక్టర్ సత్యనారాయణ, ఎస్బీహెచ్ ఆర్ఎస్ఈటీఐ డిప్యూటీ డైరైక్టర్ ఆశన్న, స్థానికులు, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు. -
డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో డీఈఈసెట్–2016లో అర్హత సాధించి డీఎడ్ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత కళాశాల అడ్మిషన్ లేఖలు అందజేసినట్టు ప్రిన్సిపాల్ జయప్రకాశరావు తెలిపారు. -
నేటి నుంచి డీసెట్–2016 సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : డీసెట్–2016(డైట్‌సెట్)లో భాగంగా ఆదివారం నుంచి పదో తేదీ వరకు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంటనే ఆన్లైన్ అప్లికేషన్, హాల్ టిక్కెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి మార్కుల లిస్టు, ఇంటర్ మార్కుల లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు(ఒకటి నుంచి 10వ తరగతి), కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేదా రేషన్ కార్డులతో పాటు పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ(బీ ఆర్ సీ) తదితర సర్టిఫికెట్లను తీసుకొని 45్ఠ30 సైజు పాలిథిన్ కవర్లో పెట్టుకొని రావాలని సూచించారు. అంతేకాక జిల్లాలోని అన్ని ప్రై వేట్ డీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు కూడా హాజరు కావాలని కోరారు. -
‘డమ్మీ’లకు ఆధార్‌తో చెక్
బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతం పెనుమార్పులకు నాంది పలుకుతోంది. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికే కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు... వీటి నేపథ్యంలో డ్రై వ్స్లో చిక్కిన వాహనచోదకులు ఎలాంటి ఎత్తులు వేయకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. మరోపక్క మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన శిక్షలు వేయాలని కోరుతూ న్యాయ విభాగానికి విన్నవించింది. ఈ మేరకు ట్రాఫిక్ అధికారులు మంగళవారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) ఎం.రజని నేతృత్వంలో న్యాయమూర్తులతో భేటీ అయ్యారు. ట్రాఫిక్ విభాగం చేపట్టే తనిఖీల్లో మద్యం తాగి, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడుపుతూ చిక్కుతున్నారు. అప్పటికప్పుడు వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్న ట్రాఫిక్ విభాగం అధికారలు నిర్ణీత సమయాల్లో గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో (టీటీఐ) జరిగే కౌన్సిలింగ్‌కు హాజరుకావడం తప్పనిసరి చేశారు. అక్కడి కౌన్సిలింగ్ తర్వాతే ఆయా ఉల్లంఘనుల్ని దాని తీవ్రతను బట్టి కోర్టుకు తరలించడం, జరిమానా వసూలు చేయడం చేస్తున్నారు. ఆధార్ కార్డు తేవాల్సిందే... ఇప్పటి వరకు ఈ కౌన్సిలింగ్‌కు కేవలం ఉల్లంఘనుడు మాత్రమే హాజరయ్యేవాడు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం... సదరు ఉల్లంఘనులు వివాహితులైతే భార్య/భర్త, అవివాహితులైతే తల్లిదండ్రులు/సంరక్షకుడితో కలిసి హాజరుకావడం తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఉల్లంఘనుల్ని డమ్మీలను రంగంలోకి దింపే అవకాశం ఉందని ట్రాఫిక్ విభాగం అధికారులు అనుమానిస్తున్నారు. తమ వారికి విషయం తెలియడం ఇష్టంలేని నేపథ్యంలో ఇలా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి డమ్మీలకు చెక్ చెప్పడానికి ఆధార్ కార్డు తీసుకురావడం తప్పనిసరి చేస్తున్నారు. చిక్కిన ఉల్లంఘనుడితో పాటు వారితో వచ్చే వాళ్ళూ ఈ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. అందులోని వివరాలు, వయస్సులను సరిచూసిన తర్వాతే కౌన్సిలింగ్‌కు అనుమతించనున్నారు. ఆధార్ కార్డు జారీ కాని పక్షంలో వారి బంధుత్వాన్ని ధ్రువీకరించే ఇతర పత్రాలు చూపే అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి ధ్రువీకరణలు లేకుండా మాత్రం కౌన్సిలింగ్‌ను అనుమతించమని, ఎవరైనా చీటింగ్‌కు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వారికి ఆటోమేటిక్‌గా సమాచారం... ‘డ్రంకెన్ డ్రై వ్’తో పాటు వివిధ రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కుతున్న వారిలో విద్యార్థులు, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారం కేవలం పోలీసు విభాగానికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇకపై దీన్ని వారు చదువుతున్న/పని చేస్తున్న సంస్థలు, విభాగాలకు అందించాలని నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం ఆయా యాజమాన్యాలు, శాఖలకు ప్రత్యేకంగా లేఖలు రాయాలని తొలుత భావించారు. ఇందులో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఈ డేటాబేస్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఇందులో నగరంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రముఖ ప్రై వేట్ సంస్థల ఈ-మెయిల్ ఐడీలు పొందుపరుస్తారు. వాటిల్లో చదువుతున్న, పని చేస్తున్న వారు చిక్కి, ఆ వివరాలు నమోదైతే చాలు... కంప్యూటర్ దానంతట అదే ఆయా సంస్థలు, శాఖలకు ఈ-మెయిల్ రూపంలో సమాచారం ఇస్తుంది. ఈ ప్రొగ్రామింగ్‌లో లేని వాటికి మాత్రమే లేఖలు రాయనున్నారు. కౌంట్స్ ‘తగ్గింపు’... శిక్షల పెంపు... మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన ఉల్లంఘనుల్ని కౌన్సిలింగ్ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వారు తీసుకున్న మద్యం మొతాదు, అప్పటి వరకు ఎన్నిసార్లు పట్టుబడ్డారనే విషయాలను పరిగణలోకి తీసుకుంటున్న న్యాయస్థానాలు జైలు శిక్షలు విధిస్తున్నాయి. బ్రీత్ ఎనలైజర్లుగా పిలిచే శ్వాస పరీక్ష యంత్రాలు వాహనచోదకుడి శరీరంలో ఉన్న ఆల్కహాల్‌ను బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిగ్రా కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన. అయితే నగరంలో 300 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్‌తో దొరికిన వారున్నారు. ఇప్పటి వరకు న్యాయస్థానాలు 150 బీఏసీ కంటే ఎక్కువ కౌంట్‌తో, ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారికి మాత్రమే ఒక రోజు నుంచి 20 రోజుల వరకు శిక్షలు విధిస్తున్నాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ట్రాఫిక్ అధికారులు న్యాయ విభాగానికి విన్నవించారు. 100 కంటే ఎక్కువ బీఏసీ కౌంట్ వచ్చినా, పగటి పూట మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడుపుతూ పట్టుబడినా జైలు శిక్ష వేయాలని కోరారు. ఈ శిక్షాకాలాన్ని సైతం మద్యం మొతాదును బట్టి పెంచాలని నివేదించారు. ఆగస్టు 1 నుంచి ‘ఆ యజమానీ’ జైలుకే... మైనర్ డ్రై వింగ్, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడాన్ని నగర ట్రాఫిక్ అధికారులు తీవ్రంగా పరిగణించనున్నారు. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం నడిపిన వ్యక్తితో పాటు దాని యజమానినీ జైలుకు పంపాల్సిందిగా కోరుతూ మంగళవారం నాటి సమావేశంలో న్యాయ విభాగానికి విన్నవించారు. మైనర్, వితౌట్ లెసైన్స్ డ్రైవింగ్‌లకు ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేవలం జరిమానాతో విడిచిపెట్టేవారు. ఈ ఏడాది మార్చ్ 1 నుంచి ఇలాంటి ఉల్లంఘనుల్ని న్యాయస్థానం ద్వారా జైలుకూ తరలిస్తున్నారు. వీరు వాహనం నడిపేందుకు పరోక్షంగా కారణమైన వాహన యజమానినీ ఇకపై బాధ్యుడిని చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే ఈ విధానంలో ఉల్లంఘనుడితో పాటు వాహన యజమానినీ జైలుకు పంపాలని నిర్ణయించారు. -
సర్టిఫికెట్ల పరిశీలన తేదీ మార్పు
బుక్కపట్నం : 2016 ఎల్పీ సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలో ప్రభుత్వం మార్పు చేసిందని డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఈనెల 26,27 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రొవిజనల్ అలాంట్మెంట్లోని ఒరిజి నల్, జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. -
మరో వివాదంలో సెన్సార్ బోర్డు..
త్రివేండ్రం: సెన్సార్ బోర్డుపై మరో సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించింది. కథకళి సినిమాకు యూ సర్టిఫికెట్ ను నిరాకరించినందుకు... మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ దర్శకులు, నిర్మాతలు సోమవారం త్రివేండ్రంలోని సీబీఎఫ్‑సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన యువ దర్శకుడు సజ్జు కన్నానైక్కల్ కథకళి చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రానికి ప్రాణంలాంటి సన్నివేశాలను బోర్డు అధికారులు కత్తిరించేశారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, నిబంధనలకు అనుగుణంగానే కథకళి సినిమాను సర్టిఫై చేశామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కథకళి నిర్మాతల పిటిషన్ స్వీకరించిన హైకోర్టు సీబీఎఫ్ సీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, సినిమా క్లైమాక్స్ లో కథకళి వేషాన్ని వదిలిపెట్టి వ్యక్తి న్యూడ్ గా పరుగెత్తే సీన్ ను తొలగించాలంటూ సీబీఎఫ్ సీ మేకర్స్ కు సూచించింది. దీనిపై స్పందించిన డెరెక్టర్ ఆ సీన్ సినిమాకు సింబాలిక్ రిప్రజెంటేషన్ అని దానిని తీయలేమని వాదిస్తున్నారు. దేశ వ్యతిరేకంగా కానీ, సెక్సువల్ గా కానీ, మహిళలను వేధించడం లాంటి సీన్ లు ఏమి సినిమాలో లేవని.. కేవలం చివరిలో ఒక వ్యక్తి న్యూడ్ గా నడుచుకుంటూ వెళ్తాడని, అది కూడా లాంగ్ షాట్ లో తీశామని సజ్జు తెలిపారు. కానీ, సీబీఎఫ్ సీ బోర్డు చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం సమజసం కాదని అన్నారు. కాగా, క్లైమాక్స్, రెండో రీల్ లో బాస్టర్డ్ అనే పదం అక్కడే ఓ వ్యక్తి వస్త్రాలు తీసేసి చితక్కొట్టే సీన్ లను తొలగించాలని బోర్డు తెలిపింది. 83 కట్లు విధించినందుకు ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బెంబే హైకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. -
ముగిసిన పీజీ మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో నాన్ సర్వీస్, ఇన్‌సర్వీస్ సర్టిఫికెట్ల పరిశీలన ఆదివారంతో ముగిసింది. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ, ఏపీకి చెందిన దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఆదివారం ముగిసింది. ఏపీ అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ జేఎన్టీయూలో 151, ఏయూలో 72, ఎస్వీ యూనివర్సిటీలో 49, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 379 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ కింద జేఎన్టీయూ హైదరాబాద్‌లో 430, కాకతీయ యూనివర్సిటీలో 47, ఎన్టీఆర్ యూనివర్సిటీలో 223 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో కలిపి దివ్యాంగులకు జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో 20 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణలో నాన్ సర్వీస్ అభ్యర్థులకు జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సోమవారం 1,001 నుంచి 4వేల ర్యాంకుల వరకు ఆహ్వానించారు. -
ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్
♦ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం ♦ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ ♦ కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో ♦ రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం పిడుగురాళ్ళ : సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని నాగబాలాజీ లేడీస్ కార్నర్ ఫిబ్రవరి 14న షార్ట్‌సర్య్కూట్‌తో కాలిపోయింది. దుకాణానికి బీమా ఉండడంతో ఫైర్ సర్టిఫికెట్ కోసం లేడీస్ కార్నర్ యజమాని జమ్మిగుంపుల నరేంద్ర పిడుగురాళ్ళ ఫైర్ ఆఫీసర్ కె. శివశంకర్‌రావును కలవగా రూ.30 వేలు డిమాండ్ చేశారు. నరేంద్ర రూ.20 వేలకు బేరం కుదుర్చుకుని బుధవారం గుంటూరులోని ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ శాంతోను సంప్రదించారు. ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు గురువారం సాయంత్రం నరేంద్ర ఫైర్ ఆఫీసర్‌ను కలిసి రూ.20 వేలు ఇవ్వగానే, ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఫైర్ ఆఫీసర్ గదిలోకి ప్రవేశించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అగ్నిమాపక అధికారి శివశంకర్రావుపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ శాంతో తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నేరుగా తమను సంప్రదించాలని, వివరాలకు 94913 05638ను సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా ఫైర్ ఆఫీసర్ శివశంకర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర అసలు దరఖాస్తు చేసుకోలేదని, దరఖాస్తు చేసుకోకుండా సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఈ నగదును కూడా తీసుకోలేదని, తన గదిలోకి ఆ నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నారు. -
మన పోరాట చేవకు ఐసిస్ సర్టిఫికెట్ అవసరమా?
అవలోకనం ఐసిస్‌లో చేరిన భారతీయులకు పోరాట చేవ తక్కువ అనే భావంతో ఉగ్రవాద సంస్థ కించపరుస్తోందనే వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. కానీ చరిత్రకేసి చూస్తే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే భారతీయ సైనికుల నైపుణ్యం, చేవ ప్రపంచానికంతటికీ తెలుసు. పైగా చరిత్రలో అత్యంత తీవ్రస్థాయిలో జరిగిన కొన్ని యుద్ధాల్లో భారతీయ సైనికులు తమ రక్తం చిందించారు. అరబ్ ఉగ్రవాదుల లక్ష్యం తప్పు కాబట్టి భారతీయ పోరాట చేవను వారు ఉపయోగించుకోకపోవడం ఒకందుకు మంచిదే. నేను ఈ వార్తను కొద్ది రోజుల క్రితం చూసి ఆశ్చర్యపడ్డాను. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర వాదసంస్థ (దీన్నే ఐసిస్, డాయేష్ అని కూడా పిలుస్తున్నారు) ‘భారతీయులతో పాటు దక్షిణాసియా ముస్లింలను ఇరాక్, సిరియా ఘర్షణ పాంతాల్లో పోరా డేందుకు తగనివారుగా పరిగణిస్తోందని, అరబ్ యోధులతో సమానంగా చూడ కుండా వీరిని చిన్నచూపు చూస్తున్నార’ని ఆ వార్త పేర్కొంది. దీనికి అనుగుణంగానే ‘దక్షిణాసియా నుంచి వచ్చి చేరిన యోధులను చిన్న చిన్న బ్యారక్‌లలో బృందాలుగా కుక్కి ఉంచుతున్నారని, వారికి అరబ్బుల కంటే తక్కువ వేతనాలు చెల్లించడమే కాకుండా, నాసిరకం ఆయుధాలను కట్టబెడుతు న్నార’ని ఆ వార్త తెలిపింది. ఈ సమాచారం విదేశీ నిఘా సంస్థలు రూపొందించిన ఉగ్రవాద వ్యతిరేక నిఘా నివేదిక నుంచి వచ్చింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తోపాటు నైజీరియా, సూడాన్ వంటి కొన్ని దేశాల వారిని అరబ్బుల కంటే తక్కువస్థాయి కలిగిన వారుగా ఐసిస్ భావిస్తున్నట్లు ఈ నివేదిక బయటపెట్టింది. నైజీరియా, సూడాన్‌లోని యుద్ధతంత్ర చరిత్ర గురించి నాకు పెద్దగా తెలి యదు. కానీ, అరబ్బుల కంటే భారత ఉపఖండానికి చెందిన వారు మరింత ఉన్నతమైన పోరాట చేవకు సంబంధించిన రికార్డును కలిగి ఉన్నారని నేను అరబ్బులకు హామీ ఇవ్వగలను. ఒకవైపున అరబ్ ఉగ్రవాదుల లక్ష్యం తప్పు కాబట్టి భారత ఉపఖండానికి సంబంధించిన ఈ సంపదను వారు ఉపయో గించుకోకపోవడం ఒకందుకు మంచిదే. కానీ మరోవైపున పాఠకులు కాస్త చరిత్ర తెలుసుకోవడం ఆసక్తిదాయకంగా ఉంటుంది. చరిత్రలోకి వెళితే నిపుణులైన భారతీయ యోధుల గురించిన వివరాలను గ్రీస్ దేశంలో క్రీ.పూ.479లోనే మనం చూడవచ్చు. గ్రీక్ నగర రాజ్యాలకు, ఇరానీ లకు మధ్య జరిగిన ప్లేషియా యుద్ధంలోనే దీన్ని మనం గమనించవచ్చు. నాటి చరిత్రకారుడు హెరోడోటస్ ఇరుపక్షాలలోని వివిధ సైనిక నిర్మాణాల గురించి చెబుతూ పర్షియా రాజు గ్జెరెక్సెస్ నియమించుకున్న భారతీయ ఉపఖండ కిరాయి సైనికుల గురించి వర్ణించాడు. ఆ యుద్ధంలో పర్షియన్లు ఓడిపోయినప్పటికీ భార తీయ ఉపఖండ సైనికులు మాత్రం తమకంటూ మంచి చరిత్రనే నమోదు చేసుకున్నారు. తర్వాత వందేళ్లకు జగ జ్జేత అలెగ్జాండర్ పంజాబ్ పై దాడి చేసినప్పటి ఘట నలను నాటి చరిత్రకారుడు అరియన్ రాశాడు. మాసిడోనియా సైనికుల దాడికి వ్యతిరేకంగా తమ నివాస ప్రాంతాలను కాపాడుకోవడానికి గ్రామీణులు నియ మించుకున్న కిరాయి సైనిక బలగాల నుంచే గ్రీకు చక్రవర్తికి నిజమైన ప్రతిఘటన ఎదురయిందని అరియన్ రాశాడు. భారతీయ సైనికులు చక్కటి పోరాట సామ ర్థ్యాన్ని కలిగి ఉండేవారు. అందుకే అలెగ్జాండర్ వారితో సంధి చేసుకున్నాడని మనకు తెలుసు. కానీ తర్వాత అతడు వారికి ద్రోహం చేసి ఊచకోత కోశాడు కూడా. అలెగ్జాండర్ పట్ల విధేయత ప్రకటించిన జీవిత చరిత్రకారులు అరియన్, క్వింటస్ వంటి వారు పంజాబ్‌లో అతడు వ్యవహరించిన తీరు నీతి బాహ్య మైనదని పేర్కొన్నారు కాబట్టే పంజాబ్ గురించిన ఘటన మనకు తెలుస్తోంది. పైగా చరిత్రలో అత్యంత తీవ్రస్థాయిలో జరిగిన కొన్ని యుద్ధాల్లో భారతీయ సైనికులు తమ రక్తం చిందించారు. మొదటి ప్రంచంచ యుద్ధ కాలంలో, 1915లో టర్కీ నేత ముస్తాఫా కమాల్ అటాటుర్క్ను సుప్రసిద్ధుడిని చేసిన గల్లిపోలి యుద్ధంలో భారతీయ సైనికులు పాల్గొన్న విషయం చాలామందికి తెలుసు. అయితే, యుద్ధగతిని నిర్ణయించే కందక యుద్ధ తంత్రం అనేది భారతీయ ఆవిష్కరణే అనే విషయం చాలామందికి తెలీకపోవచ్చు. ది ఫస్ట్ వరల్డ్ వార్ అనే పేరిట రాసిన పుస్తకంలో యుద్ధ చరిత్రకారుడు జాన్ కీగన్ ఇలా రాశారు. ‘భారతీయ సైన్యంలోని 39వ గడ్వాల్ రైఫిల్స్ ఐపర్ సమీపంలో 1914 నవంబర్ 9/10 రాత్రి వేళ తొలి కందక తరహా దాడిని ప్రారంభించింది. చిమ్మచీకటిని ఆసరాగా చేసుకుని శత్రు స్థానాలపైకి పదే పదే దాడులు చేయడం అనే ది భారతీయ సరిహద్దు పోరాటంలో సాంప్రదాయకంగా అవలంబించే యుద్ధ వ్యూహం. ఆ రాత్రి గడ్వాల్ రైఫిల్స్ చేపట్టిన ఈ తొలి హంతక దాడితో, పాశ్చాత్య సైన్యాల నాగరిక యుద్ధతంత్రంలోకి గిరిజన సైనిక చర్యలను తొలిసారిగా ప్రవేశ పెట్టినట్లయింది’ అని కీగన్ రాశారు. ధైర్యసాహసాలను, సైనిక నిపుణతలను ప్రదర్శించడంలో భారతీయ యోధులు ఎవరికీ తీసిపోయేవారు కారు. బ్రిటిష్ చరిత్రకారుడు మాక్స్ హేస్టింగ్స్ తన ‘కెటాస్ట్రోప్: యూరప్ గోస్ టు వార్ 1914’ అనే పేరిట రాసిన గ్రంథంలో ఇలా చెప్పారు. భారతీయ సైనికదళాలు బ్రిటిష్ సైన్యాలకు గస్తీ తిరిగే కళను నేర్పాయన్నారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ కందకాల్లో పలువురు భారతీయ సైనికులు ఉండేవారు. భారతీయ సైనికుల సాంప్రదాయిక ఆహార అవ సరాలను తీర్చేందుకోసం జీవంతో ఉన్న 10 వేల మేకలను సరఫరా చేయాలని బ్రిటిష్ విదేశీ కార్యాలయాన్ని ఫ్రాన్స్ కోరింది. ఇక మొఘల్ సామ్రాజ్య పతనంపై నాలుగు సంపుటాలతో కూడిన బృహత్ రచన చేసిన చరిత్రకారుడు సర్ జాదూనాధ్ సర్కార్ భారత్‌లో మూడు రాజపుత్ర వంశాల (సిసోదియా, కచ్వాహ, రాథోడ్) పోరాట తీరుతెన్నులను వర్ణించారు. యుద్ధంలో ఒకవేళ తాము ఓడిపోతున్న క్షణాల్లో కూడా, రాథోడ్‌లు తమ గుర్రా లను శత్రు సైన్యం చుట్టూ పరుగెత్తించేవారు. యుద్ధరంగం నుంచి సగౌరవంగా తప్పుకునేందుకు అవసరమైనన్ని బలిదానాలు తమవైపు నుంచి జరగలేదన్న భావనతోనే వారు శత్రు తుపాకులకు ఎదురుగా నిలిచి ప్రాణాలు పోగొట్టుకునే వారని జాధూనాథ్ సర్కార్ పేర్కొన్నారు. అయితే రాజపుత్రులతో సమస్య అల్లా ఏమిటంటే, వారు ప్రధానంగా తమలో తాము యుద్ధాలు చేస్తూనే గడిపేవారు. నేను చదివిన ఒక పుస్తకం ప్రకారం, కొద్ది డజన్ల సంఖ్యలోని రాథోడ్‌లు శత్రుపక్షంలోని దాదాపు లక్షమంది రాథోడ్ సైనికులను ఊచకోత కోశారని తెలుస్తోంది. అరబ్బుల కంటే తక్కువ చేవ కలిగినట్లు ఐసిస్ భావిస్తున్న యోధులకు సంబంధించిన దేశం వారసత్వం అలా ఎప్పుడూ లేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం నేనొక వార్త చదివాను. రెండు బ్రిటిష్ సైనిక విభాగాలు ఒక బార్లో పరస్పరం తలపడిన ఘటనకు సంబంధించిన వార్త అది. ఈ రెండింటిలో ఒక సైనిక యూనిట్ ఫుల్లుగా తాగి దూకుడుగా మరొక యూనిట్‌పై దాడి కి తలపడిందట. వారి దురదృష్టమేమిటంటే ఆ మరొక గ్రూపు గూర్ఖాల విభాగం. తమతో తలపడిన శ్వేతజాతి సైనిక విభాగం కంటే వీరు సంఖ్యలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ, వీరత్వంలో ఆధిక్యత కలిగిన గూర్ఖా సైనికులు తమ మీద దాడి చేసిన ఆ బ్రిటిష్ సైనిక విభాగాన్ని తుక్కుతుక్కుగా కొట్టి కింద పడేసిందని నాటి వార్త పేర్కొంది. అయితే భారతీయ సైనికులకు ఎల్లవేళలా అవసరమైనది మంచి నాయకత్వమే. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కి చెందిన అరబ్బులు అలాంటి నాయక త్వాన్ని తమలో చేరిన భారతీయులకు అందిస్తారంటే నాకు సందేహమే. అందుకు నేను దేవుడి కి కృతజ్ఞతలు చెబుతాను. ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) -
పుట్టగానే కుల ధ్రువీకరణ
ఎస్సీ, ఎస్టీ చిన్నారులకు వర్తింపు * కేంద్ర ప్రభుత్వ నిర్ణయం * పాఠశాలల్లోనూ కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ న్యూఢిల్లీ: ఇకపై బిడ్డపుట్టినపుడే జనన ధ్రువీకరణతోపాటు కుల ధ్రువీకరణ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ చిన్నారులకు బర్త్ సర్టిఫికెట్‌లోనే కులం పేరును పేర్కొనేలా చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు 8వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ (కుల ధ్రువీకరణ) పత్రాలతోపాటు నివాస ధ్రువీకరణ పత్రాలను పాఠశాలల ద్వారానే అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కుల, ప్రాంత ధ్రువీకరణ (రెసిడెన్స్) పత్రాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. వీటిపై చర్చించిన ప్రభుత్వం.. పుట్టినప్పటి నుంచే కుల ధ్రువీకరణ ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో జనన ధృవీకరణ పత్రాల్లోనే దళిత ముద్ర కనిపించేలా చర్యలు తీసుకోనుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వ్యక్తిగత శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు వివరాలతో దరఖాస్తులు నింపి ఉన్నతాధికారులకు పంపిచాలి. పైస్థాయిలో దీన్ని పరిశీలించిన తర్వాత ప్రధానోపాధ్యాయుడి ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఒకవేళ ఎవరి దరఖాస్తు అయినా తిరస్కరిస్తే ఆ వివరాలను కూడా విద్యార్థికి తెలిపే విధానాన్ని అమలు చేయనున్నారు. -
'నీ సర్టిఫికెట్ నెహ్రూకు అవసరం లేదు'
గువాహటి: భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూకి కేంద్రమంత్రి కిరేణ్ రిజిజు నుంచి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అన్నారు. ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కు కాస్తయినా మంచి చేయని కిరేణ్కు దేశం గర్వించదగిన మాజీ ప్రధాని గురించి మాట్లాడే యోగ్యత లేదన్నారు. శనివారం కిరేణ్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 1962నాటి ఇండియా చైనా యుద్ధ సమయంలో నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై గొగోయ్ ఆదివారం స్పందించారు. నెహ్రూపై కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం, అభాండాలు మోపడం మానుకుంటే మంచిదని చెప్పారు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు చైనాతో ఏర్పడినా నెహ్రూ ప్రజలను వదిలేయలేదని, ఆయన సమర్థతను నిరూపించుకున్నారని, తన సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ఓ కేంద్రమంత్రి(కిరేణ్) నుంచి సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం నెహ్రూకు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అరుణాచల్ ప్రదేశ్‌కు ఓ రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి బాటపట్టిందనే విషయం కిరేణ్ గుర్తుంచుకుంటే బాగుంటుందన్నారు. ఎన్డేయే హయాంలో అరుణాచల్ ప్రదేశ్‌కు ఏం చేశారని మండిపడ్డారు. -
లౌకికవాదంపై ఎవరి సర్టిఫికెటూ అవసరంలేదు
లౌకిక వర్సిటీకి ములాయం ఏమైనా వీసీనా?: నితీశ్ పట్నా: లౌకికవాదంపై తనకు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ నుంచి సర్టిఫికెట్ అవసరం లేదని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. బీజేపీతో 12 ఏళ్ల పాటు స్నేహం చేసినందుకు తన లౌకిక విశ్వసనీయతను ములాయం ప్రశ్నించటాన్ని తిప్పికొడుతూ ఆయన పైవిధంగా స్పందించా రు. మంగళవారం ఒక ప్రైవేటు టీవీ చానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ.. ‘‘ఆయనేమైనా లౌకికవాద విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్లరా? నేనేమైనా పరిశోధన స్కాలర్నా? ఆయన నుంచి నేను లౌకికవాదంపై సర్టిఫికెట్ (ధ్రవీకరణపత్రం) కోరుతున్నానా?’’ అని ఎద్దేవా చేశారు. ‘‘నేను లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్, రామ్మనోహర్ లోహియా స్కూల్ నుంచి వచ్చినవాడిని. లౌకికవాదంపై ఎవరి నుంచీ నాకు ఎటువంటి సర్టిఫికెటూ అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. నితీశే మా కూటమి సీఎం: లాలూ న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా తమ కూటమి ముఖ్యమంత్రి నితీశ్‌కుమారే అవుతారని ఆ పార్టీ అధినేత లాలూప్రసాద్ స్పష్టంచేశారు. ‘కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీలతో కూడిన మహా కూటమి అధికారంలోకి వస్తే.. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనే దానితో సంబంధం లేకుండా.. నితీశ్ సీఎం పదవి చేపడతారు. బీజేపీని బిహార్ నుంచి వట్టిచేతులతో వెనక్కు పంపేలా చూడటమే మా ప్రాధాన్యం’అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. -
సారూ.. పింఛన్ మంజూరు చేయరూ..!
డయల్ యువర్ డీఆర్డీఏ పీడీలో వినతి సంగారెడ్డి మున్సిపాలిటీ: సదరెమ్ క్యాంపునకు హాజరైనా తనకు ఇంతవరకు సర్టిఫికెట్ ఇవ్వలేదని కొండపాక మండలం దుద్డెడ గ్రామానికి చెందిన నర్సింగ్ రావు డీఆర్డీఏ పీడీకి విన్నవించుకున్నారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ డీఆర్డీఏ పీడీ కార్యమ్రంలో పీడీ సత్యనారాయణరెడ్డి హాజరుకాకపోవడంతో అసిస్టెంట్ పీడీ వెంకటేశ్వర్లు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మెదక్ మండలం కాజిపల్లికి చెందిన పెంటయ్య మాట్లాడుతూ తమ కుటుంబంలో ఉన్న బీడీ కార్మికులకు జీవనభృతి పింఛన్ అంద డం లేదన్నారు. వితంతు పింఛన్ మంజూరు చేయడంతో పంచాయతీ కార్యదర్శి పక్షపాతం చూపుతున్నాడని కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన సాయిలు ఫిర్యాదు చేశారు. జీవనభృతి పింఛన్ కోసం పీఎఫ్ కార్డుతో దరఖాస్తు చేసినా మంజూరు చేయడం లేదని నంగునూర్ మండలం ఖానాపూర్‌కి చెందిన మల్లయ్య, కొడిపాక మండలం కమ్మంపల్లికి చెందిన నర్సింలు ఫిర్యాదు చేశారు. సదరెమ్ క్యాంపునకు హాజరై సర్టిఫికెట్తో వికలాంగ ఫించన్‌కు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదని కొండపాక మండలం ఎర్రపల్లికి చెందిన మల్లయ్య ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో 23 మందికి వితంతు, వృద్ధాప్య పింఛన్లు రాలేదని మెదక్ మండలం సర్థనకు చెందిన రామ్‌చందర్ పేర్కొన్నారు. అభయాస్తం పింఛన్ అందడంలేదని పెద్దశంకరంపేట మండలం వీరోజ్పల్లికి చెందిన రమేష్ ఫిర్యాదు చేశారు. -
3 గంటల ఆలస్యంగా సరిఫికెట్ల పరిశీలన
సర్వర్, సాంకేతిక ఇబ్బందులు తొలిరోజున 400 మంది సద్వినియోగం 30 వేల లోపు ర్యాంకర్లకు నేడు విజయనగరం అర్బన్: సాంకేతిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్ కళాశాలల ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నిర్వాహకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇక్కట్లకు గురయ్యారు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సేవల అంతరాయం వల్ల స్థానిక పాలిటెక్నికల్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ దాదాపు మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత అన్ని జిల్లాలను కలిపే సర్వర్ పనిచేయకపోడం, తరువాత బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ పని చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడింది. పది రోజుల పాటు ర్యాంకుల వారీగా చేట్టే ఈ షెడ్యూల్‌కు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులూ లేకుండా చూడాలని బీఎస్ఎన్ఎల్ అధికారులకు... కౌన్సెలింగ్ నిర్వాహకులు ముందుగా సమాచారం ఇచ్చారు. అయితే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల తొలిరోజు మొదటి రౌండులో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో దూర ప్రాంతాలైన పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి అభ్యర్థులు అవస్థలు పడ్డారు. తొలిరోజున 400 మంది సద్వినియోగం షెడ్యూల్ మేరకు ఎంసెట్ ర్యాంక్‌లలో ఒకటి నుంచి 15 వేల వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం చేపట్టారు. సాయంత్రం 5.00 గంటల సమయం ముగిసే సరికి 400 మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని కౌన్సెలింగ్ కేంద్ర కో-కన్వీనర్ ఆర్.భాస్కరరావు తెలిపారు. ధ్రువీకరణ పత్రాల తనిఖీ అనంతరం అభ్యర్థులకు ఇచ్చిన తేదీలలో ఎక్కడైనా నెట్ సెంటర్లోగానీ, కౌన్సెలింగ్ సెంటర్లో ఉన్న హెల్ప్ లైన్ కేంద్రంలోగానీ కాలేజీల వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని చెప్పారు. ఎంసెట్ వెబ్సైట్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకొంటే సంబంధిత టెలిఫోన్‌కు రహస్య నంబర్ (ఓటీఎస్) వస్తుందని, దానిని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తే వెబ్ ఆప్షన్ పోర్టర్ వస్తుందని తెలిపారు. 30 వేల లోపు ర్యాంకర్లకు నేడు షెడ్యూల్ ప్రకారం 15 వేల నుంచి 30 వేల ర్యాంక్‌ల వరకు శనివారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపడతామని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణపత్రాలతోపాటు ఆధార్‌కార్డు జిరాక్స్ విధిగా తీసుకురావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. -
హాల్ టికెట్.. అందనంటోంది!
ఇతని పేరు టి.బాలగుర్రప్ప. కడపలో నివాసముంటున్నాడు. ఎస్జీటీ పోస్టు కోసం కడప, చిత్తూరు జిల్లాల్లో దరఖాస్తు చేశాడు. అధికారులు సర్టిఫికెట్లన్నీ చూసిన తర్వాతనే దరఖాస్తు స్వీకరించారు. అయితే కడపలో పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ వచ్చింది. చిత్తూరులో మాత్రం ఫోటో రిజెక్ట్..అప్లోడ్ చేయమని సిస్టమ్ అడుగుతోంది. కడప నబీకోటలో నివాసముంటున్న కె.నాగేంద్రప్రసాద్ది విచిత్ర పరిస్థితి. ఇతను డీఎస్సీకి సంబంధించి బయాలజీ, ఇంగ్లిష్ పోస్టులకు దరఖాస్తు చేశాడు. పరీక్ష ఈనెల 10, 11 తేదీల్లో ఉండగా.. ఇప్పటివరకు బయాలజీకి మాత్రం హాల్ టికెట్ వచ్చింది. ఇంగ్లిష్‌కు సంబంధించి హాల్ టికెట్ రావడం లేదు. రిజెక్ట్డ్ డీఈఓ అంటూ వస్తోంది. అధికారులు సమస్యను పరిష్కరించాలని ఇతను కోరుతున్నాడు. సాక్షి, కడప: డీఎస్సీ..బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి నిరుద్యోగి కల ఇది. దీనిని సాధించేందుకు అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే వీరి ఆశలపై ఆన్లైన్ సమస్యలు నీళ్లు చల్లుతున్నాయి. వీటి డౌన్లోడ్ కోసం వెళితే రిజెక్ట్ అని చూపుతుండడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారుల వద్దకు వెళితే వారు తమకేమీ తెలియదని, అదృష్టముంటే వస్తాయని వ్యగ్యంగా మాట్లాడుతున్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్లైన్ సమస్యలో..మరెదో కారణమో తెలీదు డీఎస్సీ హాల్ టికెట్ల జారీ వ్యవహారం అంతా అయోమయంగా మారింది. జిల్లాలో డీఎస్సీకి సంబంధించి 21,826 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది నిరుద్యోగులు జిల్లాతోపాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంత, కర్నూలు జిల్లాల్లో డీఎస్సీకి దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 25 నుంచి ఆన్లైన్లో డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మందికి ఆన్లైన్లో హాల్ టికెట్ల వివరాలు కనిపించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసిన కొంతమంది అభ్యర్థులకు కేవలం ఒకచోట పరీక్ష రాయడానికి మాత్రమే హాల్‌టికె ట్ వస్తోంది. మరో జిల్లాలో పరీక్ష రాయడానికి రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీకి ఫీజుతోపాటు ఖచ్చితంగా సర్టిఫికెట్లను అందజేసినా రాకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరికి డీఈవో రిజెక్ట్ అని...మరికొందరికి ఫోటో అప్లోడ్ చేయాలని.. ఆన్లైన్లో సూచిస్తోంది. దీంతో అభ్యర్థులు బిత్తరపాటుకు గురవుతున్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతోందని...అది సవరిస్తే అందరికీ హాల్ టికెట్లు అందుతాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే.. ‘‘అదృష్టముంటే వస్తాయి పోండి...మమ్మలేమి చేయమంటారు.’’ అంటూ సమాధానం రావడంతో నిరుద్యోగులు అవాక్కవుతున్నారు. హాల్ టికెట్ల మంజూరు కోసం డీఈఓ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. న్యాయం చేస్తాం: బండ్లపల్లె ప్రతాప్ రెడ్డి, డీఈఓ హాల్ టికెట్ రాని నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు తీసుకువస్తే ఉన్నతాధికారులకు పంపుతాం. రెండుసార్లు దరఖాస్తు చేసినా హార్డ్కాపీలో ఒకటే ఉండడం వల్ల కూడా అలా జరిగి ఉండవచ్చు.. సర్టిఫికెట్లు చూపిస్తే పరిశీలించి న్యాయం చేస్తాం. రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసినా ఏదైనా తేడాలుంటే హాల్ టికెట్ ఒక జిల్లాకే వచ్చి ఉండవచ్చు. -
తహసీల్దార్‌కు ధ్రువీకరణ జారీ అధికారం
సాక్షి, హైదరాబాద్: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.సి.శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కోసం మొదట మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తుకు కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు, అఫిడవిట్, మృతి చెందిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే 15 రోజుల్లోపు ధ్రువీకరణ పత్రం ఇచ్చేస్తారు. -
సచిన్‌కు ‘గిన్నిస్’ గౌరవం!
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన సంఘటనలు, రికార్డులను గుర్తించే గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ... మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. గిన్నిస్ సంస్థ 60 ఏళ్ల వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంగా మాస్టర్‌ను సర్టిఫికెట్, పతకం (జీడబ్ల్యుఆర్ టైటిల్)తో ఘనంగా సత్కరించింది. 24 ఏళ్ల కెరీర్లో ఈ క్రికెటర్ సాధించిన ఘనతలకు గుర్తుగా దీన్ని అందజేశారు. ఇప్పటికే సచిన్ పేరిట 19 గిన్నిస్ రికార్డులున్నాయి. ‘60 ఏళ్ల వార్షికోత్సవ ఉత్సవాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ కెరీర్లో నేను సాధించిన ఘనతలను చూసి గర్వపడుతున్నా. దిగ్గజాల సరసన చోటు దక్కడం ప్రత్యేకంగా అనిపిస్తోంది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ఉసేన్ బోల్ట్, రాడ్‌క్లిఫ్, రెడ్‌గ్రేవ్, ఫరా, లిన్‌ఫోర్డ్ క్రిస్టీ, లిసికి లను కూడా జీడబ్ల్యూఆర్ గౌరవించింది. -
పోటెత్తారు!
కడప సెవెన్‌రోడ్స్/కార్పొరేషన్ : వివిధ సర్టిఫికెట్ల కోసం వందలాదిగా ప్రజలు తరలి వస్తుండడంతో కడప తహశీల్దార్ కార్యాలయం పోటెత్తుతోంది. వీరిని అదుపు చేయలేక కార్యాలయ సిబ్బంది నానా పాట్లు పడాల్సి వస్తోంది. సినిమా రిలీజ్ రోజున టిక్కెట్ల కోసం ఎగబడ్డట్లు సర్టిఫికెట్ల కోసం క్యూ కడుతున్నారు. విద్యార్థులు స్కాలర్షిప్పులు, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 17 ఆఖరు గడువుగగా విధించింది. ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు లింకేజీ, సబ్సిడీ రుణాల పొందడానికి, దరఖాస్తు చేసుకోవడానికి గడువు తన్నుకు వస్తోంది. వీటికోసం ఆయా వర్గాల వారు కుల, ఆదాయ, నేటివిటీ, జనన ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మీ-సేవా కేంద్రాల్లో ఆయా సర్టిఫికెట్ల కోసం డబ్బులు చెల్లించి రెవెన్యూ కార్యాలయానికి వస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండగా, వాటిని విచారణ చేసి జారీ చేయాల్సిన సిబ్బంది సంఖ్య నామమాత్రంగా ఉంది. కేవలం ఐదుగురు వీఆర్ఓలతో ఈ పనులు చేయిస్తున్నారు. మల్టీ స్కానర్లు ఉపయోగిస్తున్నా, రోజుకు ఐదారు వందల సర్టిఫికెట్లు జారీ చేయలేక పోతున్నామని సిబ్బంది తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన చేసిన తరువాతే జారీ చేయాలి. ప్రాక్టికల్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని వీఆర్ఓలు వచ్చిన దరఖాస్తులపై ఎడాపెడా సంతకాలు చేస్తున్నా వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఓవైపు గడువు మీరుతుండడంతో ముఖ్యంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా సర్టిఫికెట్లు పొందలేక పోతున్నామని పలువురు వాపోతున్నారు. రెవెన్యూ సిబ్బంది చేతివాటం జనం అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొందరు సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇతర ప్రాంతాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకువచ్చి జనం ఇబ్బందిని తీర్చాలని పలువురు అధికారులకు విన్నవిస్తున్నారు. ఆ దిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆర్డీఓ స్పందించి అదనపు సిబ్బందిని, కౌంటర్లను ఏర్పాటు చేస్తే సకాలంలో సర్టిఫికెట్ల జారీ సాధ్యపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా సర్టిఫికెట్ మంజూరు చేయడం లేదని శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్థి ఖలీల్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ కోసం మూడు నెలలుగా తనను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని బాబ్జాన్ అనే మరో విద్యార్థి ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రం కోసం ఏడాదిగా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనికరించడం లేదని మాసాపేటకు చెందిన బి.నరసింహులు వాపోయారు. విచారణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందికి రూ.100 ఇచ్చినా ఇంత వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రాఘవేంద్రమౌళి అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. -
స్థానికత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశం హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి కీలకమైన స్థానిక నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా రెండు రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిం చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వ శాఖలన్నింటికీ తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు సంయుక్తంగా ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతు లు తమ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులందరికీ స్థానికత నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చే శారు. ఇప్పటినుంచే ఆ సర్టిఫికెట్లను సిద్ధం గా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలకు ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో కేంద్రం ఆమోదం లభించే అవకావం ఉన్నం దున ఇప్పుడే అన్ని శాఖల నుంచి పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్రస్థాయి శాఖలు, విభాగాలు, ప్రాజెక్టుల్లోని పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను పంపించాలని స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన ప్రాజెక్టుకు తీసుకున్న ఉద్యోగులను ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఇతర సంస్థల్లోకి తీసుకుంటే ఆ వివరాలను పేర్కొనాలని సూచించారు. అయితే ప్రాజెక్టు పూర్తయినందున ఆ ప్రాజెక్టు పోస్టులను ఖాళీగా చూపించరాదని సూచించారు. జూన్ 1వ తేదీ వరకు ఉన్న పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలన్నింటినీ సంబంధిత కార్యదర్శి లేదా విభాగాధిపతి ధ్రువీకరిస్తూ సమాచారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. ఆయా ఉద్యోగులపై నియంత్రణ ఉండి ఆర్థిక అంశాలను పర్యవేక్షించే అధికారం ఉన్నవాటినే విభాగాధిపతులుగా గుర్తించాలని తెలిపారు. రెండు రాష్ట్రాల శాఖలు ఈ రంగంలో అనుభవం ఉన్న అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించారు. -
ముగిసిన ఎంసెట్ వెబ్ఆప్షన్ ప్రక్రియ
1290 మంది విద్యార్థులు హాజరు పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన నేడు, రేపు ఆప్షన్లు మార్చుకునే అవకాశం సెప్టెంబర్ 1 నుంచి ఆడ్మిషన్లు సాక్షి, విజయవాడ : ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల విధానానికి ఈ ఏడాది సాంకేతిక విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ 7వ తేదీన మొదలై సోమవారంతో ముగిసింది. నగరంలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించింది. నగరంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలనకు కొంత మేరకు బాగానే విద్యార్థులొచ్చినా... వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు మాత్రం విద్యార్థుల నుంచి స్పందన పూర్తిగా కొరవడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల భవితవ్యం కొంత గందరగోళంలో పడటంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాషాట్రల్లో విద్యాభాస్యానికి తరలివెళ్లారు. జిల్లాలోని 41 ఇంజనీరింగ్ కళాశాలల్లో 13,384 సీట్లు ఉన్నాయి. వీటిల్లో 27 కళాశాలలు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈక్రమంలో 41 ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 2,600 మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. రాష్ట్ర విభజన పరిణామాల క్రమంలో విద్యార్థులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలు రకరకాల ఆఫర్లతో హడావుడి చేస్తున్నాయి. ముగిసిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ... ఈనెల 17న నగరంలోని ఆంధ్రలయోలా కళాశాలలో, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, ఎస్ఆర్ఆర్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ఆప్షన్ల కార్యక్రమం నిర్వహించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన వెబ్ఆప్షన్లకు 1290 మంది విద్యార్థులు హజరయ్యారు. పాలిటెక్నిక్ కళాశాలలో 500 మంది విద్యార్థులు, ఎస్ఆర్ఆర్ కళాశాలలో 300 మంది ఆంధ్ర లయోలా కళాశాలలో 491 మంది విద్యార్థులు హజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 7262 మంది విద్యార్థులు హజరయ్యారు. నేడు,రేపు చివరి అవకాశం.. ఇంజనీరింగ్ ప్రవేశం కోరే విద్యార్థులకు ఆప్షన్లు మార్చుకోవటానికి మంగళ, బుధవారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించారు. ఆప్షన్లు మార్చుకునే విద్యార్థులకు ఇదే చివరి ఆవకాశం. ఈ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ 1నాటికి ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు మొదలు పెట్టనున్నారు. -
ఎసీబీ వలలో వెదురుకుప్పం ఆర్ఐ
వెదురుకుప్పం: వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్ర గురువారం మధ్యాహ్నం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి కథనం మేరకు మండలంలోని దామరకుప్పం గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలు పోగొట్టుకున్నాడు. రామచంద్రారెడ్డి కుమారుడు అత్తూరు రాజేంద్రరెడ్డి ఈ మేరకు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారించి పాసుపుస్తకాలు బస్సులో పోగొట్టుకున్నట్లు నిర్ధారించారు. పాసు పుస్తకాల జిరాక్సు కాపీలతో పాటు పోలీసులు ఇచ్చిన సర్టిఫికెట్తో వెదురుకుప్పం తహసీల్దార్ ఇంద్రసేనకు డూప్లికెట్ పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. దీంతో తహసీల్దార్ కింది స్థాయి సిబ్బందికి సంబంధిత ఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫైల్ సిద్ధం చేయడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఏవో కుంటిసాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తూ రాజేంద్రరెడ్డిని వేధించాడు. దీంతో విసిగి వేసారిపోయిన రాజేంద్రరెడ్డి తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు రాజేంద్రరెడ్డికి డబ్బులు ఇచ్చి ఆర్‌ఐకు ఇవ్వాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆర్ఐ చంద్రకు రూ.3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఆర్ఐని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో సీఐలు రామకిషోర్,చంద్రశేఖర్‌రెడ్డి,లక్ష్మీకాంత్‌రెడ్డి,సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో అధికారులు అవినీతికి పాల్పడినా,డబ్బులు డిమాండ్ చేసి వేధింపులకు గురిచేస్తున్నా సెల్ ః9440446190, 9440446120,9440446138, 9440446193,9440808112 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శంకర్‌రెడ్డి కోరారు. రెవిన్యూ అధికారుల్లో గబులు వెదురుకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని రోజులుగా సిబ్బంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ నాయకులు కూడా ఈ విషయూన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆర్ఐను పట్టుకోవడంతో సిబ్బందిలో గుబులు పట్టుకుంది. కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలియడంతో వీఆర్వోలు పత్తా లేకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన సిబ్బందిలో నెలకొంది. -
ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్!
తహశీల్దార్, సబ్‌కల్టెర్ సంతకాలు ఫోర్జరీ సర్టిఫికెట్లో ఇచ్చిన అడ్రస్ బోగస్ దొంగ సర్టిఫికెట్లతో వ్యాపారం? సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా అమాయకులకు వల విసురుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు కోసం కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారికి అవసరమైన సర్టిఫికెట్లను ఫోర్జరీ సంతకాలతో మరో ముఠా సమకూరుస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వారి బండారం బయటపడింది. విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. వెలుగుచూసిందిలా.. మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ దానం చేసేందుకు కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని సత్య కడ్నీ సెంటర్‌కు వెళ్లారు. తన తండ్రి పేరు మిరియాల కృష్ణప్రసాద్ అని, తాను విజయవాడ సత్యనారాయణపురంలోని తిరుమలశెట్టి వారి వీధిలో (ఇంటి నెం: 23-15-100/ఎ) నివాసం ఉంటున్నామని, తమ ఇంటి యజమాని ముదిగంటి శ్రీనివాస చక్రవర్తి అనారోగ్యంతో ఉన్నందున ఆయనకు స్వచ్ఛదంగా కిడ్నీ ఇస్తున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించి తహశీల్దార్ జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని సత్య కిడ్నీ సెంటర్‌కు అందజేశారు. ఆస్పత్రి వారు ఈ సర్టిఫికెట్‌ను వెరిఫికేషన్ కోసం విజయవాడ అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావ్కు పంపించారు. సర్టిఫికెట్‌ను పరిశీలించిన తహశీల్దార్ తన సంతకంతోపాటు సబ్ కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం వచ్చిన ఈ ఫోర్జరీ సంతకాల సర్టిఫికెట్‌ను గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చి దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరారు. అయితే సదరు వ్యక్తి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నందున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తహశీల్దార్‌కు పోలీసులు సూచించారు. దీంతో తహశీల్దార్ శనివారం రాత్రి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతా బోగస్.. మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఇంటికి శనివారం రాత్రి ‘సాక్షి’ బృందం వెళ్లి పరిశీలించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ ఇంటి యజమాని టి.రామారావు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తేలింది. ఈ నంబరు గల ఇంట్లో రెండు పోర్షన్లు ఉన్నాయి. పై పోర్షన్లో వెంకటేశ్వరరావు, కింది పోర్షన్లో గడ్డం కళ్యాణ చక్రవర్తి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీనిని బట్టి మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ పేరుతో ఇక్కడ ఎవరూ నివాసం లేరని స్పష్టమైంది. అయితే.. ఇదే ఇంటి నంబరుపై మిరియాల కృష్ణప్రసాద్ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణప్రసాద్, క్రాంతి దుర్గాప్రసాద్ పేర్లతో ఈ ఇంట్లో ఇటీవల కాలంలో ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కింది పోర్షన్లో నివాసం ఉంటున్న గడ్డం కళ్యాణచక్రవర్తిని.. ప్రశ్నించగా తాను నాలుగు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఇక్కడ కృష్ణప్రసాద్ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. ఇంటి ఓనర్ హైదరాబాద్‌లో ఉంటారని తెలిపాడు. ఫోర్జరీ ముఠాకు, కిడ్నీ రాకెట్‌కు లింకు! ఈ పరిణామాలను పరిశీలిస్తే కిడ్నీ రాకెట్ ముఠాతో కృష్ణప్రసాద్, ఆయన కుమారుడు క్రాంతి దుర్గాప్రసాద్‌లకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోర్జరీ సంతకాల ముఠాకు, కిడ్నీ రాకెట్ ముఠాకు కూడా సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నీ రాకెట్ ముఠాలో హైదరాబాద్, విజయవాడతోపాటు ఇంకా ఏయే ప్రాంతాల వారు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కలెక్టర్‌కు వివరించిన తహశీల్దార్ తన సంతకం ఫోర్జరీ గురించి తహశీల్దార్ శివరావ్ కలెక్టర్‌కు వివరించారు. ఫోర్జరీ సంతకాల ముఠా ను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
నిట్‌లో కౌన్సెలింగ్ సందడి
నేటితో ముగియనున్న మొదటి విడత ఒక్క రోజే 399 మంది రిపోర్టింగ్ నిట్‌క్యాంపస్ : దేశంలోని వివిధ నిట్లు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీ, వరంగల్ నిట్‌లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్‌కు వచ్చిన విద్యార్థులతో సందడి మొదలైంది. వేరే రాష్ట్రాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, వారు తల్లిదండ్రులతో హాజరయ్యారు. దీంతో సందడి నెలకొంది. వీరంతా నిట్‌లోని ఆడిటోరియంలో రిపోర్టు చేశారు. ఆడిటోరియంలో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. బుధవారం ఒక్కరోజే సుమారు 399 మంది రిపోర్టింగ్‌కు హాజరయ్యారు. మొదటి విడుత రిపోర్టింగ్ గురువారంతో ముగియనుందని నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు తెలిపారు. డీన్ సోమయాజులు, నిట్ ఎంబీఏ విభాగం అధిపతి రవీందర్‌రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆనందకిషోర్‌లు రిపోర్టింగ్ సెంటర్లో సర్టిఫికెట్లను పరిశీలించారు. ఇంప్రూవ్మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి జేఈఈలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జేఈఈ ర్యాంకులను ప్రకటించింది. జేఈఈలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల నిష్పత్తి ఆధారంగా ర్యాంకులను నిర్ధారించారు. ఆ ర్యాంకుల ఆధారంగా ఐఐటీ, ఐఐఐటీ, నిట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు (సీఎస్ఏబీ) ద్వారా సీటు అలాట్మెంట్ చేస్తారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇంటర్మీడియెట్ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇందులో కొంతమందికి గతంలో కన్న ఎక్కువ మార్కులు వచ్చాయి. ఈ మార్కులను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు నిట్ అకడమిక్ అధికారులను కోరారు. -
ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్
కాండక్ట్ సర్టిఫికేట్ కోసం 2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం అనకాపల్లి టౌన్: పేదవాడినని కనికరం చూపాలని వేడుకున్నా లంచానికే అలవాటుపడిన ఉద్యోగి ఎప్పటిలాగే తన చేతివాటాన్ని చూపాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఓ జూనియర్ అసిస్టెంట్‌ను లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం. నర్సింహరావు తెలిపిన వివరాలివి. రాంబిల్లి మండలం కొత్తపట్నానికి చెందిన చోడపల్లి రమణ డిగ్రీ వరకు చదువుకున్నారు. 2012లో సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ఎంపికైనట్టు 15 రోజుల క్రితం కాల్‌లెటర్ వచ్చింది. ఈ నెల 14వ తేదీ లోపు విధుల్లో చేరాల్సి ఉండగా సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాండక్ట్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్, పోలీసు అధికారుల ధ్రువీకరణ పొందగా ఆర్డీఓ ధ్రువీకరణ పొందాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బి. హరిలక్ష్మికుమార్ను ఆశ్రయించారు. ఈనెల 14 తేదీలోపు చెన్నైలో జాబ్‌లో చేరాల్సి ఉందని, ఈ మేరకు 11వ తేదీ లోపు ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని జూనియర్ అసిస్టెంట్ హరి లక్ష్మికుమార్‌ను రమణ కోరారు. అయితే అతని అవసరాన్ని ఆసరాగా తీసుకొని, నిబంధనల ప్రకారం కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 15 రోజులు పడుతుందని, 11వ తేదీ లోపు ఇవ్వాలంటే 3 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని అంత డబ్బు ఇచ్చుకోలేనని రమణ వేడుకున్నప్పటికీ జూనియర్ అసిస్టెంట్ వినకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరకు 2 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆయన ప్రవర్తన పట్ల విసుగు చెందిన రమణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు ఆర్డీఓ కార్యాలయంలో పథకం ప్రకారం మాటు వేశారు. రమణ నుంచి జూనియర్ అసిస్టెంట్ 2 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఎం. నర్సింహరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. రమణ చెన్నై వెళ్లేందుకు సైతం రవాణా ఛార్జీలకు సొమ్ము లేకపోవడంతో తన తల్లి చెవిదిద్దులను తాకట్టు పెట్టి 5 వేల రూపాయలను తీసుకున్నారు. వీటిలో రూ.2 వేలు జూనియర్ అసిస్టెంట్‌కు ఇచ్చేందుకు తీసుకున్నట్టు రమణ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు పంపిస్తున్నట్టు ఎసీబీ డీఎస్పీ నర్సింహరావు తెలిపారు. ఈయన వెంట ఏసీబీ సీఐ రామకృష్ణ, రమణమూర్తి, గణేష్ ఉన్నారు. -
మాతృమూర్తికి మరింత గుర్తింపు
‘పది’ సర్టిఫికెట్లో పేరు యూజీసీ ఉత్తర్వులు ఆనందంలో మహిళాలోకం జగ్గయ్యపేట : పిల్లలు సాధించే ప్రతి విజయంలోనూ తల్లిదండ్రుల పాత్రే ప్రధానం. కానీ విజయాలకు సంబంధించిన రికార్డుల్లో మాత్రం నాన్న పేరే కనబడుతుంది. అమ్మకష్టం కనిపించదు. అందుకే పిల్లలకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్‌లోనూ మాతృమూర్తి పేరునూ చేర్చారు. మాతృమూర్తికీ తగిన గుర్తింపు ఇవ్వాలని మహిళా సంఘాలు గత ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడంతో సానుకూలంగా స్పందించిన గత కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి 10వతరగతి మార్కుల జాబితాలో తండ్రిపేరుతోపాటు తల్లిపేరునూ ప్రచురిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మార్కుల జాబితాలకే పరిమితమైన తల్లిపేరు ఇక నుంచి అన్ని సర్టిఫికెట్లల్లోనూ తప్పనిసరిగా ప్రచురించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకనుంచి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఇతర అన్నిరకాల గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లలోనూ తల్లుల పేర్లు ప్రచురితం కానున్నాయి. అమ్మపేరు ఆనందంగా ఉంది.. ఇప్పటివరకు సన్ ఆఫ్ అని తండ్రిపేరును మాత్రమే పలికేవాళ్లం. ఇప్పడు అమ్మపేరు ఉండటంతో ఎంతో సంతోషంగా ఉంది. తల్లిని గుర్తించడం పిల్లలుగా మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఆర్. దివ్య, విద్యార్థిని ఇది శుభపరిణామం.. తల్లుల పేర్లు మార్కుల జాబితాలో రావడం ఎంతో శుభపరిణామం. మా ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుతం అన్ని సర్టిఫికెట్లలోనూ తల్లులకు గుర్తింపు ఇవ్వడం సంతోషంగా ఉంది. గుత్తికొండ రాణి, విద్యార్థినితల్లి సంతోషంగా ఉంది. . మా మార్కుల జాబి తాలో మా అమ్మపేరు చూసుకుని మురిసిపోయాం. చెప్పలేనంత ఆనందం కలిగించింది. అమ్మకు పేరు చూపించి ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూశాం. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. అమరీందర్, విద్యార్థి -
కృష్ణా వర్సిటీ కౌన్సెలింగ్‌లో 354 సీట్లు భర్తీ
విజయవాడ, న్యూస్‌లైన్ : కేఆర్యూసెట్-2014కు సంబంధించి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ రెండో రోజు 354 సీట్లు భర్తీ అయ్యాయని కృష్ణా యూనివర్సిటీ డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య మండవ వెంకటబసవేశ్వరరావు తెలిపారు. కేబీఎన్ కళాశాలలో రెండో రోజైన గురువారం కూడా కౌన్సెలింగ్ కొనసాగింది. ఎంఏ (ఎకనామిక్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) తదితర కోర్సులకు సంబంధించి సీట్ల కేటాయింపు చేపట్టారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరి శీలన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ కౌన్సిలింగ్ రెండో రోజు పలు కళాశాలలకు సంబంధించి సీట్లు కేటాయించామని తెలిపారు. శక్రవారం కూడా కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులను పంపించివేస్తున్నామన్నారు. ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) విభాగానికి సంబంధించి అత్యధికంగా 231 సీట్ల కేటాయించామని తెలిపారు. కౌన్సెలిం గ్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణ రావు, పీజీ డెరైక్టర్ డాక్టర్ వై.నరసింహారావు, విశ్వవిద్యాలయం పక్షాన డాక్టర్ ఉషా తదితరులు పాల్గొన్నారు. -
తత్కాల్ సర్వీస్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్, రైలు టిక్కెట్ల మాదిరిగా తత్కాల్ పద్దతిలో 24 గంటల్లో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టింది. వివాహమైన 60 రోజుల్లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు విధించింది. త్వరగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలనుకునేవారు తత్కాల్ సర్వీస్ ద్వారా తీసుకోవచ్చు. ఇందుకోసం పది వేల రూపాయిల ఫీజు చెల్లించాలి. -
ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి
కలెక్టరేట్, : వీఆర్వో పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన మంగళవా రం సాయంత్రానికి పూర్తయింది. మొత్తం 62మంది అభ్యర్థుల్లో మాజీ సైనికుల కోటాలో వచ్చిన ఇద్దరిని అధికారులు తిరస్కరించారు. వీరిలో ఒకరు గతంలో వీఆర్ఏగా కొంతకాలం పనిచేసి మానేశారు. దాన్ని ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాగా చెప్పడం వల్ల, మరొకరు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతూ శాఖాపరమైన అనుమతి లేకుండా పరీక్ష రాసినందున అధికారులు తిరస్కరించారు. వీరిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి వనజ అనర్హులుగా తేల్చారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఎంపిక జాబితా ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. -
ఇదేమి...సేవలో..!
మీ సేవ కేంద్రాలు సర్కారుకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ సిబ్బందికి దండిగా జేబులు నింపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగంగా పనులు పూర్తి చేయడంతోపాటు అవినీతి నిర్మూలనకు ‘మీసేవ’ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో దఫ దఫాలుగా దాదాపు 250 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మీ సేవల ద్వారా ఆదాయం దండిగా వస్తుండడంతో వచ్చే మార్చి నుంచి మరో 150 సేవలను ‘మీ సేవ’ పరిధిలోకి తీసుకు రావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కాసులు ఘనంగా కురిపిస్తున్నా ‘సేవ’లు మాత్రం నాసిరకంగానే ఉన్నాయి. రెవెన్యూతో పాలు పలు శాఖల సేవలు ప్రజలకు అరకొరగానే అందుతున్నాయి. ఇక ప్రభుత్వ సిబ్బంది ‘మామూళ్లు’ వచ్చే ‘సేవ’లపైనే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ‘మీ సేవ’ కేంద్రాలు రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కుటుంబ సభ్యుని ధ్రువపత్రం, ఎఫ్‌లైన్ పిటీషన్ తదితర పనులకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలకు అక్రమ వసూళ్లు రూ.5వేల నుంచి రూ.50వేలకు పైమాటే. ఈ వ్యవహారమంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫిర్యాదు చేస్తే స్పందిస్తామన్న ధోరణితో ఉండడం, విచారణ మొక్కుబడిగా చేస్తుండడంతో పలువురు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు. సేవలు భారం... విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందడానికి రూ.70 ఖర్చవుతోంది. ప్రీ మెట్రిక్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ కేవలం రూ.1200. ఈ స్కాలర్షిప్ కూడా అందుతుందో లేదో తెలియదు. స్కాలర్షిప్ కోసం ముందుగానే రూ.70 ఖర్చుచేయవలసి వస్తోంది. పలు మీసేవ కేం ద్రాల్లో ఈ ధ్రువపత్రాల కోసం రూ.100 వరకు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.110 ఇచ్చే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసి) ప్రస్తుతం మీసేవలో రూ.225, రూ.525 వరకు చెల్లించవలసి వస్తోంది. ఈసీ ధరలు వినియోగదారులకు భారంగా పరిణమించాయి. వివరాలు తప్పుల తడకలు... ‘మీసేవ’ కేంద్రాల ప్రారంభంలోనే రెవెన్యూ అడంగల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అడంగళ్లలో వివరాలు తప్పుల తడకలుగా ఉండడంతో రైతులు వీఆర్ఓల ద్వారా అడంగళ్లను పొందుతున్నారు. వాస్తవానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అడంగళ్ల వివరాలను అప్డేట్ చేయవలసి ఉంది. రెండేళ్ల క్రితం వివరాలు ప్రస్తుతం ఉండడంతో పలు బ్యాంకులు ‘మీసేవ’ కేంద్రాల్లో అడంగళ్లను తిరస్కరిస్తున్నాయి. ఎఫ్ఎంబిలో వివరాలు భూతద్దంతో వెతికినా కనిపించని పరిస్థితి. ఇక పుట్టిన తేదీ, మరణ ధ్రువపత్రాల జారీలో నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతో పలువురు ఉసూరుమంటున్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. సాంకేతిక లోపాలు... మీసేవ కేంద్రాల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతోపాటు పలు సాంకేతిక లోపాల వల్ల అత్యవసరంగా ధ్రువపత్రాలు పొందడానికి అవకాశం ఉండడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి రెండు మూడు రోజులపాటు మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసి వస్తోంది. ఇక్కడ ‘సేవ’లతో ఊరట అరకు రూరల్ : అరకులోయ, యండపల్లి వలస, అనంతగిరి, చిలకలగెడ్డ, డుంబ్రిగుడ, అరకు సంతబయలు, హుకుంపేట, బర్మానగుడ, పెదబయలు, ముంచంగిపుట్టులో ఒక్కో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా కుల, ఆదాయం, నివాస, జనన, మరణ ధ్రువపత్రాలతోపాటు అడంగల్, 1బీ, రేషన్‌కార్డుల్లో డేటా చేర్పులు, మార్పులు, ఉపకార వేతనాలు, ప్రజావాణి ఫిర్యాదులు, పంటనష్టం దరఖాస్తు, అడంగల్‌లో చేర్పులు, మార్పులు, ఈబీసీ, ఓబీసీ, ఈ-పాస్ పుస్తకాలు, ఫ్యామిలీ మెంబర్(లీగల్‌హెయిర్), భూమి సర్వే చేయించుకునేందుకు ఎఫ్ లైన్ ఫిటీషన్, పట్టాదారు పుస్తకాల్లో మార్పులు, చేర్పులు వంటి మొత్తం 192 సేవలు అందిస్తున్నారు. గతంలో వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం పడిగాపులు కాసి, చెప్పులరిగేలా తిరిగేవారు. ఇపుడు మీసేవ కేంద్రాల ఏర్పాటుతో సులభంగా ధ్రువ పత్రాలు పొందుతున్నామని ప్రజలు చెబుతున్నారు. సత్వర సేవలకు కృషి విశాఖ ఏజేన్సీలో మొత్తం 26 మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు మీసేవ కేంద్రాలపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. -కె. చంద్రశేఖర్‌బాబు, మీ సేవ కేంద్రాల కో ఆర్డినేటర్, పాడేరు డివిజన్. ఇక్కడ నిత్యం పడిగాపులే... అనకాపల్లి న్యూస్‌లైన్ నెట్వర్క్ : మీసేవ ద్వారా అందించే సేవలను పెంచడంతో వినియోగదారులు అవస్థలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. తహసీల్దార్ కార్యాలయం పక్కన గల మీసేవ కేంద్రాన్ని, అలాగే చోడవరం బస్టాప్ ఎదురుగా గల మీసేవా కేంద్రంపై ‘న్యూస్‌లైన్’ విజిట్ చేసినపుడు పలువురు విద్యార్థులు తమ గోడు వినిపించారు. ‘స్కాలర్షిప్ కోసం ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రం కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాను... నెలరోజులు పైబడుతున్నా సర్టిఫికేట్ మంజూరు కాలేదు...స్కాలర్షిప్ గడువు ముగస్తుం డడంతో తహసీల్దార్, వీఆర్ఓల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకోలేదు...’ అంటూ సూర్య అనే విద్యార్థి వాపోయాడు. ‘మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సకాలంలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు.. మరలా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సిఫార్సు చేసుకోవాల్సి వస్తోంది... తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ తరచూ పనిచేయకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..’ అంటూ డిగ్రీ సెకెండియర్ విద్యార్థి అర్జున్ తెలిపాడు. అక్కడ ‘సేవ’కు లేదు తీరిక కశింకోట, న్యూస్‌లైన్ : కశింకోట మండలంలో మూడు మీ-సే వ కేంద్రాలున్నాయి. కశింకోట, తాళ్లపాలెం, కన్నూరుపాలెంలో ఒక్కొక్కటి వంతున ఇవి ఉన్నాయి. ప్రభుత్వ పని రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ-సేవ కేంద్రాలు పని చేయాల్సి ఉంది. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామ సమయం ఉంటుంది. అయితే వీటిని సక్రమంగా వేళకు తెరవకపోవడం, పని వేళల్లో సరిగ్గా తెరిచి ఉండడం లేదని, దీనివల్ల ఇబ్బంది చెందాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కశింకోటలో ఒకే కేంద్రం ఉండడం వల్ల రద్దీ ఏర్పడి ఇబ్బంది పడాల్సి వస్తోందని, ఇంకా అదనపు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న తాళ్లపాలెం, కన్నూరుపాలెం మీ-సేవ కేంద్రాలకు విద్యుత్ సమస్య వల్ల రోజులో ఒక పూట మాత్రమే పని చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయా కేంద్రాలు విద్యుత్ కోత వల్ల రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయడం లేదు. ఇన్వెర్టర్లు ఉన్నా అవి సరిగ్గా పని చేయడం లేదని, దీనివల్ల ధ్రువీకరణ పత్రాల కోసం దూరం నుంచి వ చ్చి ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. తరుచూ హైదరాబాద్‌లోని కేంద్రీయ సర్వర్ సరిగ్గా పని చేయక ప్రజలతో పాటు కేంద్రాల నిర్వహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు మీ-సేవ కేంద్రాలను అనుసంధానించే ప్రధాన సర్వర్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిర్వాహకులు అంటున్నారు. రద్దీ దృష్ట్యా కశింకోటలో అదనంగా రెండు మీ-సేవ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదించామని తహ సీల్దార్ కె.రమామణి పేర్కొన్నారు.