న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి పాసైన విద్యార్థులకు సర్టి ఫికెట్, మార్కుల మెమో ఇకపై వేర్వేరుగా ఉండవు. ఈ ఏడాది నుంచి ఈ రెంటింటిని కలిపి ఒక్కటిగానే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ పరీక్షల కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ‘2019 సంవత్సరం నుంచి సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు ఒక్కటే సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో ధ్రువీకరణ పత్రంతోపాటు మార్కుల వివరాలుంటాయి’ అని ఓ అధికారి చెప్పారు. 12వ తరగతికి మాత్రం పరీక్ష ధ్రువీకరణ, మార్కుల షీట్లు వేరుగా ఉంటాయి. ఒక వేళ విద్యార్ధి ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాస్తే..అందులో సంపాదించిన మార్కుల వివరాలతో ప్రత్యేక ధ్రువీకరణ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment