CBSE -SSC
-
అనుకున్నదే జరిగింది పేద పిల్లలపై కక్ష తీర్చుకున్న బాబు
-
కూటమి రాజకీయ కక్ష.. అటకెక్కనున్న CBSE
-
హైబ్రీడ్ మోడ్ కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో హైబ్రీడ్ విధానం(ఆన్లైన్, ఆఫ్‌లైన్) కుదరని, విద్యార్థులు ప్రత్యక్షంగా పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. విద్యా వ్యవస్థను గందరగోళానికి గురి చేయవద్దని పేర్కొంది. సీబీఎస్ఈ టర్న్–1 బోర్డు పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయని, సీఐఎస్సీఈ సెమిస్టర్–1 పరీక్షలు 22 నుంచి ప్రారంభం కాబోతున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం పరీక్షల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కేవలం ఆఫ్‌లైన్‌లో కాకుండా హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేలా సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈకి ఆదేశాలివ్వాలని కోరుతూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సీబీఎస్ఈ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్–19 నియంత్రణ నిబంధనలను పాటిస్తూ బోర్డు పరీక్షలను ప్రత్యక్ష విధానంలో(ఆఫ్‌లైన్ మోడ్) నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలను 6,500 నుంచి 15,000కు పెంచామని తెలిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే హాజరయ్యారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఈ దశలో పరీక్షలను రీషెడ్యూల్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు తెలియజేసింది. విద్యా వ్యవస్థతో ఆటలు వద్దని, అధికారులను వారి పని వారిని చేసుకోనివ్వాలని హితవు పలికింది. -
ఒకేదాంట్లో సీబీఎస్ఈ టెన్త్ సర్టిఫికెట్, మార్క్స్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి పాసైన విద్యార్థులకు సర్టి ఫికెట్, మార్కుల మెమో ఇకపై వేర్వేరుగా ఉండవు. ఈ ఏడాది నుంచి ఈ రెంటింటిని కలిపి ఒక్కటిగానే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ‘2019 సంవత్సరం నుంచి సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు ఒక్కటే సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో ధ్రువీకరణ పత్రంతోపాటు మార్కుల వివరాలుంటాయి’ అని ఓ అధికారి చెప్పారు. 12వ తరగతికి మాత్రం పరీక్ష ధ్రువీకరణ, మార్కుల షీట్లు వేరుగా ఉంటాయి. ఒక వేళ విద్యార్ధి ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాస్తే..అందులో సంపాదించిన మార్కుల వివరాలతో ప్రత్యేక ధ్రువీకరణ ఉంటుంది. -
‘విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం’
న్యూఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల ప్రశ్న ప్రతంలో దొర్లిన తప్పుకుగాను విద్యార్థులకు 2 మార్కులు కలపాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. మార్చి 12న జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రంలో తప్పుదొర్లిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు బోర్డు దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ రెండు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది’ అని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
సీబీఎస్ఈ–ఎస్ఎస్సీ
స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ కరిక్యులం అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మెట్రో నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు.. తల్లిదండ్రులంతా సీబీఎస్‌ఈకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కారణమేంటి? అసలు సీబీఎస్ఈ కరిక్యులం, బోధనల్లోనిప్రత్యేకతలేంటిæ? చాలా మంది తల్లిదండ్రుల్లో రేకెత్తే ప్రశ్నలే ఇవి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ విధానంలోని అంశాలపై ఫోకస్.. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సీబీఎస్ఈ విధానంలో ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ను విద్యార్థులకు అత్యంత అనుకూలాంశంగా చెప్పొచ్చు. ఇందులో సబ్జెక్ట్‌ను బోధించేటప్పుడు.. దానిపై పూర్తి అవగాహన కల్పించేలా తరగతిగదిలోనే విద్యార్థులతో యాక్టివిటీస్ చేయిస్తారు. ఉదాహరణకు.. గణితంలో ప్రాథమిక అంశాలైన కూడికల గురించి చెప్పేటప్పడు 2+2=4 అని బోర్డ్‌పై రాసి చూపడమే కాకుండా.. దానికి సంబంధించి చిన్నపాటి ప్రాక్టికల్ యాక్టివిటీని నిర్వహిస్తారు. ఫలితంగా చిన్నారుల్లో సదరు టాపిక్‌ను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. సీబీఎస్ఈ విధానంలోని మరో ప్రత్యేకత.. ఇంటరాక్టివ్ లెర్నింగ్. ఇందులో ఒక అంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థులను గ్రూపులుగా విభజించి.. వారితో సదరు టాపిక్‌పై ఏదైనా ఒక సమస్యను పరిష్కరింపజేస్తారు. ఈ విధానం భవిష్యత్తులో పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేందుకు బాటలు వేస్తుంది. సీబీఎస్ఈ సిలబస్‌లోని మరో ప్రత్యేకత ఇలస్ట్రేషన్ మెథడ్స్‌ను అనుసరించడం. ఇందులో సబ్జెక్ట్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను బొమ్మలు, గ్రాఫ్‌లు, టేబుల్స్ రూపంలో బోధిస్తారు. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ సీబీఎస్ఈ విధానంలో సిలబస్‌లోని ఒక అంశం ఆ తర్వాతి తరగతుల్లోనూ కొనసాగుతుంది. ఉదాహరణకు ఒకటో తరగతిలో పాఠ్యాంశాలు పదో తరగతి, +2 వరకు కొనసాగుతాయి. తరగతి స్థాయి పెరిగే కొద్దీ.. ఆయా అంశాల క్లిష్టత, విస్తృతి పెరుగుతుంది. దీంతోపాటు జాతీయ స్థాయిలో +2 అర్హతతో నిర్వహించే జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ప్రామాణికంగా ఉంది. ఈ కారణంగానే ఆయా పరీక్షల్లో సీబీఎస్ఈ విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు. ఇంగ్లిష్ నైపుణ్యాల విషయంలోనూ సీబీఎస్ఈ విద్యార్థులు ముందుంటున్నారు. సబ్జెక్టులు.. సమ ప్రాధాన్యం సీబీఎస్ఈ +2 స్థాయిలో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను మేజర్ సబ్జెక్టులుగా చదవడంతో పాటు ఎలక్టివ్స్‌గా ఇతర విభాగాలకు చెందిన సబ్జెక్టులను అభ్యసించే అవకాశం ఉంటుంది. బోర్డ్ సిలబస్‌లో ఆ వెసులుబాటు లేదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు సీబీఎస్ఈ అనేక చర్యలు చేపడుతోంది. సీబీఎస్ఈ అకడమిక్ వెబ్సైట్ ద్వారా పలు రకాల లెర్నింగ్ మెటీరియల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్టేట్ బోర్డ్ సిలబస్‌లో మార్పులు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల స్టేట్ బోర్డులు సైతం సిలబస్‌లో మార్పులు చేశాయి. కానీ, మౌలిక సదుపాయాల కొరతతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో ప్రధానంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఇలస్ట్రేటివ్ మెథడ్స్‌కు అవసరమైన సామగ్రి కొరత అధికంగా ఉంది.