న్యూఢిల్లీ: పాస్పోర్ట్, రైలు టిక్కెట్ల మాదిరిగా తత్కాల్ పద్దతిలో 24 గంటల్లో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టింది. వివాహమైన 60 రోజుల్లోపు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు విధించింది. త్వరగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలనుకునేవారు తత్కాల్ సర్వీస్ ద్వారా తీసుకోవచ్చు. ఇందుకోసం పది వేల రూపాయిల ఫీజు చెల్లించాలి.