మొండెంఖల్ పంచాయతీ పరిధిలోని మర్రిమానుగూడ గిరిజనులకు మంజూరు చేసిన ఆస్తి పత్రాలు
సాక్షి, పార్వతీపురంమన్యం(కురుపాం): వివిధ కేసుల్లో పట్టుబడిన వారిని విడిపించేందుకు జామీనుగా వెళ్లేవారికి సాల్వెన్స్ (ఇంటిపన్ను, ఆస్తి ధ్రువీకరణ పత్రం) సర్టిఫికేట్ అవసరం. వీటి మంజూరుకు పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌లో ఓ అధికారి రూ.500 చొప్పున వసూలు చేశారంటూ మొండెంఖల్ పంచాయతీ పరిధిలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక లక్కాయి, గురపన్న, దుర్గన్న తదితరులు స్థానిక విలేకరుల వద్ద బుధవారం వాపోయారు.
ఇదే విషయాన్ని ఎంపీడీఓ వి.శివరామప్ప వద్ద విలేకరులు ప్రస్తావించగా ఇప్పటివరకు నా దృష్టికి రాలేదని, డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment