Panchayat officials
-
‘మండల’ అధికారుల సంఘం అధ్యక్షుడిగా శేషంజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా శేషంజన్ స్వామి, ప్రధాన కార్యదర్శిగా అత్తర్ పర్వేజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో ఈ మేరకు ఎన్నుకున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రఘుపతిరెడ్డి, కోశాధికారిగా రవీందర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా డీపీవో సురేశ్ మోహన్, అసిస్టెంట్‌గా డీఎల్పీవో సాధన వ్యవహరించారు. -
పంచాయతీ అధికారుల చేతివాటం!
సాక్షి, పార్వతీపురంమన్యం(కురుపాం): వివిధ కేసుల్లో పట్టుబడిన వారిని విడిపించేందుకు జామీనుగా వెళ్లేవారికి సాల్వెన్స్ (ఇంటిపన్ను, ఆస్తి ధ్రువీకరణ పత్రం) సర్టిఫికేట్ అవసరం. వీటి మంజూరుకు పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌లో ఓ అధికారి రూ.500 చొప్పున వసూలు చేశారంటూ మొండెంఖల్ పంచాయతీ పరిధిలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక లక్కాయి, గురపన్న, దుర్గన్న తదితరులు స్థానిక విలేకరుల వద్ద బుధవారం వాపోయారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ వి.శివరామప్ప వద్ద విలేకరులు ప్రస్తావించగా ఇప్పటివరకు నా దృష్టికి రాలేదని, డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నేను చనిపోలేదు మహాప్రభో..
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: బతికుండగానే తనకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌కు చెందిన 74 ఏళ్ల షాపురం పండరిగౌడ్ గురువారం అదనపు కలెక్టర్ రాజర్షిషాను కలసి ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు తనను మనస్తాపానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌ను ప్రతినెలా తీసుకుంటున్నానని, రేషన్‌షాపుల్లో కూడా ప్రతినెలా నిత్యావసరాలను తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం బయటపడిందని తెలిపారు. 2010 అక్టోబర్ 11న పంచాయతీ అధికారులు తన మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ ‘సాక్షి’తో తెలిపారు. -
‘గ్రిడ్’కు తొలగనున్న ఆటంకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా(వాటర్‌గ్రిడ్) ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు ప్రధాన ఆటంకాలు త్వరలో తొలగిపోనున్నాయి. పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి రైల్వే, అటవీ శాఖల అనుమతుల విషయమై ఆయా శాఖల ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్ అధికారులు సోమవారం చర్చలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద పైప్‌లైన్ ఏర్పాటుకు అనుమతుల నిమిత్తం పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఎస్ఎన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్ఎన్ సింగ్ స్పందిస్తూ.. క్రాసింగ్‌ల వద్ద పనులు ఏవిధంగా చేయాలనే అంశంపై రెండు శాఖలతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయిద్దామని ప్రతిపాదించారు. ప్రాజెక్ట్‌కు సహకారాన్ని అందించాల్సిం దిగా రైల్వే ఇంజనీరింగ్ అధికారుల(అచ్యుతరావు, ఎస్కే గుప్తా)కు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక నోడల్ అధికారిని నియమిస్తామని ఎస్పీ సింగ్ చెప్పారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ శాఖ నుంచి హామీ రైల్వే అధికారులతో చర్చల అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి శోభతో అనుమతుల విషయమై చర్చించారు. రాబోయే ఆరు నెలల్లో తాము చేయబోయే పనుల ప్రాధాన్యతను వివరించారు. త్వరితగతిన అనుమతులిప్పించి సహకరించాల్సిందిగా కోరారు. ప్రతిష్టాత్మకమైన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు అటవీ శాఖ నుంచి వీలైనంత త్వరగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా శోభ హామీ ఇచ్చారు. -
ఊరి నిండా ‘చెత్త’
కార్మికుల సమ్మెతో కంపుకొడుతున్న గ్రామాలు - దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలు, రోడ్లు - ప్రత్యామ్నాయ మార్గాలు చూడని పంచాయతీ అధికారులు - నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం - వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు ఇందూరు : పంచాయతీ కార్మికుల సమ్మె పారిశుద్ధ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గత నెల రోజులుగా తమను రెగ్యులర్ చేయాలంటూ వారు విధులు మానుకుని సమ్మెకు దిగడంతో గ్రామాలలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ప్రధానంగా రోడ్లు, మురికి కాలువలు ఆధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోంది. తద్వారా పల్లె ప్రజలు దోమల బెడదతో డెంగీ, విష జ్వరాలబారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 718 పంచాయతీలలో దాదాపు కాంట్రాక్టు, తాత్కాలిక ఇతర పద్ధ తులలో పని చేస్తున్న కార్మికులు మూడు వేల మందికి పైగా ఉన్నారు. వీరికి రెండు యూనియన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు యూనియన్ల కార్మికులు సమ్మె చేస్తున్నా రు. కార్మికులు రోజూ ప్రజలకు ఎలాంటి రోగాల రాకుండా రోడ్లను, మురికి కాలువలను పరిశుభ్రం చేసేవారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలిగించేవారు. అలాగే తాగునీ టి, వాటర్, విద్యుత్ దీపాలు వేసే బాధ్యతలు, పంచాయతీ కార్యాలయాలను శుభ్రంగా ఉంచే బాధ్యత కార్మికులపైనే ఉంది. కానీ గత నెల రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. చెత్తతో, దుమ్ము దూళితో మండల కేంద్రాలతో పాటు చిన్న చిన్న గ్రామాలు ఆధ్వానంగా త యారయ్యాయి. ఇదిలా ఉండగా మురికి కాలువలు తీయకపోవడం, నీరు నిలువ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెదడ తీవ్రం కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటు వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లె వారు లేకపోవడంతో ట్యాంకులు కూడా ఆపరిశుభ్రంగా మారాయి. పట్టించుకోని పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పంచాయతీ శాఖ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గ్రామాలన్నీ చెత్తతో నిండిపోతున్నా, మురికి కాలువలు కంపు కొడుతున్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. పన్నులు వసూలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ, అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన పారిశుద్య పనులపై ఎందుకు చూపడం లేదని పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వమైన స్పందించి కార్మికులచే సమ్మెను విరమింపజేయాలని, లేదా అధికారులు ప్రత్యామ్నయ మార్గాలతో గ్రామాలను పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
ఎన్కేపల్లిలో విషాదం పూడూరు: విద్యుదాఘాతంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పంచాయతీ అధికారుల నిర్ణక్ష్యం చిన్నారిని బలితీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన పి రఘుపతి,అలవేలు దంపతులకు చందన(5), అనంతసాయి(2 సంవత్సరాల 6నెలలు) అనే చిన్నారులు ఉన్నారు. మంగళవారం ఇద్దరు ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకునేందుకు వె ళ్లారు. పాఠశాల ఆవరణలో తాగునీటి ట్యాంకు పక్కనే గ్రామానికి నీరందించేందుకు స్టార్టర్‌ను ఇనుప స్టాండ్‌కు బిగించారు. చిన్నారి అనంతసాయి అడుకుంటూ స్టార్టర్‌ను బిగించిన ఇనుపస్టాండును పట్టుకోవడంతో షాట్ తగిలింది. అక్కడే ఉన్న అక్క చందన బాలుడిని లాగడంతో షాట్ తగలడంతో అక్కడి ఆమె వెళ్లిపోయింది. గమనించిన చుట్టుపక్కల వారు కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు వె ళ్లిన బాలుడు మృతిచెందడంతో మృతుడి కుటుంబీకులు బోరున విలపించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. స్టార్టర్ వద్ద వైర్లు తేలడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్‌షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు తాండూరు రూరల్: ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...సరగళ్ల బసప్ప కుమారుడు శివప్రసాద్(6) స్థానిక పాఠశాల్లో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో విద్యుత్ బోర్డు వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. -
ఇదీ.. పల్లె లెక్క!
సాక్షి, కర్నూలు : పంచాయతీల్లో ప్రజల జేబులు ఖాళీకానున్నాయి. ప్రజలపై భారీగా పన్ను పోటుకు పంచాయతీ అధికారులు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుకుండడంతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడకుండా.. గ్రామీణ ప్రజలపై పన్నుల భారం మోపి పంచాయతీల ఖజానా నింపుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థలాలు, భూములతో పాటు వాహన పన్ను, వీధి దీపాల పన్ను, కూరగాయల మార్కెట్ వంటి అన్ని రకాల వ్యవహారాలపైనా పన్నులు బాదనుంది. ఇలా దాదాపు 48 రకాల పన్నులను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని పలు పంచాయతీల్లో పన్నులు పెంచుతున్నట్లు తీర్మానం కూడా చేశారు. కాదేదీ పన్నులకు అనర్హం.. జిల్లాలో 889 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి అభివృద్ధికి ఇప్పటిదాకా కేవలం ఆస్తి, కుళాయి పన్నులే ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇకపై ఇంటిపన్నులు, నీటిపన్ను, వీధిదీపాల పన్ను, డ్రైనేజీపన్ను, గ్రంథాలయ పన్ను, ప్రకటన పన్నులతో పాటు పన్నేతరులైన చెరువులు, మార్కెట్లు, సంతలు, లే-అవుట్ ఫీజు, సేవా రుసుము, ఆక్రమణ పన్నులు, వీధి దీపాల పన్నుతో పాటు వాహన పన్ను, ఖాళీ స్థలం లేదా భూమి ఉంటే పన్నును ఇలా మొత్తం 48 రకాల పన్నులు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పన్నుల భారం పెరగనుంది. వచ్చే నెల నుంచి పంచాయతీ పాలన ఆన్లైన్ కానున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయాలతోనే చేపట్టేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి పనులపైనా ప(క)న్ను...! పంచాయతీల ఖజానాను నింపేందుకు ప్రభుత్వం ఏకంగా కూలీ పనుల మీదా కన్ను వేసింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో అమలయ్యే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పనులపైనా పన్ను వసూలు చేయడానికి సిద్ధపడుతోంది. అదేవిధంగా పోరంబోకు భూములతో పాటు చివరకు మరుగునీరు (డ్రైనేజీ వ్యవస్థ) నిర్వహణకు కూడా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇక మీద గ్రామాల్లో షాపులు పెట్టుకునే వారే కాకుండా వీధుల్లో ఏర్పాటు చేసుకునే తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద అది ఇదీ అని తేడా లేకుండా అన్ని రకాల వ్యవహారాలపైన పన్నులు వసూలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. నిండుకున్న ఖజానా.. పంచాయతీలను ఆదుకోవాల్సిన సర్కారు సైతం పంచాయతీల ఆర్థిక వనరులనూ గుంజేసుకోవడంతో పంచాయతీల్లో ఖజానా నిండుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు మూడేళ్ల పాటు పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులే పాలన సాగించారు. అయితే ఆర్థిక లేమితో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. పైగా కేవలం ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి రావడంతో ఆ నిధులతోనే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే... గోరుచుట్టపై రోకటిపోటులాగా విద్యుత్ బిల్లులను కూడా పంచాయతీలే చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులల్లో 70 నుంచి 80 శాతం మేరకు కేవలం విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పంచాయతీలు ఆర్థికంగా కుంగిపోయాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితులల్లో ప్రజల జేబులు కొల్లగొట్టడం ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు 48 రకాల పన్ను జాబితాను రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేసింది. -
మీ వల్ల కాకపోతే సెలవు పెట్టుకోండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.410 కోట్లు గత యేడాది నవంబరులో మంజూరు చేశాం. టెండర్ వ్యవధిని కుదించినా పనులు ప్రారంభం కావడం లేదు. ఈ రకమైన ఆలస్యాన్ని సహించేది లేదు. మీ వల్ల కాకపోతే సెలవు పెట్టుకుని వెళ్లండి’అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్‌లోని కేఎల్ఐ అతిథి గృహంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, డీఆర్డీఏ, డ్వామా శాఖల పనితీరుపై అధికారులతో మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డితో పాటు ఆయా శాఖల రాష్ట్రస్థాయి అధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం తేడా లేకుండా రూ.410 కోట్లు పీఆర్ రోడ్లకు మంజూరు చేసినా పనులు ఆలస్యం కావడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో సామాజిక పింఛన్ల పథకం ‘ఆసరా’ లబ్ధిదారుల సంఖ్య తగ్గడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మహబూబ్‌నగర్ జిల్లాలో పేదరికం మాయమైందా. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య పెరిగి ఇక్కడ ఎందుకు తగ్గింది. 14వేల నుంచి 4వేలకు చేనేత పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య పడిపోవడం అసాధారణం. పింఛను మొత్తాన్ని పెంచినా మాకు చెడ్డపేరు రావడం దరిద్రం’ అని అసహనం వ్యక్తం చేశారు. సదరం క్యాంపులను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. స్థల సేకరణ పూర్తిచేయండి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలో 776.25 కిలోమీటర్ల మెయిన్ లైను, 9 ఫిల్టర్ బెడ్లు, 15 పంపింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్, జూరాల ప్రాజెక్టు నుంచి రెండు సెగ్మెంట్లుగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఫిల్టర్ బెడ్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ జరపాల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలో 355 పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.53.25కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా, మరోమారు వివరాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో పింఛన్ల మంజూరు అవకతవకలపై మరోమారు పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో గోడౌన్ల నిర్మాణానికి అనువైన స్థలాలు గుర్తించాల్సిందిగా ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు కేవలం 200 గ్రామాల్లో ప్రారంభం కావడం, 30వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించడం, ఇందిర జలప్రభ పురోగతిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్‌షెడ్ పథకం పనులు త్వరితగతిన సాగేలా చూడాలన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసులకు కొత్త వాహనాలు అందించి నాగర్‌కర్నూలుకు చేరుకున్నారు. అనంతరం జొన్నలబొగుడ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సాతాపూర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులోని ఎంజీకేఎల్ఐ పంప్‌హౌస్‌ను సందర్శించారు. భోజన విరామం అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, కలెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలు విలవిల
రోజురోజుకూ కునారిల్లుతున్న పంచాయతీల దుస్థితికి పాలకులే కారణం. ఈ పాపంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తోడవడం మరీ ఘోరం. గ్రామాభివృద్ధికి పన్నుల వసూళ్లే కీలకం. వాటిని వసూలు చేయకపోవడంతో బకాయిలు ఏటేటా కొండలా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఫలితంగా సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒంగోలు టూటౌన్ : జిల్లాలో 1028 పంచాయతీలున్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఏటా పన్నులు వసూలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలి. జిల్లా పంచాయతీ అధికారి తరచూ తనిఖీలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి సూచనలివ్వాలి. పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ ఈ జిల్లాలో కనిపించడం లేదు. ఒక్కసారి 2013-14 సంవత్సరంలో పన్నుల వసూళ్లను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. మొత్తం రూ.13,24,29,898లకు గాను ఇప్పటి వరకు రూ.8,82,78,081 మాత్రమే వసూలు చేశారు. ఇవికాక పాత బకాయిలు దాదాపు రూ.22,05,48,490 ఉండగా, ఇప్పటి వరకు రూ.12,20,75, 054 వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలున్నాయి. చాలినన్ని నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయి. జీతాలు లేక అవస్థలు = పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలిచ్చే పరిస్థితి లేదు. = పారిశుద్ధ్య కార్మికులతో పాటు టైమ్ స్కేల్ కార్మికులు, పర్మనెంట్, టెండర్.. ఎన్ఎంఆర్ విధానంలో కార్మికులు పనిచేస్తున్నారు. = జిల్లాలో పర్మనెంట్, టైమ్ స్కేల్ కార్మికులు దాదాపు 125 మంది వరకు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు. = పర్మనెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011లో అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. = దీనికి జిల్లా స్థాయి కమిటీ కూడా ఉంది. కమిటీ నిర్లక్ష్యం కారణంగా వారు ట్రెజరీ ద్వారా జీతాలకు నోచుకోవడంలేదు. పారిశుద్ధ్య కార్మికులకు చాలాచోట్ల నేటికీ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబంతో సహా తల్లడిల్లుతున్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు = విద్యుత్ బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి. = గత ప్రభుత్వాలు మైనర్ పంచాయతీలు కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని అప్పట్లో సర్పంచ్ల సంఘానికి హామీ ఇచ్చాయి. = జిల్లాలో దాదాపు 106 పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.12 కోట్ల వరకు ఉన్నాయి. = కొన్ని పంచాయతీల్లో బిల్లులు చెల్లించ కపోవడంతో రెండు నెలల క్రితం ఫీజులు తొలగించారు. దీంతో పల్లెల్లో అంధకారం అలుముకుంది. శాశ్వత భవనాల సమస్య = పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు మూడేళ్ల కిందట 350 కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఒక్కోదానికి రూ.10 లక్షలు విడుదలయ్యాయి. = పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు పనులు అప్పగించారు. ఇప్పటికి కనీసం 100 కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఇక తాగునీటి సమస్య ఉండనే ఉంది. = పంచాయతీల అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు. = {పభుత్వం విడుదల చేయాల్సిన సెస్‌లు, కొత్తపన్నులు దాదాపు రూ.200 కోట్ల వరకు బకాయి పడినట్లు సర్పంచుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. = నిధుల లభ్యత లేకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.