‘మండల’ అధికారుల సంఘం అధ్యక్షుడిగా శేషంజన్‌ | Seshanjan Swamy Elected President Of Telangana Mandal officers | Sakshi
Sakshi News home page

‘మండల’ అధికారుల సంఘం అధ్యక్షుడిగా శేషంజన్‌

Published Mon, Jan 9 2023 2:11 AM | Last Updated on Mon, Jan 9 2023 9:36 AM

Seshanjan Swamy Elected President Of Telangana Mandal officers - Sakshi

నూతన కార్యవర్గానికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల అధికారి  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా శేషంజన్‌ స్వామి, ప్రధాన కార్యదర్శిగా అత్తర్‌ పర్వేజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో ఈ మేరకు ఎన్నుకున్నారు.

అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా రఘుపతిరెడ్డి, కోశాధికారిగా రవీందర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా డీపీవో సురేశ్‌ మోహన్, అసిస్టెంట్‌గా డీఎల్‌పీవో సాధన వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement