ఊరి నిండా ‘చెత్త’
కార్మికుల సమ్మెతో కంపుకొడుతున్న గ్రామాలు
- దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలు, రోడ్లు
- ప్రత్యామ్నాయ మార్గాలు చూడని పంచాయతీ అధికారులు
- నెల రోజులైనా పట్టించుకోని ప్రభుత్వం
- వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు
ఇందూరు : పంచాయతీ కార్మికుల సమ్మె పారిశుద్ధ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గత నెల రోజులుగా తమను రెగ్యులర్ చేయాలంటూ వారు విధులు మానుకుని సమ్మెకు దిగడంతో గ్రామాలలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ప్రధానంగా రోడ్లు, మురికి కాలువలు ఆధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోంది. తద్వారా పల్లె ప్రజలు దోమల బెడదతో డెంగీ, విష జ్వరాలబారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 718 పంచాయతీలలో దాదాపు కాంట్రాక్టు, తాత్కాలిక ఇతర పద్ధ తులలో పని చేస్తున్న కార్మికులు మూడు వేల మందికి పైగా ఉన్నారు. వీరికి రెండు యూనియన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు యూనియన్ల కార్మికులు సమ్మె చేస్తున్నా రు.
కార్మికులు రోజూ ప్రజలకు ఎలాంటి రోగాల రాకుండా రోడ్లను, మురికి కాలువలను పరిశుభ్రం చేసేవారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలిగించేవారు. అలాగే తాగునీ టి, వాటర్, విద్యుత్ దీపాలు వేసే బాధ్యతలు, పంచాయతీ కార్యాలయాలను శుభ్రంగా ఉంచే బాధ్యత కార్మికులపైనే ఉంది. కానీ గత నెల రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. చెత్తతో, దుమ్ము దూళితో మండల కేంద్రాలతో పాటు చిన్న చిన్న గ్రామాలు ఆధ్వానంగా త యారయ్యాయి. ఇదిలా ఉండగా మురికి కాలువలు తీయకపోవడం, నీరు నిలువ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బెదడ తీవ్రం కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటు వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లె వారు లేకపోవడంతో ట్యాంకులు కూడా ఆపరిశుభ్రంగా మారాయి.
పట్టించుకోని పంచాయతీ అధికారులు
పంచాయతీ కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పంచాయతీ శాఖ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గ్రామాలన్నీ చెత్తతో నిండిపోతున్నా, మురికి కాలువలు కంపు కొడుతున్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. పన్నులు వసూలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ, అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన పారిశుద్య పనులపై ఎందుకు చూపడం లేదని పల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వమైన స్పందించి కార్మికులచే సమ్మెను విరమింపజేయాలని, లేదా అధికారులు ప్రత్యామ్నయ మార్గాలతో గ్రామాలను పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.