ఎన్కేపల్లిలో విషాదం
పూడూరు: విద్యుదాఘాతంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పంచాయతీ అధికారుల నిర్ణక్ష్యం చిన్నారిని బలితీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన పి రఘుపతి,అలవేలు దంపతులకు చందన(5), అనంతసాయి(2 సంవత్సరాల 6నెలలు) అనే చిన్నారులు ఉన్నారు. మంగళవారం ఇద్దరు ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకునేందుకు వె ళ్లారు. పాఠశాల ఆవరణలో తాగునీటి ట్యాంకు పక్కనే గ్రామానికి నీరందించేందుకు స్టార్టర్‌ను ఇనుప స్టాండ్‌కు బిగించారు. చిన్నారి అనంతసాయి అడుకుంటూ స్టార్టర్‌ను బిగించిన ఇనుపస్టాండును పట్టుకోవడంతో షాట్ తగిలింది. అక్కడే ఉన్న అక్క చందన బాలుడిని లాగడంతో షాట్ తగలడంతో అక్కడి ఆమె వెళ్లిపోయింది. గమనించిన చుట్టుపక్కల వారు కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు వె ళ్లిన బాలుడు మృతిచెందడంతో మృతుడి కుటుంబీకులు బోరున విలపించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. స్టార్టర్ వద్ద వైర్లు తేలడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరెంట్‌షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు
తాండూరు రూరల్: ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...సరగళ్ల బసప్ప కుమారుడు శివప్రసాద్(6) స్థానిక పాఠశాల్లో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో విద్యుత్ బోర్డు వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు.
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
Published Wed, May 20 2015 12:43 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement