Child died
-
తల్లి చెంతకు చేరేలోపే.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
భారత్‌లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ప్రహర్షిక ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు. -
సందడిగా తిరిగి.. నీళ్లబకెట్‌లో పడి..
ఖైరతాబాద్: రాత్రి 9 గంటలు.. ఇంట్లో కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడాదిన్నర పాప తప్పటడుగులు వేస్తూ తిరుగుతుండగా తల్లి గోరుముద్దలు పెడుతోంది. చిన్నారి సందడికి అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ పాప బెడ్రూం బాత్రూంలోని నీళ్లబకెట్‌లో పడి విగతజీవిగా మారింది. ఖైరతాబాద్ ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్ డివిజన్లోని ఐమా క్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో బి బ్లాక్ 307 ఫ్లాట్‌లో తోట సతీష్ కుమార్, రేణుక దంపతులు నివసిస్తున్నారు. ఈ ఫ్లాట్‌లో మొత్తం 12 మంది ఉంటున్నారు. సతీష్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఏడాదిన్నర వయసున్న మూడో కూతురు ఆది్వక మంగళవారంరాత్రి ఇంట్లో తల్లి పెట్టే గోరుముద్దలు తింటూ సందడి చేస్తూ, తప్పటడుగులు వేస్తూ, అటు ఇటు తిరుగుతోంది. ఈ క్రమంలో తల్లి కూడా భోజనం ముగించుకొని 9.30 గంటలకు బెడ్రూంలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకునేందుకు వెళ్లగా అటాచ్డ్ బాత్రూం తలుపు తెరిచి ఉంది. అందులో ఉన్న నీళ్లబకెట్‌లో పాప కాళ్లు పైకి కనిపించడంతో తల్లి లబోదిబోమంటూ ఏడుస్తూ బయటికి తీసింది. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని వాసవి హాస్పిటల్‌కు పాపను తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు రాత్రి 11 గంటల నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. కళ్ల ముందు ఆడుకుంటూ ఉన్న పాప అంతలోనే మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నా యి. -
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్‌రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్‌ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
ఎంత ఘోరం.. గాజు డోర్ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి
లుధియానా: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్లాస్ డోర్‌తో ఆడుకొంటున్న చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. భారీ గాజు తలుపు మీద పడటంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. లుధియానా ఘుమర్ మండి మార్కెట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఊహించని ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. వివరాలు.. మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం వస్త్ర దుకాణంలో కొనుగోలు కోసం వచ్చారు. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉండగా.. చిన్నారి దుకాణం ఎంట్రన్స్ వద్ద ఉన్న తలుపు హ్యాండిల్‌ను పట్టుకొని అటు ఇటూ ఊగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్లాస్ డోర్ మొత్తం ఊడిపోయి అమాంతం ఆమెపై పడిపోయింది. బోల్టులు వదులుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు, షోరూమ్ సిబ్బంది హుటాహుటిన బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అణ్యం పుణ్యం తెలియని చిన్నారిని, డోర్ బలితీసుకున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్ మిస్ PUNJAB | A three-year-old girl died in Punjab's Ludhiana after a giant glass door at a showroom fell on top of her. The incident took place at the Ghumar Mandi Market in the city, and the girl was rushed to a hospital soon after, where she was declared dead. The incident was… pic.twitter.com/WSiUtpmEyx— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 28, 2023 -
కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో నాటు తుపాకీతో పందులను కాల్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు చేరవేయగా.. వారు వచ్చి చిన్నారిని చూసేసరికి అప్పటికే మృతిచెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే -
విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి
సాక్షి, తూర్పుగోదావరి: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్(6) తన తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చదవండి: మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర -
హైదరాబాద్: గోడ కూలి నెలల పసికందు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ గోడ కూలి.. పక్కనే ఉన్న రేకుల ఇంటి మీద ఇటుక రాళ్లు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఓ నెలల పసికందు మృతి చెందింది. నారాయణఖేడ్ చెందిన శ్రీకాంత్-జగదేవి జంట.. కూలీ పని కోసం నగరానికి వచ్చి రెహమత్నగర్ పరిధిలోని ఓంనగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో.. వాళ్లుంటున్న పోర్షన్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తులో ఉన్న సైడ్‌వాల్ కూలిపోయింది. దీంతో ఆ ఇటుక రాళ్లు పక్కనే శ్రీకాంత్ ఉంటున్న రేకుల రూమ్‌పై పడ్డాయి. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో.. ఆ భార్యభర్తలిద్దరూ అప్రమత్తం అయ్యి బయటపడ్డారు. అయితే ఊయలలో నిద్రిస్తున్న 8 నెలల జీవనికా ఇటుకలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ భవన నిర్మాణం అక్రమంగా సాగుతోందని చెబుతూ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి.. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
బతుకుదెరువు.. గుండె బరువు.. తల్లి ఒడిలో నుంచి ఎగిరిపడి!
సాక్షి, మహబూబాబాద్: బతుకుదెరువు కోసం బయల్దేరిన ఓ కుటుంబానికి గుండె బరువైంది. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి అమ్మే కుటుంబంలో ఆటో బోల్తా పడి విషాదం నిండింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో మంగళవారం ఆటో బోల్తా పడి రేబెల్లి యాలాద్రి–సమ్మక్క దంపతుల కుమార్తె రాణి(3) మృతి చెందింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లికి చెందిన యాలాద్రి–సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు బతుకుదెరువు కోసం ఊరూరా తిరిగి స్టీల్ సామగ్రి, అమ్ముతూ, గ్యాస్ స్టవ్‌లు మరమ్మతు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈక్రమంలో యాలాద్రి, సమ్మక్క తమ కుమార్తె రాణి కలిసి టాటా ఏస్ ట్రాలీ క్యాబిన్లో కూర్చున్నారు. వారితో పాటు వెనకాల ట్రాలీలో సమ్మక్క తల్లి వెంకటమ్మ కూర్చుని వరంగల్ వెళ్లేందుకు బయల్దేరారు. శనిగపురం శివారు గుండ్లబోడుతండా మూల మలుపు వద్ద గల రైస్ మిల్లు ప్రాంతానికి ఆటో చేరుకోగానే.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో ఒక్కసారిగా టాటాఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈఘటనలో యాలాద్రి పక్కనే ఉన్న సమ్మక్క, చిన్నారి రాణి, ఆటో వెనుకభాగంలో కూర్చున్న వెంకటమ్మ రోడ్డుపై పడిపోయారు. సమ్మక్క, వెంకటమ్మకు స్వల్పగాయాలవగా.. రాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో వారిని ఆస్పత్రికి తరలించగా.. రాణి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్, స్థానికులు తెలిపారు. చదవండి: ఇన్‌స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని -
చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్..
నల్గొండ (భూదాన్‌పోచంపల్లి) : ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్నకుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు కాయిన్ మింగగా, అది గొంతులో ఇరుక్కొంది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేసి కాయిన్ తొలగించారు. అనంతరం ఇంటికి పంపించారు. అయితే, సోమవారం చైత్ర తీవ్ర అస్వస్థతకు గురై శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయి చిన్నారి మృతి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. కంటికి రెప్పలా సాకుకొంటున్న చిన్నారి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో అలుముకొంది. -
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్.. జరిగింది ఇదే!
సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్ గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్‌హౌజ్‌లో 17 ఏళ్ల యువకుడు గన్‌తో ఆడుతూ ఫైర్ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు ‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్ హౌస్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్‌హౌజ్‌లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్‌కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్‌తో అడుతూ ఫైర్ చేశాడు. దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. -
అంగన్వాడి కేంద్రంలో చిన్నారి మృతి!
గజ్వేల్ రూరల్: అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కామల్ల రాజు–సంతోష దంపతులకు కొడుకు, కూతురు నిత్య (4) ఉన్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం నిత్య అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిత్య ఎడమ కాలుకు రక్తం కారుతుండడాన్ని గమనించిన ఆయా పసుపుతో కట్టుకట్టి గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టింది. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలంతా భోజనం చేసిన తర్వాత 2గంటల ప్రాంతంలో నిత్యను నిద్రనుంచి లేపేందుకు ప్రయత్నించగా, లేవకపోవడంతో తల్లి సంతోషకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న నిత్యను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నిత్య మృతి చెందినట్టు తెలిపారు. నిత్య ఎడమకాలు పాదం భాగంలో పాముకాటు గుర్తులున్నాయని, తమ కూతురి మృతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అశోక్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నిత్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బస్సు చక్రాల కింద నలిగిన బాలుడు
గుడిహత్నూర్: అప్పటివరకు కుటుంబ సభ్యులతో గడిపిన బాలుడు ఇంటి ముందు ఉన్న షాప్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆ చిన్నారిని చిదిమేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండ లం హనుమాన్‌నగర్‌లో మంగళవారం జరిగింది. హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే అజీజ్ –సుల్తానాలకు నలుగురు సంతానం. చిన్నవాడైన అర్మాన్ (6) సాయంత్రం సమయంలో ఇంటి ఎదురుగా ఉండే కిరాణా దుకాణం వైపు పరిగెత్తాడు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన (ఉట్నూర్– ఆదిలాబాద్ వన్‌స్టాప్) ఆర్టీసీ బస్సు చిన్నారి మీదుగా దూసుకెళ్లింది. బస్సు వేగంగా ఉండటంతో ముందు చక్రాలతోపాటు వెనుక చక్రాలు కూడా బాలుడిపైనుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, బస్సును నిర్లక్ష్యంగా నడిపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
పరుపులో దాగి.. పసికందును కాటేసి...
మహబూబాబాద్ రూరల్: పాము కాటుతో చిన్నారి మృతిచెందగా.. అదే పాము ఆమె తండ్రిని కాటు వేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వేర్పుల క్రాంతి–మమత దంపతులకు మూడు నెలలు పసిపాప సంతానం. చిన్నారి కొద్ది రోజులుగా అనారో గ్యంతో ఉండటంతో వరంగల్, ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. శనివారం రాత్రి ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇంట్లోని బల్లపై ఉన్న పిల్లల పరుపులో పడుకోబెట్టారు. అప్పటికే అందులో ఉన్న పామును వీరు గుర్తించలేదు. కాసేపు పాలుతాగిన చిన్నా రి అంతలోనే బాగా ఏడుస్తుండటంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు చికిత్స కోసం మహబూబాబాద్‌లోని పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరుపులో నుంచి చిన్నారిని వైద్యుడికి చూపిస్తుండగానే.. అందులో నుంచి కట్ల పాము కిందపడింది. అది మమత కాలిపై నుంచి వెళుతుండగా పక్కనే ఉన్న క్రాంతి ఎడ మ కాలితో తొక్కాడు. దీంతో పాము అతడిని కాటు వేసింది. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు పామును చంపేశారు. పాప కూడా పాముకాటుతోనే మృతిచెందిందని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెం టనే క్రాంతి ఏరియా ఆస్పత్రికి చేరుకుని పాముకాటు వికటించే ఇంజక్షన్ వేయించుకున్నాడు. కాగా.. పోస్టుమార్టం రిపోర్టులో పాము చిన్నారిని ఎడమ తుంటి భాగంలో కాటు వేసినట్లుగా వైద్యులు గుర్తించారు. -
ప్రేమపేరిట మోసపోయి.. శిశువుకు జన్మనిచ్చి..
నిజామాబాద్ అర్బన్: ప్రేమపేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఓ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చెత్తకుప్పలో పడేసిన శిశువు కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) అమ్మ మ్మ ఇంటి వద్ద ఉంటూ బోధన్‌లో ఇంటర్ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో కడుపునొప్పిగా ఉందని అమ్మమ్మతో కలసి శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ డెలివరీ నిమిత్తం సిబ్బంది పూర్తి వివరాలు అడగడంతో చెప్పడం ఇష్టంలేక ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడే ఆ బాలిక ఆస్పత్రి మెట్ల పక్కన మగశిశువును ప్రసవించింది. వెంటనే శిశువును పక్కనే ఉన్న చెత్తకుప్పలో పడేసి తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ వైద్యుల వద్దకు వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో డాక్టర్లు తొలుత నమ్మలేదు. అయితే, అప్పటికే ఎక్కువ రక్తస్రావం అవుతుండటంతో ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో పారిశుధ్య కార్మికులకు చెత్తకుప్పల్లో శిశువు కనిపించడంతో ఆస్పత్రి నిర్వాహకులకు సమాచారమిచ్చారు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి కొనఊపిరితో ఉన్న శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శిశువు మృతి చెందింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన ప్రేమ వ్యవహారం, గర్భం గురించి పూసగుచ్చినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
తల్లి ప్రాణం గిలగిల.. గర్భంలో బిడ్డ మృతి
ఖమ్మం వైద్య విభాగం: వైద్యుల నిర్లక్ష్యానికి గర్భస్థ శిశువు బలైంది. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించడం.. ఆ తల్లికి కడుపు కోతను మిగిలి్చంది. గురువారం ఖమ్మంలో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన ముసుకుల అశ్విని నిండు గర్భిణి కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచి్చంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు చేసేందుకు కొన్ని టెస్టులు రాశారు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి డాక్టర్‌కు చూపించారు. పరీక్షల్లో ఆమెకు కామెర్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆపరేషన్ చేయడం కుదరదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. తాము నిరుపేదలమని, లాక్డౌన్లో అంతదూరం తీసుకెళ్లలేమని అశ్విని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అశ్విని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడుపులో ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో డాక్టర్లు మరోసారి పరీక్షించారు. ఈ దశలో ఆమె కడుపులో బిడ్డ మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు, అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం కడుపులోని మృత శిశువును అయినా తీయాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా కనికనించలేదు. దీంతో చేసేది లేక నగరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. అయినా ఎవరూ వైద్యానికి అంగీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా మమత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించి మృత శిశువును బయటకు తీశారు. కాగా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కామెర్లు ఉండడంతో ఎంజీఎంకు వెళ్లమన్నాం ఈ సంఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ బి. శ్రీనివాసరావు వివరణ కోరగా.. ఆమెకు కామెర్లు ఉం డటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారన్నారు. కానీ కడుపులో శిశువు మాత్రం ఆస్పత్రిలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. దానికి తమ వైద్యులు బాధ్యులు కాదని తెలిపారు. చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. చదవండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడం ఇలా.. -
చెరువులో శవమైన నాలుగేళ్ల చిన్నారి
సాక్షి, సంగారెడ్డి: ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి చెరువులో శవమై కనిపించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆదివారం ఈ విషయం వెలుగుచూసింది. చిన్నారిని గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. పాప మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను ఎవరైనా చంపి చెరువులో పడేశారా, లేక తల్లిదండ్రుల మధ్య గొడవలే చిన్నారి మృతికి కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
చిన్నారి ప్రాణం తీసిన వీధికుక్కలు
-
ఘోరం: చిన్నారిని బలి తీసుకున్న చిరుత
సాక్షి, తుమకూరు : నరమాంసాన్ని రుచిమరిగిన ఓ చిరుత పులి ఓ చిన్నారిని బలితీసుకుంది. తుమకూరు తాలుకాలోని హెబ్బూరు సమీపంలో ఉన్న బైచేనహళ్లి తోటలో శనివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్, శిల్పా దంపతుల కుమార్తె చందన (2) ఇంటి ముందు ఆడుకుంటుండగా తోటలోకి ప్రవేశించిన పులి చిన్నారిని ఒక్కసారిగా నోట కరుచుకుని అడవిలోకి పారిపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు బాలికను కాపాడటానికి పులితో పాటు పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. అక్కడికి కొంత దూరంలో చిన్నారి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. (విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..) చదవండి : పసి ప్రాణాన్ని బలిగొన్న ‘బాతు’! -
కూతురిని పూడ్చి పెట్టి.. తల్లి ఆత్మాహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాలు.. పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో కుసుమలత అనే మహిళ.. తన భర్త, 18 నెలల కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కుంటుంబ కలహాలతో కుసుమలత తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. అదే రోజు తన భార్య, కూతురు కనపడటం లేదని ఈనెల 6వ తేదిన పెందుర్తి పోలీస్ స్టేషన్లో కుసుమలత భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి మహిళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చిన్నముషిరివాడ వుడా కాలనీ కొండలమీద నుంచి ఓ మహిళ కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను కుసుమలతగా గుర్తించారు. పాప ఏదని కుసుమలత తల్లిని విచారించగా తన కూతురు చనిపోయిందని, కొండ ప్రాంతంలో పాతి పెట్టానని చెప్పింది. ఈ క్రమంలో కొండపైన పోలీసులు గాలిస్తుండగా.. ఎర్ర కొండపై చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్నిపోలీసులు కనుగొన్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి, తండ్రి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళ ఆత్మహత్య ప్రయత్నం విఫలమవడంతో శరీరం నిండా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. -
మంగళగూడెం చిన్నారి.. దక్షిణాఫ్రికాలో మృతి
సాక్షి, ఖమ్మం: మండల పరిధిలోని మంగళగూడేనికి చెందిన చిన్నారి దక్షిణాఫ్రికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కన్నేటి శంకర్, మమతలకు ఇద్దరు కుమారులు. మూడేళ్ల క్రితం శంకర్ భార్యా పిల్లలతో కలిసి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికా వెళ్లారు. శంకర్ అక్కడ హార్డ్‌వేర్ ఉద్యోం చేస్తున్నాడు. వీరు అక్కడే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. వారి చిన్న కుమారుడు జూవిత్(4) అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి, వారు నివాసం పక్కనే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న జూవిత్ కనిపించకపోవడంతో తల్లి కంగారు పడి వెతకగా స్విమ్మింగ్ పూల్‌లో తేలియాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామమైన మంగళగూడేనికి శనివారం తీసుకురానున్నారు. కాగా జూవిత్ బీజేపీ జిల్లా కార్యదర్శి కన్నేటి కోటయ్యకు మనవడు. -
వైద్యం వికటించి చిన్నారి మృతి
సాక్షి, వైఎస్సార్: కడప నగరంలోని వంశీ చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ఆదివారం మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వారి బంధువులు డాక్టరు నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే చిన్నారి మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం కాస్త పెద్దది కావడంతో డాక్టర్ వంశీధర్ ఆసుపత్రికి తాళాలు వేసి పరారయ్యాడు. -
సంధ్యను చిదిమేశాయి!
వెదురుకొమ్మల కోసం అడవికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కకొని ప్రాణాలు కోల్పోయింది. కందిరీగలు దాడి చేసి కుట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద సంఘటన జి.మాడుగుల మండలంలో చోటుచేసుకోగా..వంతాల సంధ్య మృత్యువుఒడిలోకి చేరింది. కందిరీగల దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. సాక్షి, జి.మాడుగుల : కె.కోడాపల్లి పంచాయతీ కవలపూలు పైవీధి గ్రామానికి చెందిన వంతాల సుబ్బారావు, వంతాల సీత భార్యభర్తలు. వీరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, గ్రామానికి చెందిన మరో ముగ్గురు గిరిజనులు కలసి గన్నేరుపుట్ట గ్రామం వద్ద అడవికి గురువారం సాయంత్రం సమయంలో వెదురుకొమ్ములు సేకరించటానికి వెళ్లారు. ఇంతలో కందిరీగలు గుంపుగా వచ్చి వీరిపై దాడి చేయగా వీరిలో అయిదుగురు వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. వంతాల సీత, వంతాల సంధ్య (6), 3 సంవత్సరాల వయస్సు గల వంతాల లక్ష్మిలపై కందిరీగలు, కొండ ఈగలు దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఆశ వర్కర్ వైద్య సిబ్బందికి తెలిజేశారు. దీంతో అంబులెన్స్ పంపించి హుటాహూటిన జి.మాడుగుల పీహెచ్‌సీకి రాత్రి ఎనిమిది గంటల సమయంలో తరలించారు. వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ వైద్యం అందిస్తున్న సమయంలో వంతాల సంధ్య మృతి చెందింది. మృతురాలి తల్లి సీత, వంతాల లక్ష్మిలకు చికిత్స అందించారు. వీరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా కందిరీగల దాడిలో తీవ్రంగా గాయపడిన వంతాల సీత, 3 సంవత్సరాల వంతాల లక్ష్మిలకు మరోసారి వైద్యం అందించేందుకు శుక్రవారం ఉదయం వైద్య సిబ్బంది, ఏఎన్ఎం సుమిత్ర, హెల్త్ అసిస్టెంట్ సప్పి బాలయ్యలు కవలపూలు గ్రామానికి ప్రయాసపడి కాలినడక వెళ్లారు. సీత, లక్షిలను వైద్యం చేయింటానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎంత బతిమిలాడిన ససేమిరా అన్నారు. దీంతో భాషా సంస్కృతులతో వైద్యానికి ఒప్పించి పాడేరు కమ్యూనిటీ ఆస్పత్రికి తలించి వైద్యం చేయించారు. సీత, లక్ష్మిలు ఆరోగ్యంగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
టిప్పర్ లారీ అదుపు తప్పి దారుణం..
-
బోయిన్‌పల్లిలో దారుణం..
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లి దారుణం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ అదుపు తప్పి ఆరేళ్ల పాప మీదకు దూసుకురావడంతో చిన్నారి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. హస్మత్‌పేట గల్లీలోకి కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ లారీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారీ లోడ్‌తో కూడిన వాహనాలకు పగటి పూట నగరంలోకి అనుమతి లేకపోయినప్పటికీ.. కంకర లోడ్‌తో కూడిన టిప్పర్‌ను చిన్న గల్లీలోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెట్టు రూపంలో మృత్యువు
సాక్షి, తెనాలి(గుంటూరు) : అప్పటి వరకు తోటి విద్యార్థులతో పాఠశాలలో సందడిగా గడిపిన ఆ చిన్నారిని మరో రెండు నిమిషాల్లో ఇంటి వెళ్తున్న క్రమంలో చెట్టు రూపంలో మృత్యువు కబళించింది. చెట్టు విరిగి పడటంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్యశాలకు తరలిస్తుండగా తల్లి ఒడిలోనే మృతి చెందిన విషాద ఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తెనాలి పట్టణ మారిస్‌పేటలోని మఠం బజారులో ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలోని యూకలిఫ్టస్ చెట్టు విరిగి పడటంతో విద్యార్థి భీమవరపు యువసందీప్ రెడ్డి(6) తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాఠశాల వదిలిపెట్టడంతో తోటి విద్యార్థులందరూ ఇళ్లకు వెళుతున్నారు. ఒకటో తరగతి చదువుతున్న సందీప్ ఉపాధ్యాయులకు వీడ్కోలు పలుకుతున్న విద్యార్థుల వరుసలో చివరన ఉన్నాడు. తరగతి గది నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా చెట్టు విరిగి పడింది. ఈ క్రమంలో చిన్నారి కుడి కాలు విరిగింది. వెంటనే ఉపాధ్యాయులు సమీపంలోని విద్యార్థులను పక్కకు లాగి, సందీప్‌ను చెట్టు కింద నుంచి పైకి తీశారు. కుమారుడు గాయపడిన విషయాన్ని తెలుసుకున్న తల్లి వీరకుమారి, స్థానికులు పాఠశాల వద్దకు వచ్చి సందీప్‌ను తెనాలి జిల్లా వైద్యశాలకు ఆటోలో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అలాగే వైద్యశాలకు తరలించగా.. డాక్టర్లు పరీక్షించి బాలుడు మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ మృతికి తండ్రి భీమవరపు సుబ్బరామిరెడ్డి, తల్లి కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డ దేహాన్ని పట్టుకుని వారు విలపించిన తీరు కంట తడి పెట్టించింది. సందీప్ అన్నయ్య మణికంఠ అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఘటన ప్రాంతానికి సమీపంలోనే ఉండటంతో మణికంఠ చెవికి చెట్టు కొమ్మలు రాసుకుపోయాయి. కడుపు కోత.. సుబ్బరామిరెడ్డి, వీరకుమారి దంపతులు నిరుపేదలు. కరెంటు పనుల మేస్త్రిలకు సహాయకుడిగా పని చేస్తూ సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిన్న వాడైన సందీప్‌కు ఐదేళ్లు నిండటంతో కొద్దిరోజుల కిందట ఒకటో తరగతిలో చేర్పించారు. పాఠశాలలో బూట్లు, పుస్తకాలు ఇవ్వడంతో ఆ చిన్నారి ఉత్సాహంగా అన్నతో కలిసి స్కూలుకు వెళుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడై కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశపడిన తల్లిదండ్రులకు కడపుకోత మిగిలింది. ఎమ్మెల్యే పరామర్శ.. ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హుటాహుటిన వైద్యశాలకు చేరుకుని చిన్నారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కడుపుకోతతో వేదనపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చారు. పురపాలక సంఘం నంచి తక్షణమే రూ.రెండు లక్షలు బాధిత కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. అలాగే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి
-
తల్లడిల్లిన తల్లి గుండె
అప్పటివరకూ తల్లితో ఉల్లాసంగా గడిపిన చిన్నారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కళ్లెదుటే రక్తపు మడుగులో విగతజీవిగా మారిన బిడ్డను చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. తినుబండారాలు కొనుక్కునేందుకు తల్లితోపాటు దుకాణానికి వెళ్లిన పాప తిరిగి ఇంటికి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన కుమార్తె తన కళ్ల ముందే లారీ చక్రాల కింద నలిగిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. బాలాయపల్లి మండలం అంబలపూడి అరుంధతీయవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. నెల్లూరు / బాలాయపల్లి: మూడు సంవత్సరాల చిన్నారి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృతిచెందిన ఘటన మండలంలోని గూడూరు – వెంకటగిరి రోడ్డు మార్గంలో అంబలపూడి అరుంధతీయవాడ గ్రామ సమీపం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండంలోని అంబలపూడి గ్రామానికి చెందిన రాపూరు ఈశ్వరయ్య, సురేఖల రెండో కుమార్తె సౌమ్య. ఈశ్వరయ్య ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సౌమ్య శుక్రవారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. కాసేపటికి తల్లిని దుకాణానికి తీసుకెళ్లి తినుబండారాలు కొనివ్వమని అడిగింది. సురేఖ రోడ్డుకు అవతల ఉన్న దుకాణానికి సౌమ్యను తీసుకెళ్లి తిరిగి ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన గూడూరు వైపు నుంచి వెంకటగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆపి ఉంది. అందులో నుంచి ప్రయాణికులు దిగుతున్నారు. బస్సు ముందు నుంచి సురేఖ, సౌమ్యలు రోడ్డు దాటుతున్నారు. ఈ సమయంలో ఓ లారీ బస్సును వెనుకనుంచి ఢీకొట్టబోయింది. స్థానికులు చూసి కేకలు వేయడంతో లారీ డ్రైవర్ బస్సును తప్పించి నేరుగా సౌమ్యను ఢీకొట్టాడు. బాలిక మీద నుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతను పరారయ్యేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు వెళుతుండగా.. సురేఖ వెనుక వస్తుండగా సౌమ్య ముందు వెళుతోంది. కళ్లెదుటే ఘటన జరగడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సౌమ్య మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని గుండలవిసేలా విలపించింది. కేకలు పెడుతుండగా డ్రైవర్ సౌమ్యను ఢీకొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పాపం..పసివాడు!
ప్రకాశం / కంభం : రిపబ్లిక్ డే రోజు పాఠశాలలో జెండా వందనం కార్యక్రమానికి హాజరయ్యేందుకు త్వరత్వరగా తయారై కొత్త దుస్తులు వేసుకొని స్కూల్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ముక్కుపచ్చలారని పసివాడిని మృత్యువు జీపు రూపంలో వచ్చి ఉసురు తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆరేళ్ల తమ పిల్లాడు ఒక్కసారిగా జీపు కింద పడి చనిపోవడంతో విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. వివరాలు.. స్థానిక కాప వీధిలో నివాసం ఉంటున్న నాగరాజు, స్వాతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నాగసాయి గౌతం(6) ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకొని తన వద్ద ఉన్న చిన్న సైకిల్‌పై స్నేహితులతో కలిసి స్కూల్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చాడు. వీధిలోని ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద అరటి పండ్ల లోడుతో వస్తున్న జీపు ఢీకొనడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రు, బంధువులు పరుగులు తీసుకుంటూ సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వై.శ్రీహరి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. స్థానికులను విచారించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. అన్నా రాంబాబు పరామర్శ ప్రమాదంలో మృతి చెందిన బాలుడి మృతదేహానికి వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు నివాళులర్పించారు. సాయంత్రం మృతుడి ఇంటికి వచ్చిన ఆయన.. బాలుడి మృతదేహానికి పూలమాల వేసి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు -
విద్యుదాఘాతానికి నాలుగేళ్ల బాలిక మృతి
సాక్షి, ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యుదాఘాతానికి నాలుగేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం పాతలింగాల గ్రామపంచాయతీ పరిధి బందాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బందాలకు చెందిన ఆగబోయిన సమ్మయ్య, స్వరూప దంపతులు తమ కుమార్తె అక్షిత(04)ను తీసుకొని తమ పత్తి చేను వద్దకు వెళ్లారు. భార్యాభర్తలు పత్తి ఏరే పనిలో నిమగ్నమవగా.. కూతురు చేనులో అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది. ఈ క్రమంలో పంట భూమి నుంచి ఉన్న విద్యుత్ లైన్ తీగ తెగిపడి ఉంది. అక్షితకు కరెంట్ తీగ తగలగడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కూతురు మృత్యువాత పడడంతో కన్నవారి రోదనలు మిన్నుముట్టాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
లక్షలు వసూలు చేసి బతికించలేదు..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కలకలం రేగింది. వైద్యం కోసం వచ్చిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. అయితే, ప్రాణాలు నిలుపుతారని ఆస్పత్రికి తీసుకొచ్చిన తమ కుమారున్ని డాక్టర్ల నిర్లక్ష్యమే చంపేసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. అనారోగ్యంతో ఉన్న జయరాం (4)ను సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్‌కి వైద్యం నిమిత్తం ఆదివారం తీసుకొచ్చారు. బాలుడి వైద్యసేవలకై 3 లక్షల యాభై వేల బిల్లు వసూలు చేశారు. బాలుడికి నయమవుతోందని చెప్పి మరింత డబ్బుని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కానీ, పిల్లాడి ప్రాణాలు మాత్రం కాపాడలేపోయారు. కాగా, తమ కుమారుడి చావుకి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందళనకు దిగారు. -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
నాగర్‌కర్నూల్ రూరల్ : కలహాలు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు ఇచ్చి తానూ తాగింది. పరిస్థితి విషమించడంతో తల్లి, కూతురు మృతిచెందింది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భూషయ్య, మహాదేవి(30) అలియాస్ మాధవి భార్యాభర్తలు.. వీరికి అచ్యుత, మౌనిక(4నెలలు) కూతుళ్లు ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య మూడు నెలలుగా తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కూతుళ్లకు పురుగు మందు తాపి తాను తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్తుండగా తల్లి మహాదేవితో పాటు ఆమె కూతురు మౌనిక ఆరో గ్య పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారి అచ్యుత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టిన రోజే.. చివరి రోజు!
బుడిబుడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో వారందరికీ సంతోషం పంచిన ఆ చిన్నారికి మొదటి పుట్టిన రోజు చివరిదయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బంధు మిత్రుల ఆప్యాయతల నడుమ నిండు నూరేళ్లు జీవించాల్సిన వాడు పుట్టిన ఏడాదికే కానరాని లోకాలకు తరలిపోయాడు. తమకు జీవనాధారమైన ఆటో కన్నపేగును చిదిమేసిన విషయాన్ని తలచుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పండుగ రోజు జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సాక్షి, జూపాడుబంగ్లా : మండలంలోని 80 బన్నూరులో శనివారం ఆటో కిందపడి ఓ చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. మృతుడి బంధువుల కథనం మేరకు..గ్రామానికి చెందిన ఇలాష్బాషా, ఆశ్మ దంపతులకు కుమారుడు యూసుఫ్(ఏడాది)ఉన్నాడు. కుమారుడి పుట్టినరోజు, రంజాన్ పండుగ ఒకే రోజు రావటంతో ఆ ఇంట్లో బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం ఇంట్లో అందరూ పండగ హడావుడిలో ఉండగా తండ్రి కుమారుడి తీసుకుని ఇంటికి సమీపంలో ఉన్న మినరల్‌వాటర్ ప్లాంటు వద్దకు వెళ్లాడు. తండ్రి ఆటోలోని ట్యాంకులో నీటిని నింపుకొని గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఆటో వెనక్కు నడపడంతో వెనుక ఉన్న చిన్నారిపై దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా వచ్చీరాని మాటలతో అందర్నీ నవ్వించిన యూసుఫ్ మృతిచెందాడనే వార్తతో కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు. ఘటన స్థలికి చేరుకుని గుండెలు అవిసేలా రోదించారు. పండగ వాతావరణం కాస్త విషాదభరితంగా మారింది. గ్రామంలోని ముస్లింలు, చుట్టుపక్కల వారు మృతి చెందిన బాలుణ్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ చెయ్యని తమకు పండుగరోజు, పుట్టిన రోజునాడే అల్లా తమ బిడ్డను తీసుకెళ్లాలా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. -
ఏ తల్లి ‘కని’కరించలేదో..!
సాక్షి, నాగార్జునసాగర్ : సాగర్ జలాశయ తీరంలో గల కృష్ణవేణి ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని బాలుడి మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం జలాశయం ఒడ్డుకు బాలుడి మృ తదేహం కొట్టుకు రావడాన్ని గమనించిన మ త్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. రైట్‌బ్యాంకు ఎస్ఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరి శీలించారు. బాలుడు వయస్సు సుమారు రెండేళ్లు ఉంటుందని, ఒంటిపై రెడ్ కలర్ టీషర్ట్, రెడ్ కలర్ నిక్కర్ ఉన్నట్టు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన వారు సెల్ : 9440900884 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. -
తల్లి పాలలో పాము విషం.!
సాక్షి, లక్నో : పాము కాటుకు ఓ మాతృమూర్తి మరణించగా, ఆమె పాలు తాగిన మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ తల్లి.. తన కూతురితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటేసింది. నిద్ర లేచాక తన బిడ్డకు పాలిచ్చింది. అప్పటికే పాము విషం ఆమె శరీరమంతా వ్యాపించడంతో.. ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు కాటేసిన పామును ఇంట్లోనే మరో గదిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకున్నారు. -
భార్య కోసమే చిన్నారి నరబలి
-
ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం: చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్‌లో విషాద సంఘటన జరిగింది. వైద్యం వికటించి 14 నెలల చిన్నారి మృతి చెందింది. ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పార్శీగుట్టలో ప్రకాష్ అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతని వద్దకు మెహను ఉన్నీసా అనే 14 నెలల బాలికను వైద్యం కోసం ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అయితే ప్రకాష్ చేసిన వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ డాక్టరును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. -
చిన్నారిని చిదిమేసిన తండ్రి
ఖానాపూర్: తాగిన మైకంలో రెండు నెలల చిన్నారిని తండ్రి ఊయల నుంచి కింద పడేయటంతో మూడు రోజుల తర్వాత ఆ చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక పద్మావతినగర్ కాలనీకి చెందిన షేక్‌గౌస్, రిహానాబేగంలకు 57 రోజుల వయస్సు గల చిన్నారి రిజ్వాన్ ఉన్నాడు. గత నెల 28న రిజ్వాన్‌కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో రిహానా కుమారుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లింది. బాలుడిని బయటికి ఎందుకు తీసుకెళ్లావంటూ షేక్ గౌస్ భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఊయలలోని బాలుడిని కింద పడేశాడు. దీంతో చిన్నారి మెడకు గాయమైంది. ఆస్పత్రిలో చూపించేందుకు డబ్బులు లేక రిహానా తన తల్లిగారి ఊరైన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు వెళ్లింది. సోదరుడి వద్ద డబ్బులు తీసుకుని గత నెల 29న నిర్మల్ ఆస్పత్రిలో చూపించింది. మందులు వాడినా చిన్నారికి నయం కాలేదు. గత నెల 30న చిన్నారి పాలు తాగడం లేదని జగిత్యాలలోని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్తున్న క్రమంలో పరిస్థితి విషమించింది. మార్గం మధ్యలో ముత్యంపేటలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతికి తన భర్తే కారణమన్న రిహానా బేగం ఫిర్యాదు మేరకు సీఐ అజ్మీరా పెద్దకుమార్ కేసు నమోదు చేశారు. -
కర్మన్‌ఘాట్‌లో విషాదం..
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సత్యసాయి అపార్ట్మెంట్లో ఎలాంటి రక్షణలేని లిఫ్ట్.. పదేళ్ల పసిబాలుడి ప్రాణాల్ని మింగింది. ఆదివారం ఉదయం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దుర్గానగర్‌లోని సత్యసాయి అపార్ట్మెంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గతకొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు పదేళ్ల కొడుకు తస్సావంత్ ఉన్నాడు. ఆదివారం ఉదయం బాలుడు ఆడుకుంటూ.. లిఫ్ట్ కోసం ఏర్పాటుచేసిన బేస్గుంతలోకి తొంగిచూస్తుండగా కిందకు దూసుకొచ్చిన లిఫ్ట్ అతని తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అపార్ట్మెంట్లో లిఫ్ట్‌కు ఎలాంటి రక్షణలు లేకపోవడంతోనే బాలుడు మృతిచెందాడని, అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ సిబ్బంది లిఫ్ట్‌ల విషయంలో నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా? లేదా? అన్నది చూడకుండానే అపార్ట్మెంట్లకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. లిఫ్ట్ తలపై పడి పదేళ్ల బాలుడు మృతి -
కారు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విష్ణునగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రాజుకు రెండేళ్ల కుమార్తె చైత్ర ఇంటి ముందు ఆడుకుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో విషాదం
గుంతకల్: అనంతపురం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. పాఠశాల గేటు విరిగిపడి ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని గుంతకల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల గేటు విరిగిపడి నర్సరీ విద్యార్థి రవి మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. -
పాపం పసివాడు..
► రైలు పట్టాల పక్కనే ఉన్న మూడేళ్ల బాలుడు ► ఇంతలో వేగంగా వెళ్లిన గూడ్స్ రైలు ► ఆ ధాటికి అదుపుతప్పి కంకర రాళ్లపై పడిన బాలుడు ► తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన పసి హృదయం మార్కాపురం రూరల్ : ఆ బాలుడి వయసు మూడేళ్లు. తల్లి కోసం రైలు పట్టాలు దాటి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఇంతలో ఓ రైలు వచ్చింది. దాని వేగం ధాటికి బాలుడు అదుపుతప్పి పట్టాల పక్కన రాళ్లపై పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని గోగులదిన్నె ఎస్సీ కాలనీ సమీపంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే మురికపూడి నాగయ్య, నాగమ్మ దంపతులకు జాయ్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి బహిర్భూమి కోసం కాలనీకి సమీపంలోని రైలు పట్టాలు దాటుకుని అవతలి వైపునకు వెళ్లింది. కుమారుడు జాయ్ ఏడ్చుకుంటూ తల్లి కోసం రైలు పట్టాల వద్దకు వచ్చి ఆగాడు. ఇంతలో ఓ గూడ్స్ రైలు వేగంగా వెళ్లింది. ఆ గాలి ధాటికి రైలు పట్టాల పక్కన ఉన్న బాలుడు అదుపుతప్పి కిందపడ్డాడు. కింద పెద్దపెత్త కంకర రాళ్లు ఉండటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు పలకల పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పటి వరకూ ఆడుతూ చలాకీగా నవ్వుతూ ఉన్న జాయ్ ఉన్నట్టుండి మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
ఎల్కతుర్తి: నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామేర గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మద్దిసిరి(3) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులెవరు గుర్తించకపోవడంతో.. నీట మునిగి మృతిచెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. -
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక చిన్నారి మృతి చెందింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మోక్షశ్రీ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, మరో 11మంది చిన్నారులు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా ఐదుగురు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందినవారు. swine flu, child died, gandhi hospital, స్వైన్ ఫ్లూ, చిన్నారి మృతి, -
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి
-
సిరిసిల్ల జిల్లాలో విషాదం
రుద్రంగి: సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారితో కలిసి బావి వద్దకు వెళ్లిన ఓ తల్లి విద్యుదాఘాతానికి గురవడంతో ఆమె చేతిలో ఉన్న చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని రుద్రంగి మండలకేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఎర్రం సృజన తన రెండేళ్ల చిన్నారి నేతిశ్రీతో కలిసి ఈ రోజు ఉదయం బావి వద్దకు వెళ్లింది. బావి వద్ద విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలింది. దీంతో చేతిలో ఉన్న నేతిశ్రీ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
స్వైన్‌ఫ్లూతో మరో చిన్నారి మృతి
-
స్వైన్‌ఫ్లూతో మరో చిన్నారి మృతి
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూతో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జములపేటకు చెందిన పది నెలల చిన్నారి ఈనెల 20వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న చిన్నారి 26వ తేదీ రాత్రి చనిపోయింది. ఇదిలా ఉండగా, చార్మినార్ ప్రాంతానికి చెందిన పది నెలల వయస్సు బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. దీంతో గాంధీలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 12 కు చేరింది. -
నీటి సంపులో పడి చిన్నారి
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలో విషాద సంఘటన వెలుగు చూసింది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతిచెందాడు. చండూరుకు చెందిన యాదయ్య, యాదమ్మ దంపతులు సంక్రాంతి పండుగకు దేవరకొండ హనుమాన్‌నగర్‌లోని అత్తగారింటికి వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంత పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో యాదయ్య యాదమ్మ దంపతుల రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడ్డాడు. ఎవరు గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
చిన్నారిని మింగిన చెరువు
కొత్తూరు: ఉదయం వరకు ముద్దు ముద్దు మాటలతో పలకరించిన చిన్నారి సాయంత్రానికి శాశ్వతంగా వదిలి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కంటికీ మిం టికీ ఏకధారగా ఏడుస్తున్నారు. అంతకుముందు రోజు వరకు తమ కంటి ముందరే ఆడుకున్న చిన్నారి కదలకుండా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చిన్న దెబ్బకే తట్టుకోలేని ఆ శరీరం చెరువులో ఊపిరాడక ఎంత అవస్థ పడిందోనని అ మ్మానాన్నలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారులను సంరక్షించాల్సిన అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ ఆశల దీపం ఆరిపోయిందని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు మండలంలోని పారాపురం గ్రామంలో అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి చెరువులో పడి చనిపోయిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. గ్రా మంలోని కుంచాల జోగారావు, అ నసూయ దంపతుల చిన్న కు మార్తె భార్గవిని నానమ్మ అప్పల మ్మ ఎప్పటిలాగానే సోమవారం అంగన్వాడీకి తీసుకొచ్చారు. మ ధ్యాహ్నం 12.30 గంటలకు కేం ద్రంలో భోజనాలు పెట్టారు. త ర్వాత కార్యకర్త జలజాక్షి, హెల్ప ర్లు భోజనం చేస్తుండగా భార్గవి పాస్‌కు వెళ్తానని చెప్పి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. చా లా సేపైనా భార్గవి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి కంకర చెరువు వద్ద అక్కడ ఉన్న వారితో వెతికించారు. కానీ చిన్నారి ఆ చూ కీ దొరక్కపోవడంతో ఇంటికి వెళ్లిపోయిందేమోనని అనుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే చిన్నారి ఇంకా ఇం టికి రాకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు అంగన్వాడీ వద్దకు వ చ్చి చెరువులో దిగి వెతికారు. కాసేపటి తర్వాత చెరువు అ డుగు భాగంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. ఈ దృశ్యాన్ని చూసిన తల్లి అనసూయతో పాటు బంధువులు భోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంగన్వాడీ కార్యకర్త, ఆయాల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చెరువులో పడి చనిపోయిందని వారు ఆరోపించా రు. ఈ మేరకు చిన్నారి తండ్రి జో గారావు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది మాత్రం తాము భోజనం చేస్తుండగా భార్గవి బయటకు వె ళ్లిందని, తాము కూడా వెతికామని చెబుతున్నారు. -
చలిమంటలో పడి చిన్నారి మృతి
వరంగల్: దురదృష్టవశాత్తూ చలిమంటలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామశివారు వడ్డెరగూడెంలో జరిగింది. తల్లిదండ్రులతో కలిసి ఇంటి వద్ద చలి మంట కాచుకుంటున్న సుర వర్షిణి ప్రమాదవశాత్తు మంటలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
నిద్రిస్తున్నపిల్లలపైకి దూసుకెళ్లిన వాహనం
సత్తెనపల్లి: కాంక్రీట్ మిక్చర్ కలిపే వాహనం కిందపడి ఓ చిన్నారి మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక అచ్చంపేట రైల్వేగేట్ వద్ద నూతనంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్కడ పని చేయడానికి వచ్చిన కూలీలు తమ పిల్లలను పక్కనే ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. ఈ పనుల్లో భాగంగా సిమెంట్ మిక్చర్ వాహనం రివర్స్ తీస్తూ నిద్రిస్తున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శరత్ అనే మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన అక్కడి కూలీలు గాయాల పాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి
నందిగామ: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ఉన్న దంపతుల చేతిలో నుంచి మూడేళ్ల పాప కిందపడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు చిన్నారి పై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. నందిగామ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారి చేతిలో ఉన్న పాప రోడ్డుపై పడిపోయింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది గమనించకపోవడంతో.. చిన్నారి పై నుంచి బస్సు వెళ్లింది దీంతో చిన్నారి మృతిచెందింది. -
స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి
నందిపేట: స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి శృతిక(2) ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో స్థానిక పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సు కిందకు వెళ్లింది. ఇది గుర్తించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి మృతి చెందింది. -
విజృంభిస్తున్న జ్వరాలు
జిల్లాలో పిట్టల్లా రాలుతున్న ప్రజలు డెంగీతో ఒక చిన్నారి, మలేరియాతో మహిళ మృతి అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నా.. వైద్య శాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా చర్యలు కనిపించడం లేదు. తాజాగా డెంగీతో బాధపడుతూ ఒక చిన్నారి, ఓ మహిళ మృతి చెందారు. ప్రొద్దుటూరు టౌన్: జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఆస్పత్రి చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నా.. అధికారుల్లో చలనం కనిపించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా నాగేంద్రనగర్‌కు చెందిన 8 నెలల చిన్నారి ఎన్ నిపున్‌రెడ్డి డెంగీ జ్వరంతో కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు చిన్నారులతో పాటు పట్టణానికి చెందిన 15 మంది డెంగీతో బాధపడుతూ కర్నూలులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా మరణంతో ప్రొద్దుటూరు పట్టణంలో డెంగీ, విషజ్వరాలతో మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. వారం నుంచి చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది నాగేంద్రనగర్‌కు చెందిన శివమోహన్‌రెడ్డి, అరుణ దంపతుల సంతానం నిపున్‌రెడ్డి(8 నెలల). బాలుడికి ఈ నెల 12న జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రక్తకణాలు రోజు రోజుకు తగ్గి పోవడంతో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదటి రోజు 90 వేలు ఉన్న రక్త కణాలు ఒక్క సారిగా 30 వేలకు పడిపోయాయి. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చికిత్స విఫలమై సోమవారం రాత్రి మృతి చెందాడు. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గతేడాది నాగేంద్రనగర్‌లో ఐదుగురు మృతి పట్టణంలో గత ఏడాది మొట్టమొదటి డెంగీ మరణం సంభవించింది నాగేంద్రనగర్‌లోనే. అప్పుడు అయిదుగురు ఈ ప్రాంత వాసులు డెంగీ, విషజ్వరాలతో మరణించారు. ఈ ప్రాంతంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి
కుల్కచర్ల : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం బండవెలితిచర్లలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇంకుడు గుంతలో పడి భీముడు(3) అనే చిన్నారి మృతి చెందాడు. తోటిపిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
సత్తుపల్లి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఎం. జయవర్ధన్(3) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిపోయాడు. తల్లిదండ్రులు గమనించక పోవడంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
బిక్కబోలు: అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ కు గురై చనిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు గ్రామానికి చెందిన నానిబాబు(3) సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి తల్లితో కలసి వెళ్లాడు. అయితే, తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్న నాని బాబు సమీపంలో తెగిపడి కిందికి వేలాడుతున్న కరెంటు తీగలను తాకాడు. విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
వైద్యం వికటించి చిన్నారి మృతి
వైద్యం వికటించి చిన్నారి మృతి చెందడంతో.. బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ చిన్నారి ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు దగ్గర్లొ ఉన్న దివ్య చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. వైద్యం వికటించడం వల్లే చిన్నారి మృతిచెందిందని ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చచెపుతున్నారు. -
పసి ప్రాణం ఖరీదు 5 లక్షలు!
♦ వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి ♦ మృతుడి తల్లిదండ్రుల ఆరోపణ ♦ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయింపు సంగారెడ్డి టౌన్: డబ్బు కోసం పసివాడి ప్రాణాలతో వైద్యులు ఆడుకున్నారు. ఇదేమని అడిగదితే రూ.5 లక్షల వెలకట్టారంటూ బాధితులు బోరున విలపించారు. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం తొగర్పల్లికి చెందిన బీ రాజు, లావణ్య దంపతుల కుమారుడు వర్శిత్ (6) వాంతులు చేసుకుంటుండటంతో గురువారం గాయత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ చక్రపాణి బాబును పరిశీలించి చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత హడావుడిగా అంబులెన్సును పిలిపించి, బాబుకు ఆక్సిజన్ పెట్టి హైదరాబాదుకు తీసుకెళ్లాలని చెప్పారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి డాక్టర్లు పరిశీలించి బాబు మృతిచెంది చాలా సేపైనట్టు వెల్లడించారు. డాక్టర్ చక్రపాణి నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడంటూ బాధితులు చిన్నారి మృతదేహంతో గాయత్రి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ముందే చికిత్స తమ వల్ల కాదని చెప్పి ఉంటే వేరే చోటకు తీసుకెళ్లే వారమని చిన్నారి బాబాయి శ్రీనివాస్ విలపించారు. తన అన్నకు ఈఎస్ఐ కార్డు ఉండటంతో డబ్బులు గుంజేందుకే వైద్యం చేస్తున్నట్టు నటించారని, ఇదేమని అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఎదురుదాడికి దిగారని ఆయన ఆరోపించారు. కాగా, ఆసుపత్రి నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ కుమార్‌రాజ చిన్నారి ప్రాణానికి పరిహారంగా రూ.5 లక్షలిస్తామని బేరమాడారని బాధితులు ఆరోపించారు. కోర్టుకెళ్లండి: డాక్టర్ చక్రపాణి బాబుకు మెదడు వాపు వ్యాధి ఉందని, ప్రాథమిక చికిత్స అందించి ఆపై హైదరాబాదు తీసుకెళ్లాలని చెప్పామని గాయత్రి చిల్డ్రన్ నర్సింగ్ హోమ్ వైద్యుడు చక్రపాణి చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లే సరికి బాబు ప్రాణాలతోనే ఉన్నాడన్నారు. బాధితులు కోర్టుకెళ్లాలని, కోర్టు తీర్పు ప్రకారం పరిహారం చెల్లిస్తామని అన్నారు. -
చెరువులో పడి బాలుడి మృతి
పాలకుర్తి: వరంగల్ జిల్లాలో చెరువులో దిగి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పాలకుర్తికు చెందిన మామిళ్ల రాజేష్ (8) తన స్నేహితులతో కలసి మండల కేంద్రంలోని చెరువులోకి దిగాడు. రాజేష్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. భయంతో స్నేహితులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ప్రమాద విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. దీంతో రాజేష్ కోసం తల్లి లక్ష్మి రాత్రంతా వెతికింది. సోమవారం ఉదయం చెరువులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. రాజేష్ తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
ఎండలకు గుండెపోటుతో చిన్నారి మృతి!
సాధారణంగా ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చిందంటే వాళ్ల వయసు కనీసం 40 ఏళ్లు దాటి ఉంటుందని అనుకుంటాం కదూ.. కానీ, మహారాష్ట్రలో 12 ఏళ్ల అమ్మాయి హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది! అది కూడా ఎండ కారణంగానే. తన స్వగ్రామంలో ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న నీటి పంపు వద్దకు నీళ్లు వస్తాయేమో, పట్టుకుందామని యోగితా దేశాయ్ (12) ఐదుసార్లు అటూ ఇటూ తిరిగింది. గత కొన్ని రోజులుగా ఆమె డిసెంట్రీతో బాధపడుతోంది. అయినా, ఆమెనే నీళ్లు పట్టుకుని రమ్మని పంపారు. చివరకు ఐదోసారి వెళ్లినప్పుడు.. పంపు దగ్గరే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్తే.. ఆమె గుండెపోటు, డీహైడ్రేషన్ కారణంగా మరణించినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో గత మూడేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా నమోదైంది. -
కవలలను బావిలో పడేసి తల్లి ఆత్మహత్యాయత్నం
ఇద్దరు పిల్లలు మృతి, తల్లికి గాయాలు కామారెడ్డి: ప్రేమించి పెళ్లాడిన భర్త మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు ఇద్దరు కవలలను బావిలో పడేసి తనూ దూకింది. పిల్లలిద్దరూ చనిపోగా, తల్లి గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఆదివారం జరిగింది. గర్గుల్‌కు చెందిన రజిత(25), బొంబోతుల మహేశ్ గౌడ్ ఐదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల వయస్సున్న కవలలు కీర్తన, కౌశిక్ ఉన్నారు. మహేశ్‌గౌడ్ కామారెడ్డిలోని మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రజిత ఆదివారం ఉదయం ఇంట్లోని చేదబావిలో కవల పిల్లలను పడేసి, తానూ దూకింది. చుట్టుపక్కలవారు వచ్చి వారిని బయటకు తీయగా చిన్నారులు అప్పటికే శవాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రజితను ఆస్పత్రికి తరలించారు. -
మురికికాల్వలో పడి చిన్నారి మృతి
తాండూరు: పారాడుతూ వెళ్లిన ఓ పసివాడు మురికి కాల్వలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు ఇంట్లో సందడి చేసిన చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన తల్లి ఇంటి చుట్టూ వెతకగా మురికి కాల్వలో శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణం మల్రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగతుర్తి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిహర్ష(2) అనే చిన్నారి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నాగార్జున సాగర్ నుంచి మిర్యాలగూడకు ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమద్యంలో తుంగతుర్తి వద్ద లారీ ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ సంఘటనలో సాయిహర్ష అక్కడికక్కడే మృతి చెందగా తన తల్లిదండ్రులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా.. అంటూ వెంటపడి..!
పాతపట్నం: ఊరెళ్లడానికి బయలుదేరిన తల్లి వెంట అమ్మా అమ్మా అంటూ వచ్చిన చిన్నారి హఠాత్తుగా బస్సుకింద పడి నలిగిపోయింది. అప్పటికే బస్సు ఎక్కిన ఆ కన్నతల్లితోపాటు డ్రైవర్ కూడా ఆ చిన్నారి రాకను గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. మండలంలోని తెంబూరు గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణోదయ ప్రయివేట్ బస్సు కింద పడి ఆదే గ్రామానికి చెందిన తృను కృష్ణారావు, తులసీ మొదటి సంతానమైన తృను రేష్మ(3) మృతి చెందింది. పర్లాకిమిడి నుంచి తెంబూరు మీదుగా టెక్కలి వెళ్తున్న అరుణోదయ ప్రయివేట్ బస్సు తెంబూరు కండ్రవీధి ఆగగా, రేష్మ తల్లి తులసి వారి కన్న వారింటికి టెక్కలి వెళ్లడానికి బయలుదేరింది. రోడ్డు ఇంటికి దగ్గరగా ఉండడంతో పాప పరుగెత్తి వచ్చింది. తల్లి బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి అమ్మా అమ్మా అంటూ.. ఏడ్చుకుంటూ వచ్చింది. అలా ఏడ్చుకుంటూ పరుగున వచ్చిన రేష్మ బస్సు కింద పడిపోయినా డ్రైవర్ కూడా గమనించకపోవడంతో చక్రాల కింద నలిచి విగతజీవిగా మారింది. కృష్ణారావు, తులసీలకు ఇద్దరు కుమార్తెలు కాగా, అందులో పెద్దమ్మాయి రేష్మ. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు హెచ్‌సీ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం కింద పడి బాలుడి మృతి
కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో శనివారం ఓ బాలుడు మృతిచెందాడు. కుల్కచర్ల మండలం ఘన్పూర్ గ్రామంలో తుఫాను వాహనం కింద పడి శివానంద్(2) ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ఆవరణలో ఉన్న తుఫాను వాహనం ముందు చిన్నారి ఆడుకుంటున్నాడు. ఇది గమనించని అతడి పెద్దనాన్న రాములు తుఫాను వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో శివానంద్ వాహనం టైర్ కిందపడి మరణించాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
అయ్యో పాపం..
కోతులకు భయపడి పరుగులు.. రెండేళ్ల చిన్నారి మృతి ఏన్కూరు: కోతుల గుంపునకు భయపడి పిల్లలు పరుగులు తీసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అరికాయలపాడులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెజవాడ సుధాకర్ రెండో కుమార్తె జస్విక(2) ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఈ చిన్నారికి సమీపంలో వీధిలో మరికొందరు పిల్లలు ఆడుకుంటున్నా రు. ఈలోగా ఓ కోతులు గుంపు అటువైపు రావడంతో పిల్లలు భయపడి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న జస్వికకు ఓ చిన్నారి బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కిందపడి కుప్పకూలింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. వెంటనే ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. జస్విక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
కుక్కల దాడి: రెండేళ్ల చిన్నారి మృతి
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుల్లయ్య కుమార్తె అనన్య(2) గురువారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం సమయానికి ఆమె గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె శరీరంపై గాట్లు ఉండటంతో గ్రామంలో తిరుగుతున్న కుక్కలే ఆమెను ఈడ్చుకెళ్లి చంపి ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
నీళ్ల తొట్టిలో పడి చిన్నారి మృతి
డోర్నకల్: ఆడుకుంటూ నీళ్ల తొట్టి వద్దకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిరుకోడు పంచాయతీ జర్పుల తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన జాటోతు లక్ష్మణ్, సత్యవతి కుమారుడు సాయిరాం(3) బుధవారం ఉదయం నీటి తొట్టి వద్ద ఆడుకుంటున్నాడు. అందులో ఉన్న చిన్న బకెట్‌ను అందుకునే ప్రయత్నంలో నీటి పడిపోయాడు. కుటుంబసభ్యులు గమనించి, బయటకు తీసేసరికే చిన్నాని ప్రాణాలు కోల్పోయాడు. -
వేడినీటిలో పడి చిన్నారి మృతి
మోత్కూరు: ప్రమాదవశాత్తు వేడినీటిలో పడిన చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉండే పుట్టూరి విక్రం, వసంత దంపతుల కుమార్తె వైష్ణవి(4). ఆదివారం సాయంత్రం విక్రం స్నానం చేసేందుకు వేడి నీటి బకెట్‌తో బాత్రూంకు వెళ్లాడు. దానిని అక్కడే ఉంచి చల్లని నీటి కోసం సంప్ దగ్గరకు వచ్చాడు. తండ్రి వెనుకే వెళ్లిన వైష్ణవి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందింది. -
అమ్మా.. ఎందుకిలా చేశావ్..?
అనంతపురం: కాన్పు కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ మగబిడ్డకు జన్మనివ్వగానే శిశువును అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయింది. దీంతో శిశువును ఎవరికి అప్పగించాలో తెలియక ఆస్పత్రి వర్గాలు సతమతమవుతుండగానే శ్వాస అందక కళ్లు కూడా తెరవని పసికందు శాశ్వతంగా కన్నుమూశాడు. మంజుల అనే మహిళ తన తల్లిని వెంటబెట్టుకుని కడుపునొప్పి అంటూ మంగళవారం రాత్రి 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది. డ్యూటీ వైద్యులు పరీక్షించి ఏడు నెలల గర్భవతి అని చెప్పి ప్రసూతి వార్డుకు పంపారు. అక్కడ అరగంటకే పురిటినొప్పులు రావడంతో ఆమె మగ బిడ్డను ప్రసవించింది. అదే రోజు రాత్రి 10 గంటలకు సాధారణ ప్రసవం కావడంతో ఇంటికి వెళ్లి దుస్తులు తెమ్మని తన తల్లికి మంజుల చెప్పింది. అలా తల్లిని సాగనంపుతూ వార్డు బయటకు వచ్చిన మంజుల తల్లితో పాటూ ఎటో వెళ్లిపోయింది. వారు ఎంతసేపటికీ రాకపోయేసరికి ఆస్పత్రి వర్గాలు కంగారుపడ్డాయి. బుధవారం ఉదయం విచారణ జరిపించారు. ఆస్పత్రి రికార్డులో కదిరి సమీపంలోని కుమ్మరవాండ్లపల్లి అని, తన భర్త రాజేష్ అని రాయించడంతో వైద్యసిబ్బంది ద్వారా అక్కడ కూడా విచారణ చేపట్టారు. అయితే మంజుల అనే ఆమె ఎవరూ లేదని తేలడంతో చిరునామా తెలియక సతమతమయ్యారు. సాధారణంగా 2.25 కిలోల బరువు ఉండాల్సి ఉండగా శిశువు కేవ లం 1.5 కిలోల బరువు ఉన్నట్లు హెడ్నర్స్ వసలాదేవి తెలిపారు. శిశువుకు పాల కోసం బత్తలపల్లి ఆర్డీటీ లేదా, అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని నిర్ణయించామన్నా రు. మరోవైపు చైల్డ్‌లైన్ వారు కూడా వచ్చి వీలైతే శిశువును తమ సంరక్షణలో ఉంచుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆలోగానే శ్వాస అందక శిశువు మృతి చెందాడు. -
కేజీహెచ్‌లో చిన్నారి మృతి
దాబాగార్డెన్స్: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసిపాప బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గురువారం వెలుగు చూసింది. విజయనగరానికి చెందిన దంపతులకు గత నెల 4 న ఆడబిడ్డ పుట్టింది. అనంతరం పాపకు ఇన్ఫెక్షన్ సోకడంతో కేజీహెచ్‌లోని పిల్లల వార్డుకు తరలించారు. అప్పటినుంచి అక్కడే ఉండి చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం కన్నుమూసింది. కాగా.. రక్తం ఎక్కించడానికి సిద్ధం చేసిన నర్సులు ఆ తర్వాత రక్తం ఎక్కుతుందా లేదా అనే విషయాన్ని గమనించ లేదని, అందువల్లే పాప మతిచెందినట్లు తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు. -
కరెంటు షాక్‌తో చిన్నారి మృతి
-
ఆర్టీసీ బస్సు ఢీ : బాలుడి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ చిన్నారి మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన సాయి(13), శ్రవణ్(14) అనే ఇద్దరు స్నేహితులు సైకిల్‌పై వెళ్తుండగా.. కొత్తగూడెం నుంచి తళ్లాడ వైపు వెళ్తున్న మధిర డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రవణ్ తీవ్రంగా గాయాపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్రవణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఆడశిశువు మృతదేహం లభ్యం
హైదరాబాద్‌సిటీ: లంగర్‌హౌస్‌పరిధిలోని మొగలినగర్ చౌరస్తా వద్ద ఆడశిశువు మృతదేహం గురువారం లభ్యమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల శిశువును గొంతు నులిమి చంపివేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో చిన్నారి దుర్మరణం
చిలకలూరిపేట: గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిగా... ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోటప్పకొండ సమీపంలో ఈటీ వద్ద ఆటోను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకి చెందిన సమీరా బేగం అనే ఆరేళ్ల పాప చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని బాలుడి మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాండ్రంగి నితీష్(3) ఇంటి ముందు ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదుట ఆడుకుంటున్న సమయంలో గోస్తని నది నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో నితీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారి మృతి: ఆస్పత్రి ఎదుట ఆందోళన
-
చిన్నారి మృతి: ఆస్పత్రి ఎదుట ఆందోళన
కదిరి: అనంతపురం జిల్లాలో చిన్నారి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి చెందిన రఘునాథ్గుప్తా, సుమతి దంపతుల కుమార్తె హిమబిందు(3)కు జ్వరం రావటంతో రెండు రోజుల క్రితం స్థానిక పద్మావతి ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, జ్వరం తగ్గడంతో గురువారం రాత్రి బాలికను డిశ్చార్జి చేశారు. అయితే, శుక్రవారం తెల్లవారు జామున ఒక్కసారిగా జ్వరం పెరిగిపోవటంతో ఆస్పత్రికి ఫోన్ చేశారు. అయితే, ఆ సమయంలో నర్సులెవరూ లేరని, ఆస్పత్రిలో సెలైన్ బాటిళ్లు కూడా అయిపోయాయని డాక్టర్ మారుతీవరప్రసాద్ తెలిపారు. కొద్దిసేపటికే హిమబిందు చనిపోయింది. దీంతో బాధితులు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం 205వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఇరువర్గాల వారితో పోలీసులు సంప్రదింపులు జరిపి ఆందోళణను శాంతింపజేశారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
వికారాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని కొత్తగడిలో జరిగింది. కాలనీకి చెందిన శ్రావణి(8) అనే చిన్నారి ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న ఆటో శ్రావణిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మృతితో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. -
దారుణం!
♦ కాలికి గాయమై ఏడుస్తున్న కుమార్తెను గోడకేసి కొట్టిన పెంపుడు తండ్రి.. తీవ్రంగా గాయపడి చిన్నారి మృతి.. ♦ మైలార్‌దేవ్‌పల్లిలో మూగ, చెవిటి చిన్నారిపై క్రూరత్వం హైదరాబాద్: ఆ చిన్నారికి పుట్టుకతో మాటలు రావు.. వినికిడి శక్తి లేదు.. ప్రమాదవశాత్తు గాయపడి నడవలేని స్థితిలో ఉంది. అలాంటి చిన్నారి ఆలనాపాలనా చూడాల్సిన తండ్రి.. కాలయముడిగా మారి గోడకు కొట్టి చంపాడు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జయమ్మకు కుమార్తె లక్ష్మి(3) ఉంది. భర్త మృతి చెందడంతో బసవరాజు(38)ను జయమ్మ రెండో వివాహం చేసుకుంది. బసవరాజుకు కూడా ఇది రెండో వివాహమే. కొంతకాలంగా మైలార్‌దేవ్‌పల్లిలో నివసిస్తున్నారు. కాగా, 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు లక్ష్మి డ్రైనేజీలో పడి కాలికి తీవ్ర గాయమైంది. తాగుడుకు బానిసలైన జయమ్మ, బసవరాజు ఉదయం పని చేసుకొని రాత్రిళ్లు తాగి ఇంటికి వచ్చేవారు. దీంతో లక్ష్మి.. తన బాధను తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోయింది. శుక్రవారం రాత్రి లక్ష్మి ఏడుపులకు విసిగిపోయిన బసవరాజు చిన్నారిని గోడకు వేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారు. చిన్నారి కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు హుటాహుటిన లక్ష్మిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు జయమ్మ, బసవరాజులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. -
స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి
స్కూల్ బస్ ఒక చిన్నారిని చిదిమేసింది. నల్లగొండ జిల్లా దేవర కొండ మండలం చింతపల్లిలో శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొనడంతో.. యూకేజీ చదువుతున్న కావేరి అనే చిన్నారి మరణించింది. చింతపల్లి మజరా చాకలి చెరువు పల్లికి చెందిన ఈ చిన్నారి.. రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన స్కూల్ బస్ ఢీ కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ ఉదయం స్కూల్ కి వెళ్లిన చిన్నారి.. విగత జీవిగా మారడంతో కావేరి కుటుంబంలో విషాదం అలముకుంది. -
ప్రబలుతున్న డెంగ్యూ....బాలుడి మృతి
వైఎస్సార్ జిల్లా: డెంగ్యూ వ్యాధితో వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఓ బాలుడు మృతి చెందాడు. రాజుపాలెం మండలం వెంగళాయపల్లె గ్రామానికి చెందిన శరత్‌కుమార్ రెడ్డి(12) డెంగ్యూతో బాధపడుతున్నాడు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యంలో నంద్యాల వద్ద మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
సంపులో పడి బాలుడి మృతి
గచ్చిబౌలి: ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికంగా అంజయ్య నగర్లో నివాసం ఉంటే రంగస్వామి, సుజాత దంపతుల కుమారుడు చందు (5) సోమవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని కోసం తల్లిదండ్రులు రాత్రంతా వెతికినా కనిపించలేదు. మంగళవారం ఉదయం వారు నివాసం ఉండే వీధిలోనే ఓ ఇంటి సంపులో చందు మృతదేహం బయటపడింది. స్థానికులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిచడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. -
బకెట్లో పడి చిన్నారి మృతి
దుగ్గిరాల: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ బకెట్లో పడి మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపుడి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన దాసరి మహేష్, రోజా కుమారి దంపతులు వ్యవసాయ కూలీలు. ఈ క్రమంలో తమ రెండేళ్ల చిన్నారి పార్వతిని అమ్మమ్మ వద్ద వదిలి వాళ్లు పనికి వెళ్లారు. ఆమ్మమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్లో పడింది. అది గుర్తించేలోపల చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బాలిక బలి
గుంతలో పడి చిన్నారి మృతి మర్రిపాడు : రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఓ బాలిక బలైపోయింది. మండలంలోని ఈర్లపాడులో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఈర్లపాడు నుంచి సన్నువారిపల్లి వరకు నూతనంగా రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి కోసం ఈర్లపాడు సమీపంలో మట్టి కోసం భారీ స్థాయిలో గుంతలు తవ్వేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గోతం సుబ్బారావు, సుభాషిణి కుమార్తె సుచరిత (8) తోటి పిల్లలతో కలిసి శుక్రవారం ఆటలాడుకుంటూ ఆ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. తోటి చిన్నారులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి
కరీంనగర్: ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. దీంతో బాధితులు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లి, బిడ్డ మృతి చెందారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మానుకోట శివారు ఎల్బీజీ నగర్ కాలనీలో బుధవారం 16 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్లో పడి మృతి చెందింది. కాలనీకి చెందిన బానోత్ నరేష్- పద్మ రెండో కూతురు బిందు (16 నెలలు) బుధవారం ఉదయమే ఇంటి ఆవరణలో ఉన్న నీళ్ల బకెట్ వద్ద ఆడుకుంది. తల నీళ్లలో పెట్టి చూడటంతో ప్రమాదవశాత్తు తలకిందులై అందులో పడిపోరుుంది. అప్పటికే బహిర్భూమికని వెళ్లిన తల్లి పద్మ వచ్చి చూసేసరికి బిందు బకెట్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. -
పందుల దాడిలో చిన్నారి మృతి
మహబూబ్ నగర్(దేవరకద్ర): పందులు దాడి చేయడంతో ఓ పసికందు దుర్మరణం చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..నర్సింహులు, కుర్మమ్మలు దంపతులు. వీరికి ఐదుగురు సంతానం. కాగా నాలుగు నెలల కిందట నర్సింహులు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం చెందాడు. దీంతో ఇంటి వాస్తులో దోషం ఉందని ఇంటి ఆవరణలోనే ఓ గుడెస వేసుకుని ఉంటున్నారు. అయితే ఐదు నెలలు వయస్సు ఉన్న పసికందును ఊయలలో వేసి తల్లి కుర్మమ్మ బయటకు వెళ్లింది. ఆ సమయంలో పందులు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
♦ ఉసురు తీసిన కుటుంబ కలహాలు ♦ పాలల్లో విషం.. తండ్రి ఆరోపణ ♦ చిన్నారి అనుమానాస్పద మృతి వేల్పనూరు(వెలుగోడు) : కుటుంబ కలహాలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. వేల్పనూరు గ్రామానికి చెందిన రొడ్డా సుధాకర్, దేవీశ్వరి దేవి దంపతులకు 12 నెలల గురుసంపత్ సంతానం. సుధాకర్‌కు ఇద్దరు సోదరులు కాగా.. పెద్ద అన్న గడివేములలో ముఠాయిల దుకాణం నిర్వహిస్తున్నాడు. రెండో సోదరుడు నాగేశ్వరరావు అతని భార్య జయమ్మలు సుధాకర్‌తో కలిసి ఇకే ఇంట్లో ఉంటున్నారు. రెండు కుటుంబాలు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాయి. కాగా మంగళవారం కుటుంబ సభ్యుల మధ్య పొలం విషయంలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్ తనయుడు గురుసంపత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే విష ప్రయోగం జరిగిన పాలు తాగడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్ఐ మల్లికార్జునలు వేల్పనూరు చేరుకుని చిన్నారి మృతిపై విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
ఎన్కేపల్లిలో విషాదం పూడూరు: విద్యుదాఘాతంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పంచాయతీ అధికారుల నిర్ణక్ష్యం చిన్నారిని బలితీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన పి రఘుపతి,అలవేలు దంపతులకు చందన(5), అనంతసాయి(2 సంవత్సరాల 6నెలలు) అనే చిన్నారులు ఉన్నారు. మంగళవారం ఇద్దరు ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకునేందుకు వె ళ్లారు. పాఠశాల ఆవరణలో తాగునీటి ట్యాంకు పక్కనే గ్రామానికి నీరందించేందుకు స్టార్టర్‌ను ఇనుప స్టాండ్‌కు బిగించారు. చిన్నారి అనంతసాయి అడుకుంటూ స్టార్టర్‌ను బిగించిన ఇనుపస్టాండును పట్టుకోవడంతో షాట్ తగిలింది. అక్కడే ఉన్న అక్క చందన బాలుడిని లాగడంతో షాట్ తగలడంతో అక్కడి ఆమె వెళ్లిపోయింది. గమనించిన చుట్టుపక్కల వారు కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు వె ళ్లిన బాలుడు మృతిచెందడంతో మృతుడి కుటుంబీకులు బోరున విలపించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. స్టార్టర్ వద్ద వైర్లు తేలడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్‌షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు తాండూరు రూరల్: ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...సరగళ్ల బసప్ప కుమారుడు శివప్రసాద్(6) స్థానిక పాఠశాల్లో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో విద్యుత్ బోర్డు వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. -
అడ్డుగా ఉందని..
మాతృమూర్తి సమాజంలో ఉన్నత స్థానం ఉంది. కానీ ఆ మహోన్నత స్థానానికే కలంకం తెచ్చేలా ఓ తల్లి వ్యవహరించింది. తన ‘సుఖానికి’ అడ్డుగా ఉందన్న కారణంతో కడుపునపుట్టిన ముక్కుపచ్చలారని చిన్నారిని ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది.. మూడు నెలల క్రితం నకిరేకల్ పట్టణంలో వెలుగుచూసిన చిన్నారి డులసి హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు.. కన్నతల్లే ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. - ప్రియుడితో కలిసి కూతురినే కడతేర్చిన తల్లి - చిన్నారి డులసి హత్యకేసును ఛేదించిన పోలీసులు - ఫోన్‌కాల్ లిస్ట్ ఆధారంగా వెలుగులోకి - నిందితుల అరెస్ట్.. రిమాండ్ నకిరేకల్ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన సుష్మితకు నకిరేకల్ పట్టణం సంతోష్‌నగర్‌కు చెందిన నిమ్మనగోటి విక్రమ్‌తో 2012 ఆగస్టు 15న వివాహం జరిగింది. దంపతులు ఇద్దరు స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి డులసి (18 నెలలు) సంతానం. ప్రియుడితో ప్రేమాయణం అదే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, సంతోష్‌నగర్‌లోనే నివాసముంటున్న కోట సాయికిరణ్‌తో సుష్మిత ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి విక్రమ్ సుష్మితను పాఠశాల మాన్పించాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఒకనొకదశలో సుష్మిత తన భర్త విక్రమ్‌కు విడాకులు ఇచ్చి సాయికిరణ్‌ను వివాహం చేసుకోవాలనుకుంది. లైన్‌క్లియర్ చేసుకోవాలని.. తనకు విడాకులు కావాలని సుష్మిత భర్తతో పలుమార్లు తగాదా పడింది. అందుకు విక్రమ్ ఒప్పుకోలేదు. దీంతో చిన్నారి డులసిని అంతమొందించి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి పన్నాగం పన్నారు. దీనిలో భాగంగానే గత మార్చి 26వ తేదీన విక్రమ్ పాఠశాలకు వెళ్లగానే సాయికిరణ్‌ను ఇంటికి పిలిచింది. తానే డులసిని నీటి బకెట్లో వేసి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. ఆపై సాయికిరణ్‌తో తలపై కొట్టించుకుని దుండగులు దాడి చేశారని చిత్రీకరించి అందరినీ నమ్మించింది. తన భర్తే దుండగుల చేత చేయించాడని పోలీసులకు తెలిపింది. వెలుగులోకి ఇలా.. సుష్మిత ఫిర్యాదు మేరకు విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే సుష్మిత ప్రేమాయణాన్ని విక్రమ్ పోలీసులకు వివరించడంతో పోలీసులు ఆమె కదలికలపై నిఘా వేశారు. దీంతో పాటు ఆమె సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను విచారించడంతో వారి అనుమానం బలపడింది. సాయికిరణ్‌ను, సుష్మితను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారని సీఐ వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి స్థానిక మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. -
ఊయలే ఉరితాడై..
⇒ ఊయలలోనే ఆగిన చిన్నారి ఊపిరి ⇒ ఊపిరాడక చిన్నారి మృతి ⇒ కోయవాగులో విషాదం కాగజ్‌నగర్ రూరల్ : పిల్లలు సరదాగా ఊగేందుకు చీరతో తయారుచేసిన ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. ఎంతో సంతోషంగా ఊ యలలో ఊగుతున్న ఆ చిన్నారి ప్రాణాలను బ లితీసుకుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఆనందంగా గంతులేస్తూ కలి యదిరిగిన తమ బిడ్డ ఇక లేదని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. కాగజ్‌నగర్ మండలం కోయవాగులో చోటుచేసుకుందీ ఘట న. కోయవాగు గ్రామానికి చెందిన మారిశెట్టి మల్లేష్-సుజాతలకు ఇద్దరు కూతుళ్లు కీర్తన, అక్షయ, కుమారుడు అభినయ్ ఉన్నారు. రెండో కుమార్తె అక్షయ (7) కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తండ్రి ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కం పెనీలో పనిచేస్తున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లి వచ్చిన అక్షర ఇంటి వెనకాల చీరతో తయారు చేసిన ఊయలలో ఊగుతోంది. తల్లి ఇంటి ముందున్న బోరు నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. కూతురు ఊయల ఊగుతూ ఆడుకుంటోందని ఊహించిందే తప్ప ఆ ఊయలే ఉరితాడై బిగుస్తుందని ఆ తల్లి ఊహించలేదు. బోరు నీటిని తీసుకుని ఇంట్లోకి రాగానే కూతురు ఊయలలోనే సృ్పహతప్పి పడిపోయి ఉండడంతో ఒక్కసారి గా చలించిపోయింది. తన కూతురు ప్రాణాలు దక్కిం చుకోవాలని తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో ఆ చిన్నారి ప్రా ణాలు కోల్పోయింది. ఇంట్లో కలియ తిరుగుతూ ఆడు తూ పాడుతూ ఉండే తమ కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
బాల్కనీ పైకప్పు కూలిపడి చిన్నారి మృతి
అనంతపురం : ఆనందంగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఇంటి ముందు బాల్కనీ పై కప్పు కూలిపడి ఒక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగింది. చంద్ర, గీత దంపతులకు ఏకైక సంతానం ప్రవళిక. పోయిన అక్టోబర్ నెలలోనే ఆమె మొదటి పుట్టిన రోజు వేడుకను తల్లిదండ్రులు ఆనందంగా జరిపించారు. ఆదివారం తన ఇంటి సమీపంలోని వేరొక ఇంటి ముందు ప్రవళిక ఆడుకుంటుండగా పైకప్పు ఒక్కసారిగా కూలి పడిపోవడంతో చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో భార్గవి(38) అనే మహిళ కాలికి గాయాలయ్యాయి. (గార్లదిన్నె) -
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి
చిన్నమండెం (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం కేశవాపురం పరిధిలోని రెడ్డివారిపల్లెలో స్వైన్‌ఫ్లూతో ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సింధు(4) జనవరి 14వ తేదీన స్వైన్‌ఫ్లూతో అస్వస్థతకు గురైంది. ఎంతకీ నయం కాకపోవటంతో చెన్నై నగరం ఎగ్మోర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. -
వెంటిలేటర్‌పై రుయా!
రుయా ఆస్పత్రిలో యంత్రాలకు జబ్బు చేసింది. అత్యవసర సేవలు అందడం లేదు. అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా, ఉపయోగించుకోలేని దీనస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఆస్పత్రిలో కోట్ల విలువైన పరికరాలు మూలన పడుతున్నాయి. వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. ఇక్కడి వాతావరణం చూస్తే అసలు అత్యవసర విభాగం ఉన్నా లేనట్టుగా తయారైంది. తిరుపతి కార్పొరేషన్: ‘వైద్యోనారాయణ’గా పేరుగాంచిన రుయాలో విలువైన వైద్య పరికరాలు చూస్తే ఆసుపత్రికి జబ్బు చేసిందా అన్న సందేహం వస్తోంది. అత్యవసర విభాగంలో అడ్మిట్ అవుతున్న వారు, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారు, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం వస్తున్న వారే అధిక భాగం ఉన్నారు. వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఏఎంసీ విభాగంలో ఆర్ఐసీ(రెస్పిరేటరి ఇంటెన్సివ్ కేర్)లో రోగులకు వైద్య సేవలు అంది స్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో దాదాపు 18 వెంటిలేటర్లు మూలన పడ్డాయి. కేవలం రెండు మాత్రమే సేవలందిస్తున్నాయి. అవికూడా తరచూ మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నమ్ముకుని డాక్టర్లు మెరుగైన సేవలు అందించలేక పోతున్నారు. రోగుల సహాయకులు బతిమిలాడితే వేలూరు సీఎంసీకి వెల్లండి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇక అత్యవసర విభాగంలోని ఎక్స్‌రే మిషన్ ఆరు నెలలుగా పనిచేయడం లేదు. యాక్సిడెంట్ కేసుల్లో వచ్చే వారికి ముందుగా ఎక్స్‌రే తీయడం వలన ప్రమాద స్థాయిని గుర్తించి తక్షణ వైద్య సహాయం అందించవచ్చు. ఎక్స్‌రే మిషన్ పనిచే యక పోవడంతో ఆసుపత్రి ప్రధాన భవనంలోని ఎక్స్‌రే భవనానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. కాళ్లు, చేతులు విరిగిన వారు అంతదూరం వెళ్లాలంటే ప్రాణం మీదకొస్తోంది. గాలిలో దీపంలా ప్రాణాలు రూ.5 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేసి వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్న రుయా ఆసుపత్రికి వాటి నిర్వహణ భారంగా మారింది. మరమ్మతులకు గురైన వాటిని సరిచే సేందుకు సాంకేతిక నిపుణులు లేరు. రోజుల తరబడి పరికరాలు మూలనపడ్డంతో అత్యవసర సేవలకు వచ్చే వారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ప్రాణాప్రాయ స్థితిలో రోజూ పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుండ గా వెంటిలేటర్లు లేని కారణంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 29 మంది అత్యవసర సేవల కోసం వస్తే వెంటి లేటర్ లేని కారణంగా 9 మంది మృత్యువాత పడ్డట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చర్చించుకుంటున్నాయి. రుయాలో వెంటిలేటర్లు లేక పోవడంతో రోగులను ఇక్కడి డాక్టర్లే దగ్గరుండి ప్రయివేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీంతో రోగి అవసరాన్ని బట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లలేని పేదవారు వైద్యుల కాళ్లపై పడి ఎలాగైనా బతి కించమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వెంటలేటర్లు పనిచేయడం లేదని, సరే పంప్ ఏర్పాటు చేస్తాం, వాటిని మీరే చేతులతో పంపింగ్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ పద్ధతిలో చేయి ఒక్క క్షణం ఆగినా రోగి ప్రాణాలకే ప్రమాదం. ఇక ఆరోగ్యశ్రీ పేషేంట్ల పరిస్థితి మరీ దారుణం. వీరికి వైద్య సేవలు అందిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వెంటిలేటర్లు పని చేయకున్నా, ముఖానికి పైపులు పెట్టి ఫొటోలు తీసుకుం టూ ‘షో’ చే స్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నాయి. పనిచేయక పోవడం వాస్తవమే... అత్యవసర వార్డుల్లో వెంటిలేటర్లు పనిచేయక పోవడం వాస్తవమే. ఉన్నతాధికారులకు లెటరు రాశాం. ప్రభుత్వం ఐదు వెంటిలేటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాటిని త్వరగా ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభిస్తాం. -డాక్టర్ వీరాస్వామి, సూపరింటెండెంట్, రుయా ఆసుపత్రి, తిరుపతి -
బస్సు కింద పడి చిన్నారి మృతి
-
బలి తీసుకున్న బర్గర్
-
బస్సులోనుంచి జారి పడి బాలుడి మృతి
-
పాలేటిలోపడవ బోల్తా
టంగుటూరు, న్యూస్‌లైన్ : పాలేటిలో పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న ఎనిమిది మంది బాలురు నీట మునగగా వారిలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అనంతవరం పంచాయతీ తాళ్లపాలెంలో ఆదివారం జరగగా సోమవారం వెలుగుచూసింది. టంగుటూరుకు చెందిన ఏడుగురు బాలురు సముద్రం చూసేందుకు తాళ్లపాలెం వెళ్లారు. సముద్రం వద్దకు తోడు రమ్మని వీరంతా తాళ్లపాలేనికి చెందిన బాలుడు నాయుడు గణేశ్(11)ను కోరారు. ఇందుకు అంగీకరించిన గణేశ్.. వారిని పాలేటి మీదుగా నీటిలో నడుచుకుంటూ సముద్రం వద్దకు తీసుకెళ్లాడు. సముద్రం చూసిన అనంతరం తిరిగి వచ్చే సరికి పాలేరు పోటుతో నిండుగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడే ఉన్న ఒక పడవలో వీరంతా ఎక్కారు. మార్గమధ్యంలో నీటి ప్రవాహానికి పడవ అటూ ఇటూ ఒరిగింది. భయంతో బాలురంతా చెల్లాచెదురుగా నీటిలో దూకారు. అందరిలో అరకొర ఈత వచ్చింది గణేశ్‌కే. నీట దూకిన వారంతా భయంతో గణేశ్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కంగారులో అందరికంటే పొట్టిగా ఉన్న గణేశ్ నీట మునిగాడు. వీరి కేకలకు సమీపంలో రొయ్యల చెరువుల వద్ద ఉన్న వారు సంఘటన స్థలానికి పరుగున వచ్చారు. వెంటనే పిల్లలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీట మునిగిన గణేశ్ ఊపిరాడక కన్ను మూశాడు. వీరిని రక్షించడం కాస్త ఆలస్యమై ఉంటే పడవలో ఉన్న ఏడుగురూ ప్రాణాలతో మిగిలేవారు కాదని స్థానికులు చెప్పారు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో తాళ్లపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుని మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు జరిగాయి. -
వైద్య కళాశాల ఆస్పత్రిలో శిశువు మృతి
మొయినాబాద్, న్యూస్‌లైన్: ఓ ప్రైవేట్ వైద్య కళాశాల ఆస్పత్రిలో పుట్టిన కొద్దిసేపటికే ఓ శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదివారం మండల పరిధిలోని అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న భాస్కర వైద్య కళాశాల ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన అవుసుల లావణ్య(25) గర్భం దాల్చినప్పటి నుంచి భాస్కర ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఈనెల 27న కుటుంబీకులు ప్రసవం కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం ఆమెకు నొప్పులు వచ్చాయి. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవమే అవుతుందన్నారు. మధ్యాహ్నం వరకు ప్రసవం కాకపోవడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబసభ్యులు వైద్యులను కోరారు. కచ్చితంగా సాధారణ ప్రసవమే జరుగుతుందని వైద్యులు చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. శనివారం అర్ధరాత్రి మగశిశువు జన్మించాడని, ప్రసవం జరిగిన కొద్దిసేపటికే మృతిచెందాడని వైద్యులు లావణ్య కుటుంబీకులకు చెప్పారు. అదేరాత్రి మృతశిశువును బంధువులకు అప్పగించి ఆస్పత్రి బయటకు పంపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందాడని ఆరోపిస్తూ ఆదివారం లావణ్య కుటుం బీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ప్రసవ సమయం మించిపోవడంతోనే శిశువు మృతి చెంది ఉండొచ్చన్నారు. దీంట్లో వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. ఈనెల 24న లావణ్యకు ప్రసవం జరగాల్సి ఉండగా కుటుంబీకులు 27 తేదీన ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. సహృదయంతో తాము ఆస్పత్రిలో చేర్చుకున్నామని, కుటుంబీకుల ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
చిన్నారిని బలిగొన్న లారీ
తాడేపల్లిగూడెం క్రైం, న్యూస్‌లైన్ : కళ్ల ముందే కన్నకూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. దేవుడు తమకు అన్యాయం చేశాడంటూ వారు రోదించిన తీరు రోడ్డున వెళ్లే వారిని సైతం కదిలించింది. తాడేపల్లిగూడెంలోని తణుకు రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం నీలాద్రిపురానికి చెందిన పొట్ల వెంకట్రావు వ్యవసాయ కూలి. అతని భార్య గంగా భవాని పుట్టినిల్లు తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయపాలెం. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వెంకట్రావు భార్యా,పిల్లలతో బైక్‌పై ఉదయం కృష్ణాయపాలెం వెళ్లారు. అస్వస్థతకు గురైన గంగాభవాని తల్లి పెద్దింట్లమ్మను పరామర్శించి సాయంత్రం నీలాద్రిపురం వెళుతుండగా తాడేపల్లిగూడెం-తణుకు రోడ్డు లోని చెక్‌పోస్టు సమీపంలో పోలీస్ ఐలాండ్ వైపు వెళుతున్న క్వారీ లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నకుమార్తె సుమలత(6) తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో కుమార్తె కల్పనశ్రీతో పాటు వెంకట్రావు, గంగాభవానీలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కల్పనశ్రీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులను కూడా ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై ఆకురాతి అప్పారావు పరిశీలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. -
‘బంగారు తల్లి’ని బలితీసుకుంది
కామారెడ్డి, న్యూస్‌లైన్: ఆడబిడ్డను ఆదుకుంటామంటూ ‘బంగారు తల్లి’ పథకంపై సర్కారు ఇస్తున్న ప్రకటనలు, చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో గాని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు మాత్రం కడుపుకోత మిగిలింది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రచ్చబండ సందర్భంగా జరిగిన తోపులాటలో మూడు నెలల పసికందు మృతిచెందింది. మండలంలోని భవానీపేట తండాకు చెందిన లావుడ్య రాజు-రేణుకలకు మూడేళ్ల పాప మోక్ష ఉంది. చిన్నారిని ‘బంగారు తల్లి’ పథకంలో నమోదు చేయించేందుకు ఆ దంపతులు శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండకు వచ్చారు. అధికారులకు దరఖాస్తులు అందించేందుకు రేణుక చంటిబిడ్డతో పాటు వరుసలో నిలుచుంది. వరుసలో ఒకరినొకరు తోపులాడుకున్న సందర్భంలో రేణుక తన కూతురు మోక్షను కడుపులో దాచుకునే ప్రయత్నం చేసింది. ఊపిరాడని పరిస్థితుల్లో చిన్నారి కండ్లు తేలేయడంతో ఆందోళన చెందిన తల్లి తన కూతురు కదలడం లేదంటూ రోదించింది. వెంటనే 108 అంబులైన్స్‌లో చిన్నారిని కామారెడ్డిలోని చిన్నపిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య సేవలు ప్రారంభించిన కొద్దిసేపటికే మోక్ష కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు కళ్లముందే చనిపోవడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. తోపులాటకు కారణం: రచ్చబండ సభ ముగిసేంత వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించకపోవడంవల్లే తోపులాట జరిగిందని పలువురు ఆరోపించారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించే సమయానికి వందలాది మంది బారులు తీరారని.. మధ్యాహ్నం కావడంతో ఆకలి మంటతో ఉన్న జనం త్వరగా దరఖాస్తులు సమర్పించాలని భావించారని, ఈ క్రమంలో తోపులాట జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. తప్పుదారి పట్టించే యత్నం రచ్చబండ సందర్భంగా జరిగిన తోపులాటలో ఊపిరాడక మృతి చెందిన చిన్నారి మోక్షకు గుండె సంబంధ వ్యాధి ఉందని అధికారులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యులు మాత్రం పాపకు గుండె సంబంధిత సమస్య ఉందని నిర్ధారించలేదు. అధికారులను సస్పెండ్ చేయాలి సాక్షి, హైదరాబాద్: రచ్చబండ సందర్భంగా చిన్నారి మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
అతిసారకు చిన్నారి బలి
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గంటల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరింది. అతిసార రూపంలో మృత్యువు కబళించింది. గ్రామంలో పీరీలు, దోలా ఉత్సవాలు తిలకించి నిద్రలోకి జారుకున్న బాలిక ఆ తర్వాత శాశ్వత నిద్రలోకి చేరింది. ఈ సంఘటన మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో శుక్రవారం విషాదం మిగిల్చింది. తల్లిదండ్రులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మడావి మధుకార్, లలిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, శ్రావణి ఉన్నారు. చిన్న కూతురు శ్రావణి(4) గురువారం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చింది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసింది. గ్రామంలో పీరీలు, దోలా ఉత్సవాలు ఉండడంతో రాత్రి పది గంటలకు వరకు గ్రామస్తులు చేసిన నృత్యాలు చూస్తూ గడిపింది. ఆ తర్వాత నిద్రపోయింది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. తల్లిదండ్రులు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
కామాంధుడి చేతిలో బాలిక బలి
గార్ల, న్యూస్‌లైన్: చట్టాలు చట్టుబండలవుతున్నాయి. కామాంధుడి దాష్టీకానికి మరో బాలిక బలైంది. గార్ల మండలం తిర్లాపురంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్యా వీరన్న కూతురు కిరణ్మయి(14) ఖమ్మంలోని ఎస్టీ బాలికల వసతిగృహంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ఈనెల 18న తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా.. ఆ బాలిక ఒంటరిగా ఇంటివద్ద ఉంది. ఇది గమనించి అదే గ్రామానికి చెందిన లావుడ్యా బాబూరావు లైంగికదాడికి యత్నించాడు. కిరణ్మయి ఎదురుతిరగడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రం గా గాయపడిన బాలికను బంధువులు ఖమ్మం తరలించగా చికిత్సపొందుతూ ఆది వారం అర్ధరాత్రి మృతి చెందింది. నిందితుడిపై ‘నిర్భయ’, హత్యానేరం కేసులు నమోదు చేశారు. సెలవులకు రాకున్నా బాగుండేదే... ‘మాయదారి పండుగ మా ఇంటి ఆడబిడ్డను కానరాకుండా చేసింది. సెలవులు రాకుంటే మా బిడ్డ ఖమ్మంలోనే ఉండేది..’ అంటూ కిరణ్మయి తల్లి శారద విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తన కూతురుకు అప్పుడే నూరేళ్లు నిండాయంటూ తండ్రి వీరన్న భోరున విలపించాడు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రుల రోదనల మధ్య సాయంత్రం బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్సై యాకూబ్‌పాషా ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని కాల్చిచంపాలి... మహిళా సంఘాల డిమాండ్ ఖమ్మం మయూరిసెంటర్ : అభం శుభం తెలియని బాలికపై లైంగికదాడికి యత్నించి.. ఎదురుతిరిగిందనే కోపంతో కిరోసిన్ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారణమైన నిందితుడిని కాల్చి చంపాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఖమ్మం ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోటు కళావతి, జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి లక్ష్మి, సీతామహాలక్ష్మి, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కొల్లు పద్మ, కె. కనకదుర్గ, ఎం.నాగమణి, బి. పద్మ సందర్శించి నివాళుల ర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిం దితుడైన బాబూరావును అరెస్టు చేసి వదిలేయకుండా తక్షణమే కాల్చి చంపాలన్నారు. నిందితుడి తరుపున న్యాయవాదులు ఎవరూ వాదించవద్దని కోరారు. నిర్భయ చట్టం వచ్చినా మహిళలపై దా డులు, అత్యాచారాలు తగ్గడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతు న్న మృగాళ్లను అక్కడికక్కడే శిక్షించాలన్నారు. నిం దితుడిని శిక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. మహిళలకు రక్షణ లేదు మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. వరస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడంతో దోషులకు శిక్ష పడడం లేదు. -పోటు కళావతి, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎక్కడిక్కడ శిక్షలు వేస్తేనే నేరాలు తగ్గుతాయి: సంఘటన జరిగిన చోట వెంటనే శిక్ష అమలు చేస్తే ఇలాంటివి మళ్లీ జరగవు. ఎవరినీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. నిందితులను కఠినంగా శిక్షిస్తే.. అది చూసి మరొకరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా ఉంటారు. చట్టాలంటే భయం లేకపోవడం వల్లే ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. -కనకదుర్గ, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్భయ చట్టం ఎక్కడాఅమలు కావడం లేదు మహిళలపై రోజురోజుకూ అత్యాచారలు పెరిగిపోతున్నా ఎక్కడా నిర్భయ చట్టం అమలు కావడం లేదు. దీంతో నేరం చేసేవారికి భయం లేకుండా పోతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కూడా ఎక్కడా పనిచేయడం లేదు. చట్టాలపై అవగాహన కల్పిండంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. -స్వరూపారాణి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
-
ప్రాణం తీసిన పేదరికం
ఖానాపూర్, న్యూస్‌లైన్ : పేదరికం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతు న్న తనయుడిని ప్రైవేటు వాహనంలో నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేక ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. తనయుడిని విగతజీవిగా మార్చింది. కొడుకును కాపాడుకోలేని పేదరికాన్ని నిందించుకుంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటన శనివారం మండల కేంద్రమైన ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రెడ్డి బుచ్చన్న, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ (8) స్థా నిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అతడు జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం జ్వరం తీవ్రం కావడంతో తల్లిదండ్రులు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి సిఫారసు చేశారు. ఖానాపూర్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు నిర్మల్‌కు వెళ్లాలని సూచించారు. ప్రైవేటు వాహనంలో వెళితే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని తల్లిదండ్రులు స్థానిక బస్టాండ్‌లో కొడుకును పట్టుకుని ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో పరిస్థితి విషమించి శ్రీకాంత్ చనిపోయూడు. కళ్లముందే కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ పేదరికాన్ని నిందించుకున్నారు. -
సంపులో పడి చిన్నారి మృతి
ఘట్కేసర్,న్యూస్‌లైన్: రెండు రోజుల్లో గృహ ప్రవేశానికి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోని వారి కూతురు సంపులో పడి దుర్మరణం చెందింది. ఈ విషాదకర సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోనిగువ్వల మురళీ, లత దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కూతురు రమ్య (4) ఉంది. దంపతులు ఇటీవలే అదే కాలనీలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు. రెండు రోజుల్లో గృహ ప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంటికి రంగులు వేసే పనుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అనంతరం చిన్నారి రమ్య కోసం గాలించినా ఆమె జాడ కనిపించలేదు. చివరగా ఇంటి ఆవరణలో ఉన్న సంపులో చూడగా రమ్య మృతదేహం తేలియాడుతూ కనిపించింది. బాలిక మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారికి మద్యం తాగించిన తండ్రి, ఆస్పత్రిలో మృతి
-
చిన్నారికి మద్యం తాగించిన తండ్రి, ఆస్పత్రిలో మృతి
ఏడాదిన్నర పాపకు మద్యం తాగించిన తండ్రి ... చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఈ విషాద సంఘటన గుంటూరు నల్లచెరువులో చోటుచేసుకుంది. ఎవరి కన్నబిడ్డో తెలియదుగానీ .. సైదా అనే వ్యక్తి తన వద్ద ఉన్న చిన్నారిని .. సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు పెంచుకోవడానికి ఇచ్చాడు. అయితే, పండగ పూట తప్పతాగిన ఆ జంట ... బిడ్డకు కూడా కొంత మద్యం తాగించింది. దీంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా ... వారు సంబంధిత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
తేలుకాటుతో బాలుడి మృతి
ఆత్మకూరు, న్యూస్‌లైన్: తేలుకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఆత్మకూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని వందూరుగుంటకు చెందిన నాగులూరి పెంచలయ్య, కమలమ్మల కుమారుడు ప్రసాద్ (13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం తిరునాళ్లతిప్ప సమీపంలోని వెంకయ్య స్వామి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ స్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ తిరుగుతుండగా తేలు కుట్టింది. వెంటనే ప్రసాద్ దారిన వెళుతున్న వాహనం ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా ఉండే ఓ వైద్యుడి వద్ద కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. -
వీధికుక్కల దాడిలో చనిపోయిన శిశువు