బకెట్‌లో పడి చిన్నారి మృతి | Died of the infant lying in the bucket | Sakshi
Sakshi News home page

బకెట్‌లో పడి చిన్నారి మృతి

Published Thu, Sep 3 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

బకెట్‌లో పడి చిన్నారి మృతి

బకెట్‌లో పడి చిన్నారి మృతి

మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మానుకోట శివారు ఎల్‌బీజీ నగర్ కాలనీలో బుధవారం 16 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్‌లో పడి మృతి చెందింది. కాలనీకి చెందిన బానోత్ నరేష్- పద్మ రెండో కూతురు బిందు (16 నెలలు) బుధవారం ఉదయమే ఇంటి ఆవరణలో ఉన్న నీళ్ల బకెట్ వద్ద ఆడుకుంది. తల నీళ్లలో పెట్టి చూడటంతో ప్రమాదవశాత్తు తలకిందులై అందులో పడిపోరుుంది. అప్పటికే బహిర్భూమికని వెళ్లిన తల్లి పద్మ వచ్చి చూసేసరికి బిందు బకెట్‌లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement