విగతజీవిగా మారిన ఏడాదిన్నర చిన్నారి
ఖైరతాబాద్ డబుల్ బెడ్‌రూం ఇంటిలో విషాదం
ఖైరతాబాద్: రాత్రి 9 గంటలు.. ఇంట్లో కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడాదిన్నర పాప తప్పటడుగులు వేస్తూ తిరుగుతుండగా తల్లి గోరుముద్దలు పెడుతోంది. చిన్నారి సందడికి అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ పాప బెడ్‌రూం బాత్‌రూంలోని నీళ్లబకెట్‌లో పడి విగతజీవిగా మారింది. ఖైరతాబాద్ ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్ డివిజన్‌లోని ఐమా క్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో బి బ్లాక్ 307 ఫ్లాట్‌లో తోట సతీష్ కుమార్, రేణుక దంపతులు నివసిస్తున్నారు.
ఈ ఫ్లాట్‌లో మొత్తం 12 మంది ఉంటున్నారు. సతీష్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఏడాదిన్నర వయసున్న మూడో కూతురు ఆది్వక మంగళవారంరాత్రి ఇంట్లో తల్లి పెట్టే గోరుముద్దలు తింటూ సందడి చేస్తూ, తప్పటడుగులు వేస్తూ, అటు ఇటు తిరుగుతోంది. ఈ క్రమంలో తల్లి కూడా భోజనం ముగించుకొని 9.30 గంటలకు బెడ్‌రూంలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకునేందుకు వెళ్లగా అటాచ్‌డ్ బాత్‌రూం తలుపు తెరిచి ఉంది.
అందులో ఉన్న నీళ్లబకెట్‌లో పాప కాళ్లు పైకి కనిపించడంతో తల్లి లబోదిబోమంటూ ఏడుస్తూ బయటికి తీసింది. కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని వాసవి హాస్పిటల్‌కు పాపను తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు రాత్రి 11 గంటల నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. కళ్ల ముందు ఆడుకుంటూ ఉన్న పాప అంతలోనే మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నా యి.
Comments
Please login to add a commentAdd a comment