ఊయలే ఉరితాడై..
⇒ ఊయలలోనే ఆగిన చిన్నారి ఊపిరి
⇒ ఊపిరాడక చిన్నారి మృతి
⇒ కోయవాగులో విషాదం
కాగజ్‌నగర్ రూరల్ : పిల్లలు సరదాగా ఊగేందుకు చీరతో తయారుచేసిన ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. ఎంతో సంతోషంగా ఊ యలలో ఊగుతున్న ఆ చిన్నారి ప్రాణాలను బ లితీసుకుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఆనందంగా గంతులేస్తూ కలి యదిరిగిన తమ బిడ్డ ఇక లేదని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.
కాగజ్‌నగర్ మండలం కోయవాగులో చోటుచేసుకుందీ ఘట న. కోయవాగు గ్రామానికి చెందిన మారిశెట్టి మల్లేష్-సుజాతలకు ఇద్దరు కూతుళ్లు కీర్తన, అక్షయ, కుమారుడు అభినయ్ ఉన్నారు. రెండో కుమార్తె అక్షయ (7) కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తండ్రి ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కం పెనీలో పనిచేస్తున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లి వచ్చిన అక్షర ఇంటి వెనకాల చీరతో తయారు చేసిన ఊయలలో ఊగుతోంది.
తల్లి ఇంటి ముందున్న బోరు నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. కూతురు ఊయల ఊగుతూ ఆడుకుంటోందని ఊహించిందే తప్ప ఆ ఊయలే ఉరితాడై బిగుస్తుందని ఆ తల్లి ఊహించలేదు. బోరు నీటిని తీసుకుని ఇంట్లోకి రాగానే కూతురు ఊయలలోనే సృ్పహతప్పి పడిపోయి ఉండడంతో ఒక్కసారి గా చలించిపోయింది. తన కూతురు ప్రాణాలు దక్కిం చుకోవాలని తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో ఆ చిన్నారి ప్రా ణాలు కోల్పోయింది. ఇంట్లో కలియ తిరుగుతూ ఆడు తూ పాడుతూ ఉండే తమ కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.