Cradle
-
చరణ్- ఉపాసన బిడ్డ కోసం ఊయల.. ఎవరు పంపించారంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలు పంచుకుంది. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ వారు తొట్లెను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న విజయ్ వర్మ పెళ్లి నాటి ఫోటో!) సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన మహిళలకు ప్రజ్వల ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలు ఈ ఊయలను చేశారని చెప్పుకొచ్చింది. వారు తయారు చేసిన ఊయల అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొంది. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరం, ఆశకు ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండిపోతుంది. తన బిడ్డ పుట్టినప్పటి నుంచే ఇలాంటి విషయాలకు బహిర్గతం కావాలని తను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని పోస్టులో పేర్కొంది. త్వరలో తాము ముగ్గురం కాబోతున్నామని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్‌కు ఉపాసన కృతజ్ఞతలు తెలిపింది. ఊయలను తయారు చేస్తున్నప్పటి ఫోటోలను ఒక వీడియోగా చేర్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: 'ఓం! కమ్ టు మై రూమ్' అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్) -
‘మనాలీ స్వింగ్’.. ‘మహా ఊయల’తో పర్యటకులకు వింత అనుభూతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన మనాలీకి ఏటా వేలాది మంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈ క్రమంలో పర్యటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది అక్కడి అంకుర సంస్థ. ఎత్తయిన ప్రాంతంలో గాలిలో ఊగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మహా ఊయల (జెయింట్ స్వింగ్) జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే ఈ జెయింట్ స్వింగ్‌ను ఐఐటీ మండీ వద్ద ఏర్పాటైన ‘మనాలీ స్వింగ్’ అంకుర సంస్థ రూపొందించింది. ప్రపంచంలోనే ఇలాంటి తరహా ఊయల ఇదే మొదటిదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పర్వతారోహణపై ఆసక్తి ఉండి, సాహసాలను ఇష్టపడే నలుగురు ఇంజినీరింగ్ మిత్రులు ఈ అంకుర సంస్థను స్థాపించారు. ఈ ఊయల ఆకృతి, కాన్సెప్టులపై 5 పేటెంట్లు పొందేందుకు అవసరమైన ప్రక్రియను కూడా వీరు ప్రారంభించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు రూ.3,000 చెల్లిస్తే.. రవాణా ఛార్జీలు, ఫొటో, వీడియోలకు అయ్యే ఖర్చులన్నీ అందులో కలిసే ఉంటాయని తెలిపారు. -
జోడెద్దుల ఊయ్యాల.. హాయిగా నిద్రపోవాల!
సాక్షి, బేతంచెర్ల: కాడెద్దుల పట్టెడలకు చీరతో ఊయల. అందులో ఆదమరిచి నిద్రపోతున్న ఓ చిన్నారి.. ఓ రైతు కుటుంబం తమ బిడ్డను ఈ విధంగా నిద్రకేసి ఎంచక్కా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఎద్దులు అడుగు తీసి అడుగేసినప్పుడల్లా ఊయల ఊగుతుండగా.. జోలపాటలా వస్తున్న ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి ఆ చిన్నారి హాయిగా నిద్రపోతోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలోని ఓ రైతు జంట తమ బిడ్డను ఈ విధంగా నిద్రపుచ్చుతున్న సన్నివేశం సాక్షి కెమెరాకు చిక్కింది. (క్లిక్: అర్ధసత్యాల ఆంధ్రజ్యోతి) -
చిన్నారి ఊపిరి తీసిన ఊయల..
సాక్షి,బేతంచెర్ల: ఊయల తాడు బిగుసుకొని శుక్రవారం ఓ చిన్నారి మృతి చెందింది. డోన్ పట్టణం కోటపేట కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, హేమలత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి ఆవరణలో పై భాగాన ఉన్న కొండికి చీరతో ఊయల కట్టారు. నాలుగో తరగతి చదువుతున్న చరణ్య(9) గురువారం మధ్యాహ్నం ఊయల ఊగుతుండగా పైభాగాన ఉన్న జారుముడి గొంతుకు బిగిసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ బాలాజీ సింగ్ తెలిపారు. కర్నూలులో దొంగల హల్చల్ కర్నూలు: నగర శివారు గుత్తి పెట్రోల్ బంక్సమీపంలోని ఉద్యోగ నగర్, శ్రీకృష్ణ కాలనీల్లో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీకి తెగబడ్డారు. పక్కపక్క కాలనీల్లోని రెండు ఇళ్లలో చొరబడి సుమారు రూ. 4.50 లక్షల నగదు, 10 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను మూటగట్టుకుని ఉడాయించారు. శ్రీకృష్ణ కాలనీలో నివాసముంటున్న షరాబు ప్రదీప్ ఇంట్లో దొంగలుపడి అందినకాడికి దండుకుని పరారయ్యారు. ప్రదీప్ ఒమెగాహాస్పిటల్లో పనిచేస్తున్నాడు. గురువారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఓర్వకల్లులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ప్రధాన తలుపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న బీరువాను ద్దలుగొట్టి అందులో ఉన్న రూ.4 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. ప్రదీప్ శుక్రవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో గదిలోకి వెళ్లి చూశాడు. బీరులోని సామానులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వెల కట్టలేని ప్రేమ
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సహాయగుణం, ప్రేమ గుణం గురించి గొప్పగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చనిపోయినా కూడా తన ప్రేమను పంచుతూనే ఉన్నారు. కన్నడ యంగ్ హీరో యష్ భార్య రాధికా పండిట్ ఓ పాపకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు ఓ ఊయల గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారట అంబరీష్. సుమారు లక్షన్నర విలువ చేసే ఈ ఊయలను ఆన్లైన్లో బుక్ చేశారాయన. యష్‌కు పాప జన్మించేలోపే అంబరీష్ చనిపోయారు. బుక్ చేసిన ఈ ఊయలకు సంబంధించిన మెసేజ్ రావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు అంబరీష్ భార్య సుమలత. ఈ గిఫ్ట్‌ను యష్ కూతురికి అందిం చారామె. ఈ ఊయల తమకు అపురూపం అని యష్ దంపతులు పేర్కొన్నారు. -
ఊయలే మృత్యువుగా మారింది
-
ఊయలే వారి ఊపిరి తీసింది..
సాక్షి, పూతలపట్టు: అమ్మానాన్న కూలికి వెళ్లడం, సెలవు రోజు కావడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేవు. తమకు ఆటవిడుపు దొరికిందని సంబరపడ్డారు. ఊళ్లోని రాతి స్తంభాలకు కట్టిన ఊయల ఊగడానికి వెళ్లారు. ఆ ఊయలే వారి పాలిట మృత్యువుగా మారింది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మండలంలోని గొడుగుచింతలో శనివారం జరిగింది. వివరాలివి.. గ్రామంలోని దళితవాడకు చెందిన నాగరాజు, సరిత దంపతులు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. తాము కష్టపడి పిల్లలిద్దరినీ బాగా చదివించాలని కలలు కన్నాము. పెద్ద కొడుకు గిరిధర్(7) గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి, చిన్నకొడుకు పవన్ కుమార్(4) అంగన్వాడీ సెంటర్లో చదువుతున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లడం, రెండవ శనివారం కావడంతో పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్లారు. అరిమేను గంగమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ రాతి స్తంభాలకు కట్టిన ఊయల ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత ఆకస్మికంగా ఆ రాతి స్తంభాలు విరిగిపోయాయి. ఊయల వేగంగా ముందుకెళ్లడంతో పిల్లలు ఎగిరి దూరంగా పడిపోయారు. ఇద్దిరి తలలకు తీవ్ర గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమై కొద్దిక్షణాలకే ప్రాణాలు విడిచారు. విషయం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పరుగున వచ్చి విగతజీవులైన తమ చిన్నారులను చూసి గుండెలవిసేలా రోదించారు. కాగా, గ్రామ దేవతకు మొక్కు చెల్లింపులో భాగంగా ఓ భక్తుడు పదేళ్ల క్రితం ఈ ఊయల రాతి స్తంభాల మద్య ఇనుప గొలుసులతో ఏర్పాటు చేశాడు. రోజూ గ్రామంలోని పిల్లలు అక్కడికి వెళ్లి ఊగుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ స్తంభాలు నేలకొరగడం విస్మయం కలిగిస్తోందని గ్రామస్తులు చెప్పారు. -
ఊయలే ఉరితాడై..
⇒ ఊయలలోనే ఆగిన చిన్నారి ఊపిరి ⇒ ఊపిరాడక చిన్నారి మృతి ⇒ కోయవాగులో విషాదం కాగజ్‌నగర్ రూరల్ : పిల్లలు సరదాగా ఊగేందుకు చీరతో తయారుచేసిన ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. ఎంతో సంతోషంగా ఊ యలలో ఊగుతున్న ఆ చిన్నారి ప్రాణాలను బ లితీసుకుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఆనందంగా గంతులేస్తూ కలి యదిరిగిన తమ బిడ్డ ఇక లేదని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. కాగజ్‌నగర్ మండలం కోయవాగులో చోటుచేసుకుందీ ఘట న. కోయవాగు గ్రామానికి చెందిన మారిశెట్టి మల్లేష్-సుజాతలకు ఇద్దరు కూతుళ్లు కీర్తన, అక్షయ, కుమారుడు అభినయ్ ఉన్నారు. రెండో కుమార్తె అక్షయ (7) కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తండ్రి ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ కం పెనీలో పనిచేస్తున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లి వచ్చిన అక్షర ఇంటి వెనకాల చీరతో తయారు చేసిన ఊయలలో ఊగుతోంది. తల్లి ఇంటి ముందున్న బోరు నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. కూతురు ఊయల ఊగుతూ ఆడుకుంటోందని ఊహించిందే తప్ప ఆ ఊయలే ఉరితాడై బిగుస్తుందని ఆ తల్లి ఊహించలేదు. బోరు నీటిని తీసుకుని ఇంట్లోకి రాగానే కూతురు ఊయలలోనే సృ్పహతప్పి పడిపోయి ఉండడంతో ఒక్కసారి గా చలించిపోయింది. తన కూతురు ప్రాణాలు దక్కిం చుకోవాలని తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలో ఆ చిన్నారి ప్రా ణాలు కోల్పోయింది. ఇంట్లో కలియ తిరుగుతూ ఆడు తూ పాడుతూ ఉండే తమ కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.