Ram Charan And Upasana Begin Preparations To Welcome Newborn Baby, Shares Glimpse Of Handcraft Cradle - Sakshi
Sakshi News home page

ఊయల తయారు చేసిన వారి గురించి ఉపాసన ఏం చెప్పారంటే?

Published Sat, Jun 17 2023 1:10 PM | Last Updated on Sat, Jun 17 2023 2:39 PM

Ram Charan Upasana Welcome Newborn Baby Handcraft Cradle - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలు పంచుకుంది. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ వారు తొట్లెను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: వైరల్‌ అవుతున్న విజయ్ వర్మ పెళ్లి నాటి ఫోటో!)

సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన మహిళలకు ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలు ఈ ఊయలను చేశారని చెప్పుకొచ్చింది. వారు తయారు చేసిన ఊయల అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొంది. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరం, ఆశకు ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండిపోతుంది.  తన బిడ్డ పుట్టినప్పటి నుంచే ఇలాంటి విషయాలకు బహిర్గతం కావాలని తను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

అందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని పోస్టులో పేర్కొంది. త్వరలో తాము ముగ్గురం కాబోతున్నామని సంతోషం వ్యక్తం చేసింది.  ఈ సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్‌కు ఉపాసన కృతజ్ఞతలు తెలిపింది. ఊయలను తయారు చేస్తున్నప్పటి ఫోటోలను ఒక వీడియోగా చేర్చి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

(ఇదీ చదవండి: 'ఓం! కమ్ టు మై రూమ్' అంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement