Video: డెలివరీ డేట్‌ ఫిక్స్‌...ఆసుపత్రికి ఉపాసన! | Ram Charan Wife Upasana To Welcome Baby Tuesday Admitted In Hospital | Sakshi
Sakshi News home page

ఉపాసన డెలివరీ డేట్‌ ఫిక్స్‌... రేపే మెగా కుటుంబంలోకి చిన్నారి ఎంట్రీ!

Published Mon, Jun 19 2023 8:17 PM | Last Updated on Mon, Jun 19 2023 8:55 PM

Ram Charan Wife Upasana To Welcome Baby Tuesday Admitted In Hospital - Sakshi

మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది గంటల్లో చిరంజీవి ఇంట్లోకి కొత్త మెంబర్ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఉపాసనకు జూన్‌ 20న డెలివరీ డేట్‌ ఇవ్వడంతో.. మంగళవారం పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు  సమాచారం. రేపు ఉదయం డెలివరీ నేపథ్యంలో ఇప్పటికే రామ్‌ చరణ్‌ దంపతులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడా? వారసురాలు వస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. 

కాగా చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే.  వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న వెల్లడించారు. ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణీ. అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ మెగా ఫ్యాన్స్‌ కోసం పలు విషయాలను షేర్‌ చేస్తున్నారు. అయితే దాదాపు పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జూనియర్‌ చరణ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. ‘అడ్వాన్స్‌ కంగ్రాట్స్‌’ అంటూ పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్‌ చరణ్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బిడ్డ పుట్టబోయే ముందు తన  పూర్తి సమయాన్ని ఉపాసనతో గడపాలని,  అందుకోసం  ఆగస్టు నెల వరకు షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వాలని  నిర్ణయించుకున్నారట. ఇక ఈ సినిమా అనంతరం చరణ్‌.. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు.
చదవండి: Janhvi Kapoor: జాన్వీకి కొత‍్త కష్టాలు.. ఓటీటీల వల్ల!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement