
ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నేడు వారి ఆనందం రెట్టింపు అయింది. ఈ విషాయాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం (జూన్ 20)న మెగా ఇంట్లోకి స్టార్ బుజ్జాయి అడుగు పెట్టింది. మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు అపోలో హాస్పిటల్ వేదిక అయింది. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.
ఇప్పటికే రామ్ చరణ్, సురేఖ హాస్పిటల్‌కు చేరుకున్నారు. డెలీవరీ అయ్యేంత వరకు ఉపాసనతోనే చరణ్ ఉన్నారని తెలుస్తోంది . మొత్తంగా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన చరణ్-ఉపాసనలకు వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షలు రవణం స్వామినాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు.
(చదవండి: మనవరాలి జాతకం అద్భుతం.. చిరంజీవి)
Comments
Please login to add a commentAdd a comment