conform
-
ఐ-టిక్కెట్, ఈ- టిక్కెట్.. ఏది వెంటనే కన్ఫర్మ్ అవుతుంది?.. ముందుగానే తెలిస్తే..
రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారు కన్ఫర్మ్ టిక్కెట్ ఒక టాస్క్ లాంటిదని చెబుతుంటారు. కాగా కన్ఫర్మ్ టిక్కెట్ విషయంలో రకరకాల సమాచారాలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి.చాలామంది ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్లను బుక్ చేయడంలో చాలా తేడాలు ఉంటాయని, కన్ఫర్మ్ టిక్కెట్ లభించడం అంత సులభం కాదని అంటుంటారు. దీనిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఐ-టిక్కెట్, ఈ -టిక్కెట్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సివుంటుంది. ఐఆరర్సీటీసీ వెబ్సైట్ నుంచి టిక్కెట్ బుక్ చేసుకుంటే దానిని ఈ- టిక్కెట్ అంటారు. దీనికి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రింటెడ్ టిక్కెట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఐ-టిక్కెట్ విషయానికొస్తే దీనిని ప్రింట్ తీసుకోవడం చాలా కష్టం. ఈ టిక్కెట్ కూడా ఐఆర్సీటీసీ నుంచే బుక్ చేయాలి. ఈ తరహా టిక్కెట్ ప్రింటెడ్ కాపీ రైల్వే నుంచి ఇంటికి వస్తుంది. దీనికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. ఈ విధమైన టిక్కెట్‌ను ప్రయాణం చేయాడానికి కొన్నిరోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ బుకింగ్ విషయంలో చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ-టిక్కెట్, ఐ- టిక్కెట్లలో ఏది త్వరగా కన్ఫర్మ్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. కొందరు ఐ-టిక్కెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందని అంటారు. అయితే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐ-టిక్కెట్, ఈ-టిక్కెట్ల కారణంగా వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అవుతుందనడానికి ఏమీ సంభంధం లేదు. ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ ఆధారంగా టిక్కెట్ బుక్ అవుతుంది. అంటే ఎవరు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటారో వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారని అర్థం. రైలు టిక్కెట్ల బుకింగ్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కన్ఫర్మ్ టిక్కెట్ వస్తుందనే ఆశతో ఐ- టిక్కెట్ లేదా ఈ-టిక్కెట్ తీసుకోవడంలో అర్థం లేదు. జనరల్ వెయిటింగ్, పీక్యూడబ్ల్యుఎల్, ఆర్క్యూడబ్ల్యుఎల్ల ఆధారంగా టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. జనరల్ వెయింటింగ్ టిక్కెట్ త్వరగా కన్పర్మ్ అవుతుంది. మిగిలినవి వెయిటింగ్ లిస్టు కోటాలో మిగిలిన సీట్ల ఆధారంగా ఈ సీట్లు అలాట్ అవుతాయి. ఈ-టిక్కెట్ వలన ప్రయోజనం ఏమిటి? ఈ- టిక్కెట్ తీసుకోవడం వలన ప్రయోజనం ఏమిటంటే.. ఒకవేళ మీకు ఈ- టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోతే మీరు ట్రైన్లో జర్నీ చేయలేరు. అయితే ఐ-టిక్కెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో.. రైల్వేవిభాగం నుంచి వచ్చిన అధికారిక టిక్కెట్ ద్వారా మీరు ప్రయాణం సాగించవచ్చు. ఈ- టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్ మాదిరి గుర్తింపును కలిగివుంటుంది. ఇది కూడా చదవండి: మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా ఎందుకు గడ్డకట్టదంటే.. -
తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు
ప్రముఖ నటుడు రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నేడు వారి ఆనందం రెట్టింపు అయింది. ఈ విషాయాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం (జూన్ 20)న మెగా ఇంట్లోకి స్టార్ బుజ్జాయి అడుగు పెట్టింది. మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు అపోలో హాస్పిటల్ వేదిక అయింది. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్, సురేఖ హాస్పిటల్‌కు చేరుకున్నారు. డెలీవరీ అయ్యేంత వరకు ఉపాసనతోనే చరణ్ ఉన్నారని తెలుస్తోంది . మొత్తంగా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన చరణ్-ఉపాసనలకు వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షలు రవణం స్వామినాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. (చదవండి: మనవరాలి జాతకం అద్భుతం.. చిరంజీవి) -
నో వెయిటింగ్..కన్ఫర్మేషనేనా!
న్యూఢిల్లీ: బుక్ చేసుకున్న రైల్వే టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు రెట్టింపయ్యాయని రైల్ యాత్రి అనే ఓ ట్రావెల్ వెబ్సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015 దీపావళి పండుగ రోజు 25.5 శాతం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు రద్దు కాగా, ఇది 2016 నాటికి 18 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఇదే పరిస్థితి కొనసాగిందని దీనిబట్టి చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అయినట్లేనని పోర్టల్ తెలిపింది. డెహ్రడూన్–హౌరా డూన్ ఎక్స్‌ప్రెస్‌కు కన్ఫర్మేషన్ రేటు 20 శాతం మేర పెరిగింది. పుణె–జమ్మూ తావి జీలం ఎక్స్‌ప్రెస్ కు 12 శాతం, గయా మీదుగా వెళ్లే ముంబై సీఎస్టీ –హౌరా సూపర్ ఫాస్ట్ మెయిల్‌కు 11 శాతం కన్ఫర్మేషన్ రేటు పెరిగినట్లు వివరించింది. ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టడమే కారణమని తెలిపింది. -
శ్రీవారి మొక్కులు చెల్లించుకోనున్న కేసీఆర్
-
రేపు ‘సెట్స్’ కన్వీనర్ల ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి ఈనెల 20న ప్రకటించనుంది. ఒక్కో సెట్‌కు ముగ్గురి చొప్పున పేర్లను ఆయా యూనివర్సిటీలు బుధవారం ఉన్నత విద్యా మండలికి పంపించాయి. వాటిపై 19న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఒక్కో సెట్‌కు వచ్చిన ముగ్గురి పేర్లలో ఒక్కరిని సెట్ కన్వీనర్‌గా నియమించనున్నారు. ఎంసెట్ బాధ్యతలను జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్యకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఆ విత్తనాలు నకిలీవే..
నిర్ధారించిన అధికారులు, శాస్త్రవేత్తలు బండారుపల్లి (తాడికొండ రూరల్): తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో 1000 ఎకరాలలో పూత, పిందె లేకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తున్న విత్తనం నకిలీదేనని అధికారులు నిర్ధారించారు. మంగళవారం గ్రామంలో శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించిన అనంతరం నకిలీ విత్తనంగా తేల్చారు. మొత్తం 80 క్వింటాళ్ళకు పైగా బ్రహ్మపుత్ర–555 విత్తనాన్ని తమకు అంటగట్టారని పలువురు రైతులు గగ్గోలు పెట్టారు. ఇప్పటికే ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి రూపంలో పెట్టామని, తమకు పరిహారం వచ్చేలా విత్తన కంపెనీపై చర్యలు తీసుకోపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. లాంఫాం శాస్త్రవేత్త శారద, ఉద్యానశాఖ డీడీఏ జయచంద్రారెడ్డితో కలిసి పలువురు అధికారులు మిరప పంటను పరిశీలించిన అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. బిల్లులు, విత్తన సంచుల ఆధారంగా రైతుల వద్ద నుంచి ఫిర్యాదులు సేకరించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, వ్యవసాయాధికారి మన్నవ నాగరాజు, ఉద్యాన శాఖాధికారి రవిప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు మానుకొండ రత్తయ్య పాల్గొన్నారు.