రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారు కన్ఫర్మ్ టిక్కెట్ ఒక టాస్క్ లాంటిదని చెబుతుంటారు. కాగా కన్ఫర్మ్ టిక్కెట్ విషయంలో రకరకాల సమాచారాలు ఇంటర్నెట్‌లో కనిపిస్తుంటాయి.చాలామంది ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్‌లను బుక్ చేయడంలో చాలా తేడాలు ఉంటాయని, కన్ఫర్మ్ టిక్కెట్ లభించడం అంత సులభం కాదని అంటుంటారు.
దీనిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఐ-టిక్కెట్, ఈ -టిక్కెట్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సివుంటుంది. ఐఆరర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి టిక్కెట్ బుక్ చేసుకుంటే దానిని ఈ- టిక్కెట్ అంటారు. దీనికి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రింటెడ్ టిక్కెట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
ఇక ఐ-టిక్కెట్ విషయానికొస్తే దీనిని ప్రింట్ తీసుకోవడం చాలా కష్టం. ఈ టిక్కెట్ కూడా ఐఆర్‌సీటీసీ నుంచే బుక్ చేయాలి. ఈ తరహా టిక్కెట్ ప్రింటెడ్ కాపీ రైల్వే నుంచి ఇంటికి వస్తుంది. దీనికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. ఈ విధమైన టిక్కెట్‌ను ప్రయాణం చేయాడానికి కొన్నిరోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
టిక్కెట్ బుకింగ్ విషయంలో చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ-టిక్కెట్, ఐ- టిక్కెట్‌లలో ఏది త్వరగా కన్ఫర్మ్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. కొందరు ఐ-టిక్కెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందని అంటారు. అయితే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐ-టిక్కెట్, ఈ-టిక్కెట్‌ల కారణంగా వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అవుతుందనడానికి ఏమీ సంభంధం లేదు. ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ ఆధారంగా టిక్కెట్ బుక్ అవుతుంది. అంటే ఎవరు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటారో వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారని అర్థం.
రైలు టిక్కెట్ల బుకింగ్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కన్ఫర్మ్ టిక్కెట్ వస్తుందనే ఆశతో ఐ- టిక్కెట్ లేదా ఈ-టిక్కెట్ తీసుకోవడంలో అర్థం లేదు. జనరల్ వెయిటింగ్, పీక్యూడబ్ల్యుఎల్, ఆర్‌క్యూడబ్ల్యుఎల్‌ల ఆధారంగా టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. జనరల్ వెయింటింగ్ టిక్కెట్ త్వరగా కన్పర్మ్ అవుతుంది. మిగిలినవి వెయిటింగ్ లిస్టు కోటాలో మిగిలిన సీట్ల ఆధారంగా ఈ సీట్లు అలాట్ అవుతాయి.
ఈ-టిక్కెట్ వలన ప్రయోజనం ఏమిటి?
ఈ- టిక్కెట్ తీసుకోవడం వలన ప్రయోజనం ఏమిటంటే.. ఒకవేళ మీకు ఈ- టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోతే మీరు ట్రైన్‌లో జర్నీ చేయలేరు. అయితే ఐ-టిక్కెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో.. రైల్వేవిభాగం నుంచి వచ్చిన అధికారిక టిక్కెట్ ద్వారా మీరు ప్రయాణం సాగించవచ్చు. ఈ- టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్ మాదిరి గుర్తింపును కలిగివుంటుంది.
ఇది కూడా చదవండి: మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా ఎందుకు గడ్డకట్టదంటే..
Comments
Please login to add a commentAdd a comment