diffrencec
-
దుర్గామాతకు పానీపూరీల అలంకరణ.. ఎక్కడంటే?
కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది. ఈసారి నగర దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండపం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది. బెహలా నోటున్ దాల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈప్రత్యేక దుర్గా మండపం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మండపాన్ని పానీపూరీలతో అలకంరించారు. దీనిని గోల్గప్ప అని కూడా అంటారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడాన్ని పలువురు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా ఈ దుర్గామండపం క్లిప్‌ను షేర్ చేశారు. ఇది కూడా చదవండి: కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు Kolkata's Durga Puja pandals: where phuchka (panipuri) meets divine architecture, a truly heavenly combination! 🙌🏛️ pic.twitter.com/Ytz6a0Aafy — Harsh Goenka (@hvgoenka) October 16, 2023 -
యూదుల ఆరాధనా విధానం ఏమిటి? ‘కిప్పా’కు ఎందుకంత ప్రాధాన్యత?
ప్రపంచంలోని పురాతన మతాలలో జుడాయిజం ఒకటి. దీనికి సుమారు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం దాదాపు ఒకే సమయంలో ఉద్భవించాయని చెబుతారు. ఈ కారణంగానే ఈ మతాల మధ్య ఎంతో సారూప్యత కనిపిస్తుంది. జుడాయిజాన్ని హిందూ మతంతో పోల్చిచూస్తే కొన్ని అంశాలు మినహా, ఎటువంటి సారూప్యత కనిపించదు. జుడాయిజం ప్రకారం ఈ మతాన్ని నమ్మేవారు రోజుకు మూడు సార్లు ప్రార్థనలు చేస్తారు. యూదులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ప్రార్థన చేసే సమయంలో జెరూసలేం వైపు చూస్తారు. జుడాయిజం విగ్రహారాధనను విశ్వసించదు. జుడాయిజంను అనుసరిస్తున్నవారు ప్రతిపనికీ దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఖబద్ హౌస్ యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఖబద్ హౌస్‌లు పలు దేశాలలో కనిపిస్తాయి. ఇక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోని ముంబై, ఢిల్లీలోని పహర్‌గంజ్, అజ్మీర్, హిమాచల్‌లోని ధర్మ్కోట్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లలో ఖబద్ హౌస్‌లు ఉన్నాయి. విదేశాల నుంచి భారత్ సందర్శనకు వచ్చే ఇజ్రాయిలీలు ఈ ఖబద్ హౌస్‌లలో ప్రార్థనలు చేస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల, ధర్మ్కోట్లోని ఖబద్ హౌస్‌లను సందర్శించడానికి ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ నుండి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యూదులు ప్రార్థనా సమయంలో తలపై కిప్పా(టోపీ) తప్పనిసరిగా ధరిస్తారు. కిప్పా అనేది ప్రతి యూదు ప్రత్యేక సందర్భాలలో ధరించే టోపీ. ఇది హిందూ, ఇస్లాంలో కూడా కనిపిస్తుంది. హిందువులు పూజ చేసేటప్పుడు తలపై గుడ్డ పెట్టుకునే ఆచారం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఇస్లాంలో కూడా నమాజ్ చదివేటప్పుడు తప్పనిసరిగా టోపీ ధరిస్తారు. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి?
పాకిస్తాన్ భారతదేశానికి పొరుగు దేశం. అయితే పాక్- భారత్ సంబంధాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగా లేవు. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే.. పాకిస్తాన్‌కు ఏనాడూ బలమైన ప్రధాని లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు మనం ఈ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి కాకుండా పాక్ ప్రధాని జీతం, అతనికి కల్పించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ఆధారంగా ది న్యూస్ ఇంటర్నేషనల్ ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఎంపీలు, మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీతభత్యాల సమాచారాన్ని బహిరంగపరిచింది. దీనిలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ప్రధానికి 2,01,574 పాకిస్తానీ రూపాయల జీతం లభిస్తున్నది. (1 పీకేఆర్ = రూ. 0.287429) ఇక ప్రధానికి కల్పించే సౌకర్యాల విషయానిక వస్తే ఒక విలాసవంతమైన ఇంటితో పాటు, భద్రత, సేవకులు లాంటి సౌకర్యాలను కల్పిస్తారు. అయితే పాక్‌లో పీఎంకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి పర్యవేక్షణ బాధ్యత అక్కడి సైన్యం చేతిలో ఉంటుంది. పాకిస్తాన్ ఎంపీల జీతం విషయానికి వస్తే వారికి 1,88,000 పీకేఆర్ జీతం లభిస్తుంది. అయితే భారత ఎంపీలకు లభించినన్ని ప్రత్యేక సదుపాయాలు పాక్ ఎంపీలకు లభించడం లేదు. అక్కడి సీనియర్ ఆఫీసర్ల విషయానికివస్తే వారికి కూడా ఎంపీలకు లభించినంత జీతం లభిస్తుంది. పాక్ ప్రధాన న్యాయమూర్తికి 15,27,399 పాకిస్తానీ రూపాయల జీతం అందుతుంది. మంత్రులు 3,38,125 పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటారు. అయితే గ్రేడ్-2 అధికారులు 5,91,475 పాకిస్తానీ రూపాయల జీతం పొందుతారు. పాకిస్తానీ రూపాయలను భారతీయ రూపాయలతో పోల్చిచూస్తే, వారి జీతం చాలా తక్కువని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది? -
ఐ-టిక్కెట్, ఈ- టిక్కెట్.. ఏది వెంటనే కన్ఫర్మ్ అవుతుంది?.. ముందుగానే తెలిస్తే..
రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారు కన్ఫర్మ్ టిక్కెట్ ఒక టాస్క్ లాంటిదని చెబుతుంటారు. కాగా కన్ఫర్మ్ టిక్కెట్ విషయంలో రకరకాల సమాచారాలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి.చాలామంది ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్లను బుక్ చేయడంలో చాలా తేడాలు ఉంటాయని, కన్ఫర్మ్ టిక్కెట్ లభించడం అంత సులభం కాదని అంటుంటారు. దీనిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఐ-టిక్కెట్, ఈ -టిక్కెట్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సివుంటుంది. ఐఆరర్సీటీసీ వెబ్సైట్ నుంచి టిక్కెట్ బుక్ చేసుకుంటే దానిని ఈ- టిక్కెట్ అంటారు. దీనికి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రింటెడ్ టిక్కెట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఐ-టిక్కెట్ విషయానికొస్తే దీనిని ప్రింట్ తీసుకోవడం చాలా కష్టం. ఈ టిక్కెట్ కూడా ఐఆర్సీటీసీ నుంచే బుక్ చేయాలి. ఈ తరహా టిక్కెట్ ప్రింటెడ్ కాపీ రైల్వే నుంచి ఇంటికి వస్తుంది. దీనికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. ఈ విధమైన టిక్కెట్‌ను ప్రయాణం చేయాడానికి కొన్నిరోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ బుకింగ్ విషయంలో చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ-టిక్కెట్, ఐ- టిక్కెట్లలో ఏది త్వరగా కన్ఫర్మ్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. కొందరు ఐ-టిక్కెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందని అంటారు. అయితే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐ-టిక్కెట్, ఈ-టిక్కెట్ల కారణంగా వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అవుతుందనడానికి ఏమీ సంభంధం లేదు. ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ ఆధారంగా టిక్కెట్ బుక్ అవుతుంది. అంటే ఎవరు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటారో వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారని అర్థం. రైలు టిక్కెట్ల బుకింగ్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కన్ఫర్మ్ టిక్కెట్ వస్తుందనే ఆశతో ఐ- టిక్కెట్ లేదా ఈ-టిక్కెట్ తీసుకోవడంలో అర్థం లేదు. జనరల్ వెయిటింగ్, పీక్యూడబ్ల్యుఎల్, ఆర్క్యూడబ్ల్యుఎల్ల ఆధారంగా టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. జనరల్ వెయింటింగ్ టిక్కెట్ త్వరగా కన్పర్మ్ అవుతుంది. మిగిలినవి వెయిటింగ్ లిస్టు కోటాలో మిగిలిన సీట్ల ఆధారంగా ఈ సీట్లు అలాట్ అవుతాయి. ఈ-టిక్కెట్ వలన ప్రయోజనం ఏమిటి? ఈ- టిక్కెట్ తీసుకోవడం వలన ప్రయోజనం ఏమిటంటే.. ఒకవేళ మీకు ఈ- టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోతే మీరు ట్రైన్లో జర్నీ చేయలేరు. అయితే ఐ-టిక్కెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో.. రైల్వేవిభాగం నుంచి వచ్చిన అధికారిక టిక్కెట్ ద్వారా మీరు ప్రయాణం సాగించవచ్చు. ఈ- టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్ మాదిరి గుర్తింపును కలిగివుంటుంది. ఇది కూడా చదవండి: మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా ఎందుకు గడ్డకట్టదంటే.. -
తన్నుకున్న తమ్ముళ్లు
– వీఆర్ పురం సర్పంచ్ చేరిక సమయంలో భగ్గుమన్న విభేదాలు – జెడ్పీ చైర్పర్సన్ ఎదుటే బాహాబాహీ నందివాడ : మండలంలో తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సర్పంచ్‌ను పార్టీలోకి చేర్చుకునే విషయంపై రెండు వర్గాలవారు గొడవకు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ ఎదుటే దుర్భాషలాడుకుంటూ ముష్టిఘాతాలకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు... మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కాకరాల సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రులు వర్గాల మధ్య ఎంతోకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరాఘవాపురం గ్రామ సర్పంచ్ మోరుగుమాల సత్యనారాయణమ్మ, కుదరవల్లి పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వర్రి రంగారావును టీడీపీలో చేర్చుకునేందుకు బుధవారం ముహూర్తం నిర్ణయించారు. వెంకటరాఘవాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గద్దె అనూరాధ, టీడీపీ గుడివాడ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, గుడివాడకు చెందిన మరికొందరు నేతలు గ్రామానికి వస్తున్నట్లు ఉదయం స్థానికంగా ప్రచారం చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నాయకుడు, ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకరాల సురేష్ తన అనుచరులతో వచ్చి జెడ్పీ చైర్పర్సన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న తమకు చెప్పకుండా కొత్తవారిని చేర్చుకోవడం ఏమిటని జెడ్పీ చైర్‌పర్సన్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్‌ను అడ్డుకోవడం ఏమిటని సురేష్‌పై రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. అంతటితో అగకుండా రావి చేయిచేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలవారు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు వచ్చి కాకరాల సురేష్ వర్గీయులను చెదరగొట్టారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సురేష్ వర్గీయులు రావి డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు చైర్పర్సన్ అనూరాధ శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ భవనం వద్ద సర్పంచ్ మోరుగుమాల సత్యనారాయణమ్మ, ఆమె కుమారుడు మోరుగుమాల లక్ష్మణరావు, కుదరవల్లి పీఎసీఎస్ అధ్యక్షుడు వర్రి రంగరావు తదితరులను టీడీపీలో చేర్చుకున్నారు. తప్పుకున్న పిన్నమనేని వర్గీయులు సర్పంచ్ చేరికపై గొడవ జరుగుతుందని ముందే తెలుసుకున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు వర్గీయులు ముందుగానే గ్రామం నుంచి తప్పుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ వస్తున్నారని తెలిసినా సర్పంచ్ చేరిక సభకు హాజరు కాలేదు.